26, ఏప్రిల్ 2025, శనివారం

వీస్తున్న కొత్త గాలి

 `డాక్టర్ దేవులపల్లి పద్మజ 

ఫోను 9849692414


                      వీస్తున్న కొత్త గాలి


పచ్చతోరణాలు, పసుపు బట్టలు, పెళ్ళి సందడి ఇంకా నడుస్తోంది. రేపటి సత్యనారాయణ వ్రతం, సాయంత్రం రిసెప్షన్ ఇంకా జరగాలి .సరళ మాటి మాటికి తన కొత్త కోడలిని ముచ్చటగా చూసుకుని ముగిసిపోతోంది. కొడుకు శ్రీకర్ , కోడలు శర్మదా హాలులో కూర్చున్నారు. భర్త ఈజీ చైర్ లో కునుకు లాగిస్తున్నారు. సరళ హాల్ లో వీళ్ళని చూసి మాట్లాడుకోడానికి మొహమాటం గా ఉండి ఎవరి గోళ్ళు వాళ్ళు గిల్లుకుంటున్నారు. అనుకుని లోపలికి వెళ్ళి గట్టిగా భర్తకి వినిపించేలా ఓ కేక పెట్టింది. 


"ఏవండీ! వినగానే కంగారుగా లేచి ఆ దిక్కుగా అడుగులేశారు. ఏమిటీ ఎందుకు అంత కేక పెట్టావు అన్నట్టు భార్యకేసి చూసారు..వాళ్ళకి కాస్త కబుర్లు చెప్పుకునే అవకాశం ఇచ్చి, మీరు జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచిస్తారని పిలిచాను. సరళ సమాధానం". శ్రీకర్! అమ్మాయికి మన ఇల్లు చూపించు. లోపలికి వెళ్ళి రిలాక్స్ అవండి. శర్మద వైపు చూసి, వెళ్లామ్మా! ఓ గంటలో అందరూ వచ్చేస్తే మరల హడావిడి. అన్నారు. కేశవరావు గారు. రాత్రి భోజనాలు వరకూ కేటరింగ్ వారి ఏర్పాట్లు చేసేసారు...మండపం నుంచి వెనక్కి వెళ్లిపోయేవారు వెళ్లి పోతారు. వ్రతానికి వచ్చే దగ్గర బంధువులు అందరూ భోజనాలు చేసి ఇంటికి చేరుకుంటారు. మంచి సమయం చూసి కొత్త దంపతులను ముందు తీసుకొచ్చి ధాన్యం గడపలో అడుగు పెట్టించారు. తెల్లవారి సందడి మొదలైంది. ఏమి చెప్తే అదే చేస్తున్నారు. చక్కగా ఉంది జంట. ఓర్పుగా వ్రతం చేసారు. సాయంత్రం స్నేహితులు తోటి ఉద్యోగులు ఊర్లో పరిచయస్తులు అందరి సమక్షం లో విందు కూడా ఘనంగా జరిగింది. యాన్నాళ్ళు అయ్యాక ముందు తిరుపతి, అక్కడ నుంచి ఊటీ, కొడైకెనాల్ వెళ్లి రమ్మని కేశవరావు గారు ముందుగానే ఏర్పాట్లు చేసారు...అనుకున్నట్టుగానే బయలుదేరారు శ్రీకర్, శర్మదా. వారిని ట్రైన్ ఎక్కించి, బయలుదేరే సమయం వరకూ సరళా, కేశవరావు, శర్మద తల్లిదండ్రులు ఉండి, సిగ్నల్ ఇవ్వగానే సరళ కోడలి దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పి, వెనుతిరిగింది.. ట్రైన్ వేగం పుంజుకుంది. సెకండ్ ఏ సీ సీట్లో కూర్చున్న వీరిద్దరూ కాసేపు మౌనంగా ఉండి బోరుకొట్టినట్టుంది. శర్మా. న్యూస్ పేపర్స్ ఇవ్వగలవా బేగ్ లో ఉన్నాయి అడిగాడు భార్యని. అవి అందించే సమయంలో అత్తగారు చెప్పిన

విషయం గుర్తుకొచ్చి లోపలి నుంచి కవర్ బయటికి తీసింది. పై బెర్త్ శ్రీ, క్రింది సీట్లో శర్మదా. సీరియస్ గా చదువుకుంటున్నారు.



చూస్తే ఈతరం పిల్లల ధోరణి కనపడడం లేదు వీళ్ళలో అనుకుంది ఎదుటి సీట్లో ఉన్న భానుమతి గారు. కవర్ లో ఉన్న కాగితాలు చూసి, అత్తగారు రచయిత్రి కదా..ఆవిడ రాసిన కధలు, కవితలు అయి ఉంటాయా అనుకుంటూ. కనులకు పని చెప్పింది.. ఆశ్చర్యం, అత్తగారు తనకి రాసిన ఉత్తరం. చి.ల.సౌ శర్మదా, నీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పడానికి నాకూ, వినడానికి నీకూ సమయం లేకపోవడం, ఏకాంతం కుదరకపోవడం. నీ చేతికి ఈ ఉత్తరం. జీవితంలో ఏదీ మనకి తెలిసి జరగదు..జరగబోయేది ముందు తెలిస్తే మనిషికి, మానవుడికి భేదం ఉండదు కదా. ఒక మంచి ఇల్లాలిగా, ఉత్తమ పౌరురాలిగా ఉండడానికి నాకు తెలిసినంతవరకూ సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు, సహనం, స్నేహతత్వం ఉండాలి..అన్నిటికి మించి మంచి స్పందన ఉండాలి. మానవత్వం కలిగి సమాజంలో తెలివిగా నెట్టుకురావాలి. నువ్వు చాలా పెద్ద చదువులు చదువుకున్నావు. నిజమే. ఆ చదువు మన సమాజాన్ని చైతన్య పరచడానికి ఉపయోగపడాలి. మనిషిగా ఎదగడానికి

మనసు ఎదగడానికి చాలా తేడా ఉంది. బయటికి కనిపించే మనిషి కంటే మనసు ఎదగడానికి చాలా సమయం పడుతుంది. కాలక్షేపం కోసం ఉద్యోగం చేయకూడదు. అవసరమైతే తప్పకుండా నీ చదువు ఉపాధి కొరకు ఉపయోగపడుతుంది. భర్తకి మంచి సంపాదన, హోదా ఇవ్వన్నీ ఉన్నపుడు, కక్కుర్తి పడి చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉండడం మంచిది కాదు. నీ స్థానం లో మరొకరికి అవకాశం, అవసరమైన వారిచే భర్తీ చేయబడుతుంది. నాలుగు రోజులు సరదాగా తిరగడానికి వెళ్లేటపుడు ఇదంతా ఏమిటి అనుకోకుండా. మంచి పిల్లవు కదా తెలుసుకుంటావని. ఇకపోతే శ్రీకర్. టైమ్ అనే దానిపై ఒక కాలు డాడీ అనే దానిపై ఒక కాలు వేసి..నిలబడతారు.. రెండు గీతలు నేలపై గీసుకుని. అంటే నీకు అర్థం కాలేదు కదా.

క్రమశిక్షణ పేరుతో చట్రంలో బిగించకుండానే నియమబధ్ధమైన ధోరణిలో పెరిగాడు. తల్లిదండ్రులు, కుటుంబం. పెద్దల ఎడ మర్యాద వంటి విషయాలు బాగానే తెలుసు. అయితే భావ ప్రకటన వాడికి తెలియని విషయం. మీరిద్దరూ ఒకరికొకరు

పూర్తిగా తెలుసుకోవాలి కదా. వాడి అలవాట్లు,అభిరుచులకు చాలా దగ్గర గా ఉంది నీ ప్రవర్తన కూడా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరినీ బాధపెట్టడు కానీ పుట్టినరోజులకి పండగలకి పెద్ద పెద్ద కానుకలిచ్చి మెప్పు పొందడం

వంటివి తెలీదు..పేస్లిప్ తెచ్చి మన చేతిలో పెడతాడు కానీ..వందరూపాయలు పెట్టి గాజులు కొని ఇస్తే అమ్మ సంతోషిస్తుంది కదా అని తెలియదు. నీ ఇష్టం అమ్మా ఏదైనా అంటాడు. ఇలాంటివన్నీ వాడికి నువ్వు తెలిసేలా చేయాలి. నీ అభీష్టం కాదనడు.  

కానీ వాడికి ఆలోచన రాదు. దానికి ఒక ఉదాహరణ.   

ఈ మధ్య ఎవరికో సహాయం చేయబోయి పదివేలు ఇచ్చాడు. ఇలా వసూలు చేసినవన్నీ కలిపి పట్టుకుని ఉడాయించాడు. బాధితులు వచ్చి మాకు సంబంధించి ఎవరినీ పంపలేదు సార్ అంటూ వారి గోడు వెళ్ళబోసుకున్నారు. అపాత్రదానం చేయకూడదు. అవసరమైన వారికి చేయూతనివ్వాలి. అలాగే మనిషికి సౌకర్యాలపై తృప్తి కూడా ఉండాలి శ్రీకర్ కి బాగానే ఉంది. .ప్రతిదీ సమయపాలన ప్రకారమే చేసుకుంటాడు. నీకు పూర్తి ఆర్ధిక స్వేచ్చ ఉంటుంది. అతని సంపాదన, నా సంపాదన అనే ప్రసక్తి లేదు. అనుకూలంగా అన్వయించగల సమర్ధవంతమైన నీ సంసారం నువ్వే

చక్కదిద్దుకోవాలి. సమాజం కూడా సక్రమంగా మంచి సానుకూల దృక్పథం లో ఉండదు. వాడు ఆఫీసు కి వెళ్ళాక నీ జాగ్రత్త లో నువ్వు ఉంటూ ఏదైనా కోర్స్ చదువుకోవడం లేకపోతే. నీకు నచ్చిన విధంగా గడుపు. నాదొక చిన్న ఆశ. నేను నీకు సంగీతం వచ్చా అని మీవాళ్ళని అడగలేదు. వీలైతే వీణ నేర్చుకో. శ్రీకర్ ఎక్కువ మాట్లాడటం లేదు కనుక అయిష్టం

అనుకోకు. నువ్వు , నీకు ఎలా కావాలో అలా మార్చుకో. చదువుకోవడం, ప్లే గ్రౌండ్ కి వెళ్లడం , భోజనం అన్నీ సమయానికి నిర్దేశించిన సమయంలో చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. వాడి మనసు తెలుసుకుని వాళ్ళ నాన్నగారు

కొని ఇచ్చేవారు. నలుగురు మంచి స్నేహితులు చూసావు కదా. వారు స్నేహధర్మం తెలిసిన మంచి పిల్లలే. నీకు కావలసినవి చేయించుకోవడం, ఎదుటివారికి కావలసినవి చేసి ఇవ్వడం మహిళలకి ఉండవలసిన లక్షణం. ఇంటికి వచ్చిన అతిథిని మనం గౌరవించి, మర్యాద చేయడం, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలి. మనకి ఆపద తలపెట్టే

వారిని దూరం పెట్టాలి. అవసరాలకి డబ్బు వాడుకుంటూనే రేపటి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. మావాడు ఈ విషయంలో పక్కా ప్రణాళికలోనే ఉంటాడు. కడుపుకి కావలసినవి నచ్చినవి, తినడం, తయారు చేసుకోవడం తెలుసుకోవాలి. హాయిగా ఇద్దరూ గడిపి రండి. మీరు తిరిగి వచ్చే సమయానికి ఈ వారంలోనే వాడిలో మార్పు రావాలి. నా బిడ్డ బంగారం.   

 ఆ బంగారంతో నీకు కావలసిన ఆభరణం చేసుకో. నువ్వు కొత్త కాపురానికి వెళ్లినపుడు మీ అమ్మ చెప్పే మాటలు కూడా ఇలాగే ఉంటాయి. హేపీ జర్నీ నా కొడుక్కి కూడా చెప్పాల్సిన వి చెప్పే పంపుతున్నాను. బి హేపీ. సరళ. హు. ఇలాంటివారు కూడా ఉంటారా.? అమ్మా.,బామ్మల మధ్య జరిగే సంఘటనలకు భిన్నంగా. వారిద్దరూ. ఏదో ఒక గొడవ, వాదనలే నిత్యం. ఎంత మంచి స్వభావం. అత్తాకోడళ్లు మధ్య సూటీపోటీ మాటలు, ఎత్తిపొడుపులు, సాధింపులే కాదు. తల్లికూతుళ్ళ మైత్రికి కూడా అవకాశం ఉంది. ఈ ఉత్తరం ద్వారా అత్తగారి మనసు అవగతమవుతోంది. ఆమె నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. భానుమతి గారికి ఈ జంట అర్థం కావడం లేదు. అరనిమిషం కూడా సెల్ ఫోన్ వదిలిపెట్టలేని తరం వీరు అసలు వాడరా....లేక చార్జింగు లేదా. ఆమె మనసులో ఆలోచనలు వేగంగా. ఆమె అదృష్టం శర్మద బేగ్ లో సెల్ఫోన్ మోగింది ఆమె లిఫ్ట్ చేసి ఆంటీ. సరే. అలాగే, హ హ ఇలా. మాట్లాడింది. యస్ నో ఆల్రైట్ భాష. మరొక సందేహం. శర్మ, నర్మ, ఏదో మా వచ్చింది పేరులో. ఉండబట్టలేక అడిగేసింది. పేరు ఏమిటని. శర్మదా శ్రీకర్ ఆంటీ నా పేరు అంది కాస్త బిడియంగా సరళ బాటలో సద్భావనలతో సాగిపోతూ. 


రైలు వేగంగా పరుగెడుతోంది గమ్యం వైపు....


సమాప్తం

కామెంట్‌లు లేవు: