4, మార్చి 2025, మంగళవారం

హిందువుగా

 నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు👇👍

1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.

2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.

3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.

4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.  

5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 

6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.

7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.

👉 వృక్షాలు దైవ స్వరూపాలే.

👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.

👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.

👉 గాలి కూడా దైవ స్వరూపమే.

👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.

👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.

👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.

8. నువ్వూ దైవ స్వరూపమే.

     నేనూ దైవ స్వరూపమే. 

     చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)

     దైవ స్వరూపాలే.    

9.  చతుర్వేదాలు,  నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, హిందూధర్మం. 

మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.

కర్మల గురించి తెలియాలంటే ......

👉 వేదాలు చదవాలి.

సమస్త జ్ఞానం పొందాలంటే ......

👉 ఉపనిషత్తులు చదవాలి.

పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......

👉 రామాయణం చదవాలి.

రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......

👉 మహాభారతం చదవాలి.

భగవంతుని తత్త్వం తెలియాలంటే ......

👉 భాగవతం చదవాలి.

చక్కటి పరిపాలన అందించాలంటే ......

👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.

అన్యోన్య దాంపత్యానికి ......

👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.

చక్కటి ఆరోగ్యానికి ......

👉 ఆయుర్వేదం చదవాలి.

మేథస్సుకు ......

👉 వేద గణితం చదవాలి.

శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......

👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.

భవన నిర్మాణాలకు ......

👉 వాస్తుశాస్త్రం చదవాలి.

గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......

👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.

11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.

12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం  ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)

13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.

14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.

15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.

16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.

యువ

హిందువుగా జన్మించాం.

హిందువుగా జీవిద్దాం.

హిందువుగా మరణిద్దాం.

            జై హింద్.🚩🚩

కాళిదాసు 🙏 మూడవ భాగం

 🙏కాళిదాసు 🙏

                   మూడవ భాగం 

 కాళిదాసు కేవలం భారతీయ కవి మాత్రమే కాదు. విశ్వకవి. ప్రపంచకవుల్లోనే అగ్రగణ్యుడైన కవి. భారతీయాత్మను కాళిదాసు చిత్రించినంత హృద్యంగా మరే కవీ ఆవిష్కరించలేదంటే అతిశయోక్తి గానేరదు. ఎందుకంటే, భారతదేశపు భౌతికస్వరూపాలను అంటే నదీనదాలను, పర్వతాలను, పట్టణాలను, ఆశ్రమాలను, వృక్షలతాదులను, కాళిదాసు వర్ణించినంత సమగ్రంగా, సమర్ధవంతంగా మరే కవీ వర్ణించి సాక్షాత్కరింపజేయలేకపోయాడు. అందుకే విమర్శకులు అంటారు “కాళిదాసు కవిత్వం సార్వభౌమికమే కాదు సార్వజనీకం కూడా” అని.

 మన తెలుగు ప్రబంధకవులు కావ్యావతారికలలో చెప్పుకున్నట్లు కాళిదాసు ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. అసలు పూర్వకవులలో ఈ ఆచారం ఉన్నట్టు కనపడదు. అందువల్ల ఇతర ఆధారాలతోనే వారి జన్మ విశేషాలను ఊహించడం జరిగింది. అయితే ఈ ఊహల్లో బేధాభిప్రాయాలు చాలా ఉన్నాయి. కాళిదాసు జీవితకాలం విషయంలో క్రీ.పూ. 8 వ శతాబ్ది నుండి క్రీ.శ.10వ శతాబ్దం వరకూ ఉన్నట్లుగా రకరకాలుగా ఈ ఊహాగానాలు అల్లుకున్నాయి. అయితే ఎక్కువమంది చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి జీవితకాలం క్రీ.పూ.150 సం.నుండి క్రీ.శ 634 సం మధ్యలో ఎక్కడో ఉంది. క్రీ.శ 6వ శతాబ్దంవాడని ఓ వాదం, గుప్తుల కాలం వాడని ఒక వాదం, విక్రమ శకారంభం వాడని అంటే 6 వ శతాబ్దికి చెందిన వాడని మూడు వాదాలు బలంగా ప్రజల్లో బలపడ్డాయి. ఇంకా సూక్ష్మపరిశీలన చేస్తే కాళిదాసు ఉజ్జయినీ ప్రాంతం వాడని మనం చెప్పుకోవచ్చు.

                                        ఉజ్జయినీ పాలకుడైన విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నాడని “ధన్వంతరి, క్షపణకామరసింహా శంఖ బేటాళభట్ట ఘటకర్పర కాళిదాసా:” అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. అంతే కాక ప్రస్తుతం మనం చదవబోయే “మేఘసందేశం” కావ్యంలో యక్షుడు మేఘునికి అలకానగర మార్గాన్ని చెప్పే సమయంలో చెప్పిన “వక్ర: పన్ ధాయదపి భవత:” అనే శ్లోకార్ధం తీసుకుంటే “నీ ప్రయాణం కొంచెం వక్ర మార్గమయినా పర్వాలేదు, ఉజ్జయినీ నగర దర్శన భాగ్యం పోగొట్టుకోకు” అని చెప్తాడు. అంతే కాక ఈ నగరశోభను 16 శ్లోకాల్లో సుదీర్ఘంగా వర్ణించడం వల్ల అతనికి ఉజ్జయినీపై గల అభిమానం వ్యక్తమౌతుంది. అంతే కాక విక్రమాదిత్యుని అభినందన కృతి “రామచరితం” లో “ఖ్యాతి కామపి కాళిదాస కృతయోనీతా: శకారాతినా” అన్న శ్లోకంలో కాళిదాసు ప్రశంస ఉంది. “విక్రమోర్వశీయం” నాటకం ఊర్వశీపురూరవులకు సంబంధించినది కదా! అందువల్ల “పురూరవోర్వశీయం” అనడం సబబు. కానీ కాళిదాసు అలా అనకుండా తన చక్రవర్తి విక్రమసింహుని పేరులో ఉన్న “విక్రమ” శబ్దం వాడడం కూడా అదే సూచిస్తున్నదని చరిత్ర,సాహిత్యకారులు బలంగా విశ్వసిస్తున్నారు.

          కాళిదాసు మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞానశాకుంతలం అనే నాటకాలు, ఋతుసంహారం అనే లఘుకావ్యం రాశాడు. శృతబోధమనే ఛందోగ్రంధము, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తరకాలమృతం అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంధాలను కూడా రచించాడని చెప్తారు. ఇతని రచనా శైలిని గూర్చి కూడా కొంత పరిచయం అవసరం. ఈతని రచన మృదుమధురమైన పదాలతో లలితంగా, చక్కని అలంకారాలతో ఉండి అక్కడక్కడా దీర్ఘ సమాసాలు వాడినప్పటికీ, సులభ గ్రాహ్యంగా ఉంటుంది. ఈతని కవిత్వ రీతి “వైదర్భీరీతి” అంటారు.

“బంధ పారుష్య రహితా శబ్ద కాఠిన్య వర్జితా

నాతి దీర్ఘ సమాసాచ వైదర్భీ రీతిరిష్యతే”

పదాలు పరుషంగా ఉండవు. కఠినమైన శబ్దాలు ఉండవు. దీర్ఘ సమాస ప్రయోగం ఉండదు. దీనినే వైదర్భీరీతి అని లాక్షణికులు అంటారు. కాళిదాసు ప్రకృతిపరిశీలనాశక్తి మనలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా అలంకారాలు వాడడంలో కాళిదాసు దిట్ట. అందుకే ఆయనను “ఉపమా కాళిదాసస్య” అంటారు.

“వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:

రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. ఆ శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

Panchaag

మంగళవారం🍁* *🌹04, మార్చి, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

*🌹04, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  శుక్లపక్షం*

*తిథి       : పంచమి* మ 03.16 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం  : భరణి* రా 02.37 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం  : ఐంద్ర* రా 02.07 వరకు ఉపరి *వైధృతి*

*కరణం   : బాలువ* మ 03.16 *కౌలువ* రా 02.01 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 11.30 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 10.12 - 11.40*

అభిజిత్ కాలం  : *ప 11.55 - 12.43*

*వర్జ్యం             : మ 01.21 - 02.49*

*దుర్ముహూర్తం  : ఉ 08.46 - 09.33 రా 11.06 - 11.55*

*రాహు కాలం   : మ 03.17 - 04.46*

గుళికకాళం      : *మ 12.19 - 01.48*

యమగండం    : *ఉ 09.21 - 10.50*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.23* 

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.23 - 08.46*

సంగవ కాలం         :      *08.46 - 11.08*

మధ్యాహ్న కాలం    :      *11.08 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ పంచమి/షష్ఠి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.15*

ప్రదోష కాలం         :  *సా 06.15 - 08.41*

రాత్రి కాలం           :  *రా 08.41 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.46 - 05.34*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🚩||జై శ్రీ రామ్ - జై హనుమాన్!!🚩*

*వైరిభీకర వానరాగ్రణి వార్ధిలంఘన చాతురీ!*

*నీరజాప్తుని ముఖ్యశిష్యుడ నేర్చినాడవు విద్యలన్*

*ఏరికోరియు రాముడంపగ నెంచి నిన్నును లంకకున్*

*జేరి జానకి జాడదెల్ప విజేతయైతివి మారుతీ!*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కాళిదాసు 🙏 మూడవ భాగం

 🙏కాళిదాసు 🙏

                   మూడవ భాగం 

 కాళిదాసు కేవలం భారతీయ కవి మాత్రమే కాదు. విశ్వకవి. ప్రపంచకవుల్లోనే అగ్రగణ్యుడైన కవి. భారతీయాత్మను కాళిదాసు చిత్రించినంత హృద్యంగా మరే కవీ ఆవిష్కరించలేదంటే అతిశయోక్తి గానేరదు. ఎందుకంటే, భారతదేశపు భౌతికస్వరూపాలను అంటే నదీనదాలను, పర్వతాలను, పట్టణాలను, ఆశ్రమాలను, వృక్షలతాదులను, కాళిదాసు వర్ణించినంత సమగ్రంగా, సమర్ధవంతంగా మరే కవీ వర్ణించి సాక్షాత్కరింపజేయలేకపోయాడు. అందుకే విమర్శకులు అంటారు “కాళిదాసు కవిత్వం సార్వభౌమికమే కాదు సార్వజనీకం కూడా” అని.

 మన తెలుగు ప్రబంధకవులు కావ్యావతారికలలో చెప్పుకున్నట్లు కాళిదాసు ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. అసలు పూర్వకవులలో ఈ ఆచారం ఉన్నట్టు కనపడదు. అందువల్ల ఇతర ఆధారాలతోనే వారి జన్మ విశేషాలను ఊహించడం జరిగింది. అయితే ఈ ఊహల్లో బేధాభిప్రాయాలు చాలా ఉన్నాయి. కాళిదాసు జీవితకాలం విషయంలో క్రీ.పూ. 8 వ శతాబ్ది నుండి క్రీ.శ.10వ శతాబ్దం వరకూ ఉన్నట్లుగా రకరకాలుగా ఈ ఊహాగానాలు అల్లుకున్నాయి. అయితే ఎక్కువమంది చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి జీవితకాలం క్రీ.పూ.150 సం.నుండి క్రీ.శ 634 సం మధ్యలో ఎక్కడో ఉంది. క్రీ.శ 6వ శతాబ్దంవాడని ఓ వాదం, గుప్తుల కాలం వాడని ఒక వాదం, విక్రమ శకారంభం వాడని అంటే 6 వ శతాబ్దికి చెందిన వాడని మూడు వాదాలు బలంగా ప్రజల్లో బలపడ్డాయి. ఇంకా సూక్ష్మపరిశీలన చేస్తే కాళిదాసు ఉజ్జయినీ ప్రాంతం వాడని మనం చెప్పుకోవచ్చు.

                                        ఉజ్జయినీ పాలకుడైన విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నాడని “ధన్వంతరి, క్షపణకామరసింహా శంఖ బేటాళభట్ట ఘటకర్పర కాళిదాసా:” అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. అంతే కాక ప్రస్తుతం మనం చదవబోయే “మేఘసందేశం” కావ్యంలో యక్షుడు మేఘునికి అలకానగర మార్గాన్ని చెప్పే సమయంలో చెప్పిన “వక్ర: పన్ ధాయదపి భవత:” అనే శ్లోకార్ధం తీసుకుంటే “నీ ప్రయాణం కొంచెం వక్ర మార్గమయినా పర్వాలేదు, ఉజ్జయినీ నగర దర్శన భాగ్యం పోగొట్టుకోకు” అని చెప్తాడు. అంతే కాక ఈ నగరశోభను 16 శ్లోకాల్లో సుదీర్ఘంగా వర్ణించడం వల్ల అతనికి ఉజ్జయినీపై గల అభిమానం వ్యక్తమౌతుంది. అంతే కాక విక్రమాదిత్యుని అభినందన కృతి “రామచరితం” లో “ఖ్యాతి కామపి కాళిదాస కృతయోనీతా: శకారాతినా” అన్న శ్లోకంలో కాళిదాసు ప్రశంస ఉంది. “విక్రమోర్వశీయం” నాటకం ఊర్వశీపురూరవులకు సంబంధించినది కదా! అందువల్ల “పురూరవోర్వశీయం” అనడం సబబు. కానీ కాళిదాసు అలా అనకుండా తన చక్రవర్తి విక్రమసింహుని పేరులో ఉన్న “విక్రమ” శబ్దం వాడడం కూడా అదే సూచిస్తున్నదని చరిత్ర,సాహిత్యకారులు బలంగా విశ్వసిస్తున్నారు.

          కాళిదాసు మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞానశాకుంతలం అనే నాటకాలు, ఋతుసంహారం అనే లఘుకావ్యం రాశాడు. శృతబోధమనే ఛందోగ్రంధము, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తరకాలమృతం అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంధాలను కూడా రచించాడని చెప్తారు. ఇతని రచనా శైలిని గూర్చి కూడా కొంత పరిచయం అవసరం. ఈతని రచన మృదుమధురమైన పదాలతో లలితంగా, చక్కని అలంకారాలతో ఉండి అక్కడక్కడా దీర్ఘ సమాసాలు వాడినప్పటికీ, సులభ గ్రాహ్యంగా ఉంటుంది. ఈతని కవిత్వ రీతి “వైదర్భీరీతి” అంటారు.

“బంధ పారుష్య రహితా శబ్ద కాఠిన్య వర్జితా

నాతి దీర్ఘ సమాసాచ వైదర్భీ రీతిరిష్యతే”

పదాలు పరుషంగా ఉండవు. కఠినమైన శబ్దాలు ఉండవు. దీర్ఘ సమాస ప్రయోగం ఉండదు. దీనినే వైదర్భీరీతి అని లాక్షణికులు అంటారు. కాళిదాసు ప్రకృతిపరిశీలనాశక్తి మనలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా అలంకారాలు వాడడంలో కాళిదాసు దిట్ట. అందుకే ఆయనను “ఉపమా కాళిదాసస్య” అంటారు.

“వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:

రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. ఆ శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఊర్ధ్వమూలం

 *ఊర్ధ్వమూలం!!*

✳️🌹🌹🌹🌹🔯🌼🌼🌼🌼✳️

*మానవుని శరీరంలో - భగవంతుడు ఏ రూపములో వున్నారు???*

*శ్లో॥*

*అహం వైశ్వానరో భూత్వా  ప్రాణినాం దేహమాశ్రితః!*

*ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం!!*

💐 నేను వైశ్వానరుణ్ణి (జఠరాగ్ని) అయి ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉంటాను, ప్రాణ అపానాలతో కూడి నాలుగు రకాల అన్నాన్ని ఆరగిస్తాను.

✳️ ఈ శ్లోకం ప్రసిద్ధమైన శ్లోకం, భారతదేశంలో చాలామంది, అనేక ఆశ్రమవాసులు - అన్నదోష నివారణకై భోజనకాలాలలో ఈ శ్లోకాన్ని పఠించి, భుజించటం ఆచారంగా వస్తున్నది...

✳️ పరమాత్మ సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. వెలుపల అంతా ఎలా వ్యాపించియున్నాడో అలాగే ప్రాణుల లోపల కూడా  వ్యాపించి యున్నాడు...

✳️ *ఎలాంటి రూపంలో ఉన్నాడు?*

💐 *1. వైశ్వానరో భూత్వా...*

✳️ వైశ్వానర రూపంలో.. జఠరాగ్నిరూపంలో.. ఉన్నాడు, ప్రాణం ఉన్నంతకాలం శరీరం వెచ్చగా ఉండాలి, ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది భగవంతుడే.  అందుకే... మండు వేసవిలోను, చల్లని శీతాకాలంలోను ఒకేవిధంగా 98.4 F వేడి ఉంటుంది. 

ఆ అగ్నియే జఠరాగ్ని - వైశ్వానరాగ్ని, అదే పరమాత్మ...

✳️ *ఏం చేస్తున్నాడు పరమాత్మ వైశ్వానరాగ్ని రూపంలో...* 

✳️ *పచామ్యన్నం చతుర్విధం...* 

✳️ మనం తినే 4 రకాల అన్నాన్ని పచనం చేస్తున్నాడు పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి, మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్నదాన్ని పక్వం చేస్తున్నాడు.  మనం నిద్రించినా ఆయన నిద్రపోడు. మనం నిద్రలేచి మళ్ళీ తినాలనుకుంటే తింటాం.  అలా తినాలంటే అంతకుముందు తిన్నది జీర్ణం కావాలి, ఆ పనిని ఆయన చేసి మనకు సహాయపడుతున్నాడు.

మనం తినే *అన్నం చతుర్విధం".* అంటే నాలుగు రకాలుగా ఉంటుంది...  అవి...

✳️ *భక్ష్యం:* గట్టి పదార్థాలు, పళ్ళతో కొరికి, నమిలి తినేవి, గారెలు, వడలు, లాంటివి.

✳️ *భోజ్యం:* మెత్తని పదార్థాలు, ముద్దలుగా చేసుకొని తినేవి, అన్నం, కూరలు, పచ్చళ్ళు, పప్పు మొదలైనవి...

✳️ *చోష్యం:* జుర్రుకోనేవి, త్రాగేవి అయిన ద్రవపదార్థాలు, సాంబారు, రసం, మజ్జిగ, కూల్ డ్రింక్స్, పాయసం మొదలైనవి...

✳️ *లేహ్యం:*  నాలుకకు రాసుకొనేవి, నంజుకోనేవి, చప్పరించేవి. ఊరగాయలు, కొన్నిరకాల పచ్చళ్ళు, తేనె మొదలైనవి...

ఈ నాలుగు రకాల ఆహారాలను పరమాత్మే జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తాడు.  ఎలా?

✳️ *ప్రాణ అపాన సమాయుక్తః...*

✳️ ప్రాణ, అపాన శక్తులతో కూడి పక్వం చేస్తాడు. 

మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలకు లాగివేసి, దానిని జఠరాగ్నితో బాగా పచనం చేసి, జీర్ణింపజేసి, అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి, మిగిలిపోయిన సారంలేని, అవసరంలేని ఆహారపు పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేసేది *ప్రాణం.*

✳️ ఈ పనికిరాని పిప్పిని బయటకు త్రోసివేసేది *అపానం.* ఈ రెండు చర్యల ద్వారా మనకు కావలసిన శక్తి వస్తుంది, దానితో పనులు చేసుకోగలుగుతాం. 

మళ్ళీ శక్తి కోసం తినగలుగుతాం, ఈ నిరంతర ప్రక్రియతో ప్రాణ అపానములనే శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు, ఈ సహాయాన్ని పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేం. శక్తిని పొందలేం...

నిజంగా ఇక్కడ ప్రాణ అపానాలను రెండింటినే చెప్పినా.....  

✅ ఇంకా 3 రూపాలలో...

*వ్యాన, ఉదాన, సమాన* -

....అనే రూపాలలో పరమాత్మ మనకు నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు...

✳️ *వ్యాన:* అంటే జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చేది, ఈ సారాన్ని రక్తంలో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది.

✳️ *సమాన:*  అంటే ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంత అన్నసారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేసేది.

✳️ *ఉదాన:* అంటే అన్ని శరీరభాగాలకు వార్తలు పంపటమే గాక శరీరాన్ని విడిచిన తర్వాత జీవుణ్ణి చేర్చవలసిన స్థానానికి చేర్చేది.

✅👉 *"జఠరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండే కుంపటి. ఆ కుంపటిని ప్రజ్వలింపజేసే కొలిమితిత్తులే ప్రాణ అపానాలు".*

✳️ ఈ పనులన్నింటిని పరమాత్మ ఎక్కడ ఉండి నిర్వహిస్తున్నాడు..? నిజంగా పరమాత్మ అడ్రస్ లేనివాడు. 

అన్ని అడ్రస్ లు ఆయనవే, ఎక్కడో ఒకచోట ఉండేవాడికే అడ్రసులు, అంతటా ఉండేవానికి అడ్రస్ ఎందుకు..? "ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు" అన్న ప్రహ్లాదుని పలుకు ఇదే...

✳️ *ప్రాణినాందేహం ఆశ్రితః..*

✳️ ఈ పనులన్నీ చేయటానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు. 

కనుక పరమాత్మను ఎక్కడా వెతకనక్కరలేదు. బస్సులలో, రైళ్ళలో, విమానాలలో ప్రయాణించాల్సిన పనిలేదు. 

ఈ 5 అడుగుల దేహంలోనే వెతికి తెలుసుకోవచ్చు. అయితే బయటకు చూడకుండా లోపలకే చూడాలి.. అంతర్ముఖులు కావాలి.

✳️ ఈ ప్రకారంగా... *పరమాత్మే సూర్యచంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న అన్నాన్ని అరిగిస్తున్నాడు. ఆయనే దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తున్నాడు.*

✅👉 *ఇంతటి ఉపకారం చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి?*  అదే *నివేదన.* ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పించి భుజించాలి, అలా నివేదించకుండా, సమర్పించకుండా, అనుమతి తీసుకోకుండా తింటే దొంగలమవుతాం, కనుక జాగ్రత్త తీసుకోవాలి.

✅👉 ఆహారాన్ని ఇస్తున్నదీ ఆయనే, తయారు కావటానికి అగ్ని రూపంలో సాయం చేస్తున్నదీ ఆయనే, తిన్న అన్నాన్ని అరిగించి అన్ని అవయవాలకు సరఫరా చేస్తున్నదీ ఆయనే, కనుక అన్నం ముద్ద నోట్లోకి పోయేముందు పరమాత్మ జ్ఞాపకానికి రావాలి... కృతజ్ఞత తెలుపాలి, అంతేకాదు, పట్టెడన్నం అతిధికి పెట్టినప్పుడు ఆ అతిధిని భగవంతునిగా భావించాలి. 

ఒక కుక్కకు పిడికెడు అన్నం పెడితే అక్కడ జఠరాగ్ని రూపంలో ఆరగించి అరిగించేవాడు పరమాత్మేననే భావనచేయాలి.

✳️ *దీనివల్ల ఏమిటి ఫలితం...*

✅ అన్నం ఆరగించే వానిలోను, పచనం చేసే జఠరాగ్నిలోను, వెలుపల ఉండే సూర్యచంద్రుల లోను, క్రింద ఆధారంగా ఉండే భూమిలోను, సస్యాలలోను, ప్రాణికోట్లలోను, సర్వేసర్వత్రా, అంతటా, అన్నింటా, అన్ని వేళలా బ్రహ్మబుద్ధి..  ఈశ్వరుడి భావన చేయగా.. చేయగా.. మన పరిమిత వ్యక్తిత్వం (జీవభావం) కరిగిపోయి నీవు, నేనూ, అతడు, ఆమె, అదీ, అన్నీ.. సర్వమూ బ్రహ్మమే.. ఈశ్వరుడె అనే స్థిరభావన సిద్ధిస్తుంది. 

*'అప్పుడే ఊర్ధ్వమూలం' అనే తత్వార్థం అనుభవానికి వస్తుంది...*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

✳️🌹🌹🌹🌹🔯🌼🌼🌼🌼✳️

ఉర్వారుక మివ బంధనం

 ఉర్వారుక మివ బంధనం అంటే.....

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. 

అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.

 ‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది.

 పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.

అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది.

 అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘ జీవన్ముక్తి ’ అంటారు...

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - పంచమి - భరణి -‌‌ భౌమ వాసరే* (04.03.2025)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag