16, ఆగస్టు 2023, బుధవారం

ప్రాప్తిని అనుసరించి లబ్ధి!

 శుభోదయం🙏

             చొప్పకట్ల.


ప్రాప్తిని అనుసరించి లబ్ధి!


వనజభవుడు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంమ్మొ కొంచెమో

విను మరుభూమి కేగిన లభించును, మేరువు చేరఁబోయినన్

ధన మధికమ్మురాదు;కడు దైన్యము మానుధనాఢ్యులందు న

వ్వననిధి నూతఁదుల్యముగ వారి గ్రహించు ఘటమ్ము చూడుమా?

-భర్తృహరి సుభాషితములు.ఏనుగు లక్ష్మణకవి.


భావం:ప్రాప్తిని బట్టి లబ్ధి.మనకెంతప్రాప్తియోఅంత మరుభూమికేగినా లభిస్తుంది.లబ్ధివ్రాసిపెట్టి లేకపోతే మేరుపర్వతం చుటూతిరిగినా మనకేమీ అంటదు.దైన్యంతో ధనవంతులచుట్టూతిరిగితే ఏంప్రయోజనం?

           కలశ ప్రమాణమునుబట్టినీరు.నీకలశమెంతపెద్దదో అంతనీరు సముద్రమందైనా నూతియందైనా లభించుట నిత్యము మనమెరిగినసత్యమేగదా!!

         "దృష్టాంతాలంకారము."

                        స్వస్తి!!

🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️

Panchaang


 

Saambaru












 

Chaarupodi










 

⚜ శ్రీ ఉగ్రతార మందిర్

 🕉 మన గుడి :







⚜ బీహార్ : మహిషి


⚜ శ్రీ ఉగ్రతార మందిర్ 



💠 బీహార్  సహర్ష  జిల్లాలోని మహిషిలో  ఉగ్రతార ప్రదేశం బీహార్‌లోని ప్రధాన శక్తి ప్రదేశాలలో ప్రముఖమైనది. 

సతీదేవి ఎడమ కన్ను ఇక్కడ పడిందని ప్రతీతి.  ఈ ప్రదేశం తంత్ర సాధనకు ప్రసిద్ధి.


💠 పురాణల ప్రకారం, శివుడు  సతీ మృత దేహాన్ని మోస్తూ విశ్వంలో పిచ్చిగా తిరుగుతున్నాడు.  

ఈ కారణంగా దేవతల భయాన్ని చూసి,  మృతదేహాన్ని విష్ణువు తన సుదర్శనంతో 52 భాగాలుగా విభజించాడు.  

నేలపై పడిన సతీదేవి శరీరభాగాలకి శక్తి  పీఠాలుగా పేరు వచ్చింది.  

మహిషి ఉగ్రతార ప్రదేశానికి సంబంధించి సతీదేవి ఎడమ కన్ను భాగం ఇక్కడ పడిందని ఒక నమ్మకం.


💠 మండన్ మిశ్రా భార్య విదుషి భారతితో ఆదిశంకరాచార్యుల వాగ్వాదం ఇక్కడ జరిగింది, ఇందులో శంకరాచార్య ఓడిపోవాల్సి వచ్చింది.   ఆ తర్వాత ఆదిశంకరాచార్యుడు అద్వైత సాధనలో విశేషంగా రాణించారు


💠 ఉగ్రతార అనే పేరు వెనుక ఉన్న మరొక నమ్మకం ఏమిటంటే, అమ్మ తన భక్తుల యొక్క భయంకరమైన వ్యాధులను నాశనం చేస్తుందని.  అందుకే ఆమెకు భక్తులు ఉగ్రతార అని పేరు పెట్టారు.


💠 ఇక్కడ అమ్మవారు మూడు ప్రధాన రూపాలలో దర్శనమిస్తారు.

మహిషిలో ఉగ్రతార, నీల సరస్వతి మరియు ఏకజాత అనే మూడు రూపాలలో భగవతి ఉంది.  

ఉగ్రతార ఆజ్ఞ లేకుండా తంత్ర సిద్ధి పూర్తికాదని నమ్ముతారు.  తంత్ర సాధన చేసేవారు ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ఇదే కారణం.  


💠 నవరాత్రుల అష్టమి రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది.

ఈ శక్తి స్థల్‌ను ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తారు, అయితే ప్రతి  నవరాత్రుల సమయంలో మరియు మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


 💠 ఈ ఆలయాన్ని 1735లో రాణి పద్మావతి నిర్మించింది. 

 ఈ ఆలయంలో  వైదిక పద్ధతి ప్రకారం పూజలు జరుగుతాయి.

అమ్మవారి పూజ సాధారణ రోజుల్లో వైదిక పద్ధతిలో జరుగుతుంది. 

 కానీ నవరాత్రులలో  తంత్రోక్త పద్ధతిలో పూజలు జరుగుతాయి.  


💠 నవరాత్రులలో అమ్మవారి హారతి రెండు సార్లు నిర్వహిస్తారు.  

ఇందులో  భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు మరియు హరతికి హాజరైన సందర్భంగా తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు.


💠 ఈ ఆలయంలో బహుశా టిబెట్ నుండి నేపాల్ మీదుగా దిగుమతి చేసుకున్న ఉగ్రతార (ఖాదిర్వణి తార) రూపం ఉంది.

ఇది దాదాపు 1.6 మీటర్ల ఎత్తులో ఉన్న నల్లరాతి విగ్రహం.

 

💠 ఇందులో తారకు ఇరువైపులా ఏకజాత మరియు నీలసరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవత వెనుక భాగంలో ఒక చిన్న రాతి స్తంభం అమర్చబడి ఉంటుంది.



💠 బీహార్ నుంచే కాకుండా నేపాల్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.  

బెంగాల్ నుండి కూడా భక్తులు ఏడాది పొడవునా ఇక్కడికి వస్తూనే ఉంటారు


💠 సహర్ష నుండి 16 కి.మీ దూరం. 

ఈ ఆలయం రోడ్డు మార్గంలో సహర్సాకు అనుసంధానించబడి ఉంది.

ఇక్కడికి చేరుకోవాలనుకునే వ్యక్తులు సహర్సా నుండి ఆటో లేదా బస్సులో ఇక్కడికి చేరుకుంటారు.

Gongura Dosaksya pachadi


 

76 సంవత్సరాల స్వతంత్ర భారతం -

 ॐ 76 సంవత్సరాల స్వతంత్ర భారతం - 

                ఆత్మవిమర్శ చేసుకొనే విషయాలు  


2. రాజ్యాంగ ప్రవేశిక - "సామ్యవాద, లౌకిక" పదాల చేర్పు 


అ) రాజ్యాంగ సభ అమోదించిన 26/11/1949 తేదీనగానీ,     

     అమలులోకి వచ్చిన 26/1/1950 తేదీనగానీ, 

     ప్రవేశికలో 

"సర్వసత్తాక 

 ప్రజస్వామ్య 

 గణతంత్ర రాజ్యం" అని మాత్రమే ఉంది. 


ఆ) "సామ్యవాద, లౌకిక" అనే రెండు పదాలూ, 

    

    సర్వసత్తాక గణతంత్ర దేశమైన తరువాత 26 సంవత్సరాలకి,  

    1976 అత్యవసర పరిస్థితిలో, 

    42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకొన్నాం. 


* అంటే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుండీ 24 సంవత్సరాల కాలం, ఈ సవరణ జరిగేంతవరకూ, మన దేశం లౌకిక (Secular) రాజ్యం కాదు. 


ఇ) మధ్యలో వచ్చిన ఆ పదాలు పౌరులు అంగీకరించారా? 


    ఈ రెండు పదాలూ, అధికార పార్టీ ప్రవేశపెట్టి, పార్లమెంటుద్వారా సవరణ చేసింది. 

    ఈ మార్పు తేనున్నట్లు ఆ పార్టీ, అంతకుముందెప్పుడూ, తమ ఎన్నికల ప్రణాళికలలో తెలుపలేదు. 

    వెంటనే 1977లో జరిగిన ఎన్నికల్లో, ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 

     అప్పుడు, ఆ సవరణని ప్రజలు తిరస్కరించినట్లే కదా! 

     కొత్త ప్రభుత్వం 43 రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ సవరణలోని వాటిని అనేకం రద్దుచేసినా, 

    ఈ రెండు పదాలూ తొలగించే విధంగా సవరింపబడక, అలాగే ఉంచబడ్డాయి. 

    మరి ఆ పదాల చేరికకి ఏ విధంగా పవిత్రత ఉన్నట్లు ? 


ఈ) విచిత్రం ఏమంటే, రాజ్యాంగ ప్రవేశికలో, ఈ రెండు పదాలూ, 

    సవరణవలన చేర్చబడినట్లు కనబడక, 

    మొదటినుంచీ ఉన్నవి అన్నవిధంగా కనిపిస్తాయి.  


ఉ) మధ్యలో వచ్చిన, ఆ రెంటి వలనా 

  - ఏదైనా ఉపయోగం ఉందా? 

  - ఇబ్బందులేనా? 

  - సవరణ ముందుకీ, అనంతరమూ మార్పువల్ల ఫలితం బేరీజువేసుకొన్నామా? 

    అనే విషయాలు విశ్లేషించుకోవాలి కదా! 


                                  సశేషం


              భారత్ మాతాకీ జై 

                వందే మాతరమ్  


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

శ్రావణ మాసం ప్రారంభం*

 *రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం*


ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.

అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి.

సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.


*శివారాధనకు ఎంతో విశిష్టత*


శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.


*మంగళ గౌరీ వ్రతం*


శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ , మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.


*వరలక్ష్మీ వ్రతం*


శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.


*శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం*


*పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే*

అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.


*శ్రవణ మాసంలోని విశిష్టతలు*

శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.


*శుక్ల పక్ష పౌర్ణమి:*

శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలుతూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 

*లోకాస్సమస్తాః సుఖినోభవంతు*

రామాయణమ్ 292/293/294

 రామాయణమ్ 292/293/294

...

అమ్మా ! దుఃఖమేల ,ఈ బాధ ఏల ఇప్పుడే ఈ శోకము నుండి విముక్తుడను చేసెదను ! నా వీపుపై కూర్చొనుము రాముని వద్దకు మరుక్షణమే నిన్ను చేర్చెదను. సముద్రమును చిటికెలో దాటివేస్తాను రాముని చెంత నిన్ను చేరుస్తాను . 

.

రావణసహితముగా లంకను పెళ్ళగించుకొని పోగల శక్తి నాకు స్వంతము. నా గమనవేగమును అందుకొన గల శక్తి ఏ దైత్యునకూ లేదు !

.

అని అతి చిన్న రూపముతో ఉన్న హనుమంతుడు పలుకగా ఆశ్చర్యముతో ఆయనను చూసి సంతోషించినదై సీతామాత ఈ విధముగా పలికెను.

.

ఓయి వానరుడా ! నీ రూపమేమి ? నీవేమి ? నీ వానరబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

 అంత దూరము నన్ను మోసుకొని పోగలవనియేనా? అని అన్న రామపత్నిని చూసి హనుమ స్వామి !

.

ఒక అవమానము ! 

ఒక కొత్త అవమానము నేడు జరిగినది !

.

సీతమ్మ తనను ఇంత తక్కువచేసి మాటలాడటము సహించలేకపోయాడు వాయునందనుడు.

.

వెంటనే తాను కూర్చొని ఉన్న కొమ్మమీదనుండి క్రిందకు దుమికి తన శరీరమును పెంచసాగెను.

.

అప్పటి వరకు ఆయనకు నీడ ఇచ్చిన ఆ మహా వృక్షము ఆయన పాదములమీద మొలచిన వెంట్రుకవలె మారిపోయింది!

.

అమ్మా ! పర్వతములు,దుర్గములు,వనములు,సకలదైత్యసైన్యములు,రావణుని ఆతని సింహాసనముతో సహా లంకమొత్తాన్ని మోసుకొని పోగలను .అవి అన్నియు నా అరచేతిలోనికి ఇమిడిపోగలవు !

.

సందేహము విడిచిపెట్టి నా వీపుమీద ఎక్కుతల్లీ ! ఈ క్షణమే నీకు రామసందర్శనభాగ్యము కలుగగలదు అని పలికిన మహాకాయుడైన హనుమంతునితో సీతమ్మ ఇలా అన్నది.

.

...

మహాభయంకరమైన అలలతో కూడి అతి విస్తారమైన సముద్రాన్ని దాటి రాగలిగిన వారు సామాన్యులా ? కాదు !!

.

నీ సామర్ధ్యము నేను ఎరుగుదు‌ను నీ గమన శక్తి నాకు తెలుసు.

.

కానీ ! 

.

మొదట ఇది రామకార్యము !

.

రామ కార్యము చెడిపోకుండా జరగవలెను .

.

వాయువేగమనోవేగాలతో నీవు వెడుతున్నప్పుడు ఆ వేగతీవ్రత తట్టుకోలేక

నేను కంగారు పడవచ్చును

కళ్ళుతిరిగి క్రింద పడిపోవచ్చును,అప్పుడు సముద్రజంతువులకు ఆహారమై పోయెదను.

.

ఇంకొక మాట ! నీవు నన్ను తీసుకువెళ్ళుట చూసి రాక్షసులూరకుందురా?

.

నన్ను కాపాడుకొనుచూ నీవు వారితోయుద్ధముచేయవలసి రావచ్చును .అది నీకు చాలా క్లిష్టముగా పరిగణించును.ఆ యుద్ధములో వారు నన్ను సంహరింపవచ్చును.లేదా తిరిగి బందీగా మరల పట్టుబడవచ్చును.

.

అదియును గాక !

.

నేను పరపురుషుని పొరపాటున కూడా స్పృశించను...

.

NB

.

"పరపురుషుని స్పృశించను" అని అమ్మ అన్న ఈ మాట మొన్నమొన్నటి వరకు అందరికీ ఆదర్శము .నేడేలనో దానిని ఎవరూ పాటించుటలేదు . పరపురుషుడి "పాణిగ్రహణము" అదే "SHAKE HAND " చాలా సాధారణమై పోయింది.....

.

వూటుకూరు జానకిరామారావు 

.

Two


 

సీతారామాంజనేయ సంవాదము.* *ప్రథమాధ్యాయము* *భాగము - 10*

 🌸


*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 10*



కం.ఆ దత్తాత్రేయ గురు

శ్రీ దివ్య పదారవింద, సేవాది శ్రీ మోదుఁడు ప్రత్యక్ష ప్ర

హ్లాదుం దిన శ్రీ జనార్ధ : నాహ్వయుఁ డొప్పు.


తాత్పర్యము: 


శ్రీ దత్తనాధుని కరుణాపాత్రుడు, అభినవ ప్రహ్లాదుడని చెప్పుకొను వీలయిన ఆచార్యుడు, "జనార్ధను"డను పేరుగల పుణ్యమూర్తి శ్రీ దత్తనాథుని శిష్యనిగా విరాజిల్లుతున్న

దివ్యమూర్తికి వందనం.



కం.తన సౌశీల్యము శాస్త్ర చింతనము నా 

త్మజ్ఞానముం జూచి హె చ్చినకూర్మి న్నిజదివ్య రూపములతో

శ్రీ భారతీ మోక్ష కా

మిను లే తెంచి యహర్నిశంబుఁదను 

నె మ్మిం గొల్వఁగా శ్రీ జనా 

ర్ద నయోగీశ్వరుఁ డొప్పె నెల్లెడ నవి ద్యాధ్వంత మార్తాండుఁ డై.


తాత్పర్యము. 


పరమపుణ్యుడైన జనార్ధుని చూచి, అతడు తన అయి వుండునని లక్ష్మి కాదు తన పతియని పార్వతి, కాదు కాదు నా పతి యని సరస్వతి, 

తను తమ రూపములో శ్రీ గురుసేవకు వచ్చారు. 


ఇది అజ్ఞానముచే వచ్చిన మాయగా, శ్రీ గురువులు తమ శిష్యులకు జ్ఞాన, ధర్మ మార్గములను బోధించు 

శ్రీ గురువులని, తమదీ ఆ శిష్యుల చిత్తమేనని తరలిపోయారు.



కం. ఆ జనార్దన గురున క ; త్యద్భుతముగ శ్రీమదేకోగురుస్వామి ; శిష్యుఁ డయ్యె మును వసిష్ఠ మహామునీం ద్రునకు నర్థి దాశరథి భక్తుఁ డైన చం; దంబు దనర.


తాత్పర్యము. 


అటువంటి దివ్యమూర్తి జనార్ధనులకు "ఏకో గురుమూర్తి" గురుమూర్తి కంటే అన్యము లేదను తత్వమూర్తి వశిష్ఠునకు రామునివలె శిష్యుడయ్యాడు. ఈ ఏకోగురువునకు సర్వము తన గురువులు శ్రీ జనార్ధనులవారే.



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

బసవ పురాణం - 5 వ భాగము🔱🙏

 🙏🔱బసవ పురాణం - 5 వ భాగము🔱🙏


అంతేకాదు ఆటలలో కూడా బాల బసవడు శివపూజ చేస్తున్న ఆటలే ఆడేవాడు. బుద్ధులెదిగే వయస్సులో భక్తులను శివునిగా తలంచడం నేర్చుకున్నాడు. అయితే బసవన్న సర్వజ్ఞుడైన నందికేశుడు కాబట్టి సర్వవిద్యలూ సహజంగానే వచ్చాయి.

అట్టి బసవన్నకు ఎనిమిదవ యేట తండ్రి ఉపనయం చేయాలని ముహూర్తము పెట్టించగా, అది విని బసవన్న తండ్రితో ఇట్లా అన్నాడు.

*‘‘నాయనా! ఈ ఉపనయనమేమిటి? శివభక్తుడవు నీవు జడుడ వెట్లయినావు? పరమాత్ముణ్ణి గురువుగా కొలిచే మనకు దుర్నరుడు గురువెట్లా అవుతాడు? అది నరకం కాదా! పూర్వజన్మ (ద్విజత్వము) ఏమిటి? ఇది పతనహేతువు. నిర్మలమైన గురుకృపాన్వీత జన్మానికి కర్మజన్మమేమిటి? ఆ గురుపాదార్చన చేసే శైవునికి అగ్నిలో హవిస్సులో వ్రేల్చడం దోషం కాదా?*

*పరమశివ మంత్రం వదలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం. ఆ భక్తులకు నమస్కరించే చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కాదా! కర్మపాశం తెగకోసిన మనం తిరిగి కర్మకాండను నేర్పేతాళ్లు (జంధ్యాలు) కట్టుకోవడమేమిటి? భస్మ రుద్రాక్షలు ధరించిన మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాము? ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైన వీరమాహేశ్వరాచార దీక్షితుని, ఉభయ కర్మ నిర్మూలుని నన్ను వడుగు పేర కర్మ సముద్రంలో ముంచుట నీకు ధర్మము కాదు తండ్రీ!*

*ఎవడు బ్రహ్మ తలను నరికాడో ఆ శివుడు బ్రహ్మ వంశుడెలా అవుతాడు? జాతికి గోత్రానికి అతీతుడై సద్గురుకర కమల సంజాతుడైన శివాచారపరుణ్ణి తిరిగి జాతి గోత్ర క్రియలను ఆశ్రయింపజేయడం తప్పు కదా!* *కుల రహితుడైన శివుని భక్తులమైన మనకు కులమేమిటి నాయనా! కాబట్టి ఏ విధంగా చూచినా ఉపనయనం కూడదు’’* అనగా తండ్రి విని బసవనితో ఇలా అన్నాడు.

*‘‘బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలున్నాయి. అందులో ఉపనయనం ఒకటి. గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగే ఈ పదహారు సంస్కారాలలో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారము కాకుండా పోతాము. అంతేకాక ఉపనయన సంస్కారమంతా శైవధర్మసంబంధమైనదే కదా! ఉపనయన పూజలో రుద్ర గణాన్ని, నందిని పూజిస్తాము. అప్పుడు, చెప్పే గాయత్రీ మంత్రంలో ప్రణవము, రుద్రుడు మాత్రమే పరమ దైవమని అర్థమవుతున్నది.*

*ఉపవీత సూత్రము, శివుడు ధరించిన సర్పానికి సంకేతము. వటువుపట్టిన పాత్ర, శివుడు పట్టిన బ్రహ్మ శిరస్సు. పాలాశదండం శూలం. కూకటి జుట్టు శివుని జడలు. వటువు ధరించిన జింక చర్మం శివుడు దాల్చిన* *గజచర్మానికి సంకేతం. చందనమే భస్మం. వటువు భిక్షాటన చేయడం, శివుని భిక్షకు సంకేతం. ఈ విధంగా ఉపనయ సంస్కారంలో వటువు శివ రూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడగా అంగీకరింపబడడు.*  అందుచేత *ఉపనయనం శివభక్తుడు తిరస్కరించవలసిన సంస్కారమేమీ కాదు.* *ఉపనయనంవల్ల భక్తి ఏమీ తగ్గదు.నీవు పసివాడవు. నీకేమి తెలుసు? మేము చెప్పినట్లు చేయడం నీ ధర్మం. ఇట్టి విపరీతపు మాటలు ఇంతకుముందు విన్నవీ కాదు కన్నవి కాదు. నీవేదో సుపుత్రుడివి వంశోద్ధారకుడవు పుట్టినావని సంతోషపడితే ఈ దుర్బుద్ధులేమిటి? కులదీపకుడు పుడితే కులమంతా వర్థిల్లుతుంది. ఒక కులనాపకుడు పుడితే వానివల్ల కులమంతా నశిస్తుంది.* 

*నీవు వడుగును తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులమునుండి వెలివేస్తారు. కాబట్టి ఇంతగా చెపుతున్నాను నా మాట విను, విననంటావా ఇంక నీవూ, నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి పడండి’’* అని తీవ్రంగా కొడుకును తిట్టాడు. అప్పుడు బసవన్న మిక్కిలి రోషముతో ఇలా అన్నాడు.

*‘‘తండ్రీ! భక్తికి, బ్రాహ్మణ ధర్మానికి బొత్తిగా సంబంధమే లేదు. బ్రాహ్మణ దర్శనం వేరు. దైవం వేరు. మంత్రం వేరు. ఆచార్యుడు వేరు. వేషధారణమూ వేరే అవుతుంది. ధ్యానమూ, బాహ్య క్రియలూ ఆచార్య మార్గమూ అన్నీ భక్తి మార్గానికన్నా భిన్నమైనవే! కాకుంటే అగ్ని ముఖము, బ్రహ్మ శిరము, రుద్రశిఖ, ప్రాణాదివాయువులు ప్రాణములు, విష్ణు గర్భము భూయోని కలిగి వుంటుందది. గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు కలిగి సంఖ్యాయనస గోత్రంతో త్రిపాదియై షట్కుక్షియై ఉంటుంది.* 

*ఈ విధమైన ఉపనయనమూ ఉపనయన మంత్రమూ శివమతమని చెప్పడం తగదు. అలాగే బ్రహ్మజ్ఞ కర్మలు కూడా శివేతరమైనవే!*

*శైవము షడ్దర్శనాతీతమైనది. శ్రుతివిహితమైనది. షడక్షరిని మించిన మంత్రరాజం లేదు.*


-ఇంకా ఉంది


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

"మై లైఫ్ స్టోరీ

 మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం

"మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:


👉ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.


హిందువులను

"రెండవ పౌరులుగా" మార్చడానికి 

"హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. 


🗣️🌎కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:


"నేను జీవించి ఉన్నంత కాలం..

మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను..


ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని.. 


పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. 


సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!


ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె.బి. కృపలానీ 


నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:


"మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.


నిజంగా 

ఇది లౌకిక దేశమైతే 


హిందూ కోడ్ బిల్లుకు బదులుగా 


అన్ని మతాలకు 

కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది.


కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది!


కానీ హిందువులు 

ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, 


అప్పుడే హిందువులంతా, హిందూ ద్రోహుల యొక్క, ఛాతీపైకి ఎక్కుతారు.


నెహ్రూకి కొనసాగింపుగా 

హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.


అయినా కూడా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు..

ఏమీ జరగనట్టుగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.

1947నుండి 70 ఏళ్లలో ఒక కుటుంబం

 హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !


హిందువులకు అర్థం కాలేదు !


దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది 

ఎక్కడి నుండి శబ్దం రాలేదు !


సగం కాశ్మీర్ పోయింది ! 

శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !


సింధు ఇవ్వబడింది!

సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !

ఎవరూ పట్టించుకోలేదు !


తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !


చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !

మీడియా కిక్కురు మనలేదు!


తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! 

కొవ్వొత్తి వెలిగించలేదు !🙈🙉🙊


సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !


మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు.. కాదు కాదు.. చంపబడ్డారు ! 

ఎటువంటి తేడా లేదు.. 


అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !


2జి స్పెక్ట్రం, 

బొగ్గు కుంభకోణం, 

CWG, 

అగస్టా,

వెస్ట్‌ల్యాండ్, 

బోఫర్స్,

వంటి భారీ కుంభకోణాలు జరిగాయి, శరీరం శబ్దం చేయలేదు!


కానీ.

గొడ్డు మాంసం, ఆగిన వెంటనే...

విపత్తు సంభవించింది !


జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే..

అసంతృప్తి బయలుదేరింది.


వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు..

వారి నాలుకలు కుట్టబడ్డాయి.


డీమానిటైజేషన్,

GST అమలు చేసినప్పుడు..


కోపం వారితో నృత్యం చేయించింది..


ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !


రోహింగ్యాల వెలికితీత - ముస్లింల సమూహలలో

నొప్పిని కలిగిస్తోంది.


ఆలోచించండి.. 

కాంగ్రెస్ = ఖన్☪️ గ్రీకు✝️ = హిందుదేశ్ వినాశనం


హిందువులకు ఏమి చేసింది ??


చర్చి కిటికీ కి 

లేదా 

మసీదు పై రాళ్ళు పడితే..మీడియాలో వారాలపాటు చూపబడుతుంది

వందల గుళ్ళు కూలగొడితే ఎవ్వరూ కిమ్మనరు..

ఎంతో కొంత భాజపా కొట్లాడితే, అది మతతత్వం అంటారు.. 

ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !


ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !


ఒకటి కాదు,  

రెండు కాదు,  

50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!


దీని గురించి ఏ ఒక్క హిందువుకు తెలియనీయలేదు !


మొదట హిందువులను 

కాశ్మీర్ లోయ నుండి బలవంతంగా తరిమేసి, 

తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !


మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!


బీజేపి, LK Advani

భారతీయ జనతా పార్టీ


మోడీ ప్రభుత్వం రాకపోతే,

ఇది ఎవరికీ తెలిసేది కూడా కాదు !


వామపక్ష జర్నలిస్టులు, 

ముస్లిం మేధావుల, 

కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు 

ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?

వీళ్లకు తోడుగా, ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు., బయస్డ్ మీడియా, సూడో సెక్యూలర్లు అందరూ హిందూ పండుగలను, సంప్రదాయాలను దేవుళ్లను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు..


ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !


      సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !


దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా....

           కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!


మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని,

ఎన్ని డ్రామాలు ఆడిందో...!


దీని గురించి ఆలోచించండి,

ఈ సందేశాన్ని 

మీకు సాద్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న అన్ని సోషల్ మీడియాలద్వారా

ప్రపంచానికి చటాండి. ఇతరులకు పంచమని 

ఒక అంతర్జాతీయ వాదిగా

ఆకండ విశ్వ సనాతన హైందవ హిందూ భారతీయ భగవత్ స్వారుపులైన  

భరతీయ జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తూ, 


భరత మాతముద్దు బిడ్డ..


దేశ చరిత్ర తెలుసుకో 

దేశ క్యాతి తెలుసుకో

నీ గొప్పదనం గూర్చి అప్పుడే

తెలుస్తుంది. 

నీకున్న ఔనత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిస్తేనే, మనలను ప్రపంచం గౌరవిస్తుందన్నది

జగమెరిగిన నగ్న సత్యం.. 


జై హింద్....!

జై భారత్...!!

జై శ్రీ రామ్...!!!


ధర్మో రక్షతి రక్షితః

వ్రుక్షో రక్షతి రక్షితః


విజయోస్తు తదస్తు శుభమస్తు.🕉🕉🕉🚩🚩🚩🚩

Wonderful art


 


 

Flog hoisting


 

Eesavadyopanishat


 

Bruhadaaranyakopanishat


 

వాజపేయి

 *భారతరత్న మన వాజపేయి కి ఘనతర నివాళి*


శా॥

ధీరత్వమ్మున సాటిలే రమలమౌ తేజమ్మునన్ రారు ధీ 

శూరత్వమ్మున నిల్వబోరు ఘన వాక్శోభలన్ బోల రే 

రీ రాజ్యాంగవిచారసారమతు లీ శ్రీలన్ విచారించగా 

వారాహీసమ! *వాజపేయి!* వినుత దీవ్యచ్ఛుభాకారుడా!    ~1


మ॥

కలలోనైనను దల్వ జంకు, మదిలో కంపమ్ము, నిద్రాస్థలిన్ 

చెలితో నుండగ భీతిభావనలు, వాసింగాంచని యాలోచనా 

కీలలున్, ఏ ప్రతిపక్షవర్గమునకున్ కేళిం గొనం దిప్పలున్ 

విలువల్ నిండిన *వాజపేయి* నిలువన్ పెన్ సింగమై కన్పడన్    ~2

*కవితాభారతి*

*~శ్రీశర్మద*

8333844664 


(శేషభాగం మధ్యాహ్నం)

జీమూత వాహనుడు ఎవరు? వారి చరిత్ర ఏమి?

 *నిత్యాన్వేషణ:*


జీమూత వాహనుడు ఎవరు? వారి చరిత్ర ఏమి?


హర్షవర్ధన రాజు రచించిన నాగానంద సంస్కృత నాటకం భారతీయ నాటక రంగం లో అగ్ర స్థానం కలిగింది. ప్రాచీన బౌద్ధ జాతక కధలనుండి గ్రహించబడింది. బోధిసత్వుడైన జీమూత వాహనుడు విద్యాధర యువ రాజు. విశ్వప్రేమ కలిగిన వాడు . మలయ పర్వత ప్రాంతమున వార్ధక్యములో విశ్రాంతి పొందుతున్న తన తల్లి తండ్రులను సేవించడానికి రాజ్యాన్ని వదలి పెడతాడు. అచ్చట సిద్ధాస్ దేశ రాకుమార్తెను మలయావతిని ప్రేమించి వివాహామాడుతాడు.

అచ్చట సర్పరాజు గరుడునితో ఒప్పందం ప్రకారం రోజు కొక నాగు ను బలికి సమర్పించుట విని తాను మరణించుటకు సిద్దమై నాగ జాతిని కాపాడే క్రమములో గరుత్మంతుడు తన తప్పు తెలుసుకుని తన క్రూరత్వం విడనాడతాడు. జగన్మాత గౌరి ప్రత్యక్షం అయి యువరాజుని తిరిగి బతికించడంతో నాటకం పూర్తివుతుంది.

శ్రీ హర్షుడు బౌద్ధము ఆచరించుటచే నాటకం లో బుద్ధుడను నాయకునిగా చేసి బౌద్ధ సూత్రాలననుసరించి రచించాడు.(మహాయాన బుద్ధిజం ). నాటకంలోని అంశాలు బౌద్ధ ఫిలాసఫీ కి చెందినవి. పూర్తి పాఠం Nagananda and its social background N.Aiyaswami sastry గారి వ్యాసాలలో సంపూర్ణముగా చదువ గలము

ఇక 12 CE కాలానికి చెందిన భారతీయ సంసృత పండితుడు -హిందూ మత గ్రంథ కర్త. ధర్మశాస్త్రాలు రచించిన బెంగాళీ త్రిమూర్తులలో మొదటివాడు. జీమూత వాహనుడు రచించిన వ్యవహార మాత్రికా , దయభాగ ప్రసిద్ధి గాంచినవి. హిందూ వారసత్వ చట్టంగా బెంగాల్ నందు బ్రిటీషువారు అనుసరించారు. అదే హిందూ వారసత్వ చట్టం 1956 గా స్వతంత్ర ఇండియా లో అమలు పరుచబడుతుంది.

ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు.


*మరొక కథనము*


పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్నే పణంగా పెట్టిన కథ!

పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూతవాహనుడు!

రాకుమారుడైన జీమూతవాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాదు, అన్నిప్రాణుల పట్లా ప్రేమ, అభిమానం, దయ దాక్షిణ్య ము చూపించేవాడు. అహం అనేది కొసరు కూడా ఉండేది కాదు.

ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటా అని దగ్గరకు వెళ్లి చూసిన అతను, అవన్నీ ఎముకుల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న ఘోష వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విన్న జీముతుడికి ముసలి పాము కనిపిస్తుంది. ‘అమ్మా! నువ్వెవరు?ఎముకుల ఏమిటి?’ అని అడుగుతాడు జీమూతుడు. ‘ఏం చెప్పమంటారు! ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని అంతం చెయ్యటానికి కంకణం కట్టుకున్నాడు. రోజూ మా మీద పడి మమ్మల్ని చేల్చుతున్నాడు.ఆ బాధ తట్టుకోలేక మేము- ‘ఇలా రోజు నీకు ఆహారంగా మారతాము’ అని వేడుకున్నాము. రేపు నా కొడుకు వంతు. అందుకే ఈ వేదన!’ అని చెప్పుకొచ్చింది ఆ ముసలి పాము. ఆ మాటలు విన్న జీమూతవాహనుడి మనసు కరిగిపోయి. పైగా గరుత్మంతుని హింస ఇలా కొనసాగితే, ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదు. శంఖచూడునికి బదులుగా తను కనుక గరుత్మంతునికి ఆహారంగా మారితే, అతని ప్రాణాన్ని కాపడటమే కాదు… ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లవుతుంది.’ ఇలా పరి విధాలుగా ఆలోచించిన జీమూతవాహనుడు, శంఖచూడునికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు.

మర్నాడు గరుత్మంతుడు వచ్చి ఎవరో సరిగ్గా చూడకుండా. తాను, ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు. ఇంతలో అక్కడి చేరుకున్నాడు మిత్రవసువు. ‘గరుత్మంతా! నీ ముందు ఎవరు ఉన్నారో కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తున్నావా ?. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించు’ అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలకి చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జీమూతవాహనుడిలో ప్రాణం అప్పటికే కోల్పోతూ వస్తుంది.

చేసిన తప్పుకు తనను నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం! జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్ని జీమూతవాహనుడి కుటుంబం భోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మండికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకానికి వెళ్లి అమృతభాండాన్ని తీసుకువచ్చాడు. దానితో జీమూతవాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జీమూతవాహనుడు సంతోషించలేదు సరికదా, సాటి జీవులు నిరంతరం గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు.

జీమూతవాహనుడి దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇకమీదట తాను పాముల జోలికి పోనని జీమూతునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకుల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జీమూతవాహనుడు, తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడినవాడయ్యాడు.

విద్యగలవారు

 🕉️   _*సుభాషితమ్*_  🕉️



శ్లో𝕝𝕝 పుస్తక ప్రత్యయాధీతం

నాధీతం గురుసన్నిధౌ|

సభామధ్యే న శోభన్తే

జారగర్భా ఇవ స్త్రియః||


తా𝕝𝕝 గురుముఖంగా నేర్వక పుస్తకం ద్వారా నేర్చిన విద్యగలవారు వ్యభిచరించి గర్బం దాల్చిన స్త్రీలవలే శోభిల్లరు.....

=================

పుస్తకం ద్వారా నేర్చిన విద్యకంటే గురుముఖతః నేర్చిన విద్య అన్నివిధాల విలువైనది......

బుధవారం, ఆగస్టు 16, 2023*రాశి ఫలాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*బుధవారం, ఆగస్టు 16, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *అమావాస్య మ1.49* వరకు 

.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు . వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఉంటాయి.


*వృషభం*


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ఆకస్మికంగా  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు  సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 


*మిధునం*


ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు.


*కర్కాటకం*


బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో  ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.


*సింహం*


దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో ఊహించని  తగాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి.


*కన్య*


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దీర్ఘకాలిక  ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు. 


*తుల*


ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.


*వృశ్చికం*


చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి. కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.


*ధనస్సు*


పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


*మకరం*


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకుంటారు. ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది.


*కుంభం*


నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. చేపట్టిన పనులలో  విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


*మీనం*


 బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 13*


నరేంద్రుని దివ్య దర్శనాలలో ఒకటి బుద్ధ దర్శనం దానిని స్వామి వివేకానంద వచనాలలో విందాం...


"బడిలో చదువుకొంటున్న రోజుల్లో ఒకసారి గది తలుపులు గడియ పెట్టి ధ్యానం చేసుకొంటున్నాను. మనస్సు ఏకాగ్రత చెందివుంది. ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో తెలియదు. ధ్యానానంతరం ఆసనం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ గది దక్షిణపు గోడ నుండి తేజో విరాజమానుడైన ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. ప్రశాంతతే మూర్తీ భవించిన ఒక సన్న్యాసి ఆయన.


ఆయన ముఖారవిందం నుండి అద్భుత ప్రకాశం ప్రసరిస్తున్నది. ఆయన దివ్యమయ ముఖమండలం అనిర్వచనీయ ప్రశాంతతతో ఒప్పారుతూ, శాంత సముద్రాన్ని పోలివుంది. శిరోముండనం గావించుకొని చేత దండ కమండలాలు ధరించి ఉన్నాడు. నాతో ఏదో చెప్ప నభిలషిస్తున్నట్లు నన్నే తదేకంగా చూస్తూ కాసేపు నిలబడ్డాడు. నేను చేష్టలుదక్కి కూర్చుని ఉండి పోయాను. 


హఠాత్తుగా ఏదో తెలియరాని భయం నన్ను ఆవరించింది. తక్షణమే ఠక్కున లేచి, గది తలుపు తెరచుకొని బయటికి పరుగెత్తాను. కాని ఆ తరువాత అలా పలాయనం చిత్తగించడం మూర్ఖత్వమనీ, లేకపోయుంటే ఆయన నాతో ఏదో చెప్పివుండేవారనీ భావించాను. 


ఆ తరువాత ఆయన దర్శనం నాకు కలుగ లేదు. ఈసారి ఆయనను దర్శించగలిగితే భయపడకుండా ఆయనతో మాట్లాడాలని అనేకసార్లు అనుకొన్నాను. కాని మళ్లీ ఆయన నా వద్దకు రానేలేదు..... బహుశా బుద్ధుడై ఉండవచ్చునని ఇప్పుడు అనుకొంటున్నాను.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-20🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-20🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


పద్మావతి తన యిష్టసఖులను వెంటబెట్టుకొని శృంగారవనమునకు విహారమునకై వెళ్ళినది. అందమయిన అనేకానేక రకాల మొక్కలు, వివిధ నామాలతో విలసిల్లే పుష్పాలూ వుండీ ఆ శృంగారవనము శాభాయమానముగా వుంది. చెలులు తోటపని చేసేవారు. ఆ తరువాత కొలనులో చల్ల చల్లని నీటిలో జలకాలాడారు. ఆ తరువాత మధుర ఫలాలు భక్షించారు. ఆనందముగా సంగీతయుక్తముగా పాటలు పాడుకోవడము ప్రారంభించారు. 


దాహముతో నున్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనములో గల కొలనులో నీరు త్రాగి, దాహము తీర్చుకొని ఒక వృక్షచ్చాయకు వెడలినాడు. అప్పుడతనికి పద్మావతి చెలికత్తెలు చేస్తున్న గానము వినబడింది. ఆ గానం వింటూ శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. 


పాట వచ్చేవైపే వెళ్ళినాడు. పద్మావతిని, చెలికత్తెలను చూశాడు, వారూ శ్రీనివాసుని చూశారు. 


పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసు డాశ్చర్యపోయినాడు. ఆహా! ఈ కన్య రతిని, పార్వతిని, భారతిని, శ్రీసతిని తలదన్నునంత అందముగ న్నుదే! ఈ వనితపొందు పొందనిచో నా యీ జన్మమేల?


 ఈమె పాదాలు చూడబోతే చిగురుటాకుల్ని మించి వున్నాయి. ఈమె నడుము చూస్తే లేదనిపించే నడుము. ఈమె వక్షోజాలు చేస్తే జక్కువపిట్టలకన్నా బాగున్నాయి. చేతులు కమలాల సుకుమారాన్ని కాదనేలా ఉన్నాయి. 


శంఖములాగా ఉన్నది కంఠము. అధరము దొండపండులాగా ఉన్నది. మల్లె మొగ్గలను మించిన తెల్లదనముతో పలువరుస వున్నది. నువ్వుపువ్వును నీలెక్కే మిటనగల సొగసుతనము గల ముక్కు ఈమె కున్నది. 


శ్రీకారములను మించిన చెవులు కలిగి యున్నదీ వనిత. ఆమె కన్నులా హృదయగతానం దావిష్కారణ దర్పణములై నిర్మలములై ఉన్నవి. ఈమె తీయని మాటలు వీణియమీటల మధురస్వరములను మించి ఉన్నవి’ అని పద్మావతి సౌందర్యాన్ని పదేపదే వర్ణించుకున్నాడు. 


అసలు ఈమె వివాహితయో? అవివాహితయో? కూడా తెలుసుకొనవలసి వున్నది, సరే ఆమెనే అడిగెదను గాక అనుకొని పద్మావతినీ సమీపించబోయెను. పద్మావతి తన చెంతకు వచ్చుచున్న వేటగానిని చూచి బెదిరి చెలులతో ‘‘మీరు వెడలి ఆ వచ్చుచున్న పురుషులెవరో సంగతీ సందర్భము తెలుసుకొనిరండి’’ అని పంపించినది.


చెలెకత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెడలి ‘‘అయ్యా మీరెవరో తెలుసుకొనగోరుచున్నాము. మీ నామధేయమేమి? మీరు యిచ్చటికి యెందు వచ్చిరి మార్గము తప్పి వచ్చితిరా! ఈ శృంగారవనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా!’ అని ప్రశ్నించిరి. 


అంతట శ్రీనివాసుడు ‘‘కన్యలారా! మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకు స్వయముగా సమాధాన మివ్వగలవాడను’’ అని అంటూ పద్మావతిని సమీపించినాడు. 


శ్రీనివాసుడు వేటకు వెళ్ళేదారి వేషం ధరించియున్నందువలన అతడు నిజముగా బోయవాడనియే పద్మావతి భ్రమించినది, కోపములో ఆమె మీరీవిధముగా స్ర్తీలుండే వనానికి రావడము సబబా? మీ దేశము యే దేశము?’ అని శ్రీనివాసునిపైప్రశ్నల వర్షం కురిపించినది. శ్రీనివాసుడన్నాడు గదా ‘‘ఓ సుందరీ! నాకెవరూ లేరు. ప్రస్తుతము నాకు బంధువులునూ లేరు. చెప్పుకొనుటకు నివాసమునూ లేదు.


 పూర్వము నాకు నివాస మొకటి వుండేది. ఇప్పుడు సంచారినగుటచే సర్వదేశములున్నూ నావే, పూర్వకాలములో లక్ష్మీ సంపన్నుడిగా నుండిననూ ప్రస్తుతము నేను బీదవాడను, నీవెవ్వరివి? నీ శుభనామమేమి? నీ మాతాపితలెవ్వరు? అని అడిగినాడు. 


జవాబు యివ్వకపోవుట మర్యాద కాదనీ ఆమెకు తెలుసు. అందుచే ‘నా తండ్రి ఆకాశరాజు, నా తల్లి ధరణీదేవి, నా పేరేమో పద్మావతి’ అని చెప్పి. మీరిచ్చటనుండి త్వరగా వెళ్ళుడు. పురుషులు యీ ప్రాంతమున నుండరాదనెను.


 అందులకు శ్రీనివాసుడు ‘సుందరీ’! నీ చక్కదనము చూచిన క్షణమునుండి యిచ్చటనుండి మరలి వెడలుటకు నా మనస్సు ఒప్పుకొనుటలేదు. నీవు లక్ష్మివలె నున్నావు. నిన్ను నేను ప్రేమించుచున్నాను. నన్ను వివాహము చేసుకొనుము’ అన్నాడు. ఒడలు మండిపోయినది పద్మావతికి ‘‘ఓయీ! మూర్ఘ స్వభావుడా! క్రిందు మీదెరుగకు పలుకుచున్నావు. క్రూర స్వభావుడవైన, బోయవాడవైన నిన్ను నేను వివాహము చేసుకొనవలెనా? నీవు మతిభ్రమవలన యీ విధముగా మాట్లాడుచుంటివా? మా తండ్రిగారైన ఆకాశరాజుగారికి యీ విషయము తెలిస్తే యింకేమయినా వుంటుందా? నిన్ను ఖండఖండాలుగా చేస్తారు తెలుసా! లెంపలు వేసుకొని యింటికి వెళ్ళిపో’ అని గర్జించింది. 


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందులాడుచుండగా ‘‘ప్రేమకు ఆశాశ్వతమైన సంపదలతో సంబంధము వుండదు. ప్రేమ హృదయాలకు సంబంధించినది. అది మమత, అనురాగము, అభిమానము మున్నగువానితో ముడివేసుకొని వుంటుంది. నిన్ను వివాహము చేసుకోకపోతే నేను జీవించలేను. నన్ను కాదనకు!’ అని కొంచెము దర్జాగా వెళ్ళాడు ఒక వూరుకొని లాభము లేదనుకొన్నది పద్మావతి. 


వెంటనే చెలులను పిలచి ‘మీద మీదకు వస్తున్న ఈయనను రాళ్ళతో కొట్టండి’ అన్నది. ఆ చెలికత్తెలందరూ రాళ్ళు తీసుకొని శ్రీనివాసుని కొట్టసాగారు. అందరూ ఒక్కసారిగా కొట్టిన ఆ రాళ్ళ దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకొనలేకపోయాడు.



 శరీరమంతా రాళ్ళ దెబ్బలవలన రక్తము కారుచుండగా, శృంగారవనమునుండి శ్రీనివాసుడు నిష్క్రమించి, తన నివాస స్థానమగు శేషచలము చేరుకున్నాడు.

నివాసుడు విచారముతో దిగులుపడి రావడానికి కారణము తెలియక గాభరా పండింది వకుళ, తీరా చూస్తే శరీరము నిండా గాయాలూ, రక్తమూను, మహాందోళన పడినది,


 ‘అయ్యో! నాయనా! ఇదేమిటి? ఇన్నిగాయాలేమిటి? ఈ రక్తమేమిటి? నిన్ను కొట్టిన ఆ కరకు గుండెలవాళ్ళెవరు? అయ్యయ్యో! ఎట్లా ఓర్చుకుంటున్నావో నాయనా! నీ తల్లిని నేను అడుగుతున్నాను. ఏమి జరిగినది? విషయము చెప్పు నాయనా! అని అడిగినది. అడుగుతూనే గాయములపై ఏవేవో పసరులూ, ఆకులూ తెచ్చి వేసినది. ఒడలు తడిమి గాయమున్న చోటనల్లా ఆకుపసరు రాసినది. 


శ్రీనివాసుడు వకుళతో జరిగిన విషయములను పూజగ్రుచ్చినట్లు చెప్పాడు. శ్రీనివాసుడు ‘అమ్మా! అదేమిటోనమ్మా! ఆ సౌందర్యరాశిని చూసినప్పటినుండి పెండ్లి చేసుకొంటే ఆమెనే చేసుకోవాలని భ్రాంతి కలిగినది. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. ఆమెను వివాహమాడకపోతే యిక నా జీవితమే లేదు’ అని తన హృదయములో నున్నదంతా వెళ్ళగ్రక్కాడు..



శ్రీనివాసుడు చెప్పినది సర్వమూ వినిన వకుళ అతనితో ‘నాయనా! ఎంతటి పొరపాటు చేసితివి? ఆకాశరాజు అంటే సామాన్యుడా! సిరిసంపదలతో తులతూగే మహారాజు, అతనికీ మనకీ వియ్యము ఎలా పొసగుతుంది? కయ్యమైనా, వియ్యమైనా సమానమైన వాళ్ళతోనే మంచిదను పెద్దల మాటలు వినలేదా? నీ మేలుకోరి చెప్పుచున్నాను. ఇక ఆ విషయము మరచిపో, వారితో మనకేమి సంబంధం?’’ అన్నది. 


ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా, వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹