23, జూన్ 2025, సోమవారం

విషములు రకములు -

 విషములు రకములు - వాటి గురించి వివరణ.

 

విషము రెండు రకాలుగా ఉండును. అవి 

    

. 1 - స్థావర విషము .

     2 - జంగమ విషము .

  

స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.

     

. స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు. అవి 


 1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 - ధాతువులు , 10 - దుంపలు .

    

స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .

 

* వేళ్ళ యందు విషము కలిగినవి - 

   నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.

 

* ఆకుల యందు విషము కలిగినవి - 

     విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును. 

 

* ఫలముల యందు విషము కలిగినవి -

     కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.

 

* పూల యందు విషము కలిగినవి -

      పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.

 

* పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -

      ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.

 

* పాల యందు విషము కలిగినవి -

       కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.

 

* ధాతువుల యందు విషము కలిగినవి -

      పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.

 

* దుంపల యందు విషము కలిగినవి -

      కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.

 స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -

  

* విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.

 * విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.

 

* విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.

 

* విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.

 

* విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.

 

* విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .

 

* ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.

 

* విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.

 

* నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.

 

* సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .

 

* కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.

 

* వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.

 

* ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.

 

* పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.

 

* మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.

 

* హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.

 

* మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.

 

* కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

       

. 9885030034

కామెంట్‌లు లేవు: