*నేటి సుభాషితం*
(సుందరకాండ విశిష్టత)
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథః
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
*అర్థం:*
సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.
ఆంజనేయ దండకం తో శుభోదయం
*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి