25, మే 2025, ఆదివారం

భగవద్గీత ఒక్కటే.

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మన జీవితం రాతను మార్చగలిగేది భగవద్గీత ఒక్కటే.. మన వ్యక్తిత్వ నిర్మాణానికి గొప్ప గైడ్ భగవద్గీతే.. అనే విషయాన్ని సోదాహరణంగా, అందరికీ తేలికగా అర్థమయ్యేలా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు యువ సాధకుడైన సునీల్ ఆకెళ్ల. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రుద్రనమకం

 🙏రుద్రనమకం🙏

ఇప్పుడు 'మహన్యాసం' అనే ప్రక్రియ గురించి చెప్పుకోవాలి.

'న్యాసం' అంటే 'ఉంచుట', 'నిలుపుట' అని అర్థం. 'మహన్యాసం' అంటే 'గొప్పగా నిలుపుట'. 

'నారుద్రో రుద్ర మర్చయేత్' అని శాస్త్రం. 'రుద్రుడు కానివాడు రుద్రుని పూజించరాదు'. రుద్రమంత్రాలతో నిన్ను నీవు మంగళకరం చేసుకోవాలి. మంత్రాలతో శరీరమంతా రుద్రమయమై పోతుంది. అందుకు మహన్యాసమనే ప్రక్రియ ఉన్నది. మంత్రశక్తి ప్రవేశించి 'మాంస'మయమైన శరీరం 'మంత్ర'మయమైన శరీరంగా మారుతుంది. 

ముందు మనచుట్టూ శివుడు, తర్వాత మనతో శివుడు, చివర మనలో శివుడు, అంతిమంగా మనమే శివుడు ..... అనే స్థితికి తీసుకు వెళుతుంది మహన్యాసం.


ఇక్కడ మనం చెప్పుకొనేది కేవలం మంత్రానుష్ఠానము కాదు. ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని స్మరించుకోబోతున్నాము. 

"తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకినీ డాకినీ సర్వ శ్వాపద తస్కర జ్వారాత్ ఉపద్రవాత్" 

అని మహన్యాసంలో చెప్పబడింది. నిరంతరం ఆ శివుడుని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారిని చూసి రోగాలూ, పాపాలూ, ఉపద్రవాలూ, భూత ప్రేత పిశాచాలూ, అన్నీ దూరం నుండి భయపడుతాయి, "సర్వే జ్వలంతం పశ్యంతు" వాటికి వీడు 'అగ్నిశిఖ'లాగా కనపడతాడు.


ఇక్కడ ఈ 'రుద్ర' శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయో 'నిరుక్తం' అనే శాస్త్ర ఆధారంగా తెలుసుకుందాము.

**రోదమును కలిగించువాడు 'రుద్రుడు'.

అంతకాలంలో అందరినీ దుఃఖింప జేయువాడు. మహాప్రళయంలో అందరినీ భయవిహ్వలులని చేసే ప్రళయ కారకుడు పరమేశ్వరుడు.  

**రుత్తుని ద్రవింపజేయువాడు 'రుద్రుడు'.

దుఃఖాన్నీ, దుఃఖ కారకాన్నీ ద్రవింప జేయువాడు, అంటే నశింప జేయువాడు. ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందిం జేస్తాడు. ఆనందదాయకుడు, దుఃఖ విమోచకుడు. దుఃఖ మూలం 'అవిద్య'. అవిద్యను నశింపజేయువాడు. గురు స్వరూపంగా బ్రహ్మవిద్యను ప్రసాదించి, అవిద్యానాశనంతో కైవల్యాన్ని ఇచ్చేవాడు 'రుద్రుడు'.

**రుతం సంసార దుఃఖం ద్రావయతి.

'రుత్' అంటే దుఃఖము. సంసార దుఃఖాన్ని నశింపజేయువాడు.

**రుతౌ నాదాంతే ద్రవతి - ద్రావయతీతి రుద్రః.

ఇది వైదిక పరమైన, యోగ పరమైన అర్థం. 'రుతం' అనే శబ్దానికి 'నాదం' అనే అర్థం ఉంది. నాదమునకు పైన స్థితి 'అమృతం', ఆ రూపంలో ప్రవహించువాడు.

'ఓం'కారంలో వ్యక్తమయ్యేది 'అ'కార, 'ఉ'కార, 'మ'కారములనే మూడు; అవ్యక్తమయ్యేవి అర్ధచంద్ర, రోధినీ, నాద, నాదాంత, శక్తి, వ్యాపికా, సమనా, ఉన్మనీ అనే ఎనిమిది ఉన్నాయి. మొత్తం కలిపి పదకొండు. ఈ పదకొండు స్థానములే 'ఏకాదశ రుద్రులు', ప్రణవం ఒకటే కనుక ఏకాదశ రుద్రులు కలిపి ఒకడే 'రుద్రుడు', అందుకే ఓంకారమే రుద్రుడు. మనలో పదకొండు రూపాలుగా ఉన్న ప్రాణశక్తి రుద్రుడే. ఈ రుద్ర శబ్దానికి 'ప్రాణశక్తి స్వరూపుడు అని అర్థం చెప్పారు.

**రుత్యా వేదరూపయా ధర్మాదీ నవలోకయతి ప్రాపయతి వా రుద్రః.

వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ, దాన్ని కలిగించేవాడు ఎవడో అతడు రుద్రుడు.

**రుత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి రుద్రః.

అని కూడా నిర్వచనం చెప్పారు.

**రుత్యా ప్రణవరూపయా స్వాత్మానాం ప్రాపయతి ఇతి రుద్రః.

ప్రణవనాదం ద్వారా ఆత్మతత్త్వాన్ని పొందింప జేసేవాడు రుద్రుడు.

**రుజాం ద్రావయతీ రుద్రః.

రోగాలను నశింప జేయువాడు

ఇన్ని అర్థములు రుద్ర నామానికి, ఇది అన్ని 'అర్థము'లను ప్రసాదించే నామము.

ఈ రుద్రునికి నమస్కారము 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీ రుద్రనమక వైభవము 🙏

 🙏 శ్రీ రుద్రనమక వైభవము 🙏

          మొదటి భాగం

ఇది పరమేశ్వర సంబంధ జ్ఞానము. 

"వేదః శ్శివః శివో వేదః" అన్నారు మహర్షులు.

వేదం 'గ్రంథం' కాదు. వేదం శబ్ద స్వరూపుడైన ఈశ్వరుడు. ఈశ్వర నిర్మితమైన శబ్ద ప్రపంచమే వేదమంటే. ఋషులు వేద మంత్రరాశిని దర్శించారు. అంటే మంత్రంతో పాటు మంత్ర సంబంధమైన 'తేజస్సు'ను దర్శించారు.

ఏ శబ్దానికి 'శక్తి' ఉంటుందో ఆ శబ్దానికి మంత్రమని పేరు.  


ఇప్పుడు చెప్పుకోబోతున్న 'రుద్రనమకం' అనే భాగానికి మరొక పేరు ఉంది, 'శత రుద్రీయం'. ఇంకోపేరు 'రుద్రోపనిషత్'. 

వేదమునకు హృదయ స్థానంలో యజుర్వేదముందట, యజుర్వేదానికి హృదయ స్థానంలో రుద్రముందట. అందుకు దీన్ని వేదానికి హృదయం అన్నారు. రుద్రం చెప్తూవుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడట.


రుద్రంలో పదకొండు అనువాకాలున్నాయి. వీటిలో ఎన్నో మంత్రాలున్నాయి. ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ప్రయోజనం సాధించవచ్చు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఓషధి.  


రుద్రనమకం యజుర్వేదంలో 'పంచమ ప్రపాఠకం' లో ఉన్నది, సప్తమ ప్రపాఠకంలో 'చమకం' వస్తుంది. 'చమే' అనే శబ్దం ఆవృత్తి జరుగుతూ మూడువందల యాభైమార్లు వస్తుంది. ఈ 'చమే' బాహుళ్యం చేత 'చమకం' అని పేరు వచ్చింది.


మొత్తం రుద్రానికి ఒకటే అర్థం; "పరమేశ్వరునికి నమస్కారము".


"ఏతానిహవా అమృతస్య నామధేయాని" -- ఏ అమృతత్వం మీరు పొంద దలుచుకొన్నారో, ఆ అమృతత్వం పేరు 'శతరుద్రీయం'. ఆ అమృతమే పరమేశ్వరుడు, అయనే అమృతేశ్వరుడు.


'శతరుద్రీయం' అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇందులో 'శత'రుద్రుల గురించి చెప్పారు. "శతం అనంతం భవతి" -- పరమేశ్వరుని యొక్క అనంతమైన విభూతుల గురించి, అనంతమైన స్వరూపాలు గురించి ఇందులో చెప్తున్నారు.


"బ్రహ్మచారీ మితాహారో భస్మనిష్ఠః సమాహితః ౹

జపేద్ ఆమరణాత్ రుద్రం సయాతి పరమాంగతిమ్ ॥"

శతరుద్రీయాధ్యాయాన్ని అనన్య చిత్తంతో, పరమేశ్వరునిపై ఆసక్తి గల మనస్సుతో, బ్రహ్మచారిగా, మితాహారంతో, భస్మధారణ నిష్ఠుడై మరణ పర్యంతం జపించువాడు పరమగతిని పొందుతాడు. 

"అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం ౹

శతరుద్రీయ జాపిత్వం తథా సన్యాస ముత్తమం ॥"

అని మరొక స్మృతివాక్యం.

అవిముక్తం (కాశీక్షేత్రం)లో మరణించిన వాడు. సన్యాసం స్వీకరించిన వాడు, శతరుద్రీయం జపించిన వాడు మోక్షం పొందుతాడు. వేదంలో 'కాశీక్షేత్రం' ఈ శతరుద్రీయం.


"శతరుద్రీయ మధీతే అగ్నిపూతో భవతి" -- శతరుద్రీయం జపం సర్వపాపములను భస్మీపటలం చేస్తుంది. 

"రుద్రాధ్యాయీ వసేత్ యత్ర గ్రామేవా నగరేపివా

న తత్ర క్షుత్పిపిపాసాధ్యా దుర్భిక్షం వ్యాధ యోపిచ"

రుద్రాధ్యాయము జపించే వాడు ఏ ఊళ్ళో ఉంటే, ఆ ఊళ్ళో ఉపద్రవాలుండవు.  

"ప్రయతః ప్రాత రుత్థాయ యదధీతే విశాంపతే

ప్రాంజలిః శతరుద్రీయం నాస్య కించన దుర్లభమ్"

ప్రాతఃకాలంలో నిద్ర లేచి ఎవరైతే రెండు చేతులు దోయిలించి, ఈ శతరుద్రీయాన్ని చదువుతారో, వాళ్ళకు దుర్లభమైనది లేదు సుమా!

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - అశ్వనీ -‌‌ భాను వాసరే* (25.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)

శోకో నాశయతే ధైర్యం 

శోకో నాశయతే శ్రుతమ్.

శోకో నాశయతే సర్వం 

నాస్తి శోకసమో రిపుః

(వా.రా.2.62.15)


*అర్థం:*

శోకము (విచారిస్తూ ఉండిపోవడం) ధైర్యాన్ని నాశనం చేస్తుంది. శోకము ఉన్న విజ్ఞానాన్ని, వివేకాన్ని నాశనం చేస్తుంది. అది ఇది అని ఏమిటి, శోకము సర్వమూ నశింపచేస్తుంది. శోకాన్ని మించిన శతృవు లేదు.

(కష్టాలు వచ్చినప్పుడు విచారిస్తూ ఉండిపోక, తేరుకుని ధైర్యంగా ముందుకు సాగాలి)

*_ముఖ్యంగా నేటి యువత దీనిని గ్రహించాలి._*


శ్రీ సూర్య మండల స్తోత్రం తో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

భగవంతుని నామ స్మరణ

 *భగవంతుని నామ స్మరణ సకల దుఃఖ నివారిణి*


*ఎట్టి ఉపాయము తోచని స్థితిలో మనసు నిండుగా భగవంతుని తలిచి చూడండి, ఏదో ఒక రూపంలో పరిష్కారమును గ్రహించడం... తప్పక అనుభవంలోకి వస్తుంది.*


*వేకువనే లేచి భగవంతుని స్మరించుటవలన ఆ దినమంతయు శుభమే కలుగుతుంది. సాధన చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద అరణ్యంలో దారిని చూపుటకు చిన్న దీపం చాలు కదా! అలాగే మన జీవితానికి సరైన దారిని చూపుటకు  భగవంతుని నామ స్మరణ అనే చిన్న సాధన చాలును. దీనికి తోడు సేవ అనేది మనము ప్రయాణించిన దారిని శుభ్రం చేయుటకు సహకరిస్తుంది.*


*కలియుగములో మానవజన్మ సార్థకతకు, మోక్ష సాధనకు అతి సులువైన మార్గం... భగవంతుని నామ స్మరణ దీన జనసేవయే. నేటి పరిస్థితుల్లో వీటికి మించి సులువైన ఉపాయం మరొకటి లేనే లేదని చెప్పాలి.*


*ప్రతిరోజు 30 నిమిషాలు  పరమాత్ముని మీద ప్రేమతో ధ్యానం... చేద్దాం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉందాం.*

https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd

*┅━❀꧁ శ్రీ మద్భగవద్గీత ꧂❀━┅*

                     

రమణోదయం

 💫 _*రమణోదయం*_ 🎊

➖➖➖➖➖✍️

*_🦚 జీవుని కార్యాలన్నీ ఈశ్వరుని కార్యాలే అని అంగీకరిస్తే జీవునికి ఉనికి ఉండదు. స్వాతంత్ర్యము ఉండదు. అంతా భగవంతునికి అర్పించినందువల్ల తాను భగవంతునికి వేరుగా ఉండడు, అట్లా ఆత్మ సమర్పణం కాలేకపోతే జీవులు చేసే పాపపుణ్యాలన్నిటికీ కర్తృత్వం జీవుడిదే తప్ప ఈశ్వరునిది కాదు. జీవుడు, శివుడు వేరనీ, జీవుడు స్వతంత్రుడనీ తలచి చేసే పాపపుణ్యఫలాలని జీవుడే అనుభవించవలసిన వాడు !!_*

*_✳️ వివరణ : కర్తృత్వ భావమున్నంతవరకు కర్మలు బంధిస్తాయి. ఫలితాలు మంచైనా, చెడైనా అనుభవించవలసినదే. "అంతాభగవదేచ్ఛ", 'శివుని ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదు' అనే పెద్దల మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండా, లోకులు కష్టం కలిగితే "ఇదంతా భగవంతుని చర్య" అని భగవంతుని దూషించినట్లు మంచి జరిగితే మాత్రం తాము భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనట్లు ఆ వాక్యాలని ఉపయోగిస్తారు._* 

*_ఈ దురభిప్రాయాన్ని నివృత్తి చేయడానికే ఈ ఉపదేశం !!_*

*_✨ స్మరణ మాత్రముననె_*

*_పరముక్తి ఫలద |_*

*_కరుణామృత జలధి యరుణాచలమిది ||_*

*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి, "గురూపదేశ రత్నమాల" నుండి)._*

*_అరుణాచల శివ.._*

*_అరుణాచల శివ.._*

*_అరుణాచల శివ.._*

*_అరుణాచలా...!_* 

🙏🇮🇳🎊🪴🦚🐍

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ


యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ 

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ (26)


ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ 

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ (27)


చంచలమూ అస్థిరమూ అయిన మనస్సు ఏయే విషయాల మీదకు వెడుతుందో ఆయా విషయాలనుంచి దానిని మళ్ళించి ఆత్మమీదే నిలకడగా వుంచాలి. ప్రశాంతమైన మనస్సుకలిగినవాడు, కామక్రోధాది ఉద్రేకకారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగపురుషుడికి పరమ సుఖం లభిస్తుంది.

సర్వధర్మాన్ పరిత్యజ్య

 18.66

*సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।*

*అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।*

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |

अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||


సర్వ-ధర్మాన్ — అన్ని విధములైన ధర్మములనూ; పరిత్యజ్య — విడిచిపెట్టి; మామ్ — నా యందు; ఏకం — మాత్రమే; శరణం — ఆశ్రయం; వ్రజ — పొందుము; అహం — నేను; త్వాం — నిన్ను; సర్వ — సమస్తమైన; పాపేభ్యః — పాప ప్రతిచర్యలనుండి; మోక్షయిష్యామి — విముక్తి చేసెదను; మా శుచః — భయపడకుము.


*BG 18.66 : అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.*


*వ్యాఖ్యానం*


ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకేసమయంలో రెండు పనులు చేయమన్నాడు - మనస్సుని భక్తిలో నిమగ్నం చేయాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు, దానితో పాటుగా భక్తి చేయమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెప్తూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా అవసరంలేదు అని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చు అన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. ఇక్కడ, ఒక సందేహం రావచ్చు, మనం మన భౌతిక ధర్మములను అన్నింటినీ విడిచి పెడితే, మనకు పాపం కలుగదా? శ్రీ కృష్ణుడు అర్జునుడికి భయపడవద్దని చెప్తున్నాడు; ఆయన అర్జునుడిని సమస్త పాపముల నుండి విముక్తి చేస్తాడు, మరియు భౌతిక అస్తిత్వం నుండి విముక్తి చేస్తాడు. 

  శ్రీ కృష్ణుడి యొక్క ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి, మనం 'ధర్మము' అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి. అది 'ధృ' అన్న ధాతువు నుండి వచ్చింది, అంటే ‘ధారణ్ కరనే యోగ్య’ '(dhāraṇ karane yogya') అంటే ‘మనకు సముచితమైన/చేయవలసిన బాధ్యతలు, విధులు, తలంపులు, మరియు కర్మలు.’ యధార్థముగా మనకు రెండు రకాల ధర్మములు ఉన్నాయి - భౌతిక ధర్మములు మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటో ఉన్న, రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనల్ని ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవి అన్నీ శారీరక ధర్మములు అంటారు. దీనినే 'అపర ధర్మ' లేదా ప్రాపంచిక ధర్మ అంటారు. దీని పరిధిలోనే, బ్ర్రాహ్మణ ధర్మ, క్షత్రియ ధర్మ, మొదలైనవి అన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనల్ని ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి/సఖుడు, మరియు ఆశ్రయము అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మ, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మ లేదా ఆధ్యాత్మిక ధర్మ అంటారు. 

  ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే అది పాపము కాదు. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది: 

 దేవర్షి-భూతాప్త-నృణాం పితౄణాం  

  న కింకరో నాయం ఋణీ చ రాజన్ 

 సర్వాత్మనా యః శరణం శరణ్యం  

  గతో ముకుందం పరిహృత్య కర్తమ్ (11.5.41) 

 ఈ శ్లోకం ఏమి చెప్తున్నది అంటే, భగవంతునికి శరణాగతి చేయనివారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనలని మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్నపూర్వకంగానే (ఆటోమేటిక్‌గా) ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడుతాము; ఇదిఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే అందరి పట్ల మన విధి నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యము ఏమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది : 

 ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టాన్ అపి స్వకాన్ 

 ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః (11.11.32)  

 ‘శారీరక ధర్మమును పాటించటం గురించి, వేదములలో, నేను అసంఖ్యాకమైన ఉపదేశాలను ఇచ్చి ఉన్నాను. కానీ, ఎవరైతే వీటిలో ఉన్న అసంపూర్ణతను గమనించి, అన్ని కర్తవ్య విధులను త్యజించి, కేవలం నా యందు భక్తి యుక్త సేవలో నిమగ్నమైతే, వారిని నేను ఉత్తమ సాధకులుగా పరిగణిస్తాను’. రామాయణములో, లక్ష్మణుడు ఏ విధంగా, సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచి, రాముడితో పాటు అడవికి ఎలా వెళ్ళాడో మనం చదివి ఉన్నాము. ఆయన అన్నాడు: 

 గురు పితు మాతు న జానహు కాహూ, కహహు సుభాఉ నాథ పతియాఊ 

 మోరె సబహీఁ ఏక తుమ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ 

 ‘ఓ ప్రభూ, నన్ను దయచేసి నమ్మండి, నాకు ఎటువంటి గురువు, తండ్రి, తల్లి, బంధువులు ఎవరూ లేరు. నాకు సంబంధించినంత వరకూ, దీనబంధువు, మనస్సు ఎఱిగినవాడవు అయిన నీవే, నా స్వామివి మరియు నా సర్వస్వమూ నీవే.’ అదే విధంగా, ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు: 

 మాతా నాస్తి పితా నాస్తి నాస్తి మే స్వజనో జనః  

 ‘నాకు ఎవరూ తల్లి, తండ్రి, లేదా బంధువులు ఎవరూ లేరు (భగవంతుడే నాకు అన్నీ).’ 

 భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు, అంటే, క్షత్రియ యోధుడిగా తన భౌతికప్రాపంచిక ధర్మము (2.31వ శ్లోకం). కానీ, భౌతిక ధర్మ అనేది భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు, మరియు పుణ్యక్షయం అయిపోయినప్పుడు జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి, శ్రీ కృష్ణుడు తదుపరి, అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు, అంటే, శరీరముతో భౌతిక ధర్మము మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. (8.7వ శ్లోకం). ఈ కర్మయోగ ఉపదేశమే భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు, అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మ, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు; అందుకే, యుద్ధం చేయాలి, కానీ అది తన క్షత్రియ ధర్మము కాబట్టి కాదు, భగవంతుడు తనను అలాగే చేయమంటున్నాడు కాబట్టి. 

  మరైతే, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశాన్ని ప్రారంభంలోనే ఎందుకు చెప్పలేదు? ఎందుకు స్పష్టంగా దీనికి విరుద్ధంగా 5.2వ శ్లోకములో కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనది అని చెప్పాడు? శ్రీ కృష్ణ భగవానుడు దీనిని స్పష్టంగా తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/18/verse/66

⚜ శ్రీ బల్లాలేశ్వర్ గణపతి దేవాలయం

 🕉 మన గుడి : నెం 1121


⚜ మహారాష్ట్ర :  పాలీ


⚜  శ్రీ బల్లాలేశ్వర్ గణపతి దేవాలయం



💠 మహారాష్ట్రలో గణపతి చాలా పవిత్రమైన దేవుడు. 

మహారాష్ట్రలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. 

మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణేష్ ఆలయాలలో, ఎనిమిది ముఖ్యమైన ఆలయాలను అష్టవినాయక గణపతి అని పిలుస్తారు.


💠 ఈ గణేశ దేవాలయాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అష్టవినాయక యాత్ర భగవాన్ గణేశ యొక్క ఈ ఎనిమిది ఆలయాలను దర్శనం చేయిస్తుంది.

అష్టవినాయకుని  దర్శన యాత్ర మహారాష్ట్రలో బాగా ప్రాచుర్యం పొందింది.


💠 అష్టవినాయక ఆలయాలలో, బల్లాలేశ్వర్ ఆలయం పాలి చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం గురించి వివరణాత్మక సమాచారాన్ని మనం తెలుసుకుందాం.


💠 గణేశుని ఆలయాలలో, బ్రాహ్మణుడిలా వేషం ధరించి భక్తుడి పేరుతో పిలువబడే ఏకైక అవతారం బల్లాలేశ్వర్


💠 శ్రీ బల్లాలేశ్వర అష్టవినాయక దేవాలయం గణేశుడి ఎనిమిది అష్టవినాయక దేవాలయాలలో ఒకటి.  ఈ ఆలయం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని పాలి గ్రామంలో ఉంది & ఇది గణేశ భక్తులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది.  

ఈ ఆలయం సరస్‌గడ్ కోట & అంబా నది మధ్య ఉంది.


💠 గణేశ దేవాలయాలలో, బల్లాలేశ్వరుడు గణేశుడినీ  యొక్క ఏకైక అవతారం, అతని భక్తుడి పేరుతో పిలుస్తారు.  


💠 బల్లాలేశ్వర్ గణపతి పురాణం బల్లాల్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది

కళ్యాణ్‌శేత్ మరియు అతని భార్య అనే దంపతులకు బల్లాల్ అనే కుమారుడు ఉన్నాడు. అతను గణేష్‌కు గట్టి భక్తుడు. అతను గణేష్ అని నమ్మే పెద్ద రాయిని పూజించడానికి అడవికి వెళ్లేవాడు. 


💠 అతను అడవిలో చెట్టుకు బంధించబడి, వేదనతో కొట్టుమిట్టాడాడు.  

ఉపశమనం కోసం నిరాశకు గురైన బల్లాల్ సహాయం కోసం గణేష్‌జీని అరిచాడు.  బాలుడి బాధతో చలించిపోయిన గణేష్‌జీ ఒక సాధువు వేషంలో అతని ముందు కనిపించాడు.


💠 గణేశుడిని చూడగానే , బల్లాల్ దాహం మరియు ఆకలి మాయమయ్యాయి; అతని గాయాలు నయమయ్యాయి మరియు అతను పూర్తిగా ఉత్తేజితుడయ్యాడు.

 అతను సాధువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి, అతన్ని గణేశుడిగా గుర్తించి, అతన్ని పూజించాడు. 

తన భక్తికి ప్రతిఫలంగా అతను కోరిన ప్రతిఫలంగా అతనికి ఏది అడిగినా ఆశీర్వదిస్తానని గణేశుడు బల్లాల్‌తో చెప్పాడు . 


💠 బల్లాల్, "నేను మీ అచంచల భక్తుడిని కావాలి, మరియు మీరు ఎల్లప్పుడూ ఈ ప్రదేశంలో ఉండి మిమ్మల్ని ఆశ్రయించే ప్రజల కష్టాలను తొలగించాలి" అని వేడుకున్నాడు. "నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, నా పేరు ముందు నీ పేరును ఉంచుకుంటాను, బల్లాల్ ప్రభువు (బల్లాల్ ఈశ్వర్) గా పూజించబడతాను" అని గణేశుడు అన్నాడు. 

అతను బల్లాల్‌ను కౌగిలించుకుని సమీపంలోని రాయిలో అదృశ్యమయ్యాడు.


💠 ఆ రాతి విగ్రహాన్ని బల్లాలేశ్వర్ అంటారు. కళ్యాణ్ నేలపై విసిరిన రాతి విగ్రహాన్ని ధుండి వినాయక్ అని కూడా పిలుస్తారు. ఇది స్వయంభు మూర్తి మరియు బల్లాలేశ్వరుడిని పూజించే ముందు పూజిస్తారు.


💠 అంతేకాకుండా, గణేష్‌ తన సహాయం కోరిన వారందరికీ ఓదార్పు మరియు ఆశ్రయం కల్పిస్తూ ఆ ప్రాంతంలోనే ఉంటానని ప్రమాణం చేశాడు.  

కాబట్టి, దయగల దేవత సమీపంలోని రాయిలో అదృశ్యమైంది, ఇది పాలిలోని గౌరవనీయమైన బల్లాలేశ్వర్ దేవతగా అద్భుతంగా రూపాంతరం చెందింది, ఇది విశ్వాసం మరియు కరుణ యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం.


💠 వినాయక మూర్తి ఒక రాతి సింహాసనంపై కూర్చుని, దాని తొండం ఎడమవైపుకు తిప్పి, వెండి నేపథ్యంలో కూర్చొని రిద్ధి మరియు సిద్ధి చామరాలను ప్రదర్శిస్తుంది.  

మూర్తి కళ్ళు మరియు నాభిలో వజ్రాలు ఉంటాయి.


💠 ఆలయంలో రెండు గర్భాలయాలు ఉన్నాయి, ఒక లోపలి మరియు బయటి గర్భాలయం.  లోపలి గర్భగుడి ఎత్తు 15 అడుగుల (4.6 మీ) కాగా, బయటి గర్భగుడి ఎత్తు 12 అడుగుల (3.7 మీ) మాత్రమే.  


💠 బయటి గర్భగుడిలో గణేశుడికి ఎదురుగా చేతిలో మోదకం పట్టుకుని, ఎలుక ఆకారంలో ఉన్న మూర్తి ఉంటుంది.  

ఆలయ ప్రధాన హాలు 40 అడుగుల (12 మీ) పొడవు మరియు 20 అడుగుల (6.1 మీ) వెడల్పు మరియు చెట్లను పోలి ఉండే ఎనిమిది స్తంభాలను కలిగి ఉంది.


💠 కుడి వైపున ఉన్న సరస్సు నుండి నీటిని గణేశుని పూజ మరియు ఇతర శుభ సందర్భాలలో ఉపయోగిస్తారు. సూర్యుడు దక్షిణ దిశకు అస్తమించే సమయంలో, సూర్యుని కిరణాలు బల్లాలేశ్వరుడి విగ్రహంపై పడతాయి.


💠 గర్భగుడి లోపలి భాగంలో బల్లాలేశ్వర విగ్రహం ఉంది. 

ఇది 3 అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు ఇది తూర్పు ముఖంగా ఉంటుంది మరియు దాని తొండం ఎడమ వైపుకు తిరుగుతుంది. 

 ఈ అంశంలో గణేష్ బ్రాహ్మణుడిగా కనిపించాడు మరియు కాబట్టి బ్రాహ్మణులు ధరించే దుస్తులు ధరించిన గణేష్‌ను చూపించే అరుదైన విగ్రహాలలో ఇది ఒకటి.

 విగ్రహం యొక్క రెండు వైపులా రిద్ధి మరియు సిద్ధి విగ్రహాలు ఉన్నాయి.


💠 బల్లాలేశ్వర్ ఆలయం పాలిలో ఉంది & ఇది ముంబై నుండి 113 కిమీ మరియు పూణే నుండి 125 కిమీ దూరంలో ఉంది.



రచన

©️ Santosh Kumar

17-21-గీతా మకరందము

 17-21-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసదానమును పేర్కొనుచున్నారు- 


యత్తు ప్రత్యుపకారార్థం 

ఫలముద్దిశ్య వా పునః | 

దీయతే చ పరిక్లిష్టం 

తద్దానం రాజసం స్మృతమ్* || 


తాత్పర్యము:- ప్రత్యుపకారము కొఱకుగాని, లేక ఫలము నుద్దేశించిగాని మనఃక్లేశముతో (అతికష్టముతో) గాని ఇవ్వబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- ప్రత్యుపకారము కోరి చేయు దానము ఉత్తమమైనదికాదని నుడువుచున్నారు. ప్రత్యుపకార మభిలషించి చేయు దానము బజారులోని వ్యాపారవిధానమే (Shop - keeping) కాగలదు. ఇచ్చిపుచ్చుకొను పద్ధతి అంత శ్రేష్ఠమైనదికాదు. అది రాజసదానపద్ధతియే యగును. మఱియు తనకేదియో మున్ముందు పరలోకాదులందు ఫలము కలుగునని ఆశించి చేయుదానము, అనగా ఫలాపేక్షతో చేయు దానమున్ను ఉత్తమమైనదికాదు. నిష్కామముగా, భగవత్ప్రీత్యర్థముగా చేయుదానమే మహోన్నతమైనది.


" పరిక్లిష్టమ్ “ - కొందఱు దానము చేయునపుడు " అయ్యో! ఈ వస్తువు పోవుచున్నదే ” యని మనస్సులో బాధపడుచుందురు. మఱికొందఱు ఇతరుల బలవంతముచే దానము చేయుచుందురు. అట్లు క్షేశముతో దానమొసంగుట ఉత్తమపద్ధతికాదు. అట్టిది సత్ప్రయోజనమున్ను గలుగజేయజాలదు. దానముచేయుట తనకర్తవ్యమని, (ధర్మమని) భావించి ఐచ్ఛికముగ, అనందముతో ఒకరికిచ్చుటయే సాత్త్వికదానము. తదితరము రాజస, తామస, దానములే యగును. కావున విజ్ఞుడు సాత్త్వికదానమునే అవలంబించవలెను.


ప్రశ్న:- రాజసదాన మెట్టిది?

ఉత్తరము:- (1) ప్రత్యుపకారముకొఱకుగాని (2) ఫలమునుగోరికాని (3) మనస్సునందు బాధపడుచుగాని చేయబడు దానము రాజసదానమనబడును.

~~~~

* తద్రాజసముదాహృతమ్ - పాఠాన్తరము.

తిరుమల సర్వస్వం 249-*

 *తిరుమల సర్వస్వం 249-*


*ద్వాదశ ఆళ్వారులు-14*

 *శ్రీరామచంద్రుని సాక్షాత్కారం* 


 మరో సందర్భంలో అరణ్యకాండ పారాయణం జరుగుతున్నప్పుడు, పౌరాణికులు సీతాపహరణ ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. సీతమ్మ తల్లి దురవస్థను విన్న కులశేఖరుని రక్తం సలసలా మరిగిపోయింది. ప్రాణాలకు తెగించి రావణునితో తలపడడానికి సిద్ధమై, సర్వసైన్యాలను తోడ్కొని; ముందువెనుకలు, పూర్వాపరాలు ఆలోచించకుండా; లంకానగరాన్ని ముట్టడించే లక్ష్యంతో సముద్రంలోనికి ప్రవేశించాడు. మంత్రులు, వీరావేశంతో నున్న మహారాజును అడ్డగించే సాహసం చేయలేక పోయారు. చితాక్రాంతులై, చేష్టలుడిగి రాజుగారి దుస్సాహసాన్ని చూస్తుండి పోయారు. సరిగ్గా ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. కులశేఖరుని అకుంఠిత భక్తికి సంతసించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ప్రత్యక్షమై ప్రసన్నవదనంతో, తాను అప్పటికే రావణుణ్ణి నిర్జించి ఆతని చెర నుండి సీతమ్మను విడిపించానని విశదపరిచాడు. దానితో సంతృప్తి నొందిన కులశేఖరుడు తన సంకల్పాన్ని విరమించుకున్నాడు.



 *మరో పన్నాగానికి శ్రీకారం* 


 పై సంఘటనలతో, శ్రీవైష్ణవుల పట్ల కులశేఖరుని భక్తిభావం మరింతగా బలపడింది. ఎల్లవేళలా వారి సాహచర్యంలోనే కాలం గడపసాగాడు. రాజమహలుకు భాగవతుల తాకిడి పెరిగి పోయింది. రాజు గారిచ్చిన చనువుతో శ్రీవైష్ణవులు సభామండపం లోను, రాజభవనం లోనూ చివరికి అభ్యంతర మందిరము మరియు ఇతర రహస్యప్రదేశాలతో సహా యథేచ్ఛగా తిరుగసాగారు. ఈ విషయంపై మంత్రులు ఆందోళన చెందారు. అపరిచితులను రాజమందిరం లోకి అనుమతించడం శ్రేయస్కరం కాదు. సున్నితమైన సమాచారం శత్రురాజుల పరమయ్యే ప్రమాదముంది. ఎలాగైనా సరే, మహారాజు మదిలో శ్రీవైష్ణవుల పట్ల ఏహ్యభావం కలిగించి, వారిని రాజమహలుకు దూరం చేసే పన్నాగం పన్నారు.



 *మాయమైన కళ్యాణహారం* 


 ఒకానొక నాడు, నవమి పుణ్యతిథి యందు రాజమహలు లోని రామమందిరంలో సీతారామకళ్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. మంత్రుల పథకం ప్రకారం సీతమ్మకు అర్పించవలసిన కళ్యాణహారం మాయమైంది. దాన్ని తీవ్ర అమంగళకరంగా భావించిన కులశేఖరుడు చోరులను తక్షణమే బంధించవలసిందిగా, మంత్రులను ఆజ్ఞాపించాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంత్రిమండలి సభ్యులు, సభామందిరంలో లెక్కకు మిక్కిలిగా నున్న శ్రీవైష్ణవులే చోరత్వానికి పాల్పడి ఉంటారని, మరెవ్వరికీ ఆ అవకాశం లేదని ముక్తకంఠంతో బదులిచ్చారు. వైష్ఠవులపై నేరారోపణను మహారాజు సహించలేక పోయాడు. కానీ విశ్వాసపాత్రులైన మంత్రులందరూ ఒక్కుమ్మడిగా శ్రీవైష్ణవులపై నేరం మోపడంతో నిస్సహాయుడయ్యాడు. ఏది ఏమైనా సరే శ్రీవైష్ణవులను నిర్దోషులుగా నిరూపించ దలచుకున్నాడు.



 *నిగ్గు తేల్చిన నాగరాజు* 


 కులశేఖరుడు శ్రీహరిపై భారం వేసి, బుసలు కొట్టే కాలసర్పాన్ని సభామందిరానికి తెప్పించాడు. ఆ నాగరాజును తన రెండు హస్తాలతో ఒదిమి పట్టుకొని, శ్రీవైష్ణవులు నిర్దోషులైతే తనను కరవ వద్దని సర్పాన్ని ఆదేశించాడు. అంతే! ఆ కోడెత్రాచు, తన సహజ ప్రవృత్తికి భిన్నంగా కాటు వేయడానికి బదులుగా, తన పడగతో కులశేఖరుణ్ణి ఆశీర్వదించి, మంత్రివర్గ సభ్యుల సమక్షంలోనే సభాగృహం నుండి చరచరా నిష్క్రమించింది. దాంతో మహారాజుకు శ్రీవైష్ణవులపై విశ్వాసం మరింతగా పెరిగిపోయింది. ఆగ్రహోదగ్రుడైన మహారాజు హెచ్చరించడంతో, మంత్రులు అసలు విషయాన్ని విన్నవించు కున్నారు.



 *శ్రీరంగం ప్రయాణం* 


 రాజ్యక్షేమం, ప్రజాక్షేమం కోరి మంత్రులు పన్నిన పన్నాగాన్ని రాజుగారు క్షమించారు కానీ కుట్రలు, కుతంత్రాలతో నిండిన రాజ్యపాలనా భారాన్ని శాశ్వతంగా వదులుకోదలచి, తన కుమారుడైన 'రెండవ దృఢవ్రతుణ్ణి' రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. వెనువెంటనే, అతికొద్ది పరివారంతో శ్రీరంగం చేరుకుని, తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు.



 *కులశేఖరుని ఆకాంక్ష* 


 అప్పటి నుండే వారి సాహిత్యసాధన మొదలైంది. వీరు తమ పాశురాల్లో స్వామిపుష్కరిణిలో హంసగానైనా జన్మించాలని; ఇంద్రలోకంలో రంభాది అప్సరసల సరసన ఉండే సుఖం కంటే, భూమండలాన్ని ఏలే చక్రవర్తిత్వం కంటే, స్వామిసన్నిధే శ్రేయోదాయకమని; వేంకటాచల క్షేత్రంలో చంపకవృక్షంగా నైనా జన్మించాలని; మత్తగజాలను అధిరోహించే రాచరికపు జన్మ కంటే తిరుమల క్షేత్రంలో పూపొదగా జన్మించడమే ఇష్టపడతానని తెలియపరిచాడు.

మరుక్షణమే మనసు మార్చుకుని తిరుమలలో పక్షిగా జన్మిస్తే, కొంత కాలానికి మనసు మారి ఎగిరిపోయే ఆలోచన రావచ్చని; చెట్టుగా పుడితే కొన్నేళ్ళ తరువాత తనను వంట చెరకుగా వాడుకుంటారని; పుష్కరిణిలో చేపగా పుడితే పక్షులకు ఆహారమవుతానని; అలా కొంతకాలానికి స్వామివారికి దూరమవుతానని; వీటన్నింటి కంటే, స్వామివారి ఎదుట బండశిలలా పడివుంటే అనుక్షణము వారి ముగ్ధమనోహర రూపాన్ని గాంచుతూ ఉండవచ్చని; స్వామివారి నుండి విరహమేర్పడదని అభిలషించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము* *సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*


387 వ రోజు

* వనకులసహదేవులు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి ఒక్కుమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టారు. మరొక పక్క భీమసేనుడు కౌరవసేనలను నిర్ధాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. అతడి వీరవిహారానికి మారణహోమానికి భయపడి కౌరవయోధులు అతడి ఎదుటకు రావడానికి సాహసించ లేకపోతున్నారు. అర్జునుడు సంశక్తులను సంహరించి మిగిలిన త్రిగర్త సైనికులను తరుముతున్నాడు. త్రిగర్త సైనిలుకు అర్జునుడి ధాటికి పారిపోయారు. అర్జునుడు కర్ణుడి వైపు రథము తోలమన్నాడు. అది చూసిన సుయోధనుడు త్రిగర్త సైనికులను యుద్ధోన్ముఖులను చేసి అర్జునుడితో యుద్ధానికి పంపాడు. కాంభోజసైనికులను తోడు చేసుకుని త్రిగర్తులు అర్జునుడిని ఎదుర్కొని చుట్టుముట్టారు. అర్జునుడు కాంబోజసేనలతో సహా త్రిగర్తల తలలను నరికాడు. రణభూమి అంతా వారి మొండెములతో నిండింది. తనను ఎదుర్కొన్న కాంభోజరాజు సోదరుడిని అర్జునుడు ఒకే బాణంతో అతడి చేతులు నరికాడు. అది చూసి అర్జునుడిని చుట్టుముట్టిన యవనసేనలు అతడి చేతిలో హతమయ్యాయి.


*అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొనుట*


శ్రీకృష్ణుడి రథ సారథ్యంలో అంతటాతానే అయి యుద్ధము చేస్తున్న అర్జునుడిని అశ్వత్థామ ఎదుర్కొని " అర్జునా ! నువ్వు నాతో యుద్ధము చేయుట లేదు నన్ను నీ అతిధిగా స్వీకరించి యుద్ధమును ఆతిధ్యముగా ఇవ్వు " అన్నాడు. అర్జునుడు కృష్ణుడి వంక చూసాడు. కృష్ణుడు అర్జునుడితో " అశ్వత్థామా ! అర్జునుడితో తనివి తీరా యుద్ధము చేసి సుయోధనుడి రుణం తీర్చుకో " అన్నాడు. వెంటనే అశ్వత్థామ కృష్ణుడి మీద అరవై బాణములు వేసి అర్జునుడి మీద మూడు బాణములు వేసాడు. అర్జునుడు అశ్వత్థామ ధనస్సు విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని అర్జునుడి శరీరం అంతా శరములు నాటి కృషార్జునులను రథంతో సహా బాణవర్షంలో ముంచాడు. కృష్ణార్జునులకు ఏమైందో తెలియక సైనికులు హాహాకారాలు చేసారు. కృష్ణుడు అర్జునుడి వంక చూసి " అర్జునా ! ఇదేమి వింత అశ్వత్థామ నిన్ను గెలువడమా ! నీ పరాక్రమం నశించిందా ! నీలో అధైర్యం ప్రవేశించిందా ! నీ గాండీవం బలం నశించిందా ! లేక గురుపుత్రుడని జాలి చూపుతున్నావా ! " అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకు రోషం తెచ్చుకుని అర్జునుడు కోపంతో అశ్వత్థామ విల్లు విరిచి, కేతనము విరిచాడు. అశ్వత్థామ వెంటనే ఒక బల్లెము తీసుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. ఇది చూసిన సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని అందరిని క్షణకాలంలో చంపాడు. వారి రథము విరిచి, గజములను అశ్వములను చంపాడు. సంశక్తులకు తోడుగా అంగ, వంగ, కళింగ, నిషాద దేశ సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. ఇంతలో అశ్వత్థామ మరొక విల్లు రథము సమకూర్చుకుని అర్జునుడిని ఎదుర్కొని కృష్ణార్జునుల మీద అత్యంత క్రూరశరములు ప్రయోగించాడు. అర్జునుడు అశ్వత్థామ శిరము మీద, కంఠము మీద, చేతుల మీద, గుండెల మీద పాదముల మీద శరప్రయోగము చేసాడు. అశ్వత్థామ రథాశ్వముల పగ్గములు ఖండించాడు. రథాశ్వములు అదుపు తప్పి రథమును ఎటో తీసుకు వెళ్ళాయి. అశ్వత్థామ తన రథమును అదుపు చేసుకుంటూ కర్ణుడి వైపు వెళ్ళాడు. అర్జునుడు మిగిలిన సంశక్తుల గర్వము అణచడానికి వెళ్ళాడు. ఇంతలో మగధరాజు దండధారుడు గజమును ఎక్కి పాండవ సైన్యంలో జొరబడి సైన్యమును నాశనం చేయసాగాడు. కృష్ణుడు " అర్జునా ! ముందు వాడి పని పట్టు " అని రథమును దండధారుని వైపు పోనిచ్చాడు. దండధారుడు కూడా అర్జునుడి ఎదురుగా గజమును ఎక్కి నిలిచి వారిపై పదునైన బాణము ప్రయోగించి కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు. అర్జునుడు ఒకే బాణంతో దండ ధారుని చేతులు రెండు నరికి మరొక బాణంతో అతడి గజమును వధించి అతడి సైన్యములను చెల్లాచెదురు చేసాడు.


 రోజు*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*