3, ఆగస్టు 2023, గురువారం

ఆర్ఎస్ఎస్

 *ఆర్ఎస్ఎస్ ఎలా పుట్టింది.. ?*

 *ఒక జాతీయ శక్తిగా ఎలా అవతరించింది... ?*

              


*ఆర్ఎస్ఎస్ సైన్యాన్ని వెనుకుండి ముందుకు నడిపించిన నాయకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఎవరు..?*


*ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి.. ?*


 *దేశాన్ని పరిరక్షించాలంటే దేశ సంస్కృతిని కాపాడాలని నమ్మిన వ్యక్తి ఆయన. సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశమొత్తం తయారుకావాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో మహా యజ్ఞం మొదలుపెట్టి... ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేశారు. ఆయనే డాక్టర్ హెడ్గేవార్. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆయన్ను స్మరించుకుందాం.*🚩🙏


*ఆర్ఎస్ఎస్- ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంధ సంస్థ...*


ఆర్ఎస్ఎస్ .. నలబై లక్షల మంది సేవకులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంధ సంస్థగా గుర్తింపు పొందింది. ఇదో మత సంస్థ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్నా... వాటన్నింటినీ పక్కన పెట్టి... గొప్ప మానవతా సంస్థగా లక్షలాది మంది మన్ననలు పొందుతోంది ఆరెస్సెస్. హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్.. భారతీయ సంస్కృతి, పౌర సమాజ విలువలను సమర్థించే ఆదర్శాలను పోత్సహిస్తూ సాగుతోంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ సంస్థ అందించిన సేవలు అనన్య సామాన్యం. 1962లో చైనా-భారత్ యుద్ధ సమయంలో వారి సేవలను ఆనాటి ప్రధాని నెహ్రూ సైతం ప్రశంసించారు. అంతే కాదు 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు అఖుంటిత సేవా నిరతితో, ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సాగిపోతోంది.


ఆ లక్ష్యంలోంచి పుట్టుకొచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్​సంఘ్‌‌..

మనదంతా ఒకే జాతి అన్న భావన ఆర్ఎస్ఎస్‌ మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా జీవన విధానంగా భావిస్తుంది. అలాంటి ఆలోచనను కలిగించిన యుగద్రష్ట డాక్టర్ జీ. ఆయనే డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్.. ఆరెస్ఎస్ వ్యవస్థాపకులు. 1925లో ఈ సంస్థ పురుడుపోసుకుంది. హిందూ సంస్కృతి హిందుస్తాన్ గుండె చప్పుడు. అందుకే హిందుస్తాన్‌ను పరిరక్షించుకోవాలంటే, హిందూ సంస్కృతిని రక్షించాలి అని భావించారు హెడ్గేవార్. సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందనీ... హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం హిందువుల విధి అని బలంగా నమ్మారు. తాను నమ్మిన సిద్ధాంతాల ఆచరణలో పెట్టేందుకు 1925లో విజయదశమి రోజున నాగ్‌‌పూర్‌‌లో రాష్ట్రీయ స్వయం సేవక్​సంఘ్‌‌ను స్థాపించారు. సామాజిక వ్యవస్థ నిర్మాణానికే ఆయన ఆర్ఎస్ఎస్​ను ప్రారంభించారు. హిందూ సమాజం అనేక కారణాలతో చెల్లాచెదురైందని, హిందూ సమాజ సంఘటన ద్వారా దేశాన్ని శక్తిమంతంగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు.


కందకుర్తి గ్రామంతో హెడ్గేవార్ కుటుంబానికి ఉన్న అనుబంధం..

తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న కందకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం నాగ్‌పూర్‌లో స్థిరపడింది. 1889, ఏప్రిల్ 1న హెడ్గేవార్ నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆయనకు 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించారు. దాంతో ఆయన సంరక్షణ బాధ్యతలను సోదరులే తీసుకున్నారు. పూణేలో చదువుకునేప్పుడు బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి వందేమాతరం పాడారు. దాంతో ఆయన్ను పాఠశాల నుంచి బహిష్కరించారు. చిన్నప్పటి నుంచే హెడ్గేవార్‌లో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపించేది. అది  1897 జూన్ 22. విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. కానీ ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు. పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ బాలుణ్ని చూసి సోదరుడు, ''నీకు మిఠాయిలు ఇవ్వలేదా?'' అని ప్రశ్నిస్తే..మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటీష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం?' అంటూ ఆ బాలుడు ఎదురు ప్రశ్నించాడు. అతడు ఎవరో కాదు హెడ్గేవార్. బీవీ దేశ్ పాండే, ఎస్ఆర్ రామస్వామి రచించిన 'డాక్టర్ హెడ్గేవార్, ద ఎపక్ మేకర్' అన్న పుస్తకంలో ఈ విషయం రాసి ఉంది. ఈ ఘటనతో ఆయనలో హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతోంది.


స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా..

మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెడ్గేవార్ కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో, ఆస్పత్రి ప్రారంభించి డబ్బు సంపాదించుకోవాలనో అనుకోలేదు. భారత దేశానికి స్వాతంత్య్రం సాధించడమే ఆయన లక్ష్యం. అయితే ఆయనకు విప్లవకారుల కార్యకలాపాలపై సదభిప్రాయం లేదు. కేవలం కొందరు బ్రిటిష్‌ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటీష్ పాలకులు దేశాన్ని వీడిపోరని భావించారు. అందుకే స్వాతంత్ర ఉద్యమకాంక్షను ప్రజల్లో రగిల్చాలనుకున్నారు. 


ఆ తర్వాత మూడేళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు..

1916లో లోకమాన్య తిలక్‌కు బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. స్వాతంత్యం నా జన్మహక్కు అంటూ తిలక్ చేసిన నినాదం ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించింది. ఇదే స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెడ్గేవార్ తీవ్రమైన ప్రసంగాలను చేయడం ప్రారంభించారు. దాంతో ఆనాటి పాలకులు ఆయన్ను ఏడాది పాటు జైల్లో పెట్టారు. 1922, జూలై 12న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ, ప్రజల మద్దతు కూడట్టడం ప్రారంభించారు హెడ్గేవార్. సంఘ్ శాఖలను ప్రాంభించడం కోసం కాశీ, లక్నో తదితర ప్రాంతాలకు తన అనుచరులను పంపారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగానూ హెడ్గేవార్ జైలుకు వెళ్లారు.


ముస్లింల దండయాత్రలతో హిందుస్థాన్‌‌లోకి ఇస్లాం ప్రవేశం..

ఆర్‌ఎస్‌ఎస్ స్థావన వెనుక ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంది. ముస్లింల దండయాత్రలతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లిం రాజులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటూనే పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడ్డారు. 


తర్వాతి కాలంలో బ్రిటీష్ వారి ప్రవేశంతో భారత దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1920 సంవత్సరంలో ప్రారంభమైన కమ్యూనిజం ద్వారా నక్సలిజం పుట్టుకొచ్చింది. 


విభజించి పాలించు సూత్రాన్ని అందిపుచ్చుకున్న బ్రిటీష్ వారు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారని, ఆ తర్వాత దాడులు పరంపర కొనసాగిందని ప్రచారం చేశారు. భారత్ ఒక ఉపఖండం అనీ, ఇది ఒక దేశం కాదు, జాతి కాదనే సిద్ధాంతాన్ని ప్రబలంగా ప్రజల్లో నాటేందుకు ప్రయత్నించారు. ఈ సిద్ధాంతాల ప్రభావానికి లోనై ఉదారవాద మేధావి వర్గం పుట్టుకొచ్చి.. దేశ సమగ్రతకు సవాల్ విసిరింది. వీటన్నింటినీ అధిగమించేందుకు హిందూ సమాజ సంఘటితానికి హెడ్గేవార్ పూనుకున్నారు.


హెడ్గేవార్‌ గొప్పతనం‌ గురించి ప్రణబ్ ముఖర్జి ఏమన్నారంటే.. 

దేశం అంతటా దేశ హితం కోసం ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలన్నది హెడ్గేవార్ ఆకాంక్ష.  ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునర్ జీవనం వేగంగా జరుగుతోంది. దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2018లో ఆర్‌‌ఎస్‌‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ... హెడ్గేవార్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee in RSS meeting) సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ‘‘భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్‌‌కు నివాళులు అర్పించడానికి వచ్చాను’’ అని రాశారు. ఈ ఒక్క మాట చాలు హెడ్గేవార్ మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.✍️


 🚩 *జైశ్రీరామ్... భారత్ మాతాకీ జై 🇮🇳🙏*

           

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

E


 

మొట్టికాయలు_అత్యంత_ప్రియం

 #మొట్టికాయలు_అత్యంత_ప్రియం..


        ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్తితుల్లో, ఎవరికీ కనపడకుండా, అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి వుండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేక పోవడంతో అనావృష్టి ఏర్పడింది. 


        చెట్లన్నీ ఎండి పోతున్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చెయ్యలేక పోతన్నానే... అని బాధపడుతున్నాడు. ఇలా చెట్లన్నీ ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలయిన జీవులన్నీ ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు.


        ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న వారిద్దర్నీ చూసి...


        “దేవేంద్రా! ఎందుకలా విచారంగా కనిపిస్తున్నారు ?” అనడిగాడు.


         “నారదమహర్షీ! మీకు తెలియనిది ఏముంటుంది?అనావృష్టి కారణంగా నీళ్ళు లేక చెట్లన్నీఎండిపోతున్నాయి. నేనుండి కూడా ఏమీ చెయ్యలేక పోతున్నాను” అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు.

   

        “మహేంద్రా విచారించకు. కష్టాలు కలకాలం ఉండవు కదా ! మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంత కాలం ఓపికపట్టు!” అని ఓదార్చాడు నారదుడు.

   

        “మహర్షీ! నేను నా గురించి బాధ పడడం లేదు. నేనిక్కడ ఉండి కూడ నాకు ఆశ్రయమిచ్చిన ఈ ఆడవికి ఏమీ చెయ్యలేకపోతున్నాను. అదే నా బాధ” అన్నాడు ఇంద్రుడు.

   

        “అగస్త్య మహర్షి నదీ సప్తకం నుండి కావేరిని తీసుకుని ఇటువైపే వస్తున్నాడు. కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంక అనావృష్టి ఉండదు బాధపడకు” అని చెబుతూ....

   

        “ఇంద్రా! అది జరగాలంటే మీరొక పనిచెయ్యాలి. పార్వతీ మాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలంటే ఆమె ప్రియ పుత్రుడు గణపతిని పూజించండి అన్నీ సక్రమంగా జరిగి పోతాయి. మీకు మంచి రోజులు కూడా వస్తాయి” అని సలహా ఇచ్చాడు నారదుడు.


        ఇంద్రుడు, శచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. దేదీప్య మానంగా ప్రకాశిస్తూ గణపతి ప్రత్యక్షమయ్యాడు. శచీoద్రులు ఆయనకు ఆనంద భాష్పాలతో అభిషేకం చేసారు.


       సంతోషించిన గణపతి “దేవేంద్రా! నీకేం కావాలో అడుగు” అన్నాడు.

   

        “గణాధ్యక్షా! మాకు ఆశ్రయమిచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతోంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామీ!” అని ప్రార్ధించారు.

   

        “దేవేంద్రా! స్వర్గ లోకమా.. భూలోకమా.. పాతాళమా.. ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు” అన్నాడు గణపతి.

   

        “స్వామీ! పరమేశ్వరుడంతటివాడు అగస్త్య మహర్షి! ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చాల పవిత్రమైన జలం. దాన్నిక్కడ ప్రవహింప చేస్తే అడవంతా సంతోషిస్తుంది” అన్నాడు. 


        ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి.


        అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకుని కొంకణ దేశం వైపు బయల్దేరాడు అగస్త్య మహర్షి. గణపతి కాకి రూప౦లో అగస్త్యుడి కమ౦డల౦ మీద వాలాడు. ఆ సమయ౦లో కొ౦చె౦ పరాకుగా ఉన్నాడు మహర్షి. కాకిని అదిల్చాడు. అది పారిపోతున్నట్టు నటి౦చి మళ్ళీ తిరిగివచ్చి కమ౦డల౦ మీద వాలి, కమ౦డలాన్ని తన కాళ్ళతో తన్ని౦ది.


        అగస్త్యుడి చేతిలోని కమ౦డల౦ కి౦ద పడిపోయి౦ది. దానిలో ఉన్న నీళ్ళన్నీ కి౦ద ఒలికి పోయాయి...


        “అయ్యో పరమేశ్వరా! నేను పడ్డ కష్ట౦ వృధా అయిపోయి౦దే!” అని బాధపడ్డాడు మహర్షి. 


        అ౦తలోనే కోప౦ వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయి౦ది. ఆశ్చర్య౦గా చూస్తూ అలాగే నిలబడి పోయాడు. అదే సమయ౦లో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయ వేషాలు వేస్తున్నాడనుకుని కోప౦తో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి ఆతడి తలకు తగిలింది.


        దొరక్కు౦డా తప్పి౦చుకుంటూ దూర౦గా పారిపోతూ,  ముప్పుతిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోప౦తో వె౦టపడ్డాడు మహర్షి. ఏమయినా సరే, తన వె౦ట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదనే నిశ్చయ౦౦తో ఆ బ్రహ్మచారి దొరకక పోతాడా... అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి.


        అదే సమయ౦లో శూర్పకర్ణ౦, ల౦బోదర౦, ఏనుగు తల, ఎలుక వాహన౦తో భవానీ మాత కుమారుడు గణపతి, తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూప౦లోను, బ్రహ్మచారి రూప౦లోను తనను అల్లరి పెట్టి౦ది గణపతేనని అర్ధ౦ చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాప౦తో...


        “అయ్యో గణాధ్యక్షా! వినాయకా! నేనె౦త అపరాధిని. ఎ౦త పాప౦ చేసాను నా పాపానికి నిష్కృతి లేదు. అపచార౦ చేసాను. నన్నే౦ చేసినా పాప౦ లేదు. అవివేక౦తో నిన్ను గుర్తి౦చలేక కొట్టబోయాను. నన్ను క్షమి౦చు” అ౦టూ తలమీద మొట్టుకు౦టూ ఏడ్చేస్తున్నాడు అగస్త్యుడు.


గణపతి చిరునవ్వుతో “పొరపాటు ఎవరికేనా సహజమే! నీ మీద నాకు కోప౦ లేదు. నీకే౦ కావాలో అడుగు!” అన్నాడు.

“స్వామీ! నేను చేసి౦ది తప్పే! వివేక౦ వదిలేసి కోప౦తో నీ తలమీద మొట్టాను”  అ౦టూ పశ్చాత్తాప౦తోను, బాధతోను తన తలమీద మళ్ళీ మళ్ళీ మొట్టుకు౦టున్నాడు. 


        కొ౦చె౦ సేపటికి తేరుకుని కి౦ద పడిన కమ౦డలాన్ని చేతిలోకి తీసుకుని “శివార్చనకు కూడా నాకు నీరు మిగల లేదు!” అన్నాడు దిగులుగా.


        “బాధ పడకు! శివార్చనకు నీరు నేనిస్తాను” అని గణపతి తన తొండాన్ని చాపి కిందపడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికిచ్చాడు. 


        “మహర్షి! ఇంద్రుడి  కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది. అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోసిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే! నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద మొట్టుకున్నావు. 


        ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని, నన్ను పూజించేప్పుడు తలమీద మొట్టి కాయలు మొట్టుకుంటారో వాళ్ళని వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోర్కెలు తీరుస్తాను. నా తండ్రితో సమానుడవు. నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే! నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు” అని చెప్పి...


        ఇంకా  ఎన్నో వరాలు అగస్త్య మహర్షికిచ్చి అ౦తర్ధానం అయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి, నెత్తినీద మొట్టికాయలు మొట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించడం మొదలయింది...సేకరణ...🙏

Village


 

తెలివికి వివేకానికి తేడా

 *శుభోదయం*

🙏💐🙏💐🙏


తెలివికి వివేకానికి తేడా ఏమిటి? 


*తెలివి బహిర్ముఖం...*

*వివేచన అంతర్ముఖం.*

  

*తెలివి:* బాహ్యసృష్టి లోని ప్రతి విషయమును గురించిన పరిమితమైన అవగాహన. 


*వివేచన:* అంతరంగా ఉండే తత్వాన్ని గురించిన లోతైన గ్రహింపు.


తెలివి అందరికీ ఉంటుంది.., వ్యక్తిని బట్టి అవగాహన మారుతుంది..


వివేచన కొందరికే ఉంటుంది. ఇది సత్యమైన తత్వము... అంతటా ఒకేలా భాసిస్తుంది.. మార్పు లేనిది...   


అలాగే....


పరమాత్మను గురించిన అవగాహన (తెలివి) అందరిదీ... కానీ అదే పరమాత్మ గురించిన లోతైన గ్రహింపు (వివేచన) కొందరిదే... 


*ఓం శ్రీ రమణాయ నమః*

🙏🙏🙏🙏🙏🙏

బ్రాహ్మణ భోజనం

 ఆల్ ఓవర్ ఇండియా

శర్మ స్ బ్రాహ్మణ భోజనం


మీ ఇంట జరిగే శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి వేద పండితులకి,మడితో రుచిగా శుభ్రంగా (ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా)  మీరు కోరుకున్న విధంగా బ్రాహ్మణ క్యాటరింగ్ చేయబడును దూరప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు, భవానీలకు, వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


సికింద్రాబాద్ రవి కిరణ్ శర్మ7842413139

సికింద్రాబాద్ కళ్యాణ్ శర్మ9885785556

విజయవాడ సాయిశర్మ 7396881404

విజయవాడ పవన్ శర్మ 79896 44180

వైజాగ్ సాయి శర్మ 7032324851

బెంగళూరు బాలసుబ్రమణ్యం శర్మగారు9986119510

తిరుపతి హేమంత్ శర్మ9959859227

కాకినాడ హరి శర్మ

08142729222

సామర్లకోట శర్మ గారు

9182285617

గుంటూరు సాయి శర్మ7989585295

కడప మురళీ శర్మ

9866261232

చెన్నై శ్రీనివాస్ శర్మ7395932954

కేరళ శర్మ9447136023

ముంబై శివరామన్ శర్మ+91 74484 08447

మధురై నారాయణ శర్మ9842191826

అరుణాచలం లక్ష్మీకాంత శర్మ8870218670

శ్రీరంగం జై శర్మ+91 94871 80737

న్యూఢిల్లీ ఫణి కుమార్ శర్మ9650873730

నాగపూర్ 9505651387

వారణాసి శర్మగారు6387716431


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి

ఊహకు భావనకు తేడా

 శుభోదయం

💐🙏💐🙏💐

ఊహకు భావనకు తేడా ఏమిటి? 

ఊహ భౌతికం... 

భావన మానసికం... 


*ఊహ:* మనిషిని అద్భుతమైన ఆలోచనలతో 

*ఊ* రిస్తుంది.సంతోషాన్ని 

*హ* రిస్తుంది.. కష్టాల్లోకి నెట్టేస్తుంది..  

ఎందుకంటే ఊహ ఎప్పుడూ వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. 

ఊహ పేకమేడలాంటిది. 


విషయ వాసనలను 

అనుసరించి భౌతికంగా కొనసాగే ఆలోచన *ఊహ.* 


*భావన:* మనిషి మనసులో కలిగే అనుభూతి భావన. 

ఆనందాన్ని 

*భా* సింపచేసేది. 

పరమాత్మను 

*వ* రించేది,

ఇంద్రియ లాలసను 

*న* శింపచేసేది.


పరమాత్మకు దగ్గర చేసే పారమార్థికమైనది భావన.  


*ఓం శ్రీ రమణాయ నమః*

🙏🙏🙏🙏🙏🙏

బ్రహ్మ రాత

 ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట. దాని ‘తలరాత’ ఆ పుర్రె మీద ఇం కా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూ హలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చది వాడట. పొడి పొడి మాటలలో, 

*‘జన్మ ప్రభృతి దారిద్య్రం,దశ వర్షాణి బంధనం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగం భవిష్యతి’*

(పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదే ళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది.... 

నారదుడికి ఆశ్చర్యం వేసింది.... ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారా గార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమి టి? మా నాన్న గారు పొరబడ్డారా?’ అనుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు.... 

‘ఇత గాడు నిష్ఠ దరిద్రుడే... దిక్కులేకుం డా మరణించిన మాటా నిజమే.... 

కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించి నట్టు కాదంటావా?’’ అన్నాడట బ్రహ్మ!!!!!! 


 బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పిం చుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా  ఓ నమ్మకం.... 

*‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, స్తోకం మహత్ వా ధనం తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’*

(విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది.... 

సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) అని చెప్పాడు భర్తృహరి..... 


మరి అంతా బ్రహ్మ రాతే అయితే ఇక మనిషి కర్మ లకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా? బోలెడంత ఉంది.... 

ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం? అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే.... 

బ్రహ్మ రాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే.... 


 దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది.... 

మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు.... 

బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే..... 

ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు. ... 

మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే.... 

బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించు కోటానికి వీలులేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే....

🙏💖🌷

కండ్ల కలక నివారణ

 కండ్ల కలక నివారణ మార్గాలు - 


 *  30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 


 *  పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 


 *  పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 


 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 


 *  కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 


    పైన చెప్పిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్నది పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


  

   మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

పాదశేషం పీతశేషం

 పాదశేషం పీతశేషం 

సంధ్యాశేషం తథైవచ

(శ్వాన) శునోమూత్రసమం తోయం 

పీత్వా చాంద్రాయణం చరేత్!! 


కాళ్ళు కడిగిన తర్వాత మిగిలిన నీరు 

గ్లాసులో నీరు త్రాగిన పిమ్మట మిగిలి నీరు 

సంధ్యావందనం ముగిసిన పిమ్మట మిగిలిన జలము 

కుక్క మూత్రంతో సమానమగును అట్టి నీటిని త్రాగిన వ్యక్తి చాంద్రాయణ వ్రతము ఆచరించిన పిదపనే పవిత్రుడు అగును కావున పైన చెప్పిన మూడు విధములుగా మిగిలిన జలము ఏదేని ఒక చెట్టు మొదట్లో గానీ ఎవ్వరూ నడవని చోట గానీ విసర్జించాలి 

కానీ? అలా అని తులసి మారేడు వంటి పవిత్ర మొక్కలలో పోయకుండుటే మేలు!!

ప్రహేళిక

 **

         (ప్రహేళిక=పజిల్)


ఈ క్రింది పద్యాన్ని చదివి అర్థంచేసుకొని సరైన సమాధానమివ్వాలి. 



卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

       *జనకపుత్రియు విభుడు*

            *దర్శన మొసంగు*

           *****************

                   (చిత్రకవిత)            సీ౹౹                                    శ్రీవరుండగుటచేఁ గృష్ణు నేపతి యండ్రు?

            శ్రీనాథు పద్యాల శ్రేష్టమేది?

ఋషియాజ్ఞచే రాముడే రాక్షసిన్ జంపె?

            బాపుజీ దేనిపై వడకె నూలు?

వైకుంఠునకు నేది ప్రధమావతారమ్ము?

            పద్యగద్యమయ కావ్యవిధమేది?

వ్యాకరణోక్త "న" వర్ణము పేరేమి?

             లోభినే మందురు లోకమందు?   

తే.గీ౹౹అన్నిటకిఁ గూడ మూడేసి అక్షరాలె

ఆది   వర్ణముల్ వరుసగా నమరఁ  జేయ

జనకపుత్రియు విభుడు దర్శనమొసంగి

చెప్ప గలిగిన వారి నాశీర్వదించు .

ముదావహం

 ముదావహం మన బ్లాగును భారతదేశంలోనే  కన్నాప్రపంచంలోని వివిధ దేశాలలో విశేషించి  అమెరికా దేశంలోని వారు ఎక్కువగా చూస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి విశేషం ఏమిటంటే అమెరికాలో భారత దేశపు వీక్షకులకన్నా ఎక్కువగా వున్నారు. . అమెరికాలో వున్న తెలుగువారిని ఈ బ్లాగు అలరిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంటున్నది.  

దయచేసి మీ అభిరుచిని  కేవలం ఈ బ్లాగుని చూడటం వరకు మాత్రమే పరిమితం చేయకుండా మీకు నచ్చిన అంశాలను ఎందుకు నచ్చాయో నచ్చని అంశాలను ఎందుకు నచ్చలేదో అలాగే ఇంకా ఈ బ్లాగు మీరు ఎలావుండాలని కోరుకుంటున్నారో కూడా తెలియజేయగలరు.  మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ బ్లాగును ఇంకా ఇంకా మెరుగులుదిద్దే ప్రయత్నం చేయగలము. 
మీరుకూడా ఈ బ్లాగులో మీ రచనలను పోస్టు చేయవచ్చు.  మీ రచనలను పోస్టు చేయగోరే మిత్రులు ప్రక్కన వున్నFORM నింపి మీ వాట్సాప్ నెంబరుతో సంప్రదించగలరు. 
Dt.3-8-2023 time 12-12 PM. last 24 hours views are as follows. 


United States
81
India
60
France
24
United Kingdom
2
Belarus
1
Netherlands
1
Other
83

మొలత్రాడు

 *నిత్యాన్వేషణ*


*మొలత్రాడు*


“మన సనాతన ధర్మం ప్రకారం, పుట్టిన శిశువుకు 21వ, రోజున నూలు తాడు కడతారు. ఆ తరువాత మంచిరోజు చూసి బొడ్డు చేర్చికడతారు. (ఇక్కడ బొడ్డును చేర్చి కట్టడమంటే శిశు జననం అయిన తరువాత బొడ్డు కత్తిరించిన తరువాత మిగిలిన చిన్న ముక్కా ఎండిపోయి రాలిపోతుంది. దానిని తల్లి తన మంగళసూత్రాల్లోనో, ఎక్కడో భద్రపరుస్తుంది. దానిని నూలుపోగులో గుచ్చి మొలకి కడుతుంది). ఇంకొంచెం పెద్దయిన తరువాత, నల్లది కాని ఎర్రనిది కాని మొలతాడు కడతారు. ఆ తరువాత బోసిమొలతో ఎవరూ వుండకూడదు. అది మళ్ళీ పాడి ఎక్కిన తరువాత తీసేస్తారు.”

గురువు కనపడిన

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                _*సుభాషితమ్*_


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*గురుందృష్ట్వా సముత్తిష్టే దభివాద్య కృతాంజలిః|*

*నైతైరుపవిశేత్ సార్ధం వివదేన్నాత్మకారణాత్||*

*జీవితార్థమపిద్వేషాత్ గురభిర్నైవ భాషణమ్|*

*ఉదితోపి గుణై రన్యైఃశ గురుద్వేషీ పతత్యథః॥*


( *శ్లో॥29-30, అధ్యా-12,*, )  ≈


*శ్రీ కూర్మ పురాణం*


≈తాత్పర్యం≈

గురువు కనపడిన వెంటనే కూర్చున్న ఆసనం నుంచి లేచి రెండు చేతులూ జోడించి విధిగా నమస్కరించాలి. గురువుతో కలిసి ఒకే ఆసనం మీద ఎప్పుడూ కూర్చోకూడదు. తనకోసం గానీ, బ్రతుకుతెరువు కోసం గానీ గురువుతో ఎప్పుడూ వాదన చేయకూడదు. గురువుతో  ఆగ్రహంగా, ద్వేషపూరితంగా ప్రసంగించకూడదు. గురువు దగ్గర అవగుణాలున్నప్పటికీ గురువుని ద్వేషించకూడదు. అలా ద్వేషించిన వాడు పతితుడవుతాడు.

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -9*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -9*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *లక్ష్మీదేవికై నారాయణుని అన్వేషణ :* 


మతి స్తిమితము లేనివానివలె శ్రీమన్నారాయణుడు తన ప్రియసతి లక్ష్మీదేవిని వెదకుచూ ఎక్కడనూ గానక బాధపడుచుండెను. 


రెండు కన్నులను వేయి కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండగ చూచుచుండెను. తిరుగనిచోటు లేకుండగ తిరుగుచుండెను. ఎన్నియో కొండలకు ఆయన పాదస్పర్శ లభించినది.


 ఎన్నియోప్రదేశములు ఆయన ఆగమనముతో పవిత్రములయినవి. తలక్రిందుల జపము చేసినను స్వర్గమునకేగి నారాయణుని దర్శించుట కష్టమే, అట్టిది ఎందరికో ఆటవికులకు నారాయణుని అమోఘ దర్శన మగుచుండెను, 


కాని ఆయన నారాయణునిగ వారికి తెలియ స్థితిలో లేకుండెను. లక్ష్మిని గూర్చి నారాయణుడు గూడ బాధపడవలసి వచ్చెను గదా. నడచి నడచి ఆయాసమును పొందుటయే శరీరము తూలిపోవుచుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండొక కొండ పై ఒక చింతచెట్టును చేరినాడు. 


లక్ష్మిని గూర్చిన చింత తప్ప మరొక్క చింత అతనికి లేకుండెను. చింతచెట్టు చెంత జేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూచినాడు. యెటులైనను యెవ్వరికినీ కనిపించకుండా కొన్నినాళ్ళుండవలెనని యోచించిన వాడయి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ నుండ జొచ్చెను.


బ్రహ్మ, శివుడు గోవత్స రూపములు ధరించుట

నారదుడు హుటాహుటీగా సత్యలోకమునకు వెడలినాడు. తండ్రి అయిన బ్రహ్మదేవునకూ, తనకూ చదువులకూ తల్లి అయిన సరస్వతీదేవికీ ప్రణామాలు చేసినాడు. ‘ఏమిటి విశేషాలు!’ అన్నాడు బ్రహ్మ.


 ‘తండ్రీ! లోగడ మీరు లోకోపయుక్తమయిన ఒక ఆలోచన నాకు చెప్పియున్నారు. ఆ ఆలోచన శ్రీమహావిష్ణువును భూలోకమునకు రప్పించుటను గూర్చి, అందుకై నేను చేసిన ప్రధమ ప్రయత్నము యొక్క ఫలితమును మీకు చెప్పుటకై వచ్చియున్నాను. 


నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువునకూ, లక్ష్మీదేవికి ఎడబాటు కలిగినది. రమాదేవి కొల్లాపురములో తపస్సు చేస్తూయున్నది. శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపము తిండీ తిప్పలు లేక, నిద్రలేక ఆరోజుకారోజు మిక్కిలి శుష్కించి పోవుచున్నాడు. 


తండ్రీ! మీరేదియో ఒక విధముగ శ్రీమహావిష్ణువునకు ఆహారము లభించునట్లు చూడవలసినదని నారాయణుని యెడల గల తన సహజాభిమానముతో అభ్యర్థించాడు. నారదుడు ఆ విధముగా అభ్యర్థించగా బ్రహ్మదేవుడు తన జనకుడయిన శ్రీమహావిష్ణువును గూర్చి యాలోచించసాగినాడు.


 తండ్రి కష్టదశలోనున్నప్పుడు తనయుడతని కుపకరించి తీరవలెను గదా! 


‘సరియే ఆ సంగతి నేను ఆలోచించి కార్యమున పెట్టెదను’ అనెను బ్రహ్మదేవుడు. అది నారదునకు కొంత సంతోషమునకు కారణమయినది. శలవుగైకొని నారదమహాముని తన దారిన వెడలినాడు. 


 *సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా, ఆద్ర పోషక గోవిందా, ఆది పురుష గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా* 


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏

4

*ఓం నమో వెంకటేశాయ 🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 131*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 131*


🔴 *రాజనీతి సూత్రాణి - అష్టమాధ్యాయము* :


1. దుర్మేధసో సచ్చాస్త్రం మోహయతి 

(మంచిశాస్త్రం మేధాశక్తి లేనివాళ్ళకి భ్రాంతి కలిగిస్తుంది.) 


2. సత్సజ్గ స్వర్గవాస 

(సత్పురుషసంగమే స్వర్గవాసం.) 


3. ఆర్యా స్వమివ పరం మన్యంతే 

(సత్పురుషులు పరాయివాడిని కూడా తనవాడిలా భావిస్తారు.) 


4. రూపానువర్తీ గుణ 

(రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది.) 


5. యత్ర సుఖేన వర్తతే తదేవ స్థానమ్ 

(ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం.) 


6. విశ్వాసఘాతినో న నిష్కృతి 

(విశ్వాసఘాతకుడికి ప్రాయశ్చిత్తం లేదు.) 


7. దైవాయత్తం న శోచేత్ 

(దైవధీనమైనదానిని గూర్చి విచారించకూడదు.) 


8. ఆశ్రితదుఃఖమాత్మన ఇవ మన్యతే సాధుః (సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలె భావిస్తాడు.) 


9. హృద్గతమాచ్చాద్యాన్యద్వత్యనార్యః 

(మనసులో ఉన్నది దాచుకొని పైకి మరొకటి చెబుతాడు.) 


10. బుద్ధిహీన పిశాచతుల్య 

(బుద్ధిలేనివాడు పిశాచం వంటివాడు.) 


11. అసహాయః పథి న గచ్చేత్ 

(తోడు లేకుండా దూరప్రయాణాలు చేయకూడదు.) 


12. పుత్రో న స్తోతవ్య 

(పుత్రుడ్ని స్తుతించకూడదు.) 


13. స్వామీ స్తోతవ్యో - నుజీవిభిః 

(ఆశ్రయించి బ్రతికేవాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఉండాలి.) 


14. ధర్మకృత్యాని సర్వాణి స్వామిన ఇత్యేవ ఘోషయేత్ 

(ధర్మబద్ధంగా జరుగుతున్న పనులన్నీ ప్రభువుగారివే అని చాటిచెబుతుండాలి.) 


15. రాజాజ్ఞాం నాతిలజ్జయేత్ 

(రాజాజ్ఞ దాటకూడదు.) 


16. యథా జ్ఞప్తం తథా కుర్యాత్ 

(ఎలా ఆజ్ఞాపిస్తే అలా చెయ్యాలి.) 


17. నాస్తి బుద్ధిమతాం శత్రుః 

(బుద్ధిమంతులకు శత్రువు ఉండడు.) 


18. ఆత్మచ్చిద్రం న ప్రకాశయేత్  

(తన లోపాల్ని బయటికి తెలియనీయకూడదు.) 


19. క్షమావానేవ సర్వం సాధయతి 

(ఓర్పుగలవాడే అన్నీ సాధించగలుగుతాడు.) 


20. ఆపదర్థం ధనం రక్షేత్ 

(ఆపత్కాలంలో ఉపయోగపడడానికి ధనం జాగ్రత్తపెట్టుకోవాలి.) 


21. సాహసవతాం ప్రియం కర్తవ్యమ్ (సాహసవంతులకు పని సాధించడం అంటే చాలా ఇష్టం.) 


22. శ్వ కార్యమద్య కుర్వీత 

(రేపు చేయవలసిన పని నేడే చెయ్యాలి.) 


23. అపర్హ్నికం పూర్వాహ్న ఏవ కర్తవ్యమ్ (మధ్యాహ్నం తర్వాత చేయవలసింది ప్రొద్దుటే చేయాలి.) 


24. వ్యవహారానులోమో ధర్మః 

(లోకవ్యవహారానికి అనుకూలంగా ఉండేదే ధర్మం.) 


25. సర్వజ్ఞతా లోకజ్ఞతా 

(లోకజ్ఞానం బాగా ఉండటమే సర్వజ్ఞత్వం.) 


26. శాస్త్రజో ప్యలోకజ్ఞో మూర్ఖతుల్య (శాస్త్రపండితులైన లోకజ్ఞానం లేనివాడు మూర్ఖుడు వంటివాడు.) 


27. శాస్త్రప్రయోజనం తత్వదర్శనమ్ 

(యధార్థస్థితిని తెలుసుకోవడమే శాస్త్రానికి ప్రయోజనం.) 


28. తత్వజ్ఞానం కార్యమేవ ప్రకాశయతి 

(ఒకడికి ఎంత తత్వజ్ఞానం ఉందో అతడు చేసే కార్యమే చెబుతుంది.) 


29. వ్యవహారే పక్షపాతో న కార్య 

(వ్యవహారంలో పక్షపాతం చూపకూడదు.) 


30. ధర్మాదపి వ్యవహారో గరీయాన్ 

(ధర్మం కంటే కూడా వ్యవహారం గొప్పది.) 


31. ఆత్మా హి వ్యవహారస్య సాక్షీ 

(వ్యవహారంలో అంతరాత్మయే సాక్షి.) 


32. సర్వసాక్షీ హాత్మా 

(అంతరాత్మ అందరికీ సాక్షి కదా.) 


33. న స్యాత్ కూటసాక్షీ 

(అసత్యమైన సాక్ష్యం చెప్పేవాడు కాకూడదు.) 


34. కూటసాక్షిణో నరకే పతంతి 

(కూటసాక్షులు నరకంలో పడతారు.)


35. ప్రచ్చపాపానాం సాక్షిణో భూతాని 

(రహస్యంగా పాపాలు చేసినవాళ్ళకి పంచమహాభూతాలే సాక్షులు.)


36. ఆత్మనః పాపయాత్మైవ ప్రకాశయతి 

(ఎప్పుడో ఒకప్పుడు తన పాపాన్ని తానే బయట పెట్టుకుంటాడు.) 


37. వ్యవహారే నర్గతమాకారః సూచయతి (వ్యవహారం లోపల ఉన్న భావాన్ని ఆకారమే సూచిస్తుంది.) 


38. ఆకారసంవరణం దేవానామప్యశక్యమ్ (దేవతలు కూడా ఆకారం కప్పిపుచ్చుకొనలేరు.) 


39. చోరరాజపురుషేభ్యో విత్తం రక్షేత్ 

(దొంగలనుండి అధికారులనుండి ధనం రక్షించుకోవాలి.) 


40. దుర్ధర్శనా హి రాజానః ప్రజా రక్షంతి (వచ్చినవాళ్ళకి దర్శనం ఇవ్వని రాజులు ప్రజల్ని నశింపచేస్తారు.) 


41. సుదర్శనా రాజనః ప్రజా రక్షంతి 

(సులభంగా దర్శనమిచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు.) 


42. న్యాయయుక్తం రాజానం మాతరం మన్యంతే ప్రజాః 

(న్యాయంగా ఉండే రాజును ప్రజలు తల్లిగా భావిస్తారు.) 


43. తాదృశః స రాజా ఇహ సుఖం తతః స్వర్గం ప్రాప్నోతి 

(అలాంటి రాజు ఇహలోకంలో సుఖం పొందుతాడు. తర్వాత స్వర్గం పొందుతాడు.) 


44. అహింసాలక్షణో ధర్మః 

(ఎవరినీ హింసించకపోవడమే ధర్మానికి లక్షణం.) 


45. స్వశరీరమపి పరశరీరం మన్యతే సాధుః (సత్పురుషుడు తన శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించవలసినదానినిగా భావిస్తాడు.) 


46. మాంసభక్షణమయుక్తం సర్వేషామ్ 

(అందరికీ కూడా మాంసభక్షణం అయుక్తమైనది.) 


47. న సంసారభయం జ్ఞానవతామ్ 

(తత్వజ్ఞానం ఉన్నవాళ్ళకి సంసారం వల్ల భయం ఉండదు.) 


48. విజ్ఞానదీపేన సంసారభయం నివర్తయతి (తత్వజ్ఞానం అనే దీపంచేత సంసారభయం తొలగించుకుంటాడు.) 


49. సర్వమనిత్యం భవతి 

(ప్రతీదీ అనిత్యమే.) 


50. కృమిశకృన్మూత్రభాజనం శరీరం పుణ్యపాపజన్మహేతుః 

(క్రిములూ, మలమూ, మూత్రమూ - వీటికి స్థానమైన ఈ శరీరం పుణ్యం చేయడానికైనా పాపం చేయడానికైనా సాధనం.)


51. జన్మమరణాదిషు తు దుఃఖమేవ 

(జన్మ, మరణాలలో దుఃఖమే కానీ సుఖం లేదు.) 


52. తపసా స్వర్గమాప్నోతి 

(తపస్సుచేత స్వర్గం పొందుతాడు.) 


53. క్షమాయుక్తస్య తపో వివర్థతే 

(ఓర్పు ఉన్నవారి తపస్సు పెరుగుతుంది.) 


54. తస్మాత్ సర్వేషాం సర్వకార్యసిద్ధిర్భవతి (తపస్సు వల్ల అందరికీ అన్ని కార్యాలూ సిద్ధిస్తాయి.) 

(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ 


                             శ్లోకం:36/150 


సర్వకాలప్రసాదశ్చ 

సుబలో బలరూపభృత్ I 

సర్వకామప్రదశ్చైవ 

సర్వద స్సర్వతోముఖః ॥ 36 ॥ 


* సర్వకాల ప్రసాదః = సమస్త కాలములందు అనుగ్రహించువాడు, 

* సుబలః = మంచి బలము కలవాడు, 

* బలరూపభృత్ = బలమైన రూపమును ధరించువాడు, 

* సర్వకామప్రదః = సమస్తమైన కోరికలు విశేషముగా ఇచ్చువాడు, 

* సర్వదః = సమస్తమును ఇచ్చువాడు, 

* సర్వతోముఖః = అన్ని ప్రక్కల ముఖము కలవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

Modiji


 

భూమికి భారమైనది,

 శ్లోకం:☝️

*భూరిభిర్భారిభిర్భీరా*

  *భూభారైరభిరేభిరే |*

*భేరీరేభిభిరభ్రాభై*

  *రభీరుభిరిభైరిభా ||*

  (శిశుపాల వధ 19-66)


భావం: బరువైనందున భూమికి భారమైనది, దుందుభిలాంటి ఘీంకారముతో, దట్టమైన చీకటి మేఘం వంటి ఏనుగు శత్రు ఏనుగుపై దాడి చేసింది.

ఈ శ్లోకము మాఘుడు *భ*, *ర* అనే రెండు అక్షరాలతో రచించాడు.

పంచాంగం 03.08.2023 Thursday

 ఈ రోజు పంచాంగం 03.08.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: ద్వితీయా తిధి బృహస్పతి  వాసర: దనిష్ఠ నక్షత్రం సౌభాగ్య  యోగ: తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


విదియ సాయంత్రం 04:19 వరకు.

దనిష్ఠ పగలు 09:57 వరకు.

సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:45

వర్జ్యం : సాయంత్రం 04:18 నుండి 05:43 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:14 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:21 నుండి 04:12 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

చామకూర కవితా చమత్కారం!

 చామకూర  కవితా  చమత్కారం!


           "  తనకుం గౌగిలి  యీవొకప్పుడును  నాథా !  నీకర స్పర్శనం 


               బున  గిల్గింతలె  యంచుఁ  బద్మిని  కరాంభోజంబునన్ మంద  మం


                ద  నటద్వాయు  చలద్దళాంగుళులు  కన్పట్టంగ  నవ్వెల్గు  రా


                 యని  రా రా  యని  పిల్చెనాఁదగె , ద్విరేఫాద్యంత  దీర్ఘధ్వనుల్".


                    చామకూర  వేంకట కవి:  విజయ విలాసము- 1 ఆ: 139 పద్యం!


                                     పెక్కు కావ్యాలు వ్రాయక పోయినా ,ప్రతిభా వంతుడై  ప్రతిపద్య చమత్కార భాసురమైన "విజయ విలాస ప్రబంధంతో ప్రబంధకవుల కగ్రస్థానంలోనిలచిన  వేంకటకవి  బహుధాప్రశంసనీయుడు. విజయ విలాసమునకు  "పిల్లవసుచరిత్రమను"-

ఖ్యాతి దక్కినదన  చామకూర కృషియెంతటిదో  మనమూహింప వచ్చును.


                    వసు చరిత్రములోని చమత్కారములకు  శ్లేషలకు  ,విజయ విలాసమునందలి  చమత్కారములకు  బహుధాభేదమున్నది.

వసుచరిత్ర శ్లేషలు పండిత సహాయములేనిదే బోధపడవు. విజయ విలాసము నందలిశ్లేషలు చిరుచిరు అచ్చతెనుగు పదముల ముచ్చటలై  సందెగాలికి  విచ్చుకొను బొండుమల్లలవలె  చదివినంతమాత్రముననే బోధపడి పాఠకుల నలరించును. ఇక  అసలు విషయమును పరిశీలింతుముగాక!