10, జూన్ 2025, మంగళవారం

Panchang


 

కుటుంబ విలువలు

 . కుటుంబ విలువలు 

శీర్షిక..అటకెక్కి కూర్చున్నాయి! 


అందరూ కలిసి ఉండాలని 

తోడూ నీడగా ఉండాలని

కష్టసుఖాలు సమంగా పంచుకోవాలని

కలలు కన్న ఊహల గాలి మేడలు 

కన్నుల ముందే కుప్పకూలిపోతున్నాయి 

స్వార్ధం నిండిన మనుషుల మద మాత్సర్యంతో..


అనుబంధాల బంధాలు విడిపోతున్నాయి వేదనతో 

అనురాగాలకు చెక్ పెట్టేస్తూ 

అసూయ ద్వేషాల అహంకార జ్వాలలు 

ఎవరికి ఎవరో! ఏమౌతారో తెలియని ఒంటరి జీవితాలు 

అమానుషత్వాల వలలో చిక్కిపోతోంది వయసు 

నిరాశా నిస్పృహలతో కృంగిపోతూ..


విలువలు తప్పిన మాటల తూటాలతో 

అవమానిస్తూ, పరిహాసాల పాలు చేసుకుంటూ

విలువలను వంచించుకుంటూ

జీవితాన్ని ఒంటరిగా నాకం-నరకం మధ్యన 

వ్రేలాడుతున్న త్రిశంకు స్వర్గంలో గడిపేస్తూ..

ంంంంంంంంంంంంంంంం


ఇది నా స్వీయ కవిత

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩మంగళవారం 10 జూన్ 2025🚩*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*               

            *64వ భాగం*


*సుందరే సుందరో రామః*

*సుందరే సుందరీ కథః*

*సుందరే సుందరీ సీత*

*సుందరే సుందరం వనం*

*సుందరే సుందరం కావ్యం*

*సుందరే సుందరం కపిః*

*సుందరే సుందరం మంత్రం*

*సుందరే కిం న సుందరం?*

```

పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు.

రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?

సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. 


తత్ అంటే పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.

```

*తతో రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ |*

*ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి ||*

```

రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దగ్గరగా ఉండి, సర్వకాలములయందు శుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యముల్లా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.


హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని 

ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. 


అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.

```

*ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ |*

*తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం ||*

```

అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు… “ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు” అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.


అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి… “రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను” అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.


హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. 


ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. 


అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి.. “ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా, సముద్రాన్ని తాగుతున్నాడా?” అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోటితో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతోంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.


హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి “సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం” అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి… “నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లే, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు” అన్నాడు.


అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు “ఓహో, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు” అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.


అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి… “అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. 'పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో” అన్నాడు.


అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని… 

“నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు” అని చెప్పి వెళ్ళిపోయాడు. 


బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి “ఓహో! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా” అన్నాడు.


అప్పుడు మైనాకుడు “ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను” అనుకున్నాడు.


అప్పుడు ఇంద్రుడు అన్నాడు… 

“నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను” అని అభయమిచ్చాడు.```


        *రేపు… 65వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మంగళవారం🍁* *🌹10, జూన్ , 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

 *🌹10, జూన్ , 2025🌹*        

    *దృగ్గణిత పంచాంగం*   

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్లపక్షం*


*తిథి  : చతుర్దశి* ఉ 11.35 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం   :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : అనూరాధ* సా 06.02 వరకు ఉపరి *జ్యేష్ఠ*


*యోగం : సిద్ధ* మ 01.45 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : వణజి* ఉ 11.35 *భద్ర* రా 12.27 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 11.00 మ 02.00 - 03.30*

అమృత కాలం  : *ఉ 06.32 - 08.18*

అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.33*

*వర్జ్యం          : రా 12.08 - 01.52*

*దుర్ముహూర్తం  : ఉ 08.11 - 09.04 రా 11.02 - 11.45*

*రాహు కాలం    : మ 03.23 - 05.02*

గుళికకాళం       : *మ 12.07 - 01.45*

యమగండం     : *ఉ 08.51 - 10.29*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.50*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.11*

సంగవకాలం         :*08.11 - 10.48*

మధ్యాహ్న కాలం    :     *10.48 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 04.03*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ పౌర్ణమి*

సాయంకాలం       :*సా 04.03 - 06.40*

ప్రదోష కాలం         :  *సా 06.40 - 08.51*

రాత్రి కాలం           :*రా 08.51 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩


_*హనుమానంజనాసూనుః*_ 

_*వాయుపుత్రోమహాబలః*_

_*రామేష్టః ఫల్గుణశఖః*_ _*పింగాక్షోమితవిక్రమః*_

_*ఉధధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః*_

_*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*_

_*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యు భయంనాస్తి సర్వత్ర విజయీభవెత్*_


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

రామో విగ్రహవాన్ ధర్మః

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_ 


రామో విగ్రహవాన్ ధర్మః 

సాధుః సత్యపరాక్రమః 

రాజా సర్వస్య లోకస్య 

దేవానాం మఘవానివ

_(వా.రా. 3.37.13)_


*అర్థం:*

శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మ అవతారము. ఆయన సత్పురుషులు. ఆయన బలం సత్యము. దేవతలకు ఇంద్రునివలె ఆయన సమస్త లోకాలకు రారాజు.


["రామో విగ్రహవాన్ ధర్మః" - ఈ మాట (శ్లోకం) అన్నది 'రాక్షసుడైన మారీచుడు', రావణునితో. 

ఒక రాక్షసుని చేతకూడా కీర్తించబడిన గొప్ప వ్యక్తిత్వం శ్రీ రామచంద్రులది.]



శ్రీ త్యాగరాజ స్వామి వారి _(మొట్టమొదటి కీర్తన అని విన్నాను)_ కీర్తనతో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

మూఢం అంటే ఏంటి?*

 *మూఢం అంటే ఏంటి?*

*మూఢం అనేది రెండు రకాలు*. 

1) గురు మూఢం,

2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం.ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.


*మూఢం సమయంలో ఏం చేయకూడదు?*

మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.

2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.

శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.

3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.

4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.

5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.

6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

7)చెవులు కుట్టించకూడదు.

8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు

9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.

10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.

12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.

13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.

14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.


*మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*

1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు.

2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు.

3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.

4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.

5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.

6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.

7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. 

8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. 

9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. 

10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.

11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు.

12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు.

⚜ శ్రీ యమై దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1138


⚜ మహారాష్ట్ర : సతార 


⚜ శ్రీ యమై దేవి ఆలయం



💠 యమై దేవి ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఔంధ్ పట్టణంలోని ఒక కొండ సముదాయంలో ఉంది.


💠 యమై దేవి దుర్గామాత యొక్క అవతారం మరియు ఈ రూపంలో ఆమెను మహారాష్ట్రలో విస్తృతంగా పూజిస్తారు. 

మరాఠీలో 'యే మై' అంటే 'తల్లి రండి' అని అర్థం.

 యమై మాతను మహిషాసుర మర్దిని యమై అని కూడా పిలుస్తారు.


💠 యమై దేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయాలు సతారా సమీపంలోని ఔంధ్ వద్ద మరియు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సమీపంలోని రాషిన్ వద్ద ఉన్నాయి.


💠 కొల్హాపూర్ లక్ష్మీదేవి మరియు జ్యోతిబా ప్రభువు ఆమెను 'యే మై' అని పిలిచి ఆహ్వానించారని పురాణాల ప్రకారం ఉంది. 

ఆ విధంగా ఆమె ఈ ప్రాంతానికి వచ్చి యమై దేవి అని పిలువబడింది.


💠 యమై దేవి మహారాష్ట్రలోని అనేక కుటుంబాలకు కులదేవత.


💠 కొల్హాపూర్ దేవత మహాలక్ష్మి మరియు విష్ణువు అవతారమైన శ్రీరాముడు ఆమెను మరాఠీలో 'యే మై' అని సంబోధించిన తర్వాత దేవత యమై పేరు పెట్టబడిందని పురాణ కథనం. అందువల్ల, ఔంధ్ దేవత యమై దేవిగా ప్రసిద్ధి చెందింది.


💠 యమై దేవి విగ్రహం నల్ల రాయితో తయారు చేయబడింది మరియు దాదాపు 2 మీటర్ల ఎత్తులో అడ్డంగా కాళ్ళు కూర్చునే స్థితిలో ఉంది. 


💠 మహారాష్ట్రలోని కెందూరుకు చెందిన శ్రీ కన్హురాజ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ సాంగత్యం ద్వారా కూడా పవిత్రుడయ్యాడు. 

 కన్హురాజ్ మహారాజ్ తపస్సుకు సంతోషించిన రేణుకా దేవి. సమాధి స్థితిలో మునిగి ఉండగా, రేణుకా దేవి ప్రత్యక్షమై ఆశీర్వదించింది. 

మీ దర్శనం ఎప్పటికీ నాతోనే ఉండాలని కన్హురాజ్ మహారాజ్ తన కోరికను వ్యక్తం చేశాడు.


💠 ఇది విన్న దేవత సంతోషకరమైన హృదయంతో తథాస్తు అని చెప్పింది, కానీ నేను బహిర్గత రూపంలో రాను, కానీ అదృశ్య రూపంలో మరియు ఒక షరతుతో వస్తాను అని చెప్పింది.


💠 నేను నిన్ను మాత్రమే చూస్తాను మరియు నేను నిన్ను అనుసరిస్తాను, కానీ మీరు నా వాగ్దానాన్ని నమ్ముతారు మరియు మీరు వెనక్కి తిరిగి చూడరు. మీరు వెనక్కి తిరిగి చూస్తే, నేను ఎక్కడ ఉన్నానో నేను స్థాపించుకుంటాను, ముందుకు రాను.


💠 తదుపరి ప్రయాణం ప్రారంభమైంది, కన్హురాజ్ మహారాజ్ ముందుకు నడుస్తున్నాడు మరియు రేణుకా దేవి అతనిని అనుసరించడం ప్రారంభించింది. 

కన్హురాజ్ మహారాజ్ దేవత పాదాల నుండి చీలమండలు మరియు గోళ్ల శబ్దం అకస్మాత్తుగా ఆగిపోయింది.


💠 ఈ సమయంలో, కన్హురాజ్ మహారాజ్ వెనక్కి తిరిగి చూస్తుండగా, అదే సమయంలో, దేవత కన్హెర్సర్ గ్రామ వాగు ఒడ్డున అదృశ్యమైంది. 

కన్హురాజ్ మహారాజ్ తన తప్పును గ్రహించాడు మరియు ఆ సమయంలో, కన్హురాజ్ మహారాజ్ దేవతను స్తుతించడం ప్రారంభించాడు మరియు యే మై (రండి తల్లి) అని పిలిచాడు, అందుకే ఈ దేవతను ఇక్కడ యేమై అని పిలుస్తారు.


💠 కానీ దేవత విధించిన షరతుల ప్రకారం, దేవత ఇలా చెప్పింది, నేను ఇప్పుడు ఈ ప్రదేశంలోనే ఉంటాను, నదికి ఉత్తరాన ఉన్న దట్టమైన అడవిలో నేను ఎప్పటికీ అక్కడే ఉంటాను. 

ఈ ప్రదేశంలో నేను భక్తుల నుండి సేవ తీసుకుంటాను మరియు వారి భక్తికి నేను సంతోషిస్తాను మరియు వారి కోరికలను తీరుస్తాను.


💠 ఈ ప్రదేశంలో కూడా నేను మీ సేవ తీసుకుంటాను, ఈ ప్రదేశం కెందూర్ నుండి చాలా దూరంలో లేదు కాబట్టి మీరు వచ్చి వెళ్ళడం సులభం అవుతుంది. కాబట్టి మీరు చాలా సులభంగా పూజలు చేయవచ్చు. దేవతా మాత ఆదేశాలను అనుసరించి, కన్హురాజ్ మహారాజ్ ఈ ప్రదేశంలో కన్హెర్సర్ దేవిని క్రమం తప్పకుండా పూజించారు.


💠 ఈ విధంగా రేణుకా మాత, అంబాబాయి, జగదంబ ఇక్కడ అవతరించారు. తరువాత చివరికి ఈ ప్రదేశంలో ఒక ఆలయం స్థాపించబడింది.


💠 ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇక్కడ హారతి నిర్వహిస్తారు.

ప్రతి మంగళవారం ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారు. ప్రతి పౌర్ణమికి, గ్రామంలో పల్లకీలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.


💠 ఈ ఆలయ రాతి నిర్మాణంపై, ఒక జంతువు నోటిలో ఏనుగును, తోకలో ఒకటి మరియు కాళ్ళలో నాలుగు పట్టుకుని ఉన్న చిత్రం ఉంది. మహారాష్ట్రలోని మురుద్‌లోని జంజీరా కోటలో కూడా ఇదే చిత్రం కనిపిస్తుంది.


💠 ఇది సతారా బస్ స్టేషన్ నుండి 44 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-10-గీతా మకరందము

 18-10-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు-

      

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్జతే | 

త్యాగీ సత్త్వసమావిష్టో  

మేధావీ ఛిన్నసంశయః || 


తాత్పర్యము:- సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు; శుభమును, నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు (అభిమానము గలిగియుండడు).


వ్యాఖ్య:- సత్త్వగుణముతో గూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి గలిగి యుండునని చెప్పబడుచున్నది. ఒకదానిని ద్వేషించుటగాని, మఱియొక దానియందు ఆసక్తిగలిగి తగుల్కొనుటగాని యతనికుండదు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడై యుండును. అశుభకర్మను, కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంతమాత్రముచేత దానిని ప్రేమించునని అర్థముకాదు. జీవన్ముక్తునిపగిది దానియెడల తటస్థభావముగలిగి, తాను మాత్రము దాని నాచరింపక శుభకార్యమునే, నిష్కామకర్మమునే ఆచరించును. అట్లాచరించినను దానితో కలియక, దానియం దభిమానము (సంగము) లేకయుండును.


ప్రశ్న:- సత్త్వగుణశీలుడగు కర్మఫలత్యాగియొక్క స్వభావమెట్లుండును?

ఉత్తరము:- అతడు (1) సత్త్వగుణసంపన్నుడై (2) ప్రజ్ఞాశాలియై (3) సంశయరహితుడై (4) అశుభ (కామ్యాది) కర్మలను ద్వేషింపకయు, శుభ(నిష్కామాది) కర్మములందు తగుల్కొనకయు (అభిమానము లేకయు) నుండును.

తిరుమల సర్వస్వం -266*

 *తిరుమల సర్వస్వం -266*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 3* 

 *రథసప్తమి* 


 తన పేరులోనే శ్రీమన్నారాయణుని పదిల పరచుకొన్న 'సూర్యనారాయణుడు' శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తుడే కాకుండా ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి కూడా! శ్రీమహాలక్ష్మికి కూడా సన్నిహితుడే! అటువంటి సూర్యుని జన్మదినమైన మాఘశుద్ధ సప్తమి నాడు హైందవులందరూ 'రథసప్తమి పర్వదినాన్ని వైభవోపేతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపు కుంటారు. 


 తిరుమలలో జరిగే రథసప్తమి ఉత్సవంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తియైన మలయప్పస్వామి వారే ఉభయదేవేరుల సమేతంగా పాల్గొని ఉత్సవానికి వన్నె తెస్తారు. ఈ సందర్భంలో సూర్యుని గురించిన కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.


 *సప్తాశ్వరథారూఢుడు* 


 సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడై, జగత్తంతా అవిశ్రాంతంగా వాయువేగ మనోవేగాలతో పర్యటిస్తూ తన దివ్యకాంతులతో సమస్త సృష్టిని చైతన్యవంతం చేస్తాడు. సూర్యుడు అధిరోహించిన రథం బృహతి, గాయత్రి, ఉష్టిక, జగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్ అనే ఏడు అశ్వాల ద్వారా లాగబడుతుంది. ఈ ఏడు గుర్రాల పేరిట, సంస్కృతభాషలో ఏడు 'ఛందస్సులు' ఉన్నాయి. సంస్కృతం లోని శ్లోకాలు, స్తోత్రాలు మొదలైనవన్నీ ఈ ఏడు ఛందస్సుల్లోనే వ్రాయబడ్డాయి. ఉదాహరణకు శ్రీవిష్ణుసహస్రనామం, శ్రీలలితాసహస్రనామం అనుష్టుప్ ఛందస్సులో రచించబడ్డాయి.

2ఈ రథం 'అనూరుడు' అనే రథికుని సారథ్యంలో నడుపబడుతుంది. అయితే, కొన్ని పురాణాలలో సూర్యుని రథం పేరు 'సప్త' అని, ఆ రథాన్ని కేవలం ఒకే ఒక్క అశ్వం లాగుతుందని, అందువల్ల ఆ అశ్వాన్ని 'సప్తాశ్వం' గా పిలుస్తారని, ఆ అశ్వమే ఏడు రూపాలలో గోచరిస్తుందని చెప్పబడింది.


 *రథసప్తమి ఉత్సవం* 


 తన ఆదేశం మేరకు విశ్వమంతా సంచరిస్తూ, కాలచక్రం గతులు తప్పకుండా తన వంతు కృషి సలుపుతున్న సూర్యనారాయణునికి, వారి జన్మదినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపడానికై మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగడమే 'రథసప్తమి ఉత్సవం'. సూర్యుడు కాలచక్ర సంచాలనంలో వ్యస్తుడై ఉండటం వల్ల, తన భక్తుని అభినందించే నిమిత్తం శ్రీవారే ఆనందనిలయం నుంచి బయటకు వస్తారన్నమాట. భక్తుల దరి జేరటానికై భగవంతుడు సదా ఆరాట పడటం సహజమే కదా!


 *సప్తవాహనారోహణం* 


 రథసప్తమి నాడు, సప్తరథారూఢుని జన్మదినోత్సవంలో సప్తగిరీశుడు సప్తవాహనాలను అధిరోహిస్తాడు. శ్రీవారు ఉభయదేవేరుల సమేతంగా మొట్టమొదటగా సూర్యప్రభవాహనాన్ని అధిరోహిస్తారు. ఆ వాహనంలో ఊరేగుతున్న మలయప్పస్వామి వారి పాదపద్మాలను బాలభానుడు తన లేలేత కిరణాలతో స్పృశిస్తూ భక్తిపూర్వకంగా సేవించు కుంటాడు. తరువాత మలయప్పస్వామి వారు వరుసగా చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, కల్పవృక్షవాహనం చివరగా చంద్రప్రభవాహనంపై ఊరేగుతారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు ఆదివరాహస్వామి ఆలయంలో పంచామృతాభిషేకాన్ని స్వీకరిస్తారు. తరువాత స్వామిపుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.


 *ఒకరో'జు బ్రహ్మోత్సవం* 


 ఈ రథసప్తమి ఉత్సవం అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండువగా జరగడం వల్ల; బ్రహ్మోత్సవాల తరువాత అతిపెద్ద సంఖ్యలో వాహనాలు పాల్గొనడం వల్ల దీనిని 'ఒకరోజు బ్రహ్మోత్సవం' గా కుడా పేర్కొంటారు. ఈ ఉత్సవాన్ని కాంచిన భక్తులపై శ్రీనివాసుని, సూర్యభగవానుని కరుణకిరణాలు ప్రసరించి ఐహికాముష్మికానందాలు సంప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.


*అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మహోత్సవం* 


 *'అష్టబంధనము', 'బాలాలయము'* మరియు *'మహాసంప్రోక్షణము'* అనే మూడు మహత్తర వైదిక క్రతువుల సమాహారమే ఈ ఉత్సవం. ఈ ఉత్సవం దాదాపు అన్ని వైష్ణవాలయాలలో జరిగినప్పటికీ తిరుమలలో జరిగే ఉత్సవానికి ఎన్నో విశిష్ఠతలు, ఎంతో ప్రాముఖ్యం ఉన్నాయి. ఈ ఉత్సవం ఎందుకు, ఎలా జరుగుతుందనే వివరాల్ని ఈరోజు తెలుసుకుందాం.


 *విష్ణువు అంశ* 


 వైఖానస ఆగమం లోని *'మరీచి సంహిత'* ననుసరించి, స్వామివారి అర్చామూర్తిలో శ్రీమహావిష్ణువు అంశ నిరవధికంగా ఉండదు. కలియుగంలో దానికి పన్నెండు సంవత్సరాల కాలపరిమితి ఉంది. ఈ గడువు ముగిసే లోపు, విస్తారమైన వైదిక ప్రక్రియల ద్వారా మూలవిరాట్టులో విష్ణువు అంశను పునఃప్రతిష్ఠింప జేసి, స్వామివారి తేజస్సును ద్విగుణీకృతం చేసే మహోత్కృష్టమైన కార్యక్రమాన్నే *'అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ'* గా వ్యవహరిస్తారు. 


 అయితే, దీనికో మినహాయింపు ఉంది. ఈ సంప్రోక్షణా కార్యక్రమం దేవతలు, ఋషులు, చక్రవర్తుల వంటి వారి ద్వారా ప్రతిష్ఠించబడ్డ దేవతామూర్తులకే అవసరమని; సాక్షాత్తు దేవదేవుడే స్వయంగా వెలయడం వల్ల, స్వయంవ్యక్త క్షేత్రాలలో ఈ సంప్రోక్షణ జరుపనవసరం లేదని కూడా శాస్త్రాలలో చెప్పబడింది. కానీ, తిరుమల ఆలయం మాత్రం దీనికి భిన్నం. శ్రీవారి మూర్తి స్వయంవ్యక్తమే అయినప్పటికీ మిగిలిన అన్ని వైదిక క్రతువుల లాగా, మహాసంప్రోక్షణ కూడా ఎప్పటినుండో ఆనందనిలయంలో జరుపబడుతోంది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*403 వ రోజు*


*అర్జునుడి మీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట*


కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీసాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికే దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు " కర్ణా ! నీ గురి తప్పుతుంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు " అన్నాడు. తన గురిని అక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు " శల్యా ! నా గురిని ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది " అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రధమును భూమిలోకి అయిదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగురగొట్టింది. ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవుడు దేవేంద్రునికి బహూకరించాడు. దేవేంద్రుడు నివాత కవచులను సంహరించిన సమయంలో అర్జునుడికి బహూకరించాడు. ఆకిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది. ఇప్పుడది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసం అయింది. అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు " ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతుంది " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! అప్పుడే మరిచావా ! ఖాండవ వనదహన సమయంలో తక్షకుడి కుమారుడు నాగ తన తల్లిని రక్షించుకు పోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు. ఆ తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడిగా నిన్ను చంపడానికి కర్ణుని వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉన్నాడు . ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ అశ్వసేనుడిని సంహరించు " అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేసాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడిమీద శరవర్షం కురిపించసాగాడు. కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తం అయింది. సూర్యుడు అస్తమించే సమయమూ ఆసన్న మైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్యరూపంలో ఉండి ఆకాశం నుండి " ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగి పోతుంది. కర్ణుడికి అవసాన సమయం ఆసన్నమైంది " అన్నాడు. అది విన్నా కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కాని అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు. కర్ణుడు మనసులో " నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కాని అది అసత్యం అయింది " అనుకున్నాడు. అర్జునుడు కర్ణుని మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. కర్ణుడు అర్జునుడు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు ఇంతలో అర్జునుడు రౌద్ర అనే అస్త్రం జపించ సాగాడు.ఇంతలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కుంగి పోయింది.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *శరీరమేవాయతనం సుఖస్య*

         *దుఃఖస్యచాప్యాయతనం శరీరమ్l*

         *యద్యచ్ఛరీరేణ కరోతి కర్మ*

        

 *తేనైవ దేహీ సముపాశ్నుతే తత్ll*


       *(మహాభారతమ్ - శాంతిపర్వమ్)*


తా𝕝𝕝 *సుఖానికి దుఃఖానికీ కూడా శరీరమే నిలయం... కనుక మానవుడు శరీరంతో చేసిన పనులన్నింటి ఫలితాన్ని శరీరంతోనే అనుభవిస్తాడు.....*


 ✍️🌹💐🌸🙏

అమ్మ ఎట్లుండును

 అమ్మ ఎట్లుండును 

అమ్మ మాట వినేసరికి ' ఎవరా అమ్మ 'అనే ప్రశ్నలు వెంటనే ఉదయిస్తాయి . ఈ 

ప్రశ్నలతో బాటే ' అమ్మ ఎట్లా ఉంటుంది ' ఏమి చేస్తూ ఉంటుంది ? అమ్మను ఎట్లా ప్రసన్నం చేసుకోగలుగుతాం .? 

అమ్మను ఆశ్రయించడం ద్వారా చివరకు మోక్షాన్ని పొందగలుగుతామా ? 

మొదలైన చాలా ప్రశ్నలు manassulo మొదలటానికి అవకాశం ఉంది . 

1- అమ్మ ఎవరు ? 

ఆదిశంకరులు " మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః 

2- కవికులగురువు కాళిదాసు 

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 

3- అమ్మ ఎవరు ? 

లలితాసహస్రనామావళి 

 'శ్రీమాత 'మొదటి పదంద్వారా పరమేశ్వరియే మన అందరికీ అమ్మ 

      నీవు సమస్త జగత్తులకు మూలకారణము . అంటే తల్లివి . నీవే సత్త్వ రజస్తమో గుణముల రూపములో ఉంటావు . ఏ విధమైన మాలిన్యము లేని దానవు . ! హరిహరాదులకు కూడా తెలియబడనిదానివి ! అన్నింటికీ ఆధారమైన ఈ జగత్తునీలో ఒక అంశ మాత్రమే ! ఏ రకమైన మార్పులు లేని పరమ ప్రకృతివి నీవే ! మొదటి దానవు నీవే ! 

బాబు దేవీదాస్ రావు. -------

Panchaag