భారతదేశాన్ని జంబూ ద్వీపం అని ఎందుకు అంటారు?
జంబో ద్వీపం అని మనం రోజూ చెప్పుకొనె సంకల్పం లొ వస్తుంది. దీని గురించి తెలుసుకోవలంటె కొంత ఖగోళ శాస్త్రం గురించి తెలియాలి కొంచం వివరంగా చెప్పాలి.
ఏకకాలం లొ ముల్లోకాలలొ నివసిస్తాం.
మొదటిది చరలోకం.
మనం భూమి పై ఉన్నాం. భూమి తనలో తాను తిరుగుతోంది. దరి దాపు గంటకు 1500 KM వేగంతొ భూమి తిరుగుతొంది. తనలో తాను భ్రమణం కాలనికి ఒక రోజు అని పేరు.ఇది మనకందరికి తెలిసిందే.
ఇదే కాకుండా భూమి సుర్యుని చుట్టూ తిరుగుతొంది. ఈవేగం దరిదాపు సెకెనుకు 30 KM, గంటకు 1,07,000 KM. భూపరిభ్రమణ కాలానికి సంవత్సరం అని పేరు. ఇది కూడా మనకు తెలుసు.
మరి సూర్యుడు కల్పకేంద్రకం (Center of Galaxy) చుట్టు ప్రదక్షణ చెస్తాడు. దాని వేగం దరిదాపు సెకెనుకు 230 KM అంటె గంటకు 8,28,000. మొగుడుతొ పాటు పెళ్ళాం పిల్లలు వెళ్ళినట్లుగా, సుర్యుడితో పాటు భూమి తొ సహా మిగతా గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ ప్రయాణిస్త్తాయి. తప్పదుగా మరి. ఈ పరిభ్రమణానికి పట్టేకాలన్ని ఒక యుగం అంటారు. ఇది కొంచం మనకు తెలుసు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం అంటారు. ఇది మనందరకూ తెలుసు.
ఇలా ఉంటె ఈ కల్పకం(Galaxy) మొత్తం విశ్వకెంద్రకం (Center of Universe) చుట్టు తిరుగుతోంది. దాని వేగం సెకెనుకు 200 KM అంతె దరిదాపు గంటకు దరిదాపు 7,50,000 KM. ఈ వేగంతొ ఒక అస్తిర కక్ష్య లొ ప్రయాణిస్తూ ఉంటుంది. ఈకల్పక పరిభ్రమణానికి పట్టే సమయాని మన్వంతరం అంటారు. (దీనికి మనువుకు, మనుచరిత్రకి ఎలాంటి సంబంధం లేదు) ఇది కొంతమందికి తెలుసు.ప్రస్తుత మన్వంతరానికి వైవశ్వత మన్వంతరం అని పెరు. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది.
ఇదే కాకుండా విశ్వ కేంద్రకం వ్యాకొచిస్తునాది దీనివలన విశ్వం మొత్తం పెరుగుతోంది. దీనిని బ్రహ్మణము అని అంటారు. దీని రమారమి వ్యాకొచవేగం సెకెనుకు 72 KM, దీనివలన మన్వంతరానికి మన్వంతరానికి పరిభ్రమణ కాలం పెరుగుతుంది. యుగానికి యుగానికికాలం కూడా పెరుగుతుంది.
అంటె ఈ విశ్వంలొ ఒకసారి మనం ఉన్న చోటుకి మరొ సారి వచ్చే ప్రసక్తే లేదు.
ఇంక రెండవ లొకం
దీనికి కాల లొకం అంటారు. ఇది విశ్వ వ్యాకొచం వలన ఏర్పడుతుంది. దీనికి ముందుకు పోవడమే తప్ప వెనుకకు మరలడం లేదు. దీని గురించి మనకందరకు తెలుసు. కాల రహస్యం గురించి మరో సారి వివరంగా చర్చించుకుందాం.
మూడవది మాయాలోకం.
ప్రస్తుతం మన నివశించే లోకం. భూమి ఇంత చండ ప్రచండ వేగాలతొ వివిధ దిశలలొ దూసుకు పోతున్నా మనకు తెలీదు. దివా రాత్రులు, సుర్యోదయాలు, చంద్రకళలు రొజూ వచ్చె నక్షత్రలు మనచుట్టు నే ఉంటాయి. అసలు భూమి కదులుతున్న అనుభవం మనకి రాదు.
మన జాగింగ్ వేగమే మనవెగం. పట్టు బడకుండా కారు నడిపే వేగమే మనవేగం. దీనిని మిధ్యా లొకం అంటారు.
దీనిగురించి మనం రొజు చెప్పుకొనె పూజ సంకల్పం లొ చక్కగా చెప్పబడింది.
మహవిష్ణో రాజ్జాయ – శ్రీ మహా విష్ణురాజ్యం అంటె ఈ విశ్వంలొ
ప్రవర్తమానస్య – ప్రవర్త – నిరంతర చలించే మానస్య – లెక్కల పట్టికలో
ఆద్య బ్రహ్మణః – ఈ రోజు వ్యాకోచించె విశ్వంలొ
దితీయ పరార్ధే – రెండవ పరార్ధమైన. మొడటి పరార్ధంలొ ఈ విశ్వం కేవలం స్తలకాల శక్తులతో నిండి ఉండెది, ఈ గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రాహలు తరువాత పునఃసృష్టిలొ ఏర్పడ్డాయి
శ్వేత వరహ్హ కల్పే – మన Milky way Galaxy సంస్కృతం లొ పేరు.
వైవస్వత మన్వంతరే – మన కల్పక ప్రస్తుత ప్రరి భ్రమణం పేరు.
కలియుగే ప్రధమ పాదే – మన సుర్య కుటుంబం ప్రస్తుత ప్రరిభ్రమణం పేరు. ఇంకా మనం first quarter లొనే ఉన్నాం
జంబో ద్వీపే – నేరేడు పండు ఆకారం లొ ఉండె భూమిలో
భరత వర్షే – భరతుడు పాలించిన రాజ్యంలొ
భరత ఖండే – హిమలయాలకి కన్యాకుమారికిమధ్య ఉన్న భాగానికి
కావేరి క్రిష్ణా మధ్య భాగే – కావేరీ క్రిష్ణా నదుల మధ్యలో – మాచెన్నైకి.
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన– ఈరోజు మన వ్యవహారం లొ ఉన్న చంద్ర మానం ప్రకారం తరువాత సంవత్సరం ఋతువు నెల పక్షం తిధి వస్తాయి.
ఇవి కూడా మనం భూ కక్ష్యలొ ఎక్కడ కచ్చితం గా ఉన్నామో తెలియజేస్తాయి. ఇంకా కరణీ యోగం కూడా చెప్పగలిస్తే, దరిదాపు భూ భ్రమణ కక్ష్యలో 500/600 కిలొమీటర్ల మధ్య, భుమి పరిభ్రమణంలొ ఎంతం కొణం లొ ఉన్నామో నిశ్చయంగా చెప్పగలుగుతాం.
చూసారా రోజు మనం చెప్పుకోనె సంకల్పం లో చాలా సులభం గా ఖగొళ శాస్త్రాలు మేళవించి మన స్తల కాలాల్ని నిర్ణయించి చెప్పేరో.
ప్రస్తుతం ఉన్న దృక్సిద్ధాంత చంద్రమాన పంచాంగాన్ని వరహామిహురుడు రాసాడు. ఆయనెమీ ఖగోళ శాస్త్రాన్ని రాయలేదు. అభిజిత్ నక్షత్రం ఏష్యమైన తరువాత వచ్చిన పరిస్తితుల ననుసరించి తిరిగి వేదాలలో ఉన్న ఖగొళ శాస్త్రాన్ననుసరించి పంచాంగ నిర్ణయంచేసాడు.
ఆయన విక్రమార్కుని ఆస్తాన పండితుడు. అందుకె ప్రస్తుత శకాన్ని విక్రమార్క శకం అంటారు. వరహామిహురుని శిష్యుడే ఆర్య భట్టు.