30, అక్టోబర్ 2023, సోమవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 79*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 79*


సదా సర్వవేళల్లో ఉన్నత మనఃస్థితులలో లయించిపోవాలి,  సమాధి స్థితిలో మగ్నమై ఉండాలనే తపన నరేంద్రునిలో రోజురోజుకూ అధికమవసాగింది. కనుక నిర్నిరోధమైన తపనతో ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి, "నాకు నిర్వికల్పసమాధి స్థితిని అనుగ్రహించండి" అని అడిగాడు.


ఈ ప్రశ్న శ్రీరామకృష్ణులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.


 శ్రీరామకృష్ణులు : ముందు నా ఆరోగ్యం కుదుట పడనీ, ఆ తరువాత నువ్వు కోరిందల్లా ఇస్తాను. 

 

నరేంద్రుడు: కాని మీరు నిష్క్రమిస్తే నా గతి ఏమిటి?


శ్రీరామకృష్ణులు ఒక క్షణం పాటు నరేంద్రుణ్ణి ఆప్యాయంగా తేరిపార చూశారు - 'ఇతడు ఏమనుకొంటున్నాడు? నా దేహం కనుమరుగైనా నాకు నాశనం లేదని ఇతడికి ఇంకా అర్థం కాలేదా? ఆ తరువాత కూడా ఇతడు కోరిందల్లా నేను ఇవ్వనా?' అంటూ ఆయన భావిస్తున్నట్లుగా ఉంది ఆ చూపు. అయినప్పటికీ తమ అనుంగు శిష్యుణ్ణి ప్రేమతో అడిగారు.


శ్రీరామకృష్ణులు : నాయనా, నీకు ఏం కావాలి?


నరేంద్రుడు: మునుపు చెప్పిందే నేను ఎడతెగకుండా కొన్ని రోజుల సమాధిస్థితిలో మగ్నుడనై ఉండిపోవాలి. శరీర పోషణార్ధం మాత్రం అప్పుడప్పుడు సమాధ్యవస్థ నుండి బయటికి రావాలి.


శ్రీరామకృష్ణులు గంభీర వదనంతో ఇలా అన్నారు:...


 "ఛ ఛ! నువ్వు విశాలహృదయుడవని అనుకొన్నాను. కాని ఇలా కోరుతున్నావే! ఇది నీకు తగునా? జీవితంలో దెబ్బలు తిని,దుఃఖంతో వచ్చే వేలమందికి నువ్వొక మర్రిచెట్టులా నీడనిస్తావని నేను ఆశించాను. కాని నువ్వో స్వీయముక్తిని అభిలషిస్తున్నావు. ఏకపక్షమైన ఇలాంటి లక్ష్యాన్ని నువ్వెలా చింతన చేయగలిగావు? సర్వతోముఖ ప్రగతినే నేను కోరుకొంటాను. 

 

చేప కూరను నేను తింటాననుకో. పులుసు, కూర, పచ్చడిగా దానిని పలురకాలుగా తినగోరతాను. 


సమాధిస్థితిలో మగ్నమై భగవద్భావనలో లయించిపోయిన ఆనందంలో మాత్రం నేను సంతృప్తి చెందను. మానవ సంబంధాలలా భగవంతునితో అనేక మార్గాలలో సాంగత్యం నెరపి భగవదానందాన్ని నానారకాలుగా అనుభవించాలని నేను కోరుకొంటాను. నువ్వు కూడా అదే విధంగా ఉండాలన్నదే నా ఆరాటం."

 

శిష్యునితో ఇలా చెప్పినప్పటికీ అతడికి ఆ అనుభవం చూపించాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించుకొన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: