10, జూన్ 2025, మంగళవారం

కుటుంబ విలువలు

 . కుటుంబ విలువలు 

శీర్షిక..అటకెక్కి కూర్చున్నాయి! 


అందరూ కలిసి ఉండాలని 

తోడూ నీడగా ఉండాలని

కష్టసుఖాలు సమంగా పంచుకోవాలని

కలలు కన్న ఊహల గాలి మేడలు 

కన్నుల ముందే కుప్పకూలిపోతున్నాయి 

స్వార్ధం నిండిన మనుషుల మద మాత్సర్యంతో..


అనుబంధాల బంధాలు విడిపోతున్నాయి వేదనతో 

అనురాగాలకు చెక్ పెట్టేస్తూ 

అసూయ ద్వేషాల అహంకార జ్వాలలు 

ఎవరికి ఎవరో! ఏమౌతారో తెలియని ఒంటరి జీవితాలు 

అమానుషత్వాల వలలో చిక్కిపోతోంది వయసు 

నిరాశా నిస్పృహలతో కృంగిపోతూ..


విలువలు తప్పిన మాటల తూటాలతో 

అవమానిస్తూ, పరిహాసాల పాలు చేసుకుంటూ

విలువలను వంచించుకుంటూ

జీవితాన్ని ఒంటరిగా నాకం-నరకం మధ్యన 

వ్రేలాడుతున్న త్రిశంకు స్వర్గంలో గడిపేస్తూ..

ంంంంంంంంంంంంంంంం


ఇది నా స్వీయ కవిత

కామెంట్‌లు లేవు: