24, డిసెంబర్ 2023, ఆదివారం

శ్రీ మార్కండేశ్వర్ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 279


⚜ హర్యానా : సహబాద్


⚜ శ్రీ మార్కండేశ్వర్ మహాదేవ్ మందిర్



💠 మార్కండేశ్వర్ మహాదేవ్ ఆలయం మార్కండేయుడు తన విధిని గెలవడానికి శివుడిని పూజించిన ప్రదేశంగా నమ్ముతారు.  శివుడు యముడిని ఓడించి యువకుడైన మార్కండేయుడిని అమరత్వం అనే వరంతో అనుగ్రహించాడు.  


💠 ఈ ఆలయం పాలరాయితో నిర్మించబడింది.

ప్రధాన దేవత శివుని మూర్తి మరియు యువ మార్కండేయ ప్రార్థనా భంగిమలో ఉన్న శివలింగం.  

ఆలయ గోడలు శివుడు యువ మార్కండేయుడిని యముడి నుండి రక్షించే దృశ్యాన్ని ప్రదర్శిస్తాయి.


 💠 ఆలయ చరిత్ర మహాభారతానికి పూర్వం నాటిది మరియు మూడవ సహస్రాబ్దిలో స్థాపించబడింది.  

ప్రస్తుత ఆలయ భవనం ఇటీవలిది.  


💠 మార్కండేయుడు మరణించే సమయంలో శివుడిని పూజించిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది.  మార్కండేయ ఒక ఆదర్శప్రాయమైన బాలుడు, అతను 16 సంవత్సరాల వయస్సులో తనకు మరణం ఉంది అని తన విధిని తెలుసుకున్నాడు మరియు తన విధిని మార్చడానికి యముని ఓడించాలని నిర్ణయించుకున్నాడు.  


💠 అతను గొప్ప శివ భక్తుడు.  

మరణించే రోజున, అతను శివుడిని పూజించడం కొనసాగించాడు.  

యమ దూతలు శివుని పట్ల ఆయనకున్న అపారమైన భక్తి మరియు విశ్వాసం కారణంగా అతని ప్రాణాలను తీయలేకపోయారు.  అందుకే, మార్కండేయుడి ప్రాణం తీసేందుకు యమ స్వయంగా దిగాడు.  యముడు మార్కండేయుని వైపు తన యమ పాశం వేసాడు.

అది చూసిన యువకుడు మార్కండయ్య శివలింగానికి ఆలింగనం చేసుకుని శివుని స్తోత్రం చేయడం ప్రారంభించాడు.  

ఆ ఉచ్చు శివలింగంపై పడింది.  అకస్మాత్తుగా శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడిని రక్షించడానికి తన త్రిశూలంతో యముడిని సంహరించాడు.  


💠 యుద్ధంలో యముడిని ఓడించిన తరువాత, యువ మార్కండేయుడు శాశ్వతంగా జీవించాలనే షరతుపై శివుడు యముడిని పునరుద్ధరించాడు.  

యువ మార్కండేయుడు పఠించిన స్తోత్రాన్ని " మహా మృత్యుంజయ స్తోత్రం"  అంటారు.  


💠 ఈ ఆలయం మార్కండ నది ఒడ్డున ఉంది.  ఈ నదికి మహర్షి మార్కండేయ నుండి పేరు వచ్చింది మరియు ఋషి మార్కండేయ యొక్క అనేక పురాతన ఆశ్రమాలను పొరుగు జిల్లాలలో నది ఒడ్డున చూడవచ్చు.  


💠 యాత్రికులు ఆదివారాలు మరియు శ్రావణ మాసంలో మార్కండేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.


💠 మహా శివరాత్రి, మకర సంక్రాంతి, కార్తీక పూర్ణిమ, దీపావళి పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 

శ్రావణ మాసంలో వేలాది మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు.



💠 రైలు ద్వారా: అంబాలా  జంక్షన్ ఆలయానికి 19 కి.మీ దూరంలో ఉన్న రైలు మార్గం.



 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మహానుభావులారా ! శ్రుతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను. వినండి. ప్రేమభావాన్ని

చంపుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే

తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలి ఇవ్వడానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనక

అతడూ తండ్రి కాడు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు. అంతేకానీ ప్రేమతోకాదు.

మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ధన ప్రాణ రాజ్యాలనేకాదు మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే

ఉంటారు. స్తోత్రప్రియులైన మానవులూ ధనధాన్యాదులను ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం ఉంది.

అంతమాత్రాన వారు తండ్రులు కారు. అతి సంకట పరిస్థితిలో కేవల వాత్సల్యంతో మహామంత్రాన్ని

ఉపదేశించి రక్షించాడు కనక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు.

వెంటవే కౌశికుడు ప్రేమగా శునశ్శేపుడి కుడిచెయ్యి అందుకున్నాడు. పుత్రకా! ఇంటికివెడదాం, పద

అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి శునశ్శేపుణ్ణి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఋత్విక్కుల సభ్యులూ కథ సుఖాంతమయ్యిందని సంతోషిస్తూ ఎవరి ఇళ్ళకు వారు

వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు.

ఈ వృత్తాంతమంతా తెలుసుకుని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగివచ్చాడు. తండ్రికి

పొష్టాంగపడ్డాడు. శ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో

కూర్చుండబెట్టుకుని నులివెచ్చని ఆనంద బాష్పజలధారలతో కొడుకు శిరస్సును ముంచెత్తేడు. ఆ

రోహితుడికి పట్టాభిషేకమయ్యింది. అప్పటినుంచీ అయోధ్యాసామ్రాజ్యాన్ని యువరాజై పరిపాలించాడు


ఉష్ణనేత్ర జలైః శీర్షణ్యభిషేకమథాకరోత్ :

రాజ్యం శశాప తేనాసౌ పుత్రేణాతిప్రియేణచ

Kanyakumari

 https://youtube.com/shorts/-XrLCTYzGjg?si=gjtpnC1JgyFaBsYy


Undavalli caves


 

Geo Thermal


 

గీతా జయంతి

 *ॐ                గీతా జయంతి* 


                        *సందేశం - 2* 


*  *వాదించువారిలో వాదించు శక్తి నేనే.*

   *"వాదః ప్రవదతామహమ్"* 


       *I am the logic among controversialists.*  

          *- Bhagawadgeetha 10/32* 

 

*వివరణ*  


    *ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్నిగూర్చి వాదిస్తాడు.* 

* *ఒకడు తన నమ్మకాలని గూర్చి వాదిస్తాడు.*  

* *ఒకడు తన కోరికలని గూర్చి వాదిస్తాడు.* 

* *ఒకడు తనకు వ్యామోహమున్న వస్తువులను గూర్చి వాదిస్తాడు.*  

* *ఒకడు తాను సత్యమనుకొన్నదానిని గురించి వాదిస్తాడు.* 

    *ఎవడు దేనిని గూర్చి వాదిస్తాడో, వాడక్కడ నుండి బయలుదేరి, అంతర్యామిని అనుభవించదానికి ప్రయాణం కడుతున్నాడు.* 

    *వాదించుచున్నది తానే కనుక, వాదన నుండి బయలుదేరి, వాదించుచున్న తన వద్దకు చేరుకుని, అందలి తనను తెలుసుకొని, ఈ మొత్తం తానే అని దర్శిస్తాడు.*  

    *కాబట్టి వాదించు వారిలో వాదించు శక్తి దేవుని వైభవము.*  


    *వాదము "వాద - జల్ప - వితండ" అని మూడు విధాలు.*  


*1. రాగద్వేషాలు లేకుండా, కేవలం తత్త్వాన్ని తెలుసుకొనే అభిలాషతో చేయబడే ప్రశ్నోత్తరాలని "వాదము" అంటారు.* 


*2. పరులు ప్రతిపాదించిన విషయాలను ఖండించి, తన ప్రతిపాదిత విషయాలను స్థాపించుకొని, ఇతరులని జయించాలని చేసే ప్రసంగం "జల్పం" అనబడుతుంది.*  


*3. కేవలం పరుల ప్రతిపాదిత విషయాలను దూషించు ఉద్దేశ్యంతో చేయబడేది "వితండం".* 


    *By the word "controversialists", we should here understand the various kinds of people using various kinds of argumentation in logic such as "Vada, Jalpa and Vitanda".* 


*1. Vada is a way of arguing by which one gets at the truth of a certain question.* 

     *The aspirants who are free from Raga - Dvesha and jealousy raise amongst themselves questions and answers and enter into discussions on philosophical problems in order to ascertain and understand the nature of the Truth.* 

    *They do not argue in order to gain victory over one another. This is Vada.* 


*2 Jalpa:*  

      *Jalpa is wrangling in which one ascerts his own opinion and refutes that of his opponent.* 


*3. Vitanda:* 

      *Vitanda is idle carping at the arguments of one's opponents.*  

      *No attempt is made to establish the other side of the question.* 


       *In Jalpa and Vitanda one tries to defeat another. There is desire for victory.* 


                    *=x=x=x=* 


    *— రామాయణం శర్మ*  

             *భద్రాచలం*

Corona virus is hidden

 PLEASE SEND THIS MSG TWICE TO ANY GROUP. ONCE TODAY AND ONCE TOMORROW. 



*Important Message for all* 


The hot water you  

     drink is good for your throat. 


But this Corona   

      virus is hidden behind the 

      Paranasal sinus of your nose for 3 to 4 days. 


The hot water we 

      drink does not reach there. 


After 4 to 5 days  

    this virus that   

    was hidden behind the  

   paranasal sinus reaches your lungs.


 Then you have trouble breathing.


That's why it is very important to take steam, 


which reaches the  

    back of your Paranasal sinus.


 You have to kill this  

   virus in the nose with steam.


At 50°C, this virus becomes disabled i.e. paralyzed. 


At 60°C this virus  

    becomes so weak that any 

     human immunity  

     system can fight against it.


 At 70°C this virus dies completely.


This is what steam does. 


The entire Public    

    Health Department knows this.


 But everyone wants to take   

    advantage of this Pandemic. 


So they don't share this information openly.


One who stays at home should take steam once a day. 


If you go to the market to buy Groceries   

vegetables etc.

 take it twice a day.


 Anyone who meets  

     some people or goes to office

    should take steam 3 times a day.                      


 *Steam week* 


   According to doctors, 

Covid -19 can be killed by 

    inhaling steam from the nose and mouth, 

   eliminating the Coronavirus.  


If all the people  

   started a steam drive campaign for a week, 


the pandemic will soon end. 


So here is a suggestion: 


* Start the process for a week from

morning and evening, for 

  just 5 minutes  

    each time, 

to inhale steam.  

  

If we all adopt this practice for a week  the deadly 


Covid-19 will be erased.


This practice has no side effects & doesn't cost anything either.


  So please send this message to all your Loved Ones, relatives,

    friends and neighbours, 

     so that we all can kill this 

     Corona virus together and live and walk freely

    in this beautiful world.


          *Thank you*

మొదటిరోజు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మొదటిరోజు..*


2004వ సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండురోజుల ముందు మా నాన్న శ్రీధరరావు గారు హఠాత్తుగా పక్షవాతం వచ్చి జబ్బున పడ్డారు..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము..హైదరాబాద్ లో మా అన్నయ్య నాగప్రదీప్ అడ్వకేట్ గా వున్నాడు.అన్నయ్య వదిన గార్లు నాన్నగారి బాగోగులు చూసుకుంటామనీ..ఏ విధమైన ఆలోచనా పెట్టుకోవద్దనీ నాకు అనునయంగా చెప్పినందున నేను తిరిగి వచ్చేసాను..


సంక్రాంతి పండుగ మూడురోజులూ అయిపోయిన మరుసటి రోజు నేను, నాభార్య  శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో అడుగుపెట్టాము..అంతకు ముందు కొన్ని వందలసార్లు శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించినా..ఆరోజు ఒక బాధ్యత తో వెళ్లడం కొంచెం కొత్తగా ఉంది..ముందుగా ఇద్దరమూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఆ సమాధి ముందు మోకరిల్లి.."స్వామీ!..నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరలా కలిగించావు..ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కష్టపడతాము..నీవు కరుణించి అండదండగా ఉండాలి..అదే మాకోరిక.." అని  మనస్ఫూర్తిగా కోరుకున్నాము..


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణమంతా తిరిగాను..శ్రీ స్వామివారు జీవించి ఉండగా ఉన్న ఆశ్రమ రూపానికి..ఇప్పుడు ఆలయంగా ఉన్న రూపానికి పోలికే లేదు..శ్రీ స్వామివారు కట్టించుకున్న ఆశ్రమం లో అంతకు ముందున్న వంటగది ఇప్పుడు లేదు..అప్పుడున్న పందిరి స్థానం లో ఒక పెద్ద మంటపం నిర్మితమైంది..శ్రీ స్వామివారి సమాధి గది మీద గాలిగోపురం అలరారుతున్నది..శ్రీ స్వామివారు చెప్పిన మాటలు..ఆయన రూపం..హావభావాలు..అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి..శివాలయము, పార్వతీదేవి ఆలయము, నవగ్రహ మంటపం..మొదలైన ఉపాలయాలు ఏర్పాటై ఉన్నాయి..శ్రీ స్వామివారు స్వయంగా కట్టించుకున్న ఆశ్రమ ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరమూ వచ్చింది..(ఆ మందిరం లో ప్రతిష్టించిన శ్రీ సాయినాథుని ప్రతిమను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చాను..అదో అనిర్వచనీయ అనుభూతి..ముందు ముందు ప్రస్తావిస్తాను.)


పూజారులతోటి..ఇతర సిబ్బంది తోటి..ఆలయ నిర్వహణ గురించి కొద్దిసేపు చర్చించాను..ఎవరి వంతు సహకారం వారు అందిస్తామని చెప్పారు..కానీ ..ఈ మందిర నిర్వహణ అనుకున్నంత తేలిక కాదనీ..ముందు ముందు అనేక సమస్యలను నేను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ..ప్రతి సమస్య పరిష్కారం వెనుకా..ఆ అవధూత దత్తాత్రేయుడు సహస్రబాహువులతో మమ్మల్ని చుట్టుముట్టి రక్షిస్తాడనీ..మా దంపతులకు ఆరోజు తెలియలేదు..


శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలూ లేవు.... భక్తుల ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఎటువంటి వరుసలూ లేవు..అడ్డదిడ్డంగా నెట్టుకొస్తున్నారు.. ముందుగా ఇక్కడ నుంచే మనం ప్రక్షాళన మొదలుపెట్టాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను..ఆమాటే మా సిబ్బంది తో చెప్పాను..ఎందుకనో వాళ్ళు ఇబ్బందిగా మొహం పెట్టి..సంకోచిస్తూనే సరే అన్నారు..మందిరం వద్ద నుంచి తిరిగి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..అక్కడే కొద్దిసేపు కూర్చుని..నమస్కరించుకొని వచ్చేసాము..


శ్రీ స్వామివారి మందిరం వద్దనుంచి నేరుగా మొగలిచెర్ల లోని ఇంటికి వచ్చి..అమ్మ వద్ద జరిగిన విషయాలన్నీ చెప్పాను..అంతా విని.."ఏమైనా మార్పులు చేద్దామని అనుకుంటున్నావా?..ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయి.." అన్నది..అలాగే అన్నాను కానీ..అమ్మ ఎందుకు ఇంత సున్నితంగా హెచ్చరించిందీ అని ఆలోచిస్తూ ఉండిపోయాను..శ్రీ స్వామివారి మీదే భారం వేసి ఊరుకున్నాను..ఆరోజు అలా గడిచిపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).

తేడాలను గమనించండి

 ఒక తొండ పాముతో "నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు" అంది..


"అదెలా..?" అనడిగింది పాము. 


"నేను చెప్పినట్టు చెయ్యి" అని, 

ఒక పొలంలో పనిచేసుకునే రైతుని "వెనుక నుండి కాటెయ్యి" అంది తొండ.. 


పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట. 


నన్ను కరిసచింది తొండే కదా అని ధైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.


మళ్ళీ ఇంకో పొలంలో "రైతుని నేను కరుస్తాను, 

నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి వేళ్ళు" అని..


తొండ కరిచింది.. పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పోయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భయంతో..


భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది..


కాబట్టి కరోన కొత్త వేరియంట్ విషయంలో పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు మిగతా సామాజిక మాధ్యమాల్లో వాటిలో వచ్చేవి, రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది.


ధైర్యంగా ఉండండి కానీ జాగ్రత్తతో మసలుకోండి. మీ ధైర్యమే మీకు కొండంత అండ..


 దయచేసి తేడాలను గమనించండి


 (1) పొడి దగ్గు + తుమ్ము = వాయు కాలుష్యం


 (2) దగ్గు + శ్లేష్మం + తుమ్ము + ముక్కు కారడం = జలుబు


 (3) దగ్గు + శ్లేష్మం + తుమ్ము + ముక్కు కారడం + శరీర నొప్పి + బలహీనత + తేలికపాటి జ్వరం = ఫ్లూ


 (4) పొడి దగ్గు + తుమ్ము + శరీర నొప్పి + బలహీనత + అధిక జ్వరం + శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది = కరోనావైరస్

Joke





 

నాయనార్ల చరిత్ర - 37*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 37*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*గణనాథ నాయనారు*


తిరుజ్ఞాన సంబంధరు అవతరించిన శీర్గాళి పుణ్యక్షేత్రంలో ఒక

బ్రాహ్మణ కుటుంబంలో గణనాథుడనే శివభక్తుడు అవతరించాడు.

పరమేశ్వరుని అర్చించడమే తన జీవితధ్యేయంగా అతడు భావించి సదా

స్వామి కైంకర్యంలోనే కాలం గడుపుతూ వచ్చాడు. 


ఉద్యాన వనాల్లో

పూలమొక్కలను పెంచి, సురభిళ పుష్పాలతో అందమైన మాలలను కూర్చి

స్వామికి సమర్పించడం, స్వామి అభిషేకార్థం పవిత్రజలాలను తీసుకొని

రావడం, దేవాలయంలో దీపాలను వెలిగించడం, పవిత్ర శైవ గ్రంథాలైన

తిరుములై పఠించడం, వాటి ప్రతులను తీసి భక్తులకు పంచడం మొదలైన

సేవలను సంతోషంగా చేస్తూ వచ్చాడు.


గణనాధ నాయనారు గొప్ప శివభక్తుడైన తిరుజ్ఞాన సంబంధరును

కళ్లకు కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి మూడువేళలా అతని దగ్గరికి  వెళ్లి భక్తితో ప్రణమిల్లు తుండేవాడు. మరణించిన తరువాత గణనాధ

నాయనారు కైలాసం చేరుకుని అక్కడి శివగణాలకు నాయకుడై పరమ

శివునికి ప్రీతితో కైంకర్యం చేసే భాగ్యాన్ని సంపాదించాడు.


*ముపైఏడవ చరిత్ర సంపూర్ణం* 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

వైకుంఠేకాదశి కబుర్లు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

##  ఓలేసు వైకుంఠేకాదశి కబుర్లు ##


గుడ్ మార్నింగ్ ఓలేసూ ...ఆహా..  బొట్టు.. చేతిలో టెంకాయ చిప్ప.. భలే..ఉదయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తిలా ఉన్నావ్ ... గుడికెళ్ళుస్తాన్నావా ? 


ఓలేస్ :: ఔ.. సామీ... తెల్లవారుఝామున లేసి పాత మార్కెట్ కాడ చెండ్రాయుని దేవలానికి పొయింటి ! .. అబ్బా ఏమన్నా రష్హా ! వల్ల గాల్యా...అలివిగాని రష్..!


ఔను..ఈ రోజు వైకుంఠేకాదశి గదా .. ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటే ఓ నాలుగు బస్తాల పుణ్యం వీపున కట్టుకుని దక్షిణ ద్వారం గుండా రావొచ్చనేమో🤣 పెద్దోళ్ళు ఏది చెప్పినా ఏదో ఒక కారణం ఉంటుంది! సైన్స్ చెపితే వినరని భక్తి/మతం ముసుగులో చెప్తారు.. అదీ సంగతి ! 


ఓలేస్ :: ధనుర్మాసం.. ఏకాదశి.. పూజలెనక  సైన్సా ? ఎట్టెట్టబ్బా🤔


అవునోలేసూ...ఖగోళ శాస్త్రం.. ఉత్తరాయణం లో సూర్యుడు ధనుస్రాసి లోంచి మకరరాశిలోకిసంక్రమణ కాలం..వసంతకాలం.. చలి.. తినింది అరగదు...ఒంట్లో వుండే టాక్సిన్స్ బైటికి పోవు.. ఎండాకాలం లో ఐతే చెమట రూపంలో పోతాయ్..మరిప్పుడు పోవాలంటే   పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక రౌండ్ వాఁకింగ్ కు పోయి బాడీకి శ్రమ కల్పిస్తే ..కొవ్వు కరిగి ఆరోగ్యం బాగుంటుందని ! 

ముప్పై రోజులు ముప్పై పాశురాలు వల్లేవేస్తో తిరిగితే ఒళ్ళు గాట్టిగుంటుందని🤣ఈ సైన్స్ చెబితే వినరు కాబట్టి.. దేవుళ్ళు మన ఊళ్ళల్లోనే మారువేషాలేసుకుని తిరుగుతూ ఉంటారని చెబితే.. గుళ్ల కెళతారు🤣 అదీ విషయం ఓలేసూ !


ఓలేస్ : ఔనయ్యోవ్...ఇప్పుడనిపిస్సాంది..పండగలప్పుడు గుమ్మాలకు మాడాకులు కట్టమని, గడపలకు పసుపు రాయండని, ఇంటిముందు బియ్యంపిండి తో ముగ్గులెయ్యమనీ...ఈటన్నిటి ఎనకాల సైన్స్ వుంటాదిల్యా !


ఔనోలెసూ...పండుగలకు ఇంటినిండా చుట్టాలు ..ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ నిండుకుంటుంది... దాన్ని మామిడాకులు లాగేసి ఫ్రెష్ ఆక్సిజన్ సప్ప్లై... ఇక గడప పసుపు , పిండి ముగ్గు,  క్రిముల్ని, చీమల్ని ఇంట్లోకి రానివ్వవు ..అదే సైన్స్ !


ఓలేస్ :: ఔ... కరెక్టే బ్బా...సైన్స్ చెప్తే ఇనరని.. మన పెద్దోళ్ళు ""ఎవరి ఇంటి గుమ్మానికి మామిడాకులుంటాయో, గడపకు పసుపుంటుందో ఆ ఇంటికే లచ్చిందేవి కాళ్లకు గజ్జలు కట్టుకుని గల గల గల మంటూ బిందెలతో బంగారం ఎత్తుకుని వస్సాది🤣"" అని చెప్తారు ల్యా ! 


అంతేగదోలేసూ..లాజిక్కులు పనిచెయ్యని చోట మ్యాజిక్కులు పని చేసేది🤣అంతే గదా ఏమంటావ్ ! 


ఓలేస్ : ఏమనేదేముంది.... మనకు సదువు ల్యాక లాజిక్కులు ఇడిసిపెట్టి మ్యాజిక్కుల్ని పట్కొని యాల్లాడ్తాండామ్..ఇదే సందు చూస్కొని మనల్ని ఏలే ప్రభుత్వాలు కూడా మనకు మతం నూరిపోసి....దేవుళ్ళ కటౌట్లు సూపిచ్చి.. మనల్ని దోచి కార్పొరేట్ల గోచీల్లోకి రాండీబ్బా ...అంబా......అదా..... అని ప్లేట్లల్లో వడ్డీస్సాన్డారు..ఇదేందీయా అని అడిగితే.. సస్పెండ్ చేసేస్తా వుండారు... దేవుడు...దేశభక్తి పేరుతో ఉరితాళ్ళు పేని ప్రశ్నల కు ఉరేసి... ప్రతిపక్షం లేకుండా తమకు తమ వాళ్లకు అనుకూలమైన బిల్లులు పాస్ చేసుకుంటావుండారు...యాడికి పోతాదో.. ఏమైపోతాదో దేశం😩😩


అయ్యా... ఓలేసూ.. కూల్..కూల్...పెరుగుట విరుగుట కొరకే అన్నారు గా... దిగులు పడొద్దు...అయ్యప్ప మాలేసుకుని శివాలయం లో  సుదర్శన చండీ యాగం చేద్దాం లే  🤣


ఓలేస్ :: అట్లే చెస్సామ్ లేబ్బా... ఇంగో మూన్ల్లెళ్లు చండీ యాగం చేసి...గడపలకు రోజూ పసుపు పట్టించ్ఛాన్టే లచ్చిందేవి కాళ్లకు గజ్జెలు కట్టుకొని గల్ గల్ గల్ మని యాడున్య నల్ల డబ్బంతా తీస్కొచ్చి ఇంటికి పదైదు లచ్చలు ఏచ్ఛాది ....లెక్కొచ్చేటట్లయితే ఏ యాగమైనా చేస్సాం ..నేను రెడీ... వస్సా మరి అంగడికి పొయ్యి నల్ల గుడ్డలు కొనక్కొచ్చా....ఉంటా మరి 👍


అందరికీ ""వైకుంఠ ఏకాదశి'' శుభాకాంక్షలు


బసవరాజు వేణుగోపాల్

23.12.2023


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                 🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ త్రయోదశి - కృత్తిక  -‌ భాను వాసరే* *(24-12-2023)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/_oQ9KnQLj_s?si=Nzk_mi7YIMBRMpjl


🙏🙏

పేదరిక నిర్మూలనకు తులసి*

 *పేదరిక నిర్మూలనకు తులసి*


 🔸ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం మరియు పూజా స్థలంలో గంగాజలం ఉంచడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.


🔸 రోజూ తులసికి నీళ్ళు సమర్పించి, ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది.


 *నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే।* 

 *నమో మోక్ష ప్రదే దేవి నమస్సంపత్ప్రదాయినీ॥* 


 🔸పేదరికాన్ని నిర్మూలించి సుఖసంపదలు పొందాలనుకునేవారు తులసి పూజ రోజున తులసి మొక్కకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.


🔸సౌభాగ్యమును కోరు స్త్రీలు, రోజు తులసి ముందు ఉభయ సంధ్యలలో దీపం వెలిగించి పూజించాలి.


🔸 తులసి మొక్క ఉన్న ఇంట్లో దరిద్రం ఉండదు.  తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం, భయం, రోగాలు ఆగవు.  (పద్మ పురాణం)

సంపద వస్తుంది

 శ్లోకం:☝️

*అర్థా భవంతి గచ్ఛంతి*

  *లభ్యతే చ పునః పునః |*

*పునః కదాపి నయాతి*

  *గతం తు నవయౌవనమ్ ||*


భావం: సంపద వస్తుంది మరియు పోతుంది. పోయాక తిరిగి మళ్ళీ సంపాదించవచ్చు. కానీ ఒకసారి యవ్వనం పోతే తిరిగిరాదు. కాబట్టి శక్తి, ఉత్సాహంతో నిండిన యవ్వనంలో ప్రతి విలువైన క్షణాన్ని ధర్మ కార్యాలకే వెచ్చించాలి. శరీరం పోయిన తర్వాత కూడా సమాజం మనల్ని ధర్మం వల్లే గుర్తుంచుకుంటుందని భావం.🙏

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 24.12.2023   Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు మార్గశిర మాస శుక్ల పక్ష: త్రయోదశి తిధి భాను వాసర: కృత్తిక నక్షత్రం సిద్ధ తదుపరి సాధ్య   యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి రేపు 05:55 వరకు. . 

కృత్తిక రాత్రి 09:20 వరకు.

సూర్యోదయం : 06:47

సూర్యాస్తమయం : 05:44

వర్జ్యం : పగలు 09:20 నుండి 10:56 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:16 నుండి 05:00 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు.


 ఈ రోజు హనుమద్ర్వతం 


శుభోదయ:, నమస్కార:

విష్ణుచిత్తుని చరితము

 విష్ణుచిత్తుని చరితము

(ఆముక్తమాల్యద )


సీ. చెంగల్వ కొలనులో నంగన లాపురిన్

           బసపాడి యత్యంత పావనముగ

     నచ్యుతు పూజకై యావస్యకంబైన 

           తీర్థమున్ బిందెల దీసికొనియు

     ఘటియందు నటునిటు కమలముల్ కదలగా 

           కటియందు కీలించి కదలు చుండ

     చనుదోయిభారాన తను మధ్య మల్లాడ

           భవ్య ప్రబంధముల్ పాడుకొనుచు

ఆ. పాదకటకము లను పదభూష లను దాల్చి

     నడచుచుందు రింతు లొడలు కదల

     నడక సోయగముల నయనాల వీక్షించి

     విల్లుపురము ప్రజలు విస్తు పోగ.     04*      


సీ. ద్రవిడాంగనామణుల్  రత్నసోపానాల

              పసుపు నరగదీసి పైన దాల్చి

     జలకమ్ము లాడగా సాగి యా నీరమ్ము

             పచ్చగా నేలపై పరచు కొనియె

     సోపానముల క్రింద సుఖనిద్ర చెందెడి

             హంసల పక్షమ్ము లయ్యె పసుపు

     పసిడి సదృశమైన పక్షమ్ములను గూడి

             యందాల నొప్పెనా యండజములు          

తే. పసుపు పక్షంబులను గూడి పట్టణమున 

     సంచరించెడి  హంసల సరళి గాంచి

     'పసిడి రెక్కల వేలుపు పక్షు' లనుచు

     భ్రమసి సంతస మందిరి ప్రజలు మదిని  05


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 3                                                                                                                                ఓంకార స్వరూపము - సన్న్యాస పద్ధతి


ఈశ్వరుడు ఇట్లు పలికెను -


ఓ దేవీ! వినుము. నీవు నన్ను ప్రశ్నించిన విషయమును చెప్పగలను. దీనిని విన్నంత మాత్రాన జీవుడు సాక్షాత్తుగా శివుడు అగును (1). ఓంకారముయొక్క అర్థమును తెలియుట యనగా నా స్వరూపమగు జ్ఞానమును పొందుటయే. ఓంకారము అనే మంత్రమునకు ప్రణవము అని పేరు. అది ఉపాసనలన్నింటికీ మూలము (2). అది మర్రిచెట్టు విత్తనము వలె మిక్కిలి సూక్ష్మమైనది మరియు గొప్ప అర్థము గలది. వేదమునకు కారణమైనది, వేదముల సారము అగు ఓంకారము విశేషించి నా స్వరూపమే యగుచున్నది (3). ప్రకాశస్వరూపుడను, సత్త్వరజస్తమోగుణములకు అతీతుడను, సర్వమునెరింగిన వాడను,సర్వమును సృష్టించిన వాడను, సర్వజగన్నాథుడను. సర్వవ్యాపకుడను, మంగళకరుడను అగు నేను ఓం అనే ఒకే అక్షరము గల మంత్రమునందు ప్రతిష్ఠితుడనై యున్నాను (4). సత్త్వరజస్తమోగుణముల కలయికలోని హెచ్చు తగ్గుల వలన ఈ జగత్తులోని సకలపదార్థములు నిర్మాణమై యున్నవి. ఈ సమస్తము, దానిలోని విభిన్నములగు అంశములతో సహా ఓంకారముయొక్క అర్థములో అంతర్గతమగునని మహర్షులు చెప్పుచున్నారు (5). కావున, ఈ అక్షరము సర్వజగత్తునకు అధిష్ఠానము, అవినాశియగు పరంబ్రహ్మమే యగుచున్నది. శివుడు సృష్ట్యాదియందు ఈ అక్షరముచే సకలజగత్తును సృష్టించును (6), శివుడే ఓంకారమనియు, ఓంకారమే శివుడనియు చెప్పబడినది. ఏలయనగా, వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు శివునకు భేదము లేశ##మైననూ లేదు (7). కావున, ఓంకారస్వరూపుడనగు దేవునిగా నన్ను బ్రహ్మర్షులు తెలియుచున్నారు. విద్వాంసులు వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు పరంబ్రహ్మతో ఐక్యమును భావన చేయుచున్నారు (8). కావున, ముముక్షువు మనస్సులో వికారములు లేనివాడై, సర్వజగత్కారణము, నిర్గుణుడను, పరమేశ్వరుడను అగు నేను ఓంకారస్వరూపుడనని తెలియవలెను (9). దేవతలకు ప్రభ్వియగు ఓ దేవీ! కావుననే, నేను జీవులు ముక్తిని పొందుట కొరకై కాశీలో సర్వమంత్రములలో శ్రేష్ఠమైన ఈ ఓంకారమును మాత్రమే ఉపదేశించెదను (10).


ఓ అంబికా! నీవు అడిగిన ప్రశ్నలలో ముందుగా ఓంకారముయొక్క ఉద్ధారము (మంత్రరహస్యములను బయటకు తీయుట, అనగా విడివిడిగా తెలసుకొనుట) ను చెప్పెదను. దీనిని తెలియుట చేతనే పరమసిద్ధి (మోక్షము) లభించును (11). ముందుగా నివృత్తి (ఆపివేయుట)ని, తరువాత క్రమముగా ఇంధనమును, కాలమును, దండము (నియమము) ను మరియు ఈశ్వరుని ఉద్ధారము చేయవలెను (12). ఈ విధముగా మూడు మాత్రలు, బిందువు, నాదము అను అయిదు వర్ణములతో కూడియున్న స్వరూపము గల ప్రణవమును ఉద్ధారము చేసి నిత్యము జపించువారికి అది ముక్తిని ఇచ్చును (13). బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సకలప్రాణుల ప్రాణము ఈ ఓంకారమే. కావుననే, దీనికి ప్రణవమను పేరు వచ్చినది (14). ఓంకారమునకు ఆకారము మొదటి వర్ణము; తరువాతిది ఉకారము; మధ్యమునందు మకారము గలదు; అది నాదముతో అంతమగును (15). ఓ మహర్షీ! ఓంకారమునందు మొదటి వర్ణము దక్షిణదిక్కునందు గలదు. అది జలస్వరూపము. మధ్యమవర్ణమగు మకారము ఉత్తరమునందు గలదు. అది అగ్ని స్వరూపము (16). క్రమముగా అకార, ఉకార, మకారములు మూడు మాత్రలు. తరువాతి భాగము సగము మాత్ర అని చెప్పబడినది (17) ఓ మహేశ్వరీ! బిందువు, నాదము కలిసి అర్ధమాత్ర యగును. జ్ఞానులచే మాత్రమే తెలియబడే ఈ అర్ధమాత్రను సాక్షాత్తుగా వర్ణించుట శక్యము కాదు (18). ఓ ప్రియురాలా! వేదములు నానుండియే పుట్టుననే సత్యమును 'ఈశానస్సర్వవిద్యానామ్‌' మొదలైన శ్రుతివాక్యములు చెప్పుచున్నవి (19). కావున, వేదమునకు ఆదిలోనుండే (కారణమైన) ఓంకారము నన్ను బోధించును. నన్ను బోధించుచుండుట చేతనే ఓంకారముకూడ వేదమునకు ఆది (కారణము) అని వర్ణించబడుచున్నది (20).


అకారము సర్వజగత్తునకు బీజమగు మహత్తత్త్వమునకు, రజోగుణమునకు, సృష్టికర్తయగు బ్రహ్మగారికి, ఉకారము మహత్తత్త్వమునకు కూడ కారణమగు మాయాశక్తికి, సత్త్వగుణమునకు, జగత్పరిపాలకుడగు విష్ణువునకు ప్రతీక (21). మకారము మాయాశక్తిసమేతుడగు ఈశ్వరునకు, తమోగుణమునకు, సంహారకుడగు రుద్రునకు ప్రతీక. బిందువు ప్రకాశస్వరూపుడగు మహేశ్వరునకు, తిరోభావము (కార్యజగత్తు కారణరూపములోనికి విలీనము కాగా, ఆ కారణము కూడ పరమాత్మలో విలీనమగుట) నకు ప్రతీకయని చెప్పబడినది (22). సర్వము మరల అనుగ్రహించే సదాశివునకు నాదము ప్రతీకయని చెప్పబడినది. సర్కజగత్కారణమగు ప్రకృతికంటె పరుడగు శివుని నాదముయొక్క అగ్రమునందు భావన చేయవలెను (23). ఆయనయే సర్వమును తెలిసినవాడు, సర్వమును సృష్టించువాడు, సర్వమును పాలించువాడు. శుద్ధుడు, నాశము లేనివాడు, శబ్దములచే సాక్షాత్తుగా నిర్దేశింప శక్యము కానివాడు, కార్యకారణములకు అతీతుడు అగు పరబ్రహ్మ సాక్షాత్తుగా ఆ సదాశివుడే (24). ఈ ప్రణవములోని ఆకారము మొదలగు వర్ణములలో తరువాతి వర్ణము దానికి ముందుండే వర్ణమును వ్యాపించును. అనగా, పూర్వవర్ణము వ్యాప్యము కాగా, ఉత్తరవర్ణము వ్యాపకమగును. ప్రణవమంతటా ఈ విధముగా భావన చేయవలెను (25). సద్యోజాత, నామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అనే నా స్వరూపములై యున్న ఐదు బ్రహ్మలు అకారము మొదలగు అయిదు వర్ణములయందు క్రమముగా ప్రతిష్ఠితులై యున్నారు (26). ఓ పార్వతీ! ఆకారమునందు సద్యోజాతుని నుండి పుట్టిన ఎనిమిది కళలు, ఉకారమునందు వామదేవస్వరూపములగు పదమూడు కళలు గలవని చెప్పబడినది (27). మకారమునందు అఘోరస్వరూపములగు ఎనిమిది కళలు గలవు. బిందువునందు తత్పురుషస్వరూపములగు నాలుగు కళలు ఉద్భవించి యున్నవి (28). నాదమునందు ఈశానునినుండి పుట్టిన అయిదు కళలు గలవు. ఆరు విధముల ఐక్యమును అనుసంధానము (భావన) చేయుటచే ప్రణవము ప్రపంచమునకు ఆత్మయగునని చెప్పబడినది (29). మంత్రము, యంత్రము, దేవత, ప్రపంచము, గురువు, శిష్యుడు అనునవి ఆ ఆరు తత్త్వములు. ఓ ప్రియురాలా! ఈ ఆరు పదార్ధముల తత్త్వమును గురించి వినుము (30).


ఈ అయిదు వర్ణముల కలయికయే మంత్రమగునని పూర్వములో చెప్పియుంటిని. ఆ మంత్రమే యంత్రరూపమును దాల్చును. దాని మండలముల క్రమమును చెప్పెదను (31). యంత్రము దేవతయొక్క స్వరూపము. దేవత జగత్స్వరూపిణి. గురువు జగత్స్వరూపుడని చెప్పబడినది. శిష్యుడు గురువుయొక్క శరీరమని ఋషులు చెప్పుచున్నారు (32). ఈ సర్వము ఓంకారమే అనియు, సర్వము బ్రహ్మమేననియు వేదము చెప్పుచున్నది. కావున, ఓంకారము వాచకము, బ్రహ్మ వాచ్యము అనే సంబంధము కూడ ఇదే విషయమును చెప్పుచున్నది (33). దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! ఆధారము, మణిపూరము, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ, శక్తి, శాంతి అనునవి క్రమముగా ఒకదానిపై మరియొకటి ఉండును. ఇవి స్థానములని చెప్పబడినవి. శాంతికి పైన పరాత్పరుడగు సదాశివుడు ఉండును. ఎవనికి దృఢమగు వైరాగ్యము కలుగునో, వాడే అధికారి (34, 35). జీవబ్రహ్మల ఏకత్వము భావన చేయబడును. కావున, ధ్యానమునకు విషయము నేనే అగుచున్నాను. దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! విషయమును చక్కగా చెప్పియుంటిని. ఇపుడు సంబంధమును వినుము (36). జీవుడు, ఆత్మ అనువాటికి నాతో అభేదము వాచ్యము. ఓంకారము వాచకము. ఈ సందర్భములో ఇదియే సంబంధమని చెప్పబడినది (37). వ్రతము మొదలగు వాటియందు చాల ప్రీతి గలవాడు, శాంతస్వభావము గలవాడు, తపశ్శాలి, ఇంద్రియములను జయించినవాడు, శుచిశుభ్రతలు గలవాడు. సచ్ఛీలము గలవాడు, బ్రాహ్మణుడు, వేదమునందు నిష్ఠ గలవాడు (38). ఇహలోకమునందలి భోగములయందు మాత్రమే గాక పరలోకములో దేవతల భోగములయందు కూడ వైరాగ్యము గలవాడు, శివదీక్ష గలవాడు, మంచి బుద్ధి గలవాడు, శమదమాదిగుణసంపన్నుడు, సౌశీల్యము గలవాడు అగు శిష్యశ్రేష్ఠుడు సకలశాస్త్రముల సారమునెరింగినవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, సన్న్యాసి అగు ఆచార్యుని వద్దకు వెళ్లి, సాష్టాంగనమస్కారము మొదలగు వాటిచే ప్రయత్నపూర్వకముగా ఆయనను సంతోష పెట్టవలెను (39-41).


ఎవడు గురవో, వాడే శివుడు, ఎవరు శివుడో, వాడే గురువు అని మహర్షులు చెప్పిరి. ఈ విషయమును మనస్సులో నిశ్చయించుకొని తన మనస్సులోని భావమును గురువునకు నివేదించవలెను (42). సద్బుద్ధి గల బ్రాహ్మణుడగు సాధకుడు గురువుయొక్క అనుజ్ఞను పొంది పన్నెండు రోజులు పాలను మాత్రమే ఆహారముగా తీసుకొని, సముద్రతీరమునందు గాని, నదీతీరమునందు గాని, పర్వతమునందు గాని, శివాలయమునందు గాని, శుక్లపక్ష పంచమినాడు గాని, ఏకాదశి నాడు గాని, ఉదయమే స్నానమును చేసి పవిత్రమగు అంతఃకరణము గలవాడై నిత్యకర్మలను ఆచరించి, గురువును ఆహ్వానించి యథావిధిగా నాందీశ్రాద్ధమును చేసి, క్షౌరకర్మయందు కక్షములను గుహ్యమును విడిచిపెట్టి శిరోజములను గెడ్డమును మీసమును గోళ్లను తీసివేసి, తరువాత స్నానమును చేసి, ఏకాగ్రమగు మనస్సు గలవాడై, పిండిని భుజించి, తరువాత సాయంకాలమునందు స్నానమును చేసి సంధ్యావందనమును చేసి, గురువుతో కూడి సాయంకాల - ఔపాసనమును చేసి, గురువు రూపములోనున్న శివునకు శాస్త్రోక్తమగు దక్షిణను ఇచ్చి (43-47), హోమద్రవ్యములను సంపాదించి, స్వశాఖాసూత్రములో చెప్పిన విధముగా యథావిధిగా లౌకికాగ్ని మొదలగు విభేదములను అనుసరించి అగ్నిని ప్రతిష్ఠించవలెను (48). అహితాగ్నియగు బ్రాహ్మణుడు ప్రాజాపత్యేష్టిచే ఆధానము చేయబడిన శ్రౌతాగ్నియందు చక్కగా ఆహుతులను సమర్పించి సమస్తసంపదను దక్షిణగా ఇచ్చి, తరువాత ఆ అగ్నిని తన యందు ఆరోపించుకొని, ఇంటిని విడిచి సన్న్యసించవలెను. తరువాత, అతడు స్థిరచిత్తముగల వాడై చరువు (హోమద్రవ్యము) ను వండి ఆ అగ్నియందు సమిధలు, అన్నము, నెయ్యి మొదలగు వివిధద్రవ్యములను (49,50), పురుషసూక్తమును పఠిస్తూ ప్రతి ఋక్కునకు అంతమునందు హోమము చేసి స్వశాఖాసూత్రములో చెప్పబడిన విధముగా స్విష్టకృత్‌ హోమమును చేయవలెను (51).


తరువాత ఆ విద్వాంసుడు తంత్రోక్తవిధానముగా కూడ హోమమును చేసి, అగ్నికి ఉత్తర దిక్కునందు వస్త్రము, మృగచర్మము మరియు దర్భలతో రచింపబడిన ఆసనమునందు కూర్చుండి దృఢమగు చిత్తము గలవాడై బ్రాహ్మముహూర్తము వరకు గాయత్రిని జపించవలెను (52). తరువాత ఆ విద్వాంసుడు స్నానమును చేసి యథావిధిగా హోమము కొరకై అన్నమును వండి పురుషసూక్తముతో మొదలిడి విరజాసూక్తము వరకు హోమమును చేయవలెను (53). ఈ ప్రక్రియను వామదేవమహర్షి చెప్పిన విధముగా గాని, శౌనకాది మునులు చెప్పిన విధముగా గాని చేయవచ్చును. కాని వామదేవమహర్షి తల్లి గర్భమునందుండగనే జ్ఞాని యైనాడు గాన, ఆయన చెప్పిన పద్ధతి శ్రేష్ఠము (54). తరువాత శేషహోమమును పూర్తి చేసి, ప్రాతరౌపాసనమును చేయవలెను. తరువాత అగ్నిని తనయందు ఆరోపించుకొని, ప్రాతస్సంధ్యావందనమును చేసి (55), సూర్యోదయమైన తరువాత గాయత్రీమంత్రమును జపించవలెను. తరువాత క్రమముగా మూడు ఏషణలను (సంతానము, ధనము, పరలోకములయందు గల ఆసక్తి) విడిచి పెట్టి ప్రేష (సన్న్యసించే సమయములో చెప్పే) మంత్రములను ఉచ్చరించి (56). పిలక, యజ్ఞపవీతము, మొలత్రాడు మొదలగు వాటిని పరిత్యజించి, తూర్పు దిక్కు వైపునకు గాని, ఉత్తరము వైపునకు గాని వెళ్లవలెను (57). తరువాత లోకములో సంచరించుటకు తగిన దండమును, కౌపీనమును స్వీకరించవలెను. అతడు లోకవ్యవహారమునందు, లోకసంచారమునందు ఇష్టము లేని వాడైనచో, వాటిని స్వీకరించనక్కర లేదు (58). తరువాత అతడు గురువు వద్దకు వెళ్లి మూడు సార్లు సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత గురువునకు సమీపములో నిలబడవలెను (59). అపుడు గురువు విరజాహోమము చేయగా మిగిలి యున్న తెల్లని భస్మను తీసుకొని, దానిని శిష్యునికి యథావిధిగా పూయవలెను (60).


తరువాత 'అగ్నిరితి' అని మొదలయ్యే మంత్రముతో త్రిపుండ్రమును ధరింపజేయవలెను. హృదయపద్మమునందు నీతో గూడి ప్రతిష్ఠితుడనై యున్న నన్ను ధ్యానించవలెను (61). ప్రీతితో నిండిన మనస్సు గల గురువు శిష్యుని శిరస్సుపై చేతిని ఉంచి వాని కుడి చెవిలో ఋషి మొదలగు వాటితో కూడియున్న ప్రణవమంత్రమును మూడు సార్లు చక్కగా ఉచ్చరించవలెను. ఆ గురుశ్రేష్ఠుడు తరువాత ఉపాసనా (స్వానుభవ) సహితముగా దాని ఆరు విధముల అర్థమును బోధించవలెను (62, 63). ఆ శిష్యుడు గురువునకు పన్నెండు సార్లు భూమిపై సాష్టాంగముగా ప్రణమిల్లి నిత్యము గురువునకు వశుడై యుండి, వేదాంతమును చక్కగా అభ్యసించవలెను (64). ఆతడు నిత్యము పరిశుద్ధమైన, వికారములు లేని మనస్సులో సాక్షిస్వరూపుడను, వినాశము లేనివాడను, పరంబ్రహ్మను, పరమాత్మను అగు నన్ను మాత్రమే ధ్యానించవలెను (65). శమదమాదిధర్మములయందు నిత్యము ప్రీతి గలవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, మాత్సర్యము లేనివాడు అగు ఆ యతి ఈధ్యానమునందు అధికారము గలవాడని చెప్పబడినది (66). దోషములు లేనిది, శోకము లేనిది, శ్రేష్ఠమైనది, ఎనిమిది పత్రములు గలది, కేసరములతో శోభిల్లునది, తొడిమకు పై భాగమునందు విరాజిల్లునది, మూలాధారశక్తితో మొదలిడి మూడు తత్త్వములకు పైన ఉండునది అగు హృదయపద్మమనే ఈశ్వరధామమును భావన చేసి దానిమధ్యలో దహరాకాశము (ఈశ్వరస్థానము) ను భావన చేయవలెను (67, 68). పరబ్రహ్మస్వరూపమైన ఓం అనే ఏకాక్షరమంత్రమును ఉచ్చరిస్తూ నీతో గూడియున్న నన్ను ఆ హృదయాకాశమధ్యములో నిత్యము స్థిరమగు మనస్సుతో ధ్యానించవలెను (69). ఓ ప్రియురాలా! ఈ విధముగా ఉపాసించు సాధకుడు నా లోకమును పొంది నానుండి విజ్ఞానమును పొంది నా సాయుజ్యము అనే ఫలమును పొందును (70).


శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసపద్ధతి వర్ణనము అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

24-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------

వృషభం


నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

మిధునం


చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ధన లాభ  సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు,  వివాదాలు సర్దుబాటు కాగలవు. 

---------------------------------------

సింహం


ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

---------------------------------------

కన్య


వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట  బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.

---------------------------------------

తుల


ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ  వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన  కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.  వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో  మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు  నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------

ధనస్సు


నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే  మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం


వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి  మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కుంభం


ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు.  ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి.  వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

మీనం


నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

- *శ్రీ రామరక్షా స్తోత్రం-4* -

 🕉️🪷  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్* ౹

*శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః* ||


  - *శ్రీ రామరక్షా స్తోత్రం-4* -


తా𝕝𝕝 సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయినవాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. *నా నుదిటిని దశరథ నందనుడైన శ్రీరాముడు రక్షించుగాక.*