21, సెప్టెంబర్ 2023, గురువారం

కొండనాలుక సమస్య నివారణ -

 కొండనాలుక సమస్య నివారణ  - 


    దాల్చిన చెక్క ని నీటితో రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని దూది చుట్టిన పుల్లకు అద్ది కొండనాలుక కు రోజు మూడు పూటలా అంటిస్తూ ఉంటే మూడు రోజుల్లో కొండనాలుక యధాస్థితికి వస్తుంది. దగ్గు తగ్గుతుంది . 


  

    మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

పదకొండవ సంవత్సరము రాగానే

 *అన్యాయోపార్జితం విత్తం దశవర్షాణి తిష్ఠతి /*

*ప్రాప్తేచైకాదశే వర్షే సమూలంచ వినశ్యతి //*

*!! తా !!*

*అన్యాయంగా సంపాదించిన ధనం పది సంవత్సరాలు ఉంటుంది. పదకొండవ సంవత్సరము రాగానే ఆ ధనం సమూలంగా నశిస్తుంది"*

Panchaag

 


Maha kaleswar


 

Mechanical movement


 

Boomerang


 

Totakura purush

 


హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు,

 🎻🌹🙏హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 


🌸జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.


🌿ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం  వచ్చినపుడు, ఎవరైనా  గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.



🌸12. రాక్షస సంహారానికై  హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?


🌿జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం  చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. 


🌸ఆ సంగతి  నారదుని ద్వారా  హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. 


🌿వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ  ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, 


🌸ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.



🌿13 . రామకార్యం  చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?


🌸జ. మైనాకుని ఆతిథ్యం  స్వీకరించకుండా వెళ్ళడంలో.



🌿14 . సీతారాములు పట్టాభిషేక  అనంతరం  హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?


🌸జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన  అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని  బహుమతిగా  ఇచ్చాడు.



🌿15.  కపీశ అంటే అర్థం ఏమిటి?


🌸జ. కపీశ  అంటే...

a) కపులకు ఈశుడు

b) కపి రూపంలో ఉన్న ఈశుడు

సి) కం(జలం)  పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా  తేజస్వరూపుడు అని అర్థం.



🌿16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?


🌸జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు 



🌿17. హనుమ రామదూత ఎలా అయ్యాడు  ?


🌸జ. రాముని ఉంగరాన్ని దూతలా  వెళ్ళి  సీతమ్మ కు ఇచ్చాడు. వేదం  అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  

అగ్ని ముఖావై దేవాః. 

దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము.


🌿 అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు  దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం  అంటే  సృష్టి  క్రమంలో  ఆకాశం నుండి వాయువు వచ్చింది. 


🌸వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి  వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో  పోల్చారు.


🌿 అగ్ని ఏవిధంగా  అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను  పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు.


🌸 అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు  హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత  అని మాత్రమే కాదు.



🌿18 . అతులిత బలధామా  అంటే అర్థం ? ఒక ఉదాహరణ?


🌸జ. ఎవ్వరితో  పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే  సీతాన్వేషణ కై హనుమని  ఎంచుకోవడం.



🌿19 . ఇంతకూ  హనుమ కేసరి నందనుడా?  వాయు పుత్రుడా?


🌸జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు  సూర్య  నాడి ద్వారా  వాయుదేవుడు  సర్వ దేవతా తేజస్సు  ప్రవేశ  పెట్టాడు కాబట్టి  ఇద్దరికీ.



🌿20 . నామస్మరణ మహిమ ఏమిటి?


🌸జ. కలియుగంలో  తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం....స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మన పార్లమెంట్

 *మన పార్లమెంట్*                                                       కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని చూస్తే.. వావ్ అనుకోవాల్సిందే. ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం.. అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి.


కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం ఆరు ద్వారాలు ఉన్నాయి. వీటికి పెట్టిన పేర్లు చూస్తే..


1. గజ ద్వారం


2. అశ్వ ద్వారం


3. గరుడ ద్వారం


4. మకర ద్వారం


5. శార్దూల ద్వారం


6. హంస ద్వారం


'గజ ద్వారం' ప్రత్యేకత ఏమంటే.. పార్లమెంటు కొత్త భవనం ఉత్తరం వైపు ఉన్న ఈ ద్వారానికి బుద్ధి.. సంపద.. జ్ఞాపకశక్తి.. జ్ఞానానికి ప్రతీకగా చెప్పే గజరాజు పేరును దీనికి పెట్టారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం బుధగ్రహంతో సంబంధం ఉందని.. ఇది తెలివికి మూలమని విశ్వసిస్తారు. రెండో ద్వారం పేరు అశ్వ ద్వారం. గుర్రం పేరు మీద ఈ గుమ్మానికి పేరుపెట్టటమే కాదు.. దీనికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కారు. శక్తికి.. బలానికి.. ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాల్ని ఈ ద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు. మూడో ద్వారం పేరు గరుడ ద్వారం. శ్రీమహా విష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజుగా చెబుతారు. శక్తికి.. ధర్మానికి చిహ్నంగా గరుడను చెబుతారు. అనేక దేశాల చిహ్నాలపై గరుడ బొమ్మ ఉండటం తెలిసిందే. తూర్పు ద్వారంగా ఉండే గరుడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.


చేపను మకరంగా పిలవటం తెలిసిందే. మకరం వివిధ జీవుల కలయికగా పేర్కొంటారు. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు నిదర్శనంగా దీన్ని ఏర్పాటు చేశారు. పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు మకర ద్వారాన్ని ఏర్పాటు చేవారు. ఐదో ద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేవారు. దేశ ప్రజల శక్తిని సూచించేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఆరో ద్వారానికి హంస ద్వారమన్న పేరును పెట్టారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన.. మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.        *సేకరణ*

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *1*



ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.


ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.


రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే

జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్


ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


*ప్రథమాశ్వాసము*


అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు.


పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుంక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య, ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు.


సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి " జనమేజయా ! నీ తమ్ముళ్ళు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా ! యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి." అని పలికి అక్కడి నుడి వెళ్ళిపోయింది.


యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్థినాపురం పోయిన తరువాత ఒక రోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపక పోయినట్లైతే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి " మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి" అని ప్రార్థించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేసాడు.

కొత్త పార్లమెంటులో

 కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని చూస్తే.. వావ్ అనుకోవాల్సిందే. ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం.. అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి.


కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం ఆరు ద్వారాలు ఉన్నాయి. వీటికి పెట్టిన పేర్లు చూస్తే..


1. గజ ద్వారం


2. అశ్వ ద్వారం


3. గరుడ ద్వారం


4. మకర ద్వారం


5. శార్దూల ద్వారం


6. హంస ద్వారం


'గజ ద్వారం' ప్రత్యేకత ఏమంటే.. పార్లమెంటు కొత్త భవనం ఉత్తరం వైపు ఉన్న ఈ ద్వారానికి బుద్ధి.. సంపద.. జ్ఞాపకశక్తి.. జ్ఞానానికి ప్రతీకగా చెప్పే గజరాజు పేరును దీనికి పెట్టారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం బుధగ్రహంతో సంబంధం ఉందని.. ఇది తెలివికి మూలమని విశ్వసిస్తారు. రెండో ద్వారం పేరు అశ్వ ద్వారం. గుర్రం పేరు మీద ఈ గుమ్మానికి పేరుపెట్టటమే కాదు.. దీనికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కారు. శక్తికి.. బలానికి.. ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాల్ని ఈ ద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు. మూడో ద్వారం పేరు గరుడ ద్వారం. శ్రీమహా విష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజుగా చెబుతారు. శక్తికి.. ధర్మానికి చిహ్నంగా గరుడను చెబుతారు. అనేక దేశాల చిహ్నాలపై గరుడ బొమ్మ ఉండటం తెలిసిందే. తూర్పు ద్వారంగా ఉండే గరుడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.


చేపను మకరంగా పిలవటం తెలిసిందే. మకరం వివిధ జీవుల కలయికగా పేర్కొంటారు. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు నిదర్శనంగా దీన్ని ఏర్పాటు చేశారు. పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు మకర ద్వారాన్ని ఏర్పాటు చేవారు. ఐదో ద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేవారు. దేశ ప్రజల శక్తిని సూచించేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఆరో ద్వారానికి హంస ద్వారమన్న పేరును పెట్టారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన.. మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.

నవగ్రహ పురాణం - 60 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 60 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 3*



*"సంజ్ఞా!"* సూర్యుడి కంఠం ఆకాశంలో ఉరుములా ధ్వనించింది. పిలుపు మందిరమంతా ప్రతిధ్వనించింది.


ఛాయ లేచి ఆందోళనగా చూసింది. తండ్రిని చూడగానే , శనీ , సావర్ణి , తపతీ అసంకల్పితంగా తల్లి చాటుకు తప్పుకున్నారు..


*"యముణ్ణి శపిస్తావా ?”* సూర్యుడు ఛాయ దగ్గరగా నిలుచుని , ఆమె ముఖంలోకి , కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ఆయన శరీరంలోంచి భయంకరమైన వేడి చుట్టూ వ్యాపిస్తోంది. సూర్యుడి ఆగ్రహ జ్వాల తనని భస్మం చేసేస్తుందేమో అన్న భయంతో , ఛాయ అప్రయత్నంగా వెనుకకు జరిగింది.


*“నీ కుమారుణ్ణి శపిస్తావా ?”* సూర్యుడు హుంకరించాడు. *"తల్లికి తగిన ప్రవర్తనేనా ఇది ? నువ్వు... నువ్వు... తల్లివేనా ? చెప్పు !"*


ఛాయ వణుకుతూ ఆయన కళ్ళలోకి చూసింది. సూర్యుడి విశాల నేత్రాలు నిప్పులతో నిండిన బంగారు గిన్నెల్లా ఉన్నాయి. మహా ఆగ్రహజ్వాలలు ఆ కళ్ళల్లోంచి వెయ్యి కిరణాలుగా , వాడిగా , వేడిగా ఛాయ కళ్ళల్లోకి దూసుకుంటూ వెళ్ళాయి.


ఛాయ శరీరం చెమట బిందువులతో తడిసిపోతోంది. కళ్ళల్లో వేడిగా నీళ్ళు తిరుగుతున్నాయి. ఆమె శరీరం వణకసాగింది. *“నువ్వు తల్లివేనా ? తల్లివేనా ? తల్లివేనా ?"* సూర్యుడి అరుపు గుహలో సింహనాదంలాగా ఛాయ చెవుల్లో , ఆమె సర్వస్వంలో సుళ్ళు తిరిగింది.


అప్రయత్నంగా ఆమె పెదవులు కదిలాయి. *"నేను... నేను... ఆ ముగ్గురికీ తల్లిని... కాను...”*


*“సంజ్ఞా !”* సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం గంటలా మ్రోగింది.


*"నేను... నన్నేం చేయకండి..నేను.. నేను...సంజ్ఞాను కాను...”.*


*“సం.....జ్ఞా !"*


*"నేను ఛాయను ! సంజ్ఞా ఛాయను ! తన ఛాయ అయిన నాకు ప్రాణం పోసి , సంజ్ఞా ఇక్కడికి పంపింది...”*


సూర్యుడు తన ఆగ్రహాన్నీ , తననూ , సర్వస్వాన్నీ మరిచిపోయి , ఉప్పెనలా కప్పేసిన నిబిడాశ్చర్యంలో మునిగిపోయి వింటున్నాడు. ఆరుగురు పిల్లలూ బొమ్మల్లా నిల్చున్నారు. ఛాయ వణికే కంఠంతో చెప్పుకు పోతోంది.


*“నాన్నగారూ..."* అంటూ యమి సూర్యుడి దగ్గరకు వెళ్ళి , చేతుల్తో ఆయన్ని చుట్టింది. *“అమ్మ... ఇంక రాదా ?”*


కూతురి ప్రశ్నకు సమాధానంగా సూర్యుడి చేతులు యమిని అక్కున చేర్చుకున్నాయి. సూర్యుడి హృదయం జాలితో నిండుతోంది. ఇంత కాలమూ తను తన బిడ్డల్ని తల్లి కాని తల్లి రక్షణలో ఉంచి , క్షోభకు గురిచేశాడు ! తాను 'ఛాయా సౌఖ్యం' అనుభవించాడు, ఛాయతో ! ఆ దాంపత్యం యధార్థం కాదు , ఆ సుఖం యధార్థం కాదు !


*"నాన్నగారూ ! మాకు మా అమ్మ కావాలి !"* వైవస్వతుడూ , యముడూ ఒకేసారి అన్నారు.


సూర్యుడు తల వాల్చి కూతురి తల మీద ఆప్యాయంగా చుంబించాడు. ఆమెను నెమ్మదిగా కుమారుల వద్దకు జరిపాడు. ముగ్గుర్నీ తదేకంగా చూశాడు. *"మీ అమ్మను తీసుకొస్తాను ! బాధపడకండి ! భయపడకండి !"* అన్నాడు. ఆయన స్వరంలో నిర్ణయం స్పష్టంగా పలికింది.


సూర్యుడు ఛాయ మాటల ద్వారా తెలిసిన వివరాల ఆధారంగా అరణ్య ప్రాంతం చేరుకున్నాడు. వాతావరణం ప్రశాంతంగా , శాంతంగా ఉంది. ధర్మపత్ని సంజ్ఞా కోసం ఆయన హృదయం ఆరాటపడుతోంది.


ఛాయ , సంజ్ఞ కాదు అని తెలిసిన క్షణం నుంచి సంజ్ఞ పట్ల విరహజ్వాల ఆయనను దహించడం ప్రారంభించింది. తన స్వాభావిక తాపాన్ని మించిన తాపంగా మారింది. ఆ విరహతాపం.


ఆయన నేత్రాలు నిర్విరామంగా సంజ్ఞ కోసం ఆ అరణ్యంలో గాలిస్తున్నాయి. ఆయనలోని ప్రతి అణువూ సంజ్ఞ కోసం ఆరాటపడుతోంది. ఆయన సర్వస్వమూ మౌన భాషలో సంజ్ఞను పిలుస్తోంది.


అరణ్యంలో అర్ధాంగి కోసం ఆదిత్యుడి అన్వేషణ నిర్విరామంగా సాగుతోంది. మనోజ్ఞమైన కాననవాతావరణంలో రకరకాల జీవజంతువుల అరుపులు ఆయనకి వినిపిస్తున్నాయి. ఇంత ప్రశాంతమైన అరణ్యంలో తపస్సు చేస్తున్న ఏ తాపసీ కనిపించడం లేదు. ఆలోచిస్తూ సంచరిస్తున్న సూర్యుడి చెవులకు ఒక కొత్త శబ్దం వినిపించింది... గుర్రం సకిలింత !


సూర్యుడి పాదాలు అప్రయత్నంగా సకిలింత వినవచ్చిన వైపు కదిలాయి. చెట్లనూ , పొదలనూ , అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలనూ తప్పుకుంటూ సూర్యుడు వెళ్తున్నాడు. ఆయననే పిలుస్తున్నట్టు గుర్రం సకిలింత వినిపిస్తూనే ఉంది.


సూర్యుడు పొదలు దాటి , అప్రయత్నంగా ఆగి , చూశాడు. ఎదురుగా అందమైన సరోవరం. అటువైపు గట్టు మీద అందమైన పొదరిండ్లు , చెట్లు , గుబాళిస్తున్న పూల మొక్కలు , వాటి ముందు నిగనిగలాడుతున్న అందమైన గుర్రం !


తన సౌందర్యంతో దృష్టిని లాగి పట్టుతున్న శ్వేతాశ్వం ! తోక - సుందరాంగి వాలుజడలా అటూ ఇటూ సమ్మోహనకరంగా కదుల్తోంది. దాని శరీరం ఆరోగ్యంగా , పుష్టిగా మెరుస్తోంది. అది అశ్వరాజం కాదు ! ఆడ గుర్రం , బడబ ! అశ్వకాంత !


సూర్యుడు అసంకల్పితంగా ముందుకు కదిలాడు. గుర్రం ఉన్నట్టుండి చెవులు రిక్కించి , వెనుదిరిగింది. దాని ఎర్రటి కళ్ళు సూర్యుణ్ణి చూడగానే గుండ్రంగా పెద్దవిగా అయ్యాయి. తన వైపే చూస్తున్న ఆ కెంపుల్లాంటి కళ్ళలోకి చూస్తూ ఆగాడు సూర్యుడు.


ఎందుకో అశ్వకాంత శరీరం కొద్దిగా వణుకుతోంది. చెవులు రిక్కించుకునే ఉన్నాయి. గుండ్రటి కళ్ళు రెప్పపాటు మరిచిపోయి చూస్తున్నాయి. అందమైన శరీరాన్ని ఆవరించిన ఏదో స్పందన ఆ అశ్వకాంత కాళ్ళను చలింపజేస్తోంది. నాట్యం చేస్తున్నట్టు , రెండేసి కాళ్ళు ఒక్కసారి వంతున కదుల్తున్నాయి. ఆ కదలికలతో ఆ అశ్వకాంత తనువు సమ్మోహనకరంగా స్పందిస్తోంది. ఆ స్పందన హోయలు ఒలికే వగలాడి నడకను గుర్తుకు తెస్తోంది సూర్యుడికి.


సూర్యుణ్ణి చూస్తూ , వాలుజడలా వాలాన్ని ఊపుతూ , ఉన్న చోటనే కదం తొక్కుతూ కళ్ళకు విందుచేస్తోంది అశ్వకాంత ! అది అశ్వకాంత కాదు , అశ్వకామిని ! సూర్యుడి ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది...


ఆ అశ్వకామిని ఆయనలోని రక్తాన్ని ఉరకలెత్తిస్తోంది. తన వైపే చూస్తున్న ఆ కెంపుల కళ్ళల్లో ఆయనకు సంజ్ఞ నేత్రాలు గోచరిస్తున్నాయి. విశేషమైన చలనంతో - అశ్వకామిని తనకు ఏదో సంజ్ఞ చేస్తోంది. ఔను ! సంజ్ఞ - సంజ్ఞ చేస్తోంది ! అశ్వభాషలో తనను ఆహ్వానిస్తోంది.


సూర్యుడు ఏదో ఉద్రేకంతో ముందుకు కదిలాడు. మరుక్షణం అశ్వకాంత కళ్ళల్లో , శరీరంలో ప్రత్యక్షమైన బెదురు ఆయనను కదలకుండా చేసింది.


సూర్యుడు అశ్వభామినినే చూస్తూ , చిరునవ్వు నవ్వాడు. ఏకాగ్రతతో ఏదో సంకల్పించాడు. క్షణంలో సూర్యుడు అందమైన అశ్వరాజంగా మారిపోయాడు. యవ్వనంతో తొణికిసలాడుతున్న అందమైన మగ గుర్రాన్ని చూడగానే అశ్వకాంత ఉత్సాహంగా కదిలింది. పురుషాశ్వం కూడా అశ్వకాంత వైపు కదిలింది. అంతే ఉత్సాహంగా , కదం తొక్కుతున్నట్టు , అశ్వకాంత అశ్వకాంతుడి వైపు అడుగులు వేసింది. అశ్వకాంతుడు అశ్వకాంత వైపు అడుగులు వేశాడు.


'సంజ్ఞాశ్వ' 'సూర్యాశ్వం' వైపు వయ్యారంగా అడుగులు వేసింది ! 'సూర్యాశ్వం' సంజ్ఞాశ్వం వైపు ఠీవిగా అడుగులు వేశాడు.


అద్భుతమైన , అద్వితీయమైన అశ్వశక్తి ఆ ఇద్దర్నీ ఒకరి వద్దకు మరొకర్ని నడిపించింది. సూర్యాశ్వం సంజ్ఞాశ్వం ముఖం దగ్గరగా తన ముఖాన్ని వుంచి ఆఘ్రాణించింది.

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 32వ శ్లోకం* 


 *యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।* 

 *సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ।। 32*


 *ప్రతిపదార్థం* 


యదృచ్ఛయా — కోరుకోకుండానే; చ — మరియు; ఉపపన్నం — వచ్చిన; స్వర్గ — స్వర్గ లోకములు; ద్వారం — తలుపు; అపావృతం — తెరిచి ఉన్న; సుఖినః — సంతోషము; క్షత్రియాః — క్షత్రియ వీరులు; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; లభంతే — లభించును; యుద్దం — యుద్ధము; ఈదృశం — ఇటువంటి.


 *తాత్పర్యము* 


ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన, క్షత్రియులు అదృష్టవంతులు. ఇది వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

వినమృపూర్వక లేఖ

 🪴🪴🪴💥💥💥

*_9 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ‌ పాలనని విమర్శ చేసే కనీస అర్హత 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రేసుకి ఉందా ???_*

 

*_ఒక సాధారణ పౌరుడి వినమృపూర్వక లేఖ మరియూ విన్నపం_* 


*_1947 తరువాత దాదాపు 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెసు పార్టీ , ఆ సమయంలో మనకంటే అధమస్తితిలో ఉన్న దేశాలు సైతం ఎప్పుడో అభివృద్ధిలోకి అడుగేసి భారతదేశాన్ని దాటేస్తే మరి అన్ని రోజులు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏమి చేసినట్టు ?  గుడ్డి గుర్రాలకు పండ్లు తోమిర్రా ! 8 సంవత్సరాలు కూడా నిండని బిజేపీ అధికారాన్ని ప్రశ్నించే మీరు 54 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఎందుకుంది అని ప్రశ్నించుకోరేం ?_*


*_మత రాజకీయాలకు పునాదులు వేసిన మీరు_* 

*_తమ సొంత వారి హిందూ అస్తిత్వాల కోసం పోరాడే బిజేపీని మతతత్వ పార్టీ అనడం హాస్యస్పదంగా లేదా ?_*


*_అంబానీ అదానీలు ఈ ఎనిమిది సంవత్సరాలలోనే ఎదిగారా ?  వారు అత్యధికంగా అభివృద్ధి చెందుతానికి భీజం వేసింది , విజయ్ మాల్యా లాంటి బ్యాంక్రప్ట్స్ కి అప్పులిచ్చింది కాంగ్రెసు ప్రభుత్వంలోనే కదా , రేచీకటి వ్యాధి ఎమైనా ఉందా , లేక అధికారం కోసం ఒక అబద్దాన్ని పదే పదే చెప్తూ దేశప్రజలని మోసం చేస్తున్నారా_* 


*_బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్  లేకుండా దేశం నడిబొడ్డున జెండా ఎగరెయ్యలేని భయానక పరీస్తితి నుండి  సగర్వంగా ధైర్యంగా మన దేశంలో జెండా ఎగరేసే స్థాయికి వచ్చింది మీరు చూడ్డం లేదా ? అర్దం అవ్వడం లేదా ,ఒప్పుకోలేక పోతున్నార ?_*


*_మీ హాయంలలో జరిగిన ఉగ్రవాద దాడులు_* 

*_దేశ ప్రజలు ఎదుర్కున్న కల్లోల పరీస్తితులు తెలియవా ,_* *_మర్చిపోయారా , 1980 లో జరిగిన మండై_* *_ఊచకోతల మొదలు 2013 హైదరాబాదు లో_* *_జరిగిన లుంబిని గోకుల్ చాట్ దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టుల దాక ఆ తర్వాత జరిగిన_* 

*_బెంగుళూరు బాంబు దాడి ,బోధ్ గయా ,పాట్నా జలపైగురి బ్లాస్ట్స్ వరకు ఎంత రక్తపాతం అయ్యి దేశం అల్లకల్లోలం అయ్యి ఉందో మీకు తెల్సిందే కదా  ?_* 


*_భయంకరమైన హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ తీసుకొచ్చింది మీరు కాదా ?_*

*_ఈ దేశపు విధ్యా వ్యవస్థలో మొత్తం మనల్ని కొల్లగొట్టిన వారి చరిత్రలే చదివించింది మీరు కాదా ,_* *_విధ్యా వ్యవస్థ నిర్విర్యం చేసి స్కిల్డ్ మరియూ ఉత్సాహం కలిగిన యువకులని దేశం విడిచేలా చేసింది మీరు కాదా_* 

*_మీ వల్ల ఈ దేశానికి ఏ చెడు జరగలేదో చెప్పండి !_* 

*_అత్యంత ఎక్కువ కాలం పాలించింది ఆ కుటుంబమే_* 

*_అత్యధిక బాంబు దాడులు మీ హాయంలోనే_*

*_అత్యధిక నల్లడబ్బు దేశాలు దాటింది మీ హాయంలోనే_* 

*_అత్యధిక స్కాములు_* *_జరిగింది మీ హాయంలోనే_* 

*_అత్యంత అవినీతి_* *_జరిగినది మీ హాయంలోనే_* 

*_అత్యధిక అశాంతిగా ఉన్నది మీ హాయంలోనే_* 

*_అత్యంత వెనుకబడిన తనంగా ఉంది మీ_* *_హాయంలోనే_* 

*_అత్యంత పేదరికాన్ని_* *_పెంచింది మీ హాయంలోనే_* 

*_అత్యంత అక్షరాస్యత తక్కువ మీ హాయంలోనే_* 

*_అత్యంత క్రైం రేట్ మీ హాయంలోనే_*

*_అత్యంత ఇంధన ధరలు పెరిగింది మీ హాయంలోనే_* 

*_అత్యంత అప్పుల్లో_* *_కూరుకుపోయింది మీ హాయంలోనే_* 

*_అత్యంత హిందువులపై దాడులు జరిగినది మీ హాయంలోనే_* 

*_అత్యంత ఎక్కువ రాజకీయ నాయకులు సంపాదించుకుంది మీ హాయంలోనే ఇవ్వన్ని గణాంకాలతో నెట్టింట్లో ఉన్నవి_* 


*_ఇదే 54 సంవత్సరాలలో  అత్యంత దుర్బంగా ఉన్న జపాన్_* 

*_(1946–1954), the high increase (1955–1972), the steady increase (1972–1992) అంటూ_* *_దేశాన్ని  అభివృద్ధి చెందిన దేశంగా_* *_ఇప్పుడు ప్రఖ్యాత దేశాల సరసన సగర్వంగా ఉంది_* 

*_మీరు పాలన మొదలెట్టిన కొత్తలోనే_* *_ఇజ్రాయెల్ దేశం చుట్టూ యమకింకరులతో_* *_సహవాసం చేస్తూ_* *_కూడా , సంవత్సరానికి ఒక సారి యుద్దం చేస్తూ_* *_కూడా అభివృద్ధి చెందిన జాబితాలో ఉండి_* *_శక్తివంతమైన దేశంగా పెర్కొనబడుతుంది_* 

*_1965 లో పుట్టిన_* *_సింగపూర్ కూడా_* *_అభివృద్ధి చెందిన దేశమే_* 

*_ఇంకెన్నో దేశాలు_* 


*_కానీ ఇన్ని సంవత్సరాలు పాలించిన మీరు దేశాన్ని ఇంకా_*

 *_" అభివృద్ధి చెందుతున్న " దేశంగానే ఉంచి 8 సంవత్సరాల పాలనని హేళన చేస్తూ , విమర్శలు చేస్తుంటే మీ అంతరాత్మ ఎలా ప్రాణాలతో బ్రతికుంటుంది ?_*


*_నిన్నా మొన్న కూడా మేము అధికారంలోకి వస్తే  ఆర్టికల్ 370_* 

*_తీసేస్తాం అన్నాడు ఒక కాంగ్రెసు నాయకుడు !_*

*_అసలు ఆర్టికల్ 370 ఎంటోకూడా_* *_తెల్సినట్టులేదు సదరు పెద్దమనిషికి , ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎంట్రా చదువుకున్నావా లేదా అని అడిగేవాడు లేకే కదా ఆ అహంకారపు_* *_మాటలు ,అదే విధంగా ఆర్టికల్ 35 A కూడా_* 

*_వాటివలన ఎవరికి ఏ నష్టం లేదు దేశమంతటా ఒకే రాజ్యాంగం ఇదే గౌ శ్రీ అంబేడ్కర్ గారు కోరుకున్నది కూడా !_* 


*_ఇంకా ఎన్ని రోజులు మీ స్వార్ద ప్రయోజనాల కోసం దేశాన్ని వాడుకుంటారు ,_* *_ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాల_* 

*_దేశ సంపదని సర్వనాశనం చేసిన_*

*_మీ చెత్తని 8_* *_సంవత్సరాలలో శుద్ధి చెయ్యాలంటే ఎంత కష్టం ?_*  *_దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో మీ సంతోషాల కోసం విమానాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తిరుగుతూనే_* *_ఉన్నాయి కదా , మీ పుట్టిన రోజు వేడుకలకి_* *_యుద్ద నౌకలని_* *_వాడుకున్న ఘనమైన చరిత్ర లేదా_* 

*_మహాప్రభో_* 

*_దయచేసి మమ్మల్ని మా దేశాన్ని దయచేసి అభివృద్ధి చెందనివ్వండి ,_* *_మళ్లీ మీ కుటుంబ పాల‌న రక్కసి కోరల్లో చిక్కుకోవాలని_* *_లేదు , ఆ ఉగ్రవాద దాడుల భయంతో బ్రతకాలని లేదు_* 

*_మీరు ఈ దేశానికి చేసే అతిపెద్ద గొప్ప సేవ ఇదొక్కట్టే_* 

*_దయచేసి మమ్మల్ని వదిలేయ్యండి ,మిమ్మల్ని ఆజన్మాంతం స్మరిస్తాము  ,_* *_ఒకే కుటుంబం చేతుల్లో స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ బానిస బ్రతుకులు బ్రతకలేము ,_*

*_మేము అభివృద్ధి చెందుతాము ,మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వండి_*   🙏🙏🙏

*_ఒక సాధారణ ఓటరు , సాధారణ దేశ పౌరుడు_*

రామాయణమ్ 331

 రామాయణమ్ 331

...

లంకానగర దక్షిణద్వారము వద్ద లక్షమంది యోధులు, పశ్చిమద్వారము వద్ద పది లక్షల సైనికులు,ఉత్తరద్వారమువద్ద కోటి మంది భటులు,తూరుపు ద్వారము వద్ద పదివేల మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు.

.

నేను నాలుగు వంతెనలను,ప్రాకారములను మహావీరులైన రాక్షస సైన్యములో ఒక భాగమును నశింపచేసితిని.

.

మనము ,మన సైన్యము సముద్రము ఏదోవిధముగా దాటినచో లంక నాశనమైనట్లే !

.

అయినా ! రామచంద్రా సైన్యమెందులకు ?

.

నేను ,పనసుడు,అంగదుడు,మైందుడు ,ద్వివిదుడు,జాంబవంతుడు,

అనలుడు,నీలుడు ...మేము అందరమూ ఆకాశమార్గాన వెళ్ళి లంకను నాశనము చేసి సీతమ్మను తీసుకొని రాగలము అని హనుమంతుడు పలికిన మాటలు విని రాముడు ఇట్లనెను.

.

సుగ్రీవా ఇదే తగిన మూహూర్తము ఈ ముహూర్తము పేరు విజయము !

.

ఇప్పుడే బయలు దేరెదము ! సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నాడు! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము ! సకలసైన్యములనూ బయలుదేరదీయుము.

.

శకునములన్నియు అనుకూలముగా యున్నవి అని రాముడు అనగానే సుగ్రీవుడు అందులకు అంగీకరించెను .

.

ముందుగా ఒక లక్షసైన్యము బయలు దేరవలే ! ఆ సైన్యము మార్గమును సుగమము చేయుచూ వెడలును దానికి నీలుడు నాయకత్వము వహించును.

.

నీలా నీవు వెంటనే బయలుదేరుము మన మార్గములో కల ఆహారములు,జలములు ,ఫలములు,మూలములు రాక్షసులు కలుషితములు ,విషపూరితములు చేసిన చేయవచ్చును ! కావున వాటిని సంరక్షిస్తూ యుండుట నీవు నీసైన్యము చేయవలెను.

.

శత్రుసైనికులు ,గూఢచారులు ఎవరైనా ఉన్నారో లేదో గమనిస్తూ యుండ వలెను.

.

బలహీనులైన వారంతా కిష్కింధలోనే యుండిపోండి ! మనము చేయుకార్యము చాలా క్లిష్టమైనది !

.

జట్లు,జట్లుగా సైన్యమును నడిపించవలే అందులకు గాను  గజ,గవయ,గవాక్షులు పూనుకొనవలె.

.

సమస్త సైన్యమునకు గంధమాధనుడు ఎడమవైపు ఉండి రక్షించవలె! 

.

నేను హనుమంతునిమీద ఎక్కి ప్రయాణించెదను ,లక్ష్మణుని అంగదుడు తీసుకు రాగలడు .

.

సేన మధ్యభాగములో నేను ఉండెదను.

.

జాంబవంతుడు ,సుషేణుడు సేన మధ్యభాగమును రక్షించ గలరు.

.

అనుచూ సమస్త సైన్యము ఏ విధముగా ప్రయాణము చేయవలెనో రాముడు చెప్పగా అందుకు తగినట్లు సుగ్రీవుడు అందరినీ ఆజ్ఞాపించెను.

.

ఆ వెంటనే  వానర సైన్యమంతా గుహలనుండి ,శిఖరములనుండి లేచి ఒక్క సారిగా గాలిలోకి పైకి ఎగిరిరి.

.

ఆ వానర సేన అంతా రాముని అనుసరించి ఉత్సాహముగా బయలుదేరిరి.

.

వూటుకూరు జానకిరామారావు

బసవ పురాణం - 35 వ భాగము..

 🎻🌹🙏బసవ పురాణం - 35 వ భాగము....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸బిజ్జలునికి అది తెలిసి దిగ్భ్రాంతి చెంది బాచయ్యకు శరణు చేసి ఆ లింగానికి సోమేశ్వరుడని పేరు పెట్టి సువర్ణ మందిరం కట్టించాడు.


🌷అరియమ కథ


🌿అన్యదైవముల పేరు వినకపోవడం అరియమ అనే భక్తుని నియమం. ఒకానొడక బ్రాహ్మణుడు రుద్రం చదువుతూ వచ్చి అరియమ ఇంటిముందు నిలిచి అన్యదైవనామం ఉచ్ఛరించాడు. 


🌸అది విని అరియమ బ్రాహ్మణుణ్ణి చంపాడు. రాజుకిది తెలిసి కోపించి ఉరిశిక్ష వేశాడు. అరియమ పోతూ పోతూ దారిలోని శివాలయంలోని శివలింగంలో లీనమైనాడు. 


🌿అందుకు చిహ్నంగా నేటికీ లింగం నుండి అరియమ కట్టుకున్న మూరెడు వస్త్రం బయటికి వచ్చి మిగిలిపోయింది కనిపిస్తూ ఉంటుంది.


🌷వీర శంకరుని కథ


🌸పరదైవములను చూడననే నియమం కల దీక్షతో వీరశంకరుడనే శివభక్తుడు ఉండేవాడు. ఒకనాడు కలలో బౌద్ధుడొకడు కనిపించగా కలయో? 


🌿ఇలయో పరమతస్థుడు కనిపించాడని దుఃఖించి వీర శంకరుడు శ్రీశైలం పోయి హాటకేశ్వరుని ముందు మండే పెనంపై కూర్చొని ప్రాణత్యాగం చేసి సాయుజ్యం పొందాడు.


🌷శివలెంక మంచయ్యగారి కథ


🌸శివలెంక మంచయ్య అనే భక్తుడు కాశిలో శివునికి ప్రతిదినమూ తన చేతివేళ్ళు పదీ అర్పించి పూజించి తిరిగి వేళ్ళు పొందేవాడు. ఒకనాడు అన్యమతస్థులు వచ్చి వాదింపగా మంచయ్య గెలిచాడు. 


🌿మాకు వాదాలు కాదు. దృష్టాంతం చూపించాలి అని వారు కోరగా మంచయ్య రమ్మని పిలువగానే విష్ణువు వచ్చి విశే్వశ్వరునకు ప్రణామం చేశాడు.


🌷కల్లిదేవయ్యగారి కథ


🌸బ్రాహ్మణులొకసారి వాదానికి వస్తే కల్లి దేవయ్య శివుడే పరదైవమని వాదించి ‘మీ మీ వేదాలు మా ఇంటి కుక్కలు కూడా చదువుతాయి’అని కుక్కతో నాలుగు వేదాలూ చదివించాడు.


🌷బిబ్బ బాచయ్య గారి కథ


🌿గొబ్బూరు అగ్రహారంలో బిబ్బ బాచయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు భక్తుల ప్రసాదం బండ్లకెత్తించి ఆడుతూ పాడుతూ ఆరగింపు చేసేవాడు. 


🌸ఒకనాడు ప్రసాదపు బండి ఎదురు వస్తుంటే బ్రాహ్మణులు ఆపి ‘అవి ఏమిటి ఎంగిలి కూడు అగ్రహారంలో బండి కదలడానికి వీలులేదు’ అని నిందించారు. బాచయ్య నవ్వాడు. 


🌿బండిలోని అన్నం అగ్నిగా మారి అగ్రహారం అంటుకుంది. బ్రాహ్మణులు ఏడుస్తూ బాచయ్యకు శరణు చేశారు. బాచయ్య అనుగ్రహించాడు. అగ్ని శాంతించి గృహాలు ఎప్పటివలెనే ఉన్నాయి.


మాదర దూడయ్యగారి కథ


🌸మాదర దూడయ్యగారనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మజ్జనం చేసిన జలముతో పొర్లితే ఒక బ్రాహ్మణునికి ఎక్కడా నయంకాని కుష్ఠువు నయమైంది.


🌷బాసన భీమయ్య కథ


🌿రోగులైన బ్రాహ్మణులందరికీ శరీరాలు బాగుచేసిన మహాభక్తుడు.


🌷శ్వపచయ్య కథ


🌸శ్వపచయ్య అనే శివభక్తుడు ప్రసాదాన్ని భుజిస్తూ సామవేది అనే బ్రాహ్మణుని కండ్లబడగా మూసివేశాడు. ‘ఓరోరి! మాంసం తింటూ దాచుకున్నావా?’ 


🌿అని సామవేది నిందింపబోగా ఆయన గుడ్డలు శ్వపచయ్య ముందు పడిపోయాయి. సామవేది శ్వపచయ్యకు మొక్కి శివదీక్ష స్వీకరించాడు.


🌷ఉద్భటుని కథ


🌸బల్లకి అనే పురంలో ఉద్భటుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన నగర ప్రభులైన భోజునికి గురువు. ఉద్భటుడు లింగైక్యం చెందగా శరీరాన్ని దహనానికి తీసుకొనిపోయారు. 


🌿ఆ దహన ధూమం సోకి చెట్టుపైనున్న ఏడువందల భూతాలు విముక్తి చెందాయి.ఆహారానికి పోయిన ఒక భూతం ఆలస్యంగా వచ్చి ‘అయ్యో! నా గతి ఏమిటి? 


🌸పనె్నండు వేల సంవత్సరాలనంచి రుూ ఉద్భటుని కోసం ఎదురు చూస్తున్నాము శాపగ్రస్తులమై’ అని దుఃఖిస్తే గంధపు చెక్కలు వేసి నేతిలో గుడ్డలు మంచివేసి మళ్లీ ఉద్భటుని చితిపై పొగను రప్పించగా అది సోకి 


🌿ఆ భూతం శాపవిముక్తి చెంది మర్రి చెట్టును కూడా పీక్కొని బంధుమిత్ర సహితంగా కైలాసానికి పోయింది.

కక్కయ్య కథ శివనింద చేసిన విప్రుని సంహరించాడు...సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

వినాయక చవితి సందేశాలు సందేశం - 6/11

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

             


     -----------------------     


                                  సందేశం - 6/11 


వినాయకుడూ - విష్ణువూ ఒకరేనా!


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం

                              చతుర్భుజమ్ I 

ప్రసన్నవదనం ధ్యాయేత్ 

               సర్వవిఘ్నోపశాంతయే ॥


    ఇది అందఱమూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.


       ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,


* శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు, 

* శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు, 

* చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు, 

* ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు, 

* విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు, 

* సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

     అయిన "వినాయకు"ని 

* ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను. 

      అని అర్థం.


 2. విష్ణువుకి  సంబంధింది కాదుకదా! 

   ----------------------- 

         ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

         ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.

         మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి అన్వయం 


* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

   నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

    ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు. 


    ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

    ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)


* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

   ( విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )

* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

   కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

   అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

    విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"

* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.


గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో  మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

    కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ  - శ్రీకృష్ణ.

   "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు". 


* ప్రసన్న వదనం

    భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 ( చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)

* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 

* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


    పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. 

    ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు.    

    శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు  అవతారమే 

                            - బ్రహ్మ వైవర్త పురాణం 



            వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని  "లక్ష్మీ గణపతి"  విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.


                    =x=x=x=


    — రామాయణం శర్మ

             భద్రాచలం

ప్రధానమంత్రి

 ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు

 *నెహ్రూ* దీనిని నిరూపించారు.


ఒక పేదవాడు కూడా ప్రధాన మంత్రి కాగలడు

 *లాల్ బహదూర్ శాస్త్రి జీ* దీనిని నిరూపించారు.


 వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు

 *మొరార్జీ దేశాయ్* దీనిని నిరూపించారు.


ఒక యువకుడు ప్రధాని కాగలడు

 *రాజీవ్ గాంధీ* దీనిని నిరూపించారు.


 ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు

ఇది *ఇందిరా గాంధీ* గారు నిరూపించారు.


 నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు

 *చరణ్ సింగ్* నిరూపించాడు.


 రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు *V.P.  సింగ్ గారు* నిరూపించాడు.


విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు

 దీనిని *పి.వి.నరసింహారావు గారు* నిరూపించారు.


 కవి ప్రధాని కాగలడు

 *అటల్ బిహారీ వాజ్‌పేయి గారు* దీనిని నిరూపించారు.


ఎవరైనా ప్రధాని కావచ్చు

ఇది *HD దేవెగౌడ* గారు నిరూపించారు.


 దేశానికి ప్రధాని అవసరం లేదు *డాక్టర్ మన్మోహన్ సింగ్* నిరూపించారు.


 ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు

 *సోనియా గాంధీ* దీనిని నిరూపించారు.


 *కానీ ఒక టీ అమ్మేవాడు కూడా ప్రధానమంత్రి కాగలడు* మరియు *వీరందరి కంటే మెరుగైన పని చేయగలడు* మరియు *భరతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు* అని *నరేంద్ర మోదీ జీ* నిరూపించారు.


ఈ రోజు ప్రపంచం లోని కొన్ని దేశాలు, మన దేశం లో ఉన్న చాలా మంది ఒక వ్యక్తిని గద్దె దించడానికి కుయుక్తులు పన్నడం లో నిమగ్నమై ఉన్నారు.



*కొంచెం ఆలోచించు...*


*అమెరికా, చైనా లాంటి దేశాల మెడలు వంచగలిగే మొనగాడు, గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బల్లెం లా ఉండే పాకిస్థాన్ ను ఈ రోజు ఆకలి కేకలతో అలమటిస్తూ అడక్కుతినే స్థాయికి దిగజార్చిన మొనగాడు మోడీ*

కాబట్టి, మిత్రులారా  అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దగలడు!


 *"మన దేశానికి మోడీ అవసరం"*


 "నేను ఉచితంగా ఆహారం ఇస్తాను" - *రాహుల్ గాంధీ*


 "నేను ఉచితంగా నీరు ఇస్తాను" - *కేజ్రీవాల్*


*"నేను ఉచితంగా భోజనం ఇవ్వను, నేను నీరు కూడా ఉచితంగా ఇవ్వను నేను చాలా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనుకుంటున్నాను, భారతదేశంలోని యువతను క్రియాశీలురు గా చేస్తాను, తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ స్వశక్తి తో  కడుపు నింపుకుంటారు మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలరు" - నరేంద్ర మోదీ*


 *సమస్య కేజ్రీవాల్‌లోనో, రాహుల్ లోనో లేదు, ఉచిత సామాగ్రి లభిస్తే లాడెన్‌కు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ ప్రజలలో ఉంది.* 

           

*మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపండి. త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది.*



 *జై హింద్....జై భారత్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Veenaa by Himaja


 

హిందువులను


 హిందువులను ముస్లింస్ ఎంత ఈజీ గా మోసం చేసారో చూడండి.... ఇప్పటికే అదే మోసం లో బ్రతకుతున్నారు కొందరు... ఎంత చెప్పిన కొందరు వినట్లేదు,, అర్థం చేసుకోవట్లేదు,,,మారట్లేదు.... డైరెక్ట్ దర్గా ఉంటే హిందువులు రారని దానికి ఒక రూపు తీసుకొచ్చి ఒక విగ్రహం లాగా తయారు చేసి మంచిగా హిందువులని మోసం చేసారు.... మీకు తెల్సిన వాళ్ళు or మీ బంధువులు ఎవరైనా 70,80,90 సంవత్సరాల ముసలి వాళ్ళు ఉంటే అడగండి మీ చిన్నప్పుడు సాయి ఉన్నాడా అని కత్చితంగా లేదు అని మేం ఎప్పుడు విన్లే అనే చెప్తారు..... ఇప్పటికి ఇంకా మోసపోతే ఎవరు ఎం చేయలేరు....

ప్రథమ కర్తవ్యం

 సంధ్యావందనం చేయడం బ్రహ్మణుడిగా మన ప్రథమ కర్తవ్యం. సంధ్యావందనం చేయకుండా ఏ పూజ నోము వ్రతము ఆబ్దికం చేయడానికి అర్హత ఉండదు. ఇప్పటికి సంధ్యావందనం చేయకుండా ఉన్నా యెడల  మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్టర్ చేరుకొంది. Online లో ఉచితంగా సంధ్యావంద అభ్యాసన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

www.sandhyavandanam.org

అక్టోబర్ 2023 "శ్రీ గాయత్రి" సంచికలో

 అక్టోబర్ 2023 "శ్రీ గాయత్రి" సంచికలో రెండు ప్రత్యేక వ్యాసాలు "సనాతన ధర్మం (శ్రీ గాయత్రి డెస్క్) "; " కిడాంబి వేణుగోపాలన్ గారి సనాతన ధర్మం-అత్యంత పురాతనం" అనేవి ప్రచురించబడుతున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటో అవగాహన అవుతుంది. మన హైదవం లో సనాతనం అంటే నిత్య జీవితమే. మనం ఆచరించే ఆచార వ్యవహారాలు అన్నీ అందులోనివే. ఈ విషయంలో అనుమానం ఉండకూడదు. పత్రిక రాగానే తప్పనిసరిగా చదవాలి. పై వ్యాసాలె కాకుండా ఇంకా తెలుసుకోవాలసింది ఎంతయినా ఉండవచ్చు. మన శ్రీ గాయత్రి రైటర్స్ నుంచి సనాతన ధర్మం మీద వ్యాసాలు ఆపేక్షితం. పూర్తి వ్యాసం కాకపోతే బాక్స్ అయిటమ్స్ కూడా పంపవచ్చు. ప్రతీ నెలా 10 వ తారీఖు లోగా పంపగలరు.                                                                                                                                                                      మన సర్వే (Survey) ప్రకారం, పెద్ద పెద్ద వ్యాసాలు ఎవరూ చదవక విడిచి (skip) పెడుతున్నారు. WhatsApp లో కూడా ఇదే పరిస్థితి. ఇదివరలో చాలా సార్లు చెప్పడం జరిగింది. పూర్తి వ్యాసం 5-6 పేజీలు దాటకుండా పంపండి. ప్రత్యేక పరిస్తితులలో  8 పేజీలు ఉండవచ్చు. 8 పేజీలు దాటితే, రెండు భాగాలుగా వేయవలసి ఉంటుంది. గమనించ గలరు. ఆధ్యాత్మిక - జ్యోతిష విషయాలలో బాక్స్ అయిటమ్స్ కూడా మీ నుంచి ఆపేక్షితం. ఒక పేజీలో 3/4,  1/2, 1/4 వంతు బాక్స్ అయిటంగా వేస్తాము. అందరూ పత్రిక చదివిన వెంటనే స్పందన కూడా పంపితే మీ పేరు, ఫోన్ నంబర్ తో ప్రచురిస్తాము. అక్టోబర్ 2023 సంచిక విషయ సూచిక (Index) ఈ నెల 28 న తెలిగియ చేస్తాము. 30 న పత్రిక విడుదల. .. .. ..  మీ,     డా. వి. యన్. శాస్త్రి - మానేజింగ్ ఎడిటర్.

Santana Dharma

 *Santana Dharmas inroads into the world*


Nearly 177 countries have signed up for International Yoga Day and 2 billion people practice yoga across the world (as per UN statistics). Yoga is an integral part of Sanatana Dharma. Such yoga practice only is unifying one fourth of the world population under a common platform by whatever name you call it, be it Sanatana Dharma or anything else.    


In fact, Christians in the West seems to have rejected Church warnings that yoga is satanic. In the United States alone, about 10 per cent of the population practices yoga regularly. In the YMCA where people go for fitness classes, almost all non-Hindu members start and end their yoga practice with ‘OM’ and Namaste. Almost every other class they offer is related to yoga and meditation. They even had a ‘Yoga Day’ a few years ago that included bhajans.  


Late Steve Jobs, the founder of Apple, who is considered the greatest inventor of the last century, states in his biography how an autobiography of a Yogi with minute details of Sanatana Dharma  is his most revered book which he had to read at least once a year to be motivated and inspired. He carried it on his iPad until his last moments. Not only that, before he died of cancer, he had arranged to buy 500 copies of the book and be given as a special gift with a personal message to every single top executive of many multi-billion dollar companies who would attend his funeral.  


It's not a surprise that J Robert Oppenheimer and many quantum physicists such as Heisenberg, Bohr and Schrodinger, all winners of the Nobel Prize in Quantum Physics, carried the book of Vedanta or BhagavadGita in one hand and physics in the other. In fact, Oppenheimer, who led the famous Manhattan Project that built the first atomic bomb, spontaneously chanted the verses from the 11th chapter of Gita when he saw the massive ball of fire after the bomb exploded in the New Mexican desert to test it. This poor man spent so much time of his life learning Sanskrit and attributed his deep insights to the Gita and the teachings of Sanatana Dharma.  


CERN institute near Geneva, where the topmost scientists in the world are today, with 23 member states, building the most sophisticated and advanced collider has an imposing statue of Nataraja, the lord of dance of the universe, right on its premises.  


14 top German universities are teaching Sanskrit and European universities are not able to keep up with the demand.  


Late Joseph Campbell, who is the most well-known mythologist of the last century and who inspired the famous Star Wars series, expresses Sanatana Dharma in the widely popular ‘Power of Myth’ series. This multi-part series was in fact filmed in the home of George Lucas who produced the Star Wars series. He as a university student quit the university because it did not offer Sanskrit. All his life he was a great follower of Upanishads.


Carl Sagan, the well- known astrophysicist who created the Cosmos series, says the secrets of the universe are hidden in the Hindu scriptures. This series was seen by 50 crore people in 60 different countries! He praised the Nasadiya Suktam, the seven ‘hymns of creation’ in Rig Veda as the most sophisticated analysis of the origin of the universe.


The spiritual teachers of the Christian world today, such as Eckhart Tolle, Mike Singer, Wayne Dyer, Stephen Wolpert (Ram Dass) and many others who have hundreds of millions of followers in the Christian world, all across the globe, are also deep believers of Hinduism and Buddhism teachings. They are bypassing the Church to explain Jesus’ teachings based on the teachings of Krishna and Buddha.


When Oprah Winfrey had a show with Echart Tolle, 3.5 crore followers across the world watched or downloaded it. His books are translated into 33 languages across the world and they are bestsellers. There is even an article in Newsweek in 2009 by Lisa Miller ‘We (Christians ) are all Hindus now’ and the Harvard Pluralism project talks about how Hindu concepts have deeply seeped into this nation (US).  


It is through Sanatana Dharma that most advanced inventions have been made to the world — the concept of zero, plastic surgery, gravity, chess, the Chakras, the Ayurveda, the martial arts that Chinese/Japanese follow, the binomials, etc — and that it led to most prosperous civilisation with 25-30 per cent of world GDP for millennia until the 1700s, when the British plundered $45 trillion and murdered more than 100 million in just three or four decades alone.


Gandhi said “Stop all conversions in India, it is the deadliest poison that ever sapped the fountain of truth.” If he had power, he added, he would legislate to stop all conversions in India. Ambedkar said that conversion is a denationalisation.


So colonial rule and the mass conversions have had their effect on the basic Indian trait of Sanatana Dharma but it has risen again like Phoenix from Ashes and started reverberating in the whole world now.

గృహస్థాశ్రమం


ಸುಭಾಷಿತ . 629 .


ಈಹಂತೇ ಸರ್ವಭೂತಾನಿ ತದಿದಂ ಕರ್ಮಸಂಜ್ಞಿತಂ | ಸಿದ್ಧಿಕ್ಷೇತ್ರಮಿದಂ ಪುಣ್ಯಮಯಮೇವಾಶ್ರಮೋ ಮಹಾನ್ || 


ಸಕಲ ಪ್ರಾಣಿಗಳೂ ಕರ್ಮಪ್ರಧಾನವಾದ ಗಗಹಸ್ಥಾಶ್ರಮವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡಿವೆ . ಇದು ಪುಣ್ಯಕರವಾದ ಸಿದ್ಧಿಕ್ಷೇತ್ರ . ಈ ಗೃಹಸ್ಥಾಶ್ರಮವೇ ದೊಡ್ಡದು . 


ಭಾರತಮಂಜರೀ .

: సకల జీవరాసులు కర్మ ప్రధాన మైన గృహస్థాశ్రమమును ఆశ్రయించి ఉన్నాయి. గృహస్థాశ్రమం పుణ్యకరమైన సిద్ధిక్షేత్రం మరియు ఉత్తమమైనది

నవగ్రహా పురాణం🪐* . *32వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *32వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 3*


*"ఆ సుముహూర్తాన్ని - మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !"* ఇంద్రుడు సవినయంగా అన్నాడు.


అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది. ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్లి అక్కడ తన విధుల్ని నిర్వహిస్తున్నాడు బృహస్పతి.


ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంటబెట్టుకుని , చతుర్ముఖ బ్రహ్మ సన్నిధికి వెళ్ళాడు. బృహస్పతిని దేవతల గురువుగా బ్రహ్మకు పరిచయం చేశాడు. 


*"మా గురుదేవుల వివాహం సంకల్పించారు. వారి జననీజనకులు. తగిన స్త్రీ రత్నాన్ని తమరే సూచించాలి"* అంటూ ఇంద్రుడు బ్రహ్మను ప్రార్ధించాడు.


బ్రహ్మ బృహస్పతిని తదేకంగా చూశాడు. *"బృహస్పతి చక్కని దేహసౌందర్యం , వర్ఛస్సూ కలిగిన వాడు. అతనికి తగిన అందగత్తె లభించాలి..."* అంటూ బ్రహ్మ. అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడయ్యాడు..


ఇంద్రుడూ , బృహస్పతీ , ఆశ్చర్యంగా ఆయనవైపే చూస్తూన్నారు. బ్రహ్మ రెప్పలు పైకెత్తి బృహస్పతి వైపు చూశాడు.


*"తార అనే జవ్వని తగిన పెనిమిటి కోసం తపస్సు చేస్తోంది. ఆమె జగదేక సుందరి ! కాలం మీ ఇద్దర్నీ కలుపుతుంది. ఆ తారను ధర్మపత్నిగా స్వీకరించు !"* బ్రహ్మ వాక్కులో అనుశాసనం ధ్వనించింది.


బ్రహ్మ హఠాత్తుగా సాక్షాత్కరించి , తార వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్వేత వర్ణ వస్త్రాలు ధరించిన తార - తెల్ల రేకుల్లో దాగిన ఎర్ర తామరలా ఉంది. తార సర్వస్వమూ పద్మమయంగా కనిపిస్తోంది బ్రహ్మ చూపులకు. ముఖం పద్మం. రెప్పలు మూసిన విశాలవిలోచనాలు పద్మ పత్రాలు. చేతులు నాజూకైన పద్మనాళాలు. అరచేతులు పద్మపత్రాలు. తార తనువల్లిపైన తామరమొగ్గలు కనిపిస్తున్నాయి. ఓహ్ ! తారది నిసర్గ సౌందర్యం ! ఎనిమిది కళ్ళతోనూ చూడాలనిపిస్తోందామెను !


*"తారా..."* అప్రయత్నంగా పిలిచాడు బ్రహ్మ.


బోర్లించిన అరచేతుల్లా ఉన్న విశాలమైన రెప్పలు నెమ్మదిగా స్పందిస్తూ - పైకి లేచాయి. తార విశాల నేత్రాలు ఆశ్చర్యానందాలతో బ్రహ్మ దేవుణ్ని చూశాయి. *“స్వామీ...”* తార చేతులు జోడించింది.


*"నువ్వు తగిన వరుని కోసం తపస్సు చేస్తున్నావని మాకు తెలుసు. స్ఫురద్రూపీ , కుశాగ్రబుద్ధీ అయిన యువకుడు నీ భర్త కాబోతున్నాడు...”* 


*"స్వామీ...!"* తార కంఠంలో వీణలు పలికా యనిపించింది. నిరంతరం వాణి వీణానాదం వినే బ్రహ్మకు.


*"అతని పేరు బృహస్పతి ! దేవ గురువుగా విశిష్ట పదవిలో వున్నాడు. అచిర కాలంలో బృహస్పతి నీకు తారసిల్లుతాడు. ఆ సుందరుణ్ని భర్తగా స్వీకరించు !"*



*"ఆజ్ఞ !"* తార నమస్కరిస్తూ అంది. 


*"బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం. ఆనందం ద్విముఖం ! కళ్యాణమస్తు !"* తారను దీవించి , మరికాసేపు ఆమె అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి , బ్రహ్మ అంతర్ధాన మయ్యాడు.


తపస్సు ఫలించిన ఆనందం తార వదనం మీద దరహాస చంద్రిక రూపంలో ప్రత్యక్ష మవుతోంది. తార కూర్చున్న చోటి నుంచి లేచింది. ఎదురుగా వున్న కొలను తామర కన్నులతో తననే చూస్తూ చిన్ని చిన్ని తరంగ హస్తాలతో రమ్మని పిలుస్తున్నట్టు కనిపిస్తోంది తారకు.


యజ్ఞం ముగిశాక 'అవభృథ స్నానం' చేయడానికన్నట్టు తార పిలుస్తున్న కొలను వైపు అడుగులు వేసింది. జుత్తు ముడి విప్పుకుంటూ నెమ్మదిగా కొలనులోనికి దిగింది. కొలనులోని తేటనీరు పై పైకి వ్యాపిస్తూ తారను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభించింది. 


తార ఒక్కసారిగా నీటిలో మునిగింది. క్షణంలో ఆమె మొహం నీటిపైన ప్రత్యక్షమైంది. కొలనులో వున్న తామరలను వెక్కిరిస్తున్న 'ముద్దు తామరలా' ఆమె ముఖం కనిపిస్తోంది.


రోజులు గడుస్తున్నాయి. కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ సాగిస్తోంది. అందమైన ప్రకృతిలో , ఆకర్షణీయమైన స్థలాల్లో ఆమె అదే పనిగా విహరిస్తోంది.


తనతో తారను కలిపే కాలం ఎప్పుడొస్తుందో అని లోలోపల అనుకుంటూనే వున్నాడు బృహస్పతి.


ఆశ్రమంలో శిష్యులు క్రిందటిరోజు బోధించిన వేదపాఠాన్ని వల్లె వేస్తున్నారు. అనుష్ఠానాలు తీర్చుకునేందుకు బృహస్పతి సమీపంలోని నది వైపు బయలుదేరాడు.


నదీతీరానికి చేరుకున్న బృహస్పతి , తటాలున ఆగాడు. నదిలోంచి ఎవరో స్త్రీ గట్టు వైపు అడుగులు వేస్తోంది. సచేల స్నానం చేసిన ఆమె వలువలలోంచి నీరు - వయ్యారంగా వొలికిపోతోంది. తడిసిన శ్వేతాంబరం ఆ శరీరాన్ని దాచీ , దాచకుండా చూపుతున్న తెరలా వుంది.


నీటిలో నుంచి పైకి లేవనెత్తిన బంగారుబొమ్మలా వుందామె. ఎవరు ? ఎవరామె ? నదీ కన్యా ? సముద్రంలోంచి ఎదురీదుతూ వచ్చిన మత్స్యకాంతా ? లేక సాగరకన్య ? కమ్మెచ్చులోంచి తీసిన బంగారు తీగలాంటి ఆమె శరీరం బృహస్పతి సర్వస్వాన్నీ అయస్కాంత శిల్పంలా లాగుతోంది. అసంకల్పితంగా ఆమె వైపు అడుగు వేశాడతను.


బృహస్పతి తనలో కలుగుతున్న భావావేశానికి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకూ ఏ స్త్రీని తాను అలా నిర్భయంగా , నిస్సంకోచంగా , రెప్పవేయకుండా చూడలేదు. బ్రహ్మదేవుడు ఎవరో 'తార' అన్నాడు ! తార కాకుండా ఈ లావణ్యవతి అని వుంటే ?....


లేకపోతే.... ఈ లావణ్యవతే తార అయితే ? లోపల్నుంచీ తన్నుకొస్తున్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ బృహస్పతి ఆగాడు. ఆమె కూడా ఆగింది.


సచేలస్నానం చేసిన ఆమె తనువు కాకుండా , బలిసిన చేపల్లా స్పందిస్తున్న ఆమె కళ్ళు బృహస్పతి దృష్టిని బలంగా లాగుతున్నాయి. 


బృహస్పతి పెదవులు ఆరిపోతూ కదిలాయి.


అయితే - మాటను ఆమె పెదవులు పలికాయి.


*" ఆర్యా... నా పేరు తార. మీరు బృహస్పతీ కుమారులను ఎరుగుదురా ?"* తార ! బృహస్పతి గుండెగూటిలో పావురంలా కొట్టుకుంది. మౌనంగా , తెలుసన్నట్టు తల పంకించాడు.


*"వారు ఎక్కడున్నారో చెప్పండి !"* తార కంఠంలో కోయిల దాగి వుందేమో అనిపించింది బృహస్పతికి.


*“ఇక్కడే... నీ సన్నిధిలో...”*


*“మీరా ?!”* ఆశ్చర్యానందాలు తార కంఠంలో జంట స్వరాల్లా పలికాయి.


*"తారా !"* అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ.


శ్రద్ధా అంగిరసులకు తార ఎంతగానో నచ్చింది. తారను తనంత తాను పరిగ్రహించకుండా , తమ అనుమతికోసం ఆమెతో బాటు వచ్చిన బృహస్పతిని చూసి అంగిరసుడూ , శ్రద్ధా సంతోషపడిపోయారు.


బృహస్పతీ తారల వివాహం నిశ్చయమైంది. ఇంద్రాది దేవతలూ , నారదుడూ , మానస పుత్రులూ వివాహానికి విచ్చేశారు. దేవేంద్రుడి ఆధ్వర్యంలో బృహస్పతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.


శ్రద్ధా , అంగిరసుడూ - తారకూ , బృహస్పతికీ వేర్వేరుగా గృహస్థ ధర్మాలూ , దాంపత్య సూత్రాలూ బోధించారు. దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమనీ , వంశాన్ని సత్ సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దర్నీ దీవించి పంపించారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


.             *🌷కులశేఖర పడి🌷*


తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆళ్వారులలో ఒకడు, తిరువాన్కూరు మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఈ గడప పేరు ఏర్పడింది.

కేరళ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు, తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని తన కోరిక విన్నవించుకున్నారు. కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.


*🌷ఆనంద నిలయ విమానం:*

గర్భాలయం మీద మనకు బంగారు పూత పూసిన గోపురం కనిపిస్తుంది. దీనిని ఆగమ భాషలో విమానం అంటారు. శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఇది త్రిదళ విమానం. ఈది మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది.


*🌷బేడి ఆంజనేయస్వామి దేవాలయము:*


బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజలీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 45*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

*ఓం నమో భగవతే రామకృష్ణాయ*


    *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

               *🚩జీవిత గాథ🚩*   

                       *భాగం 45*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

          *నరేంద్రుని పరీక్ష*                 


 "మీ గురువును పగటి పూట పరీక్షించండి, రాత్రి కూడా పరీక్షించండి. అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు కూడా అందుకు సాహసించాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు శశధర పండితుని ఇంటిని పావనం చేశారు. అప్పుడు ఇంట్లోని ఒక వ్యక్తి త్రాగడానిక ఆయనకు మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసును పుచ్చుకొన్న శ్రీరామకృష్ణులు ఆ నీరు

త్రాగలేదు. ఎవరి కంటా పడకుండా ఆ నీటిని క్రింద పారబోశారు. నరేంద్రుడు ఇదంతా గమనించాడు. తదనంతరం మంచినీటిని తెచ్చిన ఆ వ్యక్తిని గురించి వాకబు చేసినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది - ఆ వ్యక్తి దుశ్శీలుడు.


శ్రీరామకృష్ణులు కామాన్నీ, ధనేచ్ఛనూ సమూలంగా త్యజించిన వ్యక్తి. ఆయన ధనం మాత్రమే కాక, ఏ లోహపు వస్తువునూ తాకలేరు. ఒకవేళ తాకితే ఆయన చేతులు ఏదో తేలు కుట్టినట్లు కొంకర్లు పోయేవి. ఈ విషయం కూడా నమ్మడానికి నరేంద్రుడు సిద్ధంగా లేడు. దీనిని పరీక్షించాలనుకొని ఒక రోజు శ్రీరామకృష్ణులు గదిలో లేనప్పుడు  ఆయన పడక క్రింద ఒక నాణెం ఉంచాడు. 


తరువాత గదిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు పడక మీద కూర్చున్నారు. మరుక్షణమే విలవిలలాడుతూ లేచారు. అందుకు కారణం ఏమిటోనని అందరూ పడకను క్షుణ్ణంగా పరీక్షించారు. పడకను దులిపినప్పుడు ఒక నాణెం క్రింద పడింది. శ్రీరామకృష్ణులు తమ ప్రియతమ శిష్యునిపై అర్థవంతమైన దృక్కును సారించారు. నరేంద్రుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹. 

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 28*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

                  *శ్లోకం - 28*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం*

          *విపద్యన్తేమ విశ్వే విధి శత మఖాద్యా దివిషదః |*

          *కరాళం యత్ క్ష్వేళం కబలళితవతః కాలకలనా*

          *న శమ్భో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||*   


ఈ శ్లోకంలో అమ్మవారి పాతివ్రత్య మహిమను గురించి చెప్తున్నారు.


సుధామప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం= దేవతలు పాల సముద్రాన్ని ఎందుకు మధించారు? అమృతాన్ని పొంది వృద్ధ్యాప్య, మృత్యు భయాలను పోగొట్టుకోవటానికి. మరి అమృతం వారిని కాపాడిందా?


విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః = బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ మహా ప్రళయంలో నశించారు కదా! 


కరాళం యత్ క్ష్వేళం కబలితవతః = క్షీరసాగర మధనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోయి బ్రహ్మ గారి వద్దకు వెళితే ఆయన వీళ్ళను తీసుకొని శివుడి వద్దకు వెళ్లి అందరూ ప్రార్ధన చేశారు కాపాడమని. అప్పుడు శివుడు ఆ విషాన్ని మ్రింగటానికి ముందుకు వచ్చాడు. దానిని అన్నం ముద్దలాగా మ్రింగి తన ఉదరంలో వున్న లోకాలు నశించకుండా ఆ గరళాన్ని కంఠంలో నిలిపాడు.


కాలకలనా న శమ్భో= కాల, కలన (లెక్కించటం, పరిణామాలని) పరిమితులు లేని శంభుడు ఆ విషాన్ని లోక క్షేమం కోసం కంఠంలో నిలిపాడు. కాల, కలనములకు లోబడి ఉండేవాడు పశువు (మానవుడు) వాటిని తన అధీనంలో ఉంచుకొనేవాడు పశుపతి.(ఈశ్వరుడు)


మరి అమ్మవారు తన భర్త కాలకూట విషాన్ని మ్రింగుతుంటే భయపడి అడ్డు పడలేదా? లేదట. పైగా లోక రక్షణ కోసం ఆమె కూడా ప్రోత్సహించిందట. ఎందుకని ఆమెకు భయం లేదు? అది ఆమె ధరించిన తాటంకముల (చెవికమ్మలు) మహిమయట. ఆమెకు తన మాంగల్యంపై నమ్మకమని శుక మహర్షి పరీక్షిత్తుతో అంటారు. భాగవతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు.


*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అని అమ్మవారి నామం. తపః అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. వీరిద్దరి కదలిక వల్లనే కదా రోజులు,మాసములు, సంవత్సరములు, యుగములు, కల్పములు మున్నగునవి. ఆ విధంగా కాలమును నిర్దేశించే సూర్య చంద్రులను ఆవిడ నియంత్రించి చెవికమ్మలుగా ధరించాక ఇక *కాల కలన* కు ఆమె వెరవవలసిన అవసరం ఏముంది? అమ్మవారు శాశ్వత సుమంగళి. స్వామి శాశ్వత శుభంకరుడు.


అసలు తాటంకములు తాటియాకులతో చేయబడినవి. ఒకప్పుడు చెవి కమ్ములను, మంగళ సూత్రములను కూడా తాటియాకులతోనే చేసేవారట ముహూర్త సమయంలో ధరింపజేయటానికి. అవి సౌమంగళ చిహ్నాలని. అందుకే, శుభకార్యాల సందర్భంగా ఇంటి ముందు తాటాకు పందిరి వేసేవారు. తాటియాకు తోరణాలు కట్టేవారు.


తిరుచిరాపల్లి నగరం కావేరీ నది ఇవతలి ఒడ్డున ఉంటే అవతలి ఒడ్డున తూర్పుగా  శ్రీరంగనాథ క్షేత్రం శ్రీరంగం, పశ్చిమ దిశగా శ్రీ అఖిలాండేశ్వరీ సమేత జంబుకేశ్వర స్వామివారి ఆలయం ఉంటాయి. ఈ క్షేత్రాన్ని తిరు వనై కోయిల్ అంటారు. పంచభూత లింగ క్షేత్రములలో ఇది జల లింగ క్షేత్రం. స్వామివారి లింగరూపం అడుగు నుండి నిరంతరము నీరు స్రవిస్తూ ఉంటుంది.


మిగిలినవి

పృధివీ -ఏకామ్రేశ్వర

కాంచీపురం

తేజో/అగ్ని - తిరువణ్ణామలై అరుణాచలం

వాయు - శ్రీ కాళహస్తి

ఆకాశ లింగ క్షేత్రం - చిదంబరం


ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి ధరించే తాటంకముల గురించి. ఒకప్పుడు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉండేవారట. పూజ చేయటానికి వెళ్లిన ప్రతి పూజారి మూర్ఛపోయేవారట. ఈ విషయం ఆది శంకరులకు తెలుపగా, వారు వచ్చి అమ్మవారి ఉగ్రతనం అంతా మంత్రపూర్వకంగా సంగ్రహించి ఈ తాటంకములలో యంత్రరూపంలో ప్రవేశపెట్టారట. వాటిలో ఒకటి శివ చక్రము, రెండవది శ్రీచక్రము. అంతే కాక అమ్మవారి సన్నిధికి ఎదురుగా గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారట. పుత్ర వాత్సల్యంతో అమ్మవారి ఉగ్రతను శాంతిపొందుతుందని. ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ తాటంకములను శుద్ధిచేసి తిరిగి ధరింపజేసే అధికారం కంచి కామకోటి పీఠాధిపతులకు మాత్రమే ఉన్నది. అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకములను దర్శించినవారు సమస్త సన్మంగళములను పొందుతారని స్త్రీలు దీర్ఘ సుమంగళులై ఉంటారని  కన్యలకు త్వరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుందనీ విశ్వాసం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కల్కి అవతారం.

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌷 కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది 🌷


🌹కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది. 

కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.🌹


🌸పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.🌸


1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.


2. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది. 


3. వివాహ వ్యవస్థ నిలబడదు..


4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు..


5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు..


6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పడిపోతుంది


7.స్త్రీలు కేశపాశములు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది


8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యేశుడు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు


9. అది ఎప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది


10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు


11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి


12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు


13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు


14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృత యుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది 


15.ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.


16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి     పోతుంది.


17 అంత గొప్ప అవతారం కల్కి అవతారం.


ఓం నమో నారాయణాయ ....


*సేకరణ:- శ్రీ శర్మద గారి వాట్సాప్ సందేశం.*

చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      


                   -----------------------     


                                  సందేశం - 5/11 


గణపతి పూజ - దూర్వాయుగ్మం (గరిక)          


    గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక. 

    ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

   తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

   దూర్వాయుగ్మం అంటే రెండు కొసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహా ఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    గరిక  

  - మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది. 

  - కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

  - చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

  - ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.


    దూర్వాయుగ్మం (జంట గరిక) తీసుకొని, ఈ క్రింది 21 నామాలతో వినాయకునికి పూజచేస్తాం.       


1. సుముఖాయ నమః 

2. గణాధిపాయ నమః 

3. ఉమాపుత్రాయ నమః 

4. గజాననాయ నమః 

5. హరశూనవే నమః 

6. లంబోదరాయ నమః 

7. గుహాగ్రజాయ నమః 

8. గజకర్ణాయ నమః 

9. ఏకదంతాయ నమః 

10. వికటాయ నమః 

11. భిన్నదంతాయ నమః 

12. వటవే నమః 

13. సర్వేశ్వరాయ నమః 

14. ఫాలచంద్రాయ నమః 

15. హేరంబాయ నమః 

16. శూర్పకర్ణాయ నమః 

17. సురాగ్రజాయ నమః 

18. ఇభవక్త్రాయ నమః 

19. వినాయకాయ నమః 

20. సురసేవితాయ నమః 

21. కపిలాయ నమః          


                    =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం

Panchaag


 

Jokes




















 

Jonnavittula


 

⚜ శ్రీ మద్వారాణి మందిర్

 👆🕉 మన గుడి : నెం 184





⚜ ఛత్తీస్‌గఢ్ : కోర్బా


⚜ శ్రీ మద్వారాణి మందిర్ 



💠 మద్వారాణి ఆలయం దట్టమైన అడవులు మరియు పండ్ల చెట్లు మరియు పూలతో చుట్టుముట్టబడిన ఎత్తైన కొండపై హస్దేవ్ నది ఒడ్డున ఉంది.  

ఇక్కడ అమ్మవారు కల్మి చెట్టు కింద కూర్చుంటారు.  చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆ తల్లి స్వయంగా కాపాడుతుందని చెబుతారు.


💠 ఆలయంలో మా మద్వారాణి కూర్చున్న దృశ్యం చాలా అందంగా ఉంటుంది.  

ఆలయ సముదాయంలో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి, వీటిలో కాళీ మా, దుర్గామాత సహా అనేక దేవతలు ఉన్నారు.  


💠 మా మద్వారాణి దేవాలయం ఆమె భక్తులకు చాలా ప్రీతికరమైనది, ఆమె భక్తులు శతాబ్దాలుగా ఇక్కడికి వస్తూనే ఉన్నారు.

ఆమె మహిమ పరోపకారానికి నిదర్శనం.

మా మద్వారాణి తమను మరియు వారి కుటుంబాన్ని కాపాడుతుందని మరియు కష్టాల నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు.


💠 తల్లి మద్వారాణిని సంస్కృతంలో మాండ్వీ దేవి అంటారు.  

అమ్మవారి రూపానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి.  

ఇది చాలా అద్భుతమైనది.  పెద్దలు లేదా నమ్మకం ప్రకారం, నవరాత్రి సమయంలో జొన్న పంట  కల్మి చెట్టు మరియు దాని ఆకులపై పెరుగుతుంది.  నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  అమ్మవారి దర్శనానికి దూరప్రాంతాల నుంచి జనం వస్తుంటారు.  పర్వతం క్రింద ఒక ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది.  అమ్మవారి దర్శనం తర్వాత భక్తులు జాతరను సందర్శిస్తారు.


💠 ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే ఎత్తైన పర్వతం ఎక్కాలి.  ఇది కోర్బా-చంపా ప్రధాన రహదారిపై ఉన్న మా మద్వారాణి ఆలయం నుండి మొదలై 5 కిలోమీటర్ల పొడవైన కొండ రహదారి గుండా వెళుతుంది.  ఇప్పుడు ఈ మార్గాన్ని కాలినడకనే కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో కూడా చేరుకునేలా అభివృద్ధి చేశారు. 



⚜ చరిత్ర ⚜


💠 మా మద్వారాణి యువరాణి, గోడ్వానా సామ్రాజ్యం రాజు బలిరాజ్ కుమార్తె అని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం.  

ఆమె యుక్తవయస్సు వచ్చిన వెంటనే, రాజు యువరాణికి వివాహం చేసేయాలని ప్రతిపాదించాడు.  

ఆమెకు పెళ్లి ఇష్టం లేదని, తండ్రితో నేరుగా, ధైర్యంగా చెప్పలేక.... ఒక షరతు పై పెళ్లికి అంగీకరించింది.

కానీ ఒక్క రాత్రిలో మొత్తం వివాహ వేడుకను నిర్వహించమని ఆమెను కోరింది.  

రాజు దీనిని సంతోషంగా అంగీకరించాడు.  విశ్వకర్మ పెళ్లి మంటపాన్ని నిర్మించాడు.  

కానీ పెళ్లి ఊరేగింపు రాకపోవడంతో పెళ్లి జరగలేదు. 


💠 అప్ఫడు ఆమె ధైర్యంగా తనకు పెళ్లి ఇష్టం లేదని, ఆమె తన పెళ్లి మండపాన్ని విడిచిపెట్టి, ఛత్తీస్‌గఢ్‌లోని మద్వా అని  పిలువబడే "భాగ్ గయీ మండపం"కి వెళ్లిందని, బర్పాలి అనే  గ్రామానికి చేరుకుందని ఇక్కడ నివసించేవారని చెబుతారు. 


💠 బర్పాలికి మద్వారాణి రోడ్డు మార్గంలో ఈ గ్రామానికి చేరుకుంది, అక్కడ పెళ్లి కోసం సిద్దం అయినప్పుడు శరీరంపై పసుపు ఇక్కడి రాతిపై పడింది, దాని కారణంగా రాయి పసుపు రంగులోకి మారింది, దీనికి సాక్ష్యం ఈ గ్రామంలో ఈ రోజు కూడా చూడవచ్చు.


💠 తల్లి మద్వారాణి పర్వతం మీదనే ఆశ్రయం పొందింది. మార్గమధ్యంలో పెళ్లి మంటపం విడిచిపెట్టినందుకు తల్లికి మద్వారాణి అని పేరు పెట్టారు. 


💠 ఇక్కడ మీరు ఆలయానికి వచ్చినప్పుడు, మీరు ఇక్కడ కల్మి చెట్లను చూస్తారు, దాని గురించి మా మద్వారాణి తన భక్తుల కోసం కల్మీ చెట్టును నాటినప్పుడు, నవరాత్రులు వచ్చినప్పుడు, ఆకులలో, చెట్లు చుట్టూ  జొన్న పంట  పెరుగుతుంది, దానికి మీరు సాక్ష్యం ఇక్కడి గ్రామస్తుల నుండి పొందవచ్చు.

ఇది అడగడం ద్వారా తెలుసుకోవచ్చు మరియు జొన్న పంట  పెరిగినప్పుడు, ఈ అంటుకట్టిన చెట్ల చుట్టూ పాములు తిరుగుతున్నట్లు కూడా చెబుతారు.


💠 ఒక కల్మి చెట్టును నరికిన తరువాత, తల్లి మద్వారాణి తన నలుగురు సోదరీమణులతో అక్కడికి వచ్చి తన శక్తిని అక్కడ ఉంచి, దానిని ఐదు రాళ్లలో చేర్చి, నేటికీ పిండి రూపంలో పూజించబడుతుందని నమ్ముతారు.


💠 ఇక్కడి అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులకు సహాయం చేస్తూ ఉంటారని చెబుతారు.  ఆమె మానవ రూపంలో వచ్చి తప్పిపోయిన ప్రజలకు మార్గం చూపుతుంది.  దాహంతో ఉన్నవారికి నీరు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తుంది.


💠 మద్వారాణి ఆలయానికి ప్రక్కనే కాళీ దేవి ఆలయం, కాలభైరవ బాబా ఆలయం మరియు హనుమాన్ ఆలయం ఉన్నాయి. 

 

💠 రైలు ద్వారా: కోర్బా రైల్వే స్టేషన్ నుండి 30 కి.మీ దూరంలో మరియు చంపా రైల్వే స్టేషన్ నుండి 35 కి.మీ దూరంలో ఉంది.

మూర్ఖుడు

 శ్లోకం:☝️

*ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే*

*గతం న శోచామి కృతం న మన్యే |*

*ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్*

*కిం కారణం భోజ భవామి మూర్ఖః ||*


భావం: నేను నడుస్తూ తినను, నవ్వుతూ మాట్లాడను, గడచిన కష్టాల గురించి దుఃఖించను. నేను గతం గురించి ఆలోచించను. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆహ్వానం లేకుండా వెళ్లి మూడవవాడిని కాను. నేను ఇవి చేయనందున నిజంగా బుద్ధిశాలిని. అలాంటప్పుడు, ఓ భోజరాజా! నన్ను ఎందుకు మూర్ఖుడు అని పిలుస్తావు?


   ఒకసారి భోజరాజు తన రాణిని ఆమె తోటలో సందర్శించడానికి వెళ్ళాడు. తన ఇష్టసఖితో ఏకాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్న ఆమెను చూశాడు. వారి ఏకాంతాన్ని గౌరవించకుండా, రాజు లోపలికి వచ్చాడు. రాణి అతనిని సమీపించడం చూసి, "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని పిలిచింది.

   తరువాత, భోజరాజు తన రాజభవనానికి తిరిగి వచ్చి, రాణి తనను మూర్ఖునిగా ఎందుకు సంబోధించిందో ఆలోచించి సరైన సమాధానం రాకపోవడంతో, అతను ఒక ఉపాయం పన్నాడు.

   భోజుని ఆస్థానంలో 14 మంది పండితులు కవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆస్థానంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అతను ఇలా అన్నాడు: "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని

   వారిలో ఎవరికీ ఎలాంటి స్పందన లేదు. వారు తమ తమ స్థానాలలో కూర్చున్నారు, "ప్రభువు నన్ను మూర్ఖుడని ఎందుకు సంబంధించారు? నన్ను ఎంతో గౌరవించేవాడు కదా! మూర్ఖుడిని ఆస్థానంలో ఎవరు నియమిస్తారు?"

చివరికి మహాకవి కాళిదాసు ఆస్థానంలోకి ప్రవేశించాడు. రాజు తన వింత సంబోధనని పునరావృతం చేస్తూ, "లోపలికి రండి, మూర్ఖుడా" అన్నాడు! "మూర్ఖడ"నే పదాన్ని కవి విన్న వెంటనే, అతను దానిని ఒక రకమైన సమస్య అనుకుని స్వీకరించి, తక్షణమే పై శ్లోక రూపంలో పూరణ ఇచ్చాడు.🙏

పంచాంగం 21.09.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 21.09.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: షష్థి తిధి బృహస్పతి వాసర: అనురాధ నక్షత్రం ప్రీతి యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం 

షష్థి మధ్యాహ్నం 02:09 వరకు.

అనురాధ మధ్యాహ్నం 03:30 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:10

వర్జ్యం : రాత్రి 09:05 నుండి 10:41 వరకు.

దుర్ముహూర్తం : పగలు 10:09 నుండి 10:57 వరకు తిరిగి మధ్యాహ్నం 02:57 నుండి 03:46 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00  వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార: