*2157*
*కం*
నెగ్గెడి యోచనలుండగ
తగ్గుట నేర్వంగవలయు తప్పక నెపుడున్.
నిగ్గడిగల పనికైనను
తగ్గెడి తరుణంబులుండు తప్పక సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నెగ్గే ఆలోచన లుంటే తగ్గడం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. కఠినమైన (నిగ్గడి) పనికైననూ తగ్గవలసిన సమయాలు తప్పకుండా ఉంటాయి.
*సందేశం*:-- గెలిచేక్రమంలో ఒకొక్క సారి తగ్గవలసివస్తుంది. ఆయా సందర్భాల్లో తగ్గగలిగినప్పుడే విజయం పొందగలరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి