25, జూన్ 2025, బుధవారం

అనురాగపు నిక్కమెరుగ

 *2160*

*కం*

అనురాగపు నిక్కమెరుగ

ధనములు విడి బతుకవలయు తప్పక ధరణిన్.

ధనహీనుడవౌ నిను కను

గొని నిడువారిదె నిజమగు కూరిమి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అనురాగం యొక్క నిజాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ భూలోకంలో ధనములు విడిచిపెట్టి బతకవలెను. ధనములు లేని నిన్ను గూర్చి తెలుసుకుని నీకు విలువ ఇచ్చే వారి దే నిజమైన అనురాగము.

*భావం*:-- మనదగ్గర డబ్బు లేదని తెలిసి కూడా మనకు విలువ ఇచ్చేవారే నిజమైన అభిమానులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సమస్యకు

 *మేలు సేయగ జూడ శిష్టులు మెచ్చరెవ్వరు ధాత్రిపై*

ఈ సమస్యకు నా పూరణ.


మేలుకొల్పగ జాతినేతలు మేదురంబుగ జెప్పిరే


తూలనాడుట కాదు కాదని తోడు రమ్మని పిల్చుచున్


మేలు సేయగ జూడ - శిష్టులు మెచ్చరెవ్వరు ధాత్రిపై


కాలికడ్డము వేయబూనుచు కట్టెనుంచుట ధూర్తమౌ.


అల్వాల లక్ష్మణ మూర్తి.

కేశవ నామాలు

 *కేశవ నామాలు-గణిత భూమిక.*


విష్ణుమూర్తికి24పేర్లున్నాయి.వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.


ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?


ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి*?

చూద్దాం.


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.


*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*


కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

*పద్మము, శంఖము*

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

*గద,చక్రం* 

ధరించి ఉంటాడు.


*2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*


ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

*గద,చక్రం* ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

*పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.


*3.మధుసూధన రూపంలో* 


కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 

మరియు ఎడమవైపు చేతులతో

*గద,పద్మము* ధరించి ఉంటాడు.


*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి) 


*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు(permutations)* 

అంటాం.

అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.


4! = 4×3×2×1=24


*శంఖాన్ని* 'శ' తోను,

*చక్రాన్ని* 'చ' తోను,

*గదను* 'గ' తోను,

*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,


*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.


*1) శచగప 2) శచపగ*

*3) శపచగ 4) శపగచ*

*5)శగచప 6)శగపచ*

*7)చపగశ 8)చపశగ*

*9)చగపశ 10)చగశప*

*11)చశగప 12)చశపగ*

*13)గపశచ 14)గపచశ*

*15)గచశప 16)గచపశ*

*17)గశపచ 18)గశచప*

*19)పచగశ 20)పతశగ*

*21)పశగచ 22)పశచగ*

*23)పగశచ 24)పగచశ.*


[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]


ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...


మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

      

*కేశవ,నారాయణ*

*మాధవ,గోవింద*

*విష్ణు,మధుసూధన*

*త్రివిక్రమ,వామన*

*శ్రీధర,హృషీకేశ*

*పద్మనాభ,దామోదర*

*సంకర్షణ,వాసుదేవ*

*అనిరుధ్ధ,ప్రద్యుమ్న,*

*పురుషోత్తమ,అధోక్షజ*

*నారసింహ,అచ్యుత*

*జనార్ధన,ఉపేంద్ర*

*హరి శ్రీకృష్ణ.*


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

*24 పక్షాలు* అంటే

*12 నెలలు*

అనగా *ఒక సంవత్సరం* పడుతుంది*

పాలగుమ్మి పద్మరాజుగారి జయంతి*

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

24.06.2025, మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి సా6.36 వరకు

వారం: భౌమవాసరే (మంగళవారం)

నక్షత్రం:రోహిణి మ12.49 వరకు

యోగం:శూలం ఉ9.53 వరకు

కరణం:భద్ర ఉ7.44 వరకు తదుపరి శకుని సా6.36 వరకు

వర్జ్యం:ఉ.శే.వ 6.49వరకు మరల సా6.07 - 7.37

దుర్ముహూర్తము:ఉ8.06 - 8.59

మరల రా10.56 - 11.40

అమృతకాలం:ఉ9.49 - 11.19

మరల తె3.11 - 4.41

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.34



*నేడు ప్రముఖ కథకుడు పాలగుమ్మి పద్మరాజుగారి జయంతి*


ప్రముఖ కథకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన పాలగుమ్మి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురంలో 1915 జూన్ 24న జన్మించారు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశారు.


పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ "సుబ్బి"ని రచించారు. ఈయన ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన కథ "గాలివాన" మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని "హెరాల్డ్ ట్రిబ్యూన్"వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండువ బహుమతిని గెలుచుకుంది.


ఒక అమాయకపు అనాధ ఆడపిల్లకి జరిగిన అన్యాయం పై సానుభూతి చూపి తల్లిలా ఆదరించిన యజమానురాలు, తీరా ఆమెకు జరిగిన అన్యాయం ఎవరివల్ల జరిగిందో తెలిసాక ఆమె ప్రవర్తనలో మార్పు గూర్చి సుబ్బి కథలో, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఉండే సందడీ ,కొన్ని సంఘటనలు వారి హృదయంపై ఎలాంటి ముద్ర వేస్తాయో తెలిపే బాల్యం గూర్చి, ప్రతి ఒక్కరు వారి వయస్సులో ఉన్నప్పుడు వారి మదిలో మెదిలే భావాల గూర్చి, సాధారణంగా తీర్థాలలో జరిగే సందడి గూర్చి, ఒక స్త్రీ తాను చెల్లిగా, భార్యగా, తల్లిగా ఉన్నప్పుడు ఆమె చూపే ఉద్వేగాల గూర్చి ,

తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు... ఇంకా లెక్కలేనన్ని నాటికలు మరియు నాటకాలను రచించారు. ఈయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాలకు చాలా వాటికి పాలగుమ్మి ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. 

తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన పాలగుమ్మి జాతీయ చలనచిత్ర అవార్డుల సంఘం జ్యూరీ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లి సుస్తీపడ్డారు.   ఆయనకు అప్పటికే  ఆస్తమా లక్షణాలు  ఉండడంతో విపరీతమైన చలి ప్రభావంతో  1983  ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మదరాసులోని మైలాపూర్ శ్మశానవాటికలో  జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆ  రాష్ట్ర ప్రభుత్వం భద్రత  ఏర్పాటు చేయడం అరుదైన సందర్బంగా చెప్పేవారు....

ఆత్మనివేదన

 🍁పండుగలప్పుడో, పర్వదినాల్లోనో, లేకపోతే తమకు ప్రత్యేకమైన పెళ్లి రోజో, పుట్టిన రోజో... గుడికి వెళ్తుంటారు చాలామంది. ముందుగా అనుకుని ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు వెళ్లడమూ చేస్తుంటారు. అలా వెళ్లొచ్చాక తమ సన్నిహితులతో అక్కడి విషయాలను పంచుకుంటూ ఫలానా సందర్భంలో మేం అక్కడికి వెళ్లాం, ఆ దేవుణ్ని దర్శించుకున్నాం, ఆయనకి కిరీటాన్ని సమర్పించాం, అమ్మవారికి బంగారు నగలు చేయించాం లేకపోతే అన్నదాన నివేదన చేశాం, మొక్కు చెల్లించాం... అంటూ చెబుతుంటారు. తమ స్వయంకృషితో సంపాదించిన సంపదనుంచి ఇవన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు భక్తులు. నిజానికి ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో తమకు కలిగిందనీ, ఆయన సృష్టించిన సంపదేననీ తెలుసుకోలేరు.


🍁అసలు నివేదన అంటే ఏంటి? దేనిని అంటారు? సాధారణంగా భక్తులు భగవంతుడికి సమర్పించే వాటిలో పాలు, పండ్లు, చక్కెర మొదలైన ద్రవ్యాలు ఉంటే దాన్ని సామాన్య నివేదన అంటారు. పంచ భక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మహానివేదన అంటారు. కానీ ఈ ద్రవ్యాలన్నీ ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిచ్చినవే, అవే తిరిగి మనం ఆయనకే సమర్పిస్తున్నాం. వాస్తవానికి నివేదన అంటే భక్తితో, ప్రీతితో భగవంతుడికి సమర్పించడం లేదా అర్పించడం. భగవంతుడికి ఏం సమర్పించాలి? ఏం అర్పించాలి? అని మళ్లీ ప్రశ్నించుకుంటే... నీ దగ్గర ఉన్నది, నీకు మాత్రమే చెందినది నివేదన చెయ్యాలి. మరి మన దగ్గర ఉన్నది అంతా ఆ పరమాత్ముడికి చెందిందే, ఆయన ఇచ్చిందే అయినప్పుడు ఇక నివేదన చెయ్యడానికి మన దగ్గర ఏం మిగిలింది... అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానమే ఆత్మనివేదన.


🍁నవవిధ భక్తి మార్గాల్లో తొమ్మిదోది, చివరిది, పవిత్రతను కలిగించేది... ఆత్మనివేదనా భక్తి. అంటే, భక్తుడు భగవంతుడి దారిలో నడవడం. తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం. మిగిలిన ప్రాణం లేని పదార్థాల మాదిరిగా మనిషి శరీరం ఒక జడపదార్థం కాదు కదా. పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం ఎలా సాధ్యం అంటే... 'నాదేమీ లేదు... అంతా నీదే, అన్నింటా నువ్వే, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ని.... నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు సూచించిన మార్గంలో నడుస్తూ నీ సేవ చేస్తాను...' అనుకోవాలి. శారీరక మానసిక వాంఛలను, ఆకాంక్షలను, బంధాలను తృణప్రాయంగా భావించాలి. ఎటువంటి కర్మఫలాపేక్ష లేకుండా త్రికరణశుద్ధిగా కర్మలను ఆచరించాలి. నిరంతరం పరమాత్ముణ్నే స్మరిస్తూ, సేవిస్తూ, తనని తాను తెలుసుకుంటూ తనలోని ఆత్మను తెలుసుకోవాలి. ఆ ఆత్మ ద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ, ఆయనకు దగ్గరవుతూ, సకల చరాచర సృష్టిలో దైవాన్ని దర్శిస్తూ అందరి హితాన్ని కోరుతూ జీవించడమే భక్తుడు భగవంతుడికి సమర్పించే ఆత్మనివేదన.

ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

 ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

సొరియసిస్సు గాని శోభి గాని

తామరైన నిజము తగ్గించు హోమియో

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చర్మవ్యాధులు కనిపించగానే అందరూ మేధావుల్లా డాక్టర్ల అవతారమెత్తేసి, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి సిట్రాజెన్, ఏంటీబయోటిక్ టాబ్లెట్లు, ఏంటీబయోటిక్ ఆయింట్మెంట్లూ కొని తెచ్చేసుకుని వాడేస్తూ, దానిని కట్టడిలో పెట్టేసిన వీరుల్లా ఫీలైపోతారు! ఆనక అది తొండ ముదిరి ఊసరవెల్లిగా మారి, చుక్కలు చూపించినప్పటికి తమ వల్ల కాదనుకుని ఇంగ్లీషు స్కిన్ స్పెషలిస్టులందరి తెలివితేటలను కూడా చర్మంపై ప్రయోగిస్తూ, జీవితకాలం పాటు దానితో రాజీపడి గోక్కుంటూ, మా బ్రతుకింతేనని సరిపెట్టుకుని, మచ్చలు, దురదలు, దద్దుర్లు, పొలుసులు, పగుళ్ళు, రక్తాలు, చీము కంపులతో గతిలేక గోక్కుంటూ బ్రతికేస్తారు! నిజానికి వీళ్ళంతా తెలుసుకోవలసిన నగ్న సత్యం ఒకటుంది! అదేమిటంటే "ఇంగ్లీషు వైద్యంలోని ఏ మందులూ, ఆయింట్మెంట్లూ, ఏ చర్మవ్యాధినీ నయం చేయకుండా, లోలోపల అణచిపెట్టి (సప్రెస్ చేసి), ముదరబెట్టి, మరింత మొండి వ్యాధిగా మార్చి, ఎప్పటికీ మీరు వాళ్ళ చుట్టూ తిరిగే కుక్కలుగా మార్చుకుంటారు! అదే ఆంగ్లేయుల శైలి, ఆంగ్ల వైద్య శైలీ! సమస్య లేనివాడు వాళ్ళను పట్టించుకోడు! కాబట్టి అర్జంటుగా రిలీఫ్ కనిపించాలి, ఆహా! భలే వైద్యమని అనిపించాలి, ఆ ఒక్క రోగానికి వేసుకునే మందులే వీళ్ళకు తెలియకుండా వంద రోగాలను పుట్టించి, వీడు అందరు స్పెషలిస్టులకూ ఆహారమవ్వాలి! ఇది కదా ఇంగ్లీషు స్ట్రేటజీ! ఇదే నచ్చుతుంది అందరికీ! ఎందుకంటే అందరూ దాని మాయలో ఏనాడో జాంబీలుగా మారిపోయారు కాబట్టి! నిజానికి ఎలర్జీలు గానీ, దురదలు, చర్మవ్యాధులు ఏమైనా కనిపించిన తొలి రోజుల్లో దానిపై కేవలం కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలే తప్ప, ఏ మాత్రలూ, ఆయింట్మెంట్లూ వాడకూడదు! దానిని ఏమీ గెలక్కుండా వదిలేస్తే, మన ఆటోఇమ్యూన్ వ్వవస్థే దానిని నయం చేసేస్తుంది! కానీ అర్జంటుగా రిలీఫ్ వచ్చెయ్యాలని రాసే ఆయింట్మెంట్లు దానిని చర్మం దగ్గర అడ్డుకుని, రివర్స్ లో రక్తంలోకి పోయేలా చేస్తాయి! అలా రక్తంలోకి పోయినది రక్తమంతా తిరుగుతూ, అన్ని చోట్లకూ విస్తరిస్తుంది! ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ బయటపడటానికి ప్రయత్నిస్తుంది, అక్కడ కూడా ఆయింట్మెంట్లు రాస్తే, ఇంకొక కొత్త ప్లేస్ చూసుకుంటూ, చర్మానికి, అంతర్గత అవయవాలకూ దాని ప్రభావాన్ని విస్తరిస్తూ, ఆస్తమా, కేన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ తలనొప్పులు, ఫిట్స్, బ్రెయిన్ ట్యూమర్లు, మానసిక జబ్బులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ళు, కిడ్నీ, లివర్ జబ్బులు, ఇలా ఎన్నో జబ్బుల సృష్టికి బీజాలు వేస్తుంది! పైకి రాసేది పసరైనా, ఆయింట్మెంట్ అయినా, వేసేది ఇంగ్లీషులో ఏ మందైనా, ఏ ఇంజక్షనైనా సప్రెషన్ క్రిందకే వస్తుంది! పిల్లి అయినా తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది, అణచివేతకు గురైన వాడు ఎవ్వడైనా ఎప్పుడో ఒకప్పుడు మన మీద పడి, మన పీక నొక్కి, ప్రాణం తీయక మానడు! అదే సృష్టి ధర్మం! మందులే వాడుదాం  అనుకుంటే హోమియో వాడండి, ఇది మాత్రమే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నివారణ చేస్తుంది! లేదంటే అసలు ఏ మందులూ వాడకుండా, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ప్రకృతి ఆహారంతో కొన్నాళ్లు గడపండి! సకల రోగాలూ సరైపోతాయి! ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఎలర్జీలు, శోభి, దురద, ఎగ్జిమా, తామర, సొరియాసిస్ ఇలా ప్రతీ చర్మ వ్యాధినీ హోమియోతో సమర్థవంతంగా నయం చేయవచ్చు! ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ పడుతుంది, కాబట్టి ఓర్పు, ఓపికతో నిలబడి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

మనమేమొనరించెదమో

 *2159*

*కం*

మనమేమొనరించెదమో

మనలకు నవియే లభించు మహిలో నెపుడున్.

మనమొకరికి మేలొనరగ

మనకును హితమొనరు నొకరు మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఎల్లప్పుడూ మనమేమి చేసెదమో మనకు కూడా ఈ భూలోకంలో అదే లభిస్తుంది. మనం ఒకరి కి మంచి చేస్తే మనకు కూడా మంచి చేసే వారు ఒకరు ఉంటారని మరువవద్దు.

*సందేశం*:-- మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనకు కూడా జరుగుతుంది. అందువలన తమమంచి కోరుకునే వారు అందరికీ మంచి నే చేయవలెను. 

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


        శ్లో𝕝𝕝 *గృహమేధి వ్రతాన్యత్ర*

                   *మహాన్తీహ ప్రచక్షతేl*

                   *నాత్మార్ధే పాచయేదన్నం* 

                   *నా వృధా ఘాతయేత్పశూన్ll*


               *మహాభారతమ్ - శాన్తి పర్వమ్*


తా𝕝𝕝 గృహస్థులకు ధర్మశాస్త్రం అనేక విహితమైన నియమాలను సూచించింది. *గృహస్థు తన కొరకు మాత్రమే వంట చేసుకోరాదు.*

*అనేక అనర్థాలకు కారణమైన పశుహింస చేయకూడదు.*

                   

 ✍️VKS ©️ MSV🙏

మనమేమొనరించెదమో

 *2159*

*కం*

మనమేమొనరించెదమో

మనలకు నవియే లభించు మహిలో నెపుడున్.

మనమొకరికి మేలొనరగ

మనకును హితమొనరు నొకరు మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఎల్లప్పుడూ మనమేమి చేసెదమో మనకు కూడా ఈ భూలోకంలో అదే లభిస్తుంది. మనం ఒకరి కి మంచి చేస్తే మనకు కూడా మంచి చేసే వారు ఒకరు ఉంటారని మరువవద్దు.

*సందేశం*:-- మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనకు కూడా జరుగుతుంది. అందువలన తమమంచి కోరుకునే వారు అందరికీ మంచి నే చేయవలెను. 

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*

 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*




*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*


మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి. కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.


ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.


ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.


ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.


అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన 

మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.


*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

ఆంగ్ల వైద్య మొకటె

 ఆంగ్ల వైద్య మొకటె నసలైన దనుచునూ

నరుల మనసు లోన నాట్కు బోయి

మిగులు వైద్య మెల్ల మిధ్యగా దలచేరు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చిన్నప్పటినుండీ ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకూ ఇంగ్లీష్ హాస్పిటల్స్ కి తిరిగీ తిరిగీ, ప్రతీ దానికీ టెస్టులూ, స్కేనులూ, ఇంజక్షన్లూ, ఆయింటుమెంట్లూ, ఆపరేషన్లూ, పెయిన్ కిల్లర్లూ, స్పెషలిస్ట్ లూ, సర్జన్లూ, ఐసీయూలో అడ్మిట్ లూ, ఆక్సిజన్లూ, గొట్టాలూ, సెలైన్లూ, మెడికల్ మాఫియా దందాల దోపిడీలూ చూసీ, చూసీ, ఇదే బుర్రకి పట్టేసి, వైద్యమంటే ఇదేనేమోననీ, ఇలా వైద్యం చేయడమే కరెక్టేమోననీ, ఈ పిచ్చి మెదళ్ళకు పచ్చిగా పట్టేసింది! ఈ జబ్బుల నివారణకు ఇంత హంగామా చెయ్యనక్కర లేదని ఏ హోమియో, ఆయుర్వేద వైద్యులో, యోగా మాస్టర్లో చెప్పి, దానిని నయం చేసి చూపించినా కూడా, ఈ ఇంగ్లీష్ మత్తులో మునిగిన పిచ్చి బుర్రలు ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు! వీళ్ళ దృష్టికి ఇంగ్లీష్ తప్ప మిగినవన్నీ "ఉత్త వేస్ట్"! "ఇంగ్లీష్ ఒక్కటే కరెక్ట్, ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే సైంటిస్టులు, మిగిలిన వాళ్ళంతా సన్నాసులు"! 

ఎప్పుడు ఈ జనాలు ఈ పిచ్చి నుంచి బయటపడి, సాంప్రదాయ వైద్యాల బాటపడతారో, అప్పుడే వీళ్ళ జీవితాలకి సుఖం, శాంతీ దొరుకుతాయి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో𝕝𝕝 *యే అర్థా ధర్మేణ తే సత్యాః*

              *యేఽధర్మేణధిగస్తు తాన్l*

              *ధర్మం వై శాశ్వతం లోకే*

              *న జహ్యాద్ధనకాంక్షయాll*


         *మహాభారతమ్ - శాన్తి పర్వమ్*

  

తా𝕝𝕝 *స్వధర్మాన్ని సక్రమంగా అనుష్ఠిస్తూ నిజాయితీగా సంపాదించే ధనమే అసలైన ధనం*... అధర్మంతో సంపాదించేది నింద్యమైన ఆర్జన. కేవలం *ధనకాంక్షతో శాశ్వతమైన ధర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదు....*

                   

 ✍️VKS ©️ MSV🙏

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_

కిం తు కాలపరీణామో 

ద్రష్టవ్యస్సాధు పశ్యతా

ధర్మశ్చార్థశ్చ కామశ్చ 

కాలక్రమసమాహితాః

(వా. రా.4.25.8)


*అర్థం:*

అయితే, ఒక జ్ఞాని కాలగమనంలో జరిగే సంఘటనల మలుపును సరైన దృష్టితో ఊహించుకోవాలి. ధర్మం, అర్థ మరియు కామాలు కాలం నిర్దేశించిన ఆదేశం ద్వారా నియంత్రించబడతాయి.


*శ్రీ  ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా* తో  శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

సతి సుగుణంబులు కలిగియు

 *2158*

*కం*

సతి సుగుణంబులు కలిగియు

పతిధార్మిక సేవల విడు పలు సుకృతంబుల్

అతి సంతోషములిడినను

పతిసౌభాగ్యములు క్రుంచు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భార్య ఎంతటి సుగుణవతి యైన నూ భర్త కు చేసే ధార్మిక సేవలు విడిచిపెట్టి నిర్వహించే పుణ్య కర్మలు ఎంత సుఖములనిచ్చిననూ భర్త సౌభాగ్యములు(భర్త తో సౌభాగ్యము) నాశనం చేయును.

*సందేశం*:-- చాలా మంది స్త్రీలు భర్త ని విడిచిపెట్టి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ భర్త కు ధార్మిక ముగా చేసే సేవల కంటే అవేమీ నిత్య సౌభాగ్యము నీయవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నెగ్గెడి యోచనలుండగ

 *2157*

*కం*

నెగ్గెడి యోచనలుండగ

తగ్గుట నేర్వంగవలయు తప్పక నెపుడున్.

నిగ్గడిగల పనికైనను

తగ్గెడి తరుణంబులుండు తప్పక సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నెగ్గే ఆలోచన లుంటే తగ్గడం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. కఠినమైన (నిగ్గడి) పనికైననూ తగ్గవలసిన సమయాలు తప్పకుండా ఉంటాయి.

*సందేశం*:-- గెలిచేక్రమంలో ఒకొక్క సారి తగ్గవలసివస్తుంది. ఆయా సందర్భాల్లో తగ్గగలిగినప్పుడే విజయం పొందగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పంచాంగం 25.06.2025

 ఈ రోజు పంచాంగం 25.06.2025

Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి సౌమ్య వాసర మృగశిర నక్షత్రం వృద్ధి యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 





నమస్కారః , శుభోదయం