9, జూన్ 2021, బుధవారం

ప్రజల కష్టార్జితాలు.

 *పరిపాలించే ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో*? ఒక్కసారి గమనించండి.

*ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు,రాయితీలు మన కష్టార్జతాలే*

 అవి ఎలానో తెలుసుకుందాం.


1 *సంపాదిస్తే  income tax*

2.అమ్మితే sale tax 

3. *ఉత్పత్తి చేస్తే peoduction tax*

4. మార్కెట్‌ చేస్తే commercial tax

5. *సినిమాకి వెళ్తే        entertainment tax*

6. వెహికల్‌ కొంటే life tax

7.  *దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax*

8. లాంగ్‌ జర్నీ చేస్తే toll tax

9. *బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax*

 10. భార్య, పిల్లలతో పార్క్‌ కి 

     వెలెతే entery tax

11. *ఉద్యోగం చేస్తే professional tax*

12. వ్యాపారం చేస్తే  trade tax

13. *బట్టలు కొంటే vat tax*

14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే

     series tax

15. *ఆస్థి పై property tax*

16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే swachh bharat charge

17. *సబ్బు కొంటే customer charge*

18. ఒక వస్తువు కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,

*దాన్ని రిపేరు చేపిస్తే tax,*

దాన్ని లెక్కల్లో చూపిస్తే tax,

19. *సంపాదించింది ఖర్చుపెడితే tax*

20. మొత్తం మీద మనిషి జన్మిస్తే tax,

21. *మనిషి సంపాదిస్తే tax*,

మనిషి సంతోషిస్తే tax,

మనిషి మరణిస్తే tax. 


*ఇలా పలు రకాల టాక్స్ లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు* వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల,నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు,ప్రజల కష్టార్జితాలు.

*వర్షాలు పడుతున్నాయి

 .

✍🏼🌳


అక్కడక్కడ ..

*వర్షాలు  పడుతున్నాయి 💧*


*ఈ చెట్లని, మొక్కలని, తీగలని, మన ఉరిలో, విధిలో, ఇంట్లో ఉండేలాగా చూసుకుందాం, ఏలాంటి రోగాలు రాకుండా,  ప్రకృతి నుండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ, మానవాళి మనుగడ కోసం ఋషులు తెలియజేసినట్లు, మనల్ని మనమే రక్షించుకుంటూ, అందరికీ రక్షణ కలిపిస్తూ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తూ, ప్రపంచ దేశాలకు మనమంతా మార్గదర్శకమవుదాం ..*


■ మన ఊరిలో ఈ చెట్లు పెంచుదాం

*✨ రావి చెట్టు*

*✨  మర్రిచెట్టు*


■ మన విదిలో ఈ చెట్లు పెంచుదాం

*✨వేప చెట్టు*

*✨ బాదం చెట్టు (దేశీ బాదం)*


■ మన ఇంట్లో ఈ చెట్లు పెంచుదాం

*✨ మునగచెట్టు*

*✨ కర్వేపాకు*

*✨ ఉసిరి*

*✨ జామ*

*✨ నిమ్మ*


■  *మన తొట్టి(కుండి)లో ఈ మొక్కలు పెంచుదాం *

*✨ తులసి*

*✨ అలోవెరా*

*✨ పుదీన*

*✨ కొత్తిమీర*

*✨ రణపాల*

*✨ గోధుమ గడ్డి*


■ మన గోడలపై ..

ఈ తీగలు పెంచుదాం ..

*✨ తిప్పతిగా*

*✨ తమలపాకు*


*ఏలాంటి వైరస్ ల, రోగాల బారిన పడకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే, మార్గాలన్నీ మనమందరం పాటించుదాం, ఒకరికి ఒకరు సహకరిస్తూ, భవిష్యత్త్ తరాలకు  మార్గదర్ళకమయ్యే, ఈ మెసేజ్ ను మానవాళి శ్రేయస్సును కోరే ప్రతీ ఒక్కరికీ, పంపించుదాం .*


*మానవ కళ్యాణ కోసం, ఈ చెట్లు, మొక్కలు, తీగలు నాటేందుకు, పెంచి పోషించుదుకు సహకరించుదాం.*


👏👏👏👏

translations in PDF

 🌷🙏🌷

I am an 81-year old retired scientist from Kerala and settled in Bangalore. I am an expert in Sanskrit, Tamil, Malayalam, Hindi   and have working knowledge of Kannada  and Telugu.


On the day of retirement, I decided that I will engage myself in translation of Hindu stotras written in all these languages into English. I have so far  translated 2000 stotras  written in four languages. I have translated three  Ramayanas (Valmiki  , Kamba and Adhyathma), 21  Upanishads, Gita, Devi Mahatmyam, Narayaneeyam,  Jnanapana, Krishna  Karnamrutham, 21  Vedic Sukthas,  including Chamakam, Rudram and 65 out of 80 known Stotra  compositions of Adhi Sankara.


I also wanted to preserve Carnatic Krithis in English and I have translated 1950  Krithis, which include  all known Krithis of Thyagaraja, about 100  Krithis each of Purandaradasa , Oothukadu Venkatasubba Iyer and so on.


All these translations are now available in PDF format on:

 http://www.hindupedia.com/en/User:P.R.Ramachander  


I have a humble request. Please  circulate this information to your contacts.-

- *PR Ramachander*

*కపిల ఋషి

 💐🙏 


Good Article 😊


*కపిల ఋషి*


తల్లికి కపిలుడి తత్త్వ బోధ!!


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.

”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో.

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.

”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.

”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.

నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.

”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.

అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.

”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.

”ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.

”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.

”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. ”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.

కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.

    ( సేకరణ : విష్ణు పురాణము నుండి)

జై శ్రీమన్నారాయణ

 శ్రీమతే రామానుజాయ నమః

తీపి జ్ఞాపకం

 🥭🥭🥭🥭

వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋 


ఎప్పుడు తెచ్చారు? 

ఎన్ని తెచ్చారు?

ఒక్కొక్కరికీ ఎన్నేసొస్తాయి? వాటాలేసుకునేటప్పుడు ముందుగానే మంచివన్నీ చూసి తీసేసుకోవాలి. అసలే అయిదుగురం.

చిన్న రసాలా?  పందార కలిశలనుకుంటా! ఏవైతేనేం... భలే తియ్యటి వాసన గదంతా! 

గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍


అప్పుడప్పుడు ఇంకా పండనివి తెచ్చేవారు. మునగపాక నుంచి వచ్చి రోజూ పాలుపోసే పైడమ్మని అడిగి ఎండుగడ్డి తెప్పించేవారు. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.

మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. 

వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.

అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 


శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతఁవప్పుడు ఇరవయ్యొక్క రకాల పిండివంటలు వండినా విస్తట్లో ఓమూలగా క్షేత్రపాలకుడి పాత్రలో ఆవకాయ వుండాల్సిందే! 


ఇక భాద్రపదంలో వినాయక చవితికి ఉండ్రాళ్లలోకి కొబ్బరిపచ్చడీ, అల్లప్పచ్చడీ చేసినా సాయంత్రం మాత్రం పునఃపూజ తరవాత ఆవకాయ అద్దుకుంటూ ఉండ్రాళ్లు తినకపోతే వ్రతఫలం దక్కదుట! 🤭


ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! 

వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది. ఆ టైములో అర్జెంట్ ఆపరేషనన్నా వెళ్లబుద్ధి కాదు!


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. 

ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. 

నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡

నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤

ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝


అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. 

కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀


వేసవి సెలవులప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లేవాళ్లంకదా? 

అక్కడ ముగ్గురు మావయ్యలు, వాళ్లకి నలుగురేసి, అయిదుగురేసి పిల్లలు కదా!


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే జోగిరాజు మావయ్యనడిగి ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. అంతేగానీ పళ్లు తినొద్దంటే ఎలా?🤭


దాసు మావయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లి పెన్సిలిన్ ఇంజక్షన్ చేయిస్తాననేవాడు. ఆ భయంతో తినడం తగ్గించేవాళ్లం. లేకపోతే మనల్ని ఎవరాపగలరు?


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? 

ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.  

అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.

లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. 

అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! 

తీపి జ్ఞాపకం కూడా! 

 💭 😍 🥭🥭🥭


మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍 

 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰

కుసంస్కారులు

 కుసంస్కారులు


బధిరుని ముందు శంఖారావం

ఆంధుని ముందు దర్పణం

మూగవాని ముందు  కంఠ శోష

మూర్ఖుని కి హిత బోధ

సైకత మందుండి తైల ప్రయత్నం

ఎడారి లో నీటికోసం శోధన

వాయసాన్ని చూసి పికమనుకుని

భ్రమించడం

ఆమాస నిశిలో వెన్నెల కోసం తపించడం

కురూపిని అందగత్తె అని తలచడం

కడకు విద్యా ధిక. తా మదంతో

అధములు కూడా అధికులై

సాహితీ కుసంస్కారులై

తమ కంటూ ఓ అంధకారపు గిరి

గీసుకుంటూ

సహితేన కావ్యం సాహిత్యమం టూ

కుక్క పిల్లను

అగ్గి పుల్లను

సబ్బు బిళ్ళ నూ

కావేవీ కవితకు అనర్హ మంటూ

సంబోధించి నా

భాష్య కారులూ ఉటం కించినా

మార రెందుకో వీరు

నిజం చెప్పాలంటే......నిజంగా

వీరే కుసంస్కారు లు.


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

రాజమహేంద్రవరం

9866631877

తులసి--ప్రధాన్యత

 తులసి శాస్ర్తీయ నామం ‘ఆసియం బాసిల్లి కామ్‌’. ఇది ‘లాబియేటీ’ కుటుంబానికి చెందినది. ఇది హిందువులకు పూజా వస్తువుగా ఉపయోగపడుతున్నప్పటికీ, 16వ శతాబ్దం లోనే ఐరోపా దేశాలలో దీని పరిచయం వుందనే చారిత్రక ఆధా రాలను శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. అంతకు ముందే తులసిని మన దేశ వాసులు పూజించినట్లు పురాణ, ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తులసికి ప్రధాన్యత ఉందన్న సంగతి చరిత్ర చెపుతున్న సత్యం. 180 రకాల తులసి మొక్కలు న్నట్లు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. మన దేశంలో మాత్రం ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం.


1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.వేద కాలం నుంచి తులసిని దేవతా వృక్షంగా మొక్కగా భావించి పూజలు చేస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో సైతం తులసి వనాలను పెంచుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం ‘పండరీపురం’లో అతిపెద్ద తులసి వనముంది. కార్తీక మాసంలో నిత్యం ఒక తులసి దళాన్ని విష్ణువుకు సమర్పించిన వారికి సహస్ర గోదాన ఫలితాన్ని విష్ణువు ప్రసాదిస్తాడని ప్రతీతి. ఆషాఢ మాసంలో నిత్యం తులసి దళాలతో వున్న నీటితో విష్ణువుని అభిషేకిస్తారో వారిక మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మాఘ మాసంలో నిత్యం విష్ణువు పవళించే పానుపుపెై తులసి దళాలు వుంచిన వారికి విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు. శ్రీకృష్ణతులాభారంలో తులసి పాత్ర అసాధారణ మని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 


ఎన్నో మణుగుల బంగారానికి తూగని కృష్ణుడు రుక్మిణీ దేవి ఒక్క తులసి దళం త్రాసులో వుంచితే, ఆ అద్భుత ఫలితం వల్ల శ్రీ కృష్ణుని రుక్మిణీ సొంతం చేసుకోగలిగింది. తులసి మూలంతో సమస్త తీర్థాలు, కొనల యందు సమస్త వేదాలు, మధ్యలో సమస్త దేవతలు దీగి ఉం టారు. తులసి చెట్టు (మొక్క) చుట్టూ ప్రదక్షిణ చేసి, సాష్టాంగ నమస్కారమాచరించిన వరాఇకి భూప్రదక్షిణ చేసినంత పుణ్యం దక్కుతుంది. తులసికి ప్రత్యేక అర్థాన్ని కూడా నిర్ధారించారు. ‘తు’ అంటే మృత్యువు, ‘లసి’ అంటే దిక్కరించుది. మృత్యువుని దిక్కరించగలది, తప్పించగలది అని తులసిగా చెప్పవచ్చు.


తులసి ఆకులో పోషక విలువలు:

తులసి ఆకులను కోసిన వెంటనే పరీక్షించితే చాలా పోషక విలువలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. పిండి పదార్థములు 60.95, మాంసకృతులు 14.37, ఖనిజ లవణాలు 14.27, నీరు 6.43, కొవ్వు పదార్థములు 3.98 గ్రామముల పోషకాలు 100 గ్రాముల తాజా తులసి ఆకుల్లో ఉంటాయి. తులసి ఆకులు ఎండిన కొద్దీ పోషక విలువలు తగ్గుతుంటాయి. కొన్ని రకాల తులసి ఆకుల్లో పీచుపదార్థాలు కూడా ఉంటాయి. కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము, భాస్వరం లాంటి ఖనిజ లవణాలు వుంటాయి. అంతేకాకుండా విటవిన్లు కూడా తులసి ఆకుల్లో లభిస్తాయి. విటమిన్‌ ‘ఎ’, థీయోమిన్‌, రిబోప్లేవిన్‌, నియాసిన్‌, ఆస్మార్భిన్‌ ఆమ్లం, విటమిన్‌ ‘సి’, పెైరిడాక్సిన్‌ విటమిన్‌ ‘కె’లు కూడా ఉంటాయి.


16వ శతాబ్దంలోనే ఐరోపా దేశాలలో దీని పరిచయం వుందనే చారిత్రక ఆధారాలను శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. అంతకు ముందే తులసిని మన దేశ వాసులు పూజించినట్లు పురాణ, ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తులసికి ప్రాధాన్యత ఉందన్న సంగతి చరిత్ర చెపుతున్న సత్యం. 180 రకాల తులసి మొక్కలు న్నట్లు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. మన దేశంలో మాత్రం ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం. 1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.

Details of all SIM cards

 Details of all SIM cards purchased with your Aadhaar number in your name can be found at the site below. Among them you can block SIM cards that stealthily use your Aadhaar number without your knowledge. This is a good service to the Government of India.


tafcop.dgtelecom.gov.in


Open the above site on your mobile and type in your mobile number and you will know the numbers of all the SIM cards purchased with your Aadhaar number as soon as you enter the OTP. You can ban any of them. Good service

listen to world wide radio

 Dear All,

Now you can listen to world wide radio even without ear phone!!!! This is from Indian Space Research Organisation (ISRO) when you click the link, you can see the globe rotating. There are green dot on which you simply touch you can start listening to live radio from that place. Try your local radio!!!! 

Simply Amazing!!!! 😃


Proud of  ISRO, 👍🏻👍🏻🙏🙏

Keep Sharing....


http://radio.garden/live



👍🏻 *_FANTASTIC_* 🤘🏻👌🏻


*🌹 హరి మర్కట మర్కటాయనమః 🌹*

 *🌹 హరి మర్కట మర్కటాయనమః 🌹*

*🙏ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతామాత అందించే తమలపాకుల చిలుకల్ని తింటున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ,ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్ళంతా  తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు*. 


                  *ఆంజనేయస్వామి రుద్రాంశ  సంభూతుడు కావున తమలపాకులు  స్వామికి  శాంతినిస్తాయి. అందుచే  తమలపాకులతో హనుమంతుడిని పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది*.


     *1. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి  త్వరగా గుణం కనిపిస్తుంది*

.

                   *2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి*

.

            *3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది*.


*4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు*.


       *5.వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు బ్రాహ్మణునికి దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది*.


*6.స్వామికి తమలపాకుల హారాన్ని  సమర్పిస్తే  సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు*.


             *7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనైశ్చరుని అనుగ్రహం కలుగుతుంది*.


            *8.వైద్య పరంగా నయంకాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి*.


 **9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే  అన్ని  కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.* 


       *10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది*.


       *11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకులహార ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది*

.

       *12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.అప్పాలు గారెలు, ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించ వచ్చును 🙏*.


🌹🌷🍃🍁🍁🍃🌷🌹

వైశాఖ పురాణం - 30 వ

 _*వైశాఖ పురాణం - 30 వ అధ్యాయము*_ 



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పుష్కరిణి - ఫలశ్రుతి*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి , చతుర్దశి , పూర్ణిమ అను నీ మూడు తిధులును *'పుష్కరిణీ'* యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు ఈ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా.  బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.


దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను.


త్రయోదశినాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి , పూర్ణిమ యను మూడు తిధులకును , *"ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను ఇచ్చును.*


వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను , దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు , దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని , గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు , లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున ఈ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  ఇచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.


శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను , సిద్ధులుగను , బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని , ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.


మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు , చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి , చతుర్దశి , పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.


*నాయనా ! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను , నేను చూచినంత , విన్నంత , తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను ? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా ! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా ! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి , ముక్తి , జ్ఞానము , మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.


ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి ఇంటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి , ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*జీవ సమాధి..ఒక వివరణ.*


*(యాభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పూ రాలేదు..ప్రాణత్యాగం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు..ఎప్పుడు?..ఎలా?..అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా వున్నారు..


శ్రీధరరావు దంపతులకు ఈలోపల మరో సమస్య వచ్చిపడింది..శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది..ఆవిడ మునుపటి లాగా తిరుగలేకపోతున్నారు..తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు..దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు..ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి వస్తున్నారు..తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు..ఓ వారం గడిచిపోయింది..దూరపు బంధువు ఒకావిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలిచెర్ల కు వచ్చింది..ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ వున్నారు..ఈలోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధరరావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది..ఎలాగూ ఈవిడగారు వున్నారు కదా..అనుకొని..


"పిన్ని గారూ..మీరు అత్తయ్య గారివద్ద వుండి చూసుకుంటారా?..మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి ఓ మూడు గంటల లోపు వచేస్తాము.." అన్నారు ప్రభావతి గారు..


"అదేం మాటమ్మా..లక్షణంగా చూసుకోనూ..మీరిద్దరూ వెళ్ళిరండి..మేము మాట్లాడుకుంటూ ఉంటాము.." అని భరోసా ఇచ్చారావిడ..శ్రీధరరావు ప్రభావతి గార్లు సరే అని చెప్పి..గూడు బండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి ఫకీరు మాన్యం లోని ఆశ్రమానికి వెళ్లారు..


శ్రీ స్వామివారు వీరికోసమే ఎదురుచూస్తున్నట్లు గా వున్నారు..వీళ్ళను చూడగానే ..నవ్వుతూ.."నా సజీవ సమాధి విషయం ఆలోచించారా?..ఏమనుకుంటున్నారు?.." అన్నారు..


"నాయనా..మిమ్మల్ని మా చేతులతో సమాధి లో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కానీ పని..అది హత్య అవుతుంది..మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము..బ్రతికిఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులూ చేయరు..చేయలేరు..మీరు పదే పదే ఆ  విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు..ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికీ.." అన్నారు ప్రభావతి గారు కటువుగా..


శ్రీధరరావు గారైతే వాదనకే దిగారు.." ఇంత తపస్సు చేసి..ఇంత పాండిత్యమూ..వేదాంతమూ బాగా తెలుసుకొని..లోకానికి ఎటువంటి సందేశమూ ఇవ్వకుండా..మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే..అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో గానీ..ప్రపంచానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు..కొంతకాలం బోధ చేయండి.." అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చేయెత్తి వారించారు శ్రీ స్వామివారు..


ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు..ప్రశాంతంగా వున్నారు..పైపెచ్చు నవ్వుతూ..

"శరీరం తోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు..అలా అనుకొని వుంటే..వ్యాసాశ్రమం లోనే పీఠాధిపత్యం తీసుకొని..ముందుగా ఆశ్రమ వాసులకు..ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని..నా పంథా వేరు..అది మీకు ఇప్పుడు అర్ధం కాదు..ఒక్క విషయం చెప్పండి.. శిరిడీ సాయిబాబా ఇప్పుడున్నాడా?..ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు అరవై సంవత్సరాలు కావొస్తోంది..ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా?..(శ్రీ శిరిడీ సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు..) సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కరలేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది..మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి..అందుకు సమయం పడుతుంది..నాకూ కొద్దినెలల ఆయుష్షు ఉంది..ఈలోపల మీరు సిద్ధపడితే సరే..లేదా నా మార్గం లో నేను ప్రాణత్యాగం చేస్తాను..ఎంత తపస్సు చేసినా..శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము..అది భగవత్ నిర్ణయం..జీవ సమాధి చెందడమనేది సాధకుల మోక్ష పధానికి ఒక ఆలంబన వంటిది..ఎలా జరగాలని వ్రాసి వుంటే అలా జరుగుతుంది.." అంటూ ఒక్కనిముషం ఆగి.." మీరిద్దరూ చప్పున బైలుదేరండి.." అన్నారు..


సాయంత్రం చీకటి పడే వేళయిందని కాబోలు శ్రీ స్వామివారు బైలుదేరమన్నారని భావించి..శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగలిచెర్ల లోని తమ ఇంటికి చేరారు..అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు..


అనారోగ్యం.అసహనం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).