10, డిసెంబర్ 2023, ఆదివారం

తిరుమల దర్శనాలు

 తిరుమల దర్శనాలు గురించి మీరు అడిగే ప్రశ్నలు ఆధారం  చేసుకుని వీడియో లు చేశాను దయ చేసి ఈ వీడియో లు చూసి ఆ తరువాత ప్రశ్నలు అడగండి 🙏

*మొదటి గడప దర్శనం బుకింగ్ విధానం* : https://youtu.be/BVD7sTLExj8?si=cDbA8LLUmmbkjFiP


*శ్రీవారి సేవ రూల్స్ బుకింగ్ విధానం* : 

https://youtu.be/Ve-983sZIV8?si=FI6-_5PKceOBEGL3


*నవనీత సేవ కోసం తెలుసుకోండి*

https://youtu.be/UzJH28O_wsc?si=0pQcdII88oejVoRJ


*10 వేల డొనేషన్:* https://youtu.be/iebpwt4JEgk?si=a-VQRpUInmU2Uxj5


*లక్ష ఆపైన డొనేషన్* : https://youtu.be/6bBKKb_lSF8?si=KfSqI3JxNjGa1R_A


*MLA లేటర్ పై బ్రేక్ దర్శనం రూల్స్* : https://youtu.be/BG-Lna2RMfU?si=Alk3iiw8HSZ3UuqZ


*చిన్న పిల్లల దర్శనం* : 

https://youtu.be/h93K-VKyFiY?si=AcPfw_j6CNJZO6SK


*సీనియర్ సిటిజన్ దర్శనం* :

https://youtu.be/h6L-wEeJ6iQ?si=Kxyv28PWevGSYC3S


*Nri దర్శనం:* https://youtu.be/x4zhgLm-sRI?si=GXug1I8NCA3EjXY2


*తిరుమల యాత్ర పైసా ఖర్చు లేకుండా* :

https://youtu.be/E2jaCv-_QZ8?si=I09rWdjs6TmNV_K0


*తిరుమల కంచి అరుణాచలం టూర్ ప్లాన్:* https://youtu.be/D-9NOZhonLc?si=iiXHZ7MTPSlkwWsK


*జాపాలి చూపిస్తా రండి :* https://youtu.be/5aa5eJrLlMA?si=_3ik59BpweuSUpd9


*కొండపైన చూడల్సినవి :*

https://youtu.be/bhxKBOtmsrA?si=a7ufehn8xCyqoFSz


*అంగ ప్రదక్షిణ:* https://youtu.be/sbkj1PoWvdo?si=vkE9_tVCInSXkLFv


*ఆన్ లైన్ సేవ బుకింగ్*

https://youtu.be/Vzw8FoO3wmU?si=cM-MaUJhGUvnCx34


*ఈ సేవలకు పిల్లలకు ప్రవేశం లేదు.. మొదటి గడప దర్శనం పేమెంట్ విధానం* https://youtu.be/NMnpxxbjY4U?si=SXO5Qw9KAxeSh67J

Joke


 

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*ప్రహ్లాద నారద పరాశర పుండరీక*

*వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస* |

*భక్తానురక్త పరిపాలన పారిజాత*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 17_* _


*తా*: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. 

*లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ త్రయోదశి - స్వాతి -‌ భాను వాసరే* (10.12.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/DA8vjL5wGRE?si=yR5LRLSDxgOmbA-N



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జీవ సమాధి..ఒక వివరణ.*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*జీవ సమాధి..ఒక వివరణ.*


*(యాభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పూ రాలేదు..ప్రాణత్యాగం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు..ఎప్పుడు?..ఎలా?..అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా వున్నారు..


శ్రీధరరావు దంపతులకు ఈలోపల మరో సమస్య వచ్చిపడింది..శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది..ఆవిడ మునుపటి లాగా తిరుగలేకపోతున్నారు..తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు..దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు..ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి వస్తున్నారు..తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు..ఓ వారం గడిచిపోయింది..దూరపు బంధువు ఒకావిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలిచెర్ల కు వచ్చింది..ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ వున్నారు..ఈలోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధరరావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది..ఎలాగూ ఈవిడగారు వున్నారు కదా..అనుకొని..


"పిన్ని గారూ..మీరు అత్తయ్య గారివద్ద వుండి చూసుకుంటారా?..మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి ఓ మూడు గంటల లోపు వచేస్తాము.." అన్నారు ప్రభావతి గారు..


"అదేం మాటమ్మా..లక్షణంగా చూసుకోనూ..మీరిద్దరూ వెళ్ళిరండి..మేము మాట్లాడుకుంటూ ఉంటాము.." అని భరోసా ఇచ్చారావిడ..శ్రీధరరావు ప్రభావతి గార్లు సరే అని చెప్పి..గూడు బండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి ఫకీరు మాన్యం లోని ఆశ్రమానికి వెళ్లారు..


శ్రీ స్వామివారు వీరికోసమే ఎదురుచూస్తున్నట్లు గా వున్నారు..వీళ్ళను చూడగానే ..నవ్వుతూ.."నా సజీవ సమాధి విషయం ఆలోచించారా?..ఏమనుకుంటున్నారు?.." అన్నారు..


"నాయనా..మిమ్మల్ని మా చేతులతో సమాధి లో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కానీ పని..అది హత్య అవుతుంది..మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము..బ్రతికిఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులూ చేయరు..చేయలేరు..మీరు పదే పదే ఆ  విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు..ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికీ.." అన్నారు ప్రభావతి గారు కటువుగా..


శ్రీధరరావు గారైతే వాదనకే దిగారు.." ఇంత తపస్సు చేసి..ఇంత పాండిత్యమూ..వేదాంతమూ బాగా తెలుసుకొని..లోకానికి ఎటువంటి సందేశమూ ఇవ్వకుండా..మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే..అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో గానీ..ప్రపంచానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు..కొంతకాలం బోధ చేయండి.." అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చేయెత్తి వారించారు శ్రీ స్వామివారు..


ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు..ప్రశాంతంగా వున్నారు..పైపెచ్చు నవ్వుతూ..

"శరీరం తోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు..అలా అనుకొని వుంటే..వ్యాసాశ్రమం లోనే పీఠాధిపత్యం తీసుకొని..ముందుగా ఆశ్రమ వాసులకు..ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని..నా పంథా వేరు..అది మీకు ఇప్పుడు అర్ధం కాదు..ఒక్క విషయం చెప్పండి.. శిరిడీ సాయిబాబా ఇప్పుడున్నాడా?..ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు అరవై సంవత్సరాలు కావొస్తోంది..ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా?..(శ్రీ శిరిడీ సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు..) సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కరలేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది..మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి..అందుకు సమయం పడుతుంది..నాకూ కొద్దినెలల ఆయుష్షు ఉంది..ఈలోపల మీరు సిద్ధపడితే సరే..లేదా నా మార్గం లో నేను ప్రాణత్యాగం చేస్తాను..ఎంత తపస్సు చేసినా..శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము..అది భగవత్ నిర్ణయం..జీవ సమాధి చెందడమనేది సాధకుల మోక్ష పధానికి ఒక ఆలంబన వంటిది..ఎలా జరగాలని వ్రాసి వుంటే అలా జరుగుతుంది.." అంటూ ఒక్కనిముషం ఆగి.." మీరిద్దరూ చప్పున బైలుదేరండి.." అన్నారు..


సాయంత్రం చీకటి పడే వేళయిందని కాబోలు శ్రీ స్వామివారు బైలుదేరమన్నారని భావించి..శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగలిచెర్ల లోని తమ ఇంటికి చేరారు..అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు..


అనారోగ్యం.అసహనం..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*ప్రహ్లాద నారద పరాశర పుండరీక*

*వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస* |

*భక్తానురక్త పరిపాలన పారిజాత*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 17_* _


*తా*: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. 

*లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

Panchaag


 

*కార్తిక పురాణము - 28*

 *కార్తిక పురాణము - 28*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై ఎనిమిదవ అధ్యాయము*


అంబరీష ఉవాచ:

అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా! ఆగు నీకు నమస్కారము.ఈ బ్రాహ్మణుని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేని యెడల నాతో యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధమువి గనుక నాకు దైవమయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు.క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు.అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవన్నమాట నాకు తెలియును అయినను నా బాహుబలమును చూడుము.


విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను చెందక ఇతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము.శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువమని రాజు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చినట్లు నటించి సుదర్శనము, రాజా! నీకు తెలియునా? మధుకైటభులను రాక్షససులను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా?ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా?ఈ దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను ఇప్పుడిట్టి అవస్థను నావలన చెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు.అదియు నాచేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది.క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకు ఎట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివి.


రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు! అన్న సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పల్కెను.


సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు.నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు.గనుక ఇకముందు నీకు గర్వముండబోదు.నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి.నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను.నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూతమని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను.


క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు సుదర్శనుడు రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని.సుఖముగా ఉండుమని పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పడి నమస్కారము చేసెను.


ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము.నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము.ఇది శుక్ల పక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము., మాఘమాసము.ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు.


ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు బ్రహ్మపదమును చేరుదురు.కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను.సుమారు మూడు మాసములకు అంబరీషుని చేరినాడు.

జ్వాలలచేత భయంకరమై నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు.


విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులన చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు.విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము.


ఇట్లు స్తుతించి నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడుకాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తులై నిరంతరసుఖములను పొందుదురు.


కలియుగమందు ఈ అధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.


ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టావింశాధ్యాయ సమాప్తః!!

 ☘️🙏శ్రీ గురుభ్యోనమః🙏☘️

 

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*10-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. చేపట్టిన  పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

వృషభం


వ్యాపారాలలో ఆశించిన  పురోభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులలోశ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన  కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

---------------------------------------

మిధునం


స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

సింహం


చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

కన్య


కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం  సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

---------------------------------------

తుల


వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.  బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తి కావు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది.

---------------------------------------

మకరం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. సంతానానికి  నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 

---------------------------------------

కుంభం


ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనయోగం ఉన్నది.

---------------------------------------

మీనం


వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వాతావరణం గందరగోళంగా ఉంటుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀