26, జూన్ 2025, గురువారం

Panchaag


 

భారతీయనారి

 భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం-2


యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. ఒకరు మైత్రేయి. రెండవ భార్య కాత్యాయని. గృహస్థాశ్రమం తరువాత యాజ్ఞవల్క్య మహర్షి తన ఆస్తుల్ని ఇద్దరు భార్యలకు పంచి వానప్రస్థానానికి బయలుదేరాడు. కాత్యాయని ఆయనిచ్చిన భౌతిక సుఖ సంపదలతో సంతృప్తి పడిరది. రెండో భార్య మైత్రేయ నాకు అమృతత్వం ఇవ్వని భౌతిక సంపదలు వద్దని అమృతత్వమిచ్చే జ్ఞానమివ్వమని భర్తను కోరింది. అపుడు యాజ్ఞవల్క్యుడు ఆమెకు గురువై బ్రహ్మజ్ఞానం బోధించాడు. బృహదారణ్య కోపనిషత్తులో ఆత్మ, పరబ్రహ్మ అనుసంధానం గురించి, అద్వైతం గురించి మాట్లాడేది. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన తల్లి మైత్రేయి. యాజ్ఞవల్క్య`మైత్రేయి సంవాదం చాలా ప్రసిద్ధమైనది. యాజ్ఞవల్క్యుడు ఉపనిషత్తులు ప్రచారం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో ఎంతో మంది శిష్యులుండేవారు.


ప్రపంచ సుఖాలు వద్దన్న మైత్రేయిని చూసి యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోయాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ ఆత్మను గురించి తెలుసుకోవడమే నిన్ను అమరత్వం వైపు నడిపిస్తుంది. నీలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించు అని చెప్పాడు.ఆ రోజుల్లో ఆస్తులంటే గోసంపద, వృక్ష సంపద, వ్యవసాయం, వాటిని కూడా మైత్రేయి వద్దంది. మైత్రేయి ఆధ్యాత్మికతత్వం ఏమిటంటే మనకిష్టమైన, సంబంధం ఉన్న వాళ్ల సుఖ దుఃఖాలను మనం స్పందించినట్లే, మనకు తెలియని, సంబంధంలేని వారిపట్ల కూడా స్పందించడమే ‘అంతా భగవంతుని లీల’గా అర్థం చేసుకోవడం అవుతుంది. మనం ఏం చేసినా మనవల్లే జరుగుతున్నది అని భావించడం కామప్రేరకంగా, అంతా భగవంతుని అనుగ్రహంగా భావించడం శ్యామ ప్రేరకంగా అర్థం చేసుకోవడమన్నమాట. సుఖం, దుఃఖం, మంచి, చెడు, వినోదం, విషాదం పట్ల ఒకే తీరుగా స్పందించమే అద్వైతమన్నమాట.


వేదకాలంలోని గొప్ప పండితురాళ్ళలో మరొకరు గార్గి. జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షులను అధిగమించింది. ఆమె వాచక్ను మహర్షి కుమార్తె. ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసింది. జనక మహారాజు ఓసారి పండితుల సభ ఏర్పాటు చేశాడు. దేశం నలువైఫుల నుండి వచ్చిన ఋషిపుంగవులతో సహా యాజ్ఞవల్క్యుడు, గార్గి కూడా వచ్చారు. అందరిలో అత్యంత విద్యా సంపన్నులెవరో తెలుసుకుందామని జనకుడు ఓ వేయి ఆవులను తెప్పించి ప్రతి ఆవు కొమ్ములకు బంగారు సంచీలు వేలాడదీశారు. గొప్ప వేదాంత పండితులు ఎవరైనా ఉంటే గోవును ఇంటికి తీసుకు వెళ్లి వచ్చని ప్రకటన చేశారు. కాని ఎవరికి ధైర్యం చాలలేదు. యాజ్ఞవల్య్యుడు ధైర్యం చేసి ఆవులను ఆశ్రమానికి తీసుకెళ్లమని శిష్యుల్ని ఆజ్ఞాపించాడు. కాని అందుకు మిగిలిన వారు సమ్మతించలేదు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి గోవులను తీసుకువెళ్లమన్నారు. అంతలో ఒకరు ప్రశ్నవేశారు. యాజ్ఞవల్క్యుడు అందరికి సంతృప్తికరంగా సమాధానమిచ్చాడు. చివరకు గార్గి కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. వాటికి కూడా యాజ్ఞవల్క్యుడు సమాధానాలిచ్చాడు. ఆ సభలో పాల్గొన్న ఏకైక మహిళ, ఋషిక, గార్గి. గార్గి పేరు ఉపనిషత్తులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

1500`500 బి.సి. కాలంలో ఎందరో మహిళలు వేదాలను చదివారు. అందులో గార్గి ఒకరు. క్రీ.పూ. 700 లో జన్మించింది. గార్గి పేరున గోత్రం కూడా వుంది. గార్గి అంటే ఆలోచింపచేసేది అని అర్థం. ఢల్లీిలో గార్గి పేరున ఒక కళాశాల ఉంది. ఆ కళాశాల 2016లో స్వర్ణోత్సవం జరుపుకుంది. గార్గి ఋషిక, మహిళలకు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం గురించి ప్రబోధించేది. ఆమెను ఋషి పరంపరలోని నవరత్నాలలో ఒకరుగా భావిస్తారు. వేదాలను అభ్యసించేందుకు ఉపనయనం చేసుకుంది. యాజ్ఞవల్క్యుడికి పరబ్రహ్మ గురించి ఆమె అనేక ప్రశ్నలను సంధించింది. పరబ్రహ్మ గురించి ఎక్కువగా ప్రశ్నించవద్దని యాజ్ఞవల్క్యుడు వారిస్తాడు.

ఆషాఢంలో గోరింటాకు*

 🌺🍁🌺🍁🌺🍁🌺🍁🌺


*ఆషాఢంలో గోరింటాకు* 

     *ఎందుకు పెట్టుకుంటారు*

 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరుతామంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. 


*ఎందుకంటే*

 

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. 

ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. 


అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. 

గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. 


ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. 

వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. 

గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట , వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. 

వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు , వేళ్లు , బెరడు , విత్తనాలు... 

అన్నీ ఔషధయుక్తాలే !  


గోరింట పొడిని మందుగా తీసుకోవడం , గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! 

కేవలం ఆషాఢంలోనే కాదు... 

అట్లతద్దినాడూ , శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. 


గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. 

కానీ చాలా రకాల కోన్లలో , కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 


కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.


🌺🍁🌺🍁🌺🍁🌺🍁🌺

ఆయుర్వేదం - రస ఔషదాలు .

 ఆయుర్వేదం - రస ఔషదాలు .

 

ఇంతకు ముందు నేను ఆయుర్వేదం లొ శల్య తంత్రం గురించి తెలియచేసాను. ఇప్పుడు ఆయుర్వేదం లొ రస ఔషధాల గురించి తెలియజేస్తున్నాను. 

 మూలికలతో చేసినటువంటి ఔషధాలు వెంటనే ఉపయోగించవలెను. వాటికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. కానీ కొన్ని రకాల లోహములు ను శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. అవి ఎప్పుడు ఉపయోగించినా సమర్దవంతం గా పనిచేస్తాయి. మానవుని శరీరం అష్టదాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ దాతువులు లలొ హెచ్చు తగ్గుల వలన మానవునికి రోగాలు ప్రాప్తిస్తున్నాయి. మరలా వాటిని పూరించడం వలన రోగాలు తగ్గు ముఖం పడతాయి. నేటి అల్లోపతి వైద్య విదానం అదే వాటిని ప్రాకృతికం గా తయారు చేయరు . 

ఉదాహరణకు పాండు రొగమునకు ఒక అత్యద్బుతమైన ఔషధం ఉన్నది. పాండు రోగం అనగా శరీరం నందలి రక్తము లేకుండా పాలిపోయినట్టు ఉండుట .ఈ వ్యాధి గ్రస్తులు తెల్లగా మొఖము నందు జీవకళ లేకుండా ఉంటారు. ఏ గ్రామ భూమియందు 100 ఏళ్ళ నుండి ఉన్నట్టి చిట్టేపు రాళ్లను తీసుకుని వచ్చి వాటిని ఎర్రటి నిప్పుల్లో బాగుగా కాల్చి ఆవుపంచకం లొ ముంచి చల్లార్చాలి . ఈ రకం గా 12 సార్లు చేయాలి . ఇలా చేసిన తరువాత చూర్ణం చేయగా అది సిందూరం రంగులొ వస్తుంది. దానిని ఉదయం సాయంత్రం పుచ్చుకోనిన కేవలం 41 రొజులలొ మనిషి ఎర్రగా తయారవుతాడు. పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలా చాలా ఉన్నాయి .

       భావ ప్రకాశిక మొదలయిన ఆయుర్వేద గ్రంథాలలో ఈ రసాయనిక తంత్రాల గురించి ఉన్నది. 3,4 శతాబ్దాల నుంచి వాగ్బట్టాచార్యుని కాలం వరకు ఈ రసయనిక ఔషధాలు చికిత్సకు ఉపయోగించి నట్టు అంతగా లేదు . క్రీ.శ 4 వ శతాబ్దం లొ సంకలనం చేయబడ్డట్టు చెబుతున్న Bowers manicript అంతకు పూర్వం రచించబడిన D .r hernal గారిచే సంపాదించ బడిన వ్రాతపతి గా ఉన్న వైద్య గ్రందం నందు కుడా స్వర్ణ , లొహ ధాతువుల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషం గా ఎక్కడా ఉపయోగించినట్టు లేదు .వైదిక కాలం న సోమరస ఉపయోగం అదిక ప్రచారం లొ ఉన్నందున రసవిజ్ఞానం ఋగ్వేద కాలం నుండి ఆదరణ, ప్రచారం లొ ఉనట్టు భావించుచున్నారు. దానిని అనుసరించే చరకాదులు తమ గ్రంధములయందు రసౌషదాలకు స్థానం ఇచ్చారు. భారతీయుల రసప్రక్రియలకు మూలం ప్రాచీనం అని తెలియచున్నది. 

      ఋగ్వేదం న స్వర్ణం, ఇనుము, సీసము, ఇత్తడి, శ్యామ లొహం. ఇలాంటి లోహాల ప్రసక్తి కలదు. రసశాస్త్ర ప్రక్రియ కొన్ని తాంత్రి కముల యందు ప్రాధమిక స్థాయిలో వర్ణించ బడెను. రసాయనిక తాంత్రికం లొ సిద్ధ నాగార్జునుడు ప్రసిద్ధుడు .

 రస తంత్రములో ఉపయోగించబడు ద్రవ్యములను పలువురు తంత్ర కర్తలు పలు విధాలుగా వర్గీకరించారు. అందులొ రత్న సముచ్చయకారుని వర్గీకరణ సామరస్యం గా ఉన్నది. అతడు మహారసములు, ఉపరసములు, సాధారణ రసములు, దాతువులు, ఉపదాతువులు ఇలా వర్గీకరణం చేసారు. 

 మహా రసములు - అబ్రకం, వైక్రాంతం, స్వర్ణ మాక్షిక, తామ్ర మాక్షిక , సస్యకము తుత్తుము , చపలము, రసకము , అని ఎనిమిది మహారసములు గా పేర్కొనబడినవి.

 ఉప రసములు - గంధకం, గైరికము, కాశీసము, స్పటికము, తాలకము , మనశ్హిల , అంజనము, కంకు ఉస్టం అనే ఎనిమిది ఉపరసములగా పేర్కొనబడినవి .

 సాదారణ రసములు - కంపిల్లము, గౌరీ పాషాణము, నవసాగారము, కపర్ధం, అగ్ని జారం, గైరికం, హింగులం, మ్రుద్దారు శృంగి, ఈ ఎనిమిది సాదారణ రసములగా పేర్కొనబడినవి .

  పూర్వాచార్యులు పాదరసం నోక్కదానినే మహారసం గా గ్రహించి తక్కిన వాటిని ఉపరసములుగా పరిగణించారు. రస ఔషద శాస్త్ర ప్రకారం రెండు రకాలు అగు ద్రవ్యాలు కలవు.మొదటి రకం పాదరసం, గంధకం, శంఖ పాషానాది రసొపరసములు. సాదారణ రసములు.రెండొవది సువర్ణం, రజతం, తామ్రము, వంగము, సీసము లోహాది దాతువులు.సుశ్రుతమున వంగం, సీసం , తామ్రము ,రజతము, స్వర్ణం , అయస్కాంతం , మండురం, వైడుర్యం , స్పటికం, ముత్యం , శంఖం ఇవి ఔషద ద్రవ్యాలుగా పేర్కొన్నారు . చరక సంహిత ఎందు రక్తపిత్త వ్యాధి చికిత్సకు , నేత్ర రోగ చికిత్సకు వైడుర్యం, ముత్యములు , మణులు, ప్రవాళం, శంఖం, లోహము, తామ్రము , సౌవీరంజనము ఔషధాలుగా చెప్పినాడు. కుష్టు రొగమునకు పాదరస గంధకములు ఔషదములు గా పేర్కొనెను .ఈ వ్యాధులకు అయస్కాంతం ఉపయోగించడం కూడా సుశ్రుత సంహితలో ఉన్నది.

          సువర్నాధి దాతువులను పలచని రేకులగా చేసి సైంధవ లవనములను ఆ రేకులకు పూసి వానిని కాల్చి నిర్దేశించిన కషాయములలో ముంచి అందునుంచి మెత్తని చుర్ణమును గ్రహించు విదానం వివరించబడెను. ఇట్టి సుక్ష్మ చూర్ణం తయారికి 16 పర్యాయాలు ఆ రేకులను అగ్నిలో కాల్చి ముంచవలసి ఉన్నది. ఈ లొహ రేకులను చండ్రనిప్పుల బొగ్గుల మద్య నుంచి కాల్చి చల్లబడిన తరువాత మెత్తని చుర్ణమును తేనెతో సేవించవలసి ఉన్నది.అని తెలియచేయడం అయినది. అష్టాంగ హృదయం నందు నేత్ర రోగములనుకు పాదరసం తో చేసిన అంజనం ఉపయోగించెడి విదానం తెలియజేసెను.

          మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

    గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                 9885030034 

         

          కాళహస్తి వేంకటేశ్వరరావు .

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          

. 9885030034

సమస్యకు

 *భావము లేని పద్యమునె పండితులెల్లc బఠించి మెచ్చిరే*

ఈ సమస్యకు నా పూరణ. 


దీవెన లంద జేయునవి దివ్యము లైనవి పోతనార్యుచేన్


భావన భక్తియుక్తమయి భాషకు తేనెల నద్దినట్లుగాన్


జీవిత పారమార్థికము చేరగ వ్రాసిన కావ్యమందు దు


ర్భావము లేని పద్యమునె పండితులెల్లc బఠించి మెచ్చిరే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

సంస్కృతం



సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.దాని చరిత్ర ,మూలాలు, పరిణామం తెలియదు కానీ.... సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి).

Sanskrit English

1.లప్ lip

2.దంత dent

3.నాసిక nose

4.బ్రాత brother

5.మాత mother

6.సూనుః son

7.దుహిత daughter

8.నక్తం night

9.లఘు light

10.వాహక vehicle

11.వహతి weight

12.తరు tree

13.హోమ home

14.మూషి mouse

15.మృత mortal

16.గ్రాసము grass

17.బంధ bond

18.నవ new

19.మధ్య mid

20.ఉపరి upper

21.అదః under

22.హోరా hour

23.పథ్ path

24.క్రూర cruel

25.ఉక్షా ox

26.గౌ cow

27.సర్ప serpent

28.వమితం vomit

29.ఇతర other

30.పరమానంత permanant

31.న no

32.అ +హం I am

33.ఇతి it

34.తత్ that

35.సా she

36.సః he

37.వయం we

38.తే they

39.అస్ is

40.యూయం you

41.మానవ man

42.అంగార anger

43.జ్ఞా know

44.అగ్రిమకులచర

      Agriculture

45.దామ dam

46.స్థాన్ station

47.దానం donation

48.సంత్ saint

49.దివ్య divine

50.అగ్ని ignite

51.వాక్కు vocal

52.వస్ bus

53.సర car

54.సర్వేక్షణ survey

55.షష్టి sixty

56.శత పర శత cent per cent

57.ధీక్షపాల discipline

58.శూర్పనఖ sharp nails

59.దశ deci

60.నవ nona

61.అష్ట octa

62.సప్త septa

63.షష్ఠ hexa, hepta

64.పంచ penta

65.త్రయం three, trio

66.ద్వయం,ద్వి dual, dia

67.అస్థిక osteo

68.చర్మ derma

69.పాదచారి pedestrian

70.కృష్ణ Christna

71. గోళం globe

72.దత్త debt

73.విధవ widow

74.పరిమితి perimeter   

75.భ్రూ brow

76.తార star

77.అంతర inter

78.అంత్ end

79.స్విస్టం sweet

80.సీవతి sewing

81.తిథి date

82.క్రమేల camel

83.పురోగం programme

84.చోష్ juice

85.ప్రచార preacher

86.మనస్తర్ minister

87.సంపన్న champion

88.అర్కొదది arctic ocean

89.అతులాంతకోదది. Atlantic ocean

90.ప్రశంతోదది Pacific ocean 

91.అస్త్రాలయ్ Australia

92.అంధమానవ ద్వీపం Andaman 

93.హిందూ ఆసియా Indonesia

94.ఋషీయా Russia

95.కాశ్యపసముద్రము Kaspean sea.

96.ఆముస్తారదామ Amsterdam

97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి England

98.బ్రహ్మాంగ దామ Bermingham

99.మరీచిక Mauritius

100.లాస్యంజలి LosAngels

ఆషాఢమాసాన్ని

 శ్రీ గురుభ్యోనమః 

శ్రీ మహాగణాధిపతయే నమః 


గురువిజ్ఞాననిగూఢం - ఆషాఢం

                ఆషాఢమాసాన్ని విజ్ఞానమాసమనీ, గురుస్వరూపమనీ పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీ హరి కృప అత్యంత వేగంగా భక్తులపై ప్రసరించే దివ్య మాసం ఆషాఢం అని మహాభారతం చెబుతున్నది. ఆషాఢం పురాణ మాసం.


*ఆషాఢమాసంలో శివాలయంలో ధూపం వేసిన వారికి భయంకర  దారిద్ర్యం తొలగి సంపదలు లభిస్తాయి.* 


పితృదేవతలకూ, దేవతలకూ, మునులకూ కూడా అత్యంత ప్రీతిపాత్రం ఆషాఢం. మోక్షమార్గానికి ప్రథమ సోపానం ఆషాఢం. ముందుగా ఈ మాసంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. దానివల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల సద్గురు కటాక్షం లభిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత గాథ పద్మపురాణంలోని సృష్టి ఖండంలోని 9వ అధ్యాయంలోను, మత్స్యపురాణంలోని 14వ అధ్యాయంలోనూ ఉంది. 

                     *ఆషాఢమాసంలో బిల్వ వృక్షాన్ని నాటినా, బిల్వవనానికి నీరు పెట్టినా, బిల్వ పత్రాలతో రుద్రార్చన చేసినా శివగణంలో స్థానం లభిస్తుంది. ఆషాఢంలో తులసి పూజ చేసినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తులసి మెుక్కను పూజించి, ఆ మెుక్కను దానం చేయడాన్ని తులసి పూజ అంటారు. మెుక్కను ముత్తైదువులకు మాత్రమే దానం చేయాలి. ఆషాఢం అనేక విధాలుగా విజ్ఞానాన్ని, శాంతిని ప్రసాదించే మాసం .ఈ మాసాన్ని సద్వినియెాగం చేసుకున్నవారు గురుస్థానం పొందుతారు.*

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )

https://youtube.com/watch?v=is155gP9ayA&feature=share8



ఆషాఢ విదియ

ఆషాఢ విదియ రోజు పురి జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. అత్యద్భుతమైన జగన్నాథ ఆలయం ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్ప బలం వల్ల ఏర్పడింది. గజేంద్రమోక్షణంలో గజరాజుగా ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజే. ఆయన్ని అనుగ్రహించి జగన్నాథ పురం అనే ఒక ఊరును మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్ర తీరంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడయ్యాడు. జగన్నాథుడు సుభద్ర, బలరాముడితో కొలువై ఉంటాడు. 

ఆచరించవలసిన విధివిధానాలు:

ఏదైనా ఒక *ఆలయంలో* కానీ లేదా *మహానుభావులుండే స్థలానికి కానీ వెళ్లి చీపురుకట్ట పట్టుకొని ఊడవాలి. నేలని శుభ్రం చెయ్యాలి.* 

గురుసేవ, మహాత్ముల సేవ, ఆలయ సేవ, సేవకుడు లాగా, దాసుడి లాగా, ఒక కింకరుడి లాగా చెయ్యాలి. 

*ఫలశ్రుతి*- మహా ఐశ్వర్య సంపన్ను డవుతాడు. 

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )

⚜ శ్రీ మార్కండ మహాదేవ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1154


⚜ మహారాష్ట్ర :   చమోర్షి


⚜  శ్రీ మార్కండ మహాదేవ్ ఆలయం



💠 మహారాష్ట్రలోని చమోర్షి వద్ద 1200 సంవత్సరాల పురాతన శివలింగం మార్కండ మహాదేవ్ ఆలయ సముదాయం వైన్‌గంగా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది


💠 8వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ ప్రధాన సముదాయాన్ని 'మినీ ఖజురహో' లేదా 'విదర్భ ఖజురహో' అని పిలుస్తారు.


🔆 స్థల పురాణం


💠 ఒక పురాణం ప్రకారం మార్కండేయ మహర్షి శ్రీ మహాదేవుని ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చాడని చెబుతారు. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది.



💠 మార్కండ అనే పేరు శివుని యొక్క గొప్ప భక్తుడైన మార్కండేయ ఋషి పేరు నుండి వచ్చింది. 

ఆయన వైంగంగా నది ఒడ్డున సంవత్సరాలు తపస్సు చేసి చివరకు శివుడికి తన తలను అర్పించడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపి అతని పేరు మీద ఒక ఆలయాన్ని అనుగ్రహించాడు.



💠 పురాణాల ప్రకారం, ఒకసారి లంక రాజు రావణుడి సోదరుడు విభీషణుడు అనారోగ్యానికి గురయ్యాడు. 

ఆ సమయంలో యాదవుడైన హేమద్‌పంత్ అతన్ని స్వస్థపరిచాడు. కృతజ్ఞతగల విభీషణుడు అతనికి ఒక వరం ఇచ్చాడు.  

హేమాడ్‌పంత్ దేవాలయాలను నిర్మించడానికి సహాయం కోరాడు. రాక్షసులు ఒకేసారి ఒక రాత్రి కంటే ఎక్కువ పని చేయకూడదనే షరతుపై విభీషణుడు ఆ వరం ఇచ్చాడు. హేమాడ్‌పంత్ అంగీకరించాడు మరియు తదనుగుణంగా మార్కండ, భండక్ మరియు నేరి వద్ద ఉన్న అన్ని దేవాలయాలను ఒకే రాత్రిలో రూపొందించాడు. 

ఇది మహారాష్ట్రలోని ఈ జిల్లాలోని హేమాడ్‌పంతి మూలానికి చెందిన దేవాలయాల గురించి ఒక ప్రసిద్ధ జానపద కథ.


💠 హేమాడ్‌పంత్ దేవగిరి, మహాదేవ్ మరియు రామచంద్ర యాదవ రాజుల సెక్రటేరియట్‌కు అధిపతి. 

ఆయన ప్రఖ్యాత సంస్కృత పండితుడు. 

సుమారు 200 సంవత్సరాల క్రితం ఆలయంపై పిడుగు పడి, భారీ శిఖరం పైభాగం 'మహా మండపం' పైకప్పుపై పడిపోయిందని కూడా నమ్ముతారు. సుమారు 120 సంవత్సరాల క్రితం, గోండ్ రాజులలో ఒకరు దీనిని పునరుద్ధరించారు.


💠 ఈ ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు అనేక ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. 

ఈ నిర్మాణం 8వ నుండి 12వ శతాబ్దం వరకు ఉన్న రాష్ట్రకూట రాజవంశం నాటిదని చెబుతారు. 

ఈ ఆలయ సముదాయం యొక్క బయటి గోడలపై అనేక క్లిష్టమైన విగ్రహాలు (మూర్తిలు) ఉన్నాయి.



💠 ప్రధాన  ఆలయం యొక్క బయటి గోడపై దేవతలు, దేవత, అప్సర మరియు దేవాంగన శిల్పాలు చాలా ఉన్నాయి.


ఇక్కడ రెండు ప్రత్యేకతలను ప్రస్తావించాలి:


👉 579 కిలోమీటర్ల పొడవైన వైన్‌గంగా నది దక్షిణంగా ప్రవహిస్తుంది, మార్కండ వద్ద తప్ప, అక్కడ అది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది మరియు 'ఉత్తర-వాహిని వైన్‌గంగా' అని పిలుస్తారు.


 👉 బహుశా నృత్యం చేస్తున్న గణేశుడి విగ్రహం ఉన్న ఏకైక ఆలయం ఇదే కావచ్చు.


💠 ఈ సముదాయంలో వరద గణేశుడు, విగ్రహం లేని ఆలయం మరియు భవానీ ఆలయం వంటి అనేక మందిరాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు, చాలా మందిరాలు శిథిలావస్థలో ఉన్నాయి.


💠 ప్రధాన ఆలయం వెలుపలి భాగంలో దేవతలు మరియు సన్యాసులు అంటే అష్టదిక్పాల, అప్సర, సుర్సుందరి మరియు దేవాంగన శిల్పాలు ఉన్నాయి. 

అనేక పక్షులు, గజలక్ష్మి, నరసింహ మరియు శివపార్వతి శిల్పాలు కూడా ఉన్నాయి.

 ఆలయ ప్రాంగణం స్త్రీ చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. 

ఆలయం లోపలి భాగంలో రామాయణం, మహాభారతం కథలు కూడా ఉన్నాయి.


💠 దురదృష్టవశాత్తు, ఈ ఆలయం సుమారు 250 సంవత్సరాల క్రితం పిడుగుపాటుకు గురైంది మరియు శిఖరం పైభాగం మహామండపం పైకప్పుపై పడిపోయింది. 

ఈ సముదాయంలోని మరొక చిన్న ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. తరువాత గోండులు ఆలయాన్ని మరమ్మతులు చేసి నిర్మాణానికి మద్దతుగా భారీ స్తంభాలు మరియు తోరణాలను జోడించారు.


💠 24 నాలుగు దేవాలయాల సమూహం నది ఒడ్డున, ముందు మరియు ప్రక్కల మూడు ప్రవేశ ద్వారాలతో చతురస్రాకారంలో ఉంది. ఆలయ ముఖభాగాలన్నీ రామాయణం, మహాభారతం, పురాణాలు, దశావతారం మరియు మరెన్నో దృశ్యాలతో అద్భుతంగా అలంకరించబడ్డాయి.


💠 ఈ సముదాయంలోని అనేక దేవాలయాలు ఇప్పుడు పునరుద్ధరణకు గురవుతున్నాయి మరియు అందువల్ల ప్రజల సందర్శనలకు తెరవబడలేదు. పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ పూర్తి కావడానికి మరో సంవత్సరం పడుతుందని అంచనా. 

ఈ స్థితిలో కూడా ఈ ఆలయ సముదాయం యొక్క అందాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు.


💠 శివరాత్రి సమయంలో పూజలు చేయడానికి మరియు శివుని దర్శనం పొందడానికి చాలా మంది భక్తులు గుమిగూడుతారు 


💠 మార్కండ చంద్రపూర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో మరియు నాగ్‌పూర్ నుండి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. 



రచన

©️ Santosh Kumar

18-28-గీతా మకరందము

 18-28-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఇక తామసకర్తయొక్క లక్షణములను వివరించుచున్నారు - 


అయుక్తః ప్రాకృతః స్తబ్ధః  

శఠో నైష్కృతికో౽లసః

విషాదీ దీర్ఘసూత్రీ చ 

కర్తా తామస ఉచ్యతే.


తా:- మనోనిగ్రహము (లేక చిత్తైకాగ్రత) లేనివాడును, పామర స్వభావము గల వాడును (అవివేకి), వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడుచేయువాడును, సోమరితనముగలవాడును, ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- అయుక్తః = మనస్సు బహిర్ముఖముగాను, చంచలముగాను నుండువాడు, ఆత్మయందు నిలుకడలేనివాడు, ఏకాగ్రత, నిగ్రహము లేకయుండువాడు అయుక్తుడనబడును. ఆత్మతో, భగవంతునితో గూడియుండనివాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహములేక బయటనే తిరుగాడుచుండును.


"ప్రాకృతః" - ప్రకృతిగుణములు కలవాడు ప్రాకృతుడు. సంస్కారము లేనివాడు పామరుడని అర్థము. ప్రతివాడును తనయందలి ప్రకృతిగుణములను తొలగించుకొని అప్రాకృతుడుగ, దైవస్వరూపుడుగ మారవలెను.


'నైష్కృతికః' = ఇతరుల కార్యములను చెడగొట్టువాడు. ఇతరులను వంచించువాడు. సామాన్యముగ జనులు నాలుగు రకములుగ నుందురు. (1) తన సుఖమునుగూడ చూడక ఇతరులకు మేలుచేయువాడు (2) తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమొనర్చువాడు (3) తనసుఖము కొఱకు పరులకు కీడుచేయువాడు (4) అనవసరముగా ఇతరులకు కీడుచేయువాడు. మొదటివాడు ఉత్తముడు. రెండవవాడు మధ్యముడు. మూడవవాడు అధముడు. నాల్గవవాడు అధమాధముడు. ఈశ్లోకమున తెలుపబడిన 'నైష్కృతికులు' చివరి రెండు తరగతులకు జెందినవారు.


"అలసః" - భగవానుడు సోమరితనమును తామసగుణముగజెప్పి దానిని పారద్రోలవలసినదిగా బోధించుచున్నారు. సోమరి ఏరంగమందును వృద్ధికి రానేరడు. అధ్యాత్మరంగమున సోమరులకు చోటేలేదు.


"విషాదీ" - తామసకర్త ప్రతికార్యమందును ఏడుపుమొగము పెట్టుకొని యుండును. వాస్తవముగ అనంతానందపరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానమువలననే యగును. కావున గంభీరమగు స్వస్వరూపము నెరింగి విషాదమును పారద్రోలవలెను.


"దీర్ఘసూత్రీ"– మందకొడిగ ప్రవర్తించువాడు. తాబేలు నడకవంటి గమనము గలిగి చిన్నపనిని కూడా గంటలతరబడి చేయుచు, లేక అసలేచేయక "వాయిదా వేయుచునుండును. తామసకర్త 'తరువాత చూచెదములే' అను ప్రమత్తతతో గూడిన భావము గలిగియుండును.

        మహాభారతములోని శాంతిపర్వమున భీష్ముడు ధర్మరాజునకు "దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి" అను మూడు చేపలను గూర్చి బోధించిన విషయమీసందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తము. ఆ మూడు చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచనగలది. ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్నలోపముగలది. దీర్ఘసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి. (కథలో అది బెస్తవాని వలలో పడి మరణించును). కాబట్టి ఇట్టి దీర్ఘసూత్రత్వమును, అలసత్వమును, సోమరితనమును ముముక్షువులు దరికిచేర్చరాదు. అమూల్యమగు మానవజన్మను బడసి భగవత్ప్రాప్తికై యత్నింపక సోమరిగ కాలము గడుపుట మహాప్రమాదకరమని యెరుంగవలెను.


ప్ర:- తామసకర్త ఎట్టివాడు?

ఉ:- (1) మనోనిగ్రహము (చిత్తైకాగ్రత) లేనివాడు (2) పామరుడు (3) మొద్ధు, వినయము లేనివాడు(4) మోసగాడు (5) ఇతరుల కార్యములను చెడగొట్టువాడు (6) సోమరి (7) ఎల్లప్పుడు ఏదియోచింతతో, దుఃఖముతో గూడియుండువాడు (8) పనులను తెమల్చక దీర్ఘకాలము కొనసాగించువాడు - తామసకర్త యనబడును.

తిరుమల సర్వస్వం -282*

 *తిరుమల సర్వస్వం -282*

*సుప్రభాత గానం 12*

 *ఇరవై ఎనిమిదవ శ్లోకం* 


*"లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో* 

*సంసారసాగరసముత్తరణైక సేతో,* 

*వేదాంతవేద్యనిజవైభవ భక్తభోగ్య* 

*శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్."*


*శ్లోకార్థం:* 


 శ్రీమహాలక్ష్మికి నెలవైన వానివి; దోషరహితము, మంగళకరము అయినటువంటి గుణగణముల సాగరము వంటి వాడివి; సంసారమనే సాగరమును దాటించగల వారధి వంటి వానివి; వేదవేదాంతోపనిషత్తుల ద్వారా కీర్తించబడినట్టి వైభవమును కలిగినవాడివి యైనట్టి ఓ వేంకటాచలపతీ నీకు సుప్రభాతం.


 'సంసారం' అంటే సుఖ దుఃఖాలతో కూడుకున్న మానవజీవితం. సంక్లిష్టతతో కూడుకున్న ప్రాపంచిక జీవితాన్ని సాగరంతో పోల్చవచ్చు. సప్తసముద్రాలను దాటడానికి అనేక సాధనాలు ఉంటాయి. కానీ సప్తసాగరాల కంటే లోతైనది, ప్రమాదకరమైనది అయిన సంసారసాగరాన్ని దాటడానికి పరమాత్ముని పరిపూర్ణ కటాక్షం కావాలి.

 మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు ప్రళయకాలంలో ఒక నావను సృష్టించి, సృష్టిమూలాలను అందులో భద్రపరిచి, సృష్టి అంతరించకుండా కాపాడాడు. సకల చరాచర సృష్టినే ఒక నౌక సాయంతో ప్రళయాన్ని దాటించ గలిగిన శ్రీమహావిష్ణువును శరణు వేడితే సంసారసాగరాన్ని దాటడం దుర్లభం కాదు.


 ఈ శ్లోకంలో వేదాల ప్రస్తావన కుడా ఉంది. బ్రహ్మదేవుని వద్దనుండి వేదాలను తస్కరించి సాగరగర్భంలో నిక్షిప్తం చేసి; లోకాలను అజ్ఞానాంధకారంలో ముంచివేసే పన్నాగం పన్నిన సోమకాసురుడనే రాక్షసుణ్ణి మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు నిర్జించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించాడు. వేదాలు రక్షించబడిన చైత్రశుద్ధ తదియను మత్స్యజయంతిగా జరుపుకుంటారు. అందుచేతనే మత్స్యావతారుడైన శ్రీమహావిష్ణువు వేదనారాయణస్వామిగా కూడా ప్రసిద్ధికెక్కాడు. తిరుపతికి 50 మైళ్ళ దూరం లోని నాగులాపురం అనే గ్రామంలో అత్యద్భుతమైన శిల్పకళతో, సమున్నతమైన ప్రాకారాలతో అలరారుతున్న ప్రాచీన వేదనారాయణస్వామి ఆలయాన్ని నేడు కూడా చూసి తరించవచ్చు.


 ఆ విధంగా శ్రీమహావిష్ణువు మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారపు ప్రాశస్త్యాన్ని స్మరణకు తేవడం ద్వారా వారి కృపకు పాత్రులు కావాలని అణ్ణన్ స్వామి అభిలషించారు.



 *ఇరవై తొమ్మిదవ శ్లోకం*


*"ఇతం వృషాచలపతే రిహ సుప్రభాతం* 

*యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః,* 

*తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం* 

*ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే."*


*శ్లోకార్థం:* 


 ఏ మానవులైతే ఈ సుప్రభాతాన్ని అనుదినము ప్రాతఃసంధ్యలో పఠిస్తారో, అటువంటి భౌతిక కాయాన్ని కలిగిన భక్తులందరూ మోక్షసిద్ధిని పొందడానికి అనువైన అత్యుత్తమ జ్ఞానాన్ని సాధించగలరు.


 అంతిమంగా మోక్షసిద్ధిని శ్రీమహావిష్ణువు కటాక్షం ద్వారానే పొందవచ్చునని, ఎవరైతే ప్రతిదినము ప్రాతఃసంధ్య వేళలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారో వారు శ్రీవారి కటాక్షాన్ని పొందగలరని ముక్తాయిస్తూ శ్రీవేంకటేశ్వరుని భక్తులందరినీ సుప్రభాత పఠనానికై అణ్ణన్ స్వామి ప్రేరేపిస్తున్నారు.



 *సుప్రభాత గానం సమాప్తం* 



[ రేపటి భాగంలో... *తిరుమల క్షేత్రంలో నిషిధ్ధకర్మలు* గురించి తెలుసుకుందాం...]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*419 వ రోజు*

*సుయోధనుడిని మడుగు నుండి బయటకు తెచ్చే ప్రత్నం*


కృష్ణద్వైపాయన మడుగు వద్దకు వచ్చిన పాడవులతో కృష్ణుడు " ధర్మజా ! సుయోధనుడు నిశ్చయంగా ఈ మడుగులోనే ఉన్నాడు. అతడికి తెలిసిన జలస్థంభన విద్యతో మడుగు అడున దాక్కున్నాడు. అందుకే జలం నిశ్చలంగా ఉన్నది " అన్నాడు. ధర్మరాజు సుయోధనుడు స్వర్గాధిపతి వద్ద దాక్కున్నా నా వద్ద నుండి తప్పించుకొన లేడు " అన్నాడు. కృష్ణుడు " ధర్మరాజా ! ఇలాంటి మాయలు సుయోధనుడు తప్ప వేరెవరు పన్నగలరు. ఇప్పుడు దీనిని మనం వంచనతోనే జయించాలి. కనుక నీవు ఎలాగైనా సుయోధనుడు మడుగు నుండి వెలుపలికి వచ్చేలా చేయాలి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ కొరకు అనేక రాజులు మరణించారు. నీవు మాత్రం ప్రాణములు రక్షించుకోవడానికి ఇలా మడుగులో దాక్కొనడం భావ్యమా ? ఇది నీకు వీరమా ? నలుగురూ నవ్వరా ! నీ అభిమానం ఏమయ్యింది ఇలా యుద్ధంలో వెన్ను చూపడం నీకు తగునా ! క్షత్రియకులజుడవైన నీవు ఇలా నీచపు పనులు చేసిన ఇహము పరము రెండూ చెడవా ! నాడు శకుని, కర్ణుడు, దుశ్శాసనాదులను చూసి విర్రవీగావు నేడు ఇలా భీరువువై దాక్కున్నావు. నీ పిరికితనం వదిలి యుద్ధం చేసి మమ్ము జయించిన ఈ భూమండలాధిపత్యం పొందగలవు ఓడిన వీరస్వర్గం అలంకరించ గలవు. కనుక ప్రస్తుత నీ కర్తవ్యం మాతో యుద్ధం చేయటమే నీవు ఆడదానివి కాకున్న మాతో యుద్ధం చేయి " అని ఎత్తి పొడిచాడు.


*సుయోధనుడు మడుగు నుండి ధర్మజునితో మాటాడుట*


ఆ మాటలకు రోషపడిన సుయోధనుడు " ధర్మరాజా ! మానవులకు ప్రాణ భయం సహజము కాదా ! నా వద్ద ప్రస్తుతం రథము, సారథి, ఆయుధములు, చక్రరక్షకులు ఏమియును లేవు. నేను యుద్ధమున డస్సి ఉన్నాను. కనుక నేను ఇప్పుడు యుద్ధం చేయ లేను. మీరూ పద్దెనిమిది రోజుల యుద్ధమున అలసి ఉన్నారు కనుక మీరూ విశ్రాంతి తీసుకొని రండి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! మేము విశ్రాంతి తీసుకొని ఉన్నాము. నీవు మడుగులో విశ్రాంతి తీసుకున్నావు కదా ఇక వచ్చి యుద్ధం చేయి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నా తమ్ములు, బంధు మిత్రులు యుద్ధమున మరణించారు. ఎవరి కొరకు యుద్ధం తలపెట్టానో వారు లేరు కనుక ఎవరి కొరకు నేను యుద్ధం చేయాలి ? నేను గెలిచినా ఆనందించగల వారు ఎవరు. బంధు మిత్రులతో కూడి రాజ్యం చేసిన ఆనందమే కాని ఒంటరిగా రాజ్య పాలన చేయుటలో ఆనందం ఏమి ? నీకు నీ తమ్ములు అంతా ఉన్నారు కనుక నీవు ఇక ఈ రాజ్యాన్ని ఏలుకో. నేను ఈ రాజ్యాన్ని నీకు ధార పోసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. యుద్ధమున ఓడిన నాకు అభిమానం కోపం లేవు. గజ, తురగ, రథాధి సైన్య రహితమైన ఈ రాజ్యం నాకు వద్దు నీవే ఇక దీనిని నీ తలకు కట్టుకో " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ మిత్రుడు కర్ణుని మరణానంతరం శల్యుడిని సైన్యాధ్యక్షుని కావించి యుద్ధము చేసినది రాజ్యకాంక్షతో కాదా ! ఒట్టి మాటలు కట్టి పెట్టి యుద్ధముకు రా ! శత్రుశేషం ఉండగా రాజ్యాన్ని ఏలుకొనుట ధర్మం కాదు. కనుక నిన్ను గెలిచి రాజ్యాన్ని ఏలగలను. నీకు చేతనయితే నా తమ్ములతో నన్ను గెలిచి రాజ్యానికి పట్టభద్రుడివి కా ! అయిదూళ్ళు అడిగిన నిరాకరించిన నీవా నాకు రాజ్యాన్ని ధార పోసేది. రాయబారానికి వచ్చిన కృష్ణుడితో సూది మొన మోపినంత చోటు ఇవ్వనని ఇంత రక్తపాతానికి కారకుడవైన నీవు రాజ్యమును ధారపోస్తావా ! ఇక గెలుచుట అసాధ్యము అని తెలిసి ఇలా మాట్లాడుతున్నావు. నీ వద్ద రాజ్యం ఉంటే కదా నాకు ధార పోసేది. నీ దయా భిక్ష మీద వచ్చే రాజ్యాన్ని నేను స్వీకరించను. నిన్ను సంహరించి కాని రాజ్యభారం వహించను. మా ప్రాణములు నీ చేత ఉన్నాయి, నీ ప్రాణములు మా చేత ఉన్నాయి కనుక యుద్ధమున నిన్ను చంపక తప్పదు. మాకు విషము పెట్టించావు, నీళ్ళలో త్రోయించావు, లక్క ఇంట పెట్టి కాల్పించావు, మాయాజూదంతో రాజ్యమును అపహరించి మమ్ము అడవుల పాలు చేసావు ఇక నీ మత్సరమును సహించి నీ కుట్రలకు మేము బలి కాలేము. కనుక మారు మాటాడక వచ్చి యుద్ధం చెయ్యి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! మీరు అయిదుగురు నేను ఒక్కడిని, మీకు రథ, గజ, తురగ సమేత సైన్యము ఉంది. నేను ఇప్పుడు ఒంటరిని నిరాయుధుణ్ణి కనుక నేను నీకు కృష్ణుడికి వెరచి ఇక్కడ దాక్కున్నాను మీరు నాతో ఒక్కొక్కరుగా యుద్ధం చేసారంటే నేను మిమ్ము అందరిని యుద్ధమున హతమార్చి భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదుల ఋణం తీర్చుకొని రాజ్యాన్ని పొందగలను. నీకు యుద్ధ నీతి తెలియజేసాను " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మమ్ము అందరినీ ఒంటి చేత్తో సంహరించగనని అనుకోవడం సహజమే. కాని నేను అధర్మపరుడను కాను. నీకు అవసరమైన రథము, ఆయుధములు అన్నీ తీసుకో మాలో ఒక్కడితో యుద్ధం చేయి నీవు గెలిచిన రాజ్యాన్ని నీవే ఏలుకో బంధు మిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మయుద్ధం చేస్తాడు " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! రథములతో అస్త్రశస్త్రములతో యుద్ధం చేసి విసిగి ఉన్నాను ఇక నేను భూమి మీద నిలిచి మల్ల యుద్ధం చేస్తాను. గదతో నిన్ను నీ తమ్ములను తృటిలో ఓడిస్తాను " అన్నాడు. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అదే అదనుగా తీసుకొని సుయోధనుడు బుసలు కొడుతూ మడుగు నుండి బయటకు వచ్చాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


కవిం పురాణమనుశాసితారమ్

అణోరణీయాంసమనుస్మరేద్యః 

సర్వస్య ధాతారమచింత్యరూపమ్

ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ (9)


ప్రయాణకాలే మనసా௨చలేన

భక్త్యా యుక్తో యోగబలేన చైవ

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్

స తం పరం పురుషముపైతి దివ్యమ్ (10)


సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకాలనూ శాసించేవాడు, సూక్ష్మాతిసూక్ష్మమైనవాడు, సూర్యుడులాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకూ ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యంకాని రూపంకలిగినవాడు అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా వుంచుకొని భక్తిభావంతో, యోగబలంతో కనుబొమల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు...

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


         శ్లో𝕝𝕝 *పఞ్చాక్షరతనుం పఞ్చవదనం ప్రణవం శివమ్‌।*

                  *అపారకరుణారూపం గురుమూర్తి మహం భజేll*


తా𝕝𝕝 *శివపంచాక్షరీ మంత్రము శరీరముగా గలవాడు, అయిదు ముఖములు గలవాడును, ఓంకార స్వరూపుడును, మంగళకరుడును, హద్దు లేనికరుణయే స్వరూపముగా గలవాడును, దక్షిణామూర్తి గురుస్వరూపుడగు ప్రభువును నమస్కరించుచున్నాను*.

                   

 ✍️🌸💐🌹🙏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷గురువారం 26 జూన్ 2025🌷*

``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*                 

            *80వ భాగం*

```

ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడా, అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. 


అక్కడున్న వానరాలు 'ఆకాశం బద్దలయ్యిందా' అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి “తాతా, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా?” అన్నారు.


జాంబవంతుడు అన్నాడు… “అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు” అన్నాడు.


హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు… “చూడబడెను సీతమ్” అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగాడు. 


అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు… 

“నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే!” అన్నాడు.


అప్పుడు అంగదుడు… “అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు? ఇలాగే వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము” అన్నాడు.


అప్పుడు జాంబవంతుడు… “తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము” అన్నాడు.


అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువనాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దగ్గరికి వెళ్ళి… “ఆ మధువనంలోని మధువుని తాగుదాము" అన్నారు. 


అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు, అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంతమంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు.


ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతోంది (వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా “అసలు ఏమయ్యింది?” అన్నాడు.


“ఏమిలేదయ్యా, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు” అని లక్ష్మణుడితో అని, “వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను” అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు.


దదిముఖుడు ఆ వానరాలకి… 

“సుగ్రీవుడు రమ్మంటున్నాడు” అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్ళి.. “రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతోంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి” అన్నారు.


అప్పుడు రాముడు “సీత నాయందు ఎలా ఉంది?” అని అడిగాడు.


అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. 


అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి “సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది” అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి “సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి” అన్నాడు.


అప్పుడు రాముడు… “సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను" అని ఏడుస్తూ, సీత ఎలా ఉందని అడిగిగాడు. 


అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి “నీకు-సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను, నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది” అని చెప్పాడు.


అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.


హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి… “హనుమా! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.


సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను” అని, హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగలించుకున్నాడు. ```

         *రేపు…81వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గురువారం🪷* *🌹26 జూన్ 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🪷గురువారం🪷*

 *🌹26 జూన్ 2025🌹*        

   *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* మ 01.24 వరకు ఉపరి *విదియ*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం   : ఆరుద్ర* ఉ 08.46 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం : ధ్రువ* ప 11.40 వరకు ఉపరి *వ్యాఘాత* 

*కరణం   : బవ* మ 01.24 *బాలువ* రా 12.17 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 01.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *(27) తె 05.06 - 06.36* వరకు

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.37*

*వర్జ్యం          : రా 08.04 - 09.34*

*దుర్ముహూర్తం  : ఉ 09.59 - 10.52 మ 03.14 - 04.06*

*రాహు కాలం   : మ 01.49 - 03.27*

గుళికకాళం       : *ఉ 08.54 - 10.32*

యమగండం     : *ఉ 05.37 - 07.15*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.44*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.37 - 08.14*

సంగవ కాలం         :      *08.14 - 10.51*

మధ్యాహ్న కాలం    :     *10.51 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 04.06*


*ఆబ్ధికం తిధి         : ఆషాఢ శుద్ధ పాడ్యమి/విదియ*

సాయంకాలం        :*సా 04.06 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.54*

రాత్రి కాలం           :*రా 08.54 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷ఓం శ్రీ గురుదత్తాయ నమః🌷*


*హే జగదీశ భవ శరణమ్ ।*  

*జగన్నాథ భవ శరణమ్ ।*

*జగత్పాలక జగదధీశ ।*  

*జగదుద్ధార భవ శరణమ్*


   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

భాగవత నాంది పద్యం

 🙏పోతన గారి భాగవత నాంది పద్యం🙏


శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.!

భావము:

సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను.

ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం.

ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు.

ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు.

(1) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్

(2) లోకరక్షైకారంభకున్

(3) భక్తపాలన కళా సంరంభకున్

(4) దానవోద్రేక స్తంభకున్

(5) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్

(6) మహానందాంగనా డింభకున్

అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి.

భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి.

(1) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది.

(2) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.

(3) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది.

(4) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది.

(5) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.

(6) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

హక్కేది

 😱     *హక్కేది?*   😱



కం.

ప్రేమోన్మత్తులు కొందఱు 

కామోన్మత్తులు నితరులు కౌమారమ్మో 

కామాంధతయో పూనగ 

ప్రేమించుట మాని చంపు విధిలో మునిగెన్ 


కం.

తల్లిని జంపెడు వారొక 

రల్లుని జంపును మరియొక రాత్మజు నొకరున్ 

పెళ్ళాడిన పతి నొకరును 

చల్లగ జంపుట సులువయె సాటిమనుజులన్ 


కం.

హక్కేదిక్కడ చింతిల 

చక్కని ప్రాణము నడపగ సాటిజనులకున్ 

ఒక్కని కుసురును పోయగ 

హక్కే లేనట్టి వారి కారయ పృథివిన్ 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ పాడ్యమి - ఆర్ద్ర -‌‌ గురు వాసరే* (26.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి .






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*