1, ఫిబ్రవరి 2022, మంగళవారం

What is Disruptive Technology

 


What is Disruptive Technology ?? 


A superb article ...


When TV came to my house. I forgot how to read books. When the car came to my doorstep, I forgot how to walk. When I got the mobile in my hand, I forgot how to write letters. When computer came to my house, I forgot spellings. When the AC came to my house, I stopped going under the tree for cool breeze. When I stayed in the city, I forgot the smell of mud. By dealing with banks and cards, I forgot the value of money. With the smell of perfume, I forgot the fragrance of fresh flowers. With the coming of fast food, I forgot to cook traditional cuisines..


Always running around, I forgot how to stop. And lastly when I got whatsapp, forgot how to talk..


So very true

సుభాషితమ్

 *🌺సుభాషితమ్🌺* 


శ్లో𝕝𝕝 *శ్రోతం శ్రుతేనైవ న కుండవేన*

*దాననే పాణిర్నతు కంకణేన*

*విభాతికాయః ఖలు* *సజ్జనానాం* 

*పరోపకారేణ న చందనేన ||*


*--- భర్త్రహరి ---*


తా𝕝𝕝 *చెవులకు శాస్త్రజ్ఞాన విషయాలు వినడమే ఆభరణం అవుతుంది తప్ప చెవిపోగులు ఆభరణం కాదు. దాన గుణం చేతనే చేతులు ప్రకాశిస్తాయి తప్ప కంకణాల వలన కాదు. సజ్జనుల శరీరం పరోపకార గుణం చేత శోభిల్లుతుంది తప్ప చందనం లాంటి లేపనాలు పూసుకోవడం వలన కాదు.*

🔅🔆🔅🔆🔅🔅🔆🔅🔆🔅

పునర్జన్మ సిద్ధాంతాన్ని

 అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.


స్తన్యాభిలాషాత్ (3.1.21) . 


పై వివరణను 'న్యాయ దర్శనము' పునర్జన్మకి మద్దతుగా చెప్పిన ఇంకొక ఉదాహరణగా పేర్కొంటోంది. 


పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపొతే, మనుష్యుల మధ్య ఉన్నఅసమానతన అనేది, కారణం చెప్పడానికి వీలు కాకుండా, అసంబద్దంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే, తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మ వలన ఇలా జరిగింది అంటే, అతను ఈ ప్రస్తుత జన్మ యే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే, అది కూడా నమ్మశక్యంగానిదే, ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ (logical) వివరణ ఏమిటంటే అతను తన పూర్వ జన్మ కర్మ ల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడు. అందువలన, సహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.


. 🚩🙏 హరే కృష్ణ 🙏🚩

ఆత్మ

 ఈ ఆత్మ ఎ టువంటిదంటే.. అది ఎవరికీ కనపడదు, వినపడదు, ఇంద్రియ గోచరము కాదు, పోనీ మనస్సుతో ఆలోచిద్దామా అంటే ఆలోచనలకు అందనిది. ఈ ఆత్మకు ఎటువంటి వికారములు మార్పులు లేనిది. 

కాబట్టి అర్జునా! ఆత్మ ఇలా ఉంటుంది అని ఎవరూ తెలుసుకోలేదు, చెప్పలేదు, చెప్పగా వినలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నీవు ఈ ప్రకారంగా ఆత్మస్వరూపులైన నీ శత్రువుల గురించి శోకించడం మంచిదేనా! కాబట్టి నీ శోకము మాని యుద్ధముచేయడానికి సంసిద్దుడవు కా! అని అన్నాడు శ్రీ కృష్ణుడు.


అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, కనిపించనిది, కళ్లకు కనిపించదు, చెవులకు వినిపించదు, ఇంకా ఆత్మను గురించి మనసుతో ఆలోచించి తెలుసుకోలేము. ఆలోచించడం అనేపనిని మనం మనసు బుద్ధి తోనే చేస్తాము. ఏదైనా ఒక విషయం గురించి తెలిస్తే దాని గురించి ఆలోచిస్తాము. అసలు ఆత్మ కనపడదు వినపడదు, తాక బడదు. అటువంటి దానిని గురించి ఏమి ఆలోచిస్తాం. 


కాబట్టి ఆలోచనలకు కూడా అందనిది ఆత్మ. ఇవి ఆత్మ లక్షణములు. శాశ్వతము, కనపడని ఆత్మగురించి, అశాశ్వతమైన కనపడే ఈ శరీరం గురించి శోకించడం వ్యర్థము. నువ్వు ఏమి చెప్పావు. నువ్వు నా శిష్యుడివి అని అన్నావు. అందుకే ఇంతదూరం చెబుతున్నాను. నా మాటవిని, ఈ అనవసరమైన శోకం మాని లేచి యుద్ధం చెయ్యి అని బోధించాడు శ్రీకృష్ణుడు.


ఇంకా వివరంగా చెప్పాలంటే ఆత్మ దృశ్యవస్తువు కాదు. కళ్లతో చూడలేము. దాని గురించి చెవులతో వినలేము. ఎవరూ దాని గురించి చెప్పలేరు. జ్ఞానేంద్రియములకు అతీతమైనది. అతి సూక్ష్మంగా ఉంటుంది. దీనిని చూడాలంటే ఒకటే మార్గము. ముందు మనసును, ఇంద్రియములను స్వాధీనపరచుకోవాలి. దానికి మార్గము నిష్కామ కర్మ, వైరాగ్యము, అచంచలమైన, ఏకాగ్రమైన భక్తి, భగవంతుని ధ్యానించడం. వీటి ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధిఅయిన మనస్సు ఆత్మలో లీనం అవుతుంది. అప్పుడు ఆత్మ ఒకటే మిగులుతుంది. మనసు విడిగా ఉన్నంత కాలం, మనసు, అహంకారంతో కలిసి, ప్రాపంచిక విషయములలో తిరుగుతున్నంత కాలం, ఎవరికీ ఆత్మగురించి తెలిసే అవకాశం లేదు. ఇది చాలా కష్టం కాబట్టి ఎవరూ తెలుసుకోవడం లేదు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

మన కష్టార్జితాలే

 🤪🤫 *సందేశం* 🤫🥱


అన్నా స్కూలుకు పోతా...

*_15 వేలు తీసుకో_*


అన్నా ఆటో తోలుతా...

*_1 లక్ష తీసుకో_*


అన్నా కారు తోలుతా...

*_10 లక్షలు తీసుకో_*


అన్నా కటింగ్ చేస్తా...

*_10 వేలు తీసుకో_*


అన్నా చెట్లెక్కుతా...

*_10 వేలు తీసుకో_*


అన్నా నేను పెళ్లి చేసుకుంటా...

*_1 లక్ష తీసుకో_*


అన్నా నేను గర్భవతిని...

*_12 వేలు తీసుకో_*


అన్నా నేను సోమరిపోతును...

*_15 వేలు తీసుకో_*


అన్నా నేను టైలర్ని...

*_10 వేలు తీసుకో_*


అన్నా నేను జాలరిని...

*_10 వేలు తీసుకో..._*


అన్నా నాకు ఇల్లు లేదు...

*_డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకో..._*


అన్నా నాకు భూమి లేదు...

*_మూడెకరాల భూమి తీసుకో..._*


అన్నా నాకు భూమి ఉంది...

*_ఎకరాకు 10 వేల చొప్పున తీసుకో..._*


అన్నా నేను విధవరాలిని...

*_నెలకు 2500 తీసుకో_*


అన్నా నేను వికలాంగున్ని...

*_నెలకు 3000 తీసుకో_*


అన్నా నాకు ఆసరా అంటూ ఎవ్వరూ లేరు... 

*_నెలకు 2500 తీసుకో_*


అన్నా నేను ముసలోడిని...

*_నెలకు 2500 తీసుకో_*


*ఒక పిట్ట కథ విందామా?*


_ఒక దొర డబ్బులు పంచుతాను రండి అని ఊర్లో డప్పు వేయించాడు. దొరగారు డబ్బులు పంచుతున్నారట అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు._


_అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు. వచ్చినోళ్లందరికీ డబ్బులు పంచాడు దొరగారు. డబ్బులు తీసుకుని ఊర్లోకి వెళుతుంటే పర్మిట్ రూం ప్రత్యక్షమైంది. దొరగారు ఇచ్చిన డబ్బులు కొన్ని రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో వాళ్ళ ఆడోళ్ల సంపాదనతో తాగారు._

 

*_రాజ్యాంగం ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు?..._*

*_మనంతట మనమే రోడ్డేసుకోలేం, బడి కట్టుకోలేం, ఆస్పత్రి కట్టుకోలేం మార్కెట్ ఏర్పాటు చేసుకోలేం, రైలు మార్గంను ఏర్పాటు చేసుకోలేం._*


_ఆ పనుల్నీ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి గవర్నమెంటు అని పేరు పెట్టారు. ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన పనులు చేసి పెట్టే బాధ్యత అప్పగించారు._


 _అందుకోసం ట్యాక్సుల రూపంలో మన వద్ద డబ్బులు తీసుకుని మన కోసం బడి కట్టాలి, రోడ్డు వేయాలి, ఆస్పత్రి కట్టాలి, కరెంటు ఇవ్వాలి, డ్రైనేజీలు వేయాలి. చెరువులు కట్టాలి, ప్రాజెక్టులు కట్టాలి._


_కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు పెట్టుకుని తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు._


కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణలో కరిగేపోయాయి. మిగులు రాష్ట్రమని చెప్పుకున్న మనమే లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో చిక్కుకుపోయాం. మొన్నే 40 వేల కోట్లు డబ్బులు పంచాం అని ఘనంగా చెప్పుకున్నారు.


*_ఎవరి సొమ్ము అది? ప్రజలు కట్టిన పన్నులే కదా. మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా._*


*రేపటి నుంచి...*

_తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే 4 రూపాయలు ఎక్కువ పెట్టి పెట్రోలు కొనాలి, 4 రూపాయలు ఎక్కువ పెట్టి డీజిల్ కొనాలి_*


_ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రూపాయలు పెట్టి క్వార్టర్ బాటల్ కొంటున్నారు._


*_ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో... జనం పాలకులను నిలదీస్తారు, కడిగేస్తారు. ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంటు డబ్బులు తినలేదు. కాబట్టి మూసుకుని కూర్చోరు. తాటతీస్తారు._*


*_కానీ తెలంగాణ ప్రజలు పుడితే పథకం, స్కూలు కెళితే పథకం, పెద్దయితే పథకం, పెళ్లి చేసుకుంటే పథకం, పిల్లలను కంటే పథకం, వ్యవసాయం చేస్తే పథకం, వ్యవసాయం చేయకపోతే పథకం._*


_ఆస్తులను పెంచడం కష్టం గానీ పంచడం ఎంత సేపు, 5 నిమిషాల పని. ఖర్చు చేసుకోవడానికి జనాలకు ఎక్కువ సమయం పట్టదు._


*_ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు._*


_డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా తీసుకున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి తిరిగి కట్టకపోతే?_


*_అదే జరుగుతోంది_*


_చాలా సింపుల్ లాజిక్..._


_మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి._


_ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది ఆయా 'నాయకులను' బట్టి ఉంటుంది._


*_అందుకే అన్నారు... దురాశ దు:ఖానికి చేటు అని._*


*_ఓ ఓటరు మహాశయా మేలుకో. ఉచితంగా ఏది రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి._*


 *_ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో ఒక్కసారి గమనించండి. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే. అవి ఎలానో తెలుసుకుందాం._*


★సంపాదిస్తే *_income tax_*

★వస్తు సేవలను ఉత్పత్తి చేసి అమ్మితే *_goods & services tax_*

★మార్కెట్‌ చేస్తే *_commercial tax_*

★సినిమాకి వెళ్తే *_entertainment tax_*

★వెహికిల్‌ కొంటే *_life tax_*

★దాన్ని రోడ్‌ పైకి తెస్తే *_road tax_*

★లాంగ్‌ జర్నీ చేస్తే *_toll tax_*

★బండిలో పెట్రోల్‌ పోస్తే *_fuel surcharge tax_*

★భార్య, పిల్లలతో పార్కుకు వెళితే *_entry tax_*

★ఉద్యోగం చేస్తే *_professional tax_*

★వ్యాపారం చేస్తే *_trade tax_*

★అమ్మితే *_sales tax_*

★బట్టలు కొంటే *_VAT_*

★బీర్లు, విస్కీలు కొంటే *_excise tax_*

★కరెంటు, వాటర్‌ బిల్ కడితే *_service tax_*

★ఆస్థి పై *_property tax_*

దిగుమతి చేసుకుంటే *_customs tax_*

★చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే *_swachh bharat charge_*


★ *_మొత్తం మీద మనిషి జన్మిస్తే tax_*

★ *_మనిషి మరణిస్తే tax_*


*_ఇలా పలు రకాల టాక్సులతో మనిషి పుట్టినప్పటి నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు. అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే....._*


*_జై హింద్_*  *_జై తెలంగాణ_*

🙏🙏🙏💐💐

శుభ ప్రదంగా ఉటుంది.

 🎻🌹🙏 ఇవి పాటిస్తే శుభ ప్రదంగా ఉటుంది.


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


1. పూజ మధ్యలో మాట్లాడితే,  ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు. 


2. జపం చేసేటప్పుడు జపమాల పొరపాటు గా కూడా కింద పడకూడదు.. 


3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి.  దాన్ని నోటితో ఊదడం దోషం.


4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం,  కొట్టుకోవడం దోషం. అలాగే పంచ భూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ, దాటడం కానీ చేయకూడదు. 


5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కు ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తుంటారు. 


6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 రోజుల లోపు, ఆవు దగ్గర పాలు తీసకోకూడదు. 


7. పడుకునేటప్పుడు దైవ నామస్మరణ చేస్తూ  పడుకుని, లేచేటప్పుడు, అదే నామం చెబుతూ లేస్తే పడుకున్నoత సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది. 


8. వినాయకుడికి తులసి,  సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు. 

ఏకాదశి,  అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి దినాలలో తులసిని తుంచరాదు.  పూజకి,  దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి. 


9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి. అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి. 


 అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ,  అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం,  ప్లేట్ పెట్టి, గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం,  మూతలు పెట్టకుండా ఉంచడం,  ఎండిపోయినవి తినడం నిషిద్ధం.


 అయితే ఏమౌతుంది అని, అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.  అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక,  మనము తింటే శక్తి రాదు,  మనసు పై ప్రభావం పడి, పాపపు ఆలోచనలో,  లేక మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు.  అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యంగాపెట్టి, కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. 

 

10. తడి కాళ్లతో పడుకోకూడదు.  అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.

Hindus

 BJP is in clear majority in only 6 out of 29 states.


On the other hand BJP has-👇


 0 seats in Sikkim.


 0 seats in Mizoram.


 0 seats in Tamil Nadu.


 

 4 /175 in Andhra.


 1/140 in Kerala.


 3/117 in Punjab.


  74/294 in Bengal.


 5/119 in Telangana.


 8/ 70 in Delhi.


 10/147 in Odisha.


 12/60 in Nagaland.


 2/ 60 in Meghalaya.


 53/ 243 in Bihar.


 25/ 87 in J&K.


 13/ 40 seats in Goa.


Thus, BJP has only 1516 seats /4139 assembly seats in the whole country, 


out of which 950 seats are from 6 states like Gujarat, Maharashtra, Karnataka, UP, MP, Rajasthan only.


Meaning is clear... 


BJP has got defeat in 66% seats of the country even today.


Therefore, the (BJP)central government is not in a position to implement a uniform law for the minorities.


Hindus have not only become powerless but are mentally so stupid that they cannot demonstrate their power even by using their votes.


Please share this fact, as much as possible to strengthen BJP.


No major media channel will tell this truth, so pl. send this message to at least ten persons,

so that Hindus can know how safe India is.

🏹🏹🇮🇳🚩🚩🚩🚩🚩🚩

 *Jai Siyaram..*🔥🔥🔥🔥🔥

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుక

 *నమో.. సమతామూర్తి!*


శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌ ముస్తాబు

*45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం..* ఆరేళ్లలో నిర్మాణం

216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం

బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ

గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’  

సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం

2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు

వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం

5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం

13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా మూర్తి విగ్రహానికి తొలిపూజ

  పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండ ధారుడై.. ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన ఆయన మోమును చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది! అన్నీ ఒక్కటే.. అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు.


శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్‌ దివ్య క్షేత్రం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు!


2016లో పనులు


శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మ పీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. మహా విగ్రహం  కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు. 


వేర్వేరు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధాని.. 


ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ముచ్చింతలకు విచ్చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సమతామూర్తి మహా విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదీన రాష్ట్రపతి కోవింద్‌ వస్తారు. ప్రధానాలయంలోని నిత్యపూజామూర్తి బంగారు విగ్రహానికి తొలి పూజ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.


5 వేల మంది రుత్వికులతో..


శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు వస్తున్నారు. *12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు.* హోమంలో  *రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు.* రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందుకు వినియోగిస్తున్నారు. రుత్వికులు హోమాల్లో పారాయణాల్లో పాల్గొంటారు. పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు. 


*ప్రధానాకర్షణ ఫౌంటెయిన్‌!*


సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే *108 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే *45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది.* పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్‌ను నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామనుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు. దివ్యక్షేత్రం ఆవరణలో రాజస్థాన్‌లో లభించే పింక్‌ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. కాగా సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు  చేసిన *36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి. దివ్యక్షేత్రం పనులకోసం 1200 మంది శిల్పులు,* ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేస్తున్నారు.  దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రంగులతో కూడిన రెండు లక్షల మొక్కలు ఉద్యానవనాల్లో ఉన్నాయి. *రాష్ట్రపతి, ప్రధాని రాక నేపథ్యంలో ముచ్చింతల చుట్టు పక్కల రహదారులను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.*


*కార్యక్రమాలు ఇలా..*


*ఫిబ్రవరి 3న:*


అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం


*5 న: ప్రధాని మోదీ రాక,*


*రామానుజాచార్య*


*మహా విగ్రహావిష్కరణ*


*8, 9 తేదీల్లో:  ధర్మసమ్మేళనం*


*9 న: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాక*


10న: సామాజిక నేతల సమ్మేళనం


11న: సామూహిక ఉపనయనం


12న: విష్ణు సహస్రనామ పారాయణం


13న: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక


14న: మహా పూర్ణాహుతి

Intelligence

 According to Psychologists, there are four types of Intelligence: 


1) Intelligence Quotient (IQ)

2) Emotional Quotient (EQ)

3) Social Quotient (SQ)

4) Adversity Quotient (AQ)


1. Intelligence Quotient (IQ): this is the measure of your level of comprehension. You need IQ to solve maths, memorize things, and recall lessons.


2. Emotional Quotient (EQ): this is the measure of your ability to maintain peace with others, keep to time, be responsible, be honest, respect boundaries, be humble, genuine and considerate.


3. Social Quotient (SQ): this is the measure of your ability to build a network of friends and maintain it over a long period of time.


People that have higher EQ and SQ tend to go further in life than those with a high IQ but low EQ and SQ. Most schools capitalize on improving IQ levels while EQ and SQ are played down.


A man of high IQ can end up being employed by a man of high EQ and SQ even though he has an average IQ.


Your EQ represents your Character, while your SQ represents your Charisma. Give in to habits that will improve these three Qs, especially your EQ and SQ.


Now there is a 4th one, a new paradigm:


4. The Adversity Quotient (AQ): The measure of your ability to go through a rough patch in life, and come out of it without losing your mind.


When faced with troubles, AQ determines who will give up, who will abandon their family, and who will consider suicide.


Parents please expose your children to other areas of life than just Academics. They should adore manual labour (never use work as a form of punishment), Sports and Arts.


Develop their IQ, as well as their EQ, SQ and AQ. They should become multifaceted human beings able to do things independently of their parents.


Finally, do not prepare the road for your children. Prepare your children for the road."..

మాతల్లి తులసీమాత

 ఓసారి అక్బర్ బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు ..


దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.


ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్!


బీర్బల్ - మాతల్లి తులసీమాత


అక్బర్ వెంటనే అది పీకి పారేసి ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు అన్నాడు.


దానికి సరైన జవాబు ఇచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు 


ఓ చోట దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంబడే బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు 


అక్బర్ కి కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, బీర్బల్ ఏమిటిది అనడిగాడు.


మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు.


అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.


దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా  అన్నాడు 


బీర్బల్ - ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి చూద్దాము అన్నాడు.


అక్బర్ - ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు


బీర్బల్ - అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు.

అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ లేపనాన్ని పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!


కానీ అవతారం చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము అని.


బీర్బల్ -

లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది మార్గం చూపిస్తుంది అని చెప్పాడు.


ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది.


బీర్బల్ చెప్పాడు - ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని!


ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.


అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, ఈ సృష్టిలో ఎప్పుడూ మన స్రేయస్సు కోరుకునేది తల్లి మరియు తండ్రి మాత్రమే.. అందుకే హిందువులు మానవజాతి స్రేయస్సుకు ఉపయోగపడే తులసి, గోవు, నదులను కృతజ్ఞతగా తల్లితో సమానంగా భావిస్తారు. తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి శుభానికి మేలు చేస్తుంటారు అని..


ఇది నమ్మేవారిని హిందువులు అంటాము

హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని..


Jai Sri Ram 🙏🙏🙏🙏

షడ్రసముల గురించి

 షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1


     షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను . 


 *  మధుర రసము గుణము - 


       మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును . 


        దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును . 


 *  ఆమ్ల రసము గుణము - 


      ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును . 


         దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి  విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును . 


 *  లవణ రసము గుణము - 


      ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును . 


        దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును . 


         తరవాతి పోస్టు నందు మిగిలిన రసాల గుణాల గురించి వివరిస్తాను . మరింత విలువైన సమచారం కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

ఏకమూలికా ప్రయోగాలు .

 రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 


     

      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 


     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 


  ఏకమూలికా ప్రయోగాలు - 


 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 


 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 


 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 


 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 


 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 


 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 


 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 


 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 


 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 


 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 


 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 


 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 


 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 


 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 


 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 


 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 


 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 


 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 


 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 


 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 


 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 


 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 


 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 


 * మద్యము శోకము నందు శ్రేష్టం . 


 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 


 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 


 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 


 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 


 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 


 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 


 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 


 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 


 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 


 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 


 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 


 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 


 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 


 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 


 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 


 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 


 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 


 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 


 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 


 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 


 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 


 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 


 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 


 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 


       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 


       సంపూర్ణమైన వివరణల కొరకు మరియు మరెన్నో అమూల్యమైన విషయాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 



         తరువాతి పోస్టు నందు మరికొన్ని ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి వివరిస్తాను . 


      గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

మోక్షానికి కారకాలు

 మానవుడి మోక్షానికి కారకాలు అతని వయసు, పరిసరాలు కావు... దృఢ సంకల్పం, సజ్జన సాంగత్యం, ఉపదేశం. శ్రీమద్భాగవతంలోని ధ్రువుడి కథ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ధ్రువుణ్ణి చాలా పరుషమైన మాటలతో అతని సవతితల్లి నొప్పించింది. కన్న తండ్రి తన ఒడిలో అతణ్ణి కూర్చోబెట్టుకోవడానికి ముందువెనుకలాడుతున్నాడు. ధ్రువుడిది ఆటపాటలతో గడిపే చిన్న వయసు. అతని పరిస్థితి ప్రకారం... తనకు జరిగిన అవమానానికి అతను విలపిస్తూ కూర్చోవాలి. అయితే అతనికి సజ్జనురాలైన తల్లి సాంగత్యం, నారద మహర్షి లాంటి జ్ఞానుల ఉపదేశం దొరికింది. తను ఆపేక్షించిన స్థానం అశాశ్వతమనీ, నిజమైన శాశ్వత స్థానాన్ని ఇచ్చే పరమాత్ముణ్ణి శరణు వేడితే మన అజ్ఞానం, సమస్తకష్టాలు తొలగిపోతాయనీ గుర్తించాడు. వాసుదేవుడి కోసం అనితరసాధ్యమైన తపస్సు చేయాలన్న దృఢ సంకల్పం అతనికి కలిగింది. 

లౌకిక జీవనంలో ఉన్నతమైన స్థానం పొందడానికి మనం ఎంతో శ్రమిస్తాం. ఎందరినో ఆశ్రయిస్తాం. కానీ ఆ స్థానాలు అశాశ్వతం. వాటిని మనకు అందించే వ్యక్తులు అస్వతంత్రులు. వారి శక్తి పరిమితికి లోబడి ఉంటుంది. శాశ్వతమైనవాడు, సకల స్వతంత్రుడు కేవలం భగవంతుదైన వాసుదేవుడు మాత్రమే. ఆయన అనుగ్రహంతోనే బ్రహ్మాది దేవతలకు వారి యోగ్యతానుసారం సముచిత స్థానాన్ని శ్రీమహాలక్ష్మి ప్రసాదిస్తుంది. ఆమె కటాక్షంతోనే ఆదిశేషుడికి పరమాత్ముడి స్పర్శ నిరంతరం లభ్యమయ్యే భాగ్యం కలిగింది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని క్షణకాలం చూసినందుకే మనం పొంగిపోతాం. అటువంటిది... నిరంతరం ఆయన స్పర్శను పొందే ఆదిశేషుడు ఎంత అదృష్టవంతుడు! అందుకే ‘అన్యసురైహిదురాపామ్‌’ అన్నారు శ్రీ మధ్వాచార్యులు. అంటే... ఇంద్రాది దేవతలకు సైతం అది దుర్లభం. 

అటువంటి వాసుదేవుడి అనుగ్రహం పొందాలనుకున్న ధ్రువుడు మూడు రోజులకు ఒకసారి పండు తింటూ, ఆ తరువాత ఆరు రోజులకు ఒకసారి ఆకులు తింటూ, అనంతరం తొమ్మిది రోజులకు ఒకసారి గాలి పీలుస్తూ... పిదప కేవలం నీటిని తాగి, గాలిని పీల్చి... చివరకు ఊపిరి బిగబట్టి...  గాలిని సైతం పీల్చకుండా కఠోర తపస్సు చేశాడు. వాసుదేవుడి కటాక్షాన్ని పొందాడు. ఆ బాలుడి దీక్షకు పరవశుడైన పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. అతనికి సుస్థిరమైన, ప్రకాశమానమైన స్థానాన్ని అనుగ్రహించాడు. 

ఏదైనా ఏకాదశి రోజున నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలంటే జంకే మనకు... మనసుంటే, శ్రద్ధ ఉంటే, అసాధ్యమైన ఏ కార్యాన్నయినా సాధించవచ్చని ధ్రువుడి కథ తెలియజేస్తుంది. ఆ విధమైన ఉపవాస దీక్షతో భగవంతుడి అనుగ్రహం పొందిన ధ్రువుడిలా... మనం కూడా దృఢమైన, శుద్ధమైన మనసుతో, నియమ నిష్టలతో మోక్ష సాధనకు ప్రయత్నం చెయ్యాలి. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.

సుభాషితమ్

 *ॐ卐 _-|¦¦-సుభాషితమ్|¦¦|-_ ॐ卐* 

💎


శ్లో𝕝𝕝 సదాచారేణ సర్వేషాం శుద్ధం భవతి మానసం!

నిర్మలం చ విశుద్ధం చ మానసం దేవమందిరమ్!!


తా𝕝𝕝 సత్ప్రవర్తనతో అందరికీ మనస్సు పరిశుద్ధమౌతుంది.... *నిర్మలము, పరిశుద్ధమూ అయిన మనస్సే దేవమందిరం*....

మాఘమాస మహత్యం*

 వందేమాతరం


*మాఘమాస మహత్యం*


 హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది.


అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.


మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.

 

అటువంటి పవిత్రమైన మాఘమాసం విశిష్టత గురించి మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అందించిన శ్రీమతి శేషారత్నం గారి అద్భుతమైన వివరణ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకుందాం.