5, మార్చి 2023, ఆదివారం

నిత్య శ్రాద్ధం :

 1) నిత్య శ్రాద్ధం : 


ప్రతిరోజు అన్నం తినే ముందు ఆపోశన పట్టిన తరువాత ఒక ఐదు మెతుకులు ఒక్కొక్కటిగా కేవలం ఉత్తి అన్నం మెతుకులు

ఓం ప్రాణాయ స్వాహా 

ఓం అపానాయ స్వాహా 

ఓం వ్యానాయ స్వాహా 

ఓం ఉదానాయ స్వాహా 

ఓం సమానాయ స్వాహా 

అని నోటిలో వేసుకుంటే అది నిత్య శ్రాద్ధంతో సమానము లేదా అన్నం తినేముందు ఆకులో వేసిన అన్ని పదార్థములతో అన్నమును కలిపి ఒక బొటనవేలు పరిమాణమంత చిన్న ముద్దను చేసి దానిని ఆకులో కానీ, నేలమీద కానీ, కుడి వైపున పెట్టి, అన్నం తిన్న తరువాత ఆ ముద్దని కాకులకు లేదా వేరే పక్షులకు పెట్టినా అది కూడానిత్య  శ్రాద్ధంతో సమానము. దీనివలన పితృదేవతలు సంతోషిస్తారు.


2) తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఏదో ఒక క్షేత్రములో వారి పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తే అది ఏకధాటిగా సంవత్సరంపాటు శ్రాద్ధం పెట్టిన ఫలితమును ఇస్తుంది. 


3) పుట్టినరోజు నాడు వారి పేరు మీదుగా అన్నదానము కానీ ప్రసాద దానము కానీ చేస్తే అది 100 సంవత్సరముల పాటు అటు దేవతలకు నైవేద్యం పెట్టిన పుణ్యము ఇటు పితృదేవతలకు పిండం పెట్టిన పుణ్యం వస్తుంది. 


4) పితృదేవతలు యమధర్మరాజు రాజధాని నగరం అయిన సంయమని పురమునకు నైరుతి భాగంలో ఉంటారు. వీరు చాలా శక్తివంతులు, వీరందరికీ కలిపి దక్షుడి కూతురైన స్వధాదేవియే భార్య. 


5) మనము పితృ కార్యములలో తండ్రికి కానీ, తల్లికి కానీ, తాతల పేరు మీదుగా గాని పెట్టే పిండము పితృలోకంలో ఉన్న పితృదేవతలకు చెందుతుంది.

ఈ విధముగా మనము పెట్టిన పిండములను పితృదేవతలు స్వీకరించి, మనము ఎవరి పేరు మీదుగా పిండము పెట్టామో వారు ఒకవేళ యమలోకంలో ఉంటే ఆ నరక బాధల నుండి విముక్తి పొంది ఉత్తమ గతులకి వెళతారు. ఒకవేళ ఉత్తమ గతులకి వెళ్లి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా ఉత్తమగతులు కలుగుతాయి. ఒకవేళ పునర్జన్మ ఎత్తి ఉంటే ఈ పిండం పెట్టడం ద్వారా ఇంకా వారికి ఉత్తమ జన్మలు లభిస్తాయి.

మన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన తండ్రి పేరు చెప్పి పెట్టే 3 పిండములు ఈ పితృదేవతలు స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. 


6) ఈ భూమి మీద కొడుకుగా పుట్టిన ప్రతి ఒక్కడు అయితే సంపూర్ణ శ్రాద్ధం కానీ లేదా స్వయంపాకం వంటివి కానీ ఇవ్వాలి. 


7) కొన్ని ఇళ్లల్లో పిల్లలు పుట్టడం లేదు అంటే కారణము ఈ పిండాలు పెట్టకపోవడమే. 


8) శ్రాద్ధ విశేషాల గురించి వినడం వలన, తెలుసుకోవడం వలన అకాల మరణాలు, దుర్మరణాలు ఉండవు. అటువంటి కుటుంబాలలో వాళ్ళు సంపూర్ణ ఆయువుతో జీవిస్తారు.


9) సూర్య, చంద్ర గ్రహణాల తరువాత యథాశక్తిగా (నువ్వులు,దర్భలతో కలిపి నీళ్లు తర్పణాలుగా వదలాలి, అన్నం ముద్దలు చేసి పెట్టాలి)

పిండం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.

గ్రహణానంతరం పితృదేవతలకు తర్పణాలు తండ్రి బ్రతికి ఉన్న వారు ఇవ్వకూడదు. వీరు కేవలం దేవతలకు మాత్రమే తర్పణాలు(కేవలం నీళ్లు మాత్రం) ఇవ్వాలి. 


10) ప్రతి సంక్రమణానికి, వ్యతీపాత తిథులలో,  విషువత్తులకు తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంతో సమానం. 


11) మొదటి సారి క్షేత్ర దర్శనం (కాశీ వంటి క్షేత్రము), దేవతా దర్శనం చేసుకున్న తరువాత నువ్వులు దర్భలు కలిపిన నీళ్ళతో మూడుసార్లు తర్పణం విడిచి పెడితే ఇది కూడా శ్రాద్ధంతో సమానము. ఇది ఆ వంశానికి అపార రక్షణ కలిగిస్తుంది. 


12) జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, గ్రహాల అనుగ్రహము లేకుండా జాతక దోషాలు ఉన్నప్పుడు, పీడకలలు వచ్చినప్పుడు, తండ్రి లేని వాడు నువ్వులు నీళ్లు తీసుకొని తర్పణాలు విడిచి పెడితే అది అపూర్వ శ్రాద్ధంతో సమానం.


13)భోక్తలుగా ఎవరిని పిలవాలి? 


యోగి అయిన వాడు భోక్తగా వస్తే చాలా ఉత్తమం. ఉత్తమ శ్రోత్రియుడు కానీ, ఇంటికి పెద్దవాడుగా పుట్టిన వాడు కానీ, వేదాలు బాగా చదువుకున్న వాడిని కానీ పిలవాలి.

శ్రాద్ధం  పెట్టేటప్పుడు చచ్చిపోయిన ఆయన మేనల్లుడు గాని లేదా కూతురు కొడుకు (మనుమడు) కానీ ఉంటే చాలా మంచిది. 


14) భోక్తలుగా ఎవరిని పిలవకూడదు? 


అవయవ లోపం ఉన్న వాళ్ళు, రోగిష్టి వాళ్ళు,

పునర్భవుడు (ఒక స్త్రీ ఒక భర్త పోయాక రెండవ భర్త ద్వారా పొందిన సంతానం), దొంగ ఉపాధ్యాయుడు, వేదాలను తిరస్కరించే నాస్తికులు, అగ్నిహోత్రానికి నమస్కారము చేయని వారిని, వైద్య వృత్తిలో ఉన్న వారిని, గురువులను పితృదేవతలను తిరస్కరించే వాడిని, సోమరసం అమ్ముకునే వాడిని, పిసినిగొట్టు వాడిని, దంతములు నల్లగా ఉన్న వాడిని, ఎక్కువ తక్కువ అవయవాలు కలిగిన వాడిని (6 వేళ్ళు లేక 4 వేళ్ళు ఉన్నటువంటి వారు), అంధులు, గోర్లు బాగా పుచ్చిపోయి ఉన్నవాళ్ళు భోక్తలుగా పనికిరారు. 


15) దైవ కార్యములో లోటు ఉంటే దేవతలు అంతగా ఆగ్రహించరు. కానీ పితృకార్యంలో ఏదైనా లోటు ఉంటే పితృ దేవతలు వెంటనే ఆగ్రహిస్తారు.


16) శ్రాద్ధములో భోక్తలుగా వచ్చిన వారు మరియు శ్రాద్ధము పెట్టిన వారు, ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ సాంగత్యము చేయకూడదు, రాత్రికి భోజనం చేయకూడదు (తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారైతే మధ్యాహ్నం పితృకార్యంలో మిగిలిన గారెలు కానీ అప్పాలు కాని తినవచ్చును). 


17) పితృదేవతలకు శుక్లపక్షము కంటే కృష్ణపక్షము అంటే ఇష్టము. 


18) శ్రాద్ధము ఎప్పుడూ మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత పెట్టాలి. విదేశీ ప్రయాణం ఉన్నప్పుడు కానీ, లేదా యాత్రలకు వెళుతున్నప్పుడు కానీ 12లోపు శ్రాద్ధం పెట్టుకోవచ్చు.

ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులలో 12 గంటల లోపు పిండప్రదానం చేస్తే, అప్పుడు వెండి దానము చేస్తే, ముందుగా పిండప్రదానం చేయడం వలన వచ్చే దోషం తొలగిపోతుంది. 


19) విశ్వేదేవతల స్థానంలో ఇద్దరు, పితృదేవతా స్థానంలో ఒకరు మొత్తం ముగ్గురు భోక్తలు ఉండాలి. కుదరని పక్షంలో కనీసం ఇద్దరయినా ఉండాలి. 


20) శ్రాద్ధ సమయంలో ఈ మూడు తప్పక ఉండి తీరాలి :

*మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత సమయము.

*నల్ల నువ్వులు 

*కూతురు కొడుకు (దౌహిత్రుడు). ఒకవేళ దౌహిత్రుడు లేకపోతే మిగతా రెండు ఉన్నా, ఆ శ్రాద్ధం కూడా సంపూర్ణం అవుతుంది. 


21) శ్రాద్ధం పెట్టేవాడు, భోక్తలుగా వచ్చినవారు ఆరోజు ప్రయాణం చేయకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ కోపం పొందకూడదు. తొందర పడకూడదు. 


22) శ్రాద్ధం పెట్టే వాళ్ళు ఒకవేళ నీరసంగా ఉంటే పాలు తాగ వచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోనూ మజ్జిగ, రాగిజావ, అంబలి వంటివి తీసుకొనరాదు. 


23) శ్రాద్ధము అత్యంత ఫలితమును ఇవ్వాలంటే వెండిని పదేపదే చూడడము, వెండి పాత్రలు వాడడము, వెండి పుట్టుకను తెలుసుకోవడం, వెండిని పొగడడం, వెండిని దానం చేయడం వంటివి చేయాలి.

24) శ్రాద్ధం పెట్టేవారు బంగారమును ఎట్టి పరిస్థితులలోనూ ధరించరాదు. వారి ఇంటిలో స్త్రీలు కేవలం బంగారం మంగళసూత్రం తప్ప వేరే ఏ ఇతర బంగారు ఆభరణములు ధరించకూడదు. 


25) శ్రాద్ధ సమయములో వీటితో చేసిన వంటలు శ్రేష్ఠము : 


నువ్వులు, యవలు, గోధుమలు, నల్ల ఆవాలు, కాంచన ధాన్యములు, పెసలు, కందులు, మినుము. 


26) శ్రాద్ధములో వాడకూడనివి, పనికిరానివి : 


పెండలం, దోసకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆనపకాయ, ఇంగువ, అలసందులు, ప్రత్యక్ష లవణము (విస్తరిలో ఉప్పు పెట్టడము), చిరు శనగలు. భార్య ధనముతో పితృకార్యము చేయకూడదు. 


రాత్రి తెచ్చి నిల్వ పెట్టిన నీరు, దుర్వాసన వస్తున్న నీరు శ్రాద్ధానికి పనికిరాదు. ఒకవేళ తాజా నీరు దొరకకపోతే ఆవుపాల చుక్క కానీ, దర్భలు కానీ లేదా గంగాజలం చుక్క కానీ ఆ నీటిలో వేస్తే అది స్వచ్ఛ జలం అయిపోతుంది. నీటిలో వేసే ఆవుపాలు ఆవు ఈనిన పది రోజుల తరువాత పాలు మాత్రమే వాడాలి, ఈనిన పది రోజుల ముందు పాలు వాడకూడదు. 


27) శ్రాద్ధం జరిగే చోటులోకి కోడి, కుక్క, ఊర పంది, నపుంసకుడు, రాక్షసులు, పతితులు, మైల ఉన్నవాళ్లు, బయట ఉన్న వాళ్ళు రాకూడదు. 


28) శ్రాద్ధ సమయములో ఇంటి చుట్టూ నల్ల నువ్వులను 

కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్ట.......

అనే శ్లోకం చదువుతూ చల్లితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు శ్రాద్ధంలో ఉన్న దోషాలు కూడా పోతాయి. 


29) శ్రాద్ధంలో భోక్తల ఎదురుగా పితృదేవతా స్తోత్రమును చదివితే శ్రాద్ధంలో తెలిసి కాని తెలియక గాని చేసిన ఎటువంటి దోషం అయినా పరిహారమై పోయి ఆ శ్రాద్ధం అఖండ ఫలితమును ఇస్తుంది.

భారత్ మాతాకి జై *

 భారతీయులకు అంకితం.🙏🙏🙏

బ్రిటన్ కంపనీ   (లీవర్)   హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.           అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..  


*భారత్ మాతాకి జై *

భగవంతుడి లీలలు

 *సంకల్ప బలం*


*దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అని ఒక అయన ప్రశ్న* 


*అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను* అని ఒక గురువు గారు చెప్పారు...


*ఆ కథ..._*


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ *తథాస్తు* అన్నాడు. గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. 


*ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను.*


"ఏమిటా కోరిక గురువు గారూ" 

*తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని*. 

*వచ్చే జన్మలోనా*

*కాదు ఈ జన్మలోనే*


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


*అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా*


*అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది.* ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత...


శిష్యుడు పరుగు పరుగున వస్తూ *గురువు గారూ.. ఈ వింత విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!*


గురువు గారు నవ్వి, *చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా..*


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో...ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. 

*ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది.* అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. 


*భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు*


అందుకే అంటారు సంకల్పం (కోరిక ) బలం గా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని... 🙏

కళ్లు చెదిరే నిజం

 *మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం, చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారా?*

భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలు.


భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ ఎంపీలకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే,భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేలకోట్ల 65 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం.వారి నివాసం, జీవనం,ఆహారం,ప్రయాణ భత్యం,చికిత్స,విదేశీ విహారయాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


7 పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధాన మంత్రుల భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు,పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


ఇప్పుడు ఆలోచించండి. మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇది ప్రజాస్వామ్యమా?


(ఈ 100 బిలియన్ రూపాయలు మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబడి ఉండేది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


→మొదటిది - ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (టీవీ) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి.


→ రెండవది - నాయకుల జీతాలు మరియు అలవెన్సులపై నిషేధం

అప్పుడు దేశభక్తి చూపండి.


ప్రతి భారతీయుడు ఈ వ్యర్థ వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


దయతో

గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి,

దయచేసి అన్ని *ప్లానింగ్* ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోయాయి.


*మీకు రూ.29కే ఫుల్ మీల్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం ముగిసింది.


సిలిండర్,రేషన్ తీసుకురావడం లేదు


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది.చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


*అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు 1 కిలోల గోధుమలు చెల్లించాల్సిన అవసరం లేదు.*


*మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.*


దీనిని పరిశీలించండి.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించడానికి ప్రయత్నించండి.


అది అహంకారమా లేక మోసమా....


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే.

టీ = 1.00

sup = 5.50

పప్పు = 1.50

ఆహారం = 2.00

చపాతీ = 1.00

చికెన్ = 24.50

దోస = 4.00

బిర్యానీ=8.00

చేప = 13.00

ఈ వస్తువులన్నీ పేదలకు మాత్రమే మరియు ఇవన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్నాయి.


మరియు ఆ *పేద ప్రజల జీతం నెలకు 1 లక్ష 80,000 రూపాయలు మరియు అది కూడా ఆదాయపు పన్ను లేకుండా.*


మీ మొబైల్‌లో సేవ్ చేయబడిన అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి,తద్వారా అందరికీ తెలుసు…

రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించేవాడు పేదవాడు కాదని వారు భావించడానికి కారణం అదే.


*జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి,ఈ రోజు కూడా ఫార్వార్డ్ చేయబడతాయి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*

కలియుగాన్ స్మరణన్ ముక్తిహి

 శుభదినం.

భక్తి కి పరాకాష్ఠ విశ్వాసం నమ్మకం..దానికే షిర్డీ బాబా గారు శ్రద్ధ మరియు శభురి అన్నారు

అంతే అచంచలమైన విశ్వాసం నకు ధ్రువుడు ప్రహ్లాదుడు అక్రూరుడు వాల్మీకి రామదాసు యిలా ఎందరో తరించారు.

అనన్యశ్చింతయోతోమా 

యేజన పర్యుపాసతే 

తేషాం నిత్యాభి యుక్తానాం

యోగక్షమము  వహాయమం.

    మీకు తెలియనిది కాదు.

నన్ను ఎవరైనా సరే తెలిసికానీ

తెలియక కానీ నా గూర్చి ఆలోచిస్తే  వారి యోగ క్షేమము ల న్నింటినీ నేనె చూసుకుంటాను అని ఆ భగవంతుడు చెప్పాడు.

  దీపపు వెలుగు అని భావించిన పురుగులు అగ్నికి ఆహుతైనట్లు వేరే చింతలు అలా మనస్సుల లో ఆ లోచిస్తున్న భగవత్ భక్తు ల దగ్గరికి చేరటానికి కూడా సాహసించవ్.

రాముల వారి తో  సరుయూ నదిలో దిగబోయిన ఆంజనేయ స్వామి వారికి కలియుగాంతం వరుకు నా భక్తులకు నీవే అండ దండ లు గా వుండి ఆ తరువాత బ్రహ్మ పదవి కి నీవే వుంటావు.అని వారము యిచ్చిన శ్రీ రామ చంద్రుల వారు ఆంజనేయ స్వామి వారు మనకు ఆదర్శం గా వున్నారు.

అలాగే అంబరీషుిల వారు మనకు చిరస్మరణీయుడు గదా .

సూక్ష్మము లో మోక్షము.

అందుకే కలియుగాన్ స్మరణన్ ముక్తిహి.యింత కన్నా ఏమి కావాలి. ఓం నమఃశివాయ.

జీవిత మార్గంలో

 శ్లోకం:☝️

  *యథా సరిన్నైవ కదాపి వక్తి*

*సముద్రమార్గే కియదన్తరం హి ।*

  *తథైవ ధీరో మనుజస్తు మార్గే*

*కష్టాని సోఢ్వా న జహాతి యత్నం ll*


భావం: ప్రవహించే నది "సముద్ర మార్గం ఎటువైపు? ఇంకా ఎంత దూరం ఉంది?" అని ఎప్పుడూ అడగదు? అదేవిధంగా, ధీరుడు (సహనం ఉన్న వ్యక్తి) జీవిత మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విరమించుకోడు.

ప్రార్ధన

 *పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి?* 


*దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ.*


*దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.*


*అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.*


*అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన*.


*సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.*


*సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.*


*భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే   శరీరం వచ్చింది.* 


*ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మనలను వివేకవంతులను చేస్తాడు.*


*చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు, దానిని యంత్రంలో  పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది.*


*అలాగే మన దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని ఉపనిషద్ వచనం...*


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


🌷🙏🌷


ఇంగువ విశ్వనాథ్/20230109

ప్రాకులాడుచుందురు

 .

              _*సుభాషితమ్*_

 శ్లో.

*యథా వ్యాలగలస్థోऽపి*

*భేకో దంశానపేక్షతే|*

*తథా కాలాహినా గ్రస్తో*

*లోకో భోగానశాశ్వతాన్||*


తా𝕝𝕝 

*"పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపమగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు*"....

ఋణపడి జన్మిస్తాడు

 .


             _*సుభాషితమ్*_


శ్లో.


*దేవాతిథిభ్యో భృత్యేభ్యః*

*పితృభ్యశ్చాత్మనస్తథా|*

*ఋణవాన్ జాయతే మర్త్యః*

*తస్మాదనృణతాం వ్రజేత్||*


తా॥

*ప్రతిమనుష్యుడు దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితరులకు, తనకు తాను ఋణపడి జన్మిస్తాడు...కాబట్టి ప్రతి మనుష్యుడు ఆ ఋణాలను తనకు తాను చేతనైనట్లు తీర్చుకునుటకు ప్రయత్నించాలి.*

పంచదార పళ్లెం

*పంచదార పళ్లెం*


చాలా సంవత్సరాలకు ముందు జరిగిన ఒక యదార్ధ సంఘటన నా మదిలో మెదిలి ఇక్కడ పేర్కొంటున్నాను. 


మా గురువు గారి ఇంటికి నేను తరచూ వెళ్లి సందేహ నివృత్తి  చేసుకునేవాడిని. మా గురువు గారికి ఒక ఏడు ఈడు గల    ముద్దులొలికే కుమారుడు ఉండేవాడు.  ఆ పిల్లవాడు తరచూ మా గురుపత్నిని ఎత్తుకోమని మారాం చేసేవాడు. వాడి మనస్సు మళ్లించటానికి ఆవిడ ఒక పెద్ద పళ్ళెరంలో పంచదారను వెదజల్లి వాని ముందర ఉంచేవారు.  దానిని ఒక్కొక్క రేణువు వేలుతో తీసుకొని తింటూ సమయం గడిపే వాడు.  ఆ సమయంలో గురుపత్ని తన గృహ పనులను చేసుకునేవారు. 


అదే విధంగా ఒకటి రెండు రోజులు గడిచాయి. ఆమెకు పిల్లవానితో కొంత ఊరట లభించటంతో  తన పనులు నిర్విఘ్నంగా చేసుకునేవారు. 


ఒక రోజు నేను ఆ పిల్లవానిని చూసి ఆశ్చర్యచకితుడిని అయ్యాను. దానికి కారణం వాడు తన చేయిని మొత్తంగా నోటిలోకి తీసుకొని ఉమ్మి అంటించుకొని చేతితో పళ్ళెరంలోని పంచదారను అద్దుకొని ఒక్క నిమిషంలో నాకి మొత్తం పంచదార అయిపోగొట్టి ఎత్తుకోమని తల్లిగారిని వేధించసాగాడు. మేడమ్ మీరు తెలివిగా వాడికి పంచదార పళ్లెం ఇస్తే వాడు వాడి తెలివితో ఒక్క క్షణంలో మొత్తం తిని మళ్ళి ఏడుస్తున్నాడు అని అన్నాను.  అవును వీడికి రోజు రోజుకు తెలివి పెరుగుతున్నది అని ఆవిడ అన్నారు. 


ఇక విషయంలోకి వస్తే మోక్షార్థి అయిన భక్తుడు అమ్మవారిని (జగన్మాతను) మోక్షాన్ని ప్రసాదించమని పదే పదే వెంటపడి వేధిస్తూవుంటే ఆ తల్లి కూడా మా గురుపత్ని లాగానే మనకు అనేక పంచదార పళ్లెరాలను ఇచ్చి మైమరపించ ప్రయత్నిస్తుంది. 


ఆ పంచదార పళ్లెరాలలో పంచదారే కాక అనేక విధాల ఐహిక సుఖాలు, భోగాలు, విషయ సుఖాలు ఒకటేమిటి మన అరిషడ్వార్గాన్ని తృప్తి పరిచే సమస్తం ఉంటాయి. అమాయకుడైన సాధకుడు వాటిలో తలమునకలు ఐయి జగన్మాతను మరిచి సర్వ సుఖాలను అనుభావిస్తు పాపపు కార్యాలను చేస్తూ మరల మరల ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. 


తెలివైన సాధకుడు అమ్మవారి లీలను తెలుసుకొని మా గురు పుత్రుడు చేసినట్లుగా సర్వ సుఖాలను క్షణంలో అవగొట్టి వాటిలో ఏది శాశ్వతం కాదని తెలుసుకొని అమ్మ చరణాలను వేడుతాడు.


లేదా ఇంకొక విధమైన సాధకుడు తల్లి పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా వాటి అన్నింటీని తృణప్రాయంగా భావించి అమ్మవారిని (మోక్షాన్ని) చేరటమే  తన జీవిత పరమావధిగా భావించి తాపత్రయ పడతాడు. నిరంతర సాధన, అకుంఠిత దీక్ష, మొక్కవోని నమ్మకం సాధకునికి మోక్షాన్ని చేకూరుస్తుంది. ఇది సత్యం. 


కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే, సాధక మిత్రమా,  బాహ్య మైన సుఖాలను, భోగాలను తృణప్రాయంగా తలంచి శాశ్వతము, నిత్యము, సత్యము అయిన మోక్ష సుఖానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తేనే సాధకుడు మోక్షాన్ని పొందగలరు. 


సాధకునికి ప్రారంభంలో అనేక అవరోధాలు కలుగుతాయి.  నిజానికి సంసారిగా వుంటూ సాధన చేయటం అనేది రెండు పడవల మీద ప్రయాణం లాంటిది. ఎంతో నేర్పుతో, ఓర్పుతో, సహనంతో, చాకచక్యంతో, వివేకముతో, సమర్థతో తన పూర్తి భారాన్ని అమ్మవారి మీద పడ వేసి తాను చేసే కర్మలన్నీ ఆ తల్లి తనతో చేయిస్తున్నదని  భావించి ఏ కర్మలోను తన మనస్సును లగ్నం చేయకుండా కేవలం ఒక సాక్షిభూతంగా భావిస్తూ కర్మలు చేస్తూ, నిత్యం ప్రతి క్షణం మనస్సు తల్లి పాదాలమీద నుంచి మరల్చకుండా సాధన చేసే సాధకునికి మోక్షం కరతలామలకం అవుతుంది.  


ఇది సత్యం. ఎన్నో వేల జన్మలనుంచి ప్రాధేయ పడితేనో మనకు పరమేశ్వరుడు ఈ మానవ జన్మ ఇప్పుడు ఇచ్చాడు.  దీనిని సార్ధకత చేసుకొని ఇప్పుడే జన్మరాహిత్యానికి కృషి చేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే మనం తిరిగి జీవన చక్రంలో పరిభ్రమించక తప్పదు.  సాధ్యమైనంత వరకు పాప కార్యాలను నిరోధించి పుణ్య కార్యాలకు ప్రాధాన్యత ఇస్తూ కర్మలు చేస్తేనే మనం మోక్షాన్ని పొందగలము.


ఓం తత్సత్,


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

98486 47145

ఔషధాలు సేకరించే విధానము

 ఆయుర్వేద ఔషధాలు సేకరించే విధానము - 

 ఆయుర్వేదం ఔషధాలను ఒక ప్రత్యేక మయిన పరిస్థితులు , ఒక నిర్దిష్టమైన సమయం లొ మాత్రమే ఔషదులని గ్రహించాలి. అటువంటి ఔషధాలు మాత్రమే పరిపూర్ణం గా పనిచేస్తాయి.


      ఔషధాలు ఎంత శక్తివంతం గా పనిచేస్తాయి అనేది ఆ ఔషధి ఉన్నటువంటి నేల కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఔషధాలను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాడినప్పుడే శరీరం పైన వాటి ప్రభావాన్ని బలం గా చూపిస్తాయి.


 ఔషధాలు సేకరించు స్థలం - 


 ఋతువులు సరిగా ఏర్పడుతూ ఉండాలి. వెన్నెల, నీరు , గాలి కాలానుసారం గా ఉండాలి. అట్టి స్థలం లొ ప్రదిక్షణం గా ప్రవహించుచున్న నీరు కలిగి ఉండి దర్భ మొదలయిన మొక్కలచే వ్యాపించి అట్టి మన్ను నల్లగా కానీ బంగారు రంగులొ కలిగి ఉన్నది అయ్యి సువాసనలుతో కుడుకొని ఉన్నది అయి ఉండాలి. అచ్చట గండ్ర ఇసుక, చౌడు, గులక రాళ్లు , గోతులు, పుట్టలు మొదలయినవి ఉండకుడదు. మరియు అచ్చటి భూమి రాజవీధి , స్మశానం, ఇండ్లు, రచ్చబండ, ఉద్యానవనం వీటి సమీపం లొ ఉండకుడదు. నాగలిచే దున్నబడక వృక్షములను ఆవరించి ఉండవలెను.


       పురుగులు కలదియు, సర్వ కాలంబులు నీరుచే వ్యాప్థమైపొయి , పూర్వం చెప్పిన గుణములు లేనిది అయ్యి, పిశాచములు కలిగి ఉన్న భూమిలో పుట్టిన ఔషధాలు పనికి రావు .

      

          విస్తారంగా స్థూల వృక్షాలు, గసువు, పైరు మొదలగు వానిచే ఉండి గట్టిగా ఉండి, బరువు కలిగి అనేక పాషానాలతో ఉండి శ్యామల వర్ణం కలిగి, నల్లని వర్ణం కలిగిన భూమి లొ చాలా అదిక గుణం కలిగిన ఔషధాలు ఉండును. 

         భూమి యెక్క గుణం ఏ విదంగా ఉండునో ఆ ఔషధీ గూడా అదే విదంగా ఉండును.


 భూమి గుణాలు - పృథ్వి, ఉదక గుణములు కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు విరేచానకారులు అవును. ఆకాశ గుణం కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు వమన కారిణి గా ఉంటాయి. పంచ భూతముల లక్షణాలు కలిగిన భూమి లొ పుట్టిన ఔషధాలు వమన కారిణులు , విరేచన కారిణులు అవును.


 ఔషధాలు సేకరించే విదానం -


 ఔషధాలను సేకరించాలి అనుకున్న వైద్యుడు పూర్వపు రోజున ఉపవాసం ఉండి పవిత్రుడి గా ఉండి దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, బ్రహ్మ్మను, దక్షప్రజపతిని , అశ్విని దేవతలను పూజించి నాలుగు దిశలలో బలి ని సమర్పించి ఆ ఔషధిని ఆశ్రయించి ఉండు సమస్త దేవతలను గూర్చి " ఓ దేవతలారా నన్ను నిరపరాధుని చేసి మీరు ఆశ్రయించి ఉండు ఈ ఔషధిని విడిచి పొండు సర్వ ప్రాణ కోటికి జీవ పదార్ధంబైన ఈ ఔషధిని నేను గ్రహించేదను. మరియు ఓ దేవతలారా నేను ఈ ఔషధిని లోభం కొసం గ్రహించడం లేదు . ప్రధానం గా బ్రాహ్మ్మన రక్షణార్ధం అని ప్రార్ధించి నానా వర్ణములు గల దారాలతో ఆ ఔషధానికి రక్షాబంధనం చేసి పిమ్మట గృహమునకు పోవలెను.


           మరునాడు తను రక్షాబంధనం కట్టిన ఔషధి దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించ వలెను. తాను కట్టిన రక్షాబంధం పూర్వం వలె ఉండి అక్కడ మరేటువంటి వికారములు లేకుండుట చూచి బ్రహ్మ్మనుల చేత స్వస్తివాచకం చెప్పించుకొనుచూ అక్కడికి వచ్చి సూర్యుడు ఉదయించి నడినెత్తికి రాగా "ఖనన మంత్రం " ప్రకారం ఆ ఔషధి యెక్క తూర్పు వైపు బారిన వేరును అయినా ఉత్తరం వైపు బారిన వేరును అయినా తవ్వవలెను.


 ఖనన మంత్రం - ఔషధి కొసం తవ్వేప్పుడు ఖనన మంత్రం ఖచ్చితం గా పటించాలి .

 " బ్రహ్మ, విష్ణు వుని యే హస్తం చే తవ్వేధరో అట్టి అయిదు వేళ్ళు గల చేతితో నిన్ను తవ్వేదను". ఇదియే ఖనన మంత్రం. దీని చేత ముందు చెప్పిన ప్రకారం తవ్వాలి.


 గ్రహణ మంత్రం - " మంగళ కరం అగు ఔషధి నీకు నమస్కారం .మీకు శుభం ఔషదులార . బలవంతం లగుదురు కాక .ఒక్కోనియందు వీర్యం కలగ చేయుడు .మీకు ప్రార్దిన్చేదను అని మంత్రం చెప్పి ఔషధిని పట్టుకోవలెను.


 ఔషధిని పుచ్చుకునే ముందు మంత్రం - ఔషధి శ్రేష్టమ మంగళం విగ్నములను మిక్కిలి దహించుము . మిక్కిలి నశింప చేయుము . మిక్కిలి చీల్చుము. నీకు నమస్కారము. అని ఈ మంత్రం చెప్పి ఔషధిని లొపలికి పుచ్చుకోవలెను.


 వ్యర్ధ ఔషధాలు - పురుగు కుట్టినది. నీటిలో మునిగినది. మేకలు తినినది. పిశాచముల చేత వికారం పొందింది. ఎల్లప్పుడు నీడనే ఉన్నది. నీటిచేత తడియక ఎండినది . చెట్ల సందుల ఎందు ఉండినది. నడిచే దారిలో ఉన్నది. పది మందికి తెలిసినది సారం లేనిది గాని ఔషధములు వాడ రాదు. ఒకవేళ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే చంద్రగ్రహణ సమయం లొ , మరియొక రాత్రులలో గానీ మూలికలు గ్రహింప కూడదు .


 ములికలు గ్రహింప వలసిన కాలం - వర్ష ఋతువు నందు కొమ్మలు, వసంత ఋతువు నందు చిగురుటాకులు, శిశిర ఋతువు నందు , గ్రీష్మ ఋతువు నందు పండుటాకులను , మొలకెత్తు ఆకులను, మూలములను గ్రహించాలి.


       మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కుదిరిన సంధి:*

 *కుదిరిన సంధి:*

(సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం)


అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"!  మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! 


తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన  "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. 


ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. 


వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన  చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! 


ఇదిలా ఉండగా....


వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. 


తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. 


అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు,  పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. 


"ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. 


సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. 


జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది.


నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. 


"అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. 


అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు,  ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు.


విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని,  సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల  పేరిట 

రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. 


అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! 


ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! 


తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడి లో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! 


అమ్మ, నాన్నగార్ల ఆశీస్సులతో

✒️అయ్యగారి కృష్ణకుమార్.

అట్టహాసములు

 *


అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! 


*శ్రీరస్తు!శుభమస్తు!అవిఘ్నమస్తు!*


*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,

*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,

*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

*ఆర్భాటంగా మండపాలు కట్టడం,

*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,

*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం, 

*దావత్ పేరుతో తాగితందనాలాడటం,

*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,

*మధ్యతరగతి మనిషికి అవసరమా?


*ఒకడిని చూసి ఒకడు,

*ఒకడ్నిమించి ఒకడు

వెర్రెక్కి పోతున్నారు

నేటి కాలంలో.


*ఎంత తింటాడు మనిషి?

*దేంట్లో దొరుకుతుంది వినోదం?

*ఎలా చేయాలి వేడుక?

*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

*ఏది కడితే వస్తుంది హుందాతనం?

*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

*ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.


*పదిమందితో పట్టెడన్నం తింటే,

*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.


*ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

*చెమటపడితే కారిపోయే రంగుకీ,

*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,

*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,

*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,

ఉన్నదంతా ఊడ్చిపెడితే

పదికాలాలు బతకడానికొచ్చే 

కొత్తమనిషికి

తర్వాత పెట్టేది ఏమిటి?


*అప్పు చేసి ఖర్చుచేసే,

వెర్రితనం కాదు పెళ్ళంటే!

*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే

ఇంగితమైన పని వివాహ మంటే!

*శక్తికి మించి ఎగరటం,

*అప్పుచేసి ఆర్బాటం చేయటం 

*ముమ్మాటికీ తప్పు*.


*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు!*

అద్వైతశాఖ

 శైవంలో అద్వైతశాఖ ఒకటుంది


జపాన్ దేశం నుండి వచ్చిన ఒక యువసంస్కృత పండితుడు టోక్యో విశ్వ విద్యాలయంలో సంస్కృత భాషోపన్యాసకుడుగా ఉద్యోగం చేస్తున్న మినోరుహర అనే వారికి ఈ యేడు ఆగస్టు 12, సోమవారం రాత్రి స్వామివారు దర్శనమిచ్చారు. వారి సంభాషణ 90 నిమిషాలపాటు జరిగింది. వచ్చిన పండితుణ్ణి స్వామివారికి సరిచయంచేసి, డాక్టర్ వి. రాఘవన్ ఇరువురి ప్రశ్నోత్తరాలనూ వారివారి భాషల్లో వివరించి చెప్పారు. మినోరుహర హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ శైవశాఖలపై పరిశోధన సాగిస్తున్నారు. సాంస్కృతిక వినిమయ పథకం క్రింద భారత ప్రభుత్వానికి అతిథిగా భారతదేశాన్ని సందర్శించటానికి వచ్చారు. పలుప్రాంతాలు సందర్శించి కంచికి వచ్చి స్వామివారిని సందర్శించారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృతాచార్యులుగా పనిచేస్తున్న శ్రీ పి. తిరుజ్ఞాన సంబంధం కూడా మినోరుహర స్వామివారితో మాట్లాడినప్పుడక్కడే వున్నారు.


ముందు మినోరుహర మోకాళ్ల మీద వంగి చేతులు జోడించి జెపానీయుల పద్ధతిలో స్వామివారికి నమస్కారాలు తెలిపారు. 'హర' అనే పదం శివుని పేరంటూ స్వామివారే సంభాషణ ప్రారంభించారు.

శైవమతం దక్షిణాదికి ఎప్పుడెలా వచ్చిందో, అక్కడది వర్దిల్లటానికి కారణాలేమిటో చెప్పండని మినోరుహర కోరారు.


“శైవం దక్షిణ భారతంలో వర్ధిల్లనికాలమంటూ లేదు. అనాదిగా నాగరకత కళ్లు తెరిచినప్పటి నుండీ అదిక్కడుంది” అని స్వామివారన్నారు.


అద్వైతానికీ శైవానికీ వున్న సంబంధాన్ని వివరించండని మినోరుహర కోరారు.


"శైవశాఖలు చాలా వున్నాయి. అందులో ఏ శాఖను గురించి అడుగుతున్నా” రని స్వామివారడిగారు. “శైవంలోనే అద్వైత శైవం అనేది అంతర్భాగంగా వుంది. అలాగే ద్వైత శైవాలూ అనేకాలున్నాయి. ఈ రెండు రకాల శైవాలూ కాశ్మీరులోనూ దక్షిణ భారతంలోనూ బాగా వృద్ధి చెందాయి. దక్షిణాది శైవ శాఖల్లో ప్రసిద్ధమైనవి సిద్ధాంత శైవం, వీరశైవం అనేవి. సిద్ధాంత శైవం తమిళ ప్రాంతంలోనూ, వీర శైవం కన్నడ, తెలుగు సీమలలోనూ వ్యాపించాయి. “దక్షిణ భారతంలో వల్లాలారేశాస్త్రం అని అద్వైత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని వర్ధిల్లిన రచనలు కొందరు శైవసిద్ధాంతులు చేశారు. సిద్ధాంత శైవశాఖలో కూడా శివాగ్రయోగి లాంటి అద్వైతులు చేసిన రచనలెన్నో వున్నాయి. మోక్షావస్థలో జీవుడు శివునిలో (పరమాత్మలో) లీనమై అభేదస్థితిని పొందుతాడని చెప్పే అద్వైతశైవశాఖ ఒకటి, మోక్ష స్థితిలో కూడా శైవునికీ, శివునికి భేదస్థితే గాని అభేదస్థితి లేదని ప్రతిపాదించే ద్వైతశాఖ ఒకటి వున్నాయి. ఈ రెండో శాఖ శ్రీరామానుజుల విశిష్టాద్వైతం. అందులో జీవుడు ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొందిన తర్వాతకూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. భగవంతుని అనంత కల్యాణ గుణాలవల్ల అపారమైన అనుగ్రహభాగ్యంవల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తూనే వుంటాడు.


“కాని విశేష ప్రచారంలోవున్న శైవసిద్ధాంతం ప్రకారం జీవుని వ్యక్తిత్వం అనేది మాటవరసకు ప్రత్యేకంగా నిలిచివున్నప్పటికీ, అనుభవంలో మాత్రం పరమాత్ముని సర్వవ్యాపకమైన తేజస్సులో లీనమైపోతుంది. సూర్యోదయమయాక నక్షత్రాలు కనబడకపోవటం పాలకుండలో జారిన నీటి బొట్టు అదృశ్యం కావటం లాంటి స్థితి అది” అని స్వామివారు చెప్పారు.


స్వామివారడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ మినోరుహర "నే నధ్యయనం చేసినంత మట్టుకు పాశుపత సూత్రాలు మతసంబంధమైన విషయాలను గురించి చెప్పినంత తత్త్వ సంబంధమైన విషయాలను గురించి చెప్పలేదనుకుంటాను” అన్నారు.


ఆ మాటలు విని చిరునవ్వుతో "మత విషయాలు హృదయాన్ని కదిలిస్తాయి. వేదాంత విషయాలు బుద్ధికి వికాసం కలిగిస్తాయి” అన్నారు స్వామి.


తిరువాన్కూరు సంస్కృత గ్రంథమాలవారు కౌండిన్యభాష్యంతో కలిపి ప్రచురించిన పాశుపత సూత్రాలను ఆధారం చేసుకుని మినోరుహర మాట్లాడుతున్నారని డాక్టర్ రాఘవన్ స్వామివారికి విన్నవించారు.


అయితే పాశుపత సూత్రాలు భగవంతుణ్ణి ఉపాదానకారణంగా భావించాయా లేక నిమిత్తకారణంగా భావించాయా అని స్వామివారు ప్రశ్నించారు. దానికి రాఘవన్ “ఇలాంటి వేదాంత విషయాల్లో దేశంలో ప్రచారంలో వున్న నాలుగు శాస్త్రీయ శైవశాఖలూ న్యాయశాస్త్రాన్నే అనుసరించాయి. ఉద్దోతనకారుల వంటి నైయాయికులు పాశుపతాచార్యులుగానే పరిగణింపబడ్డారు. వారందరూ నిమిత్త కారణవాదులే” అని సమాధానం చెప్పారు. “ఈ విషయం గురించి మీ విద్యార్థుల్లో కొందరిని పరిశోధన చేయమనండి” అని స్వామివారు డాక్టర్ రాఘవ తో అన్నారు. 


మీరేనా మరెవరైనా జపాన్ దేశ పండితులు శైవాన్ని గురించి పరిశోధన చేసున్నారా? అని ఆచార్యులవారు మినోరుహర వైపు తిరిగి అడిగారు.


హర : నేనే ప్రస్తుతానికి.


స్వామివారు అప్పుడు 'షింటోయిజం' గురించి ప్రస్తావించారు. 


దానికి సమాధానం చెబుతూ మినోరుహర “షింటో మతం ప్రాచీనమైంది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచో, 3వ శతాబ్దం నుంచో వస్తోంది. కాని దానిమీద వ్యాఖ్యానాలు మాత్రం 15, 16 శతాబ్దాలనాటివి. షింటోమత గ్రంథం ఋగ్వేదంలాగా గేయమంత్రం. అందులోనుంచే వ్యాఖ్యాతలు మత సిద్ధాంతాలన్నీ రూపొందించారు. జపాన్ బౌద్ధమతం 7వ శతాబ్దంలోగాని రాలేదు. ప్రాచీనమైన బౌద్ధ గ్రంథాలు 8వ శతాబ్దంనాటివే అని చెప్పారు.


ప్రాచీన జపనీస్ గ్రంథాల్లో ఎక్కడైనా వేదాల ప్రసక్తి కనపడుతుందా అని అడిగిన ప్రశ్నకు "లే”దని సమాధానం చెప్పారు.


మరి సరస్వతి, గణేశుడు వంటి హిందూదేవతల విగ్రహాలు జపాన్ కెలా తరలివెళ్లాయని స్వామివారడిగినప్పుడు, అవి బౌద్ధమతంతో పాటు వచ్చాయని మినోరుహ సమాధానం చెప్పారు. తాను భారతదేశానికి రావటం ఈ రెండుదేశాల సాంస్కృతిక సంబంధాలు పెంపొందించటం కోసం కూడానని వారన్నారు. 


స్వామివారు : భారతదేశానికి రావటానికి ముందు ఈ దేశాన్ని గురించి మీకు మనస్సులో ఏదో ఒక బొమ్మ వుండి వుండాలి. ఆ బొమ్మ యిక్కడకొచ్చాక ఏమైనా మారిందా? 


మినోరుహర : భారతదేశం నేననుకున్న దానికన్నా ఆసక్తికరంగా వుందని మాత్రం చెప్పగలను. కొన్ని విషయాల్లో అది నా అంచనాలకు సరితూగలేదు. కాని మరికొన్ని విషయాల్లో అది నా అంచనాలు దాటిపోయింది. మొత్తం మీద ఈ దేశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. 


స్వామివారు : ఇంతవరకు మీరు ఏయే కేంద్రాలు సందర్శించారు? 


హర : ఢిల్లీ, లక్నో, వారాణసి, కలకత్తా, మద్రాసు చూశాను. బాంబే, పూనాలకు కూడా వెళ్లాలని వుంది. 


స్వామివారు : సంస్కృత భాషకూ, ఆభాషలో జరుగుతున్న పరిశోధనకూ సంబంధించి ఏకేంద్రం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది.?


హర : నేను చూచినంత మట్టుకు వారాణసి, కలకత్తా, మద్రాసు. వారాణసిలో హిందూ విశ్వవిద్యాలయాన్ని, సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించాను. 


స్వామివారు : ఆ రెంటిలో ఏది మంచిది?


హర : దేని ప్రత్యేకత దానిదే. రెండూ మంచివే.


మరొక ప్రశ్న సమాధానంగా మినోరుహర “జపాన్లోని చాలా కుటుంబాల్లో షింటోమతమూ, బౌద్ధమతమూ రెండూ కనబడతాయి. మా యింట్లో షింటో మందిరం, బుద్ధుని మందిరం రెండూ వున్నాయి. షింటో మతాన్ని అనుసరించేవారికీ, బౌద్ధమతాన్ని అనుసరించే వారికీ వివాహసంబంధాలున్నాయి. జపాన్ ప్రజలు ముఖ్యంగా షింటో మతస్తులు, షింటో మతం "జపనీస్ తనానికి” చిహ్నం. షింటో మతం తరువాతే బౌద్ధమతం వచ్చింది. దాని ప్రభావం షింటో మతం మీద కనబడుతుంది. జపనీయుల సంస్కృతి యావత్తూ షింటో మతంతో ముడిపడివుంది” అన్నారు.


హిందువుల్లోవున్న శ్రాద్ధ సంప్రదాయాలు దృష్టిలో వుంచుకుని “షింటోమతంలో పితృదేవతలకు జరిగే ప్రత్యాబ్దిక క్రతుకాండ ఏవిధంగా వుంటుం”దని స్వామివారు ప్రశ్నించారు.

హర : ప్రతి ఏడూ మార్చి 23, సెప్టెంబరు 23 మాకు శ్రాద్ధదినాలు. ఆ రెండు రోజుల్లో మాత్రమే పగటికాలమూ, రాత్రి కాలమూ సమానంగా వుంటాయి. 


మా దేశంలో చనిపోయినవారికి దహనసంస్కారమే జరుగుతుంది. వారి అస్థులు ఒక పేటికలో వుంచి దానిమీద సమాధి కడతారు. ఆ రెండు రోజులూ సమాధులకు వెళ్లి పుష్పగుచ్చాలుంచి పితృదేవతలను గౌరవించడం మా ఆచారం. ఇదికాక వేరే ప్రత్యాబ్దిక విధికూడా మాకుంది. ఆనాడు పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతాడు. బంధువులు వచ్చి విందారగిస్తారు. చాలా ముఖ్యమైనవి.


“ఇంచుమించు షింటోమతం మా హిందూమతమే అని అనుకోవచ్చా?” అని స్వామివారడిగిన ప్రశ్నకు, “ఈ రెంటికీ కొన్ని సామ్యాలున్నా అవి ఒకటే అనటానికి వీల్లేదు. అతి ప్రాచీనకాలంలో ఈ రెంటికీ ఏదో సంబంధం వుండి వుండవచ్చు" అని మినోరుహర సమాధానం చెప్పారు.


స్వామివారి దగ్గర సెలవు తీసుకునే ముందు "ధన్యోస్మి యన్మయా శ్రీ శంకరాచార్య దర్శనం లబ్దం. కృతార్థోస్మి, శ్రీ శంకరాచార్యులవారి దర్శనం లభించినందుకు నేనెంతో ధన్యుణ్ణి, కృతార్థుణ్ణి” అని మినోరుహర పునర్నమస్కారం చేశారు.


--- మినోరుహ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*మన సంబంధాలు

 *ఒక స్వర్ణకారుడి మరణంతో, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తినడానికి సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు. ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణిహారాన్ని ఇచ్చి - "నాయనా, దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్లు, ఈ హారాన్ని అమ్మి, మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు", అని అంది.*


*కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు.* 


*మేనమామ ఆ హారాన్ని క్షుణ్ణంగా చూసి - "నాయనా, ప్రస్తుతం మార్కెట్ బాగా మందంగా ఉందని అమ్మకు చెప్పు. కొంత కాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుంది", అని కొంత డబ్బు ఇచ్చి, "రేపటి నుండి వచ్చి నాతో పాటు దుకాణంలో కూర్చో" అని చెప్పాడు.*


*మరుసటి రోజు నుండి, ఆ కుర్రవాడు ప్రతిరోజూ దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టాడు, అక్కడ వజ్రాలను, రత్నాలను ఎలా పరీక్షించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు.*

  

*త్వరలోనే, అతను వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో అనుభవశాలి అయ్యాడు. ప్రజలు తమ వజ్రాలను పరీక్షించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రావడం ప్రారంభించారు.*


*ఒకరోజు మేనమామ, ‘‘అమ్మ హారాన్ని ఇప్పుడు తీసుకుని రా… ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పు, నీకు మంచి ధర వస్తుంది’’, అన్నాడు.*

 

*తల్లి వద్ద నుండి హారాన్ని తీసుకుని ఆ యువకుడు స్వయంగా పరీక్షించగా అది నకిలీదని తేలింది.   మేనమామ అంత గొప్ప అనుభవశాలి అయ్యి కూడా, వారికి ఈ విషయం ఎందుకు తెలియజేయలేదని ఆశ్చర్యపోయాడు.*


 *వాడు హారాన్ని ఇంట్లోనే వదిలేసి తిరిగి దుకాణానికి* *వచ్చాడు** 


 *మేనమామ, “హారం* *తీసుకురాలేదా?” అని* *అడిగాడు. ** 


*"మామయ్యా, ఈ హారం కృత్రిమమైనది, నిజమైనది కాదు ....  మీరు ఈ విషయం నా నుండి ఎందుకు దాచారు?" అని అడిగాడు.*


*దానికి అతని మేనమామ, “నువ్వు నాకు హారం తెచ్చిన వెంటనే అది కృత్రిమమైనది అని చెబితే, నువ్వు కష్టాల్లో ఉన్నందువల్లనే నేను నిన్ను మోసం చేస్తున్నాను అని అనుకునేవాడివి".*

*”ఈ రోజు నీకు నీకుగా జ్ఞానం ఉంది గనుక, హారం నిజంగా నకిలీదని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఆ సమయంలో, నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ముఖ్యమనిపించింది", అని చెప్పాడు.*



*నిజం ఏమిటంటే, జ్ఞానం లేనప్పుడు, మనం ఆలోచించేది , ఈ ప్రపంచంలో చూసేది, తెలుసుకున్న ప్రతిదీ తప్పే.  దీని కారణంగా, మన సంబంధాలు అపార్థాలకు గురవుతాయి, అది విభేదాలకు దారి తీస్తుంది, మన జీవితబంధాలు విడిపోవడం ప్రారంభమవుతాయి.*


*మన సంబంధాలు ఒక అదృశ్య దారం ద్వారా ముడిపడి ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం,నమ్మకం ద్వారా అది సంరక్షించబడుతుంది.*


 *ఒక చిన్నపాటి ఒత్తిడి వల్ల లేదా అపార్ధం వల్ల సంబంధాలలో ఎవరి పక్షాన్ని వదలకండి,అపార్థం చేసుకోకండి ...*


*వ్యక్తులను మీ స్వంతం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది.చెడగొట్టుకోవడానికి ఎంతో సమయమక్కరలేదు.*🙏

〰️〰️〰️〰️〰️〰️〰️

దరాబాద్ లో గుడి

 🌹🌺🌹🌺✍️✍️✍️✍️✍️✍️హై దరాబాద్   లో  గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.

సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. 

అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు. ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి.

తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.

“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పాలి.

“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం! 

“అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం. 

‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.

“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.

“ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. 

“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.

“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.

“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే“  వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా. 

“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు) 

“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. 

ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ 

అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.

“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”

ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ.

ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి భక్తుడు అయిన నేను ఈ పోస్ట్ ను అందరికీ షేర్ చేస్తున్నాను

మీకు తెలిసిన అన్నీ వాట్సప్ నెంబర్లకు విధిగా దయచేసి షేర్ చేయండి

84,లక్షల జీవ రాసులలో హిందూవుగా పుట్టడం ఒక వరం. అందులో అఖిలాండ బ్రహ్మాండ నాయకుని గుణగణాల

విన దానికి చెవులు చేసు కొన్న పుణ్యం।        చెప్పనలవి కాదు

ఎన్నో జన్మల పుణ్యం చూసుకుంటే గాని స్వామి పాదాలను చేరుకోలేము ఓం నమో నమోనారాయణాయః

🙏సర్వే జన సుఖినో భవన్తు

🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺