5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా.

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి * 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం.

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్.


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 


🙏 ఇంతటి ఘన కీర్తి గల తెలుగు నేల *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* 🙏

శిల్ప సంపద













 

బ్రాహ్మణ సభ

 శ్రీమహగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః 


జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం  ఏడున్నర సంవత్సరాల క్రితం 2012 శంకర జయంతి నాడు  బ్రాహ్మణ సభ (పంచ ద్రావిడ)  అనే సంస్థ  ప్రారంభించబడింది.  


పంచ ద్రావిడ ప్రాంతాలు అంటే వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కున ఉన్న తెలుగు తమిళ కన్నడ మళయాళ మరాఠీ,  గుజరాతీ భాషలు మాట్లాడే ప్రాంతాలు. ఇందులో తమిళ మళయాళాలని ఒకే భాషగా లెఖ్ఖ వేస్తారు .  బ్రాహ్మణ కనీస ఆచారాలని ఆచరణ ద్వారా కాపాడుకోవడం , బ్రాహ్మణ యువతకి సకాలంలో వివాహాలు జరిగేలా చూడటం , ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడం లాంటి ఆశయాలతో ఈ సభ ఆరంభించ బడినది . 


బ్రాహ్మణ శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రతి నెల చండీహోమం , యువత కోసం మార్గ దర్శనం , సమస్యల చర్చ,  పరిష్కారం కోసం గోష్టి , పిల్లల్లో, బ్రాహ్మణ యువతలో  నాయకత్వ ధోరణి , సేవా ధోరణి పెంచడానికి కార్యక్రమాలు, సకాలంలో వివాహం జరగడానికి జాతక పరివర్తన కార్యక్రమం ఇలాంటి మరెన్నో కార్య క్రమాలు బ్రాహ్మణ సభ నిర్వహిస్తోంది. 


గృహస్తులకున్న బాధ్యతల్లో బ్రహ్మచర్యాశ్రమం లో ఉన్న బ్రహ్మచారుల, సన్యాసాశ్రమం లో ఉన్న సన్యాసుల  పోషణ ఉన్నాయి . 


వేదం చదువుకుంటున్న విద్యార్థులకోసం  వంటకి ముందు ప్రతి బ్రాహ్మణ గృహిణి ఒక గుప్పెడు బియ్యం ఒక సంచీలో వేసి , చండీ హోమం నాడు, వేదికకి తీసుకు వస్తారు. అక్కడ ఆ బియ్యాన్ని అందరూ పెద్ద సంచులలో నింపుతారు. ఈ సమీకరించిన బియ్యం వేద పాఠశాల విద్యార్థులు భిక్షగా స్వీకరించి  , సభ్యులకి ఆశీర్వచనం చదువుతారు.     ఈ విధంగా పరమాచార్యులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి  వారి గుప్పెడు బియ్యం పధకం, గత నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణ సభ విజయవంతంగా నిర్వహిస్తోంది.  కుక్షౌ తిష్టతి యస్యాన్నమ్, వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్.  విద్యార్ధులు వేదాభ్యాసం ద్వారా మనం సమర్పించిన అన్నాన్ని జీర్ణం చేస్తే మన ముందు పది తరాలు తరవాత పది తరాలు కూడా తరిస్తాయని పెద్దలు చెప్పారు .  


బ్రాహ్మణ సభ తరఫున సభ్యులందరం కలిసి ప్రతి నిత్యం కంచి శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి భిక్షావందనం చెయ్యాలని సంకల్పించాము. ఒక రోజు కంచి కామకోటి పీఠాధిపతికి భిక్ష చెయ్యడం అంటే ఆయన పరివారానికి  ఆయన చేసే త్రికాల పూజలకి, గోశాలకి, వేదపాఠశాలకి, బ్రాహ్మణ సంతర్పణకి  ఏర్పాట్లు చెయ్యడం. ఒక సామాన్య గృహస్తుకి అంత ఖర్చు పెట్టుకోవడం కష్టం కాబట్టి , మఠం వారు మూడువేల రూపాయల్ని భిక్షావందన కనీస శుల్కంగా ఏర్పాటు చేశారు.  కానీ కొద్ది మందికి అది కూడా కష్టం కావచ్చు . ఒకవేళ కష్టం కాకపోయినా ప్రతి రోజూ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం అందరం కలిస్తే ప్రతి నిత్యం యతిభిక్ష చేసే అవకాశాన్ని పొందవచ్చు. అలా చెయ్యలనే కోరికే ఇప్పుడు బ్రాహ్మణ సభ సభ్యులు ప్రస్తావిస్తున్న నిత్య భిక్షావందనంగా మారింది. 


క్రితం సంవత్సరం ఇలా నిత్య భిక్షావందనం ఆరువేల మంది కలిసి చెయ్యలని సంకల్పించి సమీకరణ పూర్తి చేశాము. ఆ భిక్షా వందనం మార్చి 2021 వరకూ ప్రతిరోజూ జరుగుతుంది. ఈ సంవత్సరం ( 29 మార్చి 2021 నుంచి 28 మార్చి 2022 వరకూ ) మళ్ళీ ఒక్కొక్కరూ  365 రూపాయలు ఒక నిధిలోకి ఇస్తాము పన్నెండు వేల మంది కలిసి. అవి రోజుకి పన్నెండువేల లెఖ్ఖన ఒక ఏడాది పాటు కంచిలో శంకరాచార్యులకి భిక్షావందనం చెయ్యడానికి సరిపోతాయి.


ఇన్ని మఠం  కార్య క్రమాలలోకి మనదొక రూపాయ / చంద్ర మౌళీశ్వర పూజోపహారాలలో ఒక్కపువ్వు  , మఠం చేసే బ్రాహ్మణ సంతర్పణలో ఒక మెతుకు మనద్రవ్యంతో,  ప్రతి రోజూ, ఏడాది పాటు జరిగితే వచ్చే ఫలితం అనంతం. కైలాసం నుంచి ఆదిశంకరులు తెచ్చిన యోగ లింగానికి నిత్యంచేసే త్రికాల పూజలో మన ద్రవ్యం ఉపయోగపడటం మన కుటుంబాలని తరింపజేస్తుంది. ఈ అవకాశం పన్నెండు వేల మంది బ్రాహ్మణ సభ సభ్యులకు మాత్రమే. 


ఆసక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణ సభ కార్యకర్తలని సంప్రదించి ముందుగా బ్రాహ్మణ సభ సభ్యత్వ సంఖ్య పొందాలి. ఇదివరకూ ఎప్పుడైనా మీరు చండీ హోమానికి ద్రవ్యం సమర్పించి ఉంటే ఈపాటికే మీకు సభ్యత్వ సంఖ్య ఉండి ఉంటుంది. 


డబ్బు రూపంలో కానీ, చెక్కుల ద్వారా కానీ బాంకు ట్రాన్స్ఫరు ద్వారా కానీ ఈ సమర్పణ చెయ్య వచ్చు.  రసీదులు ఈమెయిలు  లో పంప బడతాయి. మీకు లేకపోతే ఇంట్లో  పిల్లలదో ,పెద్దలదో ఈమెయిలు ఇవ్వవచ్చు. అలాగే ఫోను నంబరు కూడా.  నెలకొక్క సారి కంచి నుంచి వచ్చే వాళ్ళు భిక్షావందన ప్రసాదం చండీహోమం వేదిక దగ్గర భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తారు .   వచ్చిన వాళ్ళు స్వీకరించ వచ్చు . 

ఇతర వివరాలకు సంప్రదించండి 

మంగిపూడి సత్య నారాయణ మూర్తి 9866368486

జయ జయ శంకర హర హర శంకర

మొగలిచెర్ల

 *వృద్ధ దంపతులు..*


"మీరు ప్రత్యేకించి మా కోసం రూము ఇవ్వకపోయినా పర్వాలేదు..మేమిద్దరం సర్దుకుపోతాము..మంటపం లో పడుకుంటాము..ఎంతవరకు మనకు ప్రాప్తమో అంతవరకే అనుభవించాలి..దేవుడు కేటాయించిన దానినే సంతోషంగా స్వీకరించాలి..మనది కానీ వస్తువు మన దగ్గర నిలువదు..దానికోసం నువ్వు ఎంత కాపలా కాసినా..చివరకు అది చేరవలిసిన చోటుకే చేరుతుంది..ఈ సత్యం అవగతం కావడానికి మా ఇద్దరికీ యాభై ఏళ్ళు పట్టింది.." అని ఆ వృద్ధ దంపతులలో ఉన్న భర్త చెప్పారు..డెబ్బై ఏళ్ల వయసులో ఆ ఇద్దరూ ఎంతో ఉషారుగా వున్నారు..ముఖం లో సంతోషమే తప్ప, మచ్చుకు కూడా నైరాశ్యం లేదు..ఆ దంపతులది బెర్హంపూర్..బరంపురం అని మనం పిలుస్తాము..తెలుగు వాళ్లే..కానీ అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలలో వీళ్లదీ ఒకటి..


"మీరు శ్రమ పడవద్దు..ఒక రూము కేటాయిస్తాను..అందులో వుండండి..ఈ క్షేత్రం గురించి మీకెలా తెలుసు..అందులోనూ మీరుండేది ఒరిస్సాలో.." అన్నాను కుతూహలం పట్టలేక..ఆయన నా వైపు నవ్వుతూ చూసి.."మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి..ఆ స్వామివారి క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము..పోయిన సంవత్సరం పెంచలకోన లో వెలసిన లక్ష్మీ నారసింహుడిని దర్శనం చేసుకున్నాము..అక్కడ మాల్యాద్రి గురించి అదే మాలకొండ గురించి విన్నాము..అప్పుడు మాకు కుదరలేదు..ఈ సంవత్సరం వీలుచూసుకొని..అందులోనూ శనివారం నాడు మాత్రమే మాలకొండలో దర్శనం కనుక అలా ఏర్పాటు చేసుకొని వచ్చాము..అక్కడ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నాక..మా కారు లో కూర్చోబోతుండగా..ఎవరో ఒక సాధువు లాగా వున్నాడు..అతను మా దగ్గరకు వచ్చి.."ఇక్కడ దగ్గరలోనే అవధూత దత్తాత్రేయుడి గుడి ఉంది..అక్కడికి వెళ్ళండి..మీకు శుభం జరుగుతుంది.." అన్నాడు..అతనిని విచారిస్తే..ఈ స్వామివారి గురించి చెప్పాడు..దగ్గరే కదా అని ఇటు వచ్చాము.." అన్నారు..


"ఈరోజు స్వామివారి పల్లకీసేవ ఉన్నది..అందులో పూజ చేయించుకోండి..రేప్పొద్దున్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళొచ్చు.." అన్నాను.."బాబూ..ఇక్కడ సమాధి చెందిన అవధూత చాలా సిద్ధపురుషుడని విన్నాను..మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే..ఆ కోరిక తీరుతుందని అందరూ చెపుతున్నారు..నిజమేనా..?" అని అడిగారు.."అదొక విశ్వాసం..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు తప్పక కరుణిస్తారు..నా కళ్లారా చాలామంది బాగుపడటం చూసాను.." అన్నాను.."ఓహో..అలాగా.." అన్నారు..ఆ తరువాత పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఇద్దరూ పెద్దవాళ్లే అయినా..పల్లకీ తో పాటు మందిరం చుట్టూ..ఇతర భక్తుల తో కలిసి ప్రదక్షిణాలు చేశారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని నాతో వెళ్ళొస్తామని చెప్పి..వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..


మరో పది నెలల తరువాత..ఆ దంపతులు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..అదీ శనివారం నాడే వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కోడలిని వెంటపెట్టుకొని వచ్చారు..మధ్యాహ్నం మూడు గంటల వేళ, నా దగ్గర కూర్చుని.."బాబూ..పోయినసారి మేమొచ్చినప్పుడు నువ్వు..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు కరుణిస్తారు.." అని చెప్పావు గుర్తుందా?..మేమిద్దరమూ ఆ మాట నమ్మి..మా మనుమరాలి పెళ్లి గురించి మొక్కుకున్నాము..ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళు నిండాయి..వివాహం కాలేదు..నా కుమారుడు, కోడలు బాగా వ్యధ చెందుతున్నారు..ఈ స్వామివారి వద్ద మేము మొక్కుకొని వెళ్లిన నెలన్నర కు అమ్మాయికి కేరళ నుంచి సంబంధం వచ్చింది..వాళ్ళూ తెలుగు వాళ్లే..మాట్రీమోనీ ద్వారా చూసారట..సంప్రదించారు..ఆ అబ్బాయికి ముప్పై రెండేళ్లు..వాడికి వివాహం కాలేదని వాళ్ళూ మథన పడుతున్నారు..మొత్తం మీద పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారు..నెల తిరక్కుండానే పెళ్లి చేసాము..ఇప్పుడు ఇద్దరూ కాపురం చేసుకుంటున్నారు..పైగా అమ్మాయి గర్భవతి కూడా..స్వామివారి మహిమే అని మా ఇద్దరికీ అర్ధం అయింది..మా కుమారుడికి చెప్పాము..వాళ్ళూ వస్తామని చెపితే..అందరం కలిసే వచ్చాము.." అన్నారు.."నా కళ్ళముందే..ఫలానా బరంపురం వాళ్లకు కూడా..స్వామివారి సమాధి దర్శనం తరువాత వాళ్ళ కోరిక నెరవేరింది..అని నువ్వు గట్టిగా..మాకు చెప్పినట్టే..అందరికీ చెప్పొచ్చు.." అని నవ్వుతూ చెప్పారు..ఆ వృద్దాప్యం లో ఆ దంపతుల ఓపిక కు నాకు ముచ్చటేసింది..పైగా ఇద్దరూ ఎంతో సంతోషంగా వున్నారు..


సంవత్సరం క్రితం వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసి.."అమ్మా నాన్న మొగలిచెర్ల రావాలని ఒకటే పట్టుబడుతున్నారు..నాకు వీలు కావడం లేదు..ఇంతకుముందు లాగా వాళ్ళను ఒంటరిగా పంపలేము..బాగా పెద్దవాళ్ళై పోయారు..స్వామివారి విభూతి పంపండి..త్వరలోనే అందరమూ వస్తాము.." అన్నాడు..విభూతి పోస్ట్ లో పంపాము..మరో మూడు నెలలకు ఆ దంపతులను తీసుకొని అతను వచ్చాడు..స్వామివారి సమాధి దర్శనం చేసుకున్న తరువాత.."బాబూ..ఈసారి స్వామివారిని మేమిద్దరమూ ఒకే కోరిక కోరాము..ఇప్పటి వరకూ మంచి జీవితాన్ని గడిపాము..మంచి మరణాన్ని ప్రసాదించమని వేడుకున్నాము..ఇక స్వామి దయ..మా ప్రాప్తం.." అని చెప్పారు..ఆ దంపతుల ముఖం లో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత..ఆరోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోయారు..


మరో మూడు నెలలకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి....."నాన్నగారు నెల క్రితం మరణించారండీ..ఏ ఇబ్బందీ పడకుండా ఒక్కరోజు కూడా అనారోగ్యం పాలు కాకుండా..నిద్రలోనే తుది శ్వాస విడిచారు..ఆయన కోరుకున్నట్టే అనాయాస మరణం లభించింది.."అని చెప్పాడు..వార్త విన్నప్పుడు బాధ వేసినా..ఆయన కోరుకున్నది అదే కదా..అని అనిపించింది..చివరి వరకూ స్వామివారినే నమ్మి వున్నారు..స్వామివారూ వాళ్ళు కోరుకున్నది ప్రసాదించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దేవాలయ దర్శనం

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!__*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_💐🙏🙏🙏💐

కల్పాలు

 కల్పాలు


🍁🍁🍁🍁🍁 

 


కల్పాలు పద్దెనిమిది ఉన్నాయని భవిష్య పురాణం చెబుతోంది. 

ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులు. ఒక్కో కల్పంలో నాలుగు పాదాలు ఉంటాయి. అవన్నీ సమానమైన కాలావధి లో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం లోని వైవస్వత మన్వంతరం. అందుకే సంకల్పం చెప్పుకునే టప్పుడు తిధి చెబుతూ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అంటూ చెప్పుకుంటాం. ఇక ఈ కల్పాల పేర్లు విషయానికి వస్తే అవి 

కూర్మ కల్పం 

మత్స్య కల్పం 

శ్వేతవరాహ కల్పం 

నృసింహ కల్పం 

వామన కల్పం 

స్కంద కల్పం 

రామ కల్పం 

భాగవత కల్పం 

మార్కండేయ కల్పం 

భవిష్య కల్పం 

లింగ కల్పం 

బ్రహ్మాండ కల్పం 

అగ్ని కల్పం 

వాయు కల్పం 

పద్మ కల్పం 

శివ కల్పం 

విష్ణు కల్పం 

బ్రహ్మి కల్పం

ప్రస్తుతం నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం. 

అంటే భవిష్య పురాణం ప్రకారం వరుసలో మూడో కల్పం 

దీని తరువాత 15 కల్పాలు ఉన్నాయి అందులోని ప్రతి దానిలో మన్వంతరాలు ఉన్నాయి. 

ప్రతి మన్వంతరం లోనూ నాలుగు యుగాలు ఉంటాయి. 

ఈ చక్రం అంతా పూర్తయిన తర్వాతనే సంపూర్తి లయం.

 ఈలోగా ప్రతి కలియుగాంతంలో జల ప్రళయం వచ్చి లో దుష్ట ప్రకృతి కి చెందిన వారినందరిని అంతం చేస్తుంది.

 మిగిలిన కొద్ది మంది మంచివాళ్ళతో మరో మన్వంతరంలోని సత్య యుగం ఆరంభం అవుతుంది.


🍁🍁🍁🍁

సత్యనారాయణ స్వామి వారి వ్రతం

 *సత్యనారాయణ స్వామి వారి వ్రతం లో చేసే పొరపాట్లు..* 


---చాగంటి వారి ప్రవచనం నుండి....

       సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనాాయణస్వామి వ్రతంలో ప్రధానమైన అంగం మంటపదానం చేయడం. మొట్టమొదట స్కాందం లో ఒక షరతు ఉంది. మీ శక్తికి లోటు చేయకుండా మీరు సువర్ణమూర్తిని గానీ, రాగిమూర్తిని కానీ ఏదో ఒకటి పెట్టాలి. మనం ఎప్పుడూ ఏమి చేస్తామంటే .... ఒక కలశ పాత్ర పెట్టీ సత్యనారాయణ స్వామివారి ఫోటో తీసుకువచ్చి అక్కడపెట్టి వ్రతం చేసేసిన తరువాత చివరలో మంటపదానం చెయ్యమని మంటపమున్న తువ్వాలును కొద్దిగా ఎత్తమంటారు. ఎత్తిన తరువాత అందులో ఉన్న బియ్యము, తువ్వాలు పురోహితుని కి ఇచేస్తాము. ఇంకా కొంతమంది ఐతే ఇంటికి వచ్చినవాళ్ళు చూడాలని మంటపంలో ఒక వెండి అష్టలక్ష్మీ చెంబు పెడతారు. .... అష్టలక్ష్మీ చెంబును, మంటపంలో పెట్టీ పూజ చేసిన స్వామివారి మూర్తిని వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటా రు. నీవు మంటపంలో మూర్తిని పెట్టీ పూజ చేసిన తరువాత మంటపాంతర్గతంగా ఉన్న మూర్తిని కూడా నీవు దానం చేసెయ్యాలి. నువ్వు దానం చేశానని చెప్పి దానిని మరల ఇంట్లో పెట్టుకుంటే వెంటనే పొరపాటు చేసినట్లే. 

          అలాగే సత్యనారాయణ స్వామీ వ్రతంలో గ్రహములను పిలుస్తాము. పిలిచినప్పుడు ఆయన ఒక రంగు బట్టలు కట్టుకుంటారు. ఒక వాహనం ఎక్కుతాడు. కొన్ని ఆభరణములు వేసుకుంటాడు. ఆయనతో బాటుగా ఆయన పరివారం వస్తుంది. వాళ్ళు వస్తున్నప్పుడు ధ్యాన శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములలో ఉన్న శబ్దశక్తికి ఆ గ్రహములు వచ్చి కూర్చుం టాయి. అపుడు మంటపంలో సత్యన్నారాయనుడు వచ్చి కూర్చుంటాడు


. ఆఖరున కథ చెపుతారు. కథ మార్చడానికి వీల్లేదు. 


కథలో ప్రారంభంలో ముందు వ్రతమును బ్రాహ్మణుడు చేస్తాడు. అక్కడికి మంచినీళ్ళ కోసమని ఒక శూద్రుడు కట్టెలు కొట్టుకునేవాడు వస్తాడు. దాహం కోసమని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానము చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు. మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి కట్టెలు అమ్మిన డబ్బుతో వ్రతం చేస్తాడు. ఇద్దరికీ ఫలసిద్ధి కలుగుతుంది. చాతుర్వర్ణ ములవారు ఎలా ఈశ్వరుని పాదములు చేరుకో వాలో కథలో రహస్య మంతా అంతర్భాగం గా ఉంటుంది. 


🍁🍁🍁🍁

గ్రహణ సమయంలో

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు?

⚫⚫⚫⚫⚫

దర్భలు ఎందుకు వాడాలి?

గర్భిణీ స్త్రీలు ఎందుకు చూడకూడదు?

⚫⚫⚫⚫⚫

దర్భల మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి  నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.

అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుంది. అని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది

సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ *వివరణ* చదవాల్సిందే. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.

ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. *గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగివున్నది*. అందుకే గ్రహణం సమయంలో  మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.

గ్రహణ సమయంలో జాగ్రత్తలు

వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.  కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.

ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసి శాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.

*ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి*.ఇంటిలో గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.

ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం

ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.

అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారంటున్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏