22, ఫిబ్రవరి 2024, గురువారం

అనుభవించాలి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

      🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝    

*ఆత్మనా హి కృతం పాపం*

*ఆత్మనైవ హి భుజ్యతే*।

*యః కరోతి నరః పాపం* 

*న తస్యాత్మా ధృవం ప్రియః*॥


తా𝕝𝕝 *పాపం చేసేవాడికి తనపైన తనకు ఇష్టముండదు... ఎందుకనగా, తాను చేసే పాపానికి ఫలం అనగా దుఃఖం తానే అనుభవించాలి కాబట్టి!!!*

ఏది చేస్తామో

 2609a-4.0901c-7.220224-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 

*మనం ఏది చేస్తామో…*

           *అది పదింతలై…*

                     *మనకే చేరుతుంది!*

                    ➖➖➖✍️


*కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి.*


*దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు.*

*రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు.* 

*సమయం చూస్తే ...*

*సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా?*


*దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ ... భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.*


*అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది.*

*ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో ... ఆమె సహజంగా భయపడింది.. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?ఆందోళన !*


*అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు. టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు.*

*"భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను.*

*బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి. నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు.*


*ఆమె భయపడుతూనే ఉంది.*


*"నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను" అన్నాడు.*

*అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని ...కారు కిందకి దూరి జాకీ బిగించాడు.*

*తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో ...*

*జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు.*


*"మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే ...*

*నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది" అంది.*

*"నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు.*

*మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ... ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే ... నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి" అని వెళ్లి పోయాడు.*


*మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ... ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.*

*తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.*


*అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది.*

*డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది.*

*బరువుగా నడుస్తోంది.*

*అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని ... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది.*

*ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.*


*ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది. చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.*

*అంత శ్రమ పడుతూ కూడా ... చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని, ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది.*

*భోజనం చేసి ఆమెకు ... 2000 రూపాయల నోటు ఇచ్చింది.*


*ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద ... నాలుగు 2000 నోట్లూ ఉన్నాయి.*


*ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు.*

*అందులో ఇలా ఉంది ...*

*“చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది. నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...*

*నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...*

*నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు." అని రాసి ఉంది..*


*హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది. గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.*


*అతడి పక్కన మంచం మీదకు చేరుతూ ...*

*“మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని…*

*ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు. ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.*


**”మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికీ వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే ఏదోలా చేరుతుంది.”అన్నది ఆ కధ యొక్క పరమార్థం..!!*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లోనే మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.


దయచేసి ఫోన్ కాల్ చేయవద్దు🙏

ఋణం

 శీర్షిక: ఋణం


అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక ఛస్తున్నా! కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయ్ వెధవ కాకులు. అయినా మీఛాదస్తానికి వేగలేక ఛస్తున్నాననుకోండి. ఈకాలంలోకూడా ఏమిటీ నూనె ఆడించుకోవడాలు, నాఖర్మకాకపోతే? పెచ్చులు తీయడం, ముక్కలు కోయడం, ఎండబెట్టడం.. నావల్లకాదుబాబూ. గుళ్ళోకొట్టినవన్నీ తెచ్చి నా నెత్తినపాడేస్తారు. ఇకనుంచి నా వల్లకాదు.


తెల్లవారుఝామున నాలుగింటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు పదకొండుగంటలకి ఇంటికొచ్చారు. ఆచమనంతప్ప పచ్చిమంచినీళ్ళుకూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక, స్తోత్రం, పూర్వపీఠిక, ఫలస్రుతి చెప్తేగాని ఆపదు.

నాక్కాస్త ఫలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు ఆవూరి శివాలయం పూజారి శాస్త్రిగారు


తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకెళ్ళి మంచమ్మీద వాలారో లేదో... గుప్పున కొట్టింది చేపల వాసన. లలితా! ఏమిటీవాసన? గదిలోంచే అరిచారు శాస్త్రిగారు. ఆకిటికీ తలుపు తెరచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే, సమాధానంగా.


కిటికీ తలుపు తెరచిన శాస్త్రిగారు ఒక్కనిముషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకొచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటోచూడు అరుగుమీద ఏముందో.... దుంపతెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేసేటట్టున్నాయ్!" అనగానే....

ఇంద ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధితలుపు తెరచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ. ఈసారి ఎవరిమీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతోంది. విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ.... చేపలగంప పెట్టుక్కూర్చుంది అరుగుమీద. ఇంకే అరుగు దొరకనట్టుంది. ఓ బకెట్టు నీళ్ళు పట్టుకెళ్ళి జల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరల కొబ్బరి ముక్కలదగ్గర స్టూలుమీద కూర్చున్నారు లలితమ్మ.


వీధి అరుగు మీదికి నీళ్ళు పట్టుకెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది, లేచి నిలబడటానికి కూడా సత్తువలేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి, ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మా, ఒంట్లో బాలేదా? ఏమయ్యింది? అడిగారు శాస్త్రిగారు.


Lఅవును బాబయ్యా, జొరమొచ్చేసింది. గొంతెండిపోతుంది చాల నీరసంగా చెప్పింది ముసలమ్మ. 

సరే ఆగంప అలా సందులో పెట్టుకుని వచ్చి కుర్చో! ఈలోగ మంచినీళ్ళు తెస్తాను అని లోపలికెళ్ళి, నీళ్ళు, గోరువెచ్చని పాలు చెరో గాజు గ్లాసులోనూ పట్టుకొచ్చారు శాస్త్రిగారు. సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాణ్ణి పిలిచి పదిరూపాలిచ్చి కిరాణాకొట్టుకెళ్ళి ఒక రొట్టె తీసుకురమ్మన్నారు.


ఇంద ఈ రొట్టెతిని పాలుతాగు. తరవాత ఈ బిళ్ళవేసుకుని అలా కాసేపు ఒరుగు. అదే సర్దుకుంటుంది అని ఒక క్రోసిన్ టేబ్లెట్ కూడా ఇచ్చారు.


గంటతరవాత వచ్చిచూస్తే అమె అక్కడ లేదు. గంపతీసుకుని వెళ్ళిపోయింది.


విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణకోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవొకటి. సాయంత్రం ప్రసాదంకోసం ఉంచిన పాలు అవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరిముక్కలు ఎండబెట్టుకోవడానికి వలనేయించమని ఏళ్ళుగా మొత్తుకుంటున్నా. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు. పదిరూపాయలిచ్చి రొట్టెకూడా కొనిచ్చేరంట. ఏంత ఉదారమో? వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పారు.


పోన్లేవే జ్వరంతో ఉంది. పాలదేముంది.. ప్రెసిడెంటుగారికి కబురెట్టి ఒక లీటరు పాలు పంపించమంటే సరి. ప్రసాదానికే కదా. సర్దిచెప్పడానికి చెపుదామనుకున్నారు గాని, తనలో తానే అనుకోగలిగారు.


నెలరోజులు గడిచాయి. సాయంత్రం అయిదింటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు శాస్త్రిగారు గుడితలుపులు తెరవడానికి. వీధి తలుపు తెరవగానే, గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగుమీద గంప పెట్టి ఉంది. కానీ వాసన రావట్లేదు. చక్కగా వుతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణంపెట్టింది, శాస్త్రిగారిని చూసి. ఏమ్మా ఇప్పుడెలాఉన్నావ్ అని అడిగారు శాస్త్రిగారు.

బాగున్నాను బాబయ్య. ఆపదలో కాపాడేరు. మీరుణం తీర్చుకోలేను.


ఏంపర్లేదమ్మా. నేనేంచేసాను. ఒక బిళ్ళ , కాసిని పాలు ఇచ్చాను అంతేకదా! వెళ్ళిరా! అని ముందుకి కదలబోయారు శాస్త్రిగారు.


లేదుబాబయ్యా. ఇది మీకోసమే తెచ్చాను అంది గంపచూపిస్తూ.


ఏముంది అందులో అడిగారు శాస్త్రిగారు.


మాయింటికాడ కొబ్బిరి సెట్టుందండి. పదికాయలు దింపించి ఒలిపించాను. మా ఆయన మోకుతాళ్లు అల్లుతాడండి పదిగజాల తాడు అల్లించాను. గిలకబావి సేద క్కట్టుకోవచ్చండి. మరేమోనండి సిక్కం కూడా అల్లించేనండి.


సిక్కమా, అదేంటి? అర్థంకాక అడిగారు శాస్త్రిగారు.


వలండీ వల. ఏవన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసేత్తే ఇంక కాకుల గొడవుండదండి. ఇంకా చింతచిగురు, సీమసింతకాయలు కూడా వున్నాయండి. కొత్త గంపండి. సేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపలకట్టుకుపోండి. మీరు పంతులుగోరు కదండి బాబయ్యా. మడీ ఆశారం ఉంటాదని నేనే తానం సేసి కట్టేనండి అన్నీని. ఆయ్!


గుక్కతిప్పుకోకుండా చేప్పేస్తుంటే.. నిశ్చేష్టులై వింటున్నారు శాస్త్రిగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండీ అంటూ ఉంటే... శాస్త్రిగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోటమాటలు రాలేదు.


ఎల్లోత్తానండి పంతులుగోరు... దండాలండి అమ్మగోరు అని ఇద్దరికి దణ్ణాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొల సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు.


వద్దు బాబయ్య. తమలాంటి దర్మ పెబువుల దగ్గర మేం పుచ్చుకోగూడదు. వత్తానండయ్యా అని మళ్ళీ దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది.

మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

22-02-2024

బృహష్పతి వాసరః గురువారం 

 రాశి ఫలితాలు

********

మేషం

విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.

---------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు.

---------------------------------------

మిధునం

వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు. ఇంటాబయట కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి.

---------------------------------------

కర్కాటకం

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

సింహం

 నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుకార్యములు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య

సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. వ్యాపార పరంగా స్వలపధన నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురికావల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

---------------------------------------

తుల

అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయట గౌరవమర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

ధనస్సు

వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి.

---------------------------------------

మకరం

వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసివస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

కుంభం

పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నూతన గృహ వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.

---------------------------------------

మీనం

స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

సంధ్యా వందన 

మరియు 

ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.22.02.2024 

బృహస్పతివాసరే( గురువారము)

 Xxxxx

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే శుక్ల పక్షే త్రయోదశ్యాం. (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

శుక్ల పక్షే  త్రయోదశ్యౌపరి చతుర్దశ్యాం

బృహస్పతివాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.27

సూ.అ.5.59

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

శుక్ల పక్షం త్రయోదశి ప.1.46 వరకు. 

బృహస్పతివాసరే

నక్షత్రం పుష్యమి సా. 5.14 వరకు. 

అమృతం మ.10.23 ల 12.06 వరకు. 

దుర్ముహూర్తం ప. 10.18 ల 11.04 వరకు. 

దుర్ముహూర్తం మ.2.55 ల 3.41 వరకు. 

వర్జ్యం లేదు. 

యోగం సౌభాగ్య మ.1.01 వరకు.  

కరణం తైతుల ప.1.46  వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

***************

పుణ్యతిధి మాఘ శుధ్ధ శూన్యతిధి. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

అక్రమంగా సంపాదించిన సంపద

 శ్లోకం:☝️

*అన్యాయోపార్జితం*

  *విత్తం దశవర్షాణి తిష్ఠతి |*

*ప్రాప్తే చైకాదశే వర్షే*

  *సమూలం తద్ వినశ్యతి ||*


భావం: అక్రమంగా సంపాదించిన సంపద పదేళ్లపాటు ఉంటుంది. అయితే పదకొండవ సంవత్సరం అది పూర్తిగా నాశనం అవుతుంది.

(వాస్తవానికి దీనికి మినహాయింపులు ఉన్నాయి. కౌరవుల వద్ద 13 సంవత్సరాలు ఉంది పాండవుల రాజ్య సంపద. దానిని గమనించండి)

పంచాంగం 22.02.2024

 ఈ రోజు పంచాంగం 22.02.2024 Thursday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి బృహస్పతి వాసర: పుష్యమి నక్షత్రం సౌభాగ్య యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి మధ్యాహ్నం 01:23 వరకు.

పుష్యమి సాయంత్రం 04:44 వరకు.

సూర్యోదయం : 06:43

సూర్యాస్తమయం : 06:17


వర్జ్యం : ఈ రోజు లేదు .


దుర్ముహూర్తం : పగలు 10:34 నుండి 11:21 వరకు తిరిగి మధ్యాహ్నం 03:12 నుండి 03:58 వరకు.


అమృతఘడియలు : పగలు 09:41 నుండి మధ్యాహ్నం 11:27 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం -‌ త్రయోదశి - పుష్యమి -‌ గురు వాసరే* (22.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు..*


2004 వ సంవత్సరం లో నేను మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ధర్మకర్తగా..మందిర నిర్వహణా బాధ్యతలు చేపట్టాను..అప్పట్లో శ్రీ స్వామందిరానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు..వాళ్ళ ఏర్పాట్లు వాళ్లే చూసుకోవాల్సి వచ్చేది..ముఖ్యంగా శనివారం సాయంత్రం పూట భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉండేవి..వర్షం కురిస్తే తలదాచుకోవడానికి కేవలం శ్రీ స్వామివారి మందిరం లోని మంటపం ఒక్కటే దిక్కు..అందరికీ ఆ మంటపం సరిపోయేది కాదు..అలానే సర్దుకొని వుండేవారు..ప్రధాన ఆలయం చుట్టూరా కనీసం పందిరి వేయించినా కొంతలో కొంత ఇబ్బంది తప్పుతుందని భావించాను..


శ్రీ స్వామివారి మందిరానికి వెనుక వైపు ఆర్య వైశ్య సత్రం ఉన్నది..శ్రీ స్వామివారికి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ మీరా శెట్టి గారి ఆధ్వర్యంలోనే ఆ ఆర్య వైశ్య సత్రం కూడా నిర్వహింపబడేది..కానీ కొద్దిరోజుల్లోనే..విజయవాడ వాస్తవ్యులు శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు ఆ సత్రం యొక్క నిర్వహణా బాధ్యతలు చేపట్టారు..పెద్ది శెట్టి గారు శ్రీ స్వామివారికి పరమ భక్తులు..ప్రతి సంవత్సరము రెండు మూడు సార్లు మందిరానికి వచ్చి..దర్శనం చేసుకొని వెళ్లేవారు..


2004 లో నేను శ్రీ స్వామివారి మందిర ధర్మకర్త గా బాధ్యత తీసుకున్న తరువాత..పెద్దిశెట్టి గారితో సాన్నిహిత్యం ఏర్పడింది..ఒకసారి పెద్దిశెట్టి గారు మందిరానికి వచ్చినప్పుడు..భక్తుల సౌకర్యార్థం మందిరం చుట్టూరా రేకులతో పందిరి లాగా వేద్దామని అనుకున్నానని..నేను కొంత మొత్తాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నానని..మిగిలిన మొత్తానికి వారి సహకారం కావాలని అడిగాను..నావైపు సాలోచనగా చూసి.."ఆలోచిస్తాను..మళ్లీ చెపుతాను!." అని అన్నారు..అంతేకానీ స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు..తిరిగి విజయవాడ వెళ్లిపోయారు..నా వద్ద ఉన్న నగదుతో పని పూర్తి కాదు..మొదలుపెట్టి..మధ్యలో ఆపడం బాగుండదు..ఏమి చేయాలి?..శ్రీ స్వామివారి సమాధి వద్ద ప్రార్ధన చేసుకున్నాను..


ఆ ప్రక్కరోజు మా సిబ్బంది వచ్చి.."అయ్యా..మనం రేకులతో పందిరి వేయించాలని అనుకున్నాము కదా..ముందు పని మొదలుపెడదాము..ఆ తరువాత మందిరానికి వచ్చే భక్తులను విరాళాలు అడుగుదాము..కొద్ది మందైనా స్పందించి ఎంతో కొంత సహాయం చేస్తారు..అలా మెల్లిగా పని పూర్తి చేద్దాము.." అన్నారు..ఈ సూచన అమలు చేయాలని అనుకున్నాను..సరే మంచిరోజు చూసి పని మొదలుపెట్టాలని సంకల్పించాను..


ఆరోజు సాయంత్రం..ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు నా దగ్గరకు వచ్చి.."పెద్దిశెట్టి గారు మీ ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్పారండీ..మీతో మాట్లాడతారట.." అన్నారు..నెంబర్ ఇచ్చాను..ఆ రాత్రికి పెద్దిశెట్టి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాదూ..నువ్వు రేకులతో పందిరి లాగా వేయాలని అనుకున్నావు కదా..రేపుదయం విజయవాడ నుంచి మా పనివాళ్ళ ను పంపుతున్నాను..శ్రీ స్వామివారి మందిరం లో ఎంత మేర పందిరి వెయించాలని నువ్వు అనుకున్నావో.. ఆ లెక్క వాళ్లకు చెప్పు..వాళ్ళు ఎస్టిమేషన్ వేసి నాకు చెపుతారు..మొత్తం సామాను ఇక్కడినుంచి నేను పంపిస్తాను..మా పనివాళ్ళు అక్కడే ఉండి..పని పూర్తి చేసి తిరిగి వస్తారు..నువ్వు ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయొద్దు..ఆ స్వామివారికి నేను ఈ మాత్రం సేవ చేసుకుంటాను.." అన్నారు..ఆ నిమిషం లో నాకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు..కేవలం ధన్యవాదములండీ అని మాత్రం అన్నాను..


మరో వారం కల్లా అనుకున్న విధంగా పని పూర్తి అయింది..మరో రెండు రోజుల్లో పెద్దిశెట్టి గారు మళ్లీ మందిరానికి వచ్చారు.."ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?.." అన్నారు నవ్వుతూ..తలవూపాను.."నువ్వు నన్ను అడిగిన రోజు..నేను ఆలోచిస్తాను అన్నాను..విజయవాడ వెళ్లిన తరువాత..అంతా స్వామివారి ఆదేశం అని అనిపించింది..ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకు ఫోన్ చేసాను.." అన్నారు..


శ్రీ పెద్దిశెట్టి గారు ఆ ఒక్క పనితో ఆగలేదు..భక్తులు తలదాచుకోవడానికి నాలుగువందల చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు షెడ్లు..వేయి చదరపు అడుగుల విస్తీర్ణం తో మరో షెడ్డు కూడా కట్టించారు..ఈనాటికి కూడా ఆ కట్టడాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి..స్వామివారి ని అత్యంత భక్తితో కొలిచిన ధన్యజీవి శ్రీ పెద్దిశెట్టి గారు..వయోభారం తో పాటు ఆరోగ్యం సహకరించక పోయినా..లేని శక్తి కూడగట్టుకొని..ప్రతి శివరాత్రికి, అలానే శ్రీ స్వామివారి ఆరాధనా ఉత్సవాలకు తప్పనిసరిగా మందిరానికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని వెళ్లేవారు..వారు ప్రస్తుతం భౌతికంగా లేరు కానీ..వారు శ్రీ స్వామివారి కి చేసిన సేవ సదా స్మరించుకుంటాము..


పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం...రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).