14, జులై 2025, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 44

 

 ప్రశ్న పత్రం సంఖ్య: 44


కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.


1) క్రిందిది పంచభూతాలలో లేదు


i ) నీరు 


ii ) గాలి 


iii ) పొగ 


v ) అగ్ని 


2) చందమామ రావే జాబిల్లి రావే వ్రాసింది


i ) దాశరధి రంగాచార్య


 ii ) త్యాగరాజు 


iii ) పెద్దన 


iv ) శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్య


3) భగవత్గీత వీటి సారం అంటారు 


i )పురాణాల 


 ii ) ఉపనిషతుల


 iii ) వేదాల   


iv ) సాంప్రదాయాల


4) ఇంట గెలిచి ___ ;గెలవాలి అంటారు


i ) గచ్ఛ ii ) ఊళ్ళో


 iii ) రచ్చ  


iv ) రచ్చబండ 


5) కావ్యేషు --------- రమ్యం


i ) బూటకం 


ii ) ప్రబంధం  


iii )నవల  


iv ) నాటకం 


6) 180 డిగ్రీలు వున్నదానికే ________ అని పేరు


i ) లంబరేఖ 


ii ) సరళరేఖ 


iii ) ముళరేఖ 


|iv ) ఈ మూడు 


7) మనదేశంలో గృహావసరాలకు సరఫరా చేసె విద్యుత్


i )110V ఉంటుంది 


ii ) 220V ఉంటుంది 


 iii ) 250V ఉంటుంది 


iv ) 300V ఉంటుంది


8) ఇది పురాణం కాదు


i ) మార్కండేయ పురాణం 


ii ) అగ్నిపురాణం


 iii ) వరుణ పురాణం 


iv ) వాయు పురాణం 


9) అన్నదమ్ముల ఆస్తి పంపకాల వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 


i ) సివిల్ కోర్టు ,  


 ii ) క్రిమినల్ కోర్టు 


.iii ) కన్స్యూమర్ కోర్ట్ ,


iv ) ఫామిలీ కోర్టు 


10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి


i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 


11) సహధర్మచారిణి అంటే


i ) ధర్మ,అర్ధ,కామాలనే మూడు ధర్మాలను సమంగా పంచుకునేదని 


 ii ) ధర్మ,అర్ధ,కామ మోక్షాలనే ధర్మాలను సమంగా పంచుకునేదని


iii ) అధర్మ కార్యాలను పాలుపంచుకునేది అని 


 iv ) ఆస్తిలో వాటా కోరునది అని


 12) పాలపుంత అనునది


i ) గ్రామాలలో పాల కుండను వుంచు ఉట్టి 


 ii ) గ్రామాలలో పాల కుండను వుంచు గూడు


 iii ) నక్షత్ర మండలము


iv ) రాసి చక్రము 


13) వటపత్ర సాయి అనగా


i ) మర్రి ఆకుమీద పవళించిన వాడు 


ii ) తమలపాకు మీద పవళించిన వాడు


iii ) తామర ఆకుమీద పవళించిన వాడు


iv ) జామ ఆకుమీద పవళించిన వాడు


14) జనక మహారాజు ఒక 


i ) ఆత్మవేరు పరమాత్మ వేరని నమ్మిన వాడు 


 ii )స్థితప్రజ్ఞుడు 


 iii ) మనుషులంతా ఒకటేనని నమ్మినవాడు 


iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని తెలుసుకున్నవాడు 


15) జాతక చక్రంలో _____గదులు ఉంటాయి 


i ) తొమ్మిది 


 ii ) పది 


 iii ) పన్నెండు 


 iv ) పదహారు


16) తమలపాకులు వీటికోసం వాడరు


i ) తాంబూలంలో


 ii ) పూజలలో   


 iii ) తోరణాలలో


 iv ) పేరంటంలో


17) "దేహశుద్ది" అనునది దీనికి ఉపయోగిస్తాము   


i ) ఇతరులను కొట్టటం 


 ii ) మంచినీటితో దేహాన్నిశుద్ధి చేయటం  


 iii ) పన్నీరుతో స్నానం చేయటం


 iv ) చెరువులో స్నానం చేయటం 


18) పూర్వాకాలంలో ఇలా అనేవారు " కాశీకి పోయినవారు _____పోయినట్లే"


i ) కాటికి 


 ii ) ఏటికి  


iii ) హిమాలయాలకు 


iv ) ద్రాక్షారామానికి 


19)" సరళీ స్వరాలు" అనునవి


i ) సరళ పాడే స్వరాలూ 


 ii ) సంగీతంకు సంబందించినది 


 iii ) సాహిత్యానికి సంబందించినది 


 iv ) సంగీతము ఇష్టమైనది మరియు స్పష్టమైనది 


20) లాయర్లకు మరియు డాక్టర్లకు వత్యాసం 


i ) కోటురంగు ii ) బూటు రంగు iii ) చొక్కారంగు iv ) అన్నీకూడా

హరుడై సృష్టికినీశుడై

 మ॥

హరుడై సృష్టికినీశుడై వినుతదీవ్యద్విశ్వసంహర్తయై 

స్థిరుడైయుండియు జాయ లేక జగతిన్ సృష్టించ సాధ్యమ్ముగా 

దురుసంయతి తోడ నైన యని దానూహించి యర్థాంగిగా 

స్మరుహేతుం గొని బొందె పార్వతిని భస్మక్షత్రుడానందమున్ 

*~శ్రీశర్మద*

పోతనగారి మనో విశ్లేషణ!

 శు భో ద యం 🙏


పోతనగారి మనో విశ్లేషణ!


              శా: " లగ్నంబెల్లి , వివాహముంగదిసె , నేలారాడు గోవిందు , డు


                      ద్విగ్నంబయ్యెను మానసంబు , వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం


                     డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు సిధ్దించునో ?


                     భగ్నంబై చనునో ? , విరించి కృత మెభ్భంగిన్ బ్రవర్తించునో ?  


                             రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                                 చిన్న నాటినుండి కన్నయ్యను పెండ్లియాడాలనే రుక్మిణి తలంపునకు భిన్నంగా శిశుపాలునితో ఆమెవివాహం

నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే ఉద్దేశ్యంలేని రుక్మిణి, అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని ద్వారా కృష్ణునకు ప్రణయ సందేశ

మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో

నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.


                              అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై వివాహము జరిపించుటకు అన్నరుక్మి సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన యామె మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా చిత్రించినాడు.


                  తొలుత "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో మధ్యలో యెక్కడైనా కూలబడి యుండడుగదా? 

ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో వినలేదో? వస్తాడో రాడో? నాఅదృష్టం యెలాఉందో మరి?  


                      ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.


              " రేపే వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే వచ్చే వికారం) ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో? బ్రహ్మణుడేల యాలసించెనో? నాప్రయత్నం ఫలవంతమగునో లేదో? బ్రహ్మ నిర్ణయం యేవిధంగా ఉందో? "- ఇది ఆమె మనస్సులోని డోలాయమాన మగుచున్న

భావనలు.


                 లోకంలో మనకు అనుభవమే ! యేదైనా పనిమీద మనంపంపినవారు సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం లేకపోతే మనం పడే మనోవేదన చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు

"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన పోతనగారి మనోవిశ్లేషణా సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో  


                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సింగినాదం జీలకర్ర*

 *సింగినాదం జీలకర్ర*


ఇది తరచుగా వినిపించే ఒక సామెత... *సింగినాదం అంటే ఆటవికుల చేతిలో ఉంచుకునే వాద్య పరికరం (దీనిని దుప్పి కొమ్ముతో తయారు చేస్తారు).* గతంలో ఓడ రేవులలో *సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియచేస్తూ శంఖారావం* లాంటి శబ్దం చేసేవారు. దాంతో ప్రజలు, వ్యాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునే వారు. *ఓడ రాకను తెలియచేసేదే సింగినాదం.* 


*ప్రత్యేకించి ఒక ఓడ మాత్రం అన్ని సార్లూ జీలకర్ర తోనే రేవుకు వచ్చేది.* సింగినాదం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లేవారు కాదు. ఆఁ ... ఏముందిలే జీలకర్రె కదా! అని అనుకుని మిన్నకుండిపోయేవారు. ఆ విధంగా పుట్టిందే ఈ మాట.. *సింగినాదం జీలకర్ర.*


*మరో కథనం...*


సింగినాదం జానపదుల, గిరిజనులు ఎక్కువగా వాడే కొమ్ము వాయిద్యం. అప్పట్లో మేక, గొర్రె కొమ్ముతో కూడా ఈ వాయిద్య పరికరం తయారు చేసి వాడేవారు. ఈ *మేక, గొర్రె కొమ్మును* నీటిలో మరిగించి అందులోని గుజ్జును తీసివేసి వాయిద్య పరికరంగా తయారు చేసేవారు.*సంస్కృతం లో కొమ్మును శృంగం* అని అంటారు. ఆ శృంగనాదమే వాడుక లో *సింగి నాదం* అయుంది. పల్లెటూళ్లలో గిరిజనులు అడవి ప్రాంతాల నుంచి వచ్చి పల్లెటూళ్లలో జీలకర్ర అమ్ముతుండేవారు. అలా అమ్మడానికి వచ్చినప్పుడు *శృంగ నాదం* అదే *సింగి నాదం* ఊదేవారు. అలా వచ్చిందే ఈ *సింగి నాదం జీలకర్ర,* అనే సామెత.


*సింగి నాదం జీలకర్ర,* అంటే చాలా చిన్న విషయం అని కూడా మరొక అర్ధం.

కామ: క్రోధ శ్చ లోభ శ్చ

 కామ: క్రోధ శ్చ లోభ శ్చ 

దేహే తిష్ఠంతి తస్కరా:౹

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మా జ్జాగృత జాగృత॥


కామ: -కోరికయును, 

క్రోధ: చ- కోపమును,

లోభ: చ-లోభమును అనే, 

తస్కరా: -దొంగలు, 

దేహే-నీ శరీరమందే, 

జ్ఞాన-జ్ఞాన మనే, 

రత్న-రత్నాన్ని, 

అపహారాయ-దొంగిలించడానికి, 

తిష్ఠంతి-ఉన్నాయి(ఉన్నారు), 

తస్మాత్- అందువలన, 

జాగృత జాగృత-మేలుకో మేలుకో॥


నీలోపల ఉన్న జ్ఞాన మనే రత్నాన్ని దోచుకోడానికి కామం, క్రోధం, లోభం అనే దొంగలు కాచుకొని ఉన్నారు. కాబట్టి ఓ మనిషీ!మేలుకో, మేలుకో॥

14-7-25/సోమవారం/ రెంటాల

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_


అకృతాత్మానమాసాద్య 

రాజానమనయే రతమ్

సమృద్ధాని వినశ్యన్తి 

రాష్ట్రాణి నగరాణి చ

_(5.21.11)_


*అర్థం:*

అన్యాయమైన మార్గాల్లో నిమగ్నమైన 'వివేకరహిత పాలకుల' కారణంగా 'సంపన్న దేశాలు' మరియు నగరాలు కూడా నాశనమవుతున్నాయి.

(ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ఇదే కదా)


శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారి కీర్తనతో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *త్రయః కాలకృతాః పాశాః శక్యన్తే న నివర్తితుమ్।*

           *వివాహో జన్మ మరణం యథా యత్ర చ యేన చ॥*


తా𝕝𝕝 *వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు*....

ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే....*ఇవి మార్చడానికి అసాధ్యమైనవి...*


 ✍️VKS ©️ MSV🙏

ముప్పు తిప్ప లెట్టి

 ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు

వస్తె హోమియోలొ వైద్య ముంటె

ముందుగానె వస్తె ముప్పుతిప్పలు నేల

సకురు అప్ప రావు సత్యమిదిర


భావం: అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వెళ్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ గొరిగించుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు కద నాయనా! ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం? హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు?అదేమైనా మీ శత్రువా? బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది లేతగా అప్పుడప్పుడే వచ్చిన సమస్యలూ, రోగాలూ నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా? 

హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం! దీనిని అర్థం చేసుకుని, ప్రతీ సందర్భానికీ వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం! 

సకురు అప్పారావు చెప్పే ప్రతీ మాటా అక్షర సత్యం!అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి! 

 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

కృత్రిమ కన్నీరు ""

 

కవితా శీర్షిక:

      "" కృత్రిమ కన్నీరు ""


దేహంలో జీవం ఉన్నంత కాలం 

తప్పదు కన్నీళ్ళ ఆగమనం

వాటి రాకతోనే అవుతుంది మనస్సు మలిన రాహిత్యం!


నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లు

తరతమ భేదం లేదు కన్నీళ్ళకు!

కష్టసుఖాలు రెండూ సరి సమానం 

రెండింటిని సమంగా స్వీకరించమని మానవులకు కన్నీళ్ళు ఇచ్చే సందేశం!


తల్లిపాలలా కన్నీరు స్వచ్చమైనది

గుండెలోని భారాన్ని దింపి స్వస్థత చేకూర్చుతుంది!


ప్రకృతిని వికృతిగా మార్చి

కృత్రిమ కన్నీటిని ఆహ్వానిస్తున్నాం!


వృద్ధాప్యంలో కన్నవారిని కనికరించక

వారిని అనాధలుగా వృద్ధాశ్రమంలో చేర్చి

వారి కనులలో అశ్రుధారలను కురిపిస్తున్నాం!


ఆడపిల్లల పుట్టుకను భారంగా తలచి

స్కానింగ్ ద్వారా తెల్సుకుని వారిని పురిటిలోనే చంపుతూ

వారికి కన్నీటిని బహుకరిస్తున్నాం!


కట్నకానుకలకై వనితలను వేధిస్తూ

అతివల జీవితాల్లో కన్నీటి వరదను పారిస్తున్నాం!


దైవ సంకల్ప సంఘటనలు కొన్నయితే

మానవ కల్పిత కృత్రిమ దుర్ఘటనలే అత్యధికం

అవి ఎప్పటికీ తప్పించుకోలేనివి

ఇవి ఇప్పటికైనా తప్పించుకు తీరాల్సినవి!


మన చేతలతో వాటిని సరి చేసుకుని

కృత్రిమ కన్నీటికి అడ్డు కట్ట వేద్దాం

సుఖమయ జీవనానికి శ్రీకారం చూడదాం!!!


************************************


నమస్తే అండీ, మీ రచన అందింది, ధన్యవాదాలు.

తెలుగు తల్లి కెనడా

Show quoted text

పోతనగారి మనో విశ్లేషణ!

పోతనగారి మనో విశ్లేషణ!


              శా: " లగ్నంబెల్లి , వివాహముంగదిసె , నేలారాడు గోవిందు , డు


                      ద్విగ్నంబయ్యెను మానసంబు , వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం


                     డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు సిధ్దించునో ?


                     భగ్నంబై చనునో ? , విరించి కృత మెభ్భంగిన్ బ్రవర్తించునో ?  


                             రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                                 చిన్న నాటినుండి కన్నయ్యను పెండ్లియాడాలనే రుక్మిణి తలంపునకు భిన్నంగా శిశుపాలునితో ఆమెవివాహం

నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే ఉద్దేశ్యంలేని రుక్మిణి, అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని ద్వారా కృష్ణునకు ప్రణయ సందేశ

మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో

నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.


                              అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై వివాహము జరిపించుటకు అన్నరుక్మి సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన యామె మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా చిత్రించినాడు.


                  తొలుత "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో మధ్యలో యెక్కడైనా కూలబడి యుండడుగదా? 

ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో వినలేదో? వస్తాడో రాడో? నాఅదృష్టం యెలాఉందో మరి?  


                      ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.


              " రేపే వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే వచ్చే వికారం) ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో? బ్రహ్మణుడేల యాలసించెనో? నాప్రయత్నం ఫలవంతమగునో లేదో? బ్రహ్మ నిర్ణయం యేవిధంగా ఉందో? "- ఇది ఆమె మనస్సులోని డోలాయమాన మగుచున్న

భావనలు.


                 లోకంలో మనకు అనుభవమే ! యేదైనా పనిమీద మనంపంపినవారు సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం లేకపోతే మనం పడే మనోవేదన చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు

"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన పోతనగారి మనోవిశ్లేషణా సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో  


                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆత్మభవు నీశ్వరు నేశరణంబు వేడెదన్"

 శు భో ద యం🙏


"ఆత్మభవు నీశ్వరు నేశరణంబు వేడెదన్"


"ఎవ్వనిచేజనించు,జగమెవ్వనిలోపలనుండులీనమై,

ఎవ్వనియందుడిందు, పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం

బెవ్వ,డనాదిమధ్యలయుడెవ్వడు? వాని ,నాత్మభవు, నీశ్వరు, నేశరణంబు వేడెదన్"-బమ్మెఱపోతన-గజేంద్రమోక్షము.

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 మూడవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 

               మూడవ భాగం

       ప్రకాశ బిందువు, విమర్శ బిందు ప్రకాశాలు (కాంతులు )రెండు కలిపితే బ్రహ్మ, మాయ కలవడం వంటిది. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం, వ్యక్త స్థితిలో శివుడు శక్తి వేరుపడ్డారు. వేరుపడ్డప్పుడు శివుడు నిర్వికారం అయినప్పటికీ, ఈ వేరుపడ్డ శివుని మాయ వికారంగా ( చైతన్యంగా )చూపిస్తుంది. శివుడు వికారి కాలేదు, నిర్వికారమే, వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణ రహితమైన బ్రహ్మమును ఆశ్రయించి, ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మమును చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మముగా కనబడేలా చేస్తుంది.

పై విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి


ఋగ్వేదం అకారం తోను, యజుర్వేదం ఇకారం తోను సామవేదం ఐకారంతోను ప్రారంభం అగును.

    . పరమేశ్వరుడు వేదానికి మొదలైన "అ"కార రూపుడైతే వేదాలు తరువాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏమి వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్న ''ఓం'' వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినవి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలైనవి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్ర శక్తి ఉంటుంది. మంత్రంలో మంత్రార్థం ఉంటుంది. మంత్రం ఒట్టి అక్షరాలు కాదు. ప్రాణం ఉన్న అక్షరాలు. ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థంలేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడినది ఒక అర్థాన్ని ,ఒక పరమార్ధాన్ని, ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. దానిని బట్టి ఈ వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందురూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినపుడు, శివశక్త్యాత్మకమైనపుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుండి వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుని వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైన ఆత్మశక్తియందు ప్రవేశించి, శుక్లబిందు రూపమును పొందెను. ఇదియే పురుషుడయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువు నందు జేరి, రక్తబిందు భావమును పొందినది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ బిందువు వలన నాదము పుట్టెను.అదే అహం లోని బిందువు యొక్క నాదము వలన షోడశ కళలు ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైన పదునాలుగు భువనములను సృష్టించినది.

సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘అస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. 


       ఈ బిందు నాదములు అహం అనే రెండక్షరాలకు శరీరముగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువైనది. శుక్ల బిందువు చంద్ర బిందువైనది. ఈ రెండింటి మిశ్రమ రూపమైన బిందువు సూర్య బిందువైనది. అదే "అహం "ఈ బింద్రత్రయము వలన శ్రీచక్రములో త్రికోణ చక్రం ఆవిర్భవించెను. ఆ చక్ర మధ్యలో నున్నది సంవిద్బిందువు అని గ్రహించండి . ఈ సంవిద్బిందువే పరాశక్తి. ఈ నాల్గు బిందువులు కలసిన ఈ ఆవరణయే భ్రమణ వేగముతో కదలి, మిగిలిన చక్రములు సర్వము ఏర్పడినవి .



శ్రుతులు అనేక భేదములుగా ఉన్నను, ఉపనిపదర్థమందు సర్వశ్రుతులును లయ మగుచున్నవి గాన ఉపనిపత్తులకన్న వేరే ప్రమాణము లేదు గాన ఈ వివరణ సర్వోవనిషత్ సమ్మతముగా నున్నది.


    ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు - ఈ మూడు బిందువులను మూడు కోణములుగా చేసి త్రిభుజమును తయారుచేస్తే ఈ మూడు బిందువులను కలుపుతూ ఒక వృత్తము గీస్తే ఆ వృత్తమే సూక్ష్మ శ్రీచక్రము.

ఆ ప్రకాశ విమర్శ బిందువులు ప్రవంచావిర్భావ పరిపాలన లయములు గలవి.(సృష్టి, స్థితి సంహారం ) నిత్యయుతములు.(ఎప్ప్పుడు జరుగుతుంది )కామేశ్వరీ కామేశ్వరులు వాగర్థరూపములని చెప్పినందున పైన చూపించిన త్రికోణమందు ' మధ్యబిందువు నందు ప్రకాశ విమర్శ శక్తి సూక్ష్మముగా నున్నది, అదియే అత్మ. అంటే సంవిద్బిందువు. .

సృష్టి ఆది వస్తువునందు ఉన్నది శివశక్తులే.



ఆత్మ యందు శివశక్తుల వస్తుద్వయ మేళనము గలదు. అది భావిసృష్టికి కారణము. సృష్టికొరకు 

సత్వరజస్తమస్సులనే గుణత్రయరూపములను పొందినది. 

అవే కోణబిందువులుగా నున్నవి. ఆకోణ బిందువులు త్రిగుణమయ 

రూపములుగాను, వాగ్భవ కామరాజ శక్తి బీజములుగాను, అందు ప్రతి 

బిందువునందును ప్రకాశ విమర్శశక్తులు ఇమిడియున్నందున వాణీ హిరణ్య 

గర్భ ద్వంద్వమును, లక్ష్మీనారాయణద్వంద్వమును, ఉమామహేశ్వర 

ద్వంద్వమును అయియున్నవి. ఇక ఈ కోణబిందు త్రయమే సృష్టిలో

ప్రధాన వస్తువులగు చంద్రాగ్ని సూర్యమండ లముల "కాస్పద మైనది. వీని వలన ఆకాశాది పంచభూతములును, వాటివలన శాఖోవశాఖలుగా సృష్టి అంతయు పెరిగినది.


ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరించగా, ఒకటి ‘పుం’ రూపము, మరియొకటి స్త్రీ రూపమయినది.అవే శివశక్తి రూపములు. ఒకే తత్త్వమును స్వభావమును, రూపమును, నామము కలవి. ఆయన సదాశివుడు ఆమె శక్తి. ‘నమశ్శివాభ్యం నవయౌవనాభ్యం’ అని శంకరాచార్యుల వారి స్తుతిని పరిశీలిస్తే . వారు నిత్య యవ్వనులు అనే మాట స్పష్టము అవుతుంది..


పరమాత్మ అంశములు – ఆస్తి, భాతి, ప్రియం, నామరూపములు , అనగా మొదటి మూడు పరమాత్మ యొక్క అవ్యక్తమైన స్థితి. నామమన్నది వాగర్ధ రూపము. వాక్కు శక్తిరూపం – అర్ధం శివరూపము. ఇది అక్షరము, సకలము, వ్యక్తము, మూర్తము కనుకనే శివశక్తులను గురించి మనము అనగలము, వినగలము, మాట్లాడగలము. ‘నశవేన వినాశక్తిర్న శక్తి రహితః శివః’, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు లేనిదే శక్తి లేదు.

ప్రకృతి అంతా శివునిచే చైతన్యవంతమైనది. ప్రకృతిలో లీనమైన పరమాత్మ వలన ప్రకృతి ప్రకాశించుచున్నది. అది అజడ ప్రకృతి. జడ ప్రకృతి జీవము లేనిది కనుక ప్రకృతికి శివుడే రూపము. రూపము కాలమును బట్టి, స్థలమును బట్టి ఏర్పడును. ఈ రూపము శక్తి భాగము. ఈ రూపమును చైతన్యము చేయువాడు శివుడు. ఇతి స్థూలంగా శివశక్తిమయమైన అంశపంచకము యొక్క లక్షణము.

                   సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

విద్యా దదాతి వినయం

 విద్యా దదాతి వినయం

వినయాద్యాతి పాత్రతామ్,

పాత్రత్వాత్ ధనమాప్నోతి

ధనాద్ధర్మం తతస్సుఖమ్

గీతామకరందము

 గీతామకరందము:

18-46-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ || స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని ఎట్లు బడయగలడో వివరించుచున్నారు -


యతః ప్రవృత్తిర్భూతానాం 

యేన సర్వమిదం తతమ్ 

స్వకర్మణా తమభ్యర్చ్య 

సిద్ధిం విన్దతి మానవః || 


తా:- ఎవరివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము (ప్రవృత్తి) కలుగుచున్నదో, ఎవరిచేత ఈ సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో, వారిని (అట్టి పరమాత్మను), మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు.


వ్యాఖ్య:- "యతః ప్రవృత్తిర్భూతానామ్” - ఎవరినుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుచున్నవో - అని చెప్పుటవలన, సమస్తజీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే యని స్పష్టమగుచున్నది. జడమైన వస్తువు చైతన్యముయొక్క సహాయములేనిదే ఏమియు చేయజాలదు. జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మవలననే స్పందించుచున్నది. (మయా2ధ్యక్షేణ ప్రకృతిస్సూయతే స చరాచరమ్). కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడైన ఆ పరాత్పరునియెడల అపార భక్తిశ్రద్ధలు గలిగి వారినే యారాధించుచు పరమ శ్రేయము నొందవలెను.

“యేన సర్వమిదం తతమ్" - ఇదే వాక్యము గీతయందు మూడు పర్యాయములు ప్రయోగింపబడినది. "దేనిచేత ఈ సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో " అని దానియర్థము. పరమాత్మ సర్వవ్యాపకులై యుండుటవలన ఈ ప్రపంచమున వారు లేనిచోటు లేదని నిశ్చితమగుచున్నది. పాలలో వెన్నవలె వారు సర్వత్రవ్యాపించియున్నారు. స్థూలనేత్రమునకు వారు గోచరముకాకున్నను, జ్ఞాననేత్రమునకు సర్వత్ర గోచరించుదురు. ఈ ప్రకారముగ అణువణువునందును భగవంతుడు వ్యాపించియుండుటచే, సర్వసాక్షియై సమస్తము పరికించుచుండుటచే జీవులాతని సాన్నిధ్యమును సర్వత్ర యనుభూతమొనర్చుకొనుచు, పాపకృత్యము లెవ్వియు చేయక, భక్తిభావ సమన్వితులై యుండవలెను.


"స్వకర్మణా తమభ్యర్చ్య” – మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణముద్వారా ఎట్లు పొందగలడను ప్రశ్నకు భగవాను డిచట చక్కగ సమాధానమొసంగిరి - "నీవు నీ కర్మ చేసికొనుచు దైవమును ఆరాధించుచుండుము, స్మరించుచుండుము, ఈశ్వరార్పణముగా నీ కర్మముల నాచరింపుము. అనగా నీ కర్మలద్వారా పరమాత్మను ఆరాధింపుము. అట్టిచో నీవు జ్ఞానసిద్ధిని, తద్ద్వారా మోక్షసిద్ధిని బడయగలవు - అని భగవానుడిచట బోధించిరి. ఈ ప్రకారముగ కర్మను ఈశ్వరార్పణబుద్ధితో చేయునపుడే చిత్తశుద్ధిద్వారా యది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లుకాక ఫలాభిలాషతో చేసినచో కర్మ మోక్షహేతువు కానేరదు. 

"కర్మనుచేయుము కాని ఫలమును ఈశ్వరార్పణము గావింపుము" - ఇదియే కర్మద్వారా ఈశ్వరుని యారాధించుట. అనగా భగవవత్ప్రీత్యర్థము కర్మలనాచరించవలెనని భావము.

కర్మచే మోక్షము లభించునా యని కొందఱు ప్రశ్నించుదురు. " లభించును, కాని, దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభించును" అని తెలియవలెను. ఆపద్ధతి యేదియనిన, ఆ కర్మచే భగవంతుని అర్చించవలెను. అనగా ఆ కర్మనాచరించి తత్ఫలితమును భగవంతున కర్పించవలెను. నిష్కామముగ (భగవదర్పితముగ) కర్మాచరణ చేయవలెనని భావము. అత్తఱి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధిద్వారా యది మోక్షసాధనముగ పరిణమించును. ఇదియే కర్మమార్గమందుగల కీలకము. ఆ కీలకమును, ఆ కర్మరహస్యమును భక్తులపై కరుణచే భగవంతు డిచట వెల్లడిచేసివైచిరి. " ఓ జీవుడా!, కర్మ చేయుము. కాని ఈశ్వరార్పణబుద్ధితో చేయుము. ఆ కర్మచే ఈశ్వరుని యారాధించుము. ఫలితములను కోరకుము. కర్మచేయుటయే నీ వంతు. ఫలితమును భగవంతునకే అర్పింపుము" అని యిచట చక్కగ బోధింపబడినది. ఈ పద్ధతిద్వారా కర్మ తనకర్మత్వమును పోగొట్టుకొని, తన బంధరూపమును తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోవుచున్నది. దీనినిబట్టి కర్మ నింద్యముకాదనియు, కర్మమార్గము నికృష్టముకాదనియు, దాని నాచరించుపద్ధతిని తెలిసికొనినచో అది తక్కిన భక్తిజ్ఞానాదులవలె పరమ పవిత్రమగు ఒకానొక మోక్షసాధనము కాగలదనియు ఈశ్లోకముద్వారా స్పష్టమగుచున్నది.


కాని "స్వకర్మణా తమభ్యర్చ్య” (స్వకీయకర్మచే భగవంతుని ఆరాధించుట) - అను ఈ పద్ధతిని జనులు సరిగా గమనించక, దైవార్చితముగ కర్మలు చేయుట మాని కామ్యబుద్ధితో జేయుచున్నారు. అందువలన కర్మ బంధనరూపముగా మారిపోవుచున్నది. భగవానుడో, కర్మను మోక్షరూపముగ మార్చవచ్చునని తెలిపి దాని కిచట ఉపాయమునుగూడ సెలవిచ్చిరి. కాబట్టి ముముక్షువులెల్లరు ఈ సత్యమును జ్ఞాపకము నందుంచుకొని, ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు సమస్తకర్మలను ఈశ్వరార్పణబుద్ధితో, భగవత్కైంకర్యబుద్ధితో చేయవలయును. అట్లు చేసినచో "సిద్ధిం విన్దతి మానవః” అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని తప్పక బడయగలడని గీతాచార్యులు ఘంటాపథముగ తెలుపుచున్నారు.

ఈ శ్లోకమున కర్మ, భక్తి, జ్ఞానములయొక్క సముచ్చయము తెలుపబడినది. ఎట్లనిన -

1. కర్మనాచరించుట - (కర్మ) 

2. దానిద్వారా భగవంతుని ఆరాధించుట (భక్తి) 

3. అట్లు ఆరాధించుటచే చిత్తశుద్ధికలుగ జ్ఞానమావిర్భవించుట (జ్ఞానము).


కర్మయను ప్రమిదలో భక్తియను తైలమునుపోసి ధ్యానమను వత్తినిబెట్టి జ్ఞానమను జ్యోతిని వెలిగించవలెను.


ప్ర:- సమస్త ప్రాణికోట్లు ఎవనినుండి ఉత్పత్తిని బొందుచున్నవి?

ఉ:- పరమాత్మనుండి. 

ప్ర:- ఈ ప్రపంచమంతయు ఎవనిచే వ్యాప్తమైయున్నది? 

ఉ:- పరమాత్మచే. 

ప్ర:- జీవుడు మోక్షసిద్ధిని యెట్లు పడయగలడు?

ఉ:- స్వకీయకర్మచే భగవానుని ఆరాధించినచో, అనగా ఈశ్వరార్పణబుద్ధితో (నిష్కామముగ) కర్మలను ఆచరించినచో చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, దానిచే మోక్షమును బడయును.

తిరుమల సర్వస్వం -300*

 *తిరుమల సర్వస్వం -300*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-15


సర్ థామస్ మన్రో

➖➖➖➖➖➖➖


తిరుమల ఆలయం పట్ల వ్యాపార దృక్పథం లేకుండా, ఆదరభావంతో వ్యవహరించిన అతికొద్ది మంది అన్యమత పాలకులలో థామస్ మన్రో అగ్రగణ్యులు. 1780 వ సం‌. లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మద్రాసు రెజిమెంటులో సాధారణ సిపాయిగా చేరిన మన్రో, అంచెలంచెలుగా ఎదిగి, మద్రాసు రాష్ట్రం లోని కొన్ని జిల్లాల కలెక్టరు పదవుల నలంకరించి, చివరికి 1820 వ సం. లో మద్రాసు రాష్ట్రానికి గవర్నరుగా నియమింప బడ్డారు. ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ పదవిని చేపట్టిన మన్రోకు హిందువులన్నా, హైందవ మతమన్నా విశేష గౌరవం ఉండేది. అలాగే, శ్రీవేంకటేశ్వరస్వామి వారి పట్ల కుడా వారికి అపరిమిత భక్తిశ్రద్ధలు ఉండేవి‌. వారిని దర్శించుకొవాలని ప్రగాఢంగా కాంక్షించేవారు. 


ఒక నాడు మన్రో స్వామివారి దర్శనార్థం తిరుపతి చేరుకున్నారు. మరుసటి ఉదయం తిరుమల ప్రయాణం ఖరారైంది. ఆనాటి రాత్రి స్వామివారు మన్రోకు స్వప్నంలో సాక్షాత్కరించి, అన్యమతస్తుల ఆలయ ప్రవేశం కూడదని, తిరుమల యాత్ర విరమించు కొమ్మని ఆదేశించారు. అప్పట్లోనే కోట్ల సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకునే హైందవ భక్తుల సున్నితమైన మనోభావాలు దెబ్బతినకూడదని స్వామివారి అభిమతం కానీ, ఆ జగద్రక్షకునికి కులాలు, మతాలు, ప్రాంతాలతో పనిలేదు. శరణన్న వారిని చేరదీసి చింతలు బాపటమే వారి కలియుగావతార పరమార్థం. 


శ్రీవారి ఆనతిని శిరోధార్యంగా భావించిన మన్రో - శ్రీనివాసుని దర్శించకుండానే, ఒకింత నిరాశతో మద్రాసుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, ఆలయానికి ఏదైనా మేలు చేయాలనే తలంపుతో, తన విచక్షణాధికారంలో గల కొంత సర్కారు భూమిని ఆలయానికి ధారాదత్తం చేసి, ఆ ఆదాయంతో ప్రతిరోజూ ప్రథమఘంట నివేదనకు కావలసిన ప్రసాదాలను సమకూర్చే శాశ్వత ఏర్పాటు చేశారు. అలాగే, తన స్వంత ధనం వెచ్చించి, ప్రసాద వితరణ నిమిత్తం ఒక భారీ వెండి గంగాళాన్ని ఆలయానికి సమర్పించుకొని తన భక్తి భావాన్ని చాటుకున్నారు. మన్రో గంగాళం గా సుప్రసిద్ధమైన ఆ వెండి పాత్ర, గత రెండు శతాబ్దాల పైచిలుకు కాలంగా శ్రీనివాసుని సేవలో తరిస్తూ, మన్రో ను చిరస్మరణీయునిగా చరిత్ర పుటలు కెక్కించింది. మనందరం, మనకు తెలియకుండానే, ఏదో ఒక తిరుమల యాత్ర సందర్భంగా మన్రో గంగాళం లోని అన్నప్రసాదాన్ని ఆర్తితో ఆరగించిన వారమే !!!


మద్రాసు గవర్నరుగా వారు హైందవ సమాజానికి - ఏ విధమైన వివక్షకు తావు లేకుండా - చేసిన చిరస్మరణీయ సేవలకు గుర్తుగా, చెన్నై పట్టణం లోని మౌంట్ రోడ్ లో అశ్వారూఢుడైన సర్ థామస్ మన్రో విగ్రహం ప్రతిష్ఠించ బడింది. 


ఆలయ భౌగోళిక స్వరూపం


ఆలయ పరిసరాల గురించి, అక్కడి జనావాసాల గురించి అంతకు ముందు సమగ్రమైన, ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు. కానీ, ఈస్టిండియా కంపెనీ వారి పత్రాల్లో 1800 వ సం. నాటి తిరుమల భౌగోళిక స్వరూపం కళ్ళకు కట్టినట్లు వర్ణించబడింది - 

ఆలయాన్ని అనుసంధానించి ఉన్న నాలుగు ఇరుకైన మాడవీధుల్లో మాత్రమే జనసంచారం ఉండేది, అది కూడా అత్యంత స్వల్పంగా మాత్రమే. మాడవీధుల్లో కూడా వనసూకరాలు (అడవి పందులు), తేళ్ళు, పాములు విచ్చలవిడిగా సంచరించేవి‌. ఆ వన్యప్రాణులు సాధారణంగా - వాటి సాధారణ ప్రవృత్తికి భంగం కలిగేటట్లు ప్రవర్తించితే తప్ప - భక్తులకు ఏ హానీ తలపెట్టేవి కావు. అత్యంత అరుదుగా ఎవరైనా పాముకాటుకు గురైనా - ఆ వ్యక్తి శ్రీవారి సన్నిధి లోని తీర్థాన్ని భక్తితో సేవించి, మరి కొంచెం తీర్థాన్ని సర్పఘాతానికి గురైన భాగంలో మర్దనా చేస్తే, శ్రీనివాసుని కృప వల్ల ఎంతటి ప్రమాదకరమైన విషమైనా ఏ హానీ జరగేది కాదు. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి కంకణం కట్టుకున్న కరుడు గట్టిన హైందవేతర పాలకుల ప్రతినిధులు తమ ఏలికలకు పంపించే విశ్వసనీయమైన నివేదికల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారంటే, స్వామివారి మహిమను నిరూపించడానికి మరింకేం తార్కాణం కావాలి? 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*437 వ రోజు*


*అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట*


అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. " ఈలోకంలో కోపంలో ఉన్న వాడికి, ధనసంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది. నా తండ్రి మరణాన్ని తలచుకొని దహించుకు పోతున్న నా హృదయాన్ని శత్రుసంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటాడు కనుక ఎదిరించ లేము. కనుక రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను . దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధు మిత్రులు, సైనికులు గాఢనిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆతరువాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను " అన్నాడు.


*కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట*


అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు " అశ్వత్థామా ! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మమార్గాన నడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడివీడిపడిన వాడిని వాహనవైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. పాండవులు వారి సమస్తసైన్యము, పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి నరకముకు ఏల పోయేవు. మహాస్త్రకోవిదుడవు, మహారధులలో ప్రథముడవు, అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా ! కనుక రేపు యుద్ధములో మనం పాండువీరులతో పోరు సల్పుదాము " అన్నాడు.


*అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపచేయుట*

అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! నీవు పెద్ద వాడవు నన్ను శాసించ తగిన వాడవు. నీవు చెప్పింది సత్యము కాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాకుమారుడు ధృష్టద్యుమ్నుడు అది పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేసాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మయుద్ధమున కూలత్రోయించారు. ఇన్ని విధముల యుద్ధధర్మాన్ని మీరి యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా ! " అన్నాడు. మామా ! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగ లేదా ! అందుకనే నేను చేసేది అధర్మమైనా అధర్మమార్గాన నా తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నిడిని నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను " అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. " అశ్వత్థామా ! నువ్వూ నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను " అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ " మామా ! చాలా సంతోషం నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది రండి " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సోమవారం🕉️* *🌹14 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    *🕉️సోమవారం🕉️*

*🌹14 జూలై 2025🌹*            

   *దృగ్గణిత పంచాంగం*                   

   

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి  : చవితి* రా 11.59 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : ధనిష్ఠ* ఉ 06.49 వరకు ఉపరి *శతభిష*

 

            *ఈనాటి పర్వం*  

        *సంకష్టహర చతుర్థి* 


*యోగం : ఆయుష్మాన్* సా 04.14 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం   : బవ* మ 12.33 *బాలువ* రా 11.59 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 10.00 - 11.00 సా 05.00 - 06.30*

అమృత కాలం  : *రా 11.21 - 12.55*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39* 

*వర్జ్యం      : మ 01.54 - 03.28*

*దుర్ముహూర్తం  : మ 12.39 - 01.31 & 03.16 - 04.08*

*రాహు కాలం   : ఉ 07.20 - 08.58*

గుళికకాళం       : *మ 01.51 - 03.29*

యమగండం     : *ఉ 10.36 - 12.13*

సూర్యరాశి : *మిధునం*   

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 05.50*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.43 - 08.19*

సంగవ కాలం         :      *08.19 - 10.55*

మధ్యాహ్న కాలం    :     *10.55 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి: ఆషాఢ బహుళ చవితి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.59*

------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*స్నాత్వా ప్రత్యూషకాలే* 

*స్నపనవిధివిధౌ* 

*నాహృతం గాంగతోయం*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

బాదరాయణ సంబంధం

 *బాదరాయణ సంబంధం అంటే ఏమిటి?*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹


వైశాఖ మాసం చివరి రోజులు. రోహిణి కార్తెలో రోళ్ళు బద్దలవుతాయి అంటారు. నడి వేసవిలో పది గంటలకే ఎండ మండిపోసాగింది. ఒకాయన బండి తోలుకుంటూ గ్రామంలోకి ప్రవేశించాడు. పల్లె మొదట్లోనే రేగు చెట్టు ఉంది. చెట్టు కింద బండి ఆపి ఎడ్లను విప్పి చెట్టుకు కట్టేసాడు.


చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వీధి గుమ్మం తలుపు తీసే ఉంది. గుమ్మం దాటి నడవ లోకి వెళ్లి "అమ్మాయీ, కొంచెం దాహం తీసుకురామ్మా" అన్నాడు. వంటింట్లో ఉన్న ఇల్లాలు "ఎవరు ఇంత చనువుగా పిలుస్తున్నారు" అనుకుంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.. ఇంటి ఎదురుగా బండి, ఎద్దులు కనిపిస్తున్నాయి. "గ్రామాంతరం నుంచి వచ్చినట్లు ఉంది. ఎవరో గుర్తు తెలియడం లేదు. భర్త వైపు బంధువులే అయిఉంటారు" అనుకుంది.


"ఎప్పుడూ నా వైపు బంధువులనే ఆదరిస్తారనీ, ఆయన వైపు బంధువులకు మర్యాద చెయ్యననీ అంటుంటారు. ఈ వచ్చిన ఆయనకు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడితే ఆయన ఇంక నన్ను ఏమీ అనరు" అనుకుంది. "కూర్చోండి బాబయ్య గారూ" అంటూ లోపలికి వెళ్ళింది. ఎడ్ల మేత పూర్తయ్యాక వెడదాం అనుకుని ఆయన కూర్చున్నాడు.


ఇంటి యజమాని కొంతసేపటికి ఇంట్లోకి వచ్చాడు. నడవలో కూర్చున్న ఆయనను చూసి భార్య వైపు బంధువు అనుకుని "బాగున్నారా?" అని పలకరించి లోపలికి వెళ్ళాడు. వంటింట్లో భార్య అనేక రకాల వంటలు చేస్తోంది. "వచ్చింది ఆమె దగ్గర బంధువే కాబోలు. అందుకే పెద్ద ఎత్తున వండుతోంది. తనవైపు బంధువులను నేను గౌరవించనని అంటుంది కదా. ఇప్పుడు నేను చేసే మర్యాదలు చూస్తే ఇంక నోరెత్తలేదు." అనుకున్నాడు.


వచ్చిన ఆయనను స్నానానికి పిలిచాడు. సంపెంగ నూనెతో, పన్నీటితో అభ్యంగనస్నానం. స్నానం కాగానే యజమాని కొత్త బట్టలు తెచ్చి కట్టబెట్టాడు. ఆపైన పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం, పచ్చకర్పూరంతో తాంబూలం. "ఇక వెళ్లి వస్తానమ్మా, వస్తానయ్యా బాబూ" అంటూ ఆయన వెళ్లి ఎడ్లను బండికి కట్టి బయలుదేరాడు.


భార్య "చూశారా మీ వాళ్లకు ఎంత మంచి భోజనం పెట్టానో." అని అంది. భర్త "ఏమంటున్నావు. మీ వాళ్ళు అనుకునే మర్యాద తగ్గకూడదని కొత్తబట్టలు ఇచ్చాను." అన్నాడు. ఇద్దరూ ఒకరి నొకరు తిట్టుకున్నారు.


ఆ పైన బండి వెనక పరిగెత్తి "అయ్యా మీరు ఎవరు? మాతో మీకు ఉన్న సంబంధం ఏమిటి?" అని అడిగాడు.


"మీ ఇంటి ముందు బదరీ వృక్షం ఉంది (రేగు చెట్టు). నా బండి చక్రం రేగుకర్రలతో చేశారు. మనది బాదరాయణ సంబంధం అంతకన్నా ఏం లేదు." అంటూ బండి తోలుకుని వెళ్ళిపోయాడు.


భార్యాభర్తల కళ్లలో బండి కదలటం వల్ల రేగిన దుమ్ము పడింది. వారిద్దరి కళ్లలో దుమ్ము పడిందా? వారే కళ్లల్లో దుమ్ము కొట్టుకున్నారా? ఇద్దరూ నీ వాళ్ళు, నా వాళ్ళు అనుకోకుండా మన వాళ్ళు అనుకుంటూ సఖ్యంగా ఉంటే ఈ కథ మరోలా ఉండేది కాదా?


*అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుః!*

*బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం!!*

కరుగుతున్న తెలుగు భాష.

 *వింజమూరి వెంకట అప్పారావు గారి సౌజన్యముతో.....* 👇

ఎప్పటికీ ఇదితీరని సమస్యే??


కరుగుతున్న తెలుగు భాష. 


దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు చివర పుట్టినది. తమిళ, మలయాళ, కన్నడ భాషలు మనకంటే ముందు పుట్టినవి. లిపి పరిణామ క్రమం కూడా ఇదే వరుసలో ఉంటుంది. ఇంతకంటే తెలుగు భాషోత్పత్తి, వికాసం, చరిత్ర విషయాలు ఇక్కడ అనవసరం. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే.


తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరయినా విడమరచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు.


కనీసం ఇంకో పది వేల సంవత్సరాలయినా బతికి, బట్ట కట్టి, బలుసాకయినా తిని, నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్న మాట నిజమే అయినా-ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిది అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. ఖచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది? అని తేల్చడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.


మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపిని వాడక అంతరించిపోయింది.         


కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.


ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది.


తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది.


ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తున్నాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తున్నాయి. తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.


క్షుద్రులెరుగని నిర్ణిద్ర గానమిది…పాటకు fools who don’t know the song singing without sleep లాంటి అనువాదం చేస్తుంటే తెలుగు భావాన్ని ఇంగ్లీషులోకి తీసుకెళుతున్నారని సంతోషించవచ్చు. కానీ జరుగుతున్నది కేవలం లిప్యంతరీకరణ మాత్రమే. Kshudrulerugani nirnidra ganamidi అని రాస్తున్నారు.


ఇలా రాయడంవల్ల లండన్ లో షేక్స్ పియర్లు, అమెరికాలో నోమ్ చాస్కీలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు. తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు. లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమయిన పాపం మూటగట్టుకుంటున్నారు. మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు.

పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది. దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోయింది. ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్ లన్నీ ఇలా ఇంగ్లీషు లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం.


ఈమధ్య చిరంజీవి ఆచార్య సినిమా లాహే లాహే లాహే పాటను యూ ట్యూబ్ లో ఆరు కోట్ల మంది చూశారు. మణి శర్మ మంచి సంగీతం. రామజోగయ్య శాస్త్రి చక్కటి రచన. పాట అద్భుతంగా, నిండు తెలుగు కండతో ఉంది. ఆధ్యాత్మిక, వేదాంత విషయాలను సాధారణ పరిభాషలో ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు బాగుంది. నూటికి నూరు మార్కులు వేయదగ్గ రచన. మంచి కొరియోగ్రఫీ.లవ్ స్టోరీ సినిమా సారంగదరియా సాయి పల్లవి జానపదగీతం అసాధారణంగా ఇరవై అయిదు కోట్ల మంది చూశారు. ఈ రెండు పాటలు తెలుగువే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి.ఇవే కాదు. ఏ పాటలయినా ఇంగ్లీషులోనే ఉండాలని నియమమేదో పెట్టుకున్నట్లున్నారు. తెలుగు పాటలకు తెలుగు లిపిలో టెక్స్ట్ పెడితే జరిగే నష్టాలేమిటో, పెట్టడానికి కష్టాలేమిటో ఇంగ్లీషు తండ్రికే తెలియాలి. నిజంగా తెలుగును ఇంగ్లీషులో రాయడం వల్ల వ్యాపార ప్రయోజనాలుంటే ముందు తెలుగు లిపిలో ఇచ్చి, తరువాత ఇంగ్లీషులో ఇవ్వవచ్చు. అప్పుడు అసలు భాషకు తగిన గౌరవం ఇస్తూనే, కొసరు భాష ఉపయోగాన్ని కూడా పిండుకోవచ్చు.


ఇప్పటికీ శ్రీలంకలో ప్రభుత్వ బోర్డుల్లో మొదట వారి అధికార భాష సింహళీ, తరువాత ఎక్కువ మందికి తెలిసిన తమిళం, దాని కింద మూడో లైన్లో ఇంగ్లీషులో రాస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.


కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఒక మాట ఉంది. మూడో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం. చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం. అలా మనం తెలుగు లిపిని సైలెంట్ గా మర్డర్ చేస్తున్నాం. ఇన్నాళ్లు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి.


మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది. మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది. మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది. తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకోని పుట్టు చెవుడు మనది. తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది. తెలుగు పట్టని వైక్లబ్యం మనది.ఎవ్వరూ భయపడకండి.   


తెలుగును నడి బజారులో పట్ట పగలు అందరు చూస్తుండగా ఖూనీ చేసినా ఎవరూ కేసులు పెట్టరు. పెట్టినా నిలబడవు. నిలబడినా శిక్ష పడదు. పడినా అమలు కాదు.


త్వరగా పిడికిలి బిగించి ఉరికి రండి!

తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికి రండి!

తెలుగును కసితీరా పొడిచి పొడిచి చంపేద్దాం.

తెలుగును తెలుగు లిపిలో రాస్తే- అమ్మ భాష.

తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే- ? ? ? !

సేకరించిన సమాచారం:

వింజమూరి వేంకట అప్పారావుగారి సౌజన్యంతో-

పిల్లలు - పెద్దలు

 *పిల్లలు - పెద్దలు - సభ్యతా - సంప్రదాయము*


ఈ రోజుల్లో చాలా మంది తాత, అమ్మమ్మ, నానమ్మ, తల్లిదండ్రులకు ఒక వేదన కలుగుతుంటుంది. తమ పిల్లలకు మన సంప్రదాయాల మీద గౌరవం లేదు. వినయం, విధేయత లాంటివి లేవు. తమ మాట వినడం లేదు అని. ఇలా దిగులుచెందే వారెందరో! దానికి తోడు 'గ్లోబలైజేషన్' పేరుతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో విలువలు తారుమారౌతున్నాయి. మార్పుని తట్టుకోలేని వారి హృదయం కించిత్తు బాధకి గురౌతోంది.


 కాలంలో వస్తున్న సాంకేతిక పరిణామాల ప్రభావం, దూరాలు తగ్గి దేశాలు సైతం గ్రామాలంత దగ్గర కావడం... ఇలాంటి ఎన్నో నేపథ్యాలలో 'వేగం’ పెరుగుతోంది. ఇది వరకు పాతికేళ్ళు పట్టే మార్పుకి, ఈ రోజు రెండు రోజులు చాలు.

 మార్పుని ఆహ్వానించడం మంచిదే. కానీ ఆ మార్పులు తరతరాల సంస్కృతి విలువలను ధ్వంసం చేసేటంతగా జరగడం ఆహ్వానించదగినది కాదు. ఆధునీకరణను 'పాశ్చాత్యీకరణ'గా భ్రమిస్తున్న యువత మనదైన ఘనతను తెలుసుకోకపోవడం విచారకరమైతే, దానిని ఉపేక్షించడం మరియు తృణీకరిచడం మరీ మరీ దౌర్భాగ్యం.

         

మానవ సంబంధాలు, తరతరాల నుండి సంక్రమిస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలు - వీటిని పదిలపరచుకుంటూనే, ఆధునికంగా కూడా ఎంతో ఎదగవచ్చు. అయితే వీటిపై అవగాహన, గౌరవం కలిగించాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. దీనికి రెండు పద్ధతులున్నాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మన సంస్కృతి పట్ల గౌరవం కలిగించే అంశాలను తెలియజేయాలి. ఒక పాఠ్యాంశాల బోధనలా కాకుండా, వారికి పరిసరాలలో కలిసిపోయేలా పరిచయానికి రావాలి. సంస్కృతితో కలిసి జీవింపజేయాలి. ఈ రోజుల్లో పాఠశాలల ద్వారా సంస్కృతి బోధన జరుగుతుందని ఆశించడం పొరపాటే. కేవలం ర్యాంకుల లక్ష్యంగా సాగే పోటీ చదువుల పోరులో *ఈ విలువల పరిరక్షణను విద్యాసంస్థల నుండి ఆశించడం పొరపాటు.* పౌష్టికాహారాన్నిచ్చి పోషించే బాధ్యతతోపాటు, సంస్కృతి - నాగరికతల వివేక సంస్కారాలను పిల్లలకు అలవరచడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యమే.

        

 ముఖ్యంగా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు తల్లిదండ్రులు కూడా గౌరవంగా వాటిని పాటిస్తుండాలి, *పిల్లలకు నేర్పుతూ ఉండాలి* వివిధ సంస్కృతి సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పిల్లలతో పాటు తాము పాల్గొనడం చేయాలి. వారి ముందు *మంచి పద్ధతులు* కనిపిస్తుంటే అనుకరించడం పిల్లల సహజం.

         

కుటుంబంలోని పెద్దలు ముందు సమన్వయంతో ఉండాలి. భార్యలను చిన్న చూపు చూసే భర్తలు, భర్తలను గద్దించే భార్యలు. అత్త మామలను కించపర్చే కోడళ్ళు, ఈలా సంసారంలో ఎన్నెన్నో అవకతవకలు. *ముందు పెద్దలే ఇతర పెద్దలపట్ల వినయ విధేయతల్నీ, సంస్కారాన్నీ కనబరుచుతుంటే పిల్లలకీ అది అవగతమవుతుంది*.

         

ప్రధానంగా ‘గౌరవం' కలిగించడం అత్యావశ్యకం. పరిజ్ఞానం కన్నా ముందు 'గౌరవం’ కావాలి. *అన్నీ తెలిస్తేనే గాని చేయను*' అని మొండికేస్తే నష్టపోయేది వారే. ముందు *పూర్వాచారాలను పాటిస్తూ ఉంటే క్రమేణ అవగాహన మరింత చక్కని అభ్యాసం సిద్ధిస్తుంది*.

 

ఇటువంటి నైతిక విలువలను ఒక తరం తరువాతి తరానికి అందించాలి. ఆస్తినే కాదు, తమదైన ప్రాచీన విలువల్నీ, విద్యలనీ ప్రబోధించాలి' అనే బాధ్యతను పెద్దలు తీసుకోవాలి.


*ప్రస్తుత పరిస్థితి ఎంతగా దిగజారి పోయిందంటే...* *పెద్ద వాళ్ళను పలకరించక పోవడము, రహస్య జీవితాలు, తమ జీవిత దారులను తామే ఎన్నుకోవడం*

*ఇంకా ఇంకా ఎన్నెన్నో*

          

జీవితానికి పనికొచ్చే భౌతిక విద్యలను నేర్చుకోవడంతో పాటు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రాచీన ధర్మవిద్యలు మొదటి నుండీ నేర్పాలి. సెలవు రోజుల్లో తీరిక వేళల్లో సంబంధంలేని ఏవో విదేశీభాషల కోసమో, కొత్త కోర్సుల కోసమో పిల్లల్ని పంపిస్తుంటారు, వాటితో పాటు మనదైన ఉత్తమ విలువల్నీ, ప్రాచీన కళల్నీ, వేదానికి సంబంధించిన విద్యల్నీ కూడా నేర్పించగలగాలి.

    

సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగాభ్యాసం, ప్రవర్తనా సరళి ఇంటి పనుల్లో చేయూత, అవసరంలో ఉన్న వారికి సహాకారం..పూర్వ గ్రంథాలలోని విలువలు, విశేషాలు, వాటి కథలు, బోధనలు, నైతికత... ఇలాంటి అభ్యాసాలను బాల్యం నుండి తాము అందించే ప్రయత్నం పెద్దలు చేపట్టాలి. అటువంటి పరిసరాలలో సంచరించేలా చేయాలి. పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కదా!

          

          

 *విలువల్నీ, ధర్మాన్ని బోధించడం చేత ఆరోగ్యవంతమైన, సత్సంస్కారం కలిగిన ఉత్తమ పౌరులు ఏర్పడతారు*.


 అవినీతి, బాధ్యతా రాహిత్యం వంటివి సమాజంలో తగ్గాలంటే నాటి సంస్కారాలని, నైతికతని బాల్యం నుండే అందించాల్సిన అవసరముంది.


 ముందుగా పెద్దలే వాటి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ, పిల్లల ముందు పాటిస్తూ, పాటిస్తున్నట్లు కన్పిస్తూ, వాటిపై గౌరవం కలిగిన కుటుంబాల స్నేహసంబంధాలను పిల్లలతో కొనసాగింపజేస్తూ జాగ్రత్తపడడం బాధ్యత.

           

మనదైన ఘనచరిత్ర, కట్టడాలు, పవిత్ర స్థలాలు దేవాలయాలు వాటి పురాణ సాంఘిక నేపథ్యం, చారిత్రక ఔన్నత్యం - ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ బోధించాలి. అదే వారికి వినోదంతో కూడిన విజ్ఞానాన్నీ, విజ్ఞానంతో కూడిన దేశభక్తినీ, సంస్కారాన్నీ ప్రసాదిస్తుంది.


ధన్యవాదములు.


*సేకరణ*