13, మార్చి 2025, గురువారం

దెబ్బకు దెబ్బ

 దెబ్బకు దెబ్బ 

       (హాస్య రచన)

సీ.ఒకనక్క మేసెడి 

యొంటెను కనుగొని 

 దానిమాంసముతిన

    దరికిజేరి గడ్డితినగనేమికర్మంబు పైరుండ 

రమ్ముచూపెదనని 

        నమ్మబలికి 

చేనుచూపగనంత 

    చెచ్చెఱ మేయగ

నక్క కూయగ వచ్చి 

         ప్రక్కవారు 

బడితలతోకొట్ట 

బతుకుజీవుడ యని 

యొక్క పట్టునపర్వి 

       నక్కనడిగె 

తే."అట్లుకూసితివేల"

 ని యడుగ "నట్లు

పాటపాడుటనాకల 

వాటు విను"మ 

టంచుపల్కిన "నటులనా?"యను

     చుదాని 

ముంచె నీటిలో నానక్క మునుగుచుండ 

"నాకునిదియలవాట"ని నవ్వె నొంటె.

--------------

వి.వి.హనుమంతాచార్యులు,ఖమ్మం.

9666846725.

విద్యార్థి

 

విద్యార్థి  

సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యమ్శములని  చదవాలి  వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఎంతో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తాను ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నా, భోజనం చేస్తున్నాకూడా తాను చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తాను చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం, అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా

క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి సిద్ద  గురువును ఆశ్రయించు అని ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది

సద్గురువు ఎవరు

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ  ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకర్షిస్తున్నారు . వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము స్వామీజీని నమ్ముకున్నాముఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగిందిఆయన సాక్షాత్తు ఫలానా దేముడి  అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి గురువు సేవనమే తన  జీవిత పరమావధి గా  భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో  అనేక ఆశ్రమాలను   నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారువిచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము  గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అందుకోవడం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని సాధకునికి  అనిపిస్తున్నదిఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంతే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలంటే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలిఅంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే విషయాలమీద ఆసక్తిఅనురక్తి,మోహము, కామము లేని వాడై  ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి 

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి  నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తాను త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తాను చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే  ఆలోచన  ఉదయిస్తుంది. భావన కలగటమే జీవితంలో మరో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత  జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడేకాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా అకుంఠిత దీక్షతో  మోక్ష గామివి కమ్ము

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి  శాంతిః    

మీ  భార్గవ శర్మ  

 

పిల్లల కోసం.

 అందరు దయచేసీ ఈ మెసేజ్ పూర్తిగా చదవండి. మన చుట్టూ ఉన్న ప్రాణాంతకమైన వ్యాదులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం.ఒక అబ్బాయి పేరు సత్య సాత్విక్ చాలా యాక్టవ్ కానీ వాడు పుట్టినప్పుడు 15 రోజుల లొపు వాడు చాలా బాధ పఢ్ఢారు. ఒక డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగు హాస్పటల్స్ తిరిగారు కానీ ప్రతి చోట లక్ష ఖర్చు అవుతుంది డబ్బులు సమస్య కాదు కానీ వారంతా ఆన్న మాట గ్యారంటీ ఇవ్వలేం అని అంటే పెయిలైతే . జీవితాంతం మోషన్ పైప్ ద్వారా వెళ్ళాల్సిఉంటుందని అప్పుడు అతని మీద ఆశ పూర్తిగా పోయింది అలాంటి బాధ వాడు పడుతుంటే మనం చూస్తూ ఉండలేమనిపీంచి దేవుడు మీద బారం వేసి ఇంటికి తీసుకువచ్చేసారు 4 రోజులు గడిచేసరికి సగం అయ్యపోయాడు . ఇంక గంటలే అనుకున్నారు కానీ ఇంతలో ఎవరో చెప్పారు . *మద్రాసు అదే చెన్నైలో అత్యాదునిక సదుపాయలతో 600 మంది పిల్లల డాక్టర్సు కల హాస్పటల్ ఉందని వెంటనే తీసుకువెళ్ళారు ఉదయం వెళ్ళాం సాయంత్రం ఆపరేషన్ చేసేసారు* ఇంకా విషేషం ఏమిటి అంటే ఇక్కడి డాక్టర్స్ చెప్పిన ప్రోబ్లం అసలు లేనే లేదు ఇంతకన్నా విచిత్రం *డిచ్చార్జ్ చేసే రోజు వరకు తెలియదు అక్కడ అందించేది ఉచిత వైద్యమని. కనుక మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషన్ లో దీగీ ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు . అలాగే పుట్టిన పిల్లలు నుండి 12 సంవత్ష రాల వరకు ఎటువంటి వైద్యమైనా సరే అంటే 10 లక్షలు అయ్యే హార్డు సంబంథిత వ్యాదులైనా ఉచితమే సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి .* కనుక మనలో మన పక్కన ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చు చేసే మద్యతరగతి వారు ఉంటారు అలాంటి వారికి ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి, *ఏ ఒక్కరి ప్రాణాన్ని కాపాడిన చాలు మనకి మరియు మన కుటుంబానికి ఎంతో మేలు .* ఎ ఒక్కరు టెంక్షన్ పడకూడదనే నా ఆకాంక్ష నేను నా పోన్ లో ఉన్న 157 వాట్సప్ మెంబర్స్ కి ఈ మెసేజ్ పంపుతున్నాను మీరు ఒక్కొక్కరు 150 మంది వాట్సప్ మెంబర్స్ కు పంపితే 22500 మందికి ఈ విషయం తెలుస్తుంది కనీసం 50 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కాపాడుదాం. 

పోన్ 9573799997 9640640878.

9677003334, +914442001800.

Hospital name - *kanchikamakoti child trust* 

Just forward please. Thankyou..this is forwarded message

భాగవతావతరణము

 శు భో ద యం 🙏


-భాగవతావతరణము!


       అష్టాదశపురాణములను,భారతాదులనురచించినను,వేదములనువింగడించినను, విరాగియైనవ్యాసునకు ఎందుచేతనో మనఃశాంతికొరవడినది.ఆస్థితిలో నారదుడరుదెంచి ,భాగవతరచనమొనరింప ప్రోత్సహించెడు ఘట్టమిది.


"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి

జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని

ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!

కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!"


టీకా:

ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.


భావము:

“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయింనిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి,వేదాలని నాలుగుగా విభజించి వ్రాసినవాడివి. యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”


హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుఁగొందుఁ శ్రీ

హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ

కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.


నీవు శ్రీహరిని స్తుతిస్తూ కావ్యాలను వ్రాస్తే మానససరోవరం విహరించే బంగారు హంసల మాదిరి ప్రకాశిస్తాయి. శ్రీహరినామ స్తుతి చేయని కావ్యాలు ఎంత విచిత్ర ఆర్థాలున్నదైనా శ్రీకరమై వుండదు. అందుకని శ్రీహరి చరిత్రము భాగవతమును రచియింపుమని నారదుడు వ్యాసుడికి బోధించాడు.


           స్వస్తి!🙏🙏📺👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ముక్త పద గ్రస్తంలో ముక్తి ప్రదాత !

 శు భో ద యం 🙏


ముక్త పద గ్రస్తంలో ముక్తి ప్రదాత !

----------------------------------------------------------

మ: " గిరిజా మానస హంస! హంస వర యోగి ధ్యేయ చిద్రూప! రూ

పరుచి శ్రీ జిత ముక్త! ము క్త భుజ దర్ప వ్యాఘ్ర దైత్యేంద్ర! యిం

ద్ర రమావల్లభ మిత్ర! మిత్ర రజనీరాడ్చక్ర! చక్రాబ్జ సుం

దర రేఖా కరపద్మ! పద్మ శరభా నాశంకరా! శంకరా!


అనిరుధ్ధచరిత్రము-ద్వి: ఆ; 12వపద్యము; కనుపర్తి అబ్బయామాత్యుడు;

కవి ప్రతిభ తెలియాలంటే గ్రంధమంతా తిరగ వేయాల్సిన పనిలేదు. స్థాలీ పులాక న్యాయంగా(గిన్నెలో అన్నంమెతుకు ముట్టి ఉడికినదో లేదో చెప్పటం) ఒక్క పద్యాన్ని బట్టి గూడా అంచనావేయవచ్చు. అబ్బయామాత్యుడు ప్రబంధ కవులకు దీటిపోని కవితావైభవం కలవాడు.. అతని అనిరుధ్ధచరిత్రము అనవద్యమైన హృద్యమైన ప్రబంధం. ఏమి కవిత! అచ్చతెనుగుపదాల భావాల మురిపాలతో , హాయిగా' హేలగా 'సాగే యిందులోని పద్యాలు రసహృదయులకు చక్కని (పద్యాల) విందు.


ప్రస్తుతానికి వద్దాం. ఈపద్యంలో ఉన్నవిషయం పరమేశ్వర స్తుతి.. ముక్తిప్రదాత యైన శంకరుని ముక్తపదగ్ర స్తాలంకారంతో వర్ణించటం యిందులోనివిశేషం. ముక్త పదగ్రస్తం ఒక శబ్దాలంకారం.విడిచిన పదాన్ని తిరిగి స్వీకరిస్తూ పద్యాన్ని అర్ధవంతంగా ముందుకు నడిపించటం. సామాన్యంగా ముక్త పదగ్రస్తాలు అసమాపక క్రియలతో నిర్వహిస్తారు. దానికి భిన్నంగా నామవాచకాలతో ,

అదికూడా సంబోధనలతో, నిర్వహింపబడటం మరోప్రత్యేకత! శబ్దశక్తిలో ఘటికుడైతేతప్ప కవికిది సాధ్యంకాదు.అందుచేతనే అబ్బయామాత్యుడు ప్రౌఢకవితా దురంధరుడని చెప్పటం!


అర్ధములు:- ధ్యేయ- తలంపబడువాడు; చిద్రూప-జ్ఙానస్వరూపా; రుచి-కాంతి; శ్రీ- శోభ; జిత-జయింపబడిన; ముక్త-మోక్షగాములు; ముక్త-విడువబడిన(ముక్తిని ప్రసాదించిన) భుజదర్ప-బలగర్వము; రమావల్లభుడు- విష్ణువు; మిత్ర-స్నేహితుడా; మిత్ర రజనీరాడ్చక్ర-

సూర్య చంద్రులు రధచక్రములుగా గలవాడా; చక్రాబ్జ- చక్రము పద్మములు ;రేఖా-హస్తరేఖలుగల; కరపద్మ-పద్మమున బోలిన హస్తములుగలవాడా; శరభము- శరభమృగము, మంచు; శంకరా- సంపద నొసగు వాడా;


భావము: పార్వతీ మానస హంసా! పరమ హంసలగు యోగులచే ధ్యానింపబడు జ్ఙానస్వరూపా!రూపమునందలికాంతిచే ముత్యపు శోభలను తిరస్కరించువాడా! (భస్మ ధారణచే తెల్లని శరీరముగలవాడై ముత్యముల తెల్లదనమును ధిక్కరించు చున్నటులుండువాడనియర్ధము) వ్యాఘ్రాసుర భుజ గర్వమునణచినవాడా!

ఇంద్ర, కేశవులకు మిత్రుడా! సూర్యచంద్రులు రథ చక్రములుగాగలవాడా!చక్రము ,పద్మము అనబడు చక్కని సాముద్రిక రేఖలుగల

కరపద్మములు గలవాడా! పద్మ ములకు విరోధియైన మంచును తుదముట్టించువాడా! ఐశ్వర్య ప్రదాతా నీకు నమోనమః!


కావ్య నాయిక యగు ఉషాదేవి తండ్రి బాణాసురుడు పరమేశ్వర భక్తుడు. భక్త వత్సలుడైన యాపరమేశ్వరుని ప్రార్ధించుటయే పద్యము నందలి విషయము. కాకపోతే కవి తన ప్రతిభను ప్రదర్శించు కొనుటకై అనన్య సామాన్యమైన ప్రయత్నమును

యెట్లొనరించెనో తెలుపుట కోసమే యీపద్యము నీనాడు మీ ముందుంచుట జరిగినది.

                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గురువారం🪷* *🌹13, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

*🌹13, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                


         *ఈనాటి పర్వం*

        *హోలీ కోత్సవం* 

   *🪅హోలీ పండుగ🪅* 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  శుక్లపక్షం*


*తిథి       : చతుర్దశి* ఉ 10.35 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే )

*నక్షత్రం  : పుబ్బ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం  : ధృతి* మ 01.03 వరకు ఉపరి *శూల*

*కరణం   : వణజి* ఉ 10.35 *గరజి* రా 11.26 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 11.19 - 01.04*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*


*వర్జ్యం            : మ 12.50 - 02.35*

*దుర్ముహూర్తం  : ఉ 10.17 - 11.05 మ 03.05 - 03.53*

*రాహు కాలం   : మ 01.47 - 03.17*

గుళికకాళం      : *ఉ 09.17 - 10.47*

యమగండం    : *ఉ 06.17 - 07.47*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.17* 

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.17 - 08.41*

సంగవ కాలం         :      *08.41 - 11.05*

మధ్యాహ్న కాలం    :      *11.05 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.17*

ప్రదోష కాలం         :  *సా 06.17 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.40*

బ్రాహ్మీ ముహూర్తం  :   *తె 04.40 - 05.28*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం*


*దిగంబరం భస్మసుగంధలేపనం*

*చక్రం త్రిశూలం డమరుం గదాం చ |*

*పద్మాసనస్థం ఋషిదేవవందితం* *దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదం*


     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌹🌹🌹🌷

      🌹🌷🌹🌹🌷🌹

సమస్య

 *చీకటులం దివాకరుcడు చిమ్మె దిశాంతము లందు వేకువన్*

ఈ సమస్యకు నా పూరణ. 


సాకులు ద్రోయుచున్ ముసుగుసౌఖ్యము వీడగ తట్టిలేపుచున్


దాకొను రాగబంధముల దంపతులన్ దినచర్య కోసమై


చీకటులం దివాకరుcడు చిమ్మె - దిశాంతము లందు వేకువన్


శ్లోక సమన్వితంబగుచు శోక్యము గాగ జగత్తు వెల్గగన్

(దాకొను =దగ్గరగు

శోక్యము =చింత్యము)


అల్వాల లక్ష్మణ మూర్తి

ప్రాచీన సంస్కృత నాటకం

 *ఆధునిక నవలా శైలితో ప్రాచీన సంస్కృత నాటకం:*


‘ముద్రా రాక్షసం’ గురించి  మూడు ముక్కలు.


*-- ప్రకాష్*


📗            📙         📘         📕

 

*విశాఖదత్తుని సుప్రసిద్ధ సంస్కృత నాటకం ‘ముద్రారాక్షసమ్’.* దీన్ని డా. ధూళిపాళ అన్నపూర్ణగారు తెలుగులో అనువదించారు. నాకు తెలిసి ఈ నాటకానికి చాలా ఏళ్ల క్రితం రెండు అనువాదాలు వెలువడ్డాయి. ఒకటి అవధానము చంద్రశేఖర శర్మగారు 1957 లో చేసినది.( ఇందులో గేయాలు కూడా ఉన్నాయి) రెండోది శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవి 1966 లో చేసినది. ఇవి అడుగడుగునా పద్యాలతో, అరసున్నలతో, సరళ గ్రాంథికంలో ఉన్నాయి. ఇద్దరూ ఉద్దండ పండితులే! ఇద్దరూ తమవి సరళాను వాదాలే అని చెప్పుకున్నారు. కానీ చిన్నయసూరిగారు పిల్లల కోసం రాసిన ‘నీతి చంద్రిక’ పెద్దలకు కూడా ఒక పట్టాన కొరుకుడు పడనట్టు ఇవి నేటి పాఠకులకు సాఫీగా సాగవు. నేను కొన్నేళ్ళ క్రితం చదవాలని ప్రయత్నించి ‘ మనవల్ల కాదులే’ అని రెండూ మొదటి అంకంలోనే ఆపేశాను. 


పైన చెప్పిన పండితుల అనువాదాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయినా వాటి పునర్ముద్రణకు ఎవరూ సాహసించలేదు. అలాంటి సమయంలో అన్నపూర్ణగారు సరికొత్త శైలిలో దీని అనువాదానికి పూనుకోవడం ప్రశంసనీయం. ఈ అనువాదంలో  క్లిష్టమైన పదాలు కానీ, సంస్కృతసమాసాలు కానీ లేవు. కాబట్టి ఒక నవలలా చదువుకుంటూ పోవచ్చు. సుమారు నాలుగు దశాబ్దాల సంస్కృత బోధనానుభవంమాత్రమే దీనికి సరిపోదు. ఆధునిక తెలుగు సాహిత్యానురక్తీ, పరిశీలనాశక్తీ  కూడా ఉండటం వల్ల అన్నపూర్ణగారికి ఈ అనువాదం తేటతెలుగులో రాయడం సాధ్యమైంది.  ప్రథమాంకం, ద్వితీయాంకం అనకుండా మొదటి అంకం రెండో అంకం అన్నారు. సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను చక్కగా విశ్లేషించారు. ‘ఆగు ఆగు ఒరేయ్ !’ ,  ‘చాణక్య గాడు’.. అనడం కంటే వ్యావహారిక శైలి ఏముంటుంది? సరళీకరణకు ఏ మేరకు అవకాశం ఉందో ఆ మేరకు చేసారు. భవిష్యత్తులో ఇలాంటి సంస్కృత నాటకాల అనువాదకులకు ఇది నమూనాగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 


ఒక అనువాదం ఎంత సరళంగా ఉందో చెప్పడానికి తిరుపతి వెంకటేశ్వరకవి  అనువాదంలోని ఒక పలుకుబడిని చూడండి.  రాక్షసుడు ఒక సందర్భంలో తన బాధను వ్యక్తం చేస్తూ ‘గండము పై పిండకము పుట్టినది’ అంటాడు. ఇక్కడ సామాన్య పాఠకుడు నిఘంటువు వెతకాల్సిందే. దీనిని అన్నపూర్ణగారు  ‘ ‘పుండుమీద కారం చల్లినట్టు’ ‘ గోరుచుట్టు మీద రోకటి పోటులా’ అని జనవ్యవహారంలో ఉన్న సామెతలను ఉపయోగించారు.


ఇంకో ఉదాహరణ. తిరుపతి వారి అనువాదంలోదే సూత్రధారుడి పద్యం ఇది. గీ. “తెలివితక్కువవాఁడు విత్తినను మంచి/ నేలపైఁ బడ్డ విత్తన మేల చెడును ?/పొలము బలమైనదై యుండవలయుఁగాని/ వప్తగుణ మేల వరివేళ్ళు పాఱుటకును”. ఇందులో  ‘వప్త’ అంటే విత్తులు నాటేవాడు. కొంచెం ప్రయత్నిస్తే అర్ధమవుతుంది. కానీ పాఠకుడు ఆపాటి కష్టం కూడా పడకూడదనుకున్నారు అన్నపూర్ణగారు. ‘ మంచి నేలలో పడిన గింజకు దానిని చల్లినవానితో పనిలేదు. నేల తాలూకు సారం వల్లనే చక్కగా ఎదిగి మంచి పంటను ఇస్తుంది’ అని  ‘అరటి పండు ఒలిచి పాఠకుడి నోటికి అందించారు. 


తిరుపతి కవిగారు  చాణక్యుడి మాటలు గురించి చెబుతూ “ చ. పుడమికి రొమ్ముజబ్బు లనఁ బోలిన నందుల నాఱుమూగురన్/ గెడపితి' అంటే అన్నపూర్ణ గారు ‘ ఈ భూమికి మానసికమైన జబ్బులా ఉన్న తొమ్మండుగురు నందుల్ని దుంపనాశనం చేశాను’ అని చక్కని జాతీయం ప్రయోగించారు. దుంపనాశనం అంటే సమూలంగా ధ్వంసం చేయడం అని అర్ధం.


ఇలా చెప్పడం ఆ పూర్వ పండితుల వైదుష్యాన్ని తక్కువ చేసి చెప్పడం కాదు. అన్నపూర్ణగారి అనువాదం చదువుకోడానికి ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికే. 


తెలుగుపాఠకులు దీన్ని చదివితే సంస్కృత నాటకం గొప్ప తనం తెలుస్తుంది. సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు చదివితే ఆ గొప్పతనాన్ని తెలుగులో ఎంత సరళంగా చెప్ప వచ్చో తెలుస్తుంది. సామాజిక మాధ్యమాలవల్ల పాఠకుల అభిరుచులు పక్కదారి పట్టాయనే కొందరి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఈ నాటకాన్ని ప్రచురించిన తురగా ప్రచురణాలయం వారినీ, ఎంతో శ్రమకోర్చి నాటకాన్ని తెలుగు చేసిన    డా. అన్నపూర్ణగారినీ  హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.


*పుస్తకం లభించే చిరునామా :


తురగా ప్రచురణాలయం 

99085 72598

చంద్రగ్రహణం వివరణ

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


🪷 *చంద్రగ్రహణం వివరణ* 🪷

(భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు)


🌗 2025 లో తొలిసారి మార్చి14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.


🌗 మన భారత దేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై, ఉదయం 11 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


🌗 అయితే చాలా మందిలో హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలు ఉంటాయా? అని ఆలోచిస్తుంటారు. 


🌗 ఈ గ్రహణం పగలు ఉంటుంది కాబట్టి, చంద్రగ్రహణ ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదు. ఇది ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికాలో, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూమెక్సికో , టెక్సాస్, మెక్సికో , బిరైజ్ , ఫనామ , కొలంబియా , బ్రెజిల్ , క్యూబా , సల్విడార్ , జమైకా , ekwadar , వెనిజులా , పెరు దేశాలందు కనిపిస్తోంది. (మన భారతీయులు నివసిస్తారు కనుక చెప్పడం జరిగింది).


🌗 భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు 

అందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, దేవాలయాలు-శుద్ధి, పట్టు విడుపు స్నానాలు ఇవేవీ అవసరం లేదు.

🙏🌹ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ 🌹🙏


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

గరుడ పురాణం_*8వ

 *గరుడ పురాణం_*8వ భాగం*


_*6వ అధ్యాయం:-*_


_*ధ్రువ వంశం - దక్ష సంతతి:*_


_శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు._


_*ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశంపాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతా లతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషీద' అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలనూ రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు.**_


_పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి, రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్దారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పది వేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు._


_*దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరి రాలేదు.*_


_దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు 'శబలాశ్వ' నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసివచ్చింది._


_(* వేన చరిత్రలో మనం గమనించ వలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజెలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి, తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు, బ్రాహ్మణ శబ్దానికి అర్హులైనవారు అలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది.)_


_*ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా అరవైమంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరామహర్షికి, ఇద్దరు కన్యలను కృశాశ్వునికీ పది మందిని ధర్మునికీ, పదునాల్గురిని కశ్యపునికీ, ఇరవై ఎనమండుగురిని చంద్రునికీ ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను నలుగురు కన్యలను అరిష్టనేమి కిచ్చి వివాహముగావించాడు.*_


_ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు. శంకరదేవా! భానుకి పన్నెండుగురు భానులూ, ముహూర్తకు ముహూర్తులూ జన్మించారు. లంబనుండి ఘోషులు, యామీ ద్వారా నాగవీథి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు._


_*ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వికాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ.


వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు.


అనల (అగ్ని) పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి; కృత్తి కలచే పాలింపబడి కార్తికేయుడై నాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అసలునికి కలిగారు.*_


_దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి. రుద్ర నందనులైన హర, బహురూప, త్య్రంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు._


_*కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.*_

గరుడ పురాణం_*7వ

 *గరుడ పురాణం_*7వ భాగం*


_*5వ అధ్యాయం:-*_


_*మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి- సృష్టి విస్తారం:-*_


_శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస - ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానస పుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు._


_*అలాగే పితృగణాల వారు ఏడుగురు అనగా బర్హిషద్, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు. చివరి నలుగురూ మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.*_


_కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్ఠం (కుడి బొటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు._


_*దక్షుడు ఒక అసాధారణ రూపవతీ, సుందర సులక్షణ లక్షిత జాతాయగు (తన) ఖ్యాతియను కూతురిని భృగు మహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులూ, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు.*_


_మహాత్ముడైన మనువుకి ఆయతి, నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు._


_*మరీచి - సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలీ, కుహూ, రాకా అనుమతీ నామక కన్యలు కలిగారు.*_


_అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మశుడు, అర్థవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా ఆరు వేల మంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు._


_**వసిష్ఠునికి పత్ని ఊర్జాద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు.*_ _(*ఈయన శ్రీరామ గురువు వశిష్టుడు కాదు)_


_శివశంకరా! దక్షప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి  * పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమఓజస్వులు._

_(* ఈ త్రేతాగ్నులలో విద్యుత్సంబంధియైన అగ్ని పావకం. ఘర్షణ ద్వారా వచ్చేది పవమానం. సూర్యుని లోనిది శుచి, కూర్మ పురాణంలో ఇలా చెప్పబడింది._

_పావకః పవమానశ్చ శుచి రగ్నిశ్చ తేత్రయః | నిర్మథ్యః పవమానః స్యాద్ వైద్యుత పావకః స్మృతః || యశ్చాసౌ తపతే సూర్యః శుచిరగ్ని స్త్వ సౌ స్మృతః-   1-12/25,26)_


_*దక్ష కన్యయైన స్వధకుమేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు 'బ్రహ్మవాదినులు' మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడూ, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి.*_


_అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వాయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజా పాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వాయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధతేజస్వినీ, తపస్వినీయైన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్నీ క్రమంగా రుచి ప్రజాపతికీ, దక్ష ప్రజాపతికీ, కర్దమమునికీ ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకూ దక్షిణయను కూతురూ జన్మించారు. యజ్ఞునికి పన్నెండు మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే 'యామ' అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు._


_*దక్షప్రజాపతికి ప్రసూతి ద్వారా ఇరవై నలుగురు కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన పదముగ్గురు కన్యలను దక్షిణా పుత్రుడయిన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల పదకొండుగురు కన్యలనూ దక్ష ప్రజాపతి క్రమంగా భృగుమహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడు, అగ్ని, పితరుడు - అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు.*_


_వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శ్రుతుడు, క్రియకు దండలయ, వినయులూ, బుద్ధికి బోధుడూ, లజ్జకు వినయుడూ, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమా, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్భవించాడు._


_*కొంత కాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివునీ, సతినీ తప్ప ఇతర బంధువులనందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్నీ తనకు జరిగిన అవమానాన్నీ తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణ త్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికీ దేవసేనానికీ తల్లియై లోకారాధ్య అయింది.*_


_అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియై పోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకరభగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు._

_(5వ అధ్యాయం - సమాప్తం)_