12, జులై 2025, శనివారం

హనుమాన్ చాలీసా🍁*

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩


 *🍁హనుమాన్ చాలీసా🍁*             

    *(తులసీదాస కృతం)*``


*దోహా:*

*శ్రీ గురు చరణ సరోజ రజ*

*నిజమన ముకుర సుధారి*

*వరణౌ రఘువర విమల యశ*

*జో దాయక ఫలచారి ||*


*అర్థం:*```

శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి 

నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర(రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.```


*బుద్ధిహీన తను జానికే*

*సుమిరౌ పవనకుమార*

*బల బుద్ధి విద్యా దేహు మోహి*

*హరహు కలేశ వికార ||*


*అర్థం:*```

బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.```


*చౌపాఈ:*

*జయ హనుమాన జ్ఞానగుణసాగర |*

*జయ కపీశ తిహు లోక ఉజాగర|| ౧ ||*


*అర్థం:*```

ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.```


*రామదూత అతులిత బలధామా |*

*అంజనిపుత్ర పవనసుత నామా||౨||*


*అర్థం:*```

నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.```


*మహావీర విక్రమ బజరంగీ |*

*కుమతి నివార సుమతి కే సంగీ|| ౩ ||*


*అర్థం:*```

నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు.```


*కంచన వరణ విరాజ సువేశా |*

*కానన కుండల కుంచిత కేశా|| ౪ ||*


*అర్థం:*```

బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.```


*హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |*

*కాంధే మూంజ జనేవూ సాజై ||౫||*


*అర్థం:–*```

ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.```


*శంకర సువన కేసరీనందన |*

*తేజ ప్రతాప మహా జగవందన || ౬||*


*అర్థం:*```

శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.```


*విద్యావాన గుణీ అతిచాతుర |*

*రామ కాజ కరివే కో ఆతుర || ౭ ||*


*అర్థం:*```

విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.```


*ప్రభు చరిత్ర సునివే కో రసియా |*

*రామ లఖన సీతా మన బసియా||౮||*


*అర్థం:*```

శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా,రామ,లక్ష్మణులను 

నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.```


*సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |*

*వికటరూప ధరి లంక జరావా || ౯ ||*


*అర్థం:*```

సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.```


*భీమరూప ధరి అసుర సంహారే |*

*రామచంద్ర కే కాజ సంవారే || ౧౦||*


*అర్థం:*```

మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.```


*లాయ సంజీవన లఖన జియాయే |*

*శ్రీరఘువీర హరషి వుర లాయే || ౧౧ ||*


*అర్థం:*```

సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు. ```


*రఘుపతి కీన్హీ బహుత బడాయీ |*

*తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||*

[పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి ]


*అర్థం:*```

అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.```


*సహస వదన తుమ్హరో యశ గావై |*

*అస కహి శ్రీపతి కంఠ లగావై || ౧౩ ||*


*అర్థం:*```

వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు. ```

*సనకాదిక బ్రహ్మాది మునీశా |*

*నారద శారద సహిత అహీశా ||౧౪ ||*


*యమ కుబేర దిగపాల జహాఁ తే |*

*కవి కోవిద కహి సకే కహాఁ తే ||౧౫ ||*


*అర్థం:*```

సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?```


*తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |*

*రామ మిలాయ రాజ పద దీన్హా||౧౬||*


*అర్థం:*```

నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.```


*తుమ్హరో మంత్ర విభీషణ మానా |*

*లంకేశ్వర భయె సబ జగ జానా ||౧౭||*


*అర్థం:*```

నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.```


*యుగ సహస్ర యోజన పర భానూ |*

*లీల్యో తాహి మధురఫల జానూ||౧౮||*


*అర్థం:*```

యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.```


*ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |*

*జలధి లాంఘి గయే అచరజ నాహీ॥౧౯॥*


*అర్థం:*```

అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?```


*దుర్గమ కాజ జగత కే జేతే |*

*సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే||౨౦||*


*అర్థం:*```

జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.```


*రామ దువారే తుమ రఖవారే|*

*హోత న ఆజ్ఞా బిను పైఠారే || ౨౧ ||*


*అర్థం:*```

శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.```


*సబ సుఖ లహై తుమ్హారీ శరణా |*

*తుమ రక్షక కాహూ కో డరనా ||౨౨ ||*


*అర్థం:*```

నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?```


*ఆపన తేజ సంహారో ఆపై |*

*తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||*


*అర్థం:*```

నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.```


*భూత పిశాచ నికట నహిఁ ఆవై |*

*మహావీర జబ నామ సునావై || ౨౪ ||*


*అర్థం:*```

భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.```


*నాసై రోగ హరై సబ పీరా |*

*జపత నిరంతర హనుమత వీరా ||౨౫ ||*


*అర్థం:*```

రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.```


*సంకటసే హనుమాన ఛుడావై |*

*మన క్రమ వచన ధ్యాన జో లావై ||౨౬||*


*అర్థం:*```

మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.```


*సబ పర రామ తపస్వీ రాజా |*

*తిన కే కాజ సకల తుమ సాజా ||౨౭||*


*అర్థం:*```

అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.```


*ఔర మనోరథ జో కోయీ లావై |*

*సోయి అమిత జీవన ఫల పావై||౨౮||*


*అర్థం:*```

ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.```


*చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |*

*హై పరసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||*


*అర్థం:*```

నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.```


*సాధుసంతకే తుమ రఖవారే |*

*అసుర నికందన రామ దులారే||౩౦ ||*


*అర్థం:*```

సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.```


*అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |*

*అసవర దీన్హ జానకీ మాతా|| ౩౧ ||*


*అర్థం:*```

ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.```


*రామ రసాయన తుమ్హరే పాసా |*

*సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||*


*అర్థం:*```

నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.```


*తుమ్హరే భజన రామ కో పావై |*

*జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||*


*అర్థం:*```

నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.```


*అంతకాల రఘుపతి పుర జాయీ | [రఘువర]*

*జహాఁ జన్మ హరిభక్త కహాయీ || ౩౪ ||*


*అర్థం:*```

అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.```


*ఔర దేవతా చిత్త న ధరయీ |*

*హనుమత సేయి సర్వసుఖకరయీ॥౩౫॥*


*అర్థం:*```

వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.```


*సంకట హటై మిటై సబ పీరా |*

*జో సుమిరై హనుమత బలవీరా ||౩౬||*


*అర్థం:*```

కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.```


*జై జై జై హనుమాన గోసాయీ |*

*కృపా కరహు గురు దేవ కీ నాయీ || ౩౭ ||*


*అర్థం:*```

జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.```


*యహ శతవార పాఠ కర కోయీ |*

*ఛూటహి బంది మహాసుఖ హోయీ || ౩౮ ||*


*అర్థం:*```

ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.```


*జో యహ పఢై హనుమాన చాలీసా |*

*హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||*


*అర్థం:*```

ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.```


*తులసీదాస సదా హరి చేరా |*

*కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||*


*అర్థం:*```

తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).```


*దోహా-*

*పవనతనయ సంకట హరణ

మంగళ మూరతి రూప ||*

*రామ లఖన సీతా సహిత

హృదయ బసహు సుర భూప ||*


*అర్థం:*```

పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.```


    *🚩🙏జై హనుమాన్🙏🚩*

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌹శుక్రవారం 11 జూలై 2025🌹*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త              

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                 

          *95వ భాగంతో*

  *జయప్రదంగా ముగిసింది*

```

అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో … “మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను” అన్నాడు.


భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.


శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి… 

“అన్నయ్యా! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో!” అన్నాడు.


అప్పుడు రాముడు… “నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 

14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను” అన్నాడు.


భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. 


తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.


తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. 


కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. 


వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. 


లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. 


అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.


ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. 


ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద చల్లి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో… 

“లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో!” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు… “అన్నయ్యా! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు” అన్నాడు.


తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జరిగింది.


సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు.


ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి… 

“ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీమించి వాడు 

నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి” అన్నాడు.


అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. 


అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.


ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా … 

'రాముడు, రాముడు' తప్ప, వేరొక మాట వినపడలేదు. 


రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.

```

*రామాయణం యొక్క* 

        *ఫలశ్రుతి*


ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్ధిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి                   

*శ్రీ మహావిష్ణువు యొక్క కృప* చేత తీరని కోరికలు ఉండవు.                                              


ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు.                                                 


సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. 


వివాహము కానివారికి వివాహము జరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, 

ఎన్నాళ్ళనుంచో జరగని శుభకార్యాలు జరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు. అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి.


ఇంత మంచి రామాయణాన్ని చక్కగా చెప్పిన *గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు* గారికి…..                         

*మా పాదాభివందనాలు.*🙏


 *🙏రామాయణం 95వ* *భాగంతో పూర్తయ్యింది🌹*


🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹


ఇంత మంచి విషయాలను మీకు అందిస్తున్న మా ఆధ్యాత్మిక బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ 

మీరు మీరున్న వేరే గ్రూప్ లలోకి పంపి మీరూ కూడా ఎంతో పుణ్యం సంపాదించుకోగలరు.

```

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మహాకవుల ఊహలు

 శు భో ద యం 🙏


మహాకవుల ఊహలు మహాద్భుతాలు!

-------------------------------------------------------- 

             మ: కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్మాభర్త , మార్తాం డ మం

                     డల భేదం బొనరించి యేఁగు నెడఁ , దన్మధ్యంబునన్ హార కుం

                      డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణుంగాంచి, లోఁ

                       గలఁగం బారుదు రయ్య! నీవయను శంకన్,కృష్ణరాయాధిపా!


                           చాటువు- తెనాలి రామకృష్ణకవి ;


               భువన విజయంలో రాయలు కవిపండిత గోష్ఠి నిర్వహించు నపుడు, రాయలను కీర్తించుచు అష్టదిగ్గజ కవులు పద్యోపహారములను సమర్పించు సందర్భమున, పెద్దన గారి పద్యమునకు రామకృష్ణుడు సొడ్డులు బెట్టఁగా మనుమడా !

యేదీ నీవొకపద్యం చెప్పు? మనగా తెనాలి విసరిన పద్యమిది!


                 యుధ్ధంలో వీర మరణాన్ని పొందిన యోధులు సూర్యమండలాన్ని దాటుకొని ఆపైనున్న వీర స్వర్గాన్ని చేరుతారని పురాణాలు చెపుతున్నాయి. దాని నాధారంగా చేసికొని తెనాలి మంచి కధనల్లాడు. వినండి!


                   శ్రీ కృష్ణరాయ సార్వభౌమా! యుధ్దంలో నీకత్తి కెరయై మరణించిన యోధులందరూ సూర్య మండలమును ఛేధించి ముందుకు బోవుచుండగా సూర్యమండల మధ్యస్తుడైన కేయూర కిరీటాది భూషణ రాజితో నొప్పారు శ్రీ మన్నారాయణుని జూచి, నీవని

భ్రమపడి , భయముతో పరుగులు పెట్టుచుందురు. అట్టి మహనీయమైన పరాక్రమ శాలివి నీవు. అని మెచ్చుకున్నాడు.


                          శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తియని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి ఆనాయణుడే నీవని భ్రమ

పడినారయ్యా అంటాడు కవి. పైగా కిరీటం, కేయూరాది విభూషణాలు రాజచిహ్నాలాయె!భ్రమ పడరా? శ్రీకృష్ణరాయలు మహాపరాక్రమ

శాలి.కాబట్టి వారు భయపడి పారిపోతున్నారని కవిమాట! 


              తన పరాక్రమానికి శత్రువు భయపడి పరుగెడు తన్నాడంటే రాజుకి సంతోషమేగదా!


          ఈరీతిగా యిందులో భ్ర్రాంతిమదలంకారం వర్ణింపబడింది. ఇదీ సంగతి!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పరిశ్రమ* వలననే

 *ముందు మనను మనము ఉద్దరించుకుదాము*.


సభ్యులకు నమస్కారములు.


*ఉద్దరేదాత్మనాత్మానాం*

*ఆత్మాన మవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనం* భగవద్గీత.

అందరూ తమను తామే ఉద్దరించుకోవాలి. అధోగతి పాలు చేసుకోవద్దు. ఇంద్రియాలను

 (అసూయ, ద్వేషం) జయించే ప్రయత్నం చేస్తే మనిషి తనకు తానే బంధువవుతాడు. ఇంద్రియాలను జయించక పోతే తనకు తానే శత్రువవుతాడు. *ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తానున్న స్థితి (బుద్ధి) నుండి ఉన్నతివైపు ఎదగడానికి ప్రయత్నం చేయాలి*. ఎవరో వచ్చి తమను ఉద్ధరించే అవకాశము తక్కువ. *అనవసర విషయాలపై* మనస్సు కేంద్రీకరించకుండా, సమయం వృధా చేయకుండా, ఉన్నత విషయాలపై మనస్సును , కార్యాచరణపై శ్రద్ధను కేంద్రీకరించాలి. జిల్లెళ్ళ మూడి అమ్మ మాటలలో... *అంతరంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు. కాలాన్ని మించిన గురువు లేడు. లోకాన్ని మించిన సద్గ్రంధము లేదు. స్వచ్ఛమైన జీవితాన్ని మించిన వేదాలు లేవు. మంచి జ్ఞాపకాలను మించిన శాస్త్రాలు లేవు. దైవాన్ని మరియు ఆత్మ శక్తిని మించిన మంచి మిత్రుడు లేడు.*


స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగేవారు, జీవితాన్ని ఉత్పాదకంగా మల్చుకుని విజయ తీరాల వైపు ప్రస్థానం సాగించేవారు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. *వారిలా మనం స్వయం శక్తి పరులం కావాలి*. ఆధారపడే జీవనానికి స్వస్తిపలికాలి. కేవలం మానవ శక్తిపై మాత్రమే ఆధారపడి ఎంతో పురోగమించిన వారు ఎంతోమంది ఉన్నారు. 


సమాజం నాయకుడిలో గమనిస్తున్న అంశాలు. నాయకుడంటే రాజకీయనాయకులే గాదు సంస్థల నాయకులు గూడా. రాజకీయ నాయకుల కంటే సంస్థలే ఎక్కువ ఉండవచ్చును. *ప్రవర్తనా శైలి, స్వీయ సామర్థ్యము, వాగ్ధాటి, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమైన సానుకూల దృక్పథము, ఆత్మ విశ్వాసము మరియు స్వయం కృషి అన్నిటికి మించి నిజాయితి*. 


ఒక శాస్త్ర వాక్యం చూద్దాము.

*ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథై:*.

అర్థము:- *పరిశ్రమ* వలననే ఏదైనా సాధించవచ్చును. *సాధనాత్ సాధ్యతే సర్వం* మానవ ప్రయత్నం చేయాలి. కేవలం మనోభిష్టము చేత కోరికలు, కార్యాలు, ప్రయోజనాలు నెరవేరవు. కావున ప్రతి ఒక్కరు ఈ దిశగా జీవితాన్ని మలచుకోవాలి.


ధన్యవాదములు.

శనివారం🚩* *🌹12 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🚩శనివారం🚩*

  *🌹12  జూలై  2025🌹*     

    *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి      : విదియ* రా 01.46 వరకు ఉపరి *తదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : ఉత్తరాషాఢ* ఉ 06.36 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం  : విష్కుంబ* రా 07.32 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : తైతుల* మ 02.00 *గరజి* రా 01.46 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *మ 02.00 - 03.00 సా 04.30 - 06.30*

అమృత కాలం  : *రా 08.21 - 09.59*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39* 

*వర్జ్యం           : ఉ 10.39 - 12.16*

*దుర్ముహూర్తం  : ఉ 05.42 - 07.26*

*రాహు కాలం   : ఉ 08.57 - 10.35*

గుళికకాళం       : *ఉ 05.42 - 07.20*

యమగండం     : *మ 01.51 - 03.29*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.49*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.42 - 08.18*

సంగవ కాలం         :      *08.18 - 10.55*

మధ్యాహ్న కాలం    :      *10.55 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ బహుళ విదియ*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.58*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

*🔯సహస్రనామ స్తోత్రం🔯*


*సుదర్శనాద్యుదాయుధం* *నాగరాద్గిరీశ్వరం నమామి* *వేంకటేశ్వరమ్*


*🌹ఓం నమో వెంకటేశాయ🌹*

******************************


*🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


*మోహశోక వినాశాయ*  

*సీతాశోక వినాశినే*

*భగ్నాశోక వనాయాస్తు* 

*దగ్ధలంకాయ వాగ్మినే.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కాలం పరీక్షలు

 *కాలం పరీక్షలు నిత్యం పెడుతుంది...!!*


కామా లే కానీ పుల్ స్టాప్ పడని నడక 

సాగిపోతుంది ఒడిదుడుకుల నావలా 

గంభీరమైన ఆకారాలు నన్నే చూస్తున్నాయి

గతితప్పి యాడ పడిపోతానని ఆత్రుతతో...


కూర్చునే కొమ్మను నరుక్కుంటారా 

లేత చిగుర్ల కోసం ఎదురు చూడాలి

బంగారు భవిష్యత్తును నిర్మాణం గావించి 

అందులో అదృశ్యవంతుడి గానే ఉండాలి..


కాలం పరీక్షలు నిత్యం పెడుతుంది 

సరైన సమాధానం కోసం వెతుకుతూ 

లోక అనుభవాలను పంచుకుంటూ 

ఎడారిలో వసంతం కోసం సాగిపోవాల్సిందే..


మనకు ఎవరూ వడ్డించి ఇవ్వరు 

జ్ఞానం అనే పాయసాన్ని స్వీకరిస్తూ 

అక్షరపు వెలుగుల దారుల్లో 

చిమ్మ చీకట్లోనూ నడవగలగాలి..


చుట్టూరా అంధకారం కమ్ముకున్న

పాతాళంలో రత్నం ఆకర్షిస్తుంది

దాన్ని సాధించేందుకే ఈ ప్రయాణమంతా 

జీవమున్నంతవరకు సాగుతుంది...


నాకంటూ ఒక కాలం నిర్ణయించబడుతుంది

ఆదరిస్తే అక్షర సౌధంలో రాయినైత 

నిలబడగలిగితే గుడిలో విగ్రహంగా 

లేదా గుడి బయట బండరాయిలా ఉంటా..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామకళ -- స్వరూపం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏

               మొదటి భాగం

కామకళను గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.

కొన్ని భాగాలుగా అందిస్తాను. రహస్యం ఆగుట చేత బీజాక్షరాలు చెప్పకుండా వాటి అర్ధం చెప్పడం జరిగింది గమనింప ప్రార్ధన

జాగ్రత్తగా చదవండి.అర్దమగుటకు ఉన్నంతలో తేలికగా వ్రాశాను.

ముందుగా సత్యము -- అసత్యము గురించి తెలుసుకోవాలి.

తరువాత ప్రకాశ, విమర్శ, మిశ్రమ, సంవిద్బిందువులు తెలుసుకొని అప్పుడు కామాకళా స్వరూపం గ్రహించాలి.


ఈ సృష్టిలో సకల వస్తువులు-- జీవులు 

 సత్యము -- అసత్యము అనే రెండు పదార్ధముల మేళనము కలిగియున్నవి. ఇందు అసత్యమనునది నామరూపములు కలది.నామ రూపములు ఉన్నాయి అంటే అది నశిస్తుంది అంతవరకు ఎందుకు?.మనకు నామ రూపములు ఉన్నాయి కదా! ఇది శాశ్వతం కాదు. కాబట్టి అసత్యం ఇక రెండవదైన సత్యము ఆ నామ రూపములకు చైతన్యమును, వృద్ధి -- క్షయములను కలిగించునది. ఇది మనలో కనబడకుండా ఉంటుంది.అదియే జీవుడు.ఈ సత్యాసత్యములు రెండును ప్రతివస్తువందును గలవు. -ఈరెంటిలో నామరూపములు గలది అసత్యభాగము. ఈరెండును కలసి జగత్తుగా నున్నది. ఆ రెంటిలో సత్య భాగమును సారమంటారు . తిలలందు తైలము సత్యము. అదియే సారము. రెండవది పిష్టము. అది అసత్య భాగము. మనుష్యునందు జీవుడు సత్యము. దేహము అసత్య భాగము. 

ఈరెండును కలసి ఉన్నపుడు ప్రవృత్తి ( జీవన విధానం ) కలుగుచున్నది కాబట్టి ప్రపంచ 

మందు సత్యము ప్రతి వస్తువులోను సారభూతముగా నున్నది. సారమనగా రసము.అంటే అనందస్వరూపం .

ముందు ప్రకాశ శక్తి, విమర్శ శక్తి చూద్దాము 

  ప్రకాశబిందువు,( అ )విమర్శ బిందువు,(హ) మిశ్రమ బిందువు, (అహం )ఇవే బిందుత్రయము.

వాటి వివరణ చూద్దాము

అక్షరాలలో "అ " కు ముందు ఏ అక్షరం లేదు. కాబట్టి అ అనేది సదాశివ స్వరూపం. చివరి అక్షరం " హ ". హ తరువాత ఇంక ఏ అక్షరం లేదు. ళ, క్ష ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ స్వతంత్ర అక్షరాలు కాదు. ""ల ళ యోరభేదః "" అని చెప్పుటచేత ల - ళ భేదం లేదు. క్ష అనేది సంయుక్త అక్షరం ఇది కూడా స్వతంత్ర అక్షరం కాదు. కాబట్టి " హ " చివరి అక్షరంగా గ్రహించండి

హకారమే శక్తి స్వరూపం.


శివుని డమరుకం నుండి వెలువడినవి

వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు.

1 అ,ఇ,ఉ,ణ్,


2 ఋ,ఌ,క్ 


3 ఏ,ఓ,ఙ్ 


4 ఐ,ఔ,చ్ 


5 హ,య,వ,ర,ట్ 


6 ల,ణ్


7 ఞ,మ,ఙ,ణ,న,మ్ 


8 ఝ,భ,ఞ్ 


9 ఘ,ఢ,ధ,ష్ 


10 జ,బ,గ,డ,ద,శ్ 


11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్ 


12 క,ప,య్ 


13 శ,ష,స,ర్ 


14 హ,ల్

అనే వ్యాకరణ సూత్రములు ఇవే ప్రకటిస్తున్నాయి.

 అక్షరాలలో మొదటి అక్షరం 'అ " ఇది సదాశివ స్వరూపం. "హ " చివరి అక్షరం శక్తి

 స్వరూపం. రెండు అక్షరాలకు సామ్యం ఉన్నది.

"అ, కు, హ విసర్జనీయానాం కంఠః"

జాగ్రత్తగా గమనిస్తే రెండు అక్షరాల పుట్టుక కంఠ స్థానమే. తేలికగా పలికితే " అ" ఒత్తి పలికితే "హ " అంతేతేడా ఆ రెండింటి సంయోగం "అహం "

అ, హ కలిస్తే అహ అవ్వాలి గాని అహం ఎల్లా అయింది? అనే సందేహం వస్తుంది.రెండు బీజములు కలిసి నప్పుడు నాదం వస్తుంది.

రెండు వస్తువుల రాపిడి వలన ధ్వని వచ్చినట్లు. ఆ ధ్వనినే నాదం అంటాము. ఇక్కడ నాదం బిందువు (o) గ్రహించండి.అందుచేత అహం అయింది 

అకార హకారములు రెండు శివ, శక్తి స్వరూపాలు.

""న శివేన వినా దేవీ దేవ్యాచ న సదాశివః

నైత యోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివ""


శివుడు లేనిదే అమ్మ లేదు. అమ్మ లేనిదే శివుడు లేడు. ఇద్దరికీ తేడా లేదు. వారు చంద్రుడు వెన్నెలా వంటివారు 

అను ఆగమ సిద్ధాంతము వలన శివశక్తులకు అన్యోన్యబేధము లేదని తెలుస్తోంది.

(ఇక్కడ సమన్వయము జాగ్రత్తగా చూడండి )

 ప్రకాశబిందువు శివస్వరూపము, మరియు చంద్ర మండలము. ‘అ’కారముగా గ్రహింపవలెను.


 విమర్శ బిందువు శక్తి స్వరూపము. అగ్ని మండలము. ‘హ’ కారముగా గ్రహింపవలెను. ఈ ప్రకాశ, విమర్శ బిందువుల సంయోగము వల్ల అంటే చంద్ర అగ్ని కలయిక వల్ల మిశ్రమ బిందువైన సూర్యబిందువు ( అహం) జనించుచున్నది.


 అకార స్వరూపమగు పరమశివుడు, హకార స్వరూప పరాశక్తిని వీక్షించినపుడు, ఈ వీక్షణ సంయోగము వల్ల జనించిన మూడవ ప్రతిబింబము ‘అహం.’ ఇక్కడ "అహం "పరాశక్తి. కాబట్టి పరాశక్తి అద్దము వంటింది.

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ ద్వితీయ - ఉత్తరాషాఢ-‌‌ స్థిర వాసరే* (12.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

తిరుమల సర్వస్వం -,298*

 *తిరుమల సర్వస్వం -,298*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-13


ఆదాయ వనరులు

ఆరోజుల్లో తిరుమలేశునికి అనేకానేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరేది. కానీ, ప్రముఖంగా చెప్పుకోదగ్గవి మూడు ఆదాయ వనరులు. అవేంటంటే...


హుండీ కానుకలు, నగదు విరాళాలు - నాటికీ, నేటికీ కూడా స్వామివారికి సమకూరే ఆదాయంలో అత్యధికభాగం కానుకలు, విరాళాల రూపం లోనే! ఆనాటి భక్తులు ఆత్మసమర్పణాభావంతో అయ్యవారికి ఆర్తిగా అర్పించుకునే కానుకల వివరాలను - 1831 వ సం. నాటి, ప్రఖ్యాతి గాంచిన ఏషియాటిక్ జర్నల్ అనే ఆంగ్ల త్రైమాసిక పత్రికలో ఈ విధంగా వర్ణించారు: 


భక్తులు సాధారణంగా సమర్పించుకునే మొక్కుబడులలో - మేలిమి బంగారు, వెండి అచ్చులు, స్వదేశీ, విదేశీ నాణేలు, మనం ఇంతకు ముందు చెప్పుకున్న పగోడాలు, నగదుమూటలు, రాగి డబ్బు, సుగంధద్రవ్యాలు, ఇంగువ, తలనీలాలు - ఇలా ధనరూపం లోనూ, ద్రవ్యరూపం లోనూ ఉండేవి. స్వామివారికి సమర్పించు కోవడానికి ఏదీ అనర్హం కాదు. 


సౌందర్యం పోతపోసి నట్లుండే ఓ నవయువతి తన తల్లిదండ్రుల మొక్కు తీర్చడానికై తన తలనీలాలను సునాయాసంగా త్యాగం చేస్తుంది. ఓం కుంటి వాడు వెండిపాదాన్ని, ఓ గ్రుడ్డివాడు బంగారునేత్రాన్ని - ఇలా చెప్పుకుంటూ పోతే, భక్తులు సమర్పించుకునే కానుకలకు అంతే లేదు. ఓ యువతి తాను బాల్యం నుండి గర్వాతిశయాలతో అలంకరించుకున్న నగలన్నింటినీ మూట గట్టి హుండీలో వేస్తుంది. చినిగి చీలిక పేలికలైన దుస్తులతో కనుపించే పేదరాలు, తాను కలలో కూడా ధరించలేనంత ఖరీదైన చీనీచీనాంబరాలను స్వామికి భక్తితో సమర్పించు కుంటుంది. మరొక స్త్రీ తన శిశువు కాలికి ఉన్న బంగారు కడియాన్ని పెరికి కొప్పెరలో (హుండీకి మరోపేరు) వేస్తుంది. అప్పటివరకూ ఎండ కన్నెరగని, స్వగ్రామం దాటని ఓ ఒంటరి మహిళ వందలాది మైళ్ళు ప్రయాణించి, కాలినడకన శిఖరాన్ని అధిరోహించి తన మొక్కు తీర్చుకుంటుంది. పుత్రోత్సాహం, విరోధులతో సయోధ్య, శత్రువిజయం, సుఖవంతమైన ప్రయాణం, వ్యాపారాభివృద్ధి, రోగోపశమనం లాంటి ఎన్నో, ఎన్నెన్నో కోర్కెలు కోరుతూ, లేదా వాటిని తీర్చుకుని, కానుకలతో పాటుగా భక్తులు తిరుమల విచ్చేస్తారు. తమ బంధు మిత్రుల తరఫున కూడా కానుకలు తెచ్చి స్వామివారికి సమర్పించు కుంటారు‌.


ఆహా!! ఆంగ్లేయులు అరమరికలు లేని ఆనాటి భక్తుల ఆర్తిని, శ్రీనివాసుని పట్ల వారి నిబద్ధతను, కానుకలు సమర్పించు కోవడంలో వారి ఓదార్యాన్ని - కళ్ళకు కట్టినట్లు, ఏమాత్రం శషభిషలు లేకుండా ఎంత హృద్యంగా చిత్రించారు?? చదువరుల కనులు చెమ్మగిల్లి వారి మది భక్తి రసాస్వాదనలో ఓలలాడాల్సిందే!


వర్తన - స్వామివారికి నగదు రూపంలో, ద్రవ్యరూపంలో వచ్చే కానుకలతో బాటుగా; ఆభరణాలు, వెండి, బంగారు పాత్రలు, చీనీచీనాంబరాలు, ధనుస్సు, ఖడ్గం, గద తదితర ఆయుధాలు వంటి ఖరీదైన వస్తువిశేషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలయానికి తక్షణాదాయం చేకూర్చవు. పైగా, వాటి రక్షణకు, వాటిని పదిల పరచడానికి, శుభ్రపరచడానికి, తరచూ మెరుగు పెట్టడానికి పెద్ద మొత్తం వ్యయమవుతుంది. ఈ ఖర్చులను రాబట్టుకునే నిమిత్తం వస్తురూపంలో కానుకలు సమర్పించుకునే భక్తుల వద్దనుండి కొంత రుసుము వసూలు చేసేవారు‌. కానుక యొక్క విలువను మదింపు జేసి, దానికి సమానమైన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. ఈ మొత్తాన్నే వర్తన అంటారు. రాను, రాను ఈ మొత్తం భక్తులకు అదనపుభారం కావటం వల్ల, ఈ మధ్యకాలంలో వర్తనను రద్దు జేయటంతో భక్తులకు ఉపశమనం లభించింది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము


*435 వ రోజు*

*ప్రధమాశ్వాసం*


వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహా మునులకు ఈ విదంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! రధికత్రయం నా కుమారుడి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు. ఏమి చేసారు " అని అడిగాడు. సంజయుడు" మహారాజా ! అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవశిబిరాల వైపు వెళ్ళారు. ఆ సమయంలో పాండవశిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుధిలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడకు వెళితే వారి చేతిలో చావు తప్పదని రధిక త్రయం అక్కడినుండి తూర్పు దిక్కుగా వెళ్ళి కొంతదూరం వెళ్ళి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రధములు ఆపారు. సాయం సంధ్యా కార్య క్రమాలు ముగించుకుని వారు ముగ్గురూ భూమి మీద శయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు.


*కాకులు గుడ్లగూబలు*


కృపాచార్యుడు నిద్రపోయినా అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది, మరికొన్నిటిని కాళ్ళు చేతులు విరిచింది, కొన్నింటి పొట్టలు చీల్చింది, మరికొన్నింటి రెక్కలు విరిచింది ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తళుక్కున ఒక మెరుపు మెరిసింది. " నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను, బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమ వంతులైన వారందరిని సంహరించ లేను. అది మంచిది కాదు. ఏమాత్రం సంశయించక పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బొందిలో ప్రాణముండగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్నుమూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయముతో సంహరించడమే ముఖ్యము అని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. శత్రురాజుల మీద దండెత్తినపుడు, శత్రురాజులు విడిది చేసినపుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తున్నదని పెద్దలు చెప్తారు కదా ! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా ! వారు అధర్మం పాటించినపుడు నేను అధర్మంగా నడచుకున్న ఏమి దోషం. కనుక కల్మషహృదయులగు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందార్హం కాదు " అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ (11)


మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః 

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః (12)


సమస్త ప్రాణికోటికీ ప్రభువునైన నా పరమాత్మతత్త్వం తెలియని మూఢులు మానవరూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

ఉద్ధరిస్తుంది

 03. అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ॥ దరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||


9


టేక:- (తల్లీ జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము) అవిద్యానాం = అజ్ఞానులకు, అంతస్తిమిర = లోపల వున్న (అజ్ఞానమను) చీకటికి, మిహిర ద్వీపనగరీ = సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, జడానాం = అలసులకు, మంద బుద్ధిగలవారికి, చైతన్యస్తబక = జ్ఞానమను పుష్ప గుచ్ఛమునుండి వెలువడు, మకరంద స్రుతి ఝరీ = నిరంతర చైతన్యధారగా వెలువడు తేనె ధారల ప్రవాహము, దరిద్రాణాం = దరిద్రుల పట్ల, చింతామణి గుణనికా = చింతామణుల వరుస (పేరు) జన్మజలధౌ = సంసార సముద్రము నందు, నిమగ్నానాం = మునిగి సతమతమగు వారి పట్ల, మురరిపు వరాహస్య = విష్ణుమూర్తి ఎత్తిన ఆది వరాహ అవతార మూర్తి యొక్క దంష్ట్రా భవతి = కోరవంటిది అగుచున్నది.


తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల - సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల - జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల - చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహపు కోరవంటిది. (వరాహమూర్తి ఈ కోరతోనే సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్దరించి సంరక్షించెను).


జగన్మాతా! నీ పాదంపై నున్న ఒక్క రేణువు అజ్ఞానమనే వ్యాధికి పరమౌషధం. తిమిరాంధకారంలో ఉన్నవారికి నీ పాదరేణువు సూర్యకాంతి వలె దారిచూపుతుంది. నీ పాదరేణువు జడత్వంతో ఉన్న వారికి ఆత్మ ప్రభోదాన్ని, దరిద్రులకు ఐశ్వర్యాన్ని, ఈ భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరాహావతారంగా ఉద్ధరిస్తుంది.


అమ్మా! నీ పాదకమలపరాగరేణువు ఉన్నదే! అది అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారికి సూర్యుడు ఉండే పట్టణము. మందబుద్ధులకు చైతన్యమనే కల్పవ కల్పవృక్ష పుష్పగుచ్ఛముయొక్క తేనె. దరిద్రుడి పాలిట చింతామణులప్రోగు. ప్రోగు. సంసార సాగరంలో మునిగిపోతున్న వాడికి యజ్ఞవరాహరూపియైన విష్ణువుయొక్క కోర.


12:25 PM

సుందరకాండ విశిష్టత

 *నేటి సుభాషితం* 

(సుందరకాండ విశిష్టత) 


సుందరే సుందరో రామః

సుందరే సుందరీ కథః

సుందరే సుందరీ సీత

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపిః

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?


*అర్థం:*

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.


ఆంజనేయ దండకం తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *యత్ర యచ్చారుతా హేతుః*

              *తత్తు తత్రైవ నిక్షిపేత్l*

              *నార్ప్యం నేత్రాఞ్జనం పాదే*

              *నేత్రే వాధరవర్ణకమ్ll*


తా𝕝𝕝 *"ఏది ఎక్కడ అందాన్ని ఇచ్చునో దాన్ని అక్కడే ధరించవలెను. కళ్లకి పెట్టుకోవల్సిన కాటుకని కాళ్లకి, పెదవులకు పూసుకునే లేపనం కళ్లకి ధరించరాదుకదా!"*


 ✍️VKS ©️ MSV🙏

_జూలై 12, 2025_* 🌝

 🌻🌹 🪷 🌹 *ॐ 卐 ॐ* 🌹 🪷 🌹🌻


    🌞 *_జూలై 12, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *విదియ* రా 1.47

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *ఉత్తరాషాఢ* ఉ 7.28

యోగం: *విష్కంభం* రా 9.01

కరణం: *తైతుల* మ 1.55

*గరజి* రా 1.47

వర్జ్యం: *ఉ 11.31 - 1.08*

దుర్ముహూర్తము: *ఉ 7.36 - 8.28*

అమృతకాలం: *రా 8.20 - 9.57*

రాహుకాలం: *ఉ 9.06 - 10.44*

యమగండం: *మ 1.59 - 3.58*

సూర్యరాశి: *మిథునం*

చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *5.50*

సూర్యాస్తమయం: *6.53*

           

🌻 🌸 *ఓం శ్రియై నమః* 🙏 🙏

💐 🌹 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌺 *లోకాః సమస్తాః సుఖినోభవంతు* 🌸

🪷 *సర్వే జనాః సుఖినోభవంతు*🌹

🪷🪴 *శుభమస్తు* 🙏 🙏

కిడ్ని జబ్బనొకడు

 కిడ్ని జబ్బనొకడు కేన్సరంచు నొకడు

కడుపు గుండె తేడ గలద నొకడు

తేల్చ కాంగ్ల ఘనులు తిప్పలే బెట్టేరు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఆంగ్ల వైద్యం అత్యంత అభివృద్ధి చెందినదనీ, మిగిలిన వైద్య విధానాలు అన్నింటికంటే అత్యంత తెలివైనదనీ కొంతమంది మేధావులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు! కానీ ఇప్పటికీ అనేకమంది పేషెంట్లకు వచ్చిన రోగమేమిటో చెప్పలేక, అడ్డదిడ్డమైన టెస్టులన్నీ చేయిస్తూ, కాస్సేపు ఇది కిడ్నీ రోగమేమో అని ఆ స్పెషలిస్ట్ దగ్గరకు పంపి, కిడ్నీ సంబంధిత పరీక్షలన్నీ చేయించి, కాదు కాదు, ఇదేదో కేన్సర్ లాగా ఉందని అక్కడకు పంపి, ఆ విభాగంలో పిండేసి, ఆ తర్వాత నాలుక కరుచుకుని, పొరపాటైపోయిందని, న్యూరో దగ్గరికీ, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకీ తిప్పి తిప్పి, లేనిపోని టెస్టులతో, మందులతో నలిపి నలిపి, సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించి, చివరకు సక్సెస్ ఫుల్ గా ఒక క్రొత్త వెరైటీ పేషెంట్ ను తయారు చేసి చేతిలో పెడతారు! అప్పటికి పూర్తిగా జేబులు ఖాళీ అయిపోయి, ఆరోగ్యం చంకనాకిపోయి, చివరకు ఎవరో మహానుభావుడు పీకిన క్లాసుకి బుద్దొచ్చి, హోమియోకో, యోగాకో వెళ్ళి, అనేకమంది తేరుకుంటూ ఉంటారు! బాగుపడే రాత లేనివాళ్ళు ఆ ఇంగ్లీషు మేధావుల చేతికి ఆస్తులన్నీ సమర్పించుకుని, ఆ ఏ.సీ గదుల్లోనే ఆవిరైపోతారు! 

స్పెషలిస్ట్ లను, టెస్ట్ లనూ నమ్ముకుని నాశనమైపోకుండా, మంచి హోమియో డాక్టర్ ను వెతుక్కుని, సకల సమస్యల నుంచీ సత్వరమే బయటపడండి! సరైన హోమియో డాక్టర్ అంటే కంటితో పేషెంటును చూడకుండానే, ఏ టెస్టులూ అడగకుండానే, కనీసం పేషెంటును టచ్ చేసి, నాడి కూడా చూడకుండానే, కేవలం పేషెంట్ బంధువులతో మాత్రమే ఫోన్ లో మాట్లాడినా కూడా పేషెంటుకున్న సకల రోగాలనూ గుర్తించి, నయం చేయగలిగే సత్తా కలిగి, వందల మంది ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ల కంటే కూడా అత్యధిక శక్తి వంతుడై ఉంటాడని తెలుసుకోండి! అలాగే ఈ భూమి మీద ఏ జబ్బునైనా నయం చేయగలిగే నిజమైన మందులు గానీ, సత్తా గానీ హోమియో, యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం లాంటి వాటిలో మాత్రమే ఉంటుందని, ఇంగ్లీషులో టెంపరరీగా మాయ చేసే సప్రెసివ్ మేజిక్ మందులు మాత్రమే ఉండి, ప్రజలను మరింతగా సమస్యల్లో కూరుకుపోయేలా చేస్తాయని అర్థం చేసుకోండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

స్వార్ధం నుండి

 "" నా "" అనే స్వార్ధం నుండి ""మనం"" వైపు...

"" మాది "" అనే స్వార్ధం నుండి "" ""మనది"" అనే వైపు...

""మనకెందుకులే"" అనే స్వార్ధం నుండి.. ""మనకోసం"" మనం!! వైపు!!

""నేను""బాగున్నా.. వాళ్ళగురించి మనకెందుకు?? అనే భావం నుండి

వాళ్ళు బాగుండాలి!! నేను బాగుండాలి!! మనం బాగుండాలి!!

ఏ.. విద్య అయినా కానివ్వండి... దానిలో.. ప్రావీణ్యం సాధించాలి!!

దానికి అందరూ సహకరించాలి!!

ఏ విద్య నేర్చినా... నీ సనాతన విద్య వదలరాదు!!ఖచ్చితంగా సనాతన విద్య వైదిక విద్యలో... కూడా అవగాహన..పెంపొందించుకోవాలి!!

అగ్రహారాలు, మన కాలనీలో కనీసం వారానికి ఒక సమావేశం పెట్టుకొని.. మన సాధక.. భాధకాలు పాలు పంచుకోవాలి!!

ఆనాటి కాలంలో ఇంటి బ్రహ్మ ఉండేవారు!!

రాను రాను ఇంటి బ్రహ్మలులేరు!!

ఖచ్చితంగా ప్రతీ ఇంటికి ఖచ్చితంగా స్థిర ఇంటి బ్రహ్మ అవసరం!!

ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బ్రహ్మ ను మార్చరాదు!!

వారానికి ఒక్కసారి అయినా స్థానిక దేవాలయం సకుటుంబంగా దర్శించుకోవాలి!! ప్రతీ బ్రాహ్మణుడు ఖచ్చితంగా ప్రవర, సంధ్యావందనం వచ్చి ఉండాలి! స్థానిక పురోహితులు ఈ కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహించాలి!!

సంవత్సరానికి ఒక్కసారి అయినా పుట్టిన ఊరు లో.. దేవాలయ దర్శనం తప్పనిసరి!!

బఫె విధానం పూర్తిగా.. బ్రాహ్మణ వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది!!

కేటరింగ్ వ్యవస్థలో ఇతురులు ప్రవేశించాకా.. మడి విలువ పోయింది!!

యజ్ఞ యాగాదులు.. పురాతన విధానం ఎలా అనుసరణ చేస్తున్నామో..

ఆయా వైదిక పెద్ద క్రతువుల సంతర్పణలో పూర్వ ఆచారమే శ్రేష్టం!!

మీ.. విధేయుడు,

మీ.. మిర్తిపాటి