*“చంద్రునికొక నూలుపోగు" అంటే ఏమిటి? చంద్రునికి ఇవ్వవలసినది నూలు పోగేనా?*
ప్రతి మాసమూ వృద్ధి క్షయాలు పొందేవాడు చంద్రుడు. స్త్రీలలో చంద్రుడే ఋతు చక్ర భ్రమణానికి, సంతానోత్పత్తి, ప్రతి మాసమూ జరిగే అండోత్పత్తికి కారకుడు. చంద్రుడు దాంపత్యంలో భార్యా భర్త సంబంధాల అనుకూలతికూ, సౌగాభ్యానికి కూడా కారకుడు. చంద్రునికి ఆధిదేవత గౌరీదేవి. ఆ దేవత మాంగల్య సౌభాగ్యానికీ, అన్యోన్య ద్యాంపత్యానికీ, సంతాన సౌభాగ్యానికి అధిదేవత.
గ్రహాలను తృప్తిపరచే విధానంలో ఏయే గ్రహాలకు ప్రీతికరమైన ద్రవ్య ధాన్యాదులచేత ఆయా గ్రహాలను తృప్తిపరచే విధానం ఉన్నది. వానిలో చంద్ర గ్రహానికి ప్రీతికరమైనదీ, చంద్రుని కారకత్వంలోనిదీ అయిన ధాన్యం - బియ్యం. ఆ బియ్యపు పిండిలో తయారుచేసిన తీపి వంటకమైన చలిమిడిని - చంద్రుని ఆరాధనలో గాని, గౌరీపూజలో గాని ఆర్పిస్తారు. అది విధానం. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళే సమయంలో కూడా, చంద్రునికీ, గౌరిదేవికి ప్రీతిపాత్రమైన ఈ చలిమిడినే ఆయా దేవతలకు నైవేద్యం చేసి- కుమార్తెకు సౌభాగ్యమూ, కడుపు చలువా కలగాలని - ఆమెకు ఆ చలిమిడిని ఇచ్చి పంపే ఆచారం ఉంది.
ఆ విధంగానే చంద్రుడు వస్త్ర కారకుడు కనుక - కుమార్తెకు కొత్తబట్ట కట్టబెట్టి వంపుతారు. వస్త్రం అనేది చంద్రుని కారకత్వాలలోనిది. మానవ జీవితానికి అభిషణీయములైన అనేక ముఖ్య ప్రాథమిక అంశాలు చంద్రుని ఆధిపత్యంలొ ఉండడం వల్ల - ఆ చంద్రుని ఆర్చించడం, చంద్రునికి ప్రీతికరాలైన వస్తు విశేషాలను అర్పించడం శుభప్రదమవుతుందనే విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా ఆచరిస్తారు.
ఏదైనా ఒక శుభకార్యం కాని, ఆశుభకార్యం కాని జరిగినప్పుడు ఆయా కర్తలకు వారి తల్లి వైపు బంధువులు - నూతన వస్త్రాలను బహూకరించే ఆచారం మనకుంది. దానికి కారణం - మాతృ కారకుడు కూడా చంద్రుడే కావడం గమనార్హం. ఆయా శుభాశుభ కార్యాలను నిర్వర్తించే స్త్రీ పురుషులకు - అశుభాలు తొలగిపోయి శుభం కలగాలని శుభాశంసలతోను, చంద్రభగవానుని ఆశీస్సులు వారికి కలగాలనీ, చంద్ర గ్రహ సంబంధమైన శుభఫలాలను వారు పొందాలనీ- ఇటువంటి సందర్భాలలోని భావన. ఇదే విధంగా వ్యాధిగ్రస్తులై, తిరిగి ఆరోగ్యాన్ని పొందిన వారికి కూడా తల్లి లేదా తల్లికి సంబంధించిన వారు అన్న దమ్ములు మేనమామలు ఇత్యాదులు, ఎవరు జీవించి ఉంటే వారు - నూతన వస్త్రాలను బహూకరిస్తారు. ఈ సందర్భంలో కూడా ఇదే విధమైన శుభ మనకు కారణం - చంద్రుడు ఓషధీ కారకుడు, మనః కారకుడు, మాతృ కారకుడు - కూడా కావడమే. ఇత్యాదిగా ఇంకా ఈ సందర్భంలో అనుప్రాసక్తంగా చెప్పదగిన ఉన్నాయి.
ప్రతిమాసారంభంలోనూ ప్రధమ చంద్ర దర్శనం రోజున- చంద్రరాథనోన్ముఖంగా, ఒక వస్త్ర ఖండాన్ని చంద్ర దేవతా ప్రీత్యర్థంగా అర్పించడమే చంద్రునికొక నూలుపోగు నీయడం. దాని ద్వారా చంద్రగ్రహుయొక్క అనుగ్రహాన్నీ, చంద్రగ్రహ కారకత్వంలో ఉన్న శుభఫలాలనూ పొందగోరడమే
చండ్రునికొక నూలుపోగు అనేది మరొక అర్థంలో కూడా ఉపయోగిస్తారు. అదేమంటే - కొండంత దేవునికి కొండండ పత్రి ఇచ్చుకోలేము. జగచ్చక్షువు, కర్మసాక్షిణన చంద్రునికి స్వల్పమైన నూలుపోగునివ్వడం అల్పాతి అల్పమైన కానుక. స్వీకరించేవాని అర్హతనుబట్టి కాక - ఇచ్చేవాని శక్తినిబట్టి అధికునికి స్వల్పమైన కానుక ఇచ్చినప్పడు చంద్రునికొక నూలు పోగుగా ఇస్తున్నామని చెప్పడంతా పరిపాటి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి