8, మార్చి 2025, శనివారం

భక్తి మార్గాలు

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.

[Courtesy : Suresh Naga]


❤️  నవ - విధ భక్తి మార్గాలు వాటి వివరాలు:

✅నవవిధ భక్తులు:


🌹శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

 

🌹ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా  చెప్పబడిన భక్తిమార్గములు .

 

🌹శ్రీమదాంధ్రభాగవతం లో పోతన గారు దీని యొక్క ఆంధ్రానువాదం చేస్తూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.  

 

🌹తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం

బనునీతొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మునున్ హరిన్ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

 

1. భగవంతుని లీలలను వినడం (“శ్రవణం”) 

2. ఆయన లీలలను “కీర్తించడం”

3. అదే పని గా భగవంతుని నమ”స్మరణ” చేయడం

4. స్వామివారి “పాదసేవనము”  చేయడము

5. స్వామిని “అర్చించడం”

6. భక్తి తో “వందనము” చేయడము

7. దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావము తో “దాస్యము” చేయడం

8. స్వామి నా చెలికాడు అనే భావన తో “సఖ్యము”  చేయుట

9. స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  “ఆత్మ నివేదన” చేయడం  

 

❤️ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.

 

❤️ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల  గూర్చి  మనం తెలుసుకోవాలి.

✅1. శ్రవణం  —–  పరీక్షిత్ మహారాజు (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )


✅ (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )

✅2.కీర్తనం  —–  శుక బ్రహ్మ  (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు) .

✅3.స్మరణం —–  ప్రహ్లాదుడు .(ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)

✅4.పాదసేవనం — లక్ష్మీదేవి (అమ్మ గూర్చి ఏమని చెప్పేది.. అమ్మ భక్తి తెలియనిదెవరికి )


✅ 5.అర్చనం —— పృధు మహారాజు (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది.)  

✅6.వందనం——- అక్రూరుడు (భాగవతం లో దశమస్కంధం లో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుదు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి.)

✅7.దాస్యం —— ఆంజనేయ స్వామి (స్వామి హనుమ యొక్క దాస భక్తి ,వారు శ్రీ రామ చంద్రమూర్తి ని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)

✅8.సఖ్యం —— అర్జునుడు (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)

✅9.ఆత్మనివేదనం — బలిచక్రవర్తి (వామనావతరం లో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు. )



⚜ శ్రీ కృష్ణస్వామి దేవాలయం

 🕉 మన గుడి : నెం 1043


⚜ కేరళ  : తోడుపుజ - ఇడుక్కి


⚜ శ్రీ  కృష్ణస్వామి దేవాలయం



💠 శ్రీ కృష్ణస్వామి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని తొడుపుజా పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఇది మువట్టుపుజా నదికి ఉపనది అయిన తోడుపుజయార్ ఒడ్డున ఉంది . 


💠 శ్రీకృష్ణుడు తన కుడి చేతిలో  వెన్నను పట్టుకున్న నవనీత కృష్ణుడి రూపంలో అక్కడ ఉన్నాడు.

శ్రీ కృష్ణ స్వామి ఆలయం 5000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది.


💠 ఎడవెట్టిలో శ్రీకృష్ణుడు ధన్వంతరి రూపంలో దర్శనము ఇస్తాడు.

ధన్వంతరి కృష్ణ" లేదా "ఔషధ కృష్ణ" , "నివారణ కృష్ణ " అనే పేరు కూడా కలదు.


🔆 స్థల పురాణం 


💠 మహాభారతంలో, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అశ్వినీదేవుని ఆశీస్సులతో నకులుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 

అశ్వినీ  దేవతల వైద్యులు మరియు ఆయుర్వేద మాస్టర్స్ అని నమ్ముతారు.


💠 ఈ ఆలయం చుట్టూ ఔషధ మొక్కలు మరియు ఇతర పాండవులు (మలయాళంలో అంచంబలం అని పిలుస్తారు) నిర్మించిన నాలుగు ఇతర శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి . అత్యంత దట్టమైన ఈ అడవికి వన దుర్గ కాపలాగా ఉంటుందని నమ్ముతారు.


💠 ఒకప్పుడు వివిధ దేవాలయాలకు తీర్థయాత్రలు చేస్తూ సంచరిస్తున్న బ్రాహ్మణుడు ఇక్కడికి చేరుకుని శ్రీకృష్ణుని దివ్య దర్శనం పొందాడని ప్రముఖ పురాణాలు చెబుతున్నాయి .


💠 అతని చిన్న వయస్సులోనే అతను సన్యాసం పొందాడు. అతను సన్యాసిగా ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో శ్రీకృష్ణుని గురించి ధ్యానం చేసాడు మరియు ధ్యానం సమయంలో తనను మింగడానికి ప్రయత్నించిన గుడ్లగూబ యొక్క కొమ్మును చీల్చివేస్తున్న కృష్ణుడి దర్శనం అతనికి లభించింది. 


💠 శ్రీకృష్ణుని ఈ దర్శనం తరువాత, సన్యాసి ఒక దీపాన్ని వెలిగించి, భగవంతుడు గుడ్లగూబ యొక్క కొమ్మును చీల్చివేస్తున్న దృశ్యాన్ని ధ్యానించాడు, అక్కడ అతను భగవంతుడిని చూసి నైవేద్యాలు సిద్ధం చేసి భగవంతుడికి గొప్ప భక్తితో సమర్పించాడు. 

ఈ సంఘటన మలయాళ మాసం మీనంలో ఒక చోతి నక్షత్రం రోజున జరిగింది కాబట్టి ఈ రోజును పాత రోజుల్లో పవిత్రోత్సవ దినంగా పరిగణించేవారు. 

తరువాత, కీజ్మలనాడు రాజు దేవత కోసం ఒక మందిరాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 


💠 చాలా దేవాలయాలలో సాధారణ పద్ధతిగా, గర్భాలయం తెరవగానే, స్వామివారి దండలు తొలగించి, అభిషేకం మరియు మలర్ నైవేద్యం (వేపుడు ధాన్యం) చేసి, ఆ తర్వాత ఉష పూజ చేస్తారు.

 ఇక్కడ అది భిన్నంగా ఉంటుంది, తెల్లవారుజామున బలిపీఠం తెరిచిన వెంటనే ఉషపూజ చేసి, ఆ పూజ పూర్తయిన తర్వాత, అభిషేకం మరియు మలార్ నైవేద్యాలు చేస్తారు. 


💠 హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు కుడ్యచిత్రాలతో ఈ ఆలయం ప్రత్యేకమైన కేరళ-శైలి శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.


💠 ఆలయ సముదాయం గర్భగుడి (శ్రీకోవిల్)ను కలిగి ఉంది, ఇక్కడ ప్రధాన దేవత శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించబడ్డాడు, అనేక ఇతర దేవి దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి. 


🔅 అధీన దేవతలు


💠 ఈ ఆలయంలో భగవతి , శివుడు , గణపతి , అయ్యప్ప మరియు నాగులు అధీన దేవతలుగా ఉన్నారు. 


💠 ఈ ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది, వివిధ ఆచారాలు, పండుగలు మరియు సంఘటనలు ఏడాది పొడవునా జరుగుతాయి.


💠 "తొడుపుజా పుతువర్షం" అని పిలువబడే ఆలయం యొక్క వార్షిక ఉత్సవం (పండుగ) గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు కేరళలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.

 ఈ పండుగ సాధారణంగా మలయాళ నెల మేడం (ఏప్రిల్-మే)లో వస్తుంది మరియు రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర ఉత్సవాలు ఉంటాయి.


🔆 పూజలు


💠 ఉదయం విభాగంలో 'ఉషా పూజ' తర్వాత 'అభిషేకం' ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ముందురోజు పూల దండలు తీసేస్తారు. 'నిలపడుతారా' లేదా పవిత్ర వేదిక ఆలయం ముందు ఉంది, ఇక్కడ సాధువు దేవతా విగ్రహాన్ని స్వీకరించాడు. 

విగ్రహాన్ని పండుగ సందర్భాలలో గర్భగుడి నుండి ఈ వేదికపైకి తీసుకెళ్లి పూర్తిగా అలంకరించి తిరిగి తీసుకువెళతారు.

 దేవతకు ప్రధాన వాహనాలు గుడ్లగూబ మరియు పావురం.


💠 నానయప్పర - 

నానయప్పర సేవ కోరికలను నెరవేర్చడానికి మరియు ప్రతి గురువారం ఆలయంలో సమర్పించవచ్చు. 

భక్తులు నాణేలను భగవాన్ (దైవం) ముందు ఉంచిన "పరా" (డ్రమ్)లో నింపుతారు మరియు వారి కోరికలను నెరవేర్చడానికి భగవాన్ నుండి దీవెనలు కోరుకుంటారు. 

పారా (డ్రమ్) నింపిన తర్వాత భక్తులకు తమలో తాము ఉంచుకోవడానికి పట్టుతో చుట్టబడిన నాణెం ఇవ్వబడుతుంది. 

వచ్చే ఓషధ సేవలోపు కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 

కోరిక నెరవేరిన తర్వాత నాణేన్ని ఆలయానికి తిరిగి ఇవ్వాలి.


💠 వార్షిక పండుగ మలయాళ నెల మీనం (మార్చి/ఏప్రిల్)లో నిర్వహించబడుతుంది. 

ఉత్సవ్ బలి, వేలాది మంది భక్తుల సమక్షంలో ఉత్సవాల తొమ్మిదవ రోజున పవిత్రమైన కార్యక్రమం నిర్వహిస్తారు. 



💠 కొట్టాయం రైల్వే స్టేషన్, ఇది సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.


Rachana

©️ Santosh Kumar

14-15-గీతా మకరందము

 14-15-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రజోగుణ, తమోగుణయుతులు మరణానంతరము బొందు గతులను వివరించుచున్నారు–


రజసి ప్రళయం గత్వా 

కర్మసఙ్గిషు జాయతే | 

తథా ప్రలీనస్తమసి 

మూఢయోనిషు జాయతే || 


తాత్పర్యము:- రజోగుణము అభివృద్ధినొందియుండగా మరణించువాడు కర్మాసక్తులగు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణ మభివృద్ధినొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు, లేక పశుపక్ష్యాది హీనజాతులందు పుట్టుచున్నాడు.


వ్యాఖ్య:- రజోగుణాధిక్యత గలిగి మరణించువాడు తనయొక్క సంస్కారమునకు అనుగుణ్యముగనే తిరిగి కర్మాసక్తులయందు జన్మించుచున్నాడు. అట్లు జన్మించి మఱల పెక్కు బహిర్ముఖకార్యములందు, విషయాదులందు ప్రవర్తించి - తిరిగి మరణించుచు - ఈ ప్రకారముగ సంసారబంధమునుండి విడివడక, పెక్కుయాతనల ననుభవించుచు అశాంతి గలిగియుండును. ఇక తమోగుణాధికత్యయందు మరణించువాడు హీనచరితులగు మూఢజనులందో, లేక పశుపక్ష్యాదులందో జన్మించును. అట్టివా రెన్ని దుర్భరదారుణ దుఃఖముల ననుభవించవలెనో! కావున అట్టి భయంకర పరిణామములు, భీషణదుఃఖజనకపరిస్థితులు తనకు కలుగకుండ జీవుడు అతిజాగరూకుడై జీవితకాలమున, మరణము దవ్వుననున్నపుడే ప్రయత్నపూర్వకముగ ఆ రజోగుణ, తమోగుణరూప ఫెూరపిశాచములను తన హృదయగేహమునుండి తరిమివేసి, భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము - ఇత్యాది సద్గుణరాశిని అలవఱచుకొని ముక్తుడై జన్మసార్థకత నొందవలయును.


ప్రశ్న:- రజోగుణాధిక్యతగలిగి మరణించువా డెచ్చోట జన్మించును?

ఉత్తరము: - కర్మాసక్తులందు.

ప్రశ్న:- తమోగుణాధిక్యత గలిగి మరణించువా డెచ్చోట జన్మించును?

ఉత్తరము:- పామరుల (మూఢజనుల) గర్భములందు, లేక, పశుపక్ష్యాది నీచ జాతులందు.

తిరుమల సర్వస్వం -171*

 *తిరుమల సర్వస్వం -171*


*శ్రీ హాథీరామ్ బావాజీ 3*




  మహిమ గల సిద్ధులకు, మునిపుంగవులకు సైతం సాధ్యంకాని శ్రీరాముని నిజరూపదర్శనం తనబోటి సాధారణ భక్తునికెలా సాధ్యం? ఇది తప్పనిసరిగా కలయే! స్వామి స్వప్నంలోనికి వచ్చి తనతో పరిహాసమాడుతున్నాడు! ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉద్విగ్న మనస్కుడై, చేష్టలుడిగిన బావాజీ ఆంతరంగాన్ని పసిగట్టిన శ్రీరామచంద్రుడు అతనిని సంబోధిస్తూ, అది కల కాదని, తన ఇష్టసఖుడైన బావాజీతో పాచికలాడ డానికి వైకుంఠం నుంచి దిగి వచ్చానని సర్దిచెప్పి పాచికలాట ప్రారంభించాడు.


 *భగవంతుని ఐచ్ఛిక ఓటమి* 


 భక్తులచేతిలో పరాజయం పొందటాన్ని అమితంగా ఇష్టపడే శ్రీవారు, పాచికలాటలో స్వచ్ఛందంగా పరాజితులయ్యారు. తాను ఓటమిపాలై, బావాజీ విజేతగా నిలచినందున ఏదైనా వరాన్ని కోరుకొమ్మని పలికారు. సంతోషాంతరంగుడైన బావాజీ శ్రీరామచంద్రుని దర్శనభాగ్యంతో తన చిరకాల వాంఛ యీడేరి జన్మ ధన్యమైందని, అంతకుమించిన సంపద మరేమీ లేదని, శ్రీరాముని పాదాల చెంత కొంచెం చోటిమ్మని, ఇకమీదట తనను దూరం చేయవద్దని విన్నవించుకున్నాడు. 


 బావాజీ నిస్వార్థ భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు బావాజీకి తగిన ఆభయం ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజు రాత్రి బావాజీతో పాచికలాడే నిమిత్తం ఆశ్రమానికి విచ్చేస్తానని శెలవిచ్చి అంతర్థానమయ్యాడు. బాబాజీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరునాటి ఉదయం శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయానికి విచ్చేసిన బావాజీకి పరమాశ్చర్యకరంగా, ఏ విధమైన అడ్డంకులు ఎదురు కాలేదు. చాలా సేపు శ్రీవారిని తనివితీరా దర్శించుకుని, తిరిగి ఆశ్రమానికి వచ్చి, సూర్యాస్తమయం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు. 'ఎప్పుడెప్పుడు శ్రీవారితో పాచికలాడదామా' అని ఒక ప్రక్కన బావాజీ; ప్రియభక్తునితో భేటీ కోసం మరో ప్రక్కన శ్రీరామచంద్రుడు ఇరువురూ ఉవ్విళ్ళూరుతున్నారు. 


 ఆనాటి రాత్రి పవళింపుసేవ అనంతరం ఆలయద్వారాలు మూయగానే, శ్రీవేంకటేశ్వరుడు శ్రీరామచంద్రుని రూపంలో బావాజీ ఆశ్రమానికేతెంచి, అతనితో పాచికలాడి, తన భక్తుని సాన్నిహిత్యంలో మురిసిపోయి, బావాజీని కూడా పరమానంద భరితుణ్ణి గావించాడు. అలా చాన్నాళ్ళు రాత్రివేళల్లో పాచికలాడిన తరువాత, బావాజీ సేవాభావానికి పూర్తిగా సంతృప్తి చెందిన శ్రీవారు, బావాజీ భక్తితత్పరతను లోకానికి చాటిచెప్పాలని భావించారు. తక్షణం వారి మదిలో ఒక ఆసక్తికరమైన పథకం రూపుదిద్దుకుంది. ఆ పథకాన్ని ఆచరణలో పెట్టే ఉద్దేశ్యంతో వెంటనే స్వామివారు కార్యోన్ముఖులయ్యారు.


[స్వామివారి పథకం ఏమిటో, దాన్ని వారు ఏ విధంగా ఆచరణలో పెట్టారో, దానితో బావాజీ పేరుప్రఖ్యాతులు ఏ విధంగా మార్ర్మోగి పోయాయో తెలుసుకుందాం.]



 బాబాజీ భక్తి తత్పరతను, నిస్వార్థ సేవాభావాన్ని లోకానికి వెల్లడించే ప్రయత్నంలో శ్రీవారు ఒక మహత్తరమైన పథకానికి నాంది పలికారు.


 *మాయమైన వజ్రాలహారం* 


 ఒకనాటి రాత్రి యథావిధిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, దాదాపు రాత్రి సమయమంతా బావాజీతో పాచికలాటలో వ్యస్తులై ఉన్న శ్రీవారు ప్రాతఃసంధ్య వేళలో సుప్రభాతపఠనం వినిపించడంతో, ఆటను మధ్యలోనే ఆపి హుటాహుటిగా ఆనందనిలయానికి బయలుదేరారు. బాబాజీ లాంటి భక్తులెందరికో దర్శనమిచ్చి వారందరినీ స్వామివారు కటాక్షించాలి కదా!


 ఆ హడావిడిలో శ్రీవారు తన వజ్రాలహారాన్ని అక్కడే వదలి వెళ్లారు. స్వామివారు నిష్క్రమించిన తర్వాత, వారి వజ్రాలహారాన్ని గమనించిన బాబాజీ దాన్ని తీసి పూజామందిరంలో భద్రపరిచాడు. మరునాటి రాత్రి ఆటకై వచ్చినపుడు దాన్ని భద్రంగా శ్రీవారికి అందజేద్దామని బావాజీ ఆంతర్యం. 


‌‌ ఇంతలో, సుప్రభాతానంతరం గర్భాలయం లోకి విచ్చేసిన అర్చకస్వాములకు, దర్శనార్థమై వచ్చిన అధికారులకు, భక్తులకు స్వామివారు వజ్రాలహారం లేకుండా దర్శనమివ్వడంతో అందరూ విస్తుపోయారు. స్వామివారి అమూల్యమైన హారం చోరీకి గురైందని భావించారు. ఆలయంలో అణువణువునా గాలించారు. చివరికి అర్చకస్వాముల ఇళ్ళలో కూడా సోదాలు జరిగాయి. ఎక్కడా హారం కానరాలేదు.


 *బావాజీపై నేరారోపణ* 


 చివరికి ఆలయ అధికారుల దృష్టి బావాజీపై పడింది. ప్రతినిత్యం స్వామివారిని గంటల తరబడి తదేకదీక్షతో గమనిస్తూ ఉండడంతో బావాజీపై అనుమాన బీజం నాటుకుంది. కొద్దిసేపట్లోనే అనుమానం పెనుభూతంగా మారడంతో, రాజభటులు బావాజీ ఆశ్రమం లోకి బలవంతంగా ప్రవేశించి వెతుకులాట ప్రారంభించారు. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా దైవచింతనలో మునిగివున్న బావాజీ అమాయకంగా ప్రశ్నించడంతో రాజభటులు శ్రీవారి అమూల్యమైన ఆభరణం తస్కరించబడిందని, అధికారుల ఆనతి మేరకు తాము బావాజీ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేదో మామూలు విషయంగా భావించిన బాబాజీ రాత్రి సమయంలో శ్రీరామచంద్రుడు తన ఆశ్రమానికి విచ్చేసి, తనతో పాచికలాడి, సుప్రభాత సమయంలో హడావిడిగా లేచి వెళ్లారని; ఆ తొందరపాటులో వజ్రాలహారాన్ని అక్కడే మరచిపోయారని జరిగింది జరిగినట్లుగా విడమరచి చెప్పాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*310 వ రోజు*


*సుభద్ర శోఖం*


కాని సుభద్ర పుత్రశోకము తట్టుకొన లేక శోకిస్తూ " నాయనా అభిమన్యా ! నేను పుణ్యం చేసుకుని నిన్ను కనే భాగ్యాన్ని పొందాను కాని నీ ముద్దు ముచ్చటలు చూసే భాగ్యానికి కరువయ్యాను. అత్యంత పరాక్రమవంతులైన కౌరవ వీరులను హతమార్చిన నీవు ఇలా దిక్కు లేని మరణం పొందుట నా మనస్సు కలచి వేస్తుంది. శిశువుగా సగం శరీరం నా మీద మిగిలిన శరీరం మెత్తటి శయ్య మీద ఉండేలా శయనించిన నీవు ఇలా కటిక నేలపై పరున్నావా! వంధి మాగధుల శోత్రపాఠములను విను నువ్వు ఇప్పుడిలా నక్కల ఊళలు వింటున్నావా ! ఇంతమంది మహా యోధులు పాండవులు విరాట, ద్రుపద, సాత్యకి, భీమసేనుల పరాక్రమం నిన్ను రక్షించ లేక పోయిందా! మహావీరుడైన అర్జునుడి కుమారుడవు శ్రీకృష్ణుని మేనల్లుడవు నీవు ఇలా శత్రువుల చేత మరణించుట చోద్యము కాక మరేమి ! నాయనా నీ భార్య ఉత్తర వచ్చింది చూడు లేచి ఆమెను ఓదార్చు " అని పలు విధముల రోదిస్తూ ఉంది. ద్రౌపది తన రెండు చేతులతో సుభద్ర, ఉత్తరలను పొదివి పట్టుకుని అలాగే వివశురాలై భూమి మీద పడి పోయింది. శ్రీకృష్ణుడు వారిని ఉచిత వచనములతో ఓదార్చి పాండవుల వద్దకు వచ్చి అందరిని వారి వారి శిబిరములకు వెళ్ళమని చెప్పాడు. తాను కూడా అర్జునుడితో అతడి శిబిరానికి వెళ్ళాడు.


*కృష్ణార్జునులు ఆయుధపూజ చేయుట*


శిబిరానికి వెళ్ళిన కృష్ణార్జునులు ఒక ప్రదేశమున దర్భాసనము వేసి దానిపై గాండీవము, దేవదత్తము, పాంచజన్యము, సుదర్శనము మొదలైన ఆయుధములు అమర్చారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని వాటి మధ్య నిద్రించమని చెప్పాడు. ఆ తరువాత తన సారథి దారుకునితో తన శిబిరానికి వెళ్ళాడు. తాను కూడా నిద్ర పోదామని అనుకున్నా! నిద్ర రాలేదు. పాండవ శిబిరములో ఎవరికి నిద్ర రాలేదు. పాండవులు " కుమారుని మరణనానికి క్రుద్ధుడైన అర్జునుడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. దానిని కౌరవులు ఎలాగైనా వమ్ము చేయ ప్రయత్నిస్తారు. రేపు పొద్దుక్రుంకే సమయానికి అర్జునుడు సైంధవుని చంపలేకున్న అగ్నిప్రవేశం చేస్తాడు. అప్పుడు పాండవులు ఏమౌతారు మనమేమి ఔతాము. అతడి పూజలు ఫలించి అర్జునుడు సైంధవుని వధించాలి. ద్రోణుల వంటి వారు పది వేల మంది రక్షించినా సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాలి " అని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ వేడుకున్నారు. శ్రీకృష్ణుడికి కూడా నిద్ర పట్ట లేదు. సారథి దారుకుని చూసి " దారుకా ! అర్జునుడి ప్రతిజ్ఞ విన్నావు కదా ! రేపటి లోపల సైంధవుని చంపుట సాధ్యమా ! ఒక వేళ చంపలేకున్న ఎంత దుర్ధశ సంభవించగలదు. అర్జునుడు నా బహిర్ప్రాణము నాలో సగము అతడు లేక నేను జీవించ లేను ఇది నీకు తెలుసు. కనుక అతడిని రక్షించుకోవడం నా కర్తవ్యం. నాకు ఈ ద్రోణుడు ఒక లెక్క కాదు. రేపు ఈ చరాచర ప్రపంచం నా పరాక్రమము తిలకిస్తాయి. పాండవుల మీద నాకున్న ప్రేమ లోకానికి తెలియజేస్తాను. రేపు నేను విజృంభించి సైంధవుని హతమారుస్తాను. గర్వాంధుడు సుయోధనుడు సకల సైన్యంతో నన్ను అడ్డుకున్నా అందరిని హతమార్చి సైంధవుని చంపుట తధ్యం " అన్నాడు. " దారుకా ! నా రథం సిద్ధం చెయ్యి. శౌబ్య, సుగ్రీవ మొదలగు అశ్వరాజములను రధముకు కట్టు. గరుడ ధ్వజము ఎత్తించు. నా ఆయుధములైన సుదర్శనచక్రము, గధ వంటి ప్రముఖ ఆయుధములు రధములో పెట్టు. రేపు అత్యంత జాగరూకుడివై నేను పాంచజన్యం పూరించినంత రధమును అతి వేగంగా తీసుకు వచ్చి నా ముందుంచు. నేను నా రధము ఎక్కి సైంధవుని వధిస్తాను " అన్నాడు. దారుకుడు " మహానుభావా! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. రధము సిద్ధము చేసి మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాను. అసలు మీరు అర్జునుడి రథం ఎక్కి పాంచజనన్యం పూరించగానే కౌరవుల గుండెలు జారిపోతాయి. తమరు యుద్ధం చేసే అవకాశం ఉండదు అయినా తమరి ఆజ్ఞకొరకు వేచి ఉంటాను " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పంచగవ్య థెరపీ

 *"పంచగవ్య థెరపీ లో గవ్యసిద్ద డాక్టర్ గా అయ్యే బంగారు అవకాశం"*


 భారతీయ పారంపర్య అనువంశీక పంచగవ్య వైద్య విధానం ఇది


 *నాడీ చూసి వైద్యం చేయడం నేర్పబడును* 

 

 *మొట్టమొదటిసారిగా* మన ఆంధ్రప్రదేశ్ లోని *భీమవరంలో*, కాంచిపురం పంచగవ్య విద్యాపీఠం ( PANCHAGAVYA UNIVERSITY ) వారి అనుసంధాన గురుకులం మొదలుకాబోతుంది


కాంచిపురం గురుకులంలో హిందీ, తమిళం భాషలలో విద్యాబోధన ఉంటుంది. *మన భీమవరంలో పంచగవ్య విద్యాబోధన అంతా తెలుగులోనే ఉంటుంది* 


 *ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పంచగవ్య గురుకులం ఇది* 


         *2025-26 మొదటిబ్యాచ్ ఉగాది (మార్చి 30) నుంచి * *మొదలుకాబోతుంది* 


🙏 *మా లక్ష్యం -* *దేశి గోవు* ( *నాటు ఆవు ) ద్వారా భాతదేశాన్ని ఆరోగ్యవంతంగా, నిరోగిగా, సుసంపన్నంగా తయారుచేయడం* 🙏


 *భారతదేశం యొక్క పార్లమెంట్ బోర్డు (BSS) ద్వారా 🖋️ నమోదు చేయబడిన సిలబస్ మరియు పంచగవ్య విద్యాపీఠం, -* *కాంచిపురం గురుకులం వారి అనుసంధాన గురుకులం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం లో* 


 *దేశి గోమాత యొక్క విజ్ఞానం ఆధారంగా* *నిర్మితమైన కోర్స్* *ఇది* 


# *ADVANCED DIPLOMA IN PANCHAGAVYA THERAPY, (ADPT) #* 


 *అడ్మిషన్స్ మొదలయ్యాయి* 

 *02-03-2025 నుండి 18-03-2025.* 


 *30-03-2025 ఆదివారం నుంచి క్లాస్సేస్ మొదలు అవుతాయి* 


** *క్లాస్సేస్ ప్రతి నెల రెండో శనివారం & ఆదివారం మాత్రమే* 


 *ఉద్యోగాలు, వ్యాపారాలు, చేసుకుంటూ కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు* *తర్వాత మీరే* *క్లినిక్ మొదలుపెట్టుకోవచ్చు* 


 *గృహిణిలు కూడా ఈ కోర్స్ నేర్చుకోని మీ జీవితాన్ని మార్చుకోగలిగే అద్భుత అవకాశం* 


 *నెలకు రెండు రోజులు మాత్రమే(శని, ఆదివారలలో) ఈ కోర్స్ ఉంటుంది* 


** *క్లాస్ సమయం ఉదయం 6:00 am నుండి సాయంత్రం 6:00 pm వరకు* 


 **ఉదయం అల్పాహారం 8:00 am,* 

 *ఉదయం భోజనం 1:00 గంటకు.** 

 **సాయంత్రం భోజనం 5:00 pm* *లకు ఉచితంగా పంచగవ్య* *గురుకులం ఏర్పాటు* *చేస్తుంది.


 *దూరప్రాంతాలవారికి**

 **ఉచితంగా వసతి సౌకర్యం ఏర్పాటుఉంటుంది ** 


 *6 తీయరీ సబ్జక్ట్స్* 

 *6 ప్రాక్టికల్ సబ్జక్ట్స్ ఉంటాయి* 


** *కనీస విద్యార్హత 10వ తరగతి లేక ఇంటర్, డిగ్రీ*, *పీజి* 


** *విద్యాబోధన పూర్తిగా తెలుగు లోనే ఉంటుంది* 


 *కోర్స్ వివరాలు* : 

రెండు సంవత్సరాల కోర్స్ ఇది 

మొదటిసంవత్సరంలో  

* థియరీ క్లాస్సేస్, ప్రాక్టికల్ క్లాస్సేస్ ( ఔషద నిర్మాణం ) ఉంటాయి 

* ఎగ్జామ్స్ ఉంటాయి (తెలుగులో ఎగ్జామ్ వ్రాయవచ్చు, సులువుగానే ఎగ్జామ్ ఉంటుంది 

* ఔషదలు కూడా తయారుచేయాలి

 *రెండవసంవత్సరంలో*:

 ఆన్లైన్ అప్ప్రెంటీస్ ఉంటుంది, కాంచిపురం నిరంజన్ వర్మ గురువు గారి పర్యవేక్షణలో నెలకు రెండు సార్లు ఒక సంవత్సరం పాటు నడుస్తుంది 


 *మిమల్ని సంపూర్ణ గవ్యసిద్ద వైద్యులుగా మార్చడం మా కర్తవ్యం* 


** *ఫీజ్ వివరాలు :: రెండుసంవత్సరాలకు కలిపి కేవలం 37500/-* ( *అడ్మిషన్* *ఫీజ్* , *ఆహారం, వసతి, జ్ఞాన కోస్ బుక్, ఎగ్జామ్ ఫీజు, స్టడీ మెటీరియల్, డాక్టర్ కోట్) కాంచిపురం విద్యాపీఠం నుండి ఉచితంగా లభిస్తాయి.* 


** *అడ్మిషన్ ఫీజ్ 7500/-* *అడ్మిషన్ అప్పుడు కట్టాలి* 


 *మిగిలిన ఫీజ్ ఒకే వాయిదాలో కడితే కేవలం 30000/-* 


 *** *ఫీజ్ సులువుగా రెండు* *వాయిదాలలో కూడా కట్టవచ్చు.* ( *రెండు నెలలోపు కట్టవచ్చు )* 

 *16000/- & 16000/-* 


 * *ప్రతి ఒక్కరు తప్పకుండ* 

 *రెండు రోజుల సెషన్స్ 8, నాలుగు* *రోజుల సెషన్ 1* *( పంచగవ్య మెడికల్ కాన్ఫరెన్స్ ) హాజరు కావాలి* 


** *అప్లికేషన్ కొరకు : విద్యార్హత సర్టిఫికెట్ జీరాక్స్ కాపీలు 3, మార్క్స్ మెమో జీరాక్స్ కాపీలు* *3, బర్త్* *సర్టిఫికెట్ జీరాక్స్ కాపీలు 3, ఆధార్ కార్డు జీరాక్స్ కాపీలు 3, కలర్ పాస్ ఫొటోస్ కాపీస్ 6, కలర్ స్టాంప్ సైజు ఫొటో కాపీస్ 6* ,


 *స్త్రీ, పురుషులు అందరు అర్హులే* 


** *వయో పరిమితి లేదు, అన్ని వయసులవారు నేర్చుకోవచ్చు* 


** *కేవలం 35 సీట్స్ మాత్రమే ఉంటాయి, త్వరపడండి...* 


** *భారతీయ వస్త్రాధారనలోనే రావాలి, ఇది చాలా ముఖ్యం.* 


 *మీకు లభించు సర్టిఫికెట్స్* 

 *1) BSS certificate* 

 *2) BSS Marks memo* 

 *3) Panchagavya* *Vidyapeetam certificate** 

 *4) World Skills Organization* *certificate* 


 *మీకు కోర్స్ గురుంచి ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించండి* 


 *మణికృష్ణ పంచగవ్య నాడీ చికిత్సలయం, శ్రీరాంపురం, పల్లవి హాస్పిటల్ ఎదురురోడ్డు లో,* *వీసీవీ కేబుల్ ఆఫీస్ దగ్గర, భీమవరం 2, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్* 

 *9492066085, 7013929439* 


👉👉 *దయచేసి మీ బంధుమిత్రులకు, స్నేహితులకు,* *అన్ని గ్రూపులకు పంపించండి.* 

 *గోమాత రక్షణ* *చేసినవారవుతారు* .

 *ముఖ్యంగా 10th, ఇంటర్ తో చదువు ఆపివేసి ఏమి చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూఉన్నా ఏదో ఒక రోజు జీవితంలో గొప్పగా స్థిరపడాలనిఅనుకునే వారికి, అలాంటి ఎంతో మందికి సమాజం లో ధనము, పేరు ప్రాఖ్యతలు, గౌరవం రావడానికి పరోక్షంగా కారకులు అవుతారు* , *ఈ మెసేజ్ అన్ని* *గ్రూపులలో పెట్టండి* *ఎంతో మంది జీవితాలు అద్భుతంగా మారుతాయి* 

 *మీ తల రాతను మీరే మార్చుకునే అద్భుత అవకాశం* 


 *మా వాట్సాప్ నంబర్స్* 

 *9492066085, 7013929439* 


 *ఇ-మెయిల్ : managomatha@gmai.com* 


🙏 *జై గోమాత* 🙏

🙏 *జై రాజీవ్ దీక్షిత్* 🙏

🙏 *జై భారత్* 🙏

శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దేవాలయం,

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


       88వ దివ్యదేశము 🕉


🙏శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దేవాలయం,    

తిరుప్పుళ్ కుళి, కాంచీపురం 🙏


🔅ప్రధాన దైవం: విజయరాఘవ ప్పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: మరకతవల్లి

🔅 పుష్కరిణి: జటాయుతీర్థం

🔅విమానం: విజయకోటి విమానము

🔅 జటాయువునకు


🔔 స్థలపురాణం 🔔


💠 పరంధాముని భక్తవత్సలతకు ఎల్లలు లేవు అని తెలిపే ఈ ఆలయ గాధ శ్రీ మద్రామయణం నాటి సంఘటనతో ముడిపడి ఉన్నది. 


💠శ్రీమహావిష్ణువు రాక్షస సంహారార్ధము ఇక్ష్వాకు వంశమున దశరథ మహారాజు తనయునిగా జన్మించిన శ్రీరామ అవతారమున తన పినతల్లి కైకేయికి తండ్రి ఇచ్చిన వరము నెరవేర్చుటకై 14 సంవత్సరములు వనవాసము చేయుచుండగా ( భార్య సీతాదేవి , తమ్ముడు లక్ష్మణుడు కూడ శ్రీమునితో బాటు వనవాసమున యుండిరి ) . 


💠 ఆ సమయమున రావణాసురుడు సీతాదేవిని మాయోపాయము చేసి బలవంతముగా తన లంకాపురికి తీసికొని పోయి బంధించెను . సీతను వెదకుచూ రామలక్ష్మణులు అడవులలో తిరుగుచుండగా జటాయువు అను ఒక గరుడజాతి పక్షి నేలపై పడి మూలుగుచుండుట చూచి ఆ పక్షి దగ్గరకు పోయిరి . ఆ జటాయువు ..రావణుడు సీతను అపహరించి బలవంతముగా తీసికొని పోయెనని చెప్పెను . 

ఆ విషయము శ్రీరాముడు ఎప్పటికైనా వచ్చునప్పుడు తెలియ జేయుటకే వేచియుండినట్లు తెలియ జెప్పి తన కర్తవ్యము పాటించిన తృప్తితో శ్రీరాముడు తనను చేతులలో తీసికొని నిమురు చుండగా ప్రాణములు విడిచెను . 


💠శ్రీరాముడు జటాయువును తన తండ్రి స్థానమున భావించుకొని తండ్రికి ( దశరథునకు ) అంత్యక్రియలు చేయలేక పోవుటచే , జటాయువునకు అంత సంస్కారములు చేసి భూమిలో గోయితీసి పాతి పెట్టెను . 

శ్రీరామునిలో జటాయువు శ్రీమహావిష్ణువును దర్శించెను .

కార్యక్రమానికి కావలసిన నీటి కొరకు శరప్రయోగం తో పాతాళగంగ ను రప్పించారు. అదే ఈ ఆలయంలో ఉన్న "జటాయువు పుష్కరిణి ". 


💠వేగావతి నదీతీరం లో ప్రశాంత రమణీయ వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దేవేరులు శ్రీ దేవి భూదేవి తో కలిసి దర్శనమిస్తారు. మూలవిరాట్టు ఒడిలో జటాయువు ను చూడవచ్చును. 

 పక్షిరాజు మరణానికి చింతిస్తున్నట్లుగా అమ్మవార్లు తమ ముఖాలను పక్కకు తిప్పుకొన్న భంగిమలో కనిపిస్తారు. 

కొద్ది దూరంలో ఉన్న చిన్న కొండ మీద జటాయువు ఆలయం కలదు.

పక్షిరాజు జటాయువు ప్రభుసేవలో ప్రాణం విడిచిన ప్రదేశం కనుక "తిరుపహిషి "(శ్రీ పక్షి ) అన్న పేరుతో పిలవసాగారు.


💠" పుల్ " అనగా గరుడజాతి పక్షి , " కుళి " అనగా గోయి . 

 జటాయువును గోయిలో పూడ్చి పెట్టిన స్థలము కావున " తిరుపుల్ కుళి ” అని పేరు పొందినది.

 

💠 శ్రీరాముడు జీవులనందరను ఎట్టి తారతమ్యము లేని విధముగా చూచుకొను పరమాత్మావతారము . 

శబరి , అహల్యలకు తన మాతృ స్థానమునిచ్చి గౌరవించి ఉద్ధరించెను . సుగ్రీవుడు , గుహుడు మరియు విభీషణులను తన సోదర స్థానమున ఉంచుకొని ప్రత్యేక గౌరవముతో చూచుకొనెను . 

భక్తికి , శరణాగతికి , ప్రేమకు బద్ధుడై పరమాత్ముడు సర్వజనులను అనుగ్రహించును అని బోధించు అవతారము శ్రీరాముడు , సచ్ఛీలత , కర్తవ్యపాలనము , నిస్వార్థపరత్వము భూతదయ మొదలగు సర్వ సద్గుణ రాశి శ్రీరాముడు . 


💠ఈ క్షేత్రంలో గల ఈ దేవాలయంలో, పిల్లలు లేని స్త్రీలు, పప్పును (పరుప్పు) మాడపల్లికి (భగవంతుని భోజనం తయారు చేసిన ప్రదేశం) ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత, పప్పును నీటిలో నానబెట్టి, వారి కడుపు చుట్టూ కట్టి, నిద్రపోమని చెప్తారు. వారి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, విత్తన మొగ్గలు ఏర్పడితే, వారు ఒక బిడ్డకు జన్మనిస్తారని నిర్ధారించబడింది.

ప్రతి అమావాస్య నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి.


🙏 జై శ్రీమన్నారాయణ 🙏

మూడు మజిలీలు*

 *జీవితంలో మూడు మజిలీలు* 

*మొదటి మజిలీ: 58 నుంచి 65 సంవత్సరాల మధ్య* 

*మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ/సంస్థ నుంచి* *దూరంగా జరుగుతారు* 

*మీరు ఎన్ని విజయాలు సాధించినా*, *ఎంత శక్తివంతులైనా* *ఒక మామూలు* *మనిషి*” *గా మాత్రమే* *మిగిలి* *పోతారు*. 

*మీరు ఉద్యోగ*, *వ్యాపారాల్లో  గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనం మీ బుర్ర లోంచి తొలగించుకోండి*. *ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు*. 

*రెండవ మజిలీ: 65 ఏళ్ల నుంచి* *72 వరకు* 

*ఈ వయసులో* *సమాజం మిమ్ములను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు*, *సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది*. *మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్ములను* *గుర్తించేవారి సంఖ్య కూడా పలచబడుతుంది*.

*నేను* *అప్పట్లో* *అలా ఉండేవాడిని*”, *ఒకసారి* *ఎం* *చేశానో తెలుసా*” *అని ఎవరితో* *చెప్పకండి*. *మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు*. *మీరు బాధ పడకూడదు*. 

*మూడవ మజిలీ*: *72 – 77 సంవత్సరాల* *మధ్య* 

*ఈ మజిలీలో మీకు* *ఎందరు సంతానం ఉన్నా*, *మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత* *భాగస్వామితోనో, లేక ఒంటరీగానో మాత్రమే* *మిగిలిపోతారు*. *కుటుంబం మీనుంచి దూరం జరుగుతూ ఉంటుంది*. 

*మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్ములను పలకరిస్తే, అది మీ మీద ప్రేమ, అభిమానం*, *గౌరవంగా భావించండి*. *ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని* *కోపగించుకోకండి. వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి*. 

*చివరి మజిలీ*: *77 ఏళ్ల తరువాత* 

*ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింప చేస్తుంది*. *అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు*. *జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి*. 

*శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి*. 

*మీకు నచ్చింది తినండి, త్రాగండి, ఆడండి, పాడండి*. 

*ఆనందంగా , హుషారుగా ఉండండి. అంతే*!!! *అంత శివోహం..   సర్వేజనా*  *సుఖినోభవంతు* *ఓం నమశ్శివాయ* 🙏