ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, ఫిబ్రవరి 2025, శుక్రవారం
నామ విశిష్టత
నామ విశిష్టత
మానవ లోకంలోనే కాదు... ముల్లోకాల్లోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేరు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడూ లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత ఇంతా అంతా కాదు. మనిషి తాను జీవించి నంతకాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్ధ యాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలను జపిస్తాడు. తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకొంటాడు. నిరంతరం నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతిపూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కని పిస్తుంది. ప్రతి పూజలో, సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన ఇరవైనాలుగు పేర్లను ఉచ్చరిస్తారు. విష్ణువు స్థితికారకుడు. అంటే మనిషి జీవించినంతకాలం అతడికి ఆయురారోగ్యభాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం.
విష్ణువును స్తుతించే ఇరవై నాలుగు నామాలు ఎంతో విశి ష్టమైనవి. కేశవుడంటే అంద మైన శిరోజాలు కలవాడు. కేశి అనే రాక్షసుణ్ని చంపినవాడు. నారాయణుడంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైన వాడు, నరుడి రూపంలో అవత రించిన అవతారపురుషుడు. శబ్దశక్తికి గమ్యం అయినవాడు. మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త. సంపదలకు నెలవైనవాడు. గోవిందుడంటే భూమిని, గోవు లను, స్వర్గాన్ని, వేదాలను రక్షిం చేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న వాడు. మధుసూదనుడు సుణ్ని చంపినవాడు. త్రివిక్ర ముడంటే మూడు అడుగు లతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు. వామనుడంటే పొట్టిగా ఉండీ గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేసినవాడు. శ్రీధరుడంటే సకల సంపదలనూ ధరిం చినవాడు. హృషీకేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభు డంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడంటే తులసీ మాలను ఉదరంపై ధరించినవాడు. సంకర్షణుడంటే శత్రువులను సంహరించేవాడు. వాసుదే వుడంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం కలవాడు. అనిరుద్ధుడంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగి నవాడు. పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షజుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడంటే నర, సింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు. అచ్యుతుడంటే ఎటువంటి నాశమూ లేనివాడు. అధోగతి లేనివాడు. జనార్ధనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడంటే ఇంద్రలోకానికంటే పై లోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలనూ హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు. శ్రీకృష్ణుడంటే సకల కర్మలనూ చేసేవాడు. ఇలా ఇరవైనాలుగు నామాలతో విష్ణువును స్మరించడం వల్ల మనిషి శాంతిని, ఆనం దాన్ని, అభ్యుదయాన్నీ పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం, స్వభావం అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తలచుకొన్నప్పుడు తానూ అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకొంటాడు. అలా అనుకున్నప్పుడు గుణసాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితం మానవుణ్ని మాధవుడిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత.
రాబోతున్న సంక్షోభం
*Today news information*
*తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం మొత్తం రాజస్థాన్ బీహార్ గుజరాత్ వాళ్ళు తో*
●పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు.
●ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు.
క్రమంక్రమంగా దక్షిణ భారతదేశం రాజస్తాన్/గుజరాతీల వలసవాదంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు! మన వాళ్ళూ, స్ధానికులూ వ్యాపారాలు కోల్పోతున్నారు. మనం గమనించాలి.
బ్రిటిష్ కంటే ప్రమాదం మార్వాడీ వ్యాపారులు*
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర !
ఈరోజు రాష్ట్రంలో ఏ ఊరు చూసిన ప్రతి వ్యాపారంలోను మార్వాడీలు ఎంటర్ అయిపోయారు !
ఈస్టిండియా కంపెనీ మాదిరి తెలుగు రాష్ట్రలలో జిలేబి, పానీపూరి, సమోసా వ్యాపారాలతో మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి ఎదిగి పోయారు.
ఇల్లు, వ్యాపారాలు 60 శాతం మించి మార్వాడీలు కైవసం చేసుకున్నారు.
మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే చాలా వరకు బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలు అన్ని కూడా మార్వాడి వాళ్ళవే కాబట్టి మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన వ్యాపారస్తులకు ఇవ్వరు.
డబ్బు ఎవరికీ ఊరికే రాదు కదా అని ఓ గుండు ఆయన చెప్పిన సూక్తిని మన వాళ్ళు బాగా పాటిస్తూ రూపాయి తగ్గుతుంది కదా అని మార్వాడి వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ మన బహుజన కులాల వ్యాపారస్తులకు పాడే కట్టేస్తున్నారు.
కొన్నాళ్ళకు మార్వాడి సేట్లు దగ్గర బానిస లాగా బతికే రోజు దగ్గర్లోనే ఉంది.
మార్వాడీలు గుజరాతి, రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం ఇక్కడ రావడం వల్ల స్థానిక వ్యాపారుల మధ్య ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు.
మన స్థానిక కులాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు.
మన చుట్టుపక్కల, చౌరస్తా లలో, డబుల్ సెట్టర్ దుకాణాలు కొత్తగా ఎవరు పెడుతున్నారు చూడండి.
మన తెలుగు రాష్ట్రాల బహుజన కులాలు కానీ మరే ఇతర వ్యాపారులు కానీ ఉన్నారా,.. లేరు.
చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బతీసి, లేకుండా చేసి హోల్ సేల్ వ్యాపారం అంటూ మార్వాడీలు మొత్తం దక్షిణ భారతదేశంలో స్థానికులు మధ్య పాతుకుపోయారు.
మన స్థానిక ప్రజల డబ్బులు మొత్తం వాళ్ళే దోచుకు పోతున్నారు.
మన స్థానిక బహుజన కులాలు ఏదైనా వ్యాపారం చేద్దామంటే పోటీకి నిలబడే పరిస్థితి లేకుండా ఎంతో తెలివిగా మార్వాడీలు కుట్రలు చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే మన బహుజన కులాలకు వ్యాపారం చేసే స్థోమత కోల్పోయి మార్వాడీ ల దుకాణాలముందు బిచ్ఛం అడుగుకునే దుస్థితి కి దిగజారుతారు.
భవిష్యత్తులో స్థానిక కులాల చిన్న చిన్న వ్యాపారులు ఉండరు.
ఇప్పుడు ఊర్లకు.....
👉గప్ చిప్ బండి వచ్చింది.
👉జ్యుస్ బండీ వచ్చింది
👉పీచ్ మిఠాయిలు బండీ వచ్చింది
👉రాజస్థాన్ టీ వచ్చింది
👉స్విట్ షాప్ వచ్చింది
👉రంగుల షాప్ వచ్చింది
👉పర్నీషర్ షాప్ వచ్చింది
👉సెల్ ఫోన్ చార్జర్లని వచ్చినోళ్ళు
👉షోన్ షాపులే పెట్టిర్రు.
👉సిమెంటు షాపులు
👉పైపుల షాపులు
👉బంగారు షాపులు
👉ఒక్కటేమిటీ అన్నీ వాళ్ళు పథకం ప్రకారం గ్రామగ్రామాన వస్తుంటే ....... పాపం
👉మన బజ్జీలు ఎవరు కొంటారు
👉మన బొండాలు ఎవరు కొంటారు
👉మన టీ షాపు ఎవరు పోవాలి
👉మన ఇడ్లీలు ఎవరు తింటారు
ఆలోచిస్తూ.... ఉండూ, వీళ్ళందరూ యూనిటీ గా ఉంటూ
మనల్ని వాల్ల మీద ఆధారపడి బతికేలాగ చేస్తారు.
తెర వెనుక మొత్తం మన వనరులను దోచుకోవడం, బజ్జీలు పానీ పూరీలు అని ఒకక్కటని కాదు,.. విద్యుత్ ఉపకరణాలు, హార్డ్వేర్ ఉపకరణాలు, సిమెంటు వ్యాపారాలు వజ్రాలు బంగారం వ్యాపారం వరకు ఇలా పెద్ద పెద్ద వ్యాపారులు గా తయారయ్యి వాళ్ల మీద మనం బతికేలా చేయించుకుంటారు
ఒక్కటి చెప్పు....
తెలుగు రాష్ట్రాలకు చెందిన కులాల వ్యాపారస్తులకు వందల కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయా?
నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ లాంటి వారు విదేశాలకు పారిపోయారు.
కానీ ఏ ఇతర కులాల వ్యాపారి అయిన వందల కోట్లు బ్యాకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయాడా...?
అంతేందుకు...
దక్షిణాది స్థానిక కులాల వ్యాపారులు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా తిసుకున్న అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పోయినవాళ్ళను చూపగలవా????
ఆత్మగౌరవం కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉత్తరభారతీయులు మొత్తం లక్షల కోట్లు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోతారు.
ఇప్పటి కైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేల్కొని...మన యవతను సోమరి పోతుల్లా ఉచిత పథకాలతో పరిమితం చేయకుండా...వారికి రుణ సదుపాయం కల్పించి, మంచి శిక్షణ ఇస్తే సరుకుల తయారీ రంగంలో తెలుగు యువత రాణిస్తారు. మన రాష్ట్రంలోని బహుజన కులాలతో పాటు ఇతర స్థానిక వ్యాపారులు కూడా నిలదొక్కుకుంటారు.
అంతేకాదు ఉత్తర భారతీయులు ముఖ్యంగా (గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల మార్వాడీలు)మన తెలుగు రాష్ట్రాలలో స్థానికంగా పాతుకుపోయి వాళ్ళు చెప్పిందే శాసనంగా భవిష్యత్తులో చేసే విధంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి.
●ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు.
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో బయట రాష్ట్రము నుండి మార్వాడి రావడం తో* రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
ఇతర రాష్ట్రాల పని వారు, వారు చేసే పనులు:
బీహార్ వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.
ఒరిస్సా వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.
రాజస్థాన్ వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ
ఉత్తరప్రదేశ్ వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .
కేరళ వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.
కర్ణాటక వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం మందు, మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తినీ వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలియక పోవడం తప్పు కాదు.
🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🔥మనిషికి తెలియక పోవడం తప్పు కాదు.. నేర్చుకోకపోవడం తప్పు.. బయపడటం తప్పు కాదు.. భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయక పోవడం తప్పు.. లోపాలు ఉండంటం తప్పు కాదు.. వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు.. మనం ఏ అంశంలో వెనుకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరి దిద్దుకుని మెరుగైవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు.. బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్లక తప్పదు.. చెట్టుకు ఉన్న ముళ్లనే చూస్తూ ఉంటే వికసించిన గులాబీని తాకలేము..నిన్నటిని మరచి రేపటికై పోరాడుతూ నేడు సాగిపోవడమే జీవితం🔥ఏదీ తప్పో ఏదీ ఒప్పో నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది.. తెలియదు అని అనడం ఆత్మవంచన...నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు.. అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు.. కష్ట సుఖాలు వచ్చిపోయే బందువులాంటివి.. ఉన్నది ఒక్కటే జీవితం.. మంచి ఆలోచనలతో నలుగురితో కలసి మెలసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం జీవితాన్ని మిత్రమా🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N. 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏
మధ్వనవమి_
*_ఈ రోజు మధ్వనవమి_*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మాఘ శుక్ల నవమి*
మధ్వనవమిగా ప్రసిద్ధం.
త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం శ్రీమధ్వాచార్యులు.
ఆయన ఆశ్వయుజ విజయ దశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట , వేదవతిలుగా పేర్కొన్నారు.
ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ , ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాల వైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్న వయసులోనే సకల శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.
ద్వైతమతాన్ని ప్రతిపాదించి నందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.గొప్ప కార్య సాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే.
శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు, వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది.
ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది, ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జీవుడు వేరు , బ్రహ్మము వేరు , జీవుడు మిథ్య కాదు , అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం , భక్తి ఒక్కటే ముక్తిదాయకం , అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి.అని మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు.
దేశంలో వైష్ణవమత వ్యాప్తికి , ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు , జగత్తు మాయ మాత్రమే , జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.
పరమాత్మ సర్వస్వతంత్రుడు , జీవాత్మ అస్వంతంత్రుడు , జీవోత్తముడు ఆచార్యుడు , ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి , అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.
మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ము తారు.తన ద్వైతసిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు.
ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు, తర్కంతో పాటు 37 గ్రంథాలను రచించాడు.
మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.
ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగి పోతున్న ఓడను రక్షించగా , ఓడలోని ముఖ్య నావికుడు భక్త భావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.
శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు , ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశస్తోత్రంగా పిలువబడింది.
ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్నే 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు.
తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు.
ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢనమ్మకాల్నివ్యతిరేకించాడు , యుక్తవయస్సులో కన్యాకుమారి , రామేశ్వరం , శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.
జీవాత్మ , పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని , ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నెతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు.
పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె , కవియూరు , శిరూరు , కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు , మతపరమైన ఆచారాలకు , ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
పురందరదాసు , కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.
మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.
తిరునవాయ నవముకుంద పెరుమాళ్ ఆలయం
🕉 మన గుడి : నెం 1013
⚜ కేరళ : మల్లపురం
⚜ తిరునవాయ నవముకుంద పెరుమాళ్ ఆలయం
( 65వ శ్రీవైష్ణవ దివ్యదేశo )
💠 హిందువులలోని శ్రీ వైష్ణవ శాఖకు 108 దివ్య తిరుపతులు ఉన్నాయి( 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు) మరియు వాటిలో 11 ఇప్పుడు కేరళలో ఉన్నాయి మరియు వాటిలో తిరునవయ ఒకటి.
💠 ఇది నవ యోగులు (శాతువనాథర్, సాలోగ నాథర్, ఆదినాథర్, అరుళీతానాథర్, మధంగ నాథర్, మచ్చెందిర నాథర్, కడయంతీర నాథర్, కొరక్కనాథర్ మరియు కుక్కుడనాథర్) విష్ణువును పూజించిన ప్రదేశం.
విష్ణువు నవయోగులకు దర్శనం ఇచ్చాడు. అందుకే ఈ ప్రదేశాన్ని తిరునవయోగి అని పిలుస్తారు మరియు తరువాత తిరునావయగా మార్చబడింది.
💠 ఇప్పుడు పూజలో ఉన్న నవముకుంద విగ్రహం 9 మంది సాధువులతో కూడిన 'నవయోగులు' ఇక్కడ స్థాపించిన తొమ్మిదవది అని నమ్ముతారు.
పురాణాల ప్రకారం, వీటిలో మొదటి 8 వాటిని స్థాపించిన వెంటనే భూమిలో మునిగిపోయాయి. చివరిది కూడా అలాగే మునిగిపోవడం ప్రారంభించింది కానీ దాని మోకాలి స్థాయిలో బలవంతంగా ఆపివేయబడింది.
8 విగ్రహాలు ఎక్కడికి పోయాయో కచ్చితమైన స్థలం తెలియకపోవడంతో చాలా మంది మోకాళ్లతో మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు.
తిరునవయను 9 మంది విగ్రహాలను ప్రతిష్టించిన యోగుల పేరు మీద 'నవయోగి స్థల' అని కూడా పిలుస్తారు.
🔆 స్థలపురాణం
💠 మనోహరమైన భరతపుళ అను నదీ తటమున వెలసిన ఈ దివ్యదేశమున శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారాయణుని సుందరమూర్తిని ప్రతిష్ఠించుకొని ప్రక్కనే యున్న ఒక కొలను నుండి కమలములను కోసి తెచ్చి పెరుమాళ్ కు సమర్పించి , అలకరించి , అర్చించుచుండెను .
💠 ఒక గజేంద్రుడు ( ఏనుగు) కూడ ఆ పెరుమాళ్ యందు మహాభక్తి తత్పరుడై ఉండెను .
శ్రీమన్నారాయణుని ధ్యానమునే సదా కాలము గడుపుచు ఆ గజేంద్రుడు ఆ కొలను నుండియే కమలములను కోసి తెచ్చి పెరుమాళ్కు సమర్పించి అర్చించుచుండెను .
కాని గజేంద్రుడు ఈ విధముగా చేయుట లక్ష్మీదేవికి ఇష్టములేకుండెను .
💠 తన భర్త అయిన శ్రీమన్నారాయణుని మరియొకరు అలంకరించుట , తను ఏ కొలనులో కమలములు కోయుచున్నదో ఆ కొలనులోని కమలములను ఇంకొకరు కోసి పెరుమాళ్కు సమర్పించుట సహించలేకుండెను .
అందువలన ఆ దేవి చాలా ముందుగా పోయి కొలను లోని కమలములను కోసివేసి పెరుమాళ్ పూజకు , అలంకరణకు వినియోగించుచుండెను .
💠 కొలనులో ఒక కమలము కూడ లేకుండుట గజేంద్రునికి చాలా బాధకలిగి , శ్రీమన్నారాయణుని అర్చించుటలో తాను చేసిన లోపములే అందుకు కారణమని భావించుకొని అతి దీనముగా పెరుమాళ్ ముందు మ్రోకరిల్లి గాఢముగా ధ్యానమున ప్రార్థించుచుండెను .
💠 గజేంద్రుని నిర్మల భక్తికి సంతోషించిన పెరుమాళ్ శ్రీమహాలక్ష్మి యొక్క ఆలోచన సరియైనది కాదు అని తలచి , “ దేవీ ! ఆ గజేంద్రుడు మన భక్తుడు . తనను , తన భక్తిని సంపూర్ణముగా నాయందు సమర్పించుకొని నిర్మలమైన అంతరంగమున నిండుగా నన్ను ప్రతిష్ఠించుకొని తన్మయుడై అర్చించి మహానందమును పొందువాడు .
నీకు నాయందు గల అమిత అనురాగము వలన నన్ను ఎంత చూచుకొని అలంకరించి అర్చించుకొనినను తనివి తీరని నీ అంతరంగము నాకు తెలియనిదా !
దేవీ ! నా ప్రక్కనే ఆసీనురాలివై గజేంద్రుని పూజలను స్వీకరించుము .
ఈ గజేంద్రుడు మనకు పుత్రసమానుడు .
పుత్రవాత్సల్యముతో అతనిని చూడుము . నీకును ఎంతయో ఆనందదాయక మగును " అని బోధించెను .
💠 అంతట లక్ష్మీదేవి తన ఆలోచనలోని సంకుచితత్వమునకు చింతించి , గజేంద్రుని నిర్మలమైన భక్తి ముందు తన భావనలు ఎంత నిమ్నమైనవో గ్రహించి , తన నాథుని యెదుట లజ్జిత వదనయై నిలిచియుండెను . శ్రీమన్నారాయణుడు ఆమెను బుజ్జగించి , “ దీనికి అంతకును నీకు నాయందుగల స్త్రీ సహజ ప్రేమయే కారణము బాధపడకుము " అని చెప్పి లక్ష్మీదేవిని తనచెంతనే కూర్చుండ బెట్టుకొనెను .
💠 శ్రీ కోవిల్ అని పిలువబడే గర్భాలయంలో నవముకుంద విగ్రహం ఉంది. విగ్రహం మోకాలిపై నుండి మాత్రమే ఉంది, మిగిలిన విగ్రహం భూమి లోపల ఉంది.
నవముకుంద విగ్రహం 6' ఎత్తు, మరియు రాతితో తయారు చేయబడింది మరియు పంచ లోహoతో కప్పబడి ఉంటుంది .
విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో ఉంది, నాలుగు చేతులతో పాంచజన్య శంఖం, తామర పువ్వు, కౌమోదకి గద మరియు సుదర్శన చక్రం ఉన్నాయి. విగ్రహం తూర్పు ముఖంగా ఉంది.
💠 ఇక్కడ నదీతీరం పవిత్రమైన వారణాసి లేదా కాశీ వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రజలు ఇక్కడ కాశీ మాదిరిగానే పూర్వీకులకు పిండ ప్రదానాలు పూజలు చేస్తారు.
ఈ దేవాలయం పితృ తర్పణానికి ప్రసిద్ధి చెందింది.
🔅 పండుగలు:
💠 మామాంకం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గొప్ప పండుగ. కనీసం 8వ శతాబ్దపు నుండి గమనించబడుతుందని నమ్ముతారు, ఇది నది ఒడ్డున జరుపుకుంటారు.
వార్షిక ఉత్సవం కూడా మేలో ధ్వజారోహణంతో నిర్వహిస్తారు. ఏనుగుల ఊరేగింపు కూడా ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.
నవముకుంద ఏకాదశి, అష్టమి రోహిణి (శ్రీకృష్ణుని జన్మదినం), నవరాత్రి మరియు అన్ని ఇతర వైష్ణవ సంబంధిత పండుగలు జరుపుకుంటారు.
💠 కోజికోడ్ విమానాశ్రయం మలప్పురం నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Rachana
©️ Santosh Kumar
13-19-గీతా మకరందము
13-19-గీతా మకరందము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారికll ఇవ్విధముగ క్షేత్రక్షేత్రజ్ఞుల రెండిటినిగూర్చి తెలిపి, అట్టి విజ్ఞానమువలన కలుగు ఫలితమును వచించుచున్నారు-
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే.
తాత్పర్యము:- ఈ ప్రకారము క్షేత్రము, అట్లే జ్ఞానము, జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి. నా భక్తుడు (నాయందు భక్తిగలవాడు) వీనినెరింగి నాస్వరూపమును (మోక్షమును, భగవదైక్యమును) బొందుట కర్హుడగుచున్నాడు.
వ్యాఖ్య:- "మద్భక్త ఏతద్విజ్ఞాయ' - నాభక్తుడు దీనిని తెలిసికొని అనిచెప్పుట వలన భక్తుడు కానివాడు ఆ జ్ఞానాదుల నెఱుంగజాలడనియు, పైనదెల్పిన జ్ఞానజ్ఞేయాదుల నెఱుంగుటకు పూర్వము ప్రతివారున్ను భక్తుడు కావలసియున్నదనియు స్పష్టమగుచున్నది. భక్తియను పుష్పమునుండి జ్ఞానమనుఫల మావిర్భవించును. కావున ప్రప్రథమమున సర్వేశ్వరునిపై, సద్గురువులపై అచంచలభక్తి కలిగియుండి జపతపపూజసంకీర్తనాదులచే వారిని ఆరాధించువారికి వారు కరుణించి జ్ఞాన, జ్ఞేయముల నెఱుంగగల 'బుద్ధియోగము' నొసంగగలరు. తద్ద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్సాయుజ్యమునకు (‘మద్భావాయ') తగినవారగుచున్నారు. అట్లు కాక భగవద్భక్తిలేనిచో వారెంతటి గొప్పపండితులైనప్పటికిని, భౌతికవిజ్ఞాన కుశలత్వము గలిగియున్నప్పటికిని ఈశ్వరీయ విజ్ఞానము, జ్ఞేయతత్త్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. మరియు జనులు సామాన్యభక్తితో తృప్తిపడక, సాధనాతిశయముచే క్రమముగ జ్ఞాన, జ్ఞేయములను గూడ నెరిగి మోక్షార్హులు కావలసియున్నారనియు విదితమగుచున్నది.
మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవంతు డిచట సూటియైన సమాధానము నొసంగెను. ఈ జ్ఞానజ్ఞేయాది తత్త్వమును బాగుగ తెలిసికొనినవారే మోక్షార్హులని ఇచట వచింపబడినది. ఆ జ్ఞానాదులో భగవద్భక్తికలవారికే అబ్బుననియు తెలుపబడినది.
ప్రశ్న:- భగవత్సాయుజ్యమును (మోక్షమును) ఎవడు బొందగలడు?
ఉత్తరము:- జ్ఞానస్వరూపమును, జ్ఞేయస్వరూపమును బాగుగ తెలిసికొనినవాడు.
ప్రశ్న:- జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలిసికొనగలడు?
ఉత్తరము:- భగవద్భక్తికలవాడు మాత్రమే.
తిరుమల సర్వస్వం -142*
*తిరుమల సర్వస్వం -142*
*అలిపిరి మార్గం-13*
*త్రోవ భాష్యకారుల సన్నిధి*
"మోకాళ్ళ పర్వతాన్ని" మోకాళ్ళతో అధిరోహించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీమద్రామానుజాచార్యుల వారు. ఆ విధంగా పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళకు గాయ మవ్వడంతో, మార్గమధ్యంలో కొంతసేపు విశ్రమించాడు. ఆ విషయం తెలియగానే తిరుమలలో నివసించే, వారి గురువుగారైన తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వార్ పరుగు పరుగున కొన్ని మెట్లు దిగివచ్చి, విశ్రాంతి తీసుకుంటున్న రామానుజాచార్యుల వారిని పరామర్శించి, కొండపైకి స్వాగతం పలికారు. వారు కొండపై నుంచి వస్తూ, కొన్ని ఆమ్రఫలాలను శ్రీవారి ప్రసాదంగా తెచ్చి రామానుజునుకి ప్రసాదించారు. వాటిని అత్యంత భక్తితో స్వీకరించిన రామానుజులవారు, ఉచ్ఛిష్టాన్ని (ఫలం తినగా మిగిలన మామిడి టెంకలు) అక్కడే వదిలివేశారు. కొన్నాళ్ళకు ఆ టెంకలు మొక్కలుగా మొలచి, వృక్షాలై తియ్యటి ఫలాలను ప్రసాదిస్తూ, బాటసారులకు నీడనిచ్చేవి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మామిడి చెట్లు కూడా, ఆ చెట్ల సంతతికి చెందినవే!
ఆ విషయం తెలుసుకున్న తరువాతి తరాలవారు అక్కడ నమస్కార ముద్రలోనున్న రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో, ఆ ప్రదేశం *"భాష్యకార్ల సన్నిధి"* గా పేరు గాంచింది. కొండకు వెళ్ళే త్రోవలో ఉండటం వల్ల దీన్ని *"త్రోవ భాష్యకార్ల సన్నిధి"* గా కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అక్కడ, 3,260వ మెట్టు వద్ద, రామానుజుల వారికి దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ సన్నిధికి ఎదురుగా ఉన్న శిలపై పాదపద్మాలు చెక్కబడి ఉన్నాయి.
అవి రామానుజులవారు పూజించుకునే *"శ్రీవారి పాదాలు"* అని కొందరు, *"రామానుజుల వారి పాదాలు"* అని మరికొందరు భావిస్తారు.
*అమ్మవారి సారె పెట్టెలు*
రామానుజుల వారికి నమస్కరించుకుని మరికొన్ని మెట్లెక్కగానే మనకు కుడిప్రక్కగా 3302వ మెట్టుపై; నాలుగు భుజాలతో కోణాలతో తీర్చిదిద్దినట్లున్న, చారలు కలిగిన, పూర్వకాలంలో ఉపయోగించుకునే *"కావడిపెట్టలు (40– 50 ఏళ్ళ క్రితం మనం ఉపయోగించుకున్న ట్రంకు పెట్టెలు)"* లేదా *"భోషాణం పెట్టెల"* ఆకారంలో కొన్ని రాతి శిలలు అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. వీటికి సంబంధించి, ఆసక్తికరమైన కథనాలున్నాయి:
*ఒక కథనం ప్రకారం:*
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెడలుతున్నప్పుడు కైకేయి, ఏడువారాల నగలు తనతో తోడ్కొని వెళ్ళటానికి సీతమ్మవారిని అనుమతించింది. ఆ నగల పెట్టెలను సీతమ్మవారు వనవాస సమయంలో ఇక్కడ భద్రపరచగా, సీతమ్మవారు వాటిని తిరిగి తీసుకోక పోవడంతో అవే కాలాంతరంలో శిలలుగా మారాయి. అయితే, సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో తిరుమల క్షేత్రానికి వచ్చినట్లు ఏ రామాయణ కావ్యంలోనూ ఉటంకించక పోవటంవల్ల ఈ కథనం సందేహాస్పద మనిపిస్తుంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
మాఘపురాణం -9వ
MAAGHA PURANAM -- 9
మాఘపురాణం -9వ అధ్యాయము
పుష్కరుని వృత్తాంతము
ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారిని –
“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించాడు.
వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.
దీనికి ఒక ఉదాహరణ వివరింతును ఆలకించు. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.
పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుతున్న పరమభక్తుడు.
ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు తీసి యమునివద్ద నిలబెట్టారు. ఆ సమయములో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను.
యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుని తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చోవలసినదని కోరెను.
యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే ఇంకొకడు ఉన్నాడు. వానిని తీసుకుని రాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకు వచ్చారు?” అని గర్జించే సరికి వారు గడగడ వణికిపోయిరి.
యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి వెళతాన”ని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించాడు .
పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పడుతున్న నరక బాధలను, జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా చూసాడు.
అతనికి అమితమగు భయము కలిగింది. తన భయం బోవుటకు బిగ్గరగా హరినామ స్మరణ చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చాడు. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానముతో భగవంతుని స్మరిస్తు ఉండేవాడు.
ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారు ఉన్నారు ఇది నిజము.
పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.
శ్రీ_భవనారాయణ_స్వామి_గుడి_సర్పవరం
🚩#శ్రీ_భవనారాయణ_స్వామి_గుడి_సర్పవరం.!
♦ఈ ఆలయం కాకినాడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్పవరం కథ బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించబడింది.
గొప్ప సాధువు అగస్త్య ఈ కథను శౌనక మరియు నైమిష అడవిలోని ఇతర సాధువులకు వివరించాడు.
గొప్ప సాధువు కశ్యప కద్రువ ను వివాహం చేసుకున్నాడు, వీరికి వెయ్యి సర్పాలు జన్మించాయి. ఇంద్రుడి తెల్ల గుర్రం అయిన ఉచ్చైశ్రవ ఎత్తుకు వెళ్లి ఆలింగనం చేసుకోవాలని కద్రువ ఇక్కడ కొడుకులను కోరింది, తద్వారా ఆమె వినతను తన భర్త యొక్క రెండవ భార్య, ఆమె సేవకురాలిగా చేస్తుంది. కానీ వారు వినతను మోసగించడం ఇష్టం లేకపోవడంతో వారు తమ తల్లికి అవిధేయత చూపారు. జనమేజయ చేయాల్సిన సర్పబలి లో వెలిగించిన మంటల్లో తన కుమారులు చనిపోవాలని కద్రువ శపించాడు. కద్రువ వెయ్యి మంది కుమారులలో, అనంత ధర్మవంతుడు మరియు గొప్పవాడు, విష్ణువు గౌరవార్థం తపస్సు చేయడానికి అనువైన స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎవరి దయతో తనను తాను రక్షించుకోవాలనుకున్నాడు. అతను ఈ స్థలాన్ని పవిత్రంగా కనుగొన్నాడు మరియు ఇక్కడ తన తపస్సు చేశాడు. దానితో సంతోషించిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై అతనికి సౌకర్యవంతమైన మంచంలా అంగీకరించాడు. ఈ పవిత్ర స్థలం ఎప్పటినుంచో తన పేరును సర్పపుర అని తీసుకుంటుందని మరియు అతను తన జీవిత భాగస్వామి లక్ష్మితో కలిసి నారద మహర్షి చేత స్థాపించబడతానని ప్రకటించాడు. కాబట్టి సర్పపుర అనే పేరు. గొప్ప పాము, అనంత లేదా శేష నుండి వచ్చింది.
♦#ఒక రోజు సాధువు నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు, మరియు విష్ణువు యొక్క భ్రమలో ప్రపంచం అంతా కప్పబడి ఉందని మరియు దాని నుండి ఎవరూ తప్పించుకోలేరని తన ఉపన్యాసంలో విన్నారు. వెంటనే, నారదుడు చేయగలడని నొక్కి చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మ తన అహంకారానికి సలహా ఇచ్చి, దూరంగా ఉండమని కోరాడు. నారదుడు తీర్థయాత్రలో ప్రపంచమంతా తిరుగుతూ సర్పపురానికి వచ్చి అక్కడ ఒక అందమైన సరస్సును కనుగొని, స్నానం చేయాలనుకున్నాడు. కానీ లో: అతను దానిలో మునిగిపోయిన క్షణం అతను ఒక ఆడపిల్ల అయ్యాడు. గతాన్ని మరచిపోయి, అప్పుడు ఒక మహిళ కావడంతో, ఆమె ఒక సహచరుడి కోసం వెతుకుతోంది. ఆ సమయంలో, పిఠాపురం యువరాజు నకుంద వేట కోసం అక్కడకు వచ్చాడు. యువతి మరియు రాజు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతను ఆమెను వివాహం చేసుకుని పిఠాపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కాలక్రమేణా ఆమె ప్రభవ, విభవ మొదలైన అరవై మంది కుమారులు, (తెలుగు సంవత్సరాల పేర్లు) జన్మనిచ్చింది, వారు ఎదిగి ప్రసిద్ధ వీరులు అయ్యారు.
♦తరువాత, మరొక రాజు రిపుంజయ పితాపురంపై దండెత్తి, ఆ తరువాత జరిగిన యుద్ధం, తన భర్తతో కలిసి ఆ మహిళ కుమారులు అందరూ మరణించారు. విజేత ఆ ప్రదేశం వైపు విజయవంతంగా వెళుతుండగా, విషాద వార్త విన్న ఆ మహిళ దుఃఖంతో ఉంది మరియు ఆమె జీవితాన్ని అంతం చేయాలనుకుంది. విష్ణువు పవిత్ర బ్రాహ్మణ రూపంలో ఆమె ముందు కనిపించాడు, మరియు ఆమె దుఃఖ కథను విన్న ఆమె సరస్సులో స్నానం చేయమని కోరింది. ఆమె ముంచినది మరియు ఈసారి ఆమె మళ్ళీ నారద అయ్యింది. అప్పుడు, నారదుడు ఇవన్నీ తెలుసుకోగలడు. తనను క్షమించమని విష్ణువును ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు ఇలా ప్రకటించాడు ”ఈ సరస్సును“ ముక్తి - కసారా ”అని పిలుస్తారు. సాల్వేషన్ సరస్సు మూడు ప్రపంచాలలోని అన్ని పవిత్ర స్థలాలు ఇక్కడే ఉండాలని నేను ఆజ్ఞాపించాను.
ఇక్కడ స్నానం చేసే వారు అన్ని నెలలు, కార్తీక మార్గశిర మరియు మాఘ ల పాపాలను తుడిచివేస్తారు మరియు అన్ని రోజులలో, శనివారం మరియు ఆదివారం స్నానానికి చాలా పవిత్రమైనవి. నా భార్య లక్ష్మితో పాటు నేను ఆమెను అలాగే ఉంచుతాను. దయచేసి అన్ని వేద కర్మలతో నన్ను వ్యవస్థాపించండి ”. నారదుడు ఇక్కడ ప్రభువును స్థాపించాడు. అతను "భవనారాయణ" అని పిలువబడ్డాడు, తద్వారా తన గురించి ఆలోచించేవారికి మోక్షాన్ని ప్రసాదించే దేవుడు, కనీసం వారు అన్ని మాంసం మరియు రక్తంలో అక్కడికి వెళ్లకపోవచ్చని అనుకున్నారు. అప్పుడు బ్రహ్మ, శివుడు సహా సన్యాసులందరూ అక్కడికి వచ్చి ఈ క్రింది విధంగా ప్రకటించిన భవనారాయణున్ని స్తుతిస్తూ పాడారు..
♦నేను ఎల్లప్పుడూ లక్ష్మి, నీలా మరియు భూదేవిలతో కలిసి ఉంటాను “
నూట ఎనభై పవిత్ర స్థలాలలో, భూమిపై నా ఆరాధనలో, ఇది ఉత్తమమైనది. ఈ ప్రదేశం చుట్టూ మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశాలలో నివసించే వారందరూ నా భక్తులు. మూడు రోజులు ఇక్కడే ఉన్నవాడు వంద గుర్రాల మంచిని పొందుతాడు - త్యాగాలు.
♦ఇది క్లుప్తంగా, సర్పా - పురా యొక్క ప్రాముఖ్యత. ప్రాచీన కాలం నుండి, అగస్త్య మరియు వ్యాస వంటి ఉత్తమ ‘పుణ్య క్షేత్ర’ సాధువులు ఈ ప్రదేశాలను సందర్శించినట్లు ప్రశంసలు అందుకున్నారు. ఆలయ పవిత్ర ఉత్సవాలకు విలాసంగా ఖర్చు చేయడం ద్వారా పిఠాపురానికి చెందిన రాజా, మహారాజులు దేవతకు పూజలు చేశారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వినదగు నెప్పుడైనను
చ.వినదగు నెప్పుడైనను వివేకముఁ గూర్చెడు నీతి వాక్యముల్
వినదగు సత్ప్రయోజన సువీక్షితమైన హితైషి సూచనల్
వినదగ దెప్పుడైనను వివేకములేని పరార్థ భాషణల్
విని కనినంత ధీమతి వివేచనఁ జేయ హితమ్ము భారతీ ౹౹ 31
చ. స్తుత మతితో విచక్షణ యశోగతిఁ గూర్చు శుభ ప్రదమ్మునౌ
అతులిత వైభవమ్మొసఁగు నాదరమున్ గలిగింపఁ జేయు స
న్మతి మహి మాయికాధముల నైజములన్ గమనింప నేర్పుమై
హిత మగు నెల్ల భంగుల సహేతుకమై వెలుగొందు భారతీ౹౹ 32
భాగవతము 🙏 రెండవ భాగం
🙏పోతన --భాగవతము 🙏
రెండవ భాగం
ఎవ్వని భద్ర గుణములు వర్ణించలేక బ్రహ్మాదులు ఆతని అనంతుడని, అనంత పద్మనాభుడనీ కీర్తింతురో అట్టి శ్రీ భూనీలా సమేత శ్రీమన్నారాయణుని వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించి పరవశించే గాథలున్న గ్రంథం - భక్త పోతన భాగవతం
ఎవ్వాని పదాంబుజ చారు రజో వితానము(పాదపద్మపరాగము, పాద ధూళిని) తమ కిరీటములందు అలంకరించుకొని బ్రహ్మరుద్రాదులు గర్వముతో పరవశించిపోవుదురో అటువంటి శ్రీమహావిష్ణువు, శ్రీహరి పాదారవిందముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
ఏ దేవు పదయుగంబు ఏప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మికమల ఎవ్వాని పాదకమలంబు సేవించు కౌతుకమున కమలాదేవి సుకుమారంగా ఒత్తినంతనే కమలనాభుడైన శ్రీహరి పాదకమలములు కందిపోతున్నాయని విలవిల్లాడిపోయే మహా భక్తుల భాధలు వివరించి, అటువంటి అతి సౌకుమార్యమైన శ్రీమన్నారాయణుని పాదపద్మముల వైభవాన్ని గురించి అదే సమయమున భక్త జనులను కరుణించి రక్షింప యుగయుగముల తరబడి వజ్ర సదృశమైన పాదములతో వేంకటాచలపతియై, విఠలుడై నిలబడినట్టి అట్టి శ్రీహరి, శ్రీకృష్ణుని శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించునట్టి మహా కావ్యం - భాగవతం
ఏ దేవదేవుని పాదపద్మములు దర్శింప, మునులు యుగయుగముల తరబడి తపింతురో ఏ దేవదేవుని పాదకమలములు వీక్షింప,జనులు కల్పముల తరబడి కలవరింతురో అటువంటి శ్రీహరి శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములు ఆకాశగంగలై, ఆ విశ్వాత్ము కీర్తి ప్రభలై, ఆ విష్ణు దేవుని పదనదీ జలములై, సమస్త తీర్థ సారములై, లోక పావన జలములై గగనసీమలలో ప్రవహించిన గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములందు మునుగంగ గౌరీశుండు ఉత్సాహపడి శిరమున దాల్చగా పరవశాన శిరసున గంగ ధరకు జారెనా శివగంగ అన్నట్లుగా ఎవ్వాని పదనదీ జలములు శిరస్సున దాల్చగా పరమశివుడు ఆ రీతిగా పరవశించెనో ఆ విష్ణు దేవుని పాదపద్మముల నుండి ఉద్భవించిన ఆకాశగంగ జలముల వైభవాన్ని వర్ణించే గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
భగవంతుణ్ని పట్టి తీసుకురాగలిగిన మహా గ్రంథం భాగవత గ్రంథం భగవంతుణ్ని నిలబెట్టగలిగిన మహా గ్రంథం
శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువుని, భక్తులు తమ భక్తి పాశాలతో కట్టివేసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
ఇందీవరున్ని ఇటుక మీద నిలబెట్టగలిగిన మహాభక్తుల గాథలు తెలిపే గ్రంథం
యశోదాదేవి వాత్సల్య భక్తికి లొంగి ,పొంగి శ్రీ కృష్ణపరమాత్మ రోటికి కట్టివేయబడిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
ముక్తినిచ్చె ముకుందున్ని నిలబెట్టగలిగిన గ్రంథం
నన్ను రక్షించకుండ నిన్ను పోనిచ్చెదనా సీతారామా అని నిలదీసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
శ్రీమన్నారాయణుని భక్తుల గాథల భక్తి సముద్రం-భాగవతం
నారాయణా అని ఆర్తితో పిలిచిన భక్తుల పిలుపులు సమస్త బ్రహ్మాండాలు నిండి, ఆ వైకుంఠ వరదుని, వరాలు వరదలా కుమ్మరించే ఆ వరదరాజుని కదిలించి తీసుకువచ్చిన మహా భక్తుల గాథలు తెలిపే గ్రంథం
పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థాలసారం అని తెలిపే గ్రంథం
పరమ భాగవతులైన హరిదాసుల పాదాలు కడిగిన జలాలు నింపుకున్న అరచేతుల్లో అమృతం ఉంటుందని తెలిపే గ్రంథం
పరమాత్ముడైన హరిపట్టపురాణి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఇవ్వగలిగిన గ్రంథం
హరి భక్తులతో మాటలు ధర నెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అని తెలిపిన గ్రంథం
అచ్చమే దేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి, సన్యాసము వారికి అని తెలిపే గ్రంథం
పరమ పురుషుడు గోపాల బాలుడై వచ్చి, గోవులు కాసిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
రామ భక్తిని పోతపోస్తే వచ్చిన పోతన్న రచించిన మహా గ్రంథం భాగవతం
కృష్ణ భక్తిని కణ కణంలో నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం
తన నర నరాల్లో నారాయణున్ని, నారసింహుని నింపుకున్న పోతన రాసిన మహా కావ్యం
గుండెల నిండా గోవిందున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన శ్వాస శ్వాసలో శ్రీనివాసున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన మనస్సు నిండా మాధవుణ్ణి నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన రోమ రోమాల నిండా రామున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
ఇలలో మరియు కలలో కూడా ఆ కమలనాథుని,కమలాపతి స్మృతులే నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం - భాగవతం
చిత్త శుద్ధి, చిత్త శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి ప్రసాదించగలిగిన గ్రంథం
మరణ భయం తొలగించగలిగిన గ్రంథం
ధర్మబద్దమైన కోరికలు తీర్చగలిగిన గ్రంథం
గొప్ప రక్షణ ప్రసాదించే గ్రంథం - భక్త పోతన్న భాగవతం
భాగవతంలోని మరికొన్ని పద్యాలు చూద్దాము తరిద్దాము
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నాపరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ;
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ;
బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు,
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
భావము:- భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశ మైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి, మహోత్తరునకు,
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు..
భావము:- భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొండెఱుఁగక స
ద్యోగవిభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
భావము:- యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
సర్వాగమామ్నాయ జలధికి, నపవర్గ;
మయునికి, నుత్తమ మందిరునకు,
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి,
గుణలయోద్దీపిత గురు మానసునకు, సం;
వర్తితకర్మనిర్వర్తితునకు,
దిశలేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి, సమస్తాంతరాత్ముఁ
డైవెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగ
వంతునకుఁ, దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు..
షడ్గుణైశ్వర్యములు 1మహాత్మ్యము 2ధైర్యము 3యశస్సు 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము
భావము:- పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూప మైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయ మైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మ యై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
వరథర్మకామార్థ వర్జితకాములై;
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? ;
రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక;
భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
రామహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ
యోగగమ్యుఁ, బూర్ణు, నున్నతాత్ము,
బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు,
నీశు, స్థూలు, సూక్ష్ము నేభజింతు.
భావము:- ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ ఙ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవ చేయుదును.
పావకుండర్చుల, భానుండు దీప్తుల;
నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు
రాక్రియ నాత్మకరావళిచేత బ్ర;
హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు
గణముల, జగముల, ఘన నామ రూప భే;
దములతో మెఱయించి తగ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన;
యై,గుణ సంప్రవాహంబు నెఱపు,
స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
భావము:- అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
కలఁడందురు దీనుల యెడఁ,
గలఁడందురు పరమయోగి గణముల పాలం,
గలఁడందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
భావము:- దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నాకడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
భావము:- నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నేభజియింతున్."
భావము:- ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
"లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవేతప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే!యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భావము:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు
హరియశస్సుదాబ్ది (హరికీర్తి అనే పాలసముద్రం) నుండి ఎగిసిన పాల తుంపరలే ఆకాశములో మెరసే తారలు అని హరికీర్తి వైభవాన్ని, హరిభక్తులైన ధ్రువ తారల కీర్తి వైభవాన్ని అనంతంగా వర్ణించే మహా కావ్యం - భక్త పోతన భాగవతం
తెలుగు వారందరికీ నిత్య పారాయణ గ్రంథం - భాగవతం
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
