12, జులై 2025, శనివారం

పరిశ్రమ* వలననే

 *ముందు మనను మనము ఉద్దరించుకుదాము*.


సభ్యులకు నమస్కారములు.


*ఉద్దరేదాత్మనాత్మానాం*

*ఆత్మాన మవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనం* భగవద్గీత.

అందరూ తమను తామే ఉద్దరించుకోవాలి. అధోగతి పాలు చేసుకోవద్దు. ఇంద్రియాలను

 (అసూయ, ద్వేషం) జయించే ప్రయత్నం చేస్తే మనిషి తనకు తానే బంధువవుతాడు. ఇంద్రియాలను జయించక పోతే తనకు తానే శత్రువవుతాడు. *ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తానున్న స్థితి (బుద్ధి) నుండి ఉన్నతివైపు ఎదగడానికి ప్రయత్నం చేయాలి*. ఎవరో వచ్చి తమను ఉద్ధరించే అవకాశము తక్కువ. *అనవసర విషయాలపై* మనస్సు కేంద్రీకరించకుండా, సమయం వృధా చేయకుండా, ఉన్నత విషయాలపై మనస్సును , కార్యాచరణపై శ్రద్ధను కేంద్రీకరించాలి. జిల్లెళ్ళ మూడి అమ్మ మాటలలో... *అంతరంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు. కాలాన్ని మించిన గురువు లేడు. లోకాన్ని మించిన సద్గ్రంధము లేదు. స్వచ్ఛమైన జీవితాన్ని మించిన వేదాలు లేవు. మంచి జ్ఞాపకాలను మించిన శాస్త్రాలు లేవు. దైవాన్ని మరియు ఆత్మ శక్తిని మించిన మంచి మిత్రుడు లేడు.*


స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగేవారు, జీవితాన్ని ఉత్పాదకంగా మల్చుకుని విజయ తీరాల వైపు ప్రస్థానం సాగించేవారు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. *వారిలా మనం స్వయం శక్తి పరులం కావాలి*. ఆధారపడే జీవనానికి స్వస్తిపలికాలి. కేవలం మానవ శక్తిపై మాత్రమే ఆధారపడి ఎంతో పురోగమించిన వారు ఎంతోమంది ఉన్నారు. 


సమాజం నాయకుడిలో గమనిస్తున్న అంశాలు. నాయకుడంటే రాజకీయనాయకులే గాదు సంస్థల నాయకులు గూడా. రాజకీయ నాయకుల కంటే సంస్థలే ఎక్కువ ఉండవచ్చును. *ప్రవర్తనా శైలి, స్వీయ సామర్థ్యము, వాగ్ధాటి, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమైన సానుకూల దృక్పథము, ఆత్మ విశ్వాసము మరియు స్వయం కృషి అన్నిటికి మించి నిజాయితి*. 


ఒక శాస్త్ర వాక్యం చూద్దాము.

*ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథై:*.

అర్థము:- *పరిశ్రమ* వలననే ఏదైనా సాధించవచ్చును. *సాధనాత్ సాధ్యతే సర్వం* మానవ ప్రయత్నం చేయాలి. కేవలం మనోభిష్టము చేత కోరికలు, కార్యాలు, ప్రయోజనాలు నెరవేరవు. కావున ప్రతి ఒక్కరు ఈ దిశగా జీవితాన్ని మలచుకోవాలి.


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: