12, మార్చి 2025, బుధవారం

తంగేడు చెట్టు ఉపయోగాలు -

 తంగేడు చెట్టు ఉపయోగాలు  - 


 *  ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి పదార్థం పొవడం తగ్గుతుంది . 


 *  5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు  తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .


 *  తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.


 *  తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును. 


 *  తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .


 *  తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును. 


 *  రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .


 *  తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.


 * తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి. 


 *  తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.


 *  మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.


 *  తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను. 


 *  తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను . 


 *   తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును . 


.     మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు .


                 కాళహస్తి వేంకటేశ్వరరావు  


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                        9885030034

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 


తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 


దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  


సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 


తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 


తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 


తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 


చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.


ఓం తత్సత్ 


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

ముందు జాగ్రత్త

 

ముందు జాగ్రత్త

సామజంలో మనం రోజు ముందు జాగ్రత్త పరులను అనేకులను చూస్తూ ఉంటాంనిజానికి నీవు నేను కూడా ముందు జాగ్రత్త పరులమే అవునా కాదాఒక విద్యార్థి సెలవుల తర్వాత పాఠశాల/కళాశాల తెరవగానే పరీక్షలకు చదవడం మొదలు పెడతారు ఎందుకు అంటే ఇప్పటినుంచి చదివితే కానీ నేను పూర్తి సిలబస్ సంపూర్ణంగా చదివి అర్ధం చేసుకోగలను. మొత్తం పాఠాలు నాకు క్షుణ్ణంగా వచ్చి ఉంటే ప్రశ్న పరీక్ష లో అడిగిన నేను సమాధానం చేయగలను అంటారు

ఒక గృహస్తు పంట రాగానే కొత్త బియ్యాన్ని ఒక యేటికి సరిపడా ఎక్కువ మొత్తంలో అంటే రెండు లేక మూడు క్వింటాళ్ల బియ్యం, ఒక 50 కిలోల కందిపప్పు  కొనుక్కొని ఉంటారు ఎందుకయ్యా ఇలా కొన్నావు అంటే ఏం చేద్దాం సమయం ఎలావుంటుందో ఇంట్లో బియ్యం పప్పు ఉంటే చాలు ఏమున్నా లేకున్నా రోజులు గడిపేయవచ్చు అంటాడునీకు తెలుసా మొన్న కరోనా సమయంలో నా అలవాటే నన్ను కాపాడింది ఇంట్లో నుంచి కాలు బైట పెట్టకుండా మొత్తం కరోనా కష్టకాలాన్ని అవలీలగా ఎదుర్కున్నాను అని అంటాడు మాట అన్నప్పుడు అతని ముఖంలో ఆత్మవిస్వాసం  స్పష్టంగా గోచరిస్తుంది

ఒక వ్యవసాయదారుడు ఇంకా వర్షాకాలం రాకముందే భూమి దున్నుకొని పంట గింజలు నాటడానికి సిద్ధం చేసుకుంటారుఎందుకయ్యా ఇలా చేసావు అంటే వర్షం పడినప్పుడు దున్నడం అంటే కుదరని పని అదే ముందు భూమి దున్నుకొని ఉంచుకుంటే వర్షం పడగానే గింజలు చల్లవచ్చు అని అంటారు.

వేసవిలో కరెంట్ కోత ప్రతి వారు అనుభవించేదే అదే ముందు జాగ్రత్త పరుడు ఒక ఇన్వర్టర్ కొనుక్కొని వుంచుకుంటారు ఎందుకు అయ్యా ఇప్పుడు కరెంటు పోవడం లేదు అని అంటే ఎవరికి తెలుసు రేపు వేసవిలో కరెంట్ పోదని ముందుగా  ఇన్వర్టర్ కొనుక్కొని ఉంటే రేపు కరెంటు పోతే అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అని అంటారు

తన కూతురు ఎదుగుతుంటే ఒక తల్లిదండ్రులు ముందు పెండ్లికి కావలసిన ద్రవ్యన్ని   సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మంచి వరుడి కోసం అందరికీ చెప్పి ప్రయత్నం మొదలుపెడతారు. ఎందుకు అంటే ముందు ఒక మంచి సంబంధం చూసుకొని ఉంటే తమ కుమార్తె జీవితం సుఖమయంగా సాగుతుందని చెపుతారు

 

రేపు ఏదైనా ఉరుకు ప్రయాణం అయి పోవాలంటే ముందుగా రైలు లేక బస్సు టికెట్ రిజర్వ్ చేసుకొని ఒక రోజు ముందు తను తీసుకుని పోవలసిన సామాన్లన్నీ ఒక బ్యాగ్ లో, సూట్కేసులో సర్దుకొని సిద్ధంగా ఉంటారు. రైలు తెల్లవారుజామున 6 గంటలకు అయితే 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక అరగంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్లి ఉంటారు. ఇదంతా ముందు జాగ్రత్త కదా.  

 ఇలా  వ్రాసుకుంటూ పోతే అనేకానేక విషయాలు మనకు నిత్యజీవితంలో బోధపడుతూవుంటాయి. నిజానికి ముందు జాగ్రత్త అనేది ఒక సమర్థవంతమైన మనిషి చేయాల్సిన పనే అదే ముందు జాగ్రత్త లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఒక విజయవంతమైన జీవితం గడుపుతున్న వాడు తన జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుతూ ముందు జాగ్రత్తలతో వుండి అనేక విజయాలను పొందగలుగుతారు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి మనిషి ముందు జాగ్రత్త కలిగి ఉండాలి అని. పరిస్థితి రకంగా వస్తుందో ముందుగా ఊహించి తదనుగుణంగా ముందు జాగ్రత్త పడటం అవసరం.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే మానవుడు ఒక్క విషయం తెలిసి కూడా జాగ్రత్త పడడు ఎందుకోగానీ విషయం మీద ఎంతో అజాగ్రత్తగా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఏమిటి విషయం, ఏమిటి అజాగ్రత్త అంటే ఇంకా ఏమిటండి ప్రతి మనిషి ఆఖరు గమ్యం అంటే అర్థం కాలేదా అదే మరణంప్రతి మనిషి తన జీవిత అంతిమ ప్రయాణం మరణం అని తెలుసు అయినా దానికి సంబంధించిన ముందు జాగ్రత్త మాత్రం పడడుతాత్కాలికంగా ఒకరోజు లేక్ ఒక వారమో వెళ్లే ప్రయాణికులు వారం రోజులనుండి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ శాశ్వితమైన  ప్రయాణానికి మాత్రం ఏమాత్రం ముందు జాగ్రత్త పడకుండా పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ వుంటారు.

 

సాధక మిత్రమా భగవంతుడు మనకు ఇచ్చిన అపూర్వ అవకాశమే రోజు మనం పొందిన ఈ మానవ జన్మ జన్మను మనం సార్ధకం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయకపోతే మరల మనకు మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో ఏదైనా ఒక జీవిగా మళ్ళీ పుట్ట వచ్చు  జన్మలన్ని అజ్ఞాన జీవనాన్ని గడిపేవి మాత్రమే. బుద్ధి జీవి గా వున్న మానవ జన్మ ఒక్కటే నీకు మోక్షసాధనకు పనికి వచ్చే జన్మ జన్మను మనం వృధా చేసుకుంటే మోక్ష సిద్ది పొందటం దుర్లభం.

తెలివయిన వారు ఎప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటాడునీవు కూడా తెలివైన వాడిగా ప్రవర్తించు మానవ జన్మ ఉండగా జన్మ లక్ష్యం అయిన మోక్షాన్ని పొందుఇప్పటినుండి ప్రారంభిస్తే తప్పకుండా మనకు మోక్ష సిద్ధి కలుగుతుందిఅధవా కలగక పోయిన దైవానుగ్రహం వలన మరల మానవుడిగా నయినా జన్మించవచ్చు. కృష్ణ భగవానులు గీతలో స్పష్టంగా చెప్పారు యోగ భ్రష్టుడు తిరిగి తర్వాత జన్మలో తానూ జన్మలో ఎక్కడ సాధన నిలిపివేసారో అక్కడినుంచి మొదలుపెట్టి తన గమ్యాన్ని చేరుకుంటారని. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీ సాధనను ప్రారంభించుమోక్షాన్ని సిద్దించుకో.

ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇల్టు

మీ భార్గవ శర్మ