5, మార్చి 2024, మంగళవారం

Panchaag


 

Kaaki


 

సోదరప్రేమ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సోదరప్రేమ..*


"నా పేరు సురేష్..నెల్లూరు నుంచి వచ్చాను..దాదాపు సంవత్సరం నుంచీ ఇక్కడకు రావాలని అనుకుంటున్నాను..ఇప్పటికి కుదిరింది..ఒక వారం రోజుల పాటు ఇక్కడ వుండవచ్చా?..కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి..ఈ స్వామి వారి వద్ద మ్రొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని విన్నాను..స్వామివారు దయ చూపిస్తే నా మనోవేదన తగ్గుతుందని ఆశ!." అన్నారు..ఆయన సుమారు నలభై ఐదేళ్ల వయసు కలిగి ఉంటారు..చూడటానికి నెమ్మదస్తుడిలా కనబడ్డారు..మా సిబ్బందికి చెప్పి, వారికొక రూమును కేటాయించాను..


వచ్చిన రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి, మందిరం లోకి వచ్చి, ఓ గంట సేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత లేచి వెళ్లి..మందిరం వద్ద ఉన్న దుకాణాల లో కొన్ని బిస్కెట్ పొట్లాలు కొని..మందిరం వద్ద ఉన్న కుక్కల కు ఆహారంగా పెట్టారు..రాత్రికి తన రూముకు వెళ్లిపోయారు..రోజూ ఇదే విధంగా ఉదయం, సాయంత్రం ధ్యానం చేసుకోవడమూ..కుక్కలకు ఆహారాన్ని అందివ్వడమూ తన ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు..మధ్యాహ్నం మందిరం తరఫున ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు..ఐదురోజులు గడిచిపోయాయి..మందిరం వద్ద ఉన్న ఇతర భక్తులూ..మా సిబ్బంది కూడా ఆయనను అమాయకుడి గా భావించసాగారు..కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా..అందరితో కలివిడిగా..వుండేవారు..ఏదీ మనసులో దాచుకోకుండా ప్రవర్తించేవారు..శని, ఆదివారాల్లో అన్నదానం వద్ద నిలబడి..అక్కడికి వచ్చి ఆహారం తీసుకునే వాళ్ళను ఆసక్తిగా గమనించేవారు..తానే అన్నదానం చేస్తున్నట్లు గా భావించి..అందరికీ కొసరి కొసరి అన్నం పెట్టేవారు..ఒక తన్మయత్వం ఆయన కళ్ళలో కనబడేది..శనివారం నాటి పల్లకీ సేవలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు..


మరోరెండురోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే.."ప్రసాద్ గారూ ఈరోజు మందిరం వద్ద ఎన్ని గంటలకు వుంటారు?.." అని నాకు ఫోన్ చేశారు..చెప్పాను..ఉదయం ఎనిమిది గంటల కల్లా మందిరం వద్దకు వెళ్ళాను..నాకోసమే ఎదురు చూస్తున్నట్లుగా మందిరం వెలుపలే వేచి ఉన్నారు..ఆయనను పలకరించి..మందిరం లోపలికి వెళ్లి, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చున్నాను..నేరుగా నా వద్దకు వచ్చేసారు..


"కొన్ని వివరాలు అడుగుతాను..చెపుతారా?.." అన్నారు..చెపుతాను అన్నట్లు తల ఊపాను.."అలా కాదు..నోటితో చెప్పండి.." అన్నారు..పసిపిల్లాడు అడిగినట్లు గా అడిగారు..వారిని చూస్తుంటే..ఏదీ దాచుకోకుండా చెప్పాలని అనిపించింది..


"ఒక వారం పాటు ఇక్కడ అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత?.." అన్నారు..చెప్పాను..

"ఓహో..అలాగా.."అన్నారు..కొద్దిసేపు మౌనంగా వుండి.."ప్రసాద్ గారూ నేను ఇక్కడికి వచ్చిన రోజు మీతో..కొన్ని సమస్యలున్నాయని చెప్పాను..గుర్తుందా?..నాకున్న పెద్ద సమస్య మా తమ్ముడే.. వాడు నాతో విబేధించి..నాతో మాట్లాడటం మానేశాడు..ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది..నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడండీ..అరగంట సేపు మాట్లాడాడు..ఉన్నఫళంగా నన్ను బయలుదేరి రమ్మన్నాడు..నన్ను చూడాలని అనుకుంటున్నాడట.. తన పొరపాట్లు మన్నించమని అడిగాడు..నేను ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి వద్ద ధ్యానం చేసుకున్న ఫలితం ఇది.. నేను శ్రీ స్వామివారిని నా తమ్ముడికి నాకూ మధ్య ఉన్న అంతరాలను తొలగించమనే కోరుకున్నాను.. శ్రీ స్వామివారు అది తీర్చారు.." 

ఆ మాట చెపుతూ..ఉద్వేగం ఆపుకోలేక..కన్నీళ్లు పెట్టుకున్నారు..


"నేను నాలుగు రోజులపాటు వుందామని అనుకున్నాను..కానీ పదిరోజుల పైనే ఇక్కడ వున్నాను..శ్రీ స్వామివారి కృపతో తమ్ముడి దగ్గరకు వెళుతున్నాను..త్వరలో మా తమ్ముడితో సహా ఇక్కడికి వస్తాను..నాకు చాలా తృప్తిగా వుందండీ..ఇంత చిన్న పల్లెటూరు ప్రక్కన ఉన్న ఈ గుడివద్ద..మీకు ఉన్న పరిమిత వనరులతోనే..మీరు చేస్తున్న అన్నదానం బాగుందండీ.." అన్నారు..


ఆరోజు సురేష్ గారు వాళ్ళ ఊరు వెళ్లేముందు..ఒక వారం రోజుల పాటు అన్నదానానికి సరిపడా సరుకులను మందిరం వద్దకు చేర్పించి మరీ వెళ్లారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మకు అందలం!

 అమ్మకు అందలం!

                   --------------------------

కౌసల్యా..రామా..అనే కాలం ట్యూన్ తో సెల్ ఫోన్ మోగింది.


కొద్ది సేపటికి జానకమ్మ ఫోన్ ఆన్ చేసి "హలో!"అని అంది.


"అమ్మ!నేను సంధ్యని !''అని అవతలి వైపునుండి వినిపించింది.ఆగకుండా తనే "అదేమిటి అంత సేపు పట్టిందేమిటి ఫోన్ తీయడానికి!?"అని ప్రశ్నించింది.


"నువ్వా తల్లి!ఏమి లేదమ్మా !నిద్రపోతున్నాను!"అని అంది జానకమ్మ.


"ఈ టైం లో పడుకోవటమేమిటి!మీ దగ్గర టైం ఎంతయిందేమిటి!?ఆ..సాయంత్రం 5 గంటలై ఉంటుంది.అసుర సంధ్యవేళ పడుకోవద్దని  నువ్వే చెబుతావుగా!వొంట్లో బాగో లేదా!" అని అడిగింది సంధ్య.

"బాగానే ఉందమ్మా!..ఎదో అలిసిపోయినట్టయి కన్ను మూత  పడింది..(అని దగ్గింది..)!"అంది జానకమ్మ.


"నువ్వు అబద్ధం చెబుతున్నావు!ఆ దగ్గేమిటి!మాట మాట్లాడటానికి కూడా ఆయాస పడుతున్నావు!నాన్న ఇంట్లో లేడా!?"అని ఆందోళనగా అడిగింది సంధ్య.


"అంత సీరియస్ గా ఏమి లేదే !సీసన్ మారుతోందిగా (మల్లి దగ్గు..)అందుకే కాస్త జలుబు చేసింది.విక్స్  రాసుకున్నాను.తగ్గిపోయిందిలే!"అంది జానకమ్మ.


"నాన్న ఎడి!ఇంట్లో లేడా! ముందు  ఆ విషయం చెప్పు!నిన్నొకదాన్ని ఇంట్లో వదిలేసి సీరియల్స్ ,షార్ట్ ఫిలిం లంటూ షూటింగులకు వెళ్లాడా!"అని సీరియస్ గా అంది సంధ్య.


"ఎదో ఆయన పనులు ఆయనకుంటాయే.!నాలాగా ఇంట్లో కూర్చుని వంటలు చేసుకొనే మనిషా!వరంగల్ లో ఎదో సీరియల్ షూటింగ్ ఉందని మొన్న వెళ్లారు.రెండు రోజుల్లో వచేస్తారులే!"అని సర్ది చెబుతున్నట్టు అంది జానకమ్మ.


"అదేంటమ్మా!ఉద్యోగం చేసినంత కాలం అటు ఉద్యోగం,ఇటు నాటకాలు,సీరియల్స్ షూటింగ్ లంటూ ఒక్క పూట ఇంట్లో లేకుండా తిరిగాడు.ఆదివారాలైతే అసలే కనబడేవాడు కాదు.నన్ను చెల్లిని కనిబెట్టుకుని రాత్రియంబవళ్ళు నువ్వే కాసావు.అటు వంట పని,ఇంట్లో పని,ఆయనకు సేవలు చేస్తూ నీ జీవితమంతా గడిచిపోయింది.ఒక్క రోజు సుఖపడింది లేదు.యంత్రంలా పనిచేసావు.ఈ రోజు మేము చదువుకొని పెద్ద  పెరిగి అమెరికా లో సెటిల్ అయ్యామంటే అంతా నీ చాకిరివల్లే  గదమ్మ!..రిటైర్ అయ్యాకన్నా ఇంటిపట్టున వుండి  నిన్ను చూసుకుంటాడంటే అదీనూ లేదు!ఇంకా బిజీ అయిపోయాడు!..నీకు వొంట్లో బాలేదని ఆయనకు తెలుసా!"అని ఆవేదనగా అంది సంధ్య.


"అదేంటే నాన్నగారిని అంత మాటంటావు!ఆయన బయట తిరిగి సంపాదించకపోతే మనమందరం బతికే వాళ్లమా!ఇంత బాగుపడేవాళ్ళమా!మా తరం ఆడ వాళ్ళ జీవితమే ఇంతేనమ్మా!మాకు వేరే వ్యాపకమేముంటుంది!సంసారం చేయడం పిల్లలను కనడం,వాళ్ళను కనిపెట్టుకుని వుండి పెంచి పెద్దవాళ్ళను చేయడం!మా అమ్మా అదే చేసింది.నేను అదే చేసాను!అదేదో విడ్డురంలాకా,నేనొక్కదాన్నే కష్టపడిపోయినట్టు మాట్లాడుతావ్!"అని దీర్గాలు తీస్తూ అంది జానకమ్మ!


"నువ్వెప్పుడూ అనేమాటే ఇదిగాని!..నాన్నకు నీ జ్వరం గురించి తెలుసా లేదా!ఆ మాట చెప్పు!"అని విసుగ్గా అంది సంధ్య.


"ఆయన బయలుదేరేటప్పుడే కొద్దిగా మొదలయిందమ్మా!కానీ ఆయన షూటింగ్ అప్పటికే ఫిక్స్ అయింది.అది మానకూడదని చెప్పాడు.నేనే వెళ్ళమని చెప్పానులే!దానిదేముంది అవసరమైతే పక్కింటి ఆంటీని తోడుగా తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు!ఒకటి రెండు రోజుల్లో తగ్గక పోతే ఆ పనే చేస్తాలే!"అని మళ్ళి దగ్గ సాగింది జానకమ్మ.


"పీకలమీదకొచ్చే దాకా ఇంట్లో అలాగే పడుకో!..ఆయనకు బుద్ధి లేదు..నీకు లేదు!నాన్న కనీసం ఫోన్ చేసి తెలుసుకుంటున్నాడా!"అని సంధ్య కోపంగా అంది.


"ఆయన షూటింగ్ చేసే ప్లేసులో ఫోన్ సిగ్నల్స్ వుండవుట!ఆయనేం చేస్తాడు.ఎందుకె ఊరికే అంత ఖంగారు పడి ఇంతెత్తున ఎగురుతున్నావు!నేను ఈ రోజే డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తాలే!"అని అంది జానకమ్మ.


"ఇవాళ మొదటిసారి కాదు గదమ్మ!ఇలా ఎంతకాలం ఒంటరిగా గడుపుతావు.షూటింగులు,నాటకాలంటూ నాన్న ఊరిమీద తిరుగుతుంటాడు.నువ్వేమో పిచ్చిదానిలా ఆ వెధవ టి వి పెట్టుకొని ఆయన ఎప్పుడొస్తాడా ,పాద సేవ చేద్దామని ఎదురు చూస్తుంటావు.అమ్మమ్మంటే చదువుకో లేదు.వాళ్ళ తరం అలా  గడిచి పోయింది.నువ్వు చదువుకున్నా వుద్యోగం లేకుండా మాకోసమే ఇన్నాళ్లు గడిపావు .నీక్కూడా అరవై ఏళ్ళు దాటాయి గదా!ఇప్పటికైనా నిన్ను సుఖంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద లేదా!మేమేమైనా మాట్లాడితే ఆయనకు కోపం.ఇంతెత్తున లేస్తాడు!నువ్వుకూడా మీ అమ్మలాగానే ఇంట్లో మగ్గిపోవాలని అనుకోకు.నీ వెనక మేమున్నాం....ఇది ఇలా కాదుగాని నేను చెల్లి కలిసి ఎదో ఒకటి ఆలోచిస్తాం!..ముందు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లిరా!ఏమన్నాడు నాకు మెసేజ్ పెట్టు!ఉంటా!" అని ఫోన్ పెట్టేసింది సంధ్య.ఏమిటో ఈ కాలం పిల్లలు అని అనుకుంటూ వుసూరుమంది జానకమ్మ!

                                                         ++++++++

    వారం రోజులవుతుందనుకున్న షూటింగ్ పదిహేను రోజులవడంతో ప్రముఖ నటుడు

 సుబ్రమణ్యం  ఆలస్యంగా ఇంటికి చేరాడు.షూటింగు తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆ నెలలో చేయాల్సిన ఇతర కార్యక్రమాలను సరి చూసుకుంటూ ,తోటి కళాకారులతో మాటలు చెప్పుకుంటూ రిటర్న్  జర్నీ హుషారుగా గడిచి పోయింది.ఇంటిముందు కార్  ఆగే వరకు సమయమే తెలీలేదు.


 చేతిలో సూట్ కేసు తో దిగిన ఆయనకు తన శ్రీమతి ఎదురొస్తుందనుకుంటే గేట్ కు తాళం వెక్కిరిస్తున్నట్టు కనబడింది.దానితో ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు.ఎక్కడకు పోయింది ఈవిడ!అని విసుక్కుంటూ వచ్చి డూప్లికేట్ కీస్ తో తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.ఎప్పుడు తల తళలాడుతూ కనబడే పోర్టికో,వరండా  దుమ్ము ధూళితో ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది.

     "జానకి కి ఏమైంది!ఇల్లంతా దుమ్ముకొట్టుకు పోయుంది.ఎప్పుడు ఇలా వుంచదే!"అని అనుకుంటుంటే ,తాను వెళ్ళేటప్పుడు ఆమెకు జ్వరంతో ఉండడం గుర్తొచ్చింది."కొంపదీసి ఏమి కాలేదుగా?!"గుండె ఒక్కసారిగా ఆందోళనతో వణికింది."ఛీ ఛీ నేనే తప్పు చేసాను!మధ్యలో ఒక్కసారి ఫోన్ కూడా చేయలేదు!"అని తిట్టుకున్నాడాయన.


  "సరే ఇప్పుడేమనుకుని ఏమి లాభం! ఇగనుంచైనా జాగ్రత్తగా ఉండాలి.ఇలా ఎప్పుడు కాలేదు" అని అనుకుంటూనే ఇంటి తలుపును తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.హాల్ లో  పరిస్థితి అలాగే వుంది  కనీసం వారం రోజులనుండి ఇంట్లో ఎవరు లేని ఆనవాళ్లు కనబడుతున్నాయి.చేతిలోని సూట్ కేసు ను టీపాయ్ మీద పడేసి జేబులోనుండి ఫోన్ తీసి జానకి నెంబర్ కు డయల్ చేసాడు సుబ్రహ్మణ్యం.భార్యకు ఏమైందో అనే ఆందోళన ఆయన మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.అవతల రింగవుతోంది కానీ ఎత్తడం లేదు.ఆయనలో ఖంగారు మరింత పెరిగి పోయింది.మరో సారి చేసాడు ఈ సారికూడా నో రిప్లై.కాసేపటికి ఆ ఫోన్ ఇంట్లో బెడ్ రూమ్ లోనుండి రింగ్ అవుతోందని గ్రహించాడు."ఇదేంటి ఫోన్ కూడా ఇంట్లో పడేసి పోయింది!దీనికేమైంది అసలు!"అని అనుకుంటూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తాడు.

 అక్కడ బెడ్ పక్కనే వున్నా టీపాయ్ మీద జానకి ఫోన్ వుండి.దాని కిందనే ఒక కాగితం వుంది .

దానిపై...

   "ఏమండి!..మీరు వెళ్ళిపోయాక నాకు జ్వరం పెరిగి పోయింది.పెద్దమ్మాయి ఫోన్ చేసి దాని ఫ్రెండ్ సుజిని పంపి హాస్పిటల్ లో జాయిన్ చేయించింది.దేవుడి దయ వల్ల రెండు రోజుల్లోనే కోలుకున్నాను.ఆ రెండు రోజులు సుజి,వాళ్ళ ఆయన నాతోనే వున్నారు.మీకు ఫోన్ చేస్తే కలవ లేదు.పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకొని నాకు అమెరికాకు టికెట్ బుక్ చేశారు.నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు.మీరు రాగానే మిమ్మలనుకూడా అమెరికాకు రప్పిస్తామని అనడంతో నేను .మొన్న గురువారంనాడు అమెరికాకు  బయలుదేరాను.సుజి వాళ్ళు విమానం ఎక్కే వరకు నాతోటె వున్నారు.మీరు ఇంటికి వచ్చే సరికి నేను లేకపోవడం మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించడండి.పిల్లలు పట్టుబట్టేసారు.నేను రాకపోతే వాళ్ళ మీద వొట్టే అని బలవంత పెట్టేసారు.మీరు రాగానే పిల్లలకు ఫోన్ చేయండి.నేను మాట్లాడుతాను.---ఇట్లు /జానకి.


కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది సుభ్రమన్యానికి!ఇదేమిటి చెప్పా పెట్టకుండా ఎదో అనకాపల్లి కెళ్లినట్టు అమెరికాకు వెళ్లిపోవడమేమిటి! నేను వచ్చే  వరకు ఆగొచ్చుగా!ఈ పిల్లలకు మరీ బుద్ధి లేకుండా పోయింది!అని కోపం నషాళానికెక్కింది.అదే ఆవేశంలో అమెరికాకు ఫోన్ కలిపాడు .కాసేపటికి అవతల సంధ్య ఫోన్ ఎత్తిన్ది!


"ఇదేంటి నాన్న ఇంత రాత్రి ఫోన్ చేసావు.టైం చూసుకోవద్దా!"అని చిరాకు పడింది.


"సారీరా..!నేనిప్పుడే వచ్చాను అమ్మ లేకపోవడంతో ఖంగారులో టైం చూసుకో లేదు.రేపు పొద్దున్న చేస్తాలే!"అని అన్నాడు.."పర్వాలే నాన్న!లేచేసాముగా!మాట్లాడు!"అని అంది సంధ్య.


"అదేరా!అమ్మకు ఎలా ఉందిరా!నేనొచ్చే వరకైనా ఆగక పోయారా!హఠాత్తుగా తీసుకెళ్లి పోయారు!"అని నిష్టురంగా నాడు.


"అమ్మ ఇప్పుడు బాగానే వుంది.ఇక్కడకు వచ్చాక ఒక్క రోజులోనే కోలుకుంది.ఆవిడకు మా మీద మనవళ్ల  మీద బెంగ!నన్ను చెల్లిని చూసి ఎంతో సంతోషించింది.నీకు చెప్పాలంటే నీ ఫోన్ పని చేయలేదు.ఎప్పుడొస్తావో తెలీదు.అమ్మ హాస్పిటలనుండి ఇంటికొచ్చాక ఇంట్లో ఎవరు చూస్తారు.ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సుజి చూడలేదుగా!దాని సంసారం దానికుంటుంది.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం!"అని కూల్ గా చెప్పింది సంధ్య.


"బాగున్నాయే మీ ప్రేమలు.నన్నొక్కడిని వదిలి పెట్టి పోతే నేనేమైపోతానో అనే ఆలోచన మీకు లేదా!"అని ఆక్రోశంగా అన్నాడు సుభ్రమణ్యం.


"నీకేంటి నాన్న! నెలకు ఇరవై రోజులు పైగా బయటనే తిరుగుతుంటావు.తినడానికి హోటల్ లు ఉండనే వున్నాయి.ఇంట్లో వున్నప్పుడు ఎవరైనా పనివాళ్లను పిలిచి శుభ్రం చేయించుకో!మన కాలనీ లో టిఫిను,భోజనాలు సప్లై చేసే క్యాటరర్లు ఉండనే వున్నారు.అమ్మతో నీకేం పని!.మాదగ్గర మాకు అమ్మతో పనులుంటాయి!అమ్మకూడా సంతోషంగా ఉంటోంది.వీడియో కాల్స్ ఉండనే  వున్నాయి.నీకు వీలైనప్పుడల్లా మాట్లాడు.నాదగ్గర కొన్ని రోజులు,చెల్లిదగ్గర కొన్ని రోజులు ఉంటుంది."అని యధాలాపంగా అంది సంధ్య.


"నీకు తెలివితేటలు పెరిగి పోయాయే!నాకు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకు పోయి వెధవ ఖబుర్లు చెబుతున్నావా!వెంటనే అమ్మను పంపించు."అని ఆగ్రహం తో ఊగి పోయాడు సుభ్రమణ్యం.


"కూల్ నాన్న!కూల్!ఎందుకట్లా అరుస్తావు!అమ్మ నీకెంత స్వంతమో ఆమె కడుపునా పుట్టిన మాకు అంతే స్వంతం!నువ్వు ఉద్యోగం చేసినంతకాలం ఒక్క రోజు ఇంట్లో వున్నా పాపాన పోలేదు.మా చిన్నప్పుడంతా అమ్మే ప్రపంచంగా గడిపాము!ఇప్పుడు అమెరికాలో మేమింత 

పొ జిషన్ లో సెటిల్ అయ్యామంటే అది అమ్మ పెంపకమే!మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది.అలాంటి అమ్మ ఈ వయస్సులో కూడా దిక్కు లేనిదానిలా ఇంట్లో ఒక్కతి జ్వరమొచ్చినా చూసే వాడు లేక పడుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాం!నీకు బాధ కలుగుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు!..సరే మాకెందుకు..అమ్మకు ఫోన్ ఇస్తా అమ్మతోనే మాట్లాడు.!"అని అంది సంధ్య.


కాసేపటికి జానకి లైన్ లోకి వచ్చింది.


"ఏమండి ఎలా వున్నారు!ఇంటికెప్పుడు వచ్చారు!"అని ఆతృతగా అడిగింది జానకి.


"ఇప్పుడే తగలడ్డాకాని,నువ్వు చేసిన పనేమన్నా బాగుందా!నేను ఇంట్లోలేనప్పుడు ఆ పిల్లల మాట పట్టుకుని చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేస్తావా!నా బాగోగులు ఎవరు చూస్తారే!నీకు నీ సంసారం అక్కర లేదా! నోరుమూసుకుని    వెంటనే బయలు డేరిరా!"అని ఉగ్రంగా అరిచాడు .


"అయ్యయ్యో!అదేంటండి.అలా అంటారు.నా ఆరోగ్యం బాగా లేదని పిల్లలు అలా చేశారు.దీనిలో తప్పేముందండి.మీరెలాను ఇంట్లో వుండరు.ఒక్కదాన్ని ఆ ఇంట్లో పడుండడమెందుకని నేను అనుకున్నాను!ఇక్కడ మన బుజ్జి మనవళ్లను  నేనే చూసుకుంటున్నాను.నా ఆరోగ్యంకూడా కుదుటపడింది.ఇంటికి వస్తానులెండి రాకెక్కడ పోతాను.అయినా మీరు ఇంటికి రాగానే మిమ్మలను కూడా ఇక్కడికి తెప్పిస్తామని పిల్లలు చెప్పారుగా!ఊరికే కోప్పడి పోతున్నారు!"అని జానకి అంది.


అంతలోనే సంధ్య కాల్ లోకి వచ్చింది.."అవును నాన్నా!అమ్మకు మేము అలానే చెప్పాము!నీవు అమ్మతో పూర్తి సమయం  ఎప్పుడుంటావో చెప్పు అప్పుడే నీకు కూడా ఫ్లైట్ టికెట్ లు బుక్ చేస్తాము.అప్పటి దాకా అమ్మను ఇక్కడే ఉండని.మాకు ఆవిడకు మనశాంతిగా ఉంటుంది!"అని అంది సంధ్య.


ఆ మాటకు సుభ్రమణ్యం గొంతులో వెలక్కాయ పడినట్లయింది.

ఆయనకు మరో రెండు రోజుల్లోనే టూర్ వుంది.ఈసారి ఇంకా  బిజి! నెల్లాళ్ళ పాటు అవుట్ స్టేషన్ వెళ్ళాలి.ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ తో లేక లేక అవకాశం దొరికింది.ఏమి సమాధానం చెప్పాలి!


  "అలాగే అమ్మ !నేను ఫ్రీ కాగానే మీకు కాల్ చేస్తాను.అమ్మను జాగ్రత్తగా చూసుకోండి!"అని కాల్ డిస్ కనెక్ట్  చేసి నీరసంగా మంచం మీద వాలి పోయాడు!తాను అల్లుకున్న సాలెగూడులో తానే చిక్కుకున్నట్లుగా అనిపించింది సుబ్రమణ్యానికి!


                                            **********************

              - సత్య భాస్కర్ ఆత్కురు ,9848391638        


  

  


"