*జై శ్రీమన్నారాయణ*
*26.04.2025, శనివారం*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం - వసంత ఋతువు*
*చైత్ర మాసం - బహుళ పక్షం*
*తిథి : త్రయోదశి* ఉ6.11 వరకు
*తదుపరి చతుర్థశి* తె3.48 వరకు
*వారం : శనివారం (స్థిరవాసరే)*
*నక్షత్రం : రేవతి. రా2.46 వరకు*
*యోగం : వైధృతి ఉ6.58 వరకు*
*తదుపరి విష్కంభం* తె3.48 వరకు
*కరణం : వణిజ* ఉ6.11 వరకు
*తదుపరి భద్ర* సా5.00 వరకు
*ఆ తదుపరి శకుని* తె3.48 వరకు
*వర్జ్యం : మ3.32 - 5.02*
*దుర్ముహూర్తము : ఉ5.41 - 7.21*
*అమృతకాలం : రా12.31 - 2.01*
*రాహుకాలం : *ఉ9.00 - 10.30*
*యమగండ/కేతుకాలం : మ1.30 - 3.00*
*సూర్యరాశి: మేషం*
*చంద్రరాశి: మీనం*
*సూర్యోదయం: 5.41*
*సూర్యాస్తమయం: 6.13*
వర్తమానంలో ఎంతోమంది ఆనందంతో, ఎదుటి వారి పైన అనురక్తితో ముందు వెనుకలు ఆలోచించకుండా 'నీకేం కావాలి' అని అడిగేస్తుంటారు. తీరా అవసరమైన వారు అడిగితే తడబడతారు. తమ తాహతేంటో, అవతలి వారి అవసరమేంటో గ్రహింపు లేకుండా 'అడుగు, ఇస్తాను' అనడం అనర్థాలకు హేతువు కావచ్చు.
రామాయణ, భాగవత, మహాభారత కథలు, పంచతంత్రం కథలు... అన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలంటాయి. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవని చెబుతాయి.
ఎదుటివారు ఎంత కావాల్సిన వారైనా, వారెంత తమకిష్టులైనా మొహమాటాలకు, మెహర్బానీలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవటం వివేకమనిపించుకోదు. అసహాయులకు, అన్నార్తులకు సహాయం చేయాల్సిందే. కానీ 'ఏం కావాలి' అని అతిశయంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనడం మాత్రం నిశ్చయంగా ఇబ్బందని అంగీకరించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి, వ్యక్తుల మనఃస్థితి గమనించి, స్థాయిని గుర్తించి, వారి ఆర్థిక, కుటుంబ అవసరాలను తెలుసుకుని 'నేనేమైనా నా పరిధిలో మీకు ఉడతసాయం చేయగలనా' అని నమ్రతతో అడిగితే ఎదుటివారికి మన స్థాయిని పరోక్షంగా తెలియజేసినట్లవుతుంది. సహాయమర్ధించే వారికి అర్థమవుతుంది. భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ‘ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి'. దాత కూడా అడిగిన వారి తాహతును తెలుసుకుని ఇవ్వాలి. అంతేకాని 'ఏం కావాలి' అనే అతిశయం పనికిరాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి