26, ఏప్రిల్ 2025, శనివారం

వీస్తున్న కొత్త గాలి

 `డాక్టర్ దేవులపల్లి పద్మజ 

ఫోను 9849692414


                      వీస్తున్న కొత్త గాలి


పచ్చతోరణాలు, పసుపు బట్టలు, పెళ్ళి సందడి ఇంకా నడుస్తోంది. రేపటి సత్యనారాయణ వ్రతం, సాయంత్రం రిసెప్షన్ ఇంకా జరగాలి .సరళ మాటి మాటికి తన కొత్త కోడలిని ముచ్చటగా చూసుకుని ముగిసిపోతోంది. కొడుకు శ్రీకర్ , కోడలు శర్మదా హాలులో కూర్చున్నారు. భర్త ఈజీ చైర్ లో కునుకు లాగిస్తున్నారు. సరళ హాల్ లో వీళ్ళని చూసి మాట్లాడుకోడానికి మొహమాటం గా ఉండి ఎవరి గోళ్ళు వాళ్ళు గిల్లుకుంటున్నారు. అనుకుని లోపలికి వెళ్ళి గట్టిగా భర్తకి వినిపించేలా ఓ కేక పెట్టింది. 


"ఏవండీ! వినగానే కంగారుగా లేచి ఆ దిక్కుగా అడుగులేశారు. ఏమిటీ ఎందుకు అంత కేక పెట్టావు అన్నట్టు భార్యకేసి చూసారు..వాళ్ళకి కాస్త కబుర్లు చెప్పుకునే అవకాశం ఇచ్చి, మీరు జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచిస్తారని పిలిచాను. సరళ సమాధానం". శ్రీకర్! అమ్మాయికి మన ఇల్లు చూపించు. లోపలికి వెళ్ళి రిలాక్స్ అవండి. శర్మద వైపు చూసి, వెళ్లామ్మా! ఓ గంటలో అందరూ వచ్చేస్తే మరల హడావిడి. అన్నారు. కేశవరావు గారు. రాత్రి భోజనాలు వరకూ కేటరింగ్ వారి ఏర్పాట్లు చేసేసారు...మండపం నుంచి వెనక్కి వెళ్లిపోయేవారు వెళ్లి పోతారు. వ్రతానికి వచ్చే దగ్గర బంధువులు అందరూ భోజనాలు చేసి ఇంటికి చేరుకుంటారు. మంచి సమయం చూసి కొత్త దంపతులను ముందు తీసుకొచ్చి ధాన్యం గడపలో అడుగు పెట్టించారు. తెల్లవారి సందడి మొదలైంది. ఏమి చెప్తే అదే చేస్తున్నారు. చక్కగా ఉంది జంట. ఓర్పుగా వ్రతం చేసారు. సాయంత్రం స్నేహితులు తోటి ఉద్యోగులు ఊర్లో పరిచయస్తులు అందరి సమక్షం లో విందు కూడా ఘనంగా జరిగింది. యాన్నాళ్ళు అయ్యాక ముందు తిరుపతి, అక్కడ నుంచి ఊటీ, కొడైకెనాల్ వెళ్లి రమ్మని కేశవరావు గారు ముందుగానే ఏర్పాట్లు చేసారు...అనుకున్నట్టుగానే బయలుదేరారు శ్రీకర్, శర్మదా. వారిని ట్రైన్ ఎక్కించి, బయలుదేరే సమయం వరకూ సరళా, కేశవరావు, శర్మద తల్లిదండ్రులు ఉండి, సిగ్నల్ ఇవ్వగానే సరళ కోడలి దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పి, వెనుతిరిగింది.. ట్రైన్ వేగం పుంజుకుంది. సెకండ్ ఏ సీ సీట్లో కూర్చున్న వీరిద్దరూ కాసేపు మౌనంగా ఉండి బోరుకొట్టినట్టుంది. శర్మా. న్యూస్ పేపర్స్ ఇవ్వగలవా బేగ్ లో ఉన్నాయి అడిగాడు భార్యని. అవి అందించే సమయంలో అత్తగారు చెప్పిన

విషయం గుర్తుకొచ్చి లోపలి నుంచి కవర్ బయటికి తీసింది. పై బెర్త్ శ్రీ, క్రింది సీట్లో శర్మదా. సీరియస్ గా చదువుకుంటున్నారు.



చూస్తే ఈతరం పిల్లల ధోరణి కనపడడం లేదు వీళ్ళలో అనుకుంది ఎదుటి సీట్లో ఉన్న భానుమతి గారు. కవర్ లో ఉన్న కాగితాలు చూసి, అత్తగారు రచయిత్రి కదా..ఆవిడ రాసిన కధలు, కవితలు అయి ఉంటాయా అనుకుంటూ. కనులకు పని చెప్పింది.. ఆశ్చర్యం, అత్తగారు తనకి రాసిన ఉత్తరం. చి.ల.సౌ శర్మదా, నీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పడానికి నాకూ, వినడానికి నీకూ సమయం లేకపోవడం, ఏకాంతం కుదరకపోవడం. నీ చేతికి ఈ ఉత్తరం. జీవితంలో ఏదీ మనకి తెలిసి జరగదు..జరగబోయేది ముందు తెలిస్తే మనిషికి, మానవుడికి భేదం ఉండదు కదా. ఒక మంచి ఇల్లాలిగా, ఉత్తమ పౌరురాలిగా ఉండడానికి నాకు తెలిసినంతవరకూ సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు, సహనం, స్నేహతత్వం ఉండాలి..అన్నిటికి మించి మంచి స్పందన ఉండాలి. మానవత్వం కలిగి సమాజంలో తెలివిగా నెట్టుకురావాలి. నువ్వు చాలా పెద్ద చదువులు చదువుకున్నావు. నిజమే. ఆ చదువు మన సమాజాన్ని చైతన్య పరచడానికి ఉపయోగపడాలి. మనిషిగా ఎదగడానికి

మనసు ఎదగడానికి చాలా తేడా ఉంది. బయటికి కనిపించే మనిషి కంటే మనసు ఎదగడానికి చాలా సమయం పడుతుంది. కాలక్షేపం కోసం ఉద్యోగం చేయకూడదు. అవసరమైతే తప్పకుండా నీ చదువు ఉపాధి కొరకు ఉపయోగపడుతుంది. భర్తకి మంచి సంపాదన, హోదా ఇవ్వన్నీ ఉన్నపుడు, కక్కుర్తి పడి చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉండడం మంచిది కాదు. నీ స్థానం లో మరొకరికి అవకాశం, అవసరమైన వారిచే భర్తీ చేయబడుతుంది. నాలుగు రోజులు సరదాగా తిరగడానికి వెళ్లేటపుడు ఇదంతా ఏమిటి అనుకోకుండా. మంచి పిల్లవు కదా తెలుసుకుంటావని. ఇకపోతే శ్రీకర్. టైమ్ అనే దానిపై ఒక కాలు డాడీ అనే దానిపై ఒక కాలు వేసి..నిలబడతారు.. రెండు గీతలు నేలపై గీసుకుని. అంటే నీకు అర్థం కాలేదు కదా.

క్రమశిక్షణ పేరుతో చట్రంలో బిగించకుండానే నియమబధ్ధమైన ధోరణిలో పెరిగాడు. తల్లిదండ్రులు, కుటుంబం. పెద్దల ఎడ మర్యాద వంటి విషయాలు బాగానే తెలుసు. అయితే భావ ప్రకటన వాడికి తెలియని విషయం. మీరిద్దరూ ఒకరికొకరు

పూర్తిగా తెలుసుకోవాలి కదా. వాడి అలవాట్లు,అభిరుచులకు చాలా దగ్గర గా ఉంది నీ ప్రవర్తన కూడా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరినీ బాధపెట్టడు కానీ పుట్టినరోజులకి పండగలకి పెద్ద పెద్ద కానుకలిచ్చి మెప్పు పొందడం

వంటివి తెలీదు..పేస్లిప్ తెచ్చి మన చేతిలో పెడతాడు కానీ..వందరూపాయలు పెట్టి గాజులు కొని ఇస్తే అమ్మ సంతోషిస్తుంది కదా అని తెలియదు. నీ ఇష్టం అమ్మా ఏదైనా అంటాడు. ఇలాంటివన్నీ వాడికి నువ్వు తెలిసేలా చేయాలి. నీ అభీష్టం కాదనడు.  

కానీ వాడికి ఆలోచన రాదు. దానికి ఒక ఉదాహరణ.   

ఈ మధ్య ఎవరికో సహాయం చేయబోయి పదివేలు ఇచ్చాడు. ఇలా వసూలు చేసినవన్నీ కలిపి పట్టుకుని ఉడాయించాడు. బాధితులు వచ్చి మాకు సంబంధించి ఎవరినీ పంపలేదు సార్ అంటూ వారి గోడు వెళ్ళబోసుకున్నారు. అపాత్రదానం చేయకూడదు. అవసరమైన వారికి చేయూతనివ్వాలి. అలాగే మనిషికి సౌకర్యాలపై తృప్తి కూడా ఉండాలి శ్రీకర్ కి బాగానే ఉంది. .ప్రతిదీ సమయపాలన ప్రకారమే చేసుకుంటాడు. నీకు పూర్తి ఆర్ధిక స్వేచ్చ ఉంటుంది. అతని సంపాదన, నా సంపాదన అనే ప్రసక్తి లేదు. అనుకూలంగా అన్వయించగల సమర్ధవంతమైన నీ సంసారం నువ్వే

చక్కదిద్దుకోవాలి. సమాజం కూడా సక్రమంగా మంచి సానుకూల దృక్పథం లో ఉండదు. వాడు ఆఫీసు కి వెళ్ళాక నీ జాగ్రత్త లో నువ్వు ఉంటూ ఏదైనా కోర్స్ చదువుకోవడం లేకపోతే. నీకు నచ్చిన విధంగా గడుపు. నాదొక చిన్న ఆశ. నేను నీకు సంగీతం వచ్చా అని మీవాళ్ళని అడగలేదు. వీలైతే వీణ నేర్చుకో. శ్రీకర్ ఎక్కువ మాట్లాడటం లేదు కనుక అయిష్టం

అనుకోకు. నువ్వు , నీకు ఎలా కావాలో అలా మార్చుకో. చదువుకోవడం, ప్లే గ్రౌండ్ కి వెళ్లడం , భోజనం అన్నీ సమయానికి నిర్దేశించిన సమయంలో చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. వాడి మనసు తెలుసుకుని వాళ్ళ నాన్నగారు

కొని ఇచ్చేవారు. నలుగురు మంచి స్నేహితులు చూసావు కదా. వారు స్నేహధర్మం తెలిసిన మంచి పిల్లలే. నీకు కావలసినవి చేయించుకోవడం, ఎదుటివారికి కావలసినవి చేసి ఇవ్వడం మహిళలకి ఉండవలసిన లక్షణం. ఇంటికి వచ్చిన అతిథిని మనం గౌరవించి, మర్యాద చేయడం, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలి. మనకి ఆపద తలపెట్టే

వారిని దూరం పెట్టాలి. అవసరాలకి డబ్బు వాడుకుంటూనే రేపటి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. మావాడు ఈ విషయంలో పక్కా ప్రణాళికలోనే ఉంటాడు. కడుపుకి కావలసినవి నచ్చినవి, తినడం, తయారు చేసుకోవడం తెలుసుకోవాలి. హాయిగా ఇద్దరూ గడిపి రండి. మీరు తిరిగి వచ్చే సమయానికి ఈ వారంలోనే వాడిలో మార్పు రావాలి. నా బిడ్డ బంగారం.   

 ఆ బంగారంతో నీకు కావలసిన ఆభరణం చేసుకో. నువ్వు కొత్త కాపురానికి వెళ్లినపుడు మీ అమ్మ చెప్పే మాటలు కూడా ఇలాగే ఉంటాయి. హేపీ జర్నీ నా కొడుక్కి కూడా చెప్పాల్సిన వి చెప్పే పంపుతున్నాను. బి హేపీ. సరళ. హు. ఇలాంటివారు కూడా ఉంటారా.? అమ్మా.,బామ్మల మధ్య జరిగే సంఘటనలకు భిన్నంగా. వారిద్దరూ. ఏదో ఒక గొడవ, వాదనలే నిత్యం. ఎంత మంచి స్వభావం. అత్తాకోడళ్లు మధ్య సూటీపోటీ మాటలు, ఎత్తిపొడుపులు, సాధింపులే కాదు. తల్లికూతుళ్ళ మైత్రికి కూడా అవకాశం ఉంది. ఈ ఉత్తరం ద్వారా అత్తగారి మనసు అవగతమవుతోంది. ఆమె నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. భానుమతి గారికి ఈ జంట అర్థం కావడం లేదు. అరనిమిషం కూడా సెల్ ఫోన్ వదిలిపెట్టలేని తరం వీరు అసలు వాడరా....లేక చార్జింగు లేదా. ఆమె మనసులో ఆలోచనలు వేగంగా. ఆమె అదృష్టం శర్మద బేగ్ లో సెల్ఫోన్ మోగింది ఆమె లిఫ్ట్ చేసి ఆంటీ. సరే. అలాగే, హ హ ఇలా. మాట్లాడింది. యస్ నో ఆల్రైట్ భాష. మరొక సందేహం. శర్మ, నర్మ, ఏదో మా వచ్చింది పేరులో. ఉండబట్టలేక అడిగేసింది. పేరు ఏమిటని. శర్మదా శ్రీకర్ ఆంటీ నా పేరు అంది కాస్త బిడియంగా సరళ బాటలో సద్భావనలతో సాగిపోతూ. 


రైలు వేగంగా పరుగెడుతోంది గమ్యం వైపు....


సమాప్తం

చక్వవేణ మహారాజు కథ*

 🔆🔆*ధర్మ మహిమ !*🔆🔆

                

                     —@—

 *చక్వవేణ మహారాజు కథ* 


ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.


*వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే,  ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.*


ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !


అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. 


ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.


చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. 


వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి...


పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. 


అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. 


తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది. 


ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 


వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. 


రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.


తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని” అనుజ్ఞ ఇచ్చాడు.


మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను,‘ అంది. 


ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి,‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. 

వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే అన్ని పావురాలు తినకుండా ఎగిరిపోయాయి. 


ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.


‘చూసారా స్వామి! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. 


‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.


చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు.


‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. 


హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. 


ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు. 


మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. 


మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. 

ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. 


అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.


*నీతి :  క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.*


*మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.*


దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!


*సత్కర్మ-సత్యం-ధర్మం-న్యాయం*



          🌹🌹-🙏🙏- 🌹🌹

26.04.2025, శనివారం

 *జై శ్రీమన్నారాయణ*

*26.04.2025, శనివారం*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*   

*ఉత్తరాయనం - వసంత ఋతువు*

*చైత్ర మాసం - బహుళ పక్షం*  

*తిథి : త్రయోదశి* ఉ6.11 వరకు

*తదుపరి చతుర్థశి* తె3.48 వరకు

*వారం : శనివారం (స్థిరవాసరే)*

*నక్షత్రం : రేవతి. రా2.46 వరకు*

*యోగం : వైధృతి ఉ6.58 వరకు*

*తదుపరి విష్కంభం* తె3.48 వరకు

*కరణం : వణిజ* ఉ6.11 వరకు

*తదుపరి భద్ర* సా5.00 వరకు

*ఆ తదుపరి శకుని* తె3.48 వరకు

*వర్జ్యం : మ3.32 - 5.02*

*దుర్ముహూర్తము : ఉ5.41 - 7.21*

*అమృతకాలం : రా12.31 - 2.01*

*రాహుకాలం : *ఉ9.00 - 10.30*

*యమగండ/కేతుకాలం : మ1.30 - 3.00*

*సూర్యరాశి: మేషం* 

*చంద్రరాశి: మీనం*

*సూర్యోదయం: 5.41* 

*సూర్యాస్తమయం: 6.13*



వర్తమానంలో ఎంతోమంది ఆనందంతో, ఎదుటి వారి పైన అనురక్తితో ముందు వెనుకలు ఆలోచించకుండా 'నీకేం కావాలి' అని అడిగేస్తుంటారు. తీరా అవసరమైన వారు అడిగితే తడబడతారు. తమ తాహతేంటో, అవతలి వారి అవసరమేంటో గ్రహింపు లేకుండా 'అడుగు, ఇస్తాను' అనడం అనర్థాలకు హేతువు కావచ్చు.


రామాయణ, భాగవత, మహాభారత కథలు, పంచతంత్రం కథలు... అన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలంటాయి. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవని చెబుతాయి.


ఎదుటివారు ఎంత కావాల్సిన వారైనా, వారెంత తమకిష్టులైనా మొహమాటాలకు, మెహర్బానీలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవటం వివేకమనిపించుకోదు. అసహాయులకు, అన్నార్తులకు సహాయం చేయాల్సిందే. కానీ 'ఏం కావాలి' అని అతిశయంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనడం మాత్రం నిశ్చయంగా ఇబ్బందని అంగీకరించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి, వ్యక్తుల మనఃస్థితి గమనించి, స్థాయిని గుర్తించి, వారి ఆర్థిక, కుటుంబ అవసరాలను తెలుసుకుని 'నేనేమైనా నా పరిధిలో మీకు ఉడతసాయం చేయగలనా' అని నమ్రతతో అడిగితే ఎదుటివారికి మన స్థాయిని పరోక్షంగా తెలియజేసినట్లవుతుంది. సహాయమర్ధించే వారికి అర్థమవుతుంది. భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ‘ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి'. దాత కూడా అడిగిన వారి తాహతును తెలుసుకుని ఇవ్వాలి. అంతేకాని 'ఏం కావాలి' అనే అతిశయం పనికిరాదు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి & చతుర్దశి - ఉత్తరాభాద్ర & రేవతి -‌‌ స్థిర వాసరే* (26.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సమస్యకు పూరణ.

 *రమ్మునుc గ్రోలు నా ఘనుcడె రాజ్యము నేలు యశోధనుండునై* 

ఈ సమస్యకు నా పూరణ. 


*శ్రీకృష్ణుడు*

తెమ్మిక రాజ చిహ్నములు తేజము హెచ్చు శకంబు నేర్పడున్


తమ్ముల గూడి రాజ్యమును ధర్మజు డేలును ధర్మదీక్షతో 


సమ్మతి దెల్ప పెద్దలును, చక్కని పాలన జేయ నీతి సా


రమ్మునుc గ్రోలు నా ఘనుcడె రాజ్యము నేలు యశోధనుండునై. 


అల్వాల లక్ష్మణ మూర్తి.

శ్రీ కాల భైరవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1092


⚜ మధ్యప్రదేశ్  : ఉజ్జయిని


⚜  శ్రీ కాల భైరవ ఆలయం 



 💠 విగ్రహం మద్యం సేవించగలదా?  మూర్తి మద్యం ఎలా తాగగలడు?  విగ్రహం నిర్జీవంగా ఉంది.  

నిర్జీవమైన వస్తువులు ఆకలి మరియు దాహం అనుభూతి చెందవు, అందువల్ల అవి ఏమీ తినవు లేదా త్రాగవు అనే అందరూ అనుకుంటారు ..


💠 హిందూమతంలో, దేవుని విగ్రహాలను హృదయపూర్వకంగా మరియు భక్తితో పూజిస్తారు.  భారతదేశంలో భక్తులు తమ ప్రేమను వ్యక్తపరిచే అనేక విచిత్రమైన మరియు అందమైన దేవాలయాలు ఉన్నాయి.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న  కాలభైరవ దేవాలయం అటువంటి రహస్యమైన ఆలయం.  

ఇక్కడ, భక్తులు దేవునికి మద్యం సమర్పించడమే కాకుండా, కాలభైరవుని విగ్రహం మద్యం స్వీకరించి సేవిస్తారు.  


💠 ఉజ్జయిని మహాకాల్ నగరం అని పిలుస్తారు, ఇది దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.  

షిప్రా నది ఒడ్డున ఉన్న 6000 సంవత్సరాల పురాతన కాల భైరవ దేవాలయం మహాకాళేశ్వర్ ఆలయానికి 5 కిమీ దూరంలో ఉంది.  ఆశ్చర్యకరంగా, ఈ ఆలయం హిందూ శ్మశాన వాటిక మధ్యలో ఉంది. 


💠 ఉజ్జయినిలో భారీ సంఖ్యలో దేవాలయాలను కలిగి ఉన్నప్పటికీ, కాలభైరవుడు అత్యంత ప్రముఖమైనది.

 అష్ట భైరవ ఆరాధన శైవ సంప్రదాయంలో ఒక భాగం మరియు కాల భైరవుడిని వారి ప్రధానుడిగా భావిస్తారు.  

కాల భైరవుని ఆరాధన సంప్రదాయబద్ధంగా కాపాలిక మరియు అఘోర శాఖలలో ప్రసిద్ధి చెందింది మరియు ఉజ్జయిని ఈ వర్గాలకు ప్రముఖ కేంద్రంగా ఉంది.


💠 కాలభైరవుడు హిందూ గ్రంధాల ప్రకారం శివుని మూడవ కన్ను నుండి ఉద్భవించాడు.  

భైరవ్ బాబా ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన దేవత.

సాధారణంగా ముదురు రంగుతో చూపబడుతుంది.  

అతను త్రిశూలం , డోలు, ఖడ్గం, మరియు పుర్రె (కపాలo) వంటి ఆయుధాలను కలిగి ఉన్న బహుళ చేతులు (నాలుగు లేదా ఎనిమిది) కలిగి ఉంటాడు.  

అతని  కుక్క, విధేయత, అప్రమత్తత మరియు రక్షణకు ప్రతీక. 


💠 ప్రస్తుత ఆలయ నిర్మాణం పాత ఆలయ అవశేషాలపై నిర్మించబడింది. అసలు ఆలయాన్ని భద్రసేన అనే రాజు నిర్మించాడని నమ్ముతారు. దీని గురించి స్కంద పురాణంలోని అవంతి ఖండంలో ప్రస్తావించబడింది .


🔆 మద్యం సమర్పణ


💠 ఆలయ దేవతకు పంచమకరాలు అని పిలువబడే ఐదు తాంత్రిక ఆచార నైవేద్యాలలో ఒకటిగా మద్యం అర్పిస్తారు : 

మద్యం, 

మాంసం, 

మీనం లేదా మత్స్య (చేప), 

ముద్ర (సంజ్ఞ లేదా ఎండిన ధాన్యం) మరియు మైథున (లైంగిక సంపర్కం). 


💠 పూర్వ కాలంలో, దేవతకు ఐదు నైవేద్యాలు సమర్పించబడ్డాయి, కానీ ఇప్పుడు మద్యం మాత్రమే సమర్పించబడుతున్నాయి; మిగిలిన నాలుగు నైవేద్యాలు సంకేత ఆచారాల రూపంలో ఉన్నాయి. 


💠 ఆలయం వెలుపల, విక్రేతలు కొబ్బరికాయలు, పువ్వులు మరియు మద్యం బాటిల్‌తో కూడిన నైవేద్య బుట్టలను అమ్ముతారు.

2015లో, రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వెలుపల మద్యం కౌంటర్లను ఏర్పాటు చేసింది,దేశీయ మద్యం మరియు విదేశీ మద్యం రెండింటినీ విక్రయిస్తాయి . 


💠 ప్రతిరోజూ వందలాది మంది భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు.

భక్తులు మద్యం సీసాలను పూజారికి అప్పగిస్తారు, అతను మద్యంను కప్పులో పోస్తాడు . తరువాత అతను ప్రార్థనలు చేసి, కప్పును దేవత పెదవుల దగ్గరకు తీసుకువెళతాడు.

అతను ప్లేట్‌ను కొద్దిగా వంచితే మద్యం మాయమవడం ప్రారంభమవుతుంది. బాటిల్‌లో దాదాపు మూడింట ఒక వంతు భక్తుడికి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది .


💠 ఆలయ పూజారులు, అలాగే అనేక మంది భక్తులు, ఆ చీలికలో ఎటువంటి కుహరం లేదని, మరియు దేవత తనకు సమర్పించిన మద్యాన్ని అద్భుతంగా మింగేస్తుందని వాదిస్తరు. 

అయితే, ఆలయ పూజారి సందర్శకులను విగ్రహాన్ని పరిశీలించడానికి అనుమతించడు. తాను మాత్రమే అద్భుతం చేయగలనని, మరియు విగ్రహాన్ని మద్యాన్ని మింగడానికి ప్రయత్నించిన ఇతరులు విఫలమయ్యారని కూడా అతను పేర్కొన్నాడు.

 

💠 ఆలయంలో రోజూ ఎంత మద్యం నైవేద్యం పెడుతున్నారో అధికారిక గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, ఆ మొత్తం వందల లీటర్లుగా అంచనా వేయబడింది. 

2016 ఉజ్జయిని సింహస్థ సందర్భంగా , రాష్ట్ర ప్రభుత్వం ఉజ్జయినిలో ఒక నెల పాటు మద్యం అమ్మకాలను నిషేధించింది, కానీ ఆలయం ముందు ఉన్న దుకాణాలకు మద్యం అమ్మకాలను అనుమతించింది. 


💠 భైరవ్ బాబాకు నైవేద్యాలలో నల్ల నువ్వులు, కొబ్బరికాయలు, మద్యం మరియు జిలేబీ వంటి స్వీట్లు ఉంటాయి.  


💠 ముఖ్యమైన రోజు : భైరవ అష్టమిన బాబాను పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు.


💠 ఉజ్జయిని జంక్షన్ నుండి 7 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumar

17-03-గీతా మకరందము

 17-03-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - శ్రద్ధయే (సంస్కారమే లేక గుణమే) మనుజుని స్వరూపమనియు వచించుచున్నారు –


సత్త్వానురూపా సర్వస్య 

శ్రద్ధా భవతి భారత | 

శ్రద్ధామయో౽యం పురుషో 

యో యచ్ఛ్రద్ధస్స ఏవ సః || 


తాత్పర్యము:- ఓ అర్జునా! సమస్తజీవులకును వారివారి (పూర్వజన్మసంస్కారముతో గూడిన) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ (గుణము, సంస్కారము) కలుగుచున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగ గలవాడైయున్నాడు. ఎవడెట్టిశ్రద్ధగలిగియుండునో ఆతడట్టి శ్రద్ధయే యగుచున్నాడు. (అట్టిశ్రద్ధనే గ్రహించును; తద్రూపుడే అయియుండునని భావము).


వ్యాఖ్య:- మనస్సే (అంతఃకరణమే) మనుజుడు (ప్రతిబింబరూపజీవుడు); మనుజుడు మనస్సే. కావున మనస్సు శుద్ధముగా నున్నచో మనుజుడున్ను శుద్ధరూపుడే యగుచున్నాడు. ఇచట “సత్త్వానురూపా” అను పదములోని సత్త్వమనగా అంతఃకరణము. ప్రతివారికిని వానివాని జన్మాంతరసంస్కారములతో గూడిన యంతఃకరణమెట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుచున్నది. ఎవడు ఏ శ్రద్ధ, ఏ గుణము గలిగియుండునో ఆతడు తద్రూపుడే అయియుండును. కాబట్టి మొట్టమొదట మనుజుడు తనయంతఃకరణమును శుద్ధమొనర్చుకొని సాత్త్వికశ్రద్ధామయుడై యుండులాగున ప్రయత్నించి, సాధనాభ్యాసముచే క్రమముగ నిర్మలాత్మరూపుడై చెన్నొందుటకు ప్రయత్నించవలెను. ఎవనియొక్క చిత్త మెట్టి శ్రద్ధ,గుణము గలిగియుండునో తదనుగుణ్యమగు ప్రవృత్తియే ఆతడు కలిగియుండుటబట్టి (రాజసిక, తామసిక, శ్రద్ధలను పారద్రోలి) సాత్త్వికశ్రద్ధనవలంబించి క్రమముగ దానినిన్ని అధిరోహించి విశుద్ధసత్త్వ (ఆత్మ) స్థితిని జేరుకొనవలెను. అదియే ఆతని యథార్థస్వరూపము. స్థానము.


ప్రశ్న:- జీవులకు ఎట్టిశ్రద్ధ గలుగుచున్నది?

ఉత్తరము:- వారి యంతఃకరణమెట్లుండునో దాని కనుగుణ్యమగు శ్రద్ధయే (గుణమే) కలుగుచున్నది.

ప్రశ్న: - మనుజు డెద్దానిచే పరిపూర్ణుడైయుండును?

ఉత్తరము:- శ్రద్ధచే.

ప్రశ్న:- మనుజుని స్వరూపమేమి?

ఉత్తరము:- ఆతడెట్టి శ్రద్ధగలిగియుండునో, అదియే యాతని స్వరూపము (అయితే ఇది ప్రతిబింబిత (జీవ) రూపము. వాస్తవముగ బింబభూతమగు ఆత్మయే ఆతని స్వరూపమని యెఱుగవలెను).

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*358 వ రోజు*

*పాండవ సేనలో కలకలం*


ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుడు మరణించగానే చెదిరి పోయిన కౌరవసేన తిరిగి యుద్ధానికి సమాయత్తం కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు కారణం ఏమిటి. కౌరవసేనలో ఆనందం మిక్కుటంగా ఉంది. మనము ద్రోణుడిని చంపామని ఆగ్రహించి నీ తండ్రి ఇంద్రుడు దేవసైన్యంతో మనమీదకు యుద్ధానికి వచ్చాడా ! " అన్నాడు.


*అర్జునుడు ధర్మరాజాదులకు అశ్వత్థామ గొప్పదనాన్ని తెలుపుట*


అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! అస్త్రసన్యాసం చేసిన ఆచార్యుని అధర్మంగా వధించిన వారిని అశ్వత్థామ వదిలుతాడా ! అతడి వద్ద దివ్యాస్త్ర సంపద ఉంది. అతడు సహజంగా మహాద్భుత శౌర్య సంపన్నుడు. ఈ సమయంలో అతడిని ఎదుర్కొనుట చాలా కష్టం. అన్నయ్యా ! అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్రవము మాదిరి సకిలించాడట. అప్పుడు ఆశరీరవాణి అందరూ వింటుండగా ఆ బాలుడు అశ్వత్థామ అనే పేరొతో వర్ధిల్లగలడు అని పలికిందట. ఇప్పుడు కౌరవ సేన విజృంభణకు అశ్వత్థామయే కారణం. ఎప్పుడూ పాపం చేసి ఎరగని ఓ ధర్మరాజా ! నిన్ను తన శిష్యుడని, సత్యం పలుకుతావని, ధర్మం తప్పని వాడివని అత్యంత ఆదరంతో ద్రోణుడు తన కుమారుడి మరణం గురించి అడిగాడు. కాని నీవు ధర్మహానికి తలపడి అశ్వత్థామ మరణించాడని అసత్యం పలికావు. అది నమ్మి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసాడు. ఇంత అధర్మానికి పాల్పడి రాజ్యం సంపాదించడం అవసరమా ! లోకం దూషించదా ! ఇందు వలన పొందిన సంపద మనకు ఆనందాన్ని ఇస్తుందా ! అది అధర్మము, వద్దు అని మనం అరుస్తున్నా వినక ఆ ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి జుట్టు పట్టుకుని తల నరకవచ్చా ! అది అధర్మం కాదా ! మనం ఇలా ధర్మ విరుద్ధమైన పనులు చేసిన అతడి కుమారుడు అశ్వత్థామ మనపై ఆగ్రహించి యుద్ధం చేయక మానుతాడా ! మన సేనలను సర్వనాశనం చేయడానికి అశ్వత్థామ ఉగ్రుడై వస్తున్నాడు సిద్ధం ఉండండి. అయినా అతడి బారి నుండి ధృష్టద్యుమ్నుడిని కాపాడటం నీకూ నాకే కాదు మరెవరి తరం కాదు " అన్నాడు.


*పాండవ యోధుల మధ్య వాద ప్రతివాదాలు*


అర్జునుడి మాటలను విని భీముడు కోపంతో ఊగిపోతూ " అర్జునా ! నీవు వీరుడివా ! లేక ఋషిపుంగవుడివా! ఏమిటీ పిరికి మాటలు. గురువును చంపడం మహాపాపమని మన సైన్యాలను ధ్వంసం చేస్తున్న ద్రోణుడిని నీవు వదలడం న్యాయమా ! యుద్ధరంగమున ప్రవేశించిన పిదప గురుశిష్య సంబంధాలు, బంధు మిత్ర అభిమానాలు వదిలి నిష్పక్షపాతంగా యుద్ధము చేయాలని రాజనీతి ఘోషిస్తున్నా నీవు రాజధర్మాన్ని తప్పి ద్రోణుడిని వదలడం ధర్మమా ! కౌరవులు అధర్మవర్తనులు కారా! నిండు కొలువులో శీలవతి అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చి అవమానించిన నీతి బాహ్యులకు వారికి సహకరించి యుద్ధము చేస్తున్న వారికి ఇలాంటి ఎన్ని అధర్మములు చేసినా మనకు పాపం అంటదు. అర్జునా ! మనలను ఎదుర్కోడానికి వస్తున్న శత్రువులను జయించడం ఎలా అని మేము ఆలోచిస్తుంటే నీవిలా పిరికి మాటలు మాట్లాడటం ధర్మమా ! అర్జునా ! నేనేమిటో నా పరాక్రమము ఏమిటో సుయోధనుడికి తెలుసు. మన మీదకు వస్తున్న వారిని సర్వ నాశనం చేయక వదలను " అని భీముడు రోషంతో పలికాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

శ్లో|| *యత్ పృథివ్యాం వ్రీహి యవం* 

*హిరణ్యం పశవః స్త్రియఃl*

       *నాలమేకస్య తత్సర్వం*

*ఇతి పశ్యన్న ముహ్యతిll*


తా|| " *భూమి మీద ఉన్న ధాన్యం, అంతా బంగారం, పశువులు, స్త్రీసంపద అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు ". దీన్ని తెలిసిన మానవుడు మోహపడడు.*


( *అందుచేత మానవుడికి ముందుగా కావలసినది తృప్తి అని భావం*).


 ✍️🌸🌹💐🙏