మానవ ధర్మ చంద్రిక -
* ఆవునేతి దీపారాధన జ్ఞానసిద్ధి. నువ్వులనూనె దీపారాధన సంపద వృద్ది. కీర్తి.
* ధర్మ మార్గమున సంపాదించిన ధనం ఇచ్చి కొన్న పూలతో దేవ పూజ చేసిన తన పూర్వులను, ఏడు తరాల వారిని తరింపచేయును.
* తులసి దళాలు సుర్యాస్తమయం తరువాత కోయరాదు.
* చాతుర్మాస వ్రతం - ఆషాడ శుద్ద ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి వరకు జరుగునని నిర్ణయ సింధు తెలియచేస్తుంది. ఆ కాలం నందు తులసి మొక్క పెట్టరాదు.
* ఇంట్లో పూజించు విగ్రహాలు 2 లేక 3 అంగుళాల ఎత్తు ఉండవచ్చు.
* ధర్భాసనం గాని , వేడి చర్మం గాని , నూతన వస్త్రం గాని వేసుకొని కుర్చుండాలి . కుశాసనము - పౌష్టికం. కంబలాసనం - దుఃఖ విమోచనం. ఎర్రని ఆసనం - వశ్యధికమ్ . చిత్రాసనము - సర్వార్ధములు .
తెల్లని ఆసనములు - శాంతి. కృష్ణ జిననము - జ్ఞాన సిద్ది. పులి చర్మము - మోక్ష సిద్ది. ఏ ఆసనము లేకున్నను ఒక దర్భ నయినా వేసుకొని కూర్చుండ వలెను.
* పచ్చటి పట్టుబట్ట ( పీతాంబరం ) పూజకు శుభం. తెల్లని పట్టుబట్ట శుభప్రదము. రంగులవి. బొమ్మలవి మానసిక చాంచల్యం. అంచుగలవి ధరించాలి. నారపట్టు చాలా మంచిది. ఉత్తమమైన విధావలి దీనికి ఎలాంటి దోషాలు లేవు .
* తమలపాకులు 5,7,10,12 మంచివి. ఒక వక్క తాంబూలంలో పెట్టిన ఆరొగ్యం, 3 వక్కలు శ్రేష్టం .
* నందికి ఏ పక్కనుండి వెళతారో, ఆ పక్కనుండే వెనకకు రావలెను. శివలింగం, నందికి మద్య నుండి రాకుడదు. అలా వచ్చినచో పూర్వ జన్మలో పుణ్యం కుడా పొతుంది.
* శివాలయంలో ప్రదిక్షణలు చేసే విధానం -
చండీ స్వరుడు ఉన్న చోటును అనగా
( చండీ స్వరుడు లేకున్నను ) శివాబిషేక జలం బయటకు వచ్చు సోమసుత్రం నుండి ప్రారంబించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్థంభము నుండి తిరిగి ప్రదిక్షనముగా సోమసుత్రం వద్దకు , 2.అక్కడనుండి వెనకకు తిరిగి ద్వజస్థంభం వద్దకు. 3. ద్వజస్థంభం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు. 4. తిరిగి వెనుకకు ధ్వజం వద్దకు, 5. ద్వజం నుండి ముందుకు సోమాసుత్రం వద్దకు 6. తిరిగి సోమసుత్రం నుండి వెనకకు ద్వజం వద్దకు 7. ద్వజం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు ,8. సోమసుత్రం నుండి ద్వజం వద్దకు 9. అక్కడనుండి శివాలయంలో ద్వజం ఎడమపక్కనుండి వెళ్లాలి . దీనినే చండ ప్రదిక్షణ అంటారు. ఇలా ఒకసారి చేస్తే శివునికి 30 వేల ప్రదిక్షణలు చేసిన పుణ్యము.
* మొదట నందీశ్వరుని అనుమతితో శివున్ని దర్శించుకోవాలి. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి వెనక బాగమున కుడి చేయి ఉంచి " ఓం హర హర శివ శివ " యంటూ శివుని దర్శించి ఆలయంలో ప్రవేశించాలి.
* రుద్రాక్ష దారణ వలన పునర్జన్మ ఉండదు. ఆరొగ్యం కలుగును. రుద్రాక్ష ముఖము నందు రుద్రుడు , పుచ్ఛము నందు విష్ణువు అధి దైవతములు , ఏకాదశ ముఖములు గల రుద్రాక్ష ఏక ముఖముతో సమానము .
* విబుతి దారణ వలన మానసిక ప్రశాంతత , ధైర్యము, ఆరోగ్యము, గ్రహపీడ, అకాల మరణములకు రక్షణ, రుద్రత్వం లబిస్తుంది.
* రుద్రునికి అబిషేక ద్రవ్యములు -
ఆవుపాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యములు , ఆవు పెరుగుతో ఆరొగ్యం, సర్వసౌఖ్యములు, ఆవు నెయ్యితో ఐశ్వర్య వృద్ది, పంచదారతో దుఖ నాశనం,తేనెతో తెజోవ్రుద్ది, భస్మ జలంతో మహాపాపహరం, గందోధకంతో పుత్రలాభం, పుష్పోధకంతో భులాభం, బిల్వజలంతో బోగాబాగ్యాలు, దుర్వోధకం ( పారే నీరు ) తొ నష్టశ్రవ్య ప్రాప్తి, నువ్వులనూనెతో అపంరుత్యుహారం రుద్రాక్షోధకంతో మహావైశ్వర్యమ్, సువర్ణ జలంతో ధరిద్రనాశనం , అన్నంతో రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి, ఆయుర్వృద్ధి, సుఖజీవనం, ద్రాక్షరసంతో సకల కార్యసిద్ది, ఖర్జురఫలంతో శత్రువులకు హాని , కస్తూరి జలంతో చక్రవర్తిత్వం, నవరత్నజలంతో ధాన్యం , గృహం, గోప్రాప్తి, మామిడిపండ్ల రసంతో ధీర్గవ్యాధి నాశనం, పసుపునీళ్ళతో మంగళ ప్రధం . ఆయాద్రవ్యములతో శివుని అభిషేకించిన ఆయాఫలములు లభించును.
* విభూతితో శివుని అభిషేకించిన అష్టైశ్వర్యములు కలుగును.
* నల్లనువ్వులచే అర్చించిన శివుడు శత్రు నాశనం కలగచేయును .
* శ్వేత ( తెలుపు ) అక్షతలతో శివుని అర్చించిన మోక్షప్రాప్తి - శివపాదోధకం తాగిన మోక్షము కలుగును.
* దేవుడు ఊరేగింపుకు వచ్చినపుడు , పెద్దలు ను నడిపించుకు వస్తున్నప్పుడు స్వాగతం చెప్పుటకు ప్రతి ఇంటి ముందర బిందెడు నీళ్లు నిలువుగా పొయాలి.
* ప్రతి గురువారం ఉదయం పాలు, నీళ్లు కలిపి తులసి చెట్టుకి పొస్తే లక్ష్మి నిలయం.
* గురువారం రావి చెట్టుకి సాయంత్రం పాలు , నీళ్లు కలిపి పొస్తే కార్యసిద్ధి.
* వరాన్వేషణకు మృగశిర నక్షత్రం మంచిది.
* శ్రీ శివాబిషేకం చేసిన నీళ్లు పోను గొట్టము నుండి బయటకు వచ్చిన తీర్థం మనము తాకి నెత్తిన చల్లుకోరాదు. అది చండీ స్వరునికి మాత్రమే అర్హత.
* యాగంటి బసవన్న దర్శనం - శని భాధ నివారణం.
* చైత్రమాసంలో సర్వ దేవతలకు " ధవనంతో " పూజ మంచిది అని ధర్మ సింధు చెప్తుంది.
* స్త్రీలు ఎల్లవేళలా పాపిట సింధూరం ధరించడం వలన అక్షయ సౌబాగ్యం కలుగుతుంది.
* మధురలో జననం వలన, శ్రీకాళహస్తి లొ అర్చన వలన , శ్రీశైలం లొ శిఖరదర్శనం వలన , కాశిలో మరణం వలన, అరుణాచలం లొ స్మరణ వలన వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా మోక్షర్హత పొందుతారు. మంచి బుద్ధితో సన్మార్గాన్ని పొందండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి.
* ఉత్తర దిక్కుకి ప్రయాణం చేస్తున్నప్పుడు
" ఓం ఖడ్గీ నమః " అను నామస్మరణతో సాగండి. అరిష్టాలు తోలుగుటకు
" ఓం నమో నారాయణాయా నమః " అను మంత్రము జపించండి.
* అప్పు పుచ్చుకొనుట - అప్పు ఇచ్చుట . బుదవారం చేయరాదు . మంగళవారం సంక్రమణ దినం. హస్తా నక్షత్రం రోజున అప్పులిచ్చుట వలన తిరిగి రావడం చాలా కష్టం. ఆ రొజులలొ అప్పు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం .
* జీవితం తొ కాలమే అదృష్టాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలకు అదే మూలం . జీవితం లొ నిత్య వసంతుడే కాలం.
* పాలు కారే చెట్లు, ముండ్ల చెట్లు, చింత, మునగ,కుంకుడు మొదలగునవి చెట్లు ఇంట్లో ఉండకూడదు .
* బియ్యం లేక గొధుమ నూకలు ప్రతి మంగళవారం గుప్పెడు పెరటిలో చల్లి భూతదయ చూపిన ధాన్యలక్ష్మి అనుగ్రహం కలుగును.
* విష్ణు సహస్రనామం ప్రతిధ్వనించిన చోటు దుష్ట శక్తులకు అది నిర్మూలనము.
* ఆయా నక్షత్రాల వారు ఇంటి ఆవరణలో గాని , రోడ్డు పైన గాని వృక్షము నాటి పోషిస్తే చాలా మంచిది.
అశ్వని - జీడి మామిడి.
భరణి - దేవదారు .
కృత్తిక - మేడి చెట్టు.
రోహిణి - నేరేడు .
మృగశిర - మారేడు .
ఆర్ద్ర - చింత చెట్టు.
పునర్వసు - గన్నేరు .
పుష్యమి - పిప్పిలి ( రావి చెట్టు ).
ఆశ్లేష - భోప్పాయి.
మాఘ - మర్రి.
పుబ్బ - మొదుగ .
ఉత్తర - జువ్వి .
హస్త - కుంకుడు.
చిత్త - తాడి చెట్టు.
స్వాతి - మద్ది.
విశాఖ - మొగలి.
అనురాధ - పొగడ.
జైష్ట - కొబ్బరి.
మూల - వేగిస .
పూర్వా షా డ - నిమ్మ .
ఉత్తరాషాడ - పనస.
శ్రవణం - జిల్లెడు.
ధనిష్ట - జమ్మి
శతబిషం - అరటి.
పుర్వాబాద్రా - మామిడి.
ఉత్తరాబాద్రా - వేప .
రేవతి - విప్పచెట్టు.
* శివుణ్ణి గరికతో పూజిస్తే ఆయుషు , ఉమ్మెత్త పులతో పుజ చేస్తే సంతానం. అవిసె పూలతో పూజ చేస్తే కీర్తి. తులసి దళాలతో పూజిస్తే భుక్తి, ముక్తి . జిల్లెడు పూలతో పూజిస్తే శత్రుజయం. కరవీర
( గన్నేరు ) పూలతో పూజిస్తే రోగాశాంతి, మంకెన. పూలతో పూజిస్తే అలంకారములు జాజిపులతో పూజిస్తే వాహనలాభం కలుగుతాయి.
* విష్ణువును అవిసె పూలతో పూజిస్తే పదివేల యజ్ఞఫలం . కదంభ పూలతో పూజిస్తే స్వర్గసుఖం.
* గణపతిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది . గరికతో పూజిస్తే అన్ని కష్టములు తీరును
* సర్వ వాస్తు దోషాలకు తెల్ల జిల్లెడు వినాయకుని పూజా మందిరం లొ ఉంచాలి.
* సిద్ది యొగములు :
మంగళవారం తదియ, త్రయోదశి బుధువారం విదియ, సప్తమి : గురువారం పంచమి, దశమి : శుక్రువారం పాడ్యమి, ఏకాదశి కార్యనుకులత, విశేష ఫలప్రధయకత.
* ముఖ్యంగా ప్రయాణానికి పనికి రానివి.:
విదియ మంగళవారం , సప్తమి సొమవారం, చవితి ఆదివారం, పంచమి గురువారం, తదియ శుక్రవారం షష్టి శనివారం.
* బూడిద గుమ్మడికాయ మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల ద్రుష్టిదోషాలు పొతాయి.
* మారేడు చెట్టుకి తొమ్మిది సార్లు ప్రదిక్షణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది.
* తొమ్మిది గురువారములు సుర్యొదయం కాగానే శివ దర్శనం చేసుకుంటే గ్రహాల బాధలు తోలుగుతాయి.
* ఇంట్లో పెళ్లి కి వచ్చిన అమ్మాయి ఉంటే ఆమెకి అనుకూలమైన వరుడు లభించుటకు తరచు లక్ష్మి దేవి పూజ చేయాలి . శ్రీ మహాలక్ష్మి స్తోత్రమే ,
శ్రీ సుక్తం పటించాలి .
* శనివారం నాడు ఆంజనేయ స్వామిని 108 తమలపాకులతో సేవిస్తే న్యాయ సమ్మతమైన కొరికలు నెరవేరును.
. * గురు, శుక్ర వారాలలో చేతి , కాలి గోళ్లు తీయరాదు. ఆ రెండు రోజులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి.
* శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేసి , తొమ్మిది కొబ్బరిబొండాలు సమర్పిస్తే త్వరలో ఋణ విముక్తులు అవుతారు.
* ధన విషయం లొ సంపత్తార, ప్రయాణికులకు క్షేమతార, కార్యజయానికి సాధనతార, వివాహానికి మిత్రతార. వైద్య విషయానికి పరమ మిత్రతార లు మంచివి. శుభప్రదం.
* గృహప్రవేశ సమయంలో గాని , గృహ ప్రవేశం అయిన 27 రోజులలోపు గాని శ్రీ సూక్త పారయణం
విష్ణు సహస్రనామ పారయణం తప్పనిసరిగా చేయాలి . అప్పుడా ఇల్లు దేవతానిలయం అవుతుంది.
* కుజదోష నివారణకు , నొప్పులకు, సంతతికి , అన్యోన్యతకు శ్రీ సుబ్రమణ్య స్వరుని ఆరాధన చేయాలి .
* దేవుని పూజకు ఏ గదిలో వీలైతే ఆ గదిలో ఈశాన్య తూర్పు దిశ లేక ఉత్తర దిశలొ అమర్చుకోవాలి.
* పిత్రు కార్యముల రోజు కుంకుడు కాయలతో తల స్నానం చేయ రాదు.
.మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
.
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034