ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
23, జూన్ 2025, సోమవారం
విషములు రకములు -
విషములు రకములు - వాటి గురించి వివరణ.
విషము రెండు రకాలుగా ఉండును. అవి
. 1 - స్థావర విషము .
2 - జంగమ విషము .
స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.
. స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు. అవి
1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 - ధాతువులు , 10 - దుంపలు .
స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
* వేళ్ళ యందు విషము కలిగినవి -
నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.
* ఆకుల యందు విషము కలిగినవి -
విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును.
* ఫలముల యందు విషము కలిగినవి -
కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.
* పూల యందు విషము కలిగినవి -
పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.
* పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -
ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.
* పాల యందు విషము కలిగినవి -
కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.
* ధాతువుల యందు విషము కలిగినవి -
పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.
* దుంపల యందు విషము కలిగినవి -
కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.
స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -
* విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.
* విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.
* విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.
* విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.
* విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.
* విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .
* ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.
* విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.
* నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.
* సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .
* కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.
* వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.
* ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.
* పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.
* మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.
* హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.
* మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.
* కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
⚜ శ్రీ మంకేశ్వర్ ఆలయం, జోడాజ్.
🕉 మన గుడి : నెం 1151
⚜ మహారాష్ట్ర : నాసిక్
⚜ శ్రీ మంకేశ్వర్ ఆలయం, జోడాజ్.
💠 నాసిక్ సాంప్రదాయకంగా దేవగిరి యాదవుల జన్మస్థలంగా పరిగణించబడుతుంది, వీరిని సెయునా లేదా గావ్లి రాజులు అని కూడా పిలుస్తారు.
💠 దేవగిరి యాదవులు నిర్మించిన అత్యుత్తమ ఆలయాలలో ఒకటి మాలేగావ్ తహసీల్‌లోని జోడ్గే అనే వింతైన గ్రామంలో శతాబ్దాల నాటి మంకేశ్వర్ ఆలయం .
ఈ గ్రామంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటి అందం మరియు నైపుణ్యం అసమానమైనవి.
💠 మంకేశ్వర్ ఆలయం ఒక పురాతన శివాలయం. ఈ ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని జోడాగే గ్రామంలో ముంబై-ఆగ్రా జాతీయ రహదారికి ఆనుకొని ఉంది.
💠 ఆలయం ముందు రాతితో చెక్కబడిన అందమైన నంది (ఎద్దు) ఉంది. ఇది శివాలయం కాబట్టి, ఆలయంపై శివుని అనేక శిల్పాలు చూడవచ్చు.
💠 ఆలయంలో మండపం, అనుబంధ మందిరాలు, అంతరాలయం మరియు ప్రధాన గర్భగృహానికి దారితీసే బహిరంగ అర్ధమండపం ఉంది. మండపం మరియు అర్ధమండపం యొక్క పైకప్పు ప్రస్తుతం కనిపించడం లేదు.
💠 ఈ మందిరంలో అద్భుతమైన శివుని విగ్రహం ఉంది. చాముండ శిల్పం ఇక్కడ చూడవచ్చు. అష్టదిక్పాలకుల (ఎనిమిది దిక్కుల ప్రభువులు), భైరవుడు మరియు విష్ణువు కూడా ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతారు. ఆలయ వెలుపలి భాగం వివిధ శిల్పాల అందాలతో అలంకరించబడి ఉంది.
💠 ఆలయం ముందు మరొక శిథిలమైన ఆలయం ఉంది.
దీనిని సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఆలయంలోని విగ్రహం లేదు.
💠 హేమాద్రి పండిట్ ఈ కొండపై నివసించిన సాధువు హేమాద్రి జోట్ సింగ్ బాబా ఈ మంకేశ్వర్ నిర్మించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని విస్తృతంగా నమ్ముతారు. కొండ దిగువన ఆలయం ఉంచితే సహజ శక్తుల నుండి ఆలయం బాగా రక్షించబడుతుందని హేమాద్రి పండిట్ భావించాడు.
💠 ఆలయానికి రాయిని కొండకు దక్షిణం వైపు నుండి తీసుకున్నారు.
ఈ ఆలయం 12వ శతాబ్దంలో దక్షిణాన గ్రామం మరియు ఆలయం పశ్చిమ ముఖంగా ఉండేలా నిర్మించబడింది. ఆలయ నిర్మాణం తర్వాత వార్షిక వర్షాల దిశ మారినట్లు కనిపిస్తోంది.
💠 అంతరాల పైకప్పులో తాబేలు ఉంది మరియు మందిరం యొక్క ప్రధాన ద్వారం జంతువులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు మరియు ఇతర దేవతల అద్భుతమైన శిల్పాలను కలిగి ఉంది. గర్భ గృహ ప్రవేశద్వారం వద్ద గణేశుడి విగ్రహం ఉంది. గర్భగుడిలోకి దిగి వెళ్ళాలి, అక్కడ ఒక శివలింగం నేల నుండి కొద్దిగా పైకి లేస్తుంది. అప్పటి నుండి అసలు శక్తి పీఠం భర్తీ చేయబడింది.
💠 ఈ ఆలయం లోపలి మరియు వెలుపలి భాగం రెండూ అలంకరించబడి, కళాకారుల ఆదర్శవంతమైన చేతిపనులు మరియు ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తాయి. భూమిజ శైలిలో నిర్మించిన శిఖరంలో అనేక క్లిష్టమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఎత్తైన శిఖరంపై శివుడు, చాముండి దేవి, అష్టదిక్పాలకులు, భైరవుడు, విష్ణువు, గాయకులు, జంతు మూలాంశాలు, సామాజిక దృశ్యాలు మరియు ఇతరుల అసాధారణ చిత్రణలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి కళాత్మకత మరియు వైభవాన్ని చూడటం చాలా అరుదు.
💠 జోడాగే నాసిక్ నుండి 128 కి.మీ దూరంలో ఉంది.
Rachana
©️ Santosh Kumar
18-25-గీతా మకరందము
18-25-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ| తామసకర్మను పేర్కొనుచున్నారు-
అనుబంధం క్షయం హింసాం
అనపేక్ష్య చ పౌరుషమ్ వెూహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే.
తా:- తానుచేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను (ధనాదుల) నాశమును, (తనయొక్క, ఇతరులయొక్క శరీరాదులకుగలుగు) బాధను, తన సామర్థ్యమును ఆలోచింపక, అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామసకర్మయని చెప్పబడుచున్నది.
వ్యాఖ్య: - తామసకర్మావలంబి ముందు వెనుకలు ఆలోచింపక కర్మలు ప్రారంభించును. ఆ కర్మవలన కలుగబోవు దుఃఖములను గురించి విచారింపడు. ఇతరులకు దానివలన కలుగు బాధనుగూడ యోచింపడు. తనశక్తిసామర్థ్యములనుగూడ చూచుకొనడు. అవివేకముతో గ్రుడ్డిగా కర్మలుచేయు మొదలిడును. అట్టివాడు చేయు కర్మ మహాప్రమాదభూయిష్టమైయుండును గావున అది సర్వదా త్యాజ్యమేయగును.
మరియు సామాన్యముగ భగవద్విముఖుడై, స్వార్థసాధనకొఱకు గావించు దృశ్యవిషయసంపాదనారూపమైన కర్మలన్నియు రాజస, తామస క్రియలక్రిందకే వచ్చును. ఏలయనిన, వానిచే తన ఆత్మకు కలుగు నష్టము (సంసారబంధము) నతడు ఆలోచించుటలేదు.
"మోహాత్" - అనుటవలన ఈ రాజస, తామసక్రియలన్నిటికిని మూలకారణము అవివేకము, అజ్ఞానము అయియున్నదని స్పష్టమగుచున్నది. కాబట్టి మొట్టమొదటవివేకమును సంపాదించి ఇట్టి రాజస తామసాది వృత్తులను త్యజించి జీవితమును సంస్కరించుకొనవలయును.
ప్ర: - తామసకర్మ ఎట్టిది?
ఉ: - ముందు కలుగబోవు దుఃఖాదులను, (ధనాదుల) నాశమును, (దేహాదుల) బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో గ్రుడ్డిగా నాచరింపబడు కర్మము తామసకర్మమనబడును.
ప్ర: - ఇట్టి తామస ప్రవృత్తికి కారణమేమి?
ఉ- అవివేకము.
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ప్రథమాశ్వాసము*
*416 వ రోజు*
*శకుని వధ*
కృష్ణుడు రధమును సుయోధనుడి వంకకు పోనిచ్చాడు. సహదేవుడు, భీముడు, సుయోధనుడిని చంపడానికి చెరి ఒక వైపు నుండి వచ్చారు. ఇంతలో శకుని తన సైన్యముతో వారి ముందు నిలిచాడు. శకుని, సుశర్ముడు అర్జునుడిని, సుదర్శనుడు భీమసేనుడిని, సుయోధనుడు సహదేవుని ఎదుర్కొన్నారు. సుయోధనుడు ఒక బల్లెమును సహదేవుడి మీద వేసాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకుని సహదేవుడు సుయోధనుడి మీద అత్యంత శక్తివంతమైన బాణములు ప్రయోగించాడు. కౌరవ సైనికులు తోమరములతో అర్జునుడిని కప్పారు. అర్జునుడు కోపించి వాడి అయిన బల్లెములతో గాంధార సేనల తలలు నరికాడు. ఇంతలో త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు సంశక్తులలో ఒక్కడైన సత్యకర్ముడి తలను నరికాడు. చివరగా మిగిలిన సంశక్తుడు సత్యేషుడిని కూడా చంపాడు. ఆఖరుగా మిగిలిన సుశర్మ వక్షస్థలముకు గురి పెట్టి ఒక బల్లెము విసిరాడు. ఆ బల్లెము సుశర్మ వక్షస్థలం చీల్చింది. తరువాత అర్జునుడు సుశర్మ కుమారులు అందరిని ఒక్కొక్కరిని మూడేసి బాణములతో కొట్టి చంపాడు. సంశక్త సైన్యం పారి పోయింది. భీముడు చావగా మిగిలిన సుయోధనుడి తమ్ముడు సుదర్శనుడిని సంహరించాడు " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! ఇక నీకుమారులలో ఒక్క సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. శకుని సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గుచ్చాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగారు. అది చూసి కౌరవసేనలు పారి పోయాయి. సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించాడు. సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేసాడు. సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచాడు. శకుని మహా కోపంతో సహదేవుని కత్తిని, గద ను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలో ఖండించాడు. అది చూసి శకుని తన రథ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోయాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూసావు కదా ! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని సహదేవుడు శకుని రథాశ్వములను, కేతనమును, విల్లును ఖండించాడు. అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలింది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు.
*సుయోధనుడి నిష్క్రమణ*
శకుని మరణానికి పాండవ సైన్యం హర్షాధిరేకంతో జయజయ ధ్వానాలు చేసారు. యోధులు పరమ ప్రమోదంతో శంఖధ్వానం చేసారు. గాంధార సేనలు శకుని మరణం తరువాత కూడా బెదరక తమ రాజు మరణానికి కారకుడైన సహదేవుడి మీద తిరగబడింది. సహదేవుడికి సాయంగా అర్జునుడు, భీముడు నిలబడ్డారు. భీమార్జున ధాటికి ఆగలేక వారి ధాటికి గాంధార సైన్యం నశించింది. సుయోధనుడు రణభూమిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఎదురుగా ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. సుయోధనుడు యుద్ధభూమిని వదిలి వేయడానికి నిశ్చయించుకున్నాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా ! ఆ సమయమున ఇరుపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి " అని అడిగాడు. సంజయుడు " మహారాజా! ఒక్క సుయోధనుడు తప్ప కౌరవ సైన్యం అంతా సర్వ నాశనం అయింది. పాండవ పక్షాన రెండు వేల రథములు, ఏడు వందల ఏనుగులు, అయిదు వందల హయములు, పది వేల కాల్బలం మిగిలారు. సుయోధనుడు తన గదను భుజం మీద పెట్టుకుని రణభూమిని విడిచి ఎటో వెళ్ళాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. సుయోధనుడి నిష్క్రమణతో పద్దెనిమిది రోజులు అవిచ్ఛన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైంది.
*శల్య పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
మనిషికి దూరం ఎంత
🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు.. మనసులో నమ్మకం ఉంటే అణువంత.. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం.. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు.. నేటి కంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అవసరం*🔥మంచి జీవితం, ఆరోగ్యం,సత్సంబందాలు ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.. అంతేకాదు ప్రతిరోజు ప్రశాంతంగా గడిచిపోవాలని ఆశిస్తారు.. కానీ అనుకున్నట్లుగా జరగకపోతే వాటిని సమస్యలుగా తీసుకుంటారు.. నన్ను ఎందుకు నిందించారు? ఇలా ఎందుకు జరిగింది? ఇక ఎప్పటికీ ఇలానే ఉంటుందా అని విషాదకరమైన ఆలోచనల వలయంలో చిక్కుకుంటారు.. ఈ విషవలయం నిరాశ అనే ఊబిలోకి తీసుకుపోయి దుఃఖంలో ముంచేస్తుంది🔥మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం మంచి ఆలోచనతో ముందుకు వెళ్లడం ముఖ్యం..ఎందుకంటే మన జీవితం మనదే.. మానకొచ్చే కష్టాలు మనమే భరించాలి..అందరి జీవితంలో గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు..కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది.. అందుకే పరమాత్ముని ధ్యానంలో ఉంటూ శుభమైన ఆలోచనలతో ముందుకు సాగాలి🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D N 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏
శ్రీమద్భగవద్గీత
శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో௨ధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః (3)
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్
అధియజ్ఞో௨హమేవాత్ర దేహే దేహభృతాం వర (4)
అర్జునా.. సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మమనీ, ఆత్మ పరమాత్మతత్వాన్ని అధ్యాత్మమనీ చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికీ, ఉనికికీ కారనమైన త్యాగపూర్వం, యజ్ఞరూపం అయిన కార్యమే కర్మ. శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతమంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో వుండే అధియజ్ఞాన్ని నేనే.
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *యాదృశేన హి వర్ణేన*
*భావ్యతే శుక్లమంబరమ్l*
*తాదృశం కురుతే రూపమ్*
*ఏతదేవమవేహి మేll*
*మహాభారతమ్ - శాన్తి పర్వమ్*
తా𝕝𝕝 *తెల్లటి వస్త్రానికి ఏ రంగు వేస్తే అది ఆ రంగుతోనే ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనం ఎటువంటి స్నేహం చేస్తే అటువంటి లక్షణాలే వస్తాయి.*
✍️🌹🌸💐🙏
తక్కువగా మాట్లాడగ
*2156*
*కం*
తక్కువగా మాట్లాడగ
నెక్కువ విలువొందగలవు నెక్కడనైనన్.
ఎక్కువ విలువలుగల నీ
వెక్కువగా మాటలాడ వికృతమె సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడనైనా ఎక్కువ విలువలు పొందగలవు. ఎక్కువ విలువలు కలిగినవాడవైననూ ఎక్కువగా మాట్లాడటం వలన వికృతంగా నే ఉంటుంది.
*సందేశం*:-- మౌనం మనిషి విలువలు పెంచుతుంది. ఎంతటి విలువైన వారైననూ ఎక్కువగా మాట్లాడితే మనుషులు తక్కువ గానే విలువ ఇస్తారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
సమయం (టైమ్) లేదు*
*సమయం (టైమ్) లేదు*
*ప్రతి ఒక్కరి నోటా, ఒకటే మాట. అదే టైమ్ లేదు*
పన్నెండు గంటల రైలు ప్రయాణం కేవలం రెండు గంటల్లో ఫ్లైట్ లో పూర్తి చేస్తున్నాడు.
అయినా టైమ్ లేదు అంటున్నాడు.
పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది,
అయినా టైమ్ లేదు అంటున్నాడు.
నాలుగు వారాలు పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకన్లలో వస్తోంది, అయినా టైమ్ లేదు అంటున్నాడు.
ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది,
ఇప్పుడది కేవలం ఒక సెకన్లో చూస్తున్నాడు. మాట్లాడు తున్నాడు. అయినా టైమ్ లేదు అంటున్నాడు.
ఇంటి పైకి కిందకి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు లిఫ్ట్ వల్ల క్షణాల్లో ముగుస్తోంది,
అయినా టైమ్ లేదు అంటున్నాడు.
కట్టెల పొయ్యి, రాతి రోళ్ళతో చేసే వంటలు, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ మిక్సి లుతో క్షణాల్లో చేసేస్తున్నాడు. అయినా టైమ్ లేదు అంటున్నాడు.
బ్యాంక్ లో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి,
ఇప్పుడు మొబైల్ లో కొన్ని సెకన్లలో లావాదేవీలు చేస్తున్నాడు,
అయినా టైమ్ లేదు అంటున్నాడు.
వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు
ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి,
అయినా టైమ్ లేదు అంటున్నాడు.
ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్ –
ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు అంటున్నాడు.
కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్. ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు
ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు –
ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు.
నాలుగుమందితో కూర్చున్నా అసహనంగా ఫోన్‌లో వేలు వేస్తాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి – సమయం లేదు అంటున్నాడు.
ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు ఎందుకంటే సమయం లేదు అంటున్నాడు.
పుస్తకం చదవడానికి సమయం లేదు,
తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు,
మిత్రుడిని కలవడానికి సమయం లేదు,
ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు…
కానీ – ఐపీఎల్ కోసం సమయం ఉంది,
నెట్‌ఫ్లిక్స్ కోసం సమయం ఉంది,
రీల్స్ కోసం సమయం ఉంది,
రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది,
కానీ తనకోసం సమయం లేదు…
ప్రపంచం సులభమైంది, వేగం పెరిగింది,
సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గాయి,
ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి –
కానీ మనిషికి *సమయం లేదు* అంటూ తనను తానే మర్చిపోయాడు.
నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి,
తనను అర్థం చేసుకోవడానికి,
లేదా కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వడానికి –
సమయం లేదు అంటున్నాడు.
మరొక్క రోజు సమయమే వెళ్లిపోతుంది.
ఆఖరి క్షణంలో అర్థమవుతుంది –
సమయం ఉండింది…
కానీ మనమే “సమయం లేదు” అంటూ జీవించడాన్ని మరిచిపోయాము.
కాబట్టి, ఈరోజే నిర్ణయం తీసుకోండి –
తనకోసం కొద్దిగా సమయం కేటాయించండి,
బంధాల కోసం కొంత సమయం పెట్టండి.
మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం –
కొంత సమయం వెచ్చించండి.
ఎందుకంటే "సమయం లేదు" అనేది నిజం కాదు.
అది కేవలం అలవాటు మాత్రమే…
దానిని మార్చాలి.
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *యాదృశేన హి వర్ణేన*
*భావ్యతే శుక్లమంబరమ్l*
*తాదృశం కురుతే రూపమ్*
*ఏతదేవమవేహి మేll*
*మహాభారతమ్ - శాన్తి పర్వమ్*
తా𝕝𝕝 *తెల్లటి వస్త్రానికి ఏ రంగు వేస్తే అది ఆ రంగుతోనే ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనం ఎటువంటి స్నేహం చేస్తే అటువంటి లక్షణాలే వస్తాయి.*
✍️VKS ©️ MSV🙏
తక్కువగా మాట్లాడగ
*2156*
*కం*
తక్కువగా మాట్లాడగ
నెక్కువ విలువొందగలవు నెక్కడనైనన్.
ఎక్కువ విలువలుగల నీ
వెక్కువగా మాటలాడ వికృతమె సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడటం వలన ఎక్కడనైనా ఎక్కువ విలువలు పొందగలవు. ఎక్కువ విలువలు కలిగినవాడవైననూ ఎక్కువగా మాట్లాడటం వలన వికృతంగా నే ఉంటుంది.
*సందేశం*:-- మౌనం మనిషి విలువలు పెంచుతుంది. ఎంతటి విలువైన వారైననూ ఎక్కువగా మాట్లాడితే మనుషులు తక్కువ గానే విలువ ఇస్తారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
