14, జులై 2025, సోమవారం

కృత్రిమ కన్నీరు ""

 

కవితా శీర్షిక:

      "" కృత్రిమ కన్నీరు ""


దేహంలో జీవం ఉన్నంత కాలం 

తప్పదు కన్నీళ్ళ ఆగమనం

వాటి రాకతోనే అవుతుంది మనస్సు మలిన రాహిత్యం!


నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లు

తరతమ భేదం లేదు కన్నీళ్ళకు!

కష్టసుఖాలు రెండూ సరి సమానం 

రెండింటిని సమంగా స్వీకరించమని మానవులకు కన్నీళ్ళు ఇచ్చే సందేశం!


తల్లిపాలలా కన్నీరు స్వచ్చమైనది

గుండెలోని భారాన్ని దింపి స్వస్థత చేకూర్చుతుంది!


ప్రకృతిని వికృతిగా మార్చి

కృత్రిమ కన్నీటిని ఆహ్వానిస్తున్నాం!


వృద్ధాప్యంలో కన్నవారిని కనికరించక

వారిని అనాధలుగా వృద్ధాశ్రమంలో చేర్చి

వారి కనులలో అశ్రుధారలను కురిపిస్తున్నాం!


ఆడపిల్లల పుట్టుకను భారంగా తలచి

స్కానింగ్ ద్వారా తెల్సుకుని వారిని పురిటిలోనే చంపుతూ

వారికి కన్నీటిని బహుకరిస్తున్నాం!


కట్నకానుకలకై వనితలను వేధిస్తూ

అతివల జీవితాల్లో కన్నీటి వరదను పారిస్తున్నాం!


దైవ సంకల్ప సంఘటనలు కొన్నయితే

మానవ కల్పిత కృత్రిమ దుర్ఘటనలే అత్యధికం

అవి ఎప్పటికీ తప్పించుకోలేనివి

ఇవి ఇప్పటికైనా తప్పించుకు తీరాల్సినవి!


మన చేతలతో వాటిని సరి చేసుకుని

కృత్రిమ కన్నీటికి అడ్డు కట్ట వేద్దాం

సుఖమయ జీవనానికి శ్రీకారం చూడదాం!!!


************************************


నమస్తే అండీ, మీ రచన అందింది, ధన్యవాదాలు.

తెలుగు తల్లి కెనడా

Show quoted text

కామెంట్‌లు లేవు: