ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
16, మార్చి 2026, సోమవారం
పుణ్యం వూరికే పోదు
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
inspiring story: పుణ్యం వూరికే పోదు
*******************************
ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి, వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి “HELP, HELP” అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,
ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.
“నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి” అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు,
అప్పుడు రైతు “క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, ” అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
“అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు” అంటాడు రైతు.
“అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు” అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,
డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త
“Alexander Fleming”..!!!
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??
బ్రిటీష్ ప్రధాన మంత్రి
” Winston Churchil”
అందుకే అంటారు
” పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది” అని.!! Share it
వారణాసి వెళ్లేవారికి vaaranaadi
*కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు...!*
వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి...
సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం. ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.
అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది. అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి
2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు.
1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు. డుంది గణపతి గుడి లోపల ఉంటుంది. స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.
అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది. కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి. గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు. 100 రూపాయలు ఇవమంటారు. 50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు. ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. బియ్యం మన ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.
ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు. ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు. సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. 7 కి హారతి సేవ ఉంటుంది. స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది.
దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు. దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ, మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు. మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది. అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.
రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి,12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.
మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు. స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.
మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం. దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి.
వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు. జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది. కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి. హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
రమణీయములైన చంద్రకాంతులు,
శ్రీరామ (113)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
రమణీయములైన చంద్రకాంతులు,
మనోహరమైన పచ్చికబయళ్లతోకూడిన వనములలో విహారములు,
మొదలైన వన్నీ తాత్కాలికములే.
వాటివల్ల వచ్చే ఆనందం కూడా క్షణికమే, శాశ్వతం కాదు.
ఆ ఆనందం జనన, మరణములను తప్పించలేదు అని గ్రహించడం విషయ వైముఖ్యానికి దారి తీస్తుంది, అన్న భర్తృహరి బోధను ఇంతకు ముందు చెప్పుకున్నాము.
శ్రీ భర్తృహరి మహాయోగి ఇంకా ఇలా అంటున్నారు.
శ్లో //రమ్యం హర్మ్యతలం న కిం వసతయే శ్రావ్యం న గేయాదికం/
కింవా ప్రాణసమా సమాగత సుఖం నైవాధిక ప్రీతయే/
కింతు భ్రాన్త పతంగ పక్ష పవన వ్యాలోల దీపాంకుర/
చ్ఛాయా చంచల మాకలయ్య సకలం సన్తో వనాన్తం గతాః//
(సకల సదుపాయములతో కూడిన విలాస భవనములలో (ఇప్పటి ఫైవ్ స్టార్ హోటళ్లు) నివాసం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
శ్రవణానందకరమైన సంగీతం మనస్సును పరవశంచేసి అద్భుతమైన ఆహ్లాదాన్ని ఇస్తుంది.
ప్రాణసమానురాలైన ప్రియురాలి సాంగత్యం ఎక్కడలేని ప్రీతిని కలిగిస్తుంది.
ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవే.
కానీ ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి.
ఇవేవీ వార్ధక్యాన్ని, జనన, మరణములను తప్పించలేవు.
దీపం చుట్టూ తిరిగే మిడత యొక్క రెక్కల గాలిచేత, కదులుతున్న దీపకాంతి, ఎంత చంచలమో ఈ భోగాలన్నీ అంత చంచలములు.
ఈ విషయం గ్రహించిన మహనీయులు శాశ్వతమైన ఆనందం (మోక్షం) పొందుట కొరకు, సాధన చేసే ఉద్దేశంతో విజనప్రదేశములకు వెళ్తున్నారు).
మానవ జన్మ వచ్చింది శాశ్వతానందం సాధించడానికి గాని, క్షణికానందాల వెంట పరుగులు తీసి సంసారంలో పరిభ్రమించడానికి కాదని భర్తృహరి బోధల సారాంశం.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
16-3-'26
అంబలి
అంబలి యొక్క ఉపయోగాలు -
రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి
ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని , రుచిని కలిగిస్తుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వలన శక్తివంతంగా తయారవుతారు. ఇది చలువచేస్తుంది. అన్నహితాన్ని కలగజేస్తుంది.అలసటని పోగొడుతుంది.
రక్తపోటు , షుగర్ వ్యాధి ఉన్నవారికి , రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నవారికి , నీరసంతో క్షీణించిన వారికి , అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం .
అంబలి అంటే ధాన్యపు పిండితో కాచిన జావ మొలకెత్తిన ధాన్యంతో జావకాస్తే జీవనీయ విలువలు మర్రిన్ని శరీరానికి అందుతాయి. ధాన్యాలలోకెల్లా రాగులు శ్రేష్టం . అందుకని రాగిఅంబలి గురించి మీకు తెలియజేస్తున్నాను. బియ్యపుపిండితో కూడా అంబలి చేసుకోవచ్చు . అది కెలోరీలు పెంచుతుంది . కొన్ని వ్యాధుల్లో అపకారం చేస్తుంది .
బలకరంగా , వీర్యపుష్టిని ఇచ్చేదిగా రాగి అంబలి మేలు చేస్తుంది ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగడం వలన శరీరదృడత్వం పెరుగుతుంది. స్థూలకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి ఉదయం రాగి అంబలి తాగడం శ్రేయస్కరం.
మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.
గమనిక ~
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
వెండిపళ్ళెరమున
🪷 *"శుభోదయ సుప్రభాతం"* 🪷
ఆ.వె.
వెండిపళ్ళెరమున వేడ్కగా కుంకుమ
నింపి నింగి నుంచ నెగడినట్లు
తూర్పుదిక్కునందు తొంగిజూచె నినుడు
తెల్లవారెను నేస్తమా! తీరు లెమ్ము!
*~శ్రీశర్మద*
నేటి వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - ద్వాదశి - ధనిష్ట - ఇందు వాసరే* (16.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
