12, జులై 2025, శనివారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ (11)


మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః 

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః (12)


సమస్త ప్రాణికోటికీ ప్రభువునైన నా పరమాత్మతత్త్వం తెలియని మూఢులు మానవరూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

కామెంట్‌లు లేవు: