25, జూన్ 2025, బుధవారం

అనురాగపు నిక్కమెరుగ

 *2160*

*కం*

అనురాగపు నిక్కమెరుగ

ధనములు విడి బతుకవలయు తప్పక ధరణిన్.

ధనహీనుడవౌ నిను కను

గొని నిడువారిదె నిజమగు కూరిమి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అనురాగం యొక్క నిజాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ భూలోకంలో ధనములు విడిచిపెట్టి బతకవలెను. ధనములు లేని నిన్ను గూర్చి తెలుసుకుని నీకు విలువ ఇచ్చే వారి దే నిజమైన అనురాగము.

*భావం*:-- మనదగ్గర డబ్బు లేదని తెలిసి కూడా మనకు విలువ ఇచ్చేవారే నిజమైన అభిమానులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: