25, జూన్ 2025, బుధవారం

పాలగుమ్మి పద్మరాజుగారి జయంతి*

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

24.06.2025, మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి సా6.36 వరకు

వారం: భౌమవాసరే (మంగళవారం)

నక్షత్రం:రోహిణి మ12.49 వరకు

యోగం:శూలం ఉ9.53 వరకు

కరణం:భద్ర ఉ7.44 వరకు తదుపరి శకుని సా6.36 వరకు

వర్జ్యం:ఉ.శే.వ 6.49వరకు మరల సా6.07 - 7.37

దుర్ముహూర్తము:ఉ8.06 - 8.59

మరల రా10.56 - 11.40

అమృతకాలం:ఉ9.49 - 11.19

మరల తె3.11 - 4.41

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.34



*నేడు ప్రముఖ కథకుడు పాలగుమ్మి పద్మరాజుగారి జయంతి*


ప్రముఖ కథకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన పాలగుమ్మి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురంలో 1915 జూన్ 24న జన్మించారు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశారు.


పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ "సుబ్బి"ని రచించారు. ఈయన ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన కథ "గాలివాన" మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని "హెరాల్డ్ ట్రిబ్యూన్"వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండువ బహుమతిని గెలుచుకుంది.


ఒక అమాయకపు అనాధ ఆడపిల్లకి జరిగిన అన్యాయం పై సానుభూతి చూపి తల్లిలా ఆదరించిన యజమానురాలు, తీరా ఆమెకు జరిగిన అన్యాయం ఎవరివల్ల జరిగిందో తెలిసాక ఆమె ప్రవర్తనలో మార్పు గూర్చి సుబ్బి కథలో, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఉండే సందడీ ,కొన్ని సంఘటనలు వారి హృదయంపై ఎలాంటి ముద్ర వేస్తాయో తెలిపే బాల్యం గూర్చి, ప్రతి ఒక్కరు వారి వయస్సులో ఉన్నప్పుడు వారి మదిలో మెదిలే భావాల గూర్చి, సాధారణంగా తీర్థాలలో జరిగే సందడి గూర్చి, ఒక స్త్రీ తాను చెల్లిగా, భార్యగా, తల్లిగా ఉన్నప్పుడు ఆమె చూపే ఉద్వేగాల గూర్చి ,

తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు... ఇంకా లెక్కలేనన్ని నాటికలు మరియు నాటకాలను రచించారు. ఈయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాలకు చాలా వాటికి పాలగుమ్మి ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. 

తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన పాలగుమ్మి జాతీయ చలనచిత్ర అవార్డుల సంఘం జ్యూరీ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లి సుస్తీపడ్డారు.   ఆయనకు అప్పటికే  ఆస్తమా లక్షణాలు  ఉండడంతో విపరీతమైన చలి ప్రభావంతో  1983  ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మదరాసులోని మైలాపూర్ శ్మశానవాటికలో  జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆ  రాష్ట్ర ప్రభుత్వం భద్రత  ఏర్పాటు చేయడం అరుదైన సందర్బంగా చెప్పేవారు....

కామెంట్‌లు లేవు: