25, జూన్ 2025, బుధవారం

సతి సుగుణంబులు కలిగియు

 *2158*

*కం*

సతి సుగుణంబులు కలిగియు

పతిధార్మిక సేవల విడు పలు సుకృతంబుల్

అతి సంతోషములిడినను

పతిసౌభాగ్యములు క్రుంచు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భార్య ఎంతటి సుగుణవతి యైన నూ భర్త కు చేసే ధార్మిక సేవలు విడిచిపెట్టి నిర్వహించే పుణ్య కర్మలు ఎంత సుఖములనిచ్చిననూ భర్త సౌభాగ్యములు(భర్త తో సౌభాగ్యము) నాశనం చేయును.

*సందేశం*:-- చాలా మంది స్త్రీలు భర్త ని విడిచిపెట్టి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ భర్త కు ధార్మిక ముగా చేసే సేవల కంటే అవేమీ నిత్య సౌభాగ్యము నీయవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: