2, జులై 2025, బుధవారం

నిధుల రహస్యాలు

 ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో వివరించిన నిధుల రహస్యాలు - 

 

.     నిధి అనగానే చాలమంది బంగారం , వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువయిన సంపద అనగా వైద్యానికి , మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు పైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్నికొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు . ధనం ను కూడా భూగర్భం నందు దాచిన దానిని కూడా నిధి అంటారు. 

          

.     నిధులు అనేవి ముఖ్యంగా మూడు  రకాలుగా దాచబడి ఉంటాయి.  అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు . అదే సమయంలొ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి . మొత్తం వూరిలో శవాన్ని తీయుటకు మనుషుల కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణం అయ్యే వ్యాధి పేరు "కలరా" అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.

                 

ఇక మనం రెండోవరకం నిధుల గురించి తెలుసుకుందాం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది.

          

        మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశ 

పూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు . ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు  రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను . 

         

.            ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు  వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన "నిధిప్రదీపం" అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.  

              

.       శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు .  అవి 

  *   కచ్చప .

 *    మకర .

 *    శంఖ .

 *    పద్మ .

        

.       వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు . 

            

.      మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును. 

   

నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు  - 


 *  ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .

 

*  డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.

 

*  కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును. 

 

*  ఒక ప్రదేశం నందు అనేక  వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .


 *  పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడిపడిన గ్రామాల యందు నిధి ఉండును. 


 *  ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును . 

 

*  ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును. 

        

.        పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి . స్థలాభావం వల్లన వివరించలేకున్నా . 

  

భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి  - 

       

.     ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన  స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి  ఆ కుండ శిదిలిం అయ్యి ఉన్నచో ఆస్థానమున నిధి ఉన్నదని గుర్తించవలెను.

          

 గమనిక  - 

          

ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు . దయచేసి అత్యాశకి పోకండి .మీకు దక్కాలని రాసి ఉంటే ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు .  


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     

కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

 9885030034

Panchaag

 


గడన గల మగని జూచిన


చక్కని పద్యం

గడన గల మగని జూచిన

నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;

గడ నుడుగు మగని జూచిన

నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ

భావం: స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు.

పరమాత్మా నీవే ఉన్నావు...!

 ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.


ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.


దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.


అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.


ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.


కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది, 

" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,


నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..

అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.


అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?? అంది.


అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, 


"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.


ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.


ఈ కథలో...


 *ఆవు* - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.


 *పులి* - అహంకారం నిండిఉన్న మనస్సు.


 *యజమాని* - సద్గురువు/పరమాత్మ.


 *బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం


మరియు,


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.


 *నీతి :* 


ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,


" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.


 దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.


ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.


పరమాత్మా నీవే ఉన్నావు...!

అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!  

                     

🌹🙏🌹శ్రీ 🌹🙏🌹

హిందువు

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


🕉️ *దేవుడు ఎక్కడ వున్నాడో తెలియని వాళ్ళు సమాధుల్ని పూజిస్తారు. హిందువు లు: ప్రకృతిలో లభించే ప్రతీ వస్తువును పూజి స్తారు. కారణం* :⬇️ 


▪️✅ *భగవంతుడు తానే : గాలీ, నీరు, నిప్పు, నింగి, నేల అయివున్నాడనీ ; సూక్షంగా, స్తూలంగా , కారణంగా, కారణా తీతం గా ; నీవార సూకాగ్రంగా, అణువు పరిమాణమై, లోపలా, వెలుపలా, నిండి పరిపూర్ణమై ; అండమై, పిండమై,బ్రహ్మాండమై వెలు గుతూ ; అన్నింటా బీజంగా - సృష్టికి ఆధారంగా ; రక్షకుడి గా, శిక్షకుడిగా, మోక్ష ప్రదా తగా వుంటూ ; భ్రమను కల్పిస్తూ, భ్రాంతి పుట్టిస్తూ, శాంతి చేకూరుస్తూ ; దృశ్యా లుచూపిస్తూ, సస్యాలు పోషి స్తూ, నాట్యాలు నర్తిస్తూ వుం డే ; భూత - భూతేశుడూ, దేవ - దేవేశుడూ, ఈశ - పర మేశుడూ, లోక - లోకేశుడూ, సర్వ - విశ్వేశ్వుడూ, సర్వే శుడూ అయిన పరమాత్మే వున్నాడని గ్రహించిన మతం : హిందూ మతం. అందుకే హిందువులు అన్నింటిలో దేవుడ్ని చూస్తారు*.



 


హరిః ఓమ్.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *అర్థా గృహే నివర్తన్తి స్మశానే మిత్ర బాంధవా*

            *సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి*


*తా𝕝𝕝 మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు.* *మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.*

     

 ✍️🌸💐🌹🙏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷బుధవారం 2 జూలై 2025🌷*

``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

      *వాల్మీకి రామాయణం*                

            *86వ  భాగం*

```

అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు ఆగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.


ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని… “అన్నయ్యా! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు!” అన్నాడు.


అప్పుడు రాముడు…  “నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు!” అని చెప్పాడు.


“దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు” అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. 


లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. 


రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. 


ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. 


అప్పుడు లక్ష్మణుడు… 'నేను విష్ణు అంశ' అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.


వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు.

(లక్ష్మణుడు పడిపోయేముందు.. 

'నేను విష్ణు అంశని!' అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). 


ఇంతలో హనుమంతుడు మూర్ఛనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి 'నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా' అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళీ స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.


అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లేచిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. 


వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది… “బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు” అన్నాడు.


లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వశుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. 


వెంటనే హనుమంతుడు వచ్చి… 

“స్వామీ! ఏ విధంగా అయితే 

శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి” అన్నాడు.


అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి… 

“దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అపహరించినవాడా! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను…” అని రాముడు చెబుతుండగా, రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు. 


ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతోంది. 


అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.


‘అవి బాణాల, మెరుపులా?’ అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి అన్ని మర్మస్థానాలని బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.(ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు)


అప్పుడు రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతోంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పో!” అన్నాడు.


రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని…  “గరుత్మంతుడు  పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ‘ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళీ స్వస్థతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము!’ అన్నాడు.


ఒకనాడు బ్రహ్మగారు నాతో 'నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు' అన్నారు.  ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు(రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు 'ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు!' అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి…  'స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు!' అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు (నందీశ్వరుడిని చూసి రావణుడు.. 'కోతి ముఖంవాడ' అని హేళన చేశాడు. 'ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా!' అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగా కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు నిద్రలేస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి!” అన్నాడు.```


        *రేపు…87వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

బుధవారం🪷* *🌷02 జూలై 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🪷బుధవారం🪷*

 *🌷02  జూలై  2025🌷*      

    *దృగ్గణిత పంచాంగం*               


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి     : సప్తమి* ప 11.58 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : ఉత్తర* ఉ 11.07 వరకు ఉపరి *హస్త*

*యోగం  : వరీయాన్* సా 05.47 వరకు ఉపరి *పరిఘ*

*కరణం   : వణజి* ప 11.58 *భద్ర* రా 12.59 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.30  సా  04.30 - 05.30*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం           : రా 08.28 - 10.15*

*దుర్ముహూర్తం  : ప 11.45 - 12.38*

*రాహు కాలం   : మ 12.12 - 01.50*

గుళికకాళం       : *మ 10.33 - 12.12*

యమగండం     : *ఉ 07.17 - 08.55*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.38 - 08.16*

సంగవకాలం         :*08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :      *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ శుద్ధ అష్టమి*

సాయంకాలం        :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.55*

-----------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      *🪷సరస్వతీ శ్లోకం🪷*


*సరస్వతీ నమస్తుభ్యం* 

*వరదే కామరూపిణీ*

*విద్యారంభం కరిష్యామి*

*సిద్ధిర్భవతు మే సదా*

*యా కుందేందు* 

*తుషార హార ధవళా*

*యా శుభ్ర వస్త్రావృతా*

*యా వీణా వరదండ*

*మండిత కరా*

*యా శ్వేత పద్మాసనా*

*యా బ్రహ్మాచ్యుత శంకర*   

*ప్రభృతిభిర్-దేవైః*

*సదా పూజితా*

*సామామ్ పాతు సరస్వతీ*  

*భగవతీ నిశ్శేషజాడ్యాపహా*


*🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

    🌹🌷🌹🌷🌹🌷🌹

కాయగూరల సంస్కృతం పేర్లు!

 మన కాయగూరల సంస్కృతం పేర్లు!


-అవాక్పుష్పీ (బెండకాయ)

-జంబీరమ్ (నిమ్మకాయ)

-ఆలుకమ్ (బంగాళదుంప)

-ఉర్వారుక (దోసకాయ)

-కారవేల్ల (కాకరకాయ)

-కోశాతకీ (బీరకాయ)

-బృహతీ (ముళ్ళవంకాయ)

-మరిచకా (మిరపకాయలు)

-రాజకోశతకీ (కాప్సికం)

-లశున (వెల్లుల్లి)

-వార్తాక (వంకాయ)

-బింబమ్ (దొండకాయ)

-శీతలా (సొరకాయ)

-క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)

-పలాండు (ఉల్లిగడ్డ)

-కూష్మాండ (గుమ్మడికాయ)

-తౄణబిందుక (చేమదుంపలు)

-మూలకమ్ (ముల్లంగి)

-రంభాశలాటు (పచ్చి అరటికాయ)

-సూరణ (కంద)

ISSSK

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)


అవశ్యం క్రియమాణస్య 

దృశ్యతే కర్మణః ఫలమ్.

అలం నిర్వేదమాగమ్య 

న హి నో మీలనం క్షమమ్

(4.49.8)


*అర్థం:*

కష్టపడితే దాని ఫలితం తప్పక లభిస్తుంది. దిగులుపడి కూలబడితే కంటిమీద కునుకు కూడా పట్టదు.

_(నేటి యువత బాగా గ్రహించాలి)_

శ్రీ జగన్నాథ ఆచార్యుల వారి *'పూరి జగన్నాథ స్తుతి'* తో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః 


శుభ బుధవారం.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *అర్థా గృహే నివర్తన్తి స్మశానే మిత్ర బాంధవా*

            *సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి*


తా𝕝𝕝 మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు. *మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.*

     

 ✍️VKS ©️ MSV🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ సప్తమి - ఉత్తరాఫల్గుణి -‌‌ సౌమ్య వాసరే* (02.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

📆తేది : , *2, జూలై, 2025


*శ్రీరస్తు,శుభమస్తు,ఆవిఘ్నమస్తు*          

*ప్రదేశము:*  *హైదరాబాద్,తెలంగాణ,* *భారతదేశము.*

🙏 🕉 *నమః శివాయ*

 🙏 *నమో వెంకటేశయ*        

         *ఓం శ్రీ *స్వామియే*శరణం*అయ్యప్ప*  

📆తేది : , *2, జూలై, 2025*

🌹సంవత్సరం :     *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

🍫ఆయనం : *ఉత్తరాయణం*

🌈ఋతువు : 🌻 *గ్రీష్మ ఋతువు*

🔥మాసం : *ఆషాఢ*

🙂  పక్షం :   *శుక్ల*

🍎వారము: *బుధవారం* ( *సౌమ్యవాసర*)                             

*☀సూర్యోదయం : *ఉ 5.49*

*🌤*సూర్యాస్తమయం* : *సా 6.50*

🏵తిథి:  *సప్తమి నిన్న ఉ 10.20 నుండి ఈ రోజు  ఉ 11.58 వరకు, తర్వాత అష్టమి.*

⭐నక్షత్రం: *ఉత్తర ఫల్గుణి నిన్న ఉ 8.53 నుండి ఈ రోజు ఉ 11.07 వరకు, తర్వాత హస్త*. 

🧶యోగము: *పరియాన్ రోజు సా 5.46 వరకు.*

🤠కరణం-1:*పణజి ఈ రోజు  ఉ 11.59 వరకు*

🤠కరణం-2:: *భద్ర ఈ రోజు రా తె 1.00 వరకు.* 

👍అభిజిత్ ముహూర్త: *లేదు.*

👏బ్రహ్మ ముహూర్త :*రా తె 4.13-5.01*     

👌అమ్రుతఘడియ:  *లేవు.*              

🙉దుర్ముహూర్తం: *ఉ 11.54-12.46*

🐵గుళికకాలం:*ఉ 10.42-12.20*

🙊యమగండం: *ఉ 7.27-9.05*

 🙈వర్జ్యం: *రా 8.28-10.15.*

😡రాహుకాలం:*మ 12.20-1.57*

   సూర్యరాశి: *మిథునం*

   చంద్రరాశి: *కన్య*


*గోమాతను పూజించండి*

  *గోమాతను  సంరక్షించండి* 🥦🥦🥦🥦🥦🥦🥦🥦

*పచ్చని చెట్లను పెంచండి* *స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి* *పర్యావరణాన్ని కాపాడండి* *వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది*

🥦🥦🥦🥦🥦🥦🥦🥦

కవితాకన్యా వృణీతే స్వయం!

 శు భో ద యం🙏


కవితాకన్యా వృణీతే స్వయం!


కవితాకన్యక వరించేదెవరిని?


" నైనం వ్యాకరణజ్ఙమేతి పితరమ్ !

నభ్రాతరం ఛాందసమ్/

మీమాంసానిపుణం నపుంసక ఇతి,జ్ఙాత్వా నిరస్తాదరాత్/

"కావ్యాలంకరణజ్ఙమేవ, కవితాకన్యా వృణీతే స్వయమ్ "//

ఒక కవిగారు కష్టపడి ఒకకావ్యంవ్రాశారు.ఆకావ్యకన్యకు (కావ్యాన్ని కన్యగా పోల్చుట కవిసమయం) తగిన వరుని నిర్ణయించగోరి నలుగురు వరులను రప్పించారు. వారు వరుసగా-

1 వ్యాకరణవేత్త.

2వేదవేత్త.

3 తర్కశాస్త్ర పండితుడు

4కావ్య,అలంకారాదులపరిచయముగలవాడు.

     ఈనలుగురిలో నొకనివరింపుమని కవితాకన్యనుగోర ఆమె మొదటి ముగ్గురను కాదని నాల్గవవానినే వరించినది.కారణమేమో? చూతము.

 1"నైనం  వ్యాకరణజ్ఙమేతిపితరమ్."-వ్యాకరణవేత్తను తండ్రివరుసయగుననితిరస్కరించినదట.!

2 వేదవేత్తసోదరుడగునని వలదన్నదట!

3తర్కశాస్త్రప్రవీణునిజూచి వీడా! తృతీయప్రకృతి(నపుంసకుడు)వలదన్నదట! వ్యర్ధవాగ్వాదమేగాని పనిశూన్యమని యామెయాంతర్యము.

4 ఇకమిగిలిన వాడు వివిధకావ్యములనెరింగినవాడు.అలంకారశాస్త్రవేత్త,రసజ్ఙుడు కావున అతనిని స్వయముగా వరించినదట!


ఈవిషయాన్నే తిరుపతివేంకట కవులు చమత్కారంగా-

"ఎందరిజూపెనేని వరియింపదు 'మాకవితాకుమారి' క /

న్నందుకుదేశముల్ తిరుగుటబ్బెను సౌఖ్యములేకపోయె,నా /

నందనృపాల! నీదుసుగుణంబులనేగనిదెల్పినంత, వెం /

టందలయూచె;ఁగావున దటాలునదీనిపరిగ్రహింపుమా!

     (నానారాజ సందర్శనం-తిరుపతికవులు) అన్నారట!


   చూచితిరా కావ్యకన్యనిర్ణయము."చదువుతోబాటురసజ్ఙత అత్యవసరము.అప్పుడే చదివినదానికి సార్ధకత!సౌందర్యమునారాధించుటకు కళాహృదయముండవలెను.అట్లే సాహిత్యము నారాధించుటకు సరసుడై యుండవలెను.లేకున్నకావ్యరసాస్వాదనము.గగన కుసుమమే!!


                 స్వస్తి!🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷