30, అక్టోబర్ 2023, సోమవారం

Action behind the scenes


 

వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల

 మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ  - 


      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను .  అవి 


     *  ప్రేవులు . 

     *  మూత్రపిండములు . 

     *  ఉపిరితిత్తులు . 

     *  చర్మము . 


  *  ప్రేవులు  - 


        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే      " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 


                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 


*  మూత్రపిండములు  - 


 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 


 *  ఊపిరితిత్తులు  - 


     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము  ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 


 *  చర్మము  - 


     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 


       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 


             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 


            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 


               సమాప్తం 


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 



     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

శ్రీ బ్రహ్మ ఆలయం

 🕉 మన గుడి : నెం 224





⚜ గోవా  :  వాల్పోయి


⚜ శ్రీ బ్రహ్మ ఆలయం


💠 బ్రహ్మదేవుడకి చెందిన ఆలయాలు అక్కడక్కడా  అనేక మందిరాలు ఉన్నప్పటికీ, అతని గౌరవార్థం స్వతంత్ర ఆలయాలు చాలా అరుదు. భారతదేశం మొత్తంలో ఆయనకు మాత్రమే అంకితం చేయబడిన 10 కంటే తక్కువ దేవాలయాలు ఉన్నాయి.  



💠 ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం, లింగోద్భవ సమయంలో బ్రహ్మ, శివుని లింగం యొక్క మొదలు  కనుగొన్నటు  అబద్ధాన్ని చెప్పినప్పుడు, అది శివుడికి కోపం తెప్పించింది, అతను తన స్వంత ఆరాధనను కలిగి ఉండవని

బ్రహ్మను శపించాడు. 

అప్పటి నుండి, బ్రహ్మదేవునికి నిత్య ఆరాధన , ఆలయాలు లేకుండా పోయాయి.


💠 భారతదేశం అంతటా చాలా తక్కువ బ్రహ్మ దేవాలయాలను కనుగొంటారు, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో అత్యంత ప్రసిద్ధమైనది. 

బ్రహ్మ దేవాలయాల యొక్క ఇతర కొన్ని ఉదాహరణలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మరియు గోవాలో కనిపిస్తాయి. 

అయితే శివ, దేవి లేదా విష్ణు ఆలయాల మాదిరిగా కాకుండా, ఈ ఆలయాలు ప్రజలలో ప్రాచుర్యం పొందలేదు. 


💠 గోవాలో బ్రహ్మ-కర్మాలి వద్ద బ్రహ్మ దేవుడికి స్వతంత్రంగా అంకితం చేయబడిన ఒక ప్రత్యేక మందిరం ఉంది.

ఈశాన్య గోవాలోని కారంబోలిమ్ (బ్రహ్మ-కర్మాలి అని కూడా పిలుస్తారు) వద్ద ఉన్న ఆలయం అంతగా ప్రసిద్ధి చెందలేదు.  

ఇక్కడ పూజించబడుతున్న విగ్రహం 11వ శతాబ్దాల శిల్పకళలో అద్భుతంగా ఉంది.

ఈ ఆలయం 450 సంవత్సరాలకు పైగా పురాతనమైనది

 గోవాలోని స్థానికులతో సహా చాలా మందికి ఈ ఆలయం ఉనికి గురించి తెలియదు.



💠 ఈ ఆలయంలోని బ్రహ్మ విగ్రహం ఎత్తుగా మరియు సొగసైనదిగా ఉంది.

బ్రహ్మ యొక్క  చిత్రం కదంబ కాలం నాటిది. మారుతీ ఆలయం రాత్రిపూట అందంగా వెలిగిపోతుంది మరియు ప్రకాశవంతంగా వెలిగించడం వల్ల ఆలయం దూరం నుండి కనిపిస్తుంది.


💠 ఆకుపచ్చ నేపథ్యంలో ప్రకాశవంతమైన నారింజ రంగులో పెయింట్ చేయబడిన పంజిమ్‌లోని అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి!


💠 ఈ ఆలయంలో మరియు బ్రహ్మ విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కదంబ కాలంలో నల్ల రాయితో చెక్కబడిన అసలైన మొదటి శిల్పం.  


💠 ఆలయం లోపల బ్రహ్మదేవుని విగ్రహం బ్రహ్మ - విష్ణు - మహేషుల త్రిమూర్తులు అయిన త్రిమూర్తి రూపంలో బ్రహ్మను చూపించారు.

గోవాలోని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, 16వ శతాబ్దంలో తిస్వాడి ద్వీపాన్ని పోర్చుగీసు వారు స్వాధీనం చేసుకున్నారు మరియు ఆలయం నాశనం చేయబడుతుందనే భయం ఉంది.

అందుకే 1541లో, బ్రహ్మ భక్తులు పాత గోవాలోని కర్మాలి గ్రామం నుండి విగ్రహాన్ని  తరలించి, రహస్య పద్ధతిలో, అప్పటికి పోర్చుగీసు పాలనలోకి రాని సత్తారి తాలూకాకు తీసుకువెళ్లారు.


💠 సత్తారి తాలూకా 1781లో పోర్చుగీసు పాలనలోకి వచ్చింది. భక్తులు విగ్రహాన్ని వాల్‌పోయి గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నాగర్‌గావ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నది ఒడ్డున ఉన్న చిన్న మందిరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  

ఈ చిన్న కుగ్రామం తరువాత బ్రహ్మ  మరియు దాని మూలం కర్మాలి గ్రామం (తిస్వాడి తాలూకాలో) మరియు అందుకే బ్రహ్మ కర్మాలి అని పేరు వచ్చింది.


💠 బ్రహ్మ దేవుడు ముఖం మీద గడ్డం కలిగి ఉన్నాడు.  

తన నాలుగు చేతులలో, అతను తన ఎగువ కుడి చేతిలో గరిటె, ఎడమ ఎగువ చేతిలో వేదాలు, దిగువ ఎడమ చేతిలో కమండలం మరియు వరముద్ర భంగిమలో తన దిగువ కుడి చేతిలో పూసలు (మాల) జపిస్తూ ఉంటాడు.


💠 అతని భార్యలు సావిత్రి మరియు సరస్వతి ఇరువైపులా నిలబడి ఉన్నారు.  

మూడు చిన్న గూళ్లలో, మధ్య గూడులో గణపతి, కుడి వైపున ఎద్దుపై శివుడు, ఎడమ గూడులో విష్ణువు ఉన్నారు.


💠 శతాబ్దాల నాటి అసలు ఆలయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కూల్చివేసి, దాని స్థానంలో కొత్తది నిర్మించబడింది, అయితే పాత ఆలయంలోని కొన్ని అంశాలను అలాగే ఉంచారు.



💠 ఇది గోవాలోని కలంగుట్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

మంగళవారము."* *"అట్లతదియ నోము."*

 రేపే 

*"31-10-2023, మంగళవారము."*

*"అట్లతదియ నోము."*


ఈ నోము చేసుకోవడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం.


ఈ పండుగలో అమ్మ వారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తే కుజ దోష పరిహారమై సంసార సుఖంలో ఎలాంటి అడ్డంకులు రావని విశ్వసిస్తారు. 


కుజుడు రజోదయమునకు కారకుడు. కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. 


మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన గర్భస్రావం రాకుండా, సుఖప్రసవం అయ్యేందులు దోహదపడుతుంది. ఈ పండుగను ఉత్తర భారత దేశంలో "కర్వాఛౌత్" అనే పేరుతో జరుపుకుంటారు.


అట్లతద్ది ముందు రోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్లతద్ది రోజు ఆడవాళ్ళు రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంటిలో తూర్పు దిక్కున మండపం ఏర్పాటు చేసి గణపతి పూజ చేసి తర్వాత గౌరీదేవి పూజ చేస్తారు. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, గౌరీ స్తోత్రాలు, లలితా సహస్ర నామ పారాయణము చేసి పాటలు పాడతారు. 


సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం తిరిగి గౌరీపూజ చేసి పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి, పదకొండుమంది ముత్తైదువులకు అలంకారం చేసి పదకొండు అట్లు, పదకొండు పండ్లు వాయనంగా ఇస్తారు. 


అట్ల తద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు తలపై వేసుకుంటారు. ముత్తైదువులకు నల్లపూసలు, లక్క కోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాను ఇచ్చి భోజనాలు పెట్టి, తర్వాత తాము భోజనం చేస్తారు.

How he balanced


 

London Goldman


 

Circus


 

Autowaala


 

Gava chat


 

Tongue country


 

Electric moped

Electric moped st 65 thousands 

Bed sheets

Bed sheets wholesale 

Hyderabad to poducherry trip

Hyderabad to ponducharry trip 

Temple

Temple open once in a year 

Ananta padbhanaabha temple

Ananta padbhanaabha temple in kothut

Harsha catering

Harsha catering services in Hyderabad

Hyderabad to mysore trip

Hyderabad to Mysoy Trip  

Tippa teegs

 https://youtu.be/9xWfHNGV8B0?si=4SlZcUAOUW_N923z


సోమవారము, అక్టోబర్, 30, 2023

 సోమవారము, అక్టోబర్, 30, 2023

-----------------------------------------

మాసం: ఆశ్వయుజము

ఆయనం: దక్షిణాయణం

పక్షము: కృష్ణ పక్షము

ఋతువు: శరత్ ఋతువు

అమృతకాలము: 01:41, అక్టోబర్ 31 నుండి 03:14, అక్టోబర్ 31 వరకు

సూర్యోదయము: 06:14

సూర్యాస్తమయము: 17:46

రాహు కాలం: 07:40 నుండి 09:07 వరకు

యమగండము: 10:33 నుండి 12:00 వరకు

దుర్ముహుర్తములు: 12:23 నుండి 13:09 వరకు, 14:41 నుండి 15:27 వరకు

అభిజిత్: 11:37 నుండి 12:23 వరకు

కరణం: తైతిల 11:0 వరకు, బవ 22:22 వరకు

చంద్రోదయం: 18:56

చంద్రాస్తమయం: 07:28

చంద్ర రాశి: మేషం 10:28

తిథులు: విదియ 22:22 వరకు

నక్షత్రము: కృత్తిక 04:01, అక్టోబర్ 31 వరకు

గుళిక కాలం: 13:26 నుండి 14:53 వరకు

శక: 1945 శోభకృత్

వర్జ్యం: 16:21 నుండి 17:55 వరకు

యోగా: వ్యతీపాత 17:33 వరకు


 

Checkout Telugu Calendar Panchangam App: 

 IOS :  https://itunes.apple.com/app/telugu-calendar/id1448360812

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


రూపయౌవనవతియైన అహల్య తపశ్శీలుడైన గౌతమునికి భార్య అయ్యింది. ఇంద్రుడితో

వంచనకు గురి అయ్యింది. భర్త శపించాడు. తన తప్పు తెలుసుకుంది. పశ్చాత్తాపం పొందింది. ఇలాంటి

ధర్మ విపర్యయాలు జరుగుతాయి అననురూప వివాహాలవల్ల. అందుచేత సుకన్యను ఈ చ్యవనుడికి

ఇవ్వము. మూత్రబంధన బాధను అనుభవిస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చి, మౌనంగా సాలోచనగా

విష్క్రమించి ఇంటికి చేరుకున్నాడు. మంత్రులను సమావేశపరిచాడు. ఈ ధర్మసంకట పరిస్థితిలో

మీరంతా బాగా ఆలోచించి నాకేదైనా మార్గం చూపించండి. ఏమి చెయ్యమంటారో చెప్పండి అని సలహా

అడిగాడు. అందరూ ముక్తకంఠంగా ఒకేమాట చెప్పారు. ఒక కురూపి వృద్ధతపస్వికి ఇంతటి సుందరాంగి

సుకన్యను ఇమ్మని ఎవరుమాత్రం ఎలా చెబుతారు అన్నారు. శర్యాతి ఏ దారీ దొరకక మథనపడుతున్నారు.

సుకన్యకు ఈ సంగతి తెలిసింది. చిన్నగా నవ్వుకుంది. సరాసరి తండ్రిని చేరుకుంది.

నాన్న గారూ! ఇందులో మీరు ఇంతగా మధనపడవలసిందీ దిగులుపడవలసిందీ ఏమీ లేదు. నేనిప్పుడే

వెళ్ళి ఆ మహర్షిని ఓదారుస్తాను. ప్రసన్నుణ్ణి చేసుకుంటాను. నన్ను నేను సమర్పించుకుంటాను అంది.

అమ్మా! ఏమిటి ఈ సాహసం. నువ్వు ఆ వృద్ధుడికి పరిచర్యలు చేస్తావా? అందునా ఆ

ఘోరారణ్యంలో ఒంటరిగా? అతడు అసలే క్రోధనుడు. అంధుడు. ఇవ్వి ఆలోచించావా? ఏ తండ్రి

అయినా కన్న కూతురిని అందగాడికీ యువకుడికీ ధనవంతుడికీ విద్యావంతుడికీ గుణవంతుడికీ

ఇవ్వాలనుకుంటాడేగానీ ఇలాంటి కురూపికీ వృద్ధుడికి తాపసికీ ఇవ్వాలనుకుంటాడా? కూతురు

ఇష్టపడితేమాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడ ఆ చ్యవనుడెక్కడ? ఏ ఒక్క అంశంలోనూ

అమరూపత లేదే. ఎలా అంగీకరించను తల్లీ! ఇది అన్యాయం. అంతఃపురసాధాలలో నివసించిన

కూతురికి అడవుల్లో పర్ణశాలల్లో నివాసం కల్పించనా? ఇంతకన్నా నేను నా సైనికులూ ఈ అనారోగ్యంతో

ఇలా మరణించడమే మంచిది. ఏది జరగాలని రాసిపెట్టిఉందో అది జరుగుతుంది. అంతే. నేను బేంబేలు

పడిపోయి చూస్తూ చూస్తూ నీకు అన్యాయం చెయ్యను, చెయ్యలేను. అమ్మా! నువ్వు స్థిరచిత్తంతో ఉండు.

ఏ అంధుడికీ నిన్ను ఇవ్వనుగాక ఇవ్వను. ఈ రాజ్యం, ఈ దేహం ఉంటే ఉండనీ, పోతే పోనీ. బాధలేదు.

ఇది నా నిర్ణయం. ఇది నా నిశ్చయం.

Sivalingam


 

మల్లికార్జునుడు

 శ్రీశైలం వృద్ధ మల్లికార్జునుడు...

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది.

మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరునిసౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది.

ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. 

అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. 

కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. 

అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తితత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవుఇక్కడఎవరికోసంవెతుకుతున్నావు అని అడిగాడు.

ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. 

చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు.

అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. 

అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. 

అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆకాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. 

ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. 

ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. 

అది మన తెలుగునాట ఉన్న కొండఅక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. 

ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. 

ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. 

సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి.ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది.

ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

Kidney medicine


 

Caring children


 

Pochamms


 

అందం’ అంటే ఏంటి

 *‘అందం’ అంటే ఏంటి నాన్నా? అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే*


*నాన్న చెప్పిన సమాధానం*


*“రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా’ అని చెప్తావు చూడు ఆ పలకరింపే ‘అందం’ అంటే.*


*”స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే.*


*”ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే ‘మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు, కావాలంటే నన్నడుగు’ అంటూ ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అన్నావు చూడు అదే అందమంటే.*


*”షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే ‘కాస్ట్లీ అయితే వద్దు నాన్నా’ అంటావు చూడు అదే అందమంటే.*


*”అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి ‘స్మైల్ నాన్నా!’ అంటావు చూడు అదే అందమంటే.*


*నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.*


*”అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే.*


*”నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు ‘అలా ఉన్నావేంటి నాన్నా అంతా ఓకే అవుతుందిలే’ అంటావు చూడు అదీ అందమంటే.*


*అని అనగానే*


*ఓహో అందం అంటే గుండెలో ఉంటుందా, మంచి మనస్సులో ఉంటుందా, మంచి ఆలోచనలో ఉంటుందా అన్న కూతురు సమాధానం విని ఆశ్చర్యంగా ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు.*

వివాహ జీవితం*

 *నూతన దంపతులు-వివాహ జీవితం*


వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడున్న తరానికి ముందు తరం వాళ్లు అయితే ఏదో రకంగా సంసార జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకు పోతుండేవారు. ఈ కాలం పిల్లలు అయితే అస్సలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. వివాహ పొంతన సరిగా లేనప్పుడు గ్రహ రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు భార్యాభర్తలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బందులు లేదా వడి దుడుకులు పూర్వం ఆడవాళ్లు అయితే భరించారు. ప్రస్తుతం వివాహ పొంతనలో దోషం ఉన్నప్పుడు గ్రహాలు ద్వారా వచ్చే ఇబ్బందులను ఆడపిల్లలు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. వివాహ పొంతన సరిగా చూడకుండా కేవలం గణాలు లేదా పాయింట్లు 18 నుండి 36 మధ్యలో వచ్చినప్పుడు వివాహాలు చేస్తున్నారు. కేవలం ఈ గణాలు ఆధారంగా మాత్రమే కాకుండా అబ్బాయి అమ్మాయి యొక్క ఇద్దరి జాతకాలు పరిశీలించాలి. ఈ పరిశీలనలో కాబోయే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉంటారా ఉండరా అనే విషయం, విడిపోయేలా ఉంటే పోలీస్ కేసులు కోర్టు గొడవలు భరణాలతో విడిపోతారా లేదా ఏ గొడవ లేకుండా విడిపోతారా అనే విషయం కూడా తెలుస్తుంది. జాతకాల పరిశీలించినప్పుడు ఇది కచ్చితంగా తెలుస్తుంది. కొంతమంది వివాహ జీవితంలో మానసికంగా ఎవరో ఒకరు టార్చర్ పెడుతూ ఉంటారు, మరి కొంతమందికి రెండు వివాహాలు జరుగుతుంటాయి. కొంతమంది వివాహం తర్వాత ఆర్థికంగా బలహీన పడిపోతుంటారు. మాంగళ్య స్థానం బలహీనమైతే అతి తక్కువ కాలంలోనే ఎవరో ఒకరు కాలం చేస్తారు. ముఖ్యంగా కుజదోషం కూడా పరిశీలించాలి.9494550355. కొంతమందికి వివాహం అయిన తర్వాత సంతానం కలగదు ఇటువంటి సమస్యలు అన్ని వివాహ పొంతనలో ఇద్దరి జాతకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ విషయాలు ఏమీ పరిశీలించకుండా కేవలం 18 నుండి 36 గణాల మధ్యలో వస్తే వివాహాలు చేసేస్తున్నారు. గణాలతోపాటు పై జాతక పరిశీలన మొత్తం చేయాల్సి ఉంటుంది. వివాహం అంటే రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాలు రెండు తరాలకు సంబంధించిన సంతోషకరమైన బంధం వలే ఉండాలి.ఇటువంటి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. కావున ఇద్దర జాతకాలు పరిశీలించే జ్యోతిష్యులను సంప్రదించి వివాహ సంబంధాలను నిశ్చయం చేసుకుంటే  వివాహ జీవితం బాగుంటుంది. పిల్లల జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం చిన్న పరిహారం చేస్తే భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలైతే తీరిపోయి అన్యోన్యంగా ఉంటారు. పిల్లల వివాహ జీవితం కాస్త ఒడిదుడుకులుగా ఉంటే ఆమె తల్లి శివాలయంలో ఒక దీపం వెలిగిస్తూ ఉండాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యి , విప్ప నూనె, కొబ్బరి నూనె సమానంగా ఒక మట్టి ప్రమిదలో పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి. తన కూతురు కాపురం బాగుండాలని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉంటే దంపతుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగి వారి దాంపత్య బంధం అన్యోన్యంగా ఉంటుంది.



Forward  message

నరసింహ శతకము

 *నరసింహ శతకము*


*ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న* 

*దేహ మెప్పటికి దా స్థిరత నొంద,* 

*దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు*

*నొక్క తీరుననుండ దుర్విలోన,*

 *బాల్య యౌవన సుదుర్భల వార్ధకములను* 

*మూటిలో మునిగెడి ముఱికి కొంప ;* 

*భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న* 

*గాల మృత్యువు చేత గోలుపోవు* 


*నమ్మరాదయ్య ! యిది మాయనాటకంబు ;*

*జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!* 

*భూషణ వికాస ! శ్రీధర్మ పురనివాస !*

*దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!*

*( 5 వ పద్యము)*


*భావము* :  

*ఓ నరసింహా ! ఇహలోకము అంటే భూలోక సుఖాలు కోరుదామంటే, ఈ శరీరం నశ్వరమైనది;  శాశ్వతమైనది కాదు. జీవితాంతం బలం ఒకే విధంగా వుండదు. ఈ దేహం అనే కట్టె బాల్యము, యవ్వనము, ముసలితనము అనే మురికిగుంటలో మునిగిపోయే తోలుతిత్తి. దీన్ని ప్రేమతో నిలుపుకుందామంటే* *చావు, మృత్యువులలో ఇది జారిపోతుంది. దీనిని ఎప్పటికీ నమ్మరాదు. ఇది ఒక బూటకనాటకం వంటిది. పుట్టుకనేది నాకొద్దు తండ్రీ!*

*ఓ పంకజనాభా ! నన్ను రక్షించు.*

సుఖాలు ఆనందాలు

 మనిషిలో సహాయ గుణం , దాన ధర్మాలుచేసే మనస్తత్వం, ఎదుటి వారితో ప్రేమ పూర్వకం గా మాట్లాడడం అలంకారాలు మరియు మంచి వ్యక్తిత్వంకి నిదర్శనాలు . పెద్దవారిని గౌరవించడం, పేద ధనిక బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండడం సంస్కారం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంతో పుణ్యం కానీ ఆకలి తీరే మార్గం అంటే జీవనమార్గం చూపించడం ఇంకా ఎక్కువ పుణ్యం . మనం సంపాదించే సమయంలో ధనవంతులం అయ్యే కొలదీ వినయంగా ఉండడం అలవాటు చేసు కుంటే  మన వ్యక్తిత్వానికి అందం వస్తుంది. మొక్కలు కూడా ఫలాలను ఇచ్చే సమయం లో వంగి ఉండి.. ఎంతో అందంగా ఉంటాయి . బాహ్య రూపం ఎదుటి వారిని ఆకర్షించవచ్చుకానీ అందమైన వ్యక్తిత్వం , ముఖంలో ప్రేమైక  చిరునవ్వు అందరిలోనూ గుర్తింపు ఇస్తుంది . కొంతమంది ఈర్ష్యాపరులు మనతోనే ఉండి, మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడుకోవచ్చు... అట్టి వారి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ వెనకే . మన పయనం గమ్యం వైపు అయినప్పుడు మధ్యలో ఎదురయ్యే వారంతా ఆట విడుపు మాత్రమే . వారికోసం పట్టించుకొని ఆగిపోతే గమ్యం ఎప్పటికీ చేరుకోలేము . కొన్ని ఎదురు దెబ్బలు తినకుండా మంచిస్థానంలోకి చేరుకోలేము  స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే ...కాలక తప్పదు,  కరగక తప్పదు , నలగక తప్పదు , దెబ్బలు తప్పవు . అలాగే మనిషి కూడా జీవితం లో మంచిస్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు . మనిషి విలువ దూరమైతే తెలుస్తుంది , కాలం విలువ గడిచిపోతే తెలుస్తుంది , జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది .  మనిషికి మాట చాలా ముఖ్యం . మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి సరదాగా మాట్లాడే మాట కూడా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండవచ్చు . దాని వల్ల అపార్థాలు చేసుకుంటే బంధాలు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు మరియు ఆ "మాట" మనసులో ఉండి పోతుంది. కాబట్టి తొందర పడి నోటి నుండి మాట జార కూడదు . కొన్ని సంతోషాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకదు. డబ్బుతో కొనే వాటిని "సుఖాలు" అంటారు., డబ్బుతో కొనలేని వాటిని "ఆనందాలు" అంటారు . అదే స్నేహం , ఆత్మీయత . ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మందులుతో నయం కాని జబ్బులు స్నేహితుల కలయిక తో నయం అయిపోతాయి. ప్రతిరోజూ ఒక అరగంట స్నేహితులతో గడిపితే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది . 

               ఇతి శివమ్

      సర్వేజనాఃసుఖినోభవంతు!

అందరికీ సాయం

 సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది

కాశీకి చేరుకున్నారు ఒక జంట. కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి పుట్టింది.చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి.భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది.అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి తోడుగా ఉన్నాడు.ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది.

ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని!ఆమె అడిగినవారికి దానం చేయడం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతుంటే… కాదనలేక అందరికి ఇస్తూ అప్పులుపాలైపోయింది.అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరు ఆమెను నిష్టూరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ”మా డబ్బులు మాకు ఇవ్వండి!” అంటూ గొడవ పెట్టారు.

ఆమెకు ఏం చేయాలో అర్థం కానివేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది.

అతడు “తాకట్టుగా నీ దగ్గర ఏముంది!” అని అడిగాడు.

అందుకు ఆమె “నాదగ్గర ఏమి లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప!” అన్నది.

”నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది?” అంటే…

“ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టే ఉంది, అక్కడకి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను. నా పుణ్యం తీరేవరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే!” అంది.

”నాకెలా తెలుస్తుంది- నాకెంత పుణ్యం వచ్చిందో?” అని అంటే…

ఆమె ఒక లింగ రూపం అయిన రాయిని తీసి “అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది!” అని చెప్పింది.

రాయి మునిగిపోతుంది, కాని ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు ఐదులక్షలు అప్పు తీర్చాడు.

ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టే దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్కకట్టమన్నాడు.

ఆరోజు రాత్రి గడిచింది.ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు.అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉన్నాడు.’అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను., మోసపోయానేమో?’ అని అనుకుంటుండగా… ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది. అంతే! నదిలో ఆమె విసిరిన లింగం పైకి తేలింది.

ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి! ‘ఏంటి ఐదులక్షలు విలువ చేస్తుందా పుణ్యం ఈ ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు అంటే ఆ తల్లి చేసిన పుణ్యం నా కోట్లు కుమ్మరించినా సరితూగదు కదా!’ అని ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు.ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఈశుడిని భక్తిగా కొలవడం మొదలుపెట్టాడు.మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం చాలా విలువైనది వెల కట్టలేనిది. చెడు ఒక్క క్షణం కూడా తలవకు రమంచిని నిమిషమైన మరిచిపోకు!

3 D art


 

Truck


 

Bamboo gun


 

MRP


 

Cheepirikatta


 

Python

 


డిగ్నిటీ ఆఫ్ లేబర్*

 *డిగ్నిటీ ఆఫ్ లేబర్*

                ➖➖➖✍️


*కాచిగూడ to బెంగళూరు ట్రైన్ లో వస్తున్న ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ...*


   ముందు సీట్లో  ఓ  కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..


*ఏరా తమ్ముడూ!!* సమోసాలు మెుత్తం అమ్మేసావా....”??


“అవును సార్!”


“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?


“అవును సార్!! 


ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!”


ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..???


“రూపాయి వస్తుంది సార్!!”


“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”


“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు *3,000 – 3,500* అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి


  ఎదుటి వ్యక్తి  మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. *నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే..* వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా…

“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”

“లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!!


“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”

“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్న..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ”

ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…????????


ఎదుటి వ్యక్తికి  మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని

తమ్ముడు!! ఏం చదువుకున్నావు..

మూడో తరగతి…

ఏం నీకు చదవాలని లేదా!!!

సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! 


ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇంక నాకు చదువెందుకు...??


అబ్బా ఎంత గొప్పనీతి సూత్రం!!!


అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!


ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు…. 

చదువులేని వారు అనామకులూ కాదు…

మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచు కుంటే… 

రేపు మనదే…!!✍️


           దీనినే …

*‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’* అంటారు.✍️


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


Shared post 

Source ; unknown

వేదబాహ్యులు

వేదబాహ్యులు – 3 చివరి పార్టు

భగవద్గీతలో చార్వాకదర్శనం

.

భగవద్గీత 16 వ అధ్యాయం, దైవాసురసంపద్విభాగ యోగం లో అసుర దైవ లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు చార్వాకభావాలను అసురులకు ఆపాదిస్తూ ఇలా అంటాడు – “అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు. జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టాయని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు. ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు. (వికీ సోర్స్)


పై వాక్యాలు చార్వాకవాదానికి ప్రతివిమర్శగా రాసారని ఇట్టేపోల్చుకోవచ్చును.  “అప్పుచేసైనా నెయ్యి తిను” అని ప్రక్షిప్తం చేసినట్లుగానే “ఈ జగత్తుకు కారణం కామమే” అని చార్వాకులు అన్నట్లు ప్రచారించారు. దీనికి ఆధారంగా  చార్వాకమతానికి చెందినదని చెప్పబడే  “kāma evaikaḥ puruṣārthaḥ” (కామం మాత్రమే పురుషార్ధం) అనే వాక్యాన్ని చూపుతారు. ధర్మార్ధకామ మోక్షాలను పురుషార్ధాలుగా చెప్పటం బ్రాహ్మణీయభావజాలం. తదుపరి జన్మ, మోక్షం లాంటి భావాలను అంగీకరించక, స్వేచ్ఛాజీవనాన్ని ప్రవచించిన చార్వాకులు పురుషార్ధాలు అనే చట్రాన్ని అంగీకరించి ఉంటారా అని  Battacharya ramkrishna ప్రశ్నిస్తారు.


మహాభారతం వనపర్వంలో (33:57) చిన్నప్పుడు తండ్రి ఒడిలో కూర్చుని ఒక బ్రాహ్మణుడు చెప్పే బార్హస్పత్య సూత్రాలను ఏపనీ లేకపోయినా ఏదో పనికల్పించుకొని వెళ్లి వినేదానినని ద్రౌపతి ధర్మరాజుతో చెబుతుంది.  (వనపర్వం నీతిం బృహస్పతిప్రొక్తాం భరాతౄన మే ఽగరాహయత పురా/తేషాం సాంకద్యమ అశ్రౌషమ అహమ ఏతత తథా గృహే)

.

ఆరుగురు గురువులు

BCE 5 వ శతాబ్దానికి చెందిన మగధరాజైన అజాతశత్రు ఒకరోజు రాజభవనం మిద్దెపై కూర్చుని తాత్వికచర్చ చేయటానికి సరైన సన్యాసి ఎవరున్నారు అని తన మంత్రులను అడగగా వారు- అజితకేశ కంబళ, పూరన కస్సప, మఖలి గోశాల, పకుధకచ్ఛాయన, సంజయబేలత్తిపుత్త, నిగంత్తనాతపుత్త అనే ఆరుగురి పేర్లు చెప్పి;  వీరందరూ చాలాకాలంగా సన్యాసిజీవనాన్ని గడుపుతున్నారని, ప్రతిఒక్కరు తమదైన తాత్విక సంప్రదాయాన్ని నెలకొల్పి దానికి గురువులుగా ఉంటూ దాన్ని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో అజాతశత్రు వ్యక్తిగత వైద్యుడైన జీవకుడు, ఆసమయంలో  రాజగ్రుహలో సమీపంలో బసచేసి ఉన్న బుద్ధుని వద్దకు అజాతసత్రుని తీసుకొని వెళ్లాడని బౌద్ధ గ్రంథం Samannaphala Sutta లో ఉంది. 

.

1. అజిత కేశకంబళ

.

BCE 6 వ శతాబ్దానికిచెందిన అజిత కేశకంబళ  మొట్టమొదటి భౌతికవాది. ఇతను బుద్ధుని సమకాలీనుడు.  ఇతనికి పూర్వం ప్రాచీనభారతీయ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా అజితకేశకంబళ పేరు ప్రాచీన భారతవేదాంత గ్రంధాలన్నింటిలో కనిపిస్తుంది. ఇతడు చెప్పినబోధనలకు సంబంధించిన వివరాలు నేరుగా దొరకవు.  బౌద్ధ పాలి, జైన ప్రాకృత రచనలలో ఇతని గురించిన ప్రస్తావనలు విరివిగా లభిస్తాయి.  వారు ఇతని సిద్ధాంతాన్ని స్మశానవైరాగ్యంగా అభివర్ణించారు. బౌద్ధ, జైన మతాలు అజితకేశకంబలను వారికి పోటీ దారునిగా చూసిన కారణంగా వారి వ్యాఖ్యలు అంత విశ్వసనీయమని భావించలేం. (రి. Studies on Carvaka/Lokayata by Battacharya ramkrishna pno28 )


అజితకేశ కంబళ బుద్ధుని కంటే వయసులో పెద్ద. ఇతను మనిషివెంట్రుకలతో చేసిన కంబళి వేసుకొని తిరిగేవాడు.  Anguttara Nikaya (3.135) లో బుద్ధుడు అజితకేశ కంబళునిగురించి ఇలా అన్నాడు-“ఇతను వేసుకొనే వెంట్రుకల దుస్తులు చాలా అసౌకర్యం. వేసవిలో వెచ్చగా, శీతాకాలంలొ చల్లగా, దుర్వాసనవేస్తూ, దురదలు కలిగిస్తూ ఉంటాయి ” (The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann pn 221)


మగథ రాజైన అజాతశతృతో అజితకేశకంబళి చేసిన సంభాషణ Sāmañña-phala-sutta లో ఇలా ఉంది.  


“ఓ మహారాజా! దానాలు, బలులు, నైవేద్యాల వల్ల ఏ ఫలితమూ లేదు.  మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.  ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. 


పై వాఖ్యలోని చివరిభాగం మహాభారతంలో కనిపిస్తుంది.  భీష్ముడు యుధిష్టిరునితో “కొంతమంది  “ఈ లోకము లేదు పర లోకమూ లేదు” అని భావిస్తారు. అటువంటి నాస్తికులను నమ్మరాదు” అంటాడు.  (శాంతిపర్వం131.13)


దాదాపు అదే వాక్యం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది (4.40)

సంశయంలో పడ్డవాడికి “ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. సుఖం కూడా లేదు.


సమాధానం ఇవ్వకతప్పని వాదన చేసాడు అజితకేశకంబళ.  దానికి ఒక చోట అలాంటి వారిని నమ్మరాదని, మరో చోట వారు సంశయవాదులని, వారికి సుఖం ఉండదని  మహాభారతం ద్వారా బ్రాహ్మణవాదులు సమాధానం ఇచ్చారు.  అజితకేశకంబళ చేసిన భావవాదపు శక్తి అది. 


Dlgha Nikaya 2.23 లో అజితకేశకంబల ఇతర  ప్రవచనాలు    ఇలా ఉన్నాయి


1. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.

2. స్వర్గ నరకాలు ఏమీ లేవు. 

3. తల్లి దండ్రి అంటూ ఎవరూ లేరు.  వారికి చేసే మంచి చెడులకు ఫలితాలు ఏమీ ఉండవు

4. మరణించాక మరుజన్మ, ఆత్మ  అంటూ ఏమీ ఉండవు.  ఈ దేహంలోని మట్టి మట్టిలో, నీరు నీటిలో, గాలి గాలిలో, వెచ్చదనం నిప్పులో, ఆలోచనలు శూన్యంలో కలిసిపోతాయి. 

5. మూర్ఖుడు, జ్ఞాని చనిపోయాకా ఒకేలా మట్టిగా మారతారు. 

6. శవాన్ని నలుగురు స్మశానానికి మోసుకెళతారు.  కొన్నాళ్లకు పావురంరంగులోకి మారి వెలిసిపోయిన ఎముకలు మాత్రమే స్మశానంలో మిగులుతాయి. 

6. చనిపోయిన వ్యక్తిపేరిట దానదర్మాలు చేయటం అవివేకం 

అజిత కేశకంబళి   నెలకొల్పిన సంప్రదాయం CE 6 వ శతాబ్దపు చార్వాకుల వరకూ కొనసాగి ప్రశ్నించటం, వాదించటం, ధిక్కరించటం ఈ దేశ సంస్కృతికి, బహుళత్వానికి వెన్నుగర్ర అని నిరూపించింది. 

.

2. పూర్ణ కాశ్యప/పూరన కస్సప

.

పూర్ణకాశ్యపుని గురించిన ఆధార గ్రంథాలు లభించవు.  జైన బౌద్ధ రచనలలో ఇతనిని విమర్శిస్తూ చేసిన కథనాల ద్వారా ఇతను వేదాలను తిరస్కరించి, దిగంబరంగా సంచరిస్తూ,  భౌతికవాదాన్ని ప్రవచించాడని అర్ధమౌతుంది.  ఇతను- ఒక గృహబానిస అని, ఇంటినుండి పారిపోగా, దారిలో దొంగల దోపిడీకి గురయి కట్టుబట్టలుకూడ కోల్పోయి దిగంబరంగా సంచరిస్తూ, అందరిని అపహాస్యం చేస్తూ చివరకు నిరాశతో, దుఃఖితుడై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని బుద్ధ ఘోషుడు తన “సుమంగళ విలాసిని” అనే గ్రంథంలో పేర్కొన్నాడు (రి. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya pn 513) 


పూర్ణ కాశ్యపుడు చాన్నాళ్ళు గృహస్థుగా జీవించాడని, సన్యసించాక తనకు వచ్చే భిక్షాన్ని నాలుగుభాగాలు చేసి మూడుభాగాలు బాటసారులకు, కుక్కలకు, కాకులకు, చేపలకు పంచి నాలుగోభాగాన్ని తను తినేవాడని  - “భాగవతీ సూత్ర”  అనే జైన గ్రంథంలో  కనిపిస్తుంది. 


పూర్ణ కాశ్యప బోధించిన వాటిలో ముఖ్యమైన అంశాలు-యజ్ఞయాగాదులు, కర్మకాండలు , పాపపుణ్యాలు, స్వర్గనరకాలు లేవు.  మంచి చేస్తే పుణ్యం రాదు, చెడు చేస్తే పాపం అంటదు. దానధర్మాలు అర్ధరహితం. ఈ ప్రపంచం నియతిజనితం (ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే వాదన /Every thing is born  of destiny). 


15 వ శతాబ్దపు జైనపండితుడు గుణరత్న తాను రచించిన “తర్క రహస్య దీపిక” అనే గ్రంథంలో పూర్ణ కాశ్యపుడు ప్రవచించిన నియతివాదాన్ని  ప్రస్తావించాడు.  పాలిరచనల్లో చెప్పిన పూర్ణ కాశ్యపుని బోధనలు రెండువేల ఏండ్ల తరువాత కూడా ఉటంకించబడటం భౌతికవాద దృక్ఫథపు బలంగా భావించాలి. 

3. మఖలి గోశాల (చూడుడు అంతర్ధానమైన ఆజీవిక మతం వ్యాసం. మొదటి కామెంటు లింకులో )

.

4. పకుధ కచ్ఛాయన /ప్రకృత కాత్యాయనుడు

.

పకుధ కచ్చాయన భౌతికవాది. ఇతను కర్మవాదాన్ని అంగీకరించలేదు. ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి తో పాటు జీవితము, సుఖ, దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఏడు అంశాలు స్థిరమైనవి, మార్పులేనివి ఒకదానిని మరొకటి ప్రభావితం చేయలేనివి అంటాడు. భౌతిక అంశాలతో పాటు అభౌతికాలైన  జీవితము, సుఖదుఃఖాలను చేర్చటం అనేది కచ్ఛాయన సిద్ధాంతంలోని ప్రత్యేకతగా భావించాలి. 

.

5. సంజయబేలత్తిపుత్త

సంజయబేలత్తిపుత్త స్పష్టమైన భౌతిక వాది.  గోచరమైనవి తప్ప మిగిలినవాటిని నమ్మరాదని ప్రవచించాడు. ఇది కొంతమేరకు చార్వాకుల వాదం.  ఇతను ఏ సమకాలీన సిద్ధాంతాలను అంగీకరించనూ లేదు ఖండించనూ లేదు. ఈ లోకంలో దేనిమీదా సంపూర్ణమైన అవగాహన  ఉండదని, ఒకే అంశాన్ని భిన్నవిధాలుగా వ్యాఖ్యానించవచ్చుకనుక, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది తప్పు అని వాదులాడుకోవటం అర్ధరహితమని ఇతను అభిప్రాయపడ్డాడు.    ఇది  ఒక రకంగా సంశయవాదం. (skepticism). బుద్ధుని వద్ద శిష్యులుగా చేరకముందు సరిపుత్త,  మహామొగ్గల్లన లాంటివారు సంజయవద్ద కొంతకాలం శిష్యరికం చేసారు. 

.

6. నిగంత్తనాతపుత్త

.

జైన మతానికి చెందిన 24 వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు బౌద్ధసాహిత్యంలో నిగంత్తనాతపుత్త గా చెప్పబడ్డాడు.  నిర్గ్రంథులతో (దిగంబరులు) చేతులు కలిపిన నాత వంశీకుడు అని అర్ధం.  ఇతని నిజజీవిత పేరు వర్థమాన. సైన్యాద్యక్షుడైన తండ్రిపేరు సిద్థార్ధ, తల్లి త్రిశల. వైశాలి సమీపంలో ఇతను BCE 557 లో జన్మించాడు. ఇతనికి జైన మహావీర అనే బిరుదు కలదు.  ఇతని తల్లిదండ్రులు పార్శ్వనాథుని బోధనలను ఆచరించేవారు. వారు సల్లేఖవ్రతం (Fast onto death) చేపట్టి మరణించాకా, వర్ధమాన మహావీరుడు తన ముప్పై ఏండ్లవయసులో ఇంటిని విడిచిపెట్టి శ్రమణ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని బోధనలు జైన ధర్మానికి  చెందినవి. 

.

***

పాయాసి

.

ఇతను ఒక రాజు.  బౌద్ధ, జైన, బ్రాహ్మణవాద మతాలకు వివిధ కాలాలలో వివిధ రాజుల ఆదరణ లభించి అవి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  చార్వాక వాదానికి ఏ రకమైన రాజాదరణ లభించలేదు కానీ పాయసి అనే రాజు భౌతికవాదాన్ని కొన్ని జుగుప్సాకర ప్రయోగాల ద్వారా పరీక్షించి వాటి నిగ్గు తేల్చాలని చూసినట్లు కొన్ని బౌద్ధ జైన రచనలలో కనిపిస్తుంది. 

ఆత్మ లేదు అని చార్వాకులు చెప్పారు.  ఆత్మ ఉందాలేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి పాయాసి- ఒక దొంగను పెద్ద ఇత్తడి పాత్రలో ఉంచి దానిమూతను తగరంతో అతికింపచేసాడు.  ఆ పాత్రలో దొంగచనిపోతే ఆత్మ ఏ విధంగా బయటకు వెళుతుందో చూడాలనుకొన్నాడు.  మరొక ప్రయోగంలో పెద్దపాత్రలో ఉంచిన వ్యక్తి  బరువు చనిపోకముందు చనిపోయాకా ఏమైనా తేడా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసాడు. ఈ ప్రయోగాలన్నీ దేహాత్మవాదం  నిగ్గు తేల్చటానికే.   

.  

ముగింపు

బౌద్ధజైనాలు చార్వాకులను అంగీకరించకపోవటానికి కారణం వారు పునర్జన్మను, నైతిక, ధార్మిక జీవనాన్ని విశ్వసించారు. ఈ లోకంలో తర్కం వెర్రితలలు వేయకుండా కొన్ని మతగ్రంథాలను ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఒక పరిధి విధించుకొని జీవించటం ఉత్తమజీవనం అని నమ్మారు.   వారికి చార్వాకుల తర్కం విచ్చలవిడితనంగాను, వితండవాదంగాను కనిపించింది.  ఆకారణంగా బౌద్ధ, జైనులు  చార్వాక సిద్ధాంతాన్ని తిరస్కరించి తమ గ్రంథాలలో చార్వాకసిద్ధాంతాలను ఖండించారు. 


కూర్మపురాణం  (CE 550-800)  బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది.  పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా  ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది. 


పదిహేనవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులే కాక పాషండులు, కాపాలికులు, పాశుపతులు పేర్లతో నాస్తికులు ఉన్నారని శృంగార నైషద పద్యంలో  (7-127)   శ్రీనాథుడు చేసిన వర్ణనను బట్టి   తెలుగునేలపై ప్రాచీన  వేదబాహ్య జీవనవిధానాలు  నిన్నమొన్నటి వరకూ మనుగడ సాగించాయని, ఇక్కడి ప్రజలు సాంస్కృతికంగా వైవిధ్యాన్ని కలిగిఉండేవారని అర్ధమౌతుంది. 

***


భిన్న ప్రాచీన భారతీయ దర్శనాలు ఒకదానినొకటి కబళించే శతృశిబిరాలుగా లేవు. వేరు వేరు సంప్రదాయ శాస్త్రాలుగా సమాంతరంగా మనుగడ సాగించాయి.  ఇవి ఒకదాని లోపాలను మరొకటి ప్రశ్నించుకొంటూ ఒకదానినొకటి పూరించుకొంటూ సాగాయి తప్ప ఒకదానినొకటి తొలగించుకోలేదు. అగ్నివేషుడు, కౌటిల్యుడు, వాల్మీకి, వ్యాసుడు   లాంటి వారు తాము నమ్మిన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ  అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను తమరచనలలో ఉటంకించారు. వాటిలోని అసంబద్దతలను ఖండించారు. వైరుధ్యాలను కలిగిఉండటం మానవ మేథ యొక్క భిన్నపార్శ్వాల ఆవిష్కరణగా  చూసారు. 


బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు

1. Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata

2. The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann 

3. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya

4. దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి

5.Lokāyata/Cārvāka: A Philosophical Inquiry  Pradeep P. Gokhale 

6. History and Doctrines of THE AJIVIKAS, AL Bhasham

7. ON  HINDUISM Wendy Doniger

8. చార్వాక దర్శనం – డా. కత్తి పద్మారావు

9. ఆస్తికత్వము  by వారణాసి సుబ్రహ్మణ్యం

10. అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ

పంచాంగం 30.10.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 30.10.2023  Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: ద్వితీయా తిధి ఇందు వాసర: కృత్తిక నక్షత్రం వ్యతీపాత  యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.


విదియ రాత్రి 10:27 వరకు.

కృత్తిక  రా.తె 04:01 వరకు .

సూర్యోదయం : 06:17

సూర్యాస్తమయం : 05:42

వర్జ్యం : సాయంత్రం 04:21 నుండి 05:54 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:22 నుండి 01:08 వరకు తిరిగి మధ్యాహ్నం 02:39 నుండి 03:25 వరకు.


రాహుకాలం : పగలు  07:30  నుండి 09:00 వరకు 


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 79*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 79*


సదా సర్వవేళల్లో ఉన్నత మనఃస్థితులలో లయించిపోవాలి,  సమాధి స్థితిలో మగ్నమై ఉండాలనే తపన నరేంద్రునిలో రోజురోజుకూ అధికమవసాగింది. కనుక నిర్నిరోధమైన తపనతో ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి, "నాకు నిర్వికల్పసమాధి స్థితిని అనుగ్రహించండి" అని అడిగాడు.


ఈ ప్రశ్న శ్రీరామకృష్ణులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.


 శ్రీరామకృష్ణులు : ముందు నా ఆరోగ్యం కుదుట పడనీ, ఆ తరువాత నువ్వు కోరిందల్లా ఇస్తాను. 

 

నరేంద్రుడు: కాని మీరు నిష్క్రమిస్తే నా గతి ఏమిటి?


శ్రీరామకృష్ణులు ఒక క్షణం పాటు నరేంద్రుణ్ణి ఆప్యాయంగా తేరిపార చూశారు - 'ఇతడు ఏమనుకొంటున్నాడు? నా దేహం కనుమరుగైనా నాకు నాశనం లేదని ఇతడికి ఇంకా అర్థం కాలేదా? ఆ తరువాత కూడా ఇతడు కోరిందల్లా నేను ఇవ్వనా?' అంటూ ఆయన భావిస్తున్నట్లుగా ఉంది ఆ చూపు. అయినప్పటికీ తమ అనుంగు శిష్యుణ్ణి ప్రేమతో అడిగారు.


శ్రీరామకృష్ణులు : నాయనా, నీకు ఏం కావాలి?


నరేంద్రుడు: మునుపు చెప్పిందే నేను ఎడతెగకుండా కొన్ని రోజుల సమాధిస్థితిలో మగ్నుడనై ఉండిపోవాలి. శరీర పోషణార్ధం మాత్రం అప్పుడప్పుడు సమాధ్యవస్థ నుండి బయటికి రావాలి.


శ్రీరామకృష్ణులు గంభీర వదనంతో ఇలా అన్నారు:...


 "ఛ ఛ! నువ్వు విశాలహృదయుడవని అనుకొన్నాను. కాని ఇలా కోరుతున్నావే! ఇది నీకు తగునా? జీవితంలో దెబ్బలు తిని,దుఃఖంతో వచ్చే వేలమందికి నువ్వొక మర్రిచెట్టులా నీడనిస్తావని నేను ఆశించాను. కాని నువ్వో స్వీయముక్తిని అభిలషిస్తున్నావు. ఏకపక్షమైన ఇలాంటి లక్ష్యాన్ని నువ్వెలా చింతన చేయగలిగావు? సర్వతోముఖ ప్రగతినే నేను కోరుకొంటాను. 

 

చేప కూరను నేను తింటాననుకో. పులుసు, కూర, పచ్చడిగా దానిని పలురకాలుగా తినగోరతాను. 


సమాధిస్థితిలో మగ్నమై భగవద్భావనలో లయించిపోయిన ఆనందంలో మాత్రం నేను సంతృప్తి చెందను. మానవ సంబంధాలలా భగవంతునితో అనేక మార్గాలలో సాంగత్యం నెరపి భగవదానందాన్ని నానారకాలుగా అనుభవించాలని నేను కోరుకొంటాను. నువ్వు కూడా అదే విధంగా ఉండాలన్నదే నా ఆరాటం."

 

శిష్యునితో ఇలా చెప్పినప్పటికీ అతడికి ఆ అనుభవం చూపించాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించుకొన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *69వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *69వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 7*


మందిరము , మందిరంలోని ఏకాంతమూ తమవే అంటూ రోహిణీ చంద్రున్ని ఉయ్యాలబాపిన ఉల్లాసం ఎక్కువ రోజులు నిలువలేదు. ఆ ఇద్దర్నీ మురిపించి మైమరపించిన ఏకాంతాన్ని దక్షప్రజాపతి రాక ఛిన్నాభిన్నం చేసింది.


*"చంద్రా !"* ముఖద్వారం ముందు నిలుచుని దక్షప్రజాపతి పిలిచిన పిలుపు మందిరమంతా సుళ్ళు తిరుగుతూ , రోహిణీ చంద్రుల కర్ణపుటాలను అరచేతి దెబ్బలా తాకింది. రోహిణి భయపడుతూ చంద్రుడి వైపు చూసింది. చంద్రుడు చిరునవ్వుతో ఆమె భయాన్ని దూరం చేశాడు. 


*"చంద్రా ! వెలుపలికి రా !"* దక్షుడి కేక వాళ్ళ వైపు దూసుకుంటూ వచ్చింది. ఇద్దరూ కూర్చున్న చోటు నుండి లేచారు.


ద్వారం ఆవలికి అడుగులు వేసి , అగిన రోహిణీ , చంద్రులకు దక్షుడూ , ఆయన పుత్రికలూ కనిపించారు.


*"రండి ! దయచేయండి !"* చంద్రుడు ఆహ్వానించాడు.


*"నీ మందిరం లోపలకి రావాల్సింది నేను కాదు. నీ పత్నులైన నా పుత్రికలు !"* దక్షుడు రౌద్రంగా చూస్తూ అన్నాడు. *"అంతిమ ప్రయత్నంలో వచ్చాను. అంతిమంగా అడుగుతున్నాను. అగ్ని సాక్షిగ వివాహం చేసుకున్న నా పుత్రికలను భార్యలుగా స్వీకరిస్తావా , లేదా ?"*


*"మీ పుత్రికలకు ఆనాడే చెప్పాను , మామగారూ ! మీ ఇరవై ఆరుగురు కుమార్తెలనూ వివాహం చేసుకున్నది యధార్ధమే , కానీ భార్య భర్తకు 'దాసి' కూడా అవుతుందని మీకు తెలుసు ! వాళ్ళందర్నీ దాసీజనంగా , పరిచారికలుగా స్వీకరించడానికీ , ఆ పదవులలో సపర్యలు చేయించుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే !"*


*"చంద్రా !”* దక్షుడు గర్జించాడు.


*"పరిచారికలుగా రోహిణికీ , నాకూ వినయవిధేయతలతో పరిచర్యలు చేస్తూ బ్రతుకులు వెళ్ళదీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటే - ఇదే నా ఆహ్వానం !"* 


*"నికృష్టుడా ! భార్యలు దాసీలు అవుతారు , హృదయ రాణులూ అవుతారు. నీ అహంకారం క్షమార్హం కాదు ! నిన్ను..."* 


*“శపిస్తారా ?”* చంద్రుడు వెటకారంగా అడ్డు తగిలాడు. *“ప్రయత్నించండి !”*


*"నిలువెల్లా అహంకారంతో , కామంతో నిండిన నీ శరీరం క్షయ వ్యాధితో క్షీణిస్తుంది ! ఈ దక్షుడి శాపాగ్ని నీకు 'రాజయక్ష్మవ్యాధి'ని శిక్షగా అందిస్తుంది. అనుభవించు !”*2ఆవవవవ దక్షప్రజాపతి కంఠం ఉరుములా శబ్దించింది. *"క్షీణించు ! క్షీణించి , క్షీణించి , కృశించు!"*


చంద్రుడు వెటకారంగా నవ్వాడు. *"మహాప్రసాదం !"*


దక్షుడు రోహిణి వైపు నిప్పులు కక్కుతూ చూశాడు.


*"రోహిణీ ! స్వార్ధంతో , కామంతో నీ అక్క చెల్లెళ్ళను ఆత్మక్షోభకు గురిచేశావు ! నీ తండ్రి శాపం నీకు తాపంగా పరిణమిస్తుంది. వ్యాధి గ్రస్థుడయ్యే ఆ అహంకారిని సేవిస్తూ , మనస్తాపాన్ని అనుభవించు !"*


చంద్రుడి ధైర్యాన్ని భగ్నం చేస్తూ దక్షప్రజాపతి శాపం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. చంద్రుడి శరీరం కళను కోల్పోయింది. యవ్వన గర్వంతో గంతులు వేస్తున్న అందాల తనువులో బలహీనత , నీరసం ప్రవేశించాయి.


భర్తకు ధైర్యం చెప్పలేకా , తనను తాను ఓదార్చుకోలేకా రోహిణి తీవ్ర మనస్తాపాన్ని అనుభవించ సాగింది. సతీపతులిద్దరిని , అష్టకష్టాలు కలిగిస్తున్న చంద్రుడి క్షయవ్యాధి , లోకాల మీద కూడా తన దుష్ప్రభావాన్ని చూపించింది. చంద్రుడి శరీరాన్ని ఆవరించిన క్షయవ్యాధి.


అంతరిక్షంలో చంద్రమండలం మీదా , చంద్ర బింబం మీదా ప్రతిఫలించింది. చంద్ర కాంతి క్షీణించిపోయిన కారణాన , మొక్కలూ , లతలూ , మూలికలూ , వృక్షజాతీ ప్రాణశక్తిని కోల్పోయి , పెరుగుదల లేకుండా క్షీణించిపోయాయి. ఓషధుల మీద చంద్రుడి క్షయ అత్యధికంగా దుష్ప్రభావాన్ని చూపించింది. ప్రజలు రోగాలతో మరణించసాగారు.


లోకాలలో ఆహార సమస్యా , ఔషధాల సమస్యా తలయెత్తింది. పగటి వేడిమి రాత్రుళ్ళల్లో చల్లబడే అవకాశం లేకుండా పోయింది. చంద్రకాంతి క్షీణించి , రాత్రులలో చీకటి రాజ్యం చేయసాగింది.


ఈ విపరీత పరిణామాల ప్రభావం దేవలోకం మీద పడింది. చంద్ర కాంతిలో క్షీణత ఇంద్రుణ్ణి ఆశ్చర్యంలో పడవేసింది.


అవాంతరానికి కారణాన్ని ఇంద్రాదులు అన్వేషిస్తున్న సమయంలో నారదుడు ఇంద్రసభకు చేరుకున్నాడు. లోకాలకు దాపురించిన ఆ ఉపద్రవానికి కారణం చంద్రుడినే అడిగి తెలుసుకోవడం మంచిదన్నాడు. ఇంద్రాది దేవతలూ , నారుదుడూ చంద్రుడి వద్దకు వెళ్ళారు. వ్యాధితో కళావిహీనుడైపోయి , కృశించి పోయిన చంద్రుణ్ణి చూసి అందరూ ఆశ్చర్య పోయారు.


*"చంద్రా ! నువ్వు ఔషధాలకు మూలరూపాలైన ఓషధులకే అధిపతివి ! నిప్పును నిప్పు కాల్చినట్టు - ఓషధీనాధుడైన నీకు ఈ వ్యాధి ఎందుకు దాపురించింది ?"* ఇంద్రుడు చంద్రుణ్ణి ప్రశ్నించాడు.


చంద్రుడు అనుమానిస్తూ చూశాడు. నారద మహర్షి చిన్నగా నవ్వాడు. *"చేసిన తప్పు చెప్పడం ఎప్పుడూ మంచిదే ! రోగాన్నీ , రోగకారణాన్నీ దాచుకోరాదు సుమా !"* తన వ్యాధికి కారణం దక్షప్రజాపతి శాపం అని వెల్లడించిన చంద్రుడు - ఆ శాపానికి కారణమైన తన రోహిణీ పక్షపాత వైఖరినీ వివరించాడు. *"నన్ను ఎవరి శాపాలూ ఏమీ చేయలేవని గర్వించాను !"* అన్నాడు నీరసంగా.


*"ఆ గర్వంతో శపించి చూడమంటూ , మా తండ్రిగారిని రెచ్చగొట్టారు , కూడా !"* రోహిణి పశ్చాత్తాపంతో అంది.


*"మీరే నన్ను రోగ విముక్తుణ్ణి చేయాలి"* చంద్రుడు ఇంద్రుడితో అన్నాడు దీనంగా. *“అర్థం కాలేదా , చంద్రా ? నీకు వ్యాధి రావడం - ఔషధానికి వచ్చినట్టే ! వైద్యంతో నయమయ్యే వ్యాధి కాదు నీది ! ఇది శాపం చేస్తున్న నిత్య సంహారం ! ఉపసంహారమొక్కటే దీనికి పరిష్కారం !"* ఇంద్రుడు నిష్కర్షగా అన్నాడు.


*"మహేంద్రులు చక్కగా చెప్పారు. ఇప్పుడు జరగాల్సింది శాప ఉపసంహరణ ! అది చేయవల్సింది దక్షుడు - దక్షప్రజాపతి ఒక్కడే !”* 


*"ఔను ! మన మందరం చంద్రుడిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయనను అభ్యర్థించుదాం !"* ఇంద్రుడు తన నిర్ణయాన్ని వ్యక్తం చేశాడు.


మహేంద్రుడు చేసిన అభ్యర్థనను ఆలకించిన దక్షుడు ఆలోచనలో పడ్డాడు.


ఆలోచన ముగించి ఇంద్రుడితో ఇలా అన్నాడు.


*"నాయనా , ఇంద్రా ! నువ్వు నా దౌహిత్రుడివి ! నీ అభ్యర్ధనను నిరాదరించలేను. చంద్రుడు అపరాధం చేశాడు. నేనూ , నా పుత్రికలూ ఓరిమితో ప్రసాదించిన అవకాశాలను చిన్న చూపు చూశాడు. అతన్ని శపించడానికి కారణం ఉంది. అది నీకు తెలుసు. చంద్రుడు నా పుత్రికలందర్నీ సాదరంగా , సానురాగంగా , సమ దృష్టితో ఏలుకోవాలి. రోహిణినో , మరొకతినో నెత్తి కెక్కించుకోవడం క్షమార్హంగా చూడబడదు. సప్తవింశతి ధర్మపత్నులనూ సమదృష్టితో సంభావించి సంతోష పరుస్తూ ఉంటానని చంద్రుడు శపథం చేయాలి. అది జరిగిన అనంతరం ఆలోచిస్తాను, ఉపసంహారం గురించి !”*


ఇంద్రుడు చంద్రుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. చంద్రుడు దక్షప్రజాపతి పాదాలు స్పశించి , ఆయన నిర్దేశించిన విధంగా శపథం చేశాడు.


*"నేను కూడా నా అపరాధాన్ని అర్థం చేసుకున్నాను. నా అక్కచెల్లెళ్ళను గౌరవంగా చూసుకొంటాను..."* రోహిణి కన్నీళ్ళతో అంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 69*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 69*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*గళే రేఖా స్తిస్రో గతిగమకగీతైకనిపుణే*

*వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంఖ్యా ప్రతిభువః |*

*విరాజంతే నానా విధమధురరాగాకరభువాం*

*త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే ||*

అమ్మా సంగీత నిధీ

గళే రేఖాస్తిస్రో = నీ కంఠమునందు మూడు రేఖలు ఉన్నాయి.

కంఠమునందు, నుదిటిపైన, నడుము నందు మూడు రేఖలు ఉండటం ఉత్తమ సాముద్రిక లక్షణమని పెద్దలు అంటారు.


నానా విధమధురరాగాకరభువాం = అన్ని విధముల మధుర రాగములకు నెలవైనది నీ కంఠము.


గతిగమకగీతైకనిపుణే = గతి, గమక, గీతములు మూడూ నాద శాస్త్రములో ప్రధానమైనవి. పాడేటప్పుడు వెలువడే మాధుర్యమునకు ఈ మూడూ మూలములు.వీటిలో అమ్మవారు నిపుణురాలు.ఈ మూడింటికీ సంకేతంగా కంఠమునందు మూడు రేఖలు కలిగివున్నది ఆమె అంటున్నారు శంకరులు.


త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవ తే = గ్రామము అంటే ఒక రాగములోని సప్తస్వరములలో స్థాయిలు.

స్వరములు ..స , రి , గ , మ , ప , ద , ని 

మూడింటికి ..

స - షడ్జమ

మ - మధ్యమ

గ - గాంధార   వీటికి గ్రామములని పేరు.

మిగిలిన నాలుగు స్వరములు

రిషభ ,పంచమ ,దైవత , నిషాదములు.

అమ్మా ఈ మూడు గ్రామములకు సంకేతములుగాను , హద్దులుగానూ  వున్నాయి నీ కంఠము నందలి మూడు రేఖలు అంటున్నారు శంకరులు.


వివాహవ్యానద్ధ ప్రతిగుణగుణసంఖ్యా ప్రతి భువః = శ్రీ లలితా సహస్ర నామములలోని *కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా* ను స్మరిస్తున్నారు. గుణము అంటే త్రాడు. మంగళసూత్రము మూడు పేటలుగా ఒకొక్క పేటకు తొమ్మిది దారాలుగా ఉంటుంది.అంటే 27. ఇది నక్షత్రముల సంఖ్య. ప్రతివారి జీవితము ,ఆయువు నక్షత్ర గమనంపై ఆధారపడి ఉంటుంది. నీ మంగళసూత్రములోని మూడు పేటలకు సంకేతంగా నీ కంఠములో ఈ మూడు రేఖలు పెట్టుకున్నావా తల్లీ అంటున్నారు శంకరులు.


శ్రీ కాంచీ మహాస్వామివారు పైఐ విధంగా వ్యాఖ్యానం చేస్తూ చమత్కారంగా మరొక మాట చెప్పారు. పరమేశ్వరుడు క్షీరసాగర మధనము నుండి జనించిన హాలాహల భక్షణము చేసేటప్పుడు ఆయన ఉదరములోని సమస్త లోకములు దహింపబడకుండా అమ్మవారు తన చేతి మూడు వ్రేళ్ళని ఆయన కంఠమునకు అడ్డు పెట్టారుట.అప్పుడు చిన్న ముద్దగా ఆయన మింగిన హాలాహలము ఆయన కంఠములో నిలిచిపోయిందట. అమ్మవారు అర్థనారీశ్వరి కనుక ఆ వ్రేళ్ళ గుర్తులు ఆమె కంఠమును అలంకరించాయిట.

అందుకే పురుషులందరికీ కంఠములో ముద్దవలెను , స్త్రీలకు కంఠమునందు త్రిరేఫములును కలిగినవని ఆయన చమత్కరించారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేదవతి గారి కోరిక..*

 *వేదవతి గారి కోరిక..*


"మీరు ప్రసాద్ గారేనా మాట్లాడటం?.." అని ఫోన్ లో అడిగారు ఆవిడ.."అవునండీ..మీరూ..?" అని సందేహంగా అడిగాను.."నా పేరు వేదవతి..మీరు నిర్మల ప్రభావతి గారి కుమారుడే కదా.."? అని అడిగారు.."అవును.." అన్నాను.."బాబూ..మీతో కొంచెం సేపు మాట్లాడాలి..ఇప్పుడు మీకు వీలవుతుందా..?" అన్నారు.."పర్లేదు చెప్పండి.." అన్నాను..


"నా పేరు వేదవతి..భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వచ్చిన సాయిబాబా పత్రికలో మీ అమ్మగారు అవధూత తో మా అనుభవాలు అని మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామివారి చరిత్రను కొన్నాళ్ళు వ్రాసారు..అప్పట్లో అది చదివాను..ఆ తరువాత కొన్నాళ్ళకు నేను మా వారు మొగలిచెర్ల కు వచ్చి, మీ అమ్మ నాన్న గార్లను కలిసాము..ఇదంతా 1996 లో ముచ్చట..అప్పుడే మేము అక్కడ సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామివారి సమాధిని కూడా దర్శించుకున్నాము..ఆ తరువాత కొన్నాళ్ల పాటు మీ అమ్మగారి తో ఉత్తరాల ద్వారా సంబంధాలు ఉండేవి..క్రమంగా సంసార బాధ్యతలు పెరిగే సరికి..అలా ఉత్తరాల ద్వారా పలకరింపులూ ఆగిపోయాయి..ఒకసారి విజయవాడలో ఏదో రచయితల మీటింగ్ లో మీ తల్లిదండ్రులను కలిశాను..ఆ తరువాత లేదు..ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే..ఈమధ్య మీరు ఆ మొగలిచెర్ల స్వామివారి గురించి సోషల్ మీడియా లో వ్రాస్తున్నారట..మా మనుమరాలు నాకు చూపించింది..అవి చదివిన తరువాత మీకు ఫోన్ చేయాలని అనిపించింది..ఆ స్వామివారి సమాధిని దర్శించి రమారమి పాతికేళ్ళ కాలం గడిచిపోయింది..ఆయన మహిమలు, లీలలు గత ఆరు నెలలుగా  చదువుతున్నాను..చాలా బాగున్నాయి..నాకు ఒక సహాయం చేయగలరా?.." అన్నారు..

"ఏమి చేయమంటారు?.." అన్నాను..


"మా కుమారుడు కోడలు హైదరాబాద్ లో వుంటారు..వాళ్ళ అమ్మాయి..అంటే..మా మనుమరాలికి వివాహం నిశ్చయం అయింది..అబ్బాయి అమెరికా లో ఉంటాడు..ఇంకొక మూడు నెలల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాము..అబ్బాయి ఇక్కడకు రావడానికి ఏదో వీసా సమస్య ఉందట..స్వామివారి వద్ద అర్చన చేయించండి..నిజానికి నేనే అక్కడికి వచ్చి స్వామివారిని వేడుకోవాలి..కానీ..నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్లు..ప్రయాణాలు చేయలేను..మా అబ్బాయికి ఇటువంటి వాటిమీద నమ్మకం లేదు..నేను స్వామివారి సమాధి ఒకసారి చూసిన దాన్ని..మీ అమ్మానాన్న గార్ల ద్వారా స్వామివారి గురించి విని వున్నాను..అందువల్ల ఆయనకు మొర పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకంతో నీకు చేస్తున్నాను..స్వామివారు నాకు ఓపిక ఇస్తే..త్వరలో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను..నాకోసం ఆ పిల్లల పేర్లతో అర్చన చేయించు బాబూ.." అని ప్రాధేయపూర్వకంగా అడిగారు.."అమ్మా..మీరేమీ బాధ పడవద్దు..గోత్రనామాలు మెస్సేజ్ చేయండి..అర్చన చేయిస్తాను..అదీకాక రేపు గురువారం నాడు దత్తహోమము చేస్తున్నాము..అందులో కూడా గోత్రనామాలతో సంకల్పం చేయిస్తాను.." అని చెప్పాను.."మంచిది నాయనా..చాలా ఓపికగా నా మాటలు విని..సమాధానం చెప్పావు..మళ్లీ చెపుతున్నాను..నాకు శక్తి ఇస్తే..ఒక్కసారి ఆ స్వామివారి సమాధిని మళ్లీ దర్శించుకుంటాను..ఆయన దయ ఉండాలి..అంతే.." అన్నారు..


వేదవతి గారితో మాట్లాడిన విదంగానే..ఆవిడగారు పంపిన గోత్రనామాలతో ఆ ప్రక్కరోజు గురువారం నాడు నిర్వహించిన దత్తహోమము లో అర్చన కార్యక్రమాలు చేయించాను..ఆరోజు సాయంత్రం వేదవతి గారికి ఫోన్ లో తెలియచేసాను..ఆవిడ సంతోషించారు..మరో ఆరేడు నెలల తరువాత ఒక గురువారం ఉదయం నాకు వేదవతి గారు ఫోన్ చేసి..ఆ ప్రక్క శనివారం నాడు తాను, తన కుమారుడు కోడలు కలిసి మొగలిచెర్ల వస్తున్నామని..వీలుంటే వసతి కొరకు ఒక గది తీసి పెట్టమని చెప్పారు..అలాగే ఆ శనివారం వచ్చారు..ఆరోజు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ లో వేదవతి గారి కుమారుడు కోడలు పాల్గొన్నారు..ఆ రాత్రికి ఆ ముగ్గురూ నా వద్దకు వచ్చి.."బాబూ..స్వామివారి దయవల్ల మా మనుమరాలి సమస్య తీరిపోయింది..దాని పెళ్లి కూడా లక్షణంగా జరిపించాము..ఆ సమస్య తీరితే వీళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకొని వస్తానని ఆరోజే నేను మొక్కుకున్నాను..నన్ను రప్పించడం కోసం స్వామివారే మా కోరిక తీర్చాడేమో..కాకపోతే పాతికేళ్ళ తరువాత నేను ఈ వయసులో ఇక్కడికి రావడమేమిటి?..అంతా..ఆయన లీల.." అని చెప్పారు..ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని బాగా ఉద్వేగం పొందారు..మరో గంట తరువాత తిరుగు ప్రయాణం అవుతూ..మా దంపతుల వద్దకు వచ్చి..నా భార్యతో.."అమ్మాయీ..మీరిద్దరూ స్వామివారి సేవలో వున్నారు..అదృష్టవంతులు.." అని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారు..


కొన్ని కొన్ని సంఘటనలు చిత్రంగా ఉంటాయి..వేదవతి గారికి పాతికేళ్ళ విరామం తరువాత స్వామివారి గురించి మళ్లీ తెలియడం..ఆవిడ మొక్కుకోవడం..ఆ కోరిక తీరడం..ఆవిడ అంత వృద్ధాప్యంలోనూ మళ్లీ స్వామివారి సమాధి దర్శించుకోవడం..అంతా మాకు అంతుపట్టని ఒక లీలా వినోదం..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

ఎక్కడ ఉన్నామో

 భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా


సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే 🏃🏻 అది "ముంబై"


సీన్ 2 :-  ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే 😫 అది "చెన్నై"


సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు 🍺🍻తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"


సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకన్డి దూరం గా వెళ్ళండి 🏡అంటే అది "బెంగళూరు"


సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ 📲తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో  ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"


సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే 🔫అది "బీహార్" 


సీన్ 7 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు వచ్చి వాడి కులం ఏంటి అని వేరే కులం వాడ్ని కొడితే అది "ఆంధ్ర ప్రదేశ్"


ఇది అల్టిమేట్


సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే ☕అది "కేరళ"

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు *****                                    ~~~ If you plant ----- ~~~.                                  If you plant honesty; you will reap trust.              If you plant goodness ; you will reap friends.                            If you plant humility ; you will reap greatness.                         If you plant perseverance; you will reap contentment.             If you plant consideration; you will reap perspective.            If you plant hard work ; you will reap success.                            If you plant forgiveness; you will reap reconciliation.         So, be careful what you plant now, it will determine- - - - what you will reap later.           ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~.                                The wheel of " LIFE " in Buddhism.                       From right understanding proceeds right thought,.                            From right thought proceeds right speech,.                              From right speech proceeds right action,.      From right action proceeds right livelihood,.                         From right livelihood proceeds right effort,.       From right effort proceeds right awareness,.                       From right awareness proceeds right concentration,.                  From right concentration proceeds right wisdom,.                                     From right wisdom proceeds right liberation.---- Goutham a Buddha.                           Dt 30--10--2023, Monday. Good morning.

ఆత్మ విద్య

 ఆత్మ విద్య :-మీ జన్మ రహస్యం నాడి జ్ఞానం - మనిషి దేహమునంధలి నాడులు .


 ఈ ప్రపంచం నందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అంతకు మించి మనిషి దేహం నందు కలవు. భగవంతుడు తన శక్తి నంతటిని మనిషి శరీరం నందు వెన్నముక క్రింద బాగం లొ వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతం గా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు కరెంటు హై టెన్షన్ వైరల దగ్గర వినిపిస్తుంది . అదే సుషుమ్న నాడి. అందలి రక్త ప్రసరణ , శక్తి ఆ శబ్దం చేయును . ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రొజులలొ శక్తివంతుడు కావొచ్చు. 


     ఈ పొస్ట్ లొ మనిషి యెక్క దేహం లొని నాడులు గురించి వివరించుతున్నాను....


  శరీరం నందలి మూలాధారం నకు మీదగా నాభి స్థానమునకు మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియోకటి కలదు. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి.మనుషుల దేహంబున సుక్ష్మ,, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలు ఉన్నవి.ఈ నాడులు ములాదారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధొ (క్రిన్ధ ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగము గా వ్యాపించి ఉన్నాయి . మరియు పై నాడులను ఆశ్రయించి 3 కొట్ల 50 లక్షల రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములు గా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సుక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాధి వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండెను. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యొగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విదంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది. అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గందాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాదారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రదాన నాడులు సుక్ష్మ చిద్రములతో కూడి  యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిద అన్నపానదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును . 


         పైన చెప్పిన నాడులలో ఇళా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్త జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలుమ్బస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి. ఈ పదనాలుగు నాడులలో ఇళా నాడి మొదలు చారాణా నాడి వరకు గల పది నాడులు ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. అందువలన ఇవి ప్రదాన నాడులుగా గుర్తిన్చబడుతున్నవి . ఇళా , పింగళ , సుషుమ్న  అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును . గాంధారి, హస్తజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షినాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామబాగంబున వ్యాపించి ఉండును. మద్య బాగం నందు ఉండే పుషు అను ప్రసుతికా నాడి సమస్త కార్యంబులను చేయును .


         వామ నాసిక యందు ఇళా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంద్రంబు యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తజిహ్వ, దక్షిణ కర్ణంబు పుషాయు , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుసం , శిశ్న ములంబున కుహువు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులు ను ఆశ్రయించి ఉండును.


          ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేహ దత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును. కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారనముకు ఉపయుక్తమై ఉండును. పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్ర కలుగును.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - ద్వితీయ - కృత్తిక - ఇందు వాసరే* (30.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/BLFBnLMCr1M?si=gpxquFEG5iGTQrjT



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Aatagaadu

 https://youtube.com/shorts/_oVDxDfSZAw?si=iqsGj4YwcHzNe1n4


*శ్రీ స్వామివారి వివరణ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి వివరణ..*


*(పన్నెండవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలనీ శ్రీధరరావు దంపతులను కోరడం..వారు తర్జన భర్జన పడటం జరుగుతూవుంది..ప్రత్యామ్నాయంగా  పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి..కొన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి.. ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలావుంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు.. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది..ఈ ఆలోచన ను తమలోనే దాచుకున్నారు..


వరుసగా ఆరేడు వారాలపాటు శ్రీధరరావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..ప్రభావతి గారు ఇంటివద్దే ఉండిపోవాల్సివచ్చింది..మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు..శ్రీధరరావు గారు ఆ పని మీద వున్నారు..కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళుతూ శ్రీధరరావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళుతూ వుండేవారు..అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధరరావు గారు ప్రయత్నం చేశారు..కానీ అదేమీ చిత్రమో.. శ్రీ స్వామివారు అటు శివాలయం లోగానీ..ఇటు పార్వతీదేవి మఠం లోగానీ కనుపించేవారు కాదు..ఎంత సేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు..వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు..అలా రెండు మూడు సార్లు శ్రీధరరావు గారికి అనుభవం అయింది..


ఒకరోజు, శ్రీధరరావు గారొక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..చిత్రం..శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల వున్న అరుగుమీద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారిని చూడగానే నవ్వుతూ.."శ్రీధరరావు గారూ నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా?.." అన్నారు..


శ్రీధరరావు గారు అవాక్కయ్యారు.."అది కాదు స్వామీ..ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు..మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను..మీరు కనిపించలేదు.." అన్నారు..


"ఇక్కడ నేను తపస్సుచేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం..నన్ను చూడటం కోసం వారం కాని వారం లో ఈ మాలకొండ ఎక్కడం..నాకోసం కొండమీద పడిగాపులు కాయడం..నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం..ఒకవేళ నేను కనబడితే..కాళ్లకు మొక్కడం..అది వీలుగాకపోతే..నామీదకు చిల్లర డబ్బులు విసరడం..ఇదంతా ఏమిటి?..నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా?.."


"ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఓ నియమం ఉంది శ్రీధరరావుగారూ..మీకూ తెలుసు..వారం లో ఆదివారం నుంచీ శుక్రవారం వరకూ దైవపూజ..ఒక్క శనివారం నాడు మాత్రమే మానవపూజ అని..నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది..నన్ను చూడటం కోసం జనాలు ఏరోజు పడితే ఆరోజు ఈ కొండమీద సంచరిస్తున్నారు..ఇది నివారిద్దామనే నేను, నా శేష తపోసాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలచాను.. అందుకే మిమ్మల్ని భూమి అడిగాను.." అంటూ ఒక్కక్షణం ఆగి..


"ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి, నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా?..


"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః "


 అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందేగానీ.. పరిష్కారం కాదు.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆశ్చర్యపోయారు..ఈ ప్రతిపాదన తానూ తన భార్య అనుకున్నది..శ్రీ స్వామివారికెలా తెలిసిందీ?..అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూసారు..శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత!..


"మీరు ఇతరత్రా ఆలోచనలు పెట్టుకోకండి..ఇంటికెళ్లి అమ్మతో చెప్పండి..ఇక్కడ ఎక్కువకాలం నేను ఉండటం సాధ్యపడదు..దైవానుగ్రహం ఉన్నంత వరకూ అన్ని సాధనలూ సవ్యంగా సాగుతాయి..ఆ లక్ష్మీనృసింహుడి ఆదేశం అయిన తరువాత ఆలస్యం చేయకూడదు..నా తపోసాధన ఇంతవరకూ ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది..ఇకముందు జరగాల్సిన ప్రదేశం కావాలి..అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను..అది దత్తక్షేత్రం అవుతుంది.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లిపోయారు..


శ్రీధరరావు గారు తిరిగి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా..పూసగ్రుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేసారు..

"సరే శ్రీవారూ..దైవానుగ్రహం ఎలా వుంటే అలా జరుగుతుంది..అంతగా స్వామివారు చెపుతున్నారు కదా..మన ప్రయత్నం మనం చేద్దాం..మీరే అన్నారుకదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని..ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను నమ్మి వున్నాము..ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిసాము...ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం.." అని అన్నారు..శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు..


ఆ తరువాత మరో రెండురోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారిని కలిశారు.."అమ్మతో చెప్పావా నాయనా?.." అన్నారు..అవునన్నట్లు తలూపారు శ్రీధరరావు గారు.."మంచిది..అంతా శుభమే జరుగుతుంది.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్ల అనుభవాలు..రేపటినుంచి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

30-10-2023* *ఇందు వాసరః {సోమ వారం}* *రాశి ఫలితాలు

 *30-10-2023*

*ఇందు వాసరః {సోమ వారం}*

*రాశి ఫలితాలు*

*మేషం*

విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు  కలుగుతాయి. నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు  పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

*వృషభం*

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు  తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.  సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

*మిధునం*

శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి  ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో  అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

*కర్కాటకం*

చేపట్టిన పనులలో ఆటంకాలు  తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో  కొన్ని సమస్యల నుండి బయట పడగలరు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు  ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

*సింహం*

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం  అందుతుంది. బంధు, మిత్రులతో   ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.  వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.  క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

*కన్య*

కీలక వ్యవహారాలలో సోదరులతో  భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం  మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

*తుల*

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి. నూతన కార్యక్రమాలు  ప్రారంభానికి అవరోధాలు  తప్పవు. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని  విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు కలుగుతాయి.

*వృశ్చికం*

సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన  గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  నుండి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత  పురోగతి సాధిస్తారు.

*ధనస్సు*

మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని  మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 

*మకరం*

మిత్రులతో  వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  సంతాన  వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

*కుంభం*

గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు   ధన  సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.

*మీనం*

అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం  చేస్తారు.  క్రయవిక్రయాలలో లాభలు అందుకుంటారు. వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున తొందరపాటు  నిర్ణయాలు మానుకోవాలి.

🕉️

పోతనగారి సూర్యోదయ వర్ణనం!


పోతనగారి  సూర్యోదయ వర్ణనం! 


             కం:  అరుణహరి నఖర  విదళిత


                    గురు తిమిరేంద్ర  కుంభకూట  వినిర్ము


                    క్త  రుధిర మౌక్తికముల  క్రియ


                    సురపతి దిశఁ   గెంపు తోడఁ  జుక్కలు  మెఱసెన్;  


                      భాగ-  దశ-స్కం;  1302  పద్యము-  పోతన  మహాకవి;


       సీ:   పౌలోమి  తన బాలు  పాన్పుపైఁ  గనుపట్టఁ


                                     బన్నిన  బవడంపు  బంతియనఁగ ;


             నాయురర్ధముల  వ్యయంబు  లొత్తిలి  చాటు


                                               కాల జాంఘకు  చేతి  గంట  యనఁగ :


             ఘనజంతు  జీవిత   కాలరాసులు  విధిఁ గొల్వ


                                                    నెత్తిన  ఘన  హేమకుంభమనఁగ;


              పశ్చిమ దిక్కాంతఁ  బరగఁ  గైసేయుచో


                                               ముందర  నిడుకొన్న  ముకురమనఁగ; 


     గీ:  కోక తాపోప శమన  దివ్య  ఘుటిక  యనఁగ,


           పద్మినీకాంత  నోముల  ఫలమనంగ ,


           మూడు మూర్తుల  సాకారంపు  ముద్దయనఁగ


          మిహిర  మండల  ముదయాద్రి  మీద  నొప్పె!  


                 భాగ-  దశ-స్కం;  1303  పద్యం ;  బమ్మెఱ పోతన మహాకవి!


                         ఎందరో కవులు  తమకావ్యాల్లో  సందర్భాను సారంగా  సూర్యోదయ  సూర్యాస్తమయ  దృశ్యాలను  వర్ణించారు.

ఒక్కొక్క కవిది  ఒక్కొక్కబాణి.  పోతన వర్ణించిన  సూర్యోదయ దృశ్యమిది.


                 బలరామ  కృష్ణులు  మేనమామ  పిలుపున  మధురలో   విడిసిన  సందర్భమున  నీవర్ణనమున్నది.


                   రెండు  పద్యాలుగా  మనమిప్పుడు  చెప్పుకో బోతున్నాం. మొదటిది కందపద్యం!


            మొదటి పద్యభావం:  అరుణోదయం  సిహంలా  ఉన్నదట. అది  రాత్రియనే మదపుటేనుగు  కుంభస్ధలం  బ్రద్దలుకొడుతున్నదట. ఆసందర్భంలో  ఆకుంభస్ధలం  నుండిరాలే ముత్యాలవలె తారకలు సంధ్యారాగంలో  చూపరులకు

కాననౌతున్నవట! 


                  రాత్రి అనేఏనుగు.  అరుణోదయమనే సింహము.  నక్షత్రములనే  ముత్యములు. ఇవీపోలికలు:


              రాత్రియనే  మత్తేభంమీద అపుణోదయ  సింహంలఘించింది  కుంభస్థలం ఛేదించింది. అంతే అందులో ఉన్న ముత్యాలు రాలిపడుతున్నాయి. ఆదృశ్యాన్ని తలపిస్తోంది. తొలివెలుగురేఖలు తూర్పున ఉదయిస్తుంటే.


          (సముద్రం.  మొసలినోరు  .ఏనుగు కుంభస్థలం . ముత్యాలకు  నెలవులని  కవిసమయం )


                 

                    ఇఁక  రెండవ పద్యానికి వద్దాం!   ముందు భావం  చెప్పుకుందాం!


                           "  తూరుపు దిక్కున   కనబడుతున్న  అరుణకాంతి  శచీదేవి (పౌలోమి) తనకొమరుడాడుకునుటకు  వేలాడదీసిన పగడాల  బంతి యా,యనునట్లుగను,


                           ఆయుః పరిమాణముల  లెక్కలు  వినిపించుటకు కాలమనే  గణకుడు వాయించే  చేతిలోనిగంట యా,యనునట్లును,


                       

                       ప్రాణుల  ఆయుఃప్రమాణమును  కొలుచుటకై  బ్రహ్మగారు  యెత్తిపట్టుకొన్న   బంగరు కుండ యా ,యనునట్లుగను,


                 పశ్చిమ  దిక్కనే వనిత  యలంకరణమునకై  తనయెదుట  నిలుపుకొన్న  నిలువు  టద్దమా,యనునట్లుగను,


                 చక్రవాకముల  విరహతాపమును దీర్ప కాలవైద్యుడిచ్చిన  మందుమాత్రయా ,యనునట్లును,


,,                  పద్మినీ కాంత(తామరపూవు)  నోచిన  నోముల  ఫలమా ,యనునట్లుగను,


,                   లోకాలనేలు  ముగురు మూర్తుల  ఆకారపు  మద్దయా ,  యనునటులను


                                  సూర్యమండలము  ఉదయాద్రిపై  ఒప్పారెను.


                    విశేషాంశములు;  ముందు కంస వధ జరుగ నున్నది. తత్ సూచనలను  యీపద్యమున కవి నిపుణముగా  ప్రవేశపెట్టి

నాడు. గణకుడు గంటలు మ్రోగించుట  మనలోకొందరికి పరిచయమే. ఆస్తుల వేలంపాటలలో అమీనా  పాట పూర్తయిందని చెప్పటం

కోసం ఒకటోసారి (గంట ) రెండోసారి (గంట)  యీవిధంగా హెచ్చరస్తాడు.అదిగో ఆగంటమాదిరి అరుణుడున్నాడట!


                       పల్లెలలో  ధాన్యకొలవటానికి  లోహాలతో  చేసిన పాత్రలుంటాయి. ప్రాణుల ఆయువునుకొలిచే కొలపాత్రలా 

అరుణోదయమున్నదట.  

             చంటి పిల్లలు ఆడుకుంటానికి  ఉయ్యాలపైన రంగురంగుల  బంతులు కడుతూ ఉండేవారుగదా  ఆమాదిరిగా శచీ

దేవి తన కొమారునకు ఆటలనిమిత్తం కట్టిన పగడాల బంతిలా అరుణుడున్నాడట.


                    పశ్చమ దిగంగన  అలంకారం   చేసికోవటానికి   ముందు నిలుపుకొన్న  అద్దంలా ఉన్నాడట.

సూర్యోదయం జరిగేది తూర్పుననే , కానీ  అది  పశ్చిమ దిశాభి ముఖంగానేకదా! చక్కగాఉందివర్ణన.


                  చక్రవాకములని  ఒకరకం పక్షులున్నవట. వాటికి రాత్రి వియోగం  పగలు  సమాగమం.రాత్రంతా  పడిన విరహ తాపం తగ్గటంకోసం అవివేసుకునే  ఔషధ గుళిక లాగ అరుణుడున్నాడట. 


                    ఆడవారు సౌభాగ్యంకోసం  యెన్నో నోములు నోచుతూ ఉంటారు  .పద్మినిచేసిన నోములఫలమా  యనేవిధంగాఅరుణోదయమైనదట.


                            త్రిమూర్త్యాత్మక  స్వరూపం  సూర్యభగవానుడు. బ్రహ్మ  విష్ణు  మహేశ్వరులకు  ప్రతిరూపమని వేదములుఘోషిస్తున్నాయి. 


                              ఆవిధంగా  సూర్యోదయమైనదంటారు  పోతనగారు!


                                                  స్వస్తి!🌷🙏🙏🌷🙏🙏🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

మానవులు మాత్రము

 యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరంగతః |

తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితోజనః||


ఈ ప్రపంచంలో రెండురకములవారు సుఖముగా ఉంటారు 

1మూఢులుఏమియు తెలియనివారు సుఖముగ ఉందురు

2 జ్ఞానులు (పరమహంసలు) బుద్ధికి అతీతమైన పరమాత్మనుపొంది వారు సుఖముఉందురు.

వీరిద్దరికి మధ్యన సంశయముతో వ్రేలాడే మానవులు మాత్రము దుఃఖముల పాలగుచుందురు🙏

సోమవారం, అక్టోబరు 30, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, అక్టోబరు 30, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:విదియ రా11.29 వరకు  

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:భరణి ఉ6.12 వరకు తదుపరి కృత్తిక తె6.00వరకు

యోగం:వ్యతీపాతం రా8.10 వరకు

కరణo:తైతుల మ12.00 వరకు తదుపరి గరజి రా11.29వరకు

వర్జ్యం:సా6.06 - 7.41

దుర్ముహూర్తము:మ12.06 - 12.52 & మ2.24 - 3.09

అమృతకాలం:తె3.38 - 5.14

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి  : తుల

 చంద్రరాశి : మేషం 

సూర్యోదయం:6.01

సూర్యాస్తమయం:5.27


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

కైలాసగిరి నుండి కాశికై

 కైలాసగిరి నుండి కాశికై

కాశికాపురి నుండి దాసికై

దాసికై ఈ దక్షవాటికై 

దయచేసినావయా 

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


విరిసె జాబిలి మల్లెరేఖగా 

కురిసె తేనియల మువ్వాకగా

దరిసి నీ దయ 

నిండు గోదావరీ నది 

ఝరులాయెరా హర

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


ముక్కోటి దేవతల నేతరా 

ముల్లోకముల కిష్టదాతరా

వెలిబూది పూతరా 

నలవిసము మేతరా 

హర హర హర హర 

హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర

lకైలాసగిరిl


                    - దేవులపల్లి కృష్ణశాస్త్రి

           గానం - బి వసంత

సుభాషితమ్

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


శ్లో"   *_సంసారసాగర విశాల కరాళకామ_౹*

*_నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య_౹* 

*_మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య_౹*

 *_లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్_౹౹*


_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ - 03_


 భా: ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను....వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని..... కావున, *ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క రక్షణను [శరణును] నాకు ప్రసాదించుము*...

Panchaang