7, జులై 2025, సోమవారం

సంఘజీవిగా బ్రతుకుదాము*

 *ఒంటరిగా కాదు సంఘజీవిగా బ్రతుకుదాము*


సభ్యులకు నమస్కారములు .


ఒకటిగా, ఒంటరిగా ఉన్న అక్షరాలకు ఏ అర్థము కానరాదు. అవుతే, 

*న మంత్రం అక్షరం నాస్తి* అని చదువుకున్నాము. ఇక్కడ కూడా అక్షరం *ఓం* కార సహితంగా ఉండాల్సిందే. ఒంటరి అక్షరాలకు జతగా మరిన్ని అక్షరాలు ఉంటేనే అవి అర్థవంతమైన వాక్యాలుగా, వ్యాఖ్యానాలుగా మారుతాయి. 


*మరియొక మాట.......*

*అక్షరాణాం అకారోస్మి*.. భగవాన్ ఉవాచ. అనగా నేనే అక్షరాన్ని అనే భగవంతుడే చెప్పినట్లుగా శాస్త్రాలు ఉటంకిస్తున్నాయి. ఇంతేకాకుండా *ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ నమః* మరియు *ఇతి ద్వే అక్షరే నారాయణాయ* ఇతి పంచాక్షరాని అని కూడా ఉపనిషత్ గీతా వచనం. అవుతే, సృష్టిలో దేవుడు కూడా ఒంటరిగా లేడు. దేవుడు సరసన దేవీ ఉంటుంది. వారి ప్రపన్నులైన భక్త బృందం ఉంటుంది.


 *ఒంటరి జీవితం కంటే సంఘజీవనం ఫలదాయకంగా ఉంటుంది*. మంచి వారితో స్నేహం, మంచి సంస్థలతో అనుబంధం వలన మానవ జీవితం అర్థవంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. జీవితం సార్ధకం అవుతుంది.


పుట్టేటప్పుడు ఏదో సాధిస్తానని పిడికిలి బిగించి ప్రాణం పోసుకుంటాడు మనిషి. కాని, పోయేటప్పుడు సాధించినదేది తీసుకపోలేము ..అని గుర్తుగా శూన్యమైన అరచేతులతో ప్రాణాలు వదిలేస్తాడు. సంపద, ఐశ్వర్యం, బంధాలు, అనుబంధాలు, సతీ, సుతులు, సంతానం చివరికి శరీరం కూడా వెంటరాదు. *చివరికి తనకు మిగిలేది, దక్కేది సేవల వలన వచ్చిన కీర్తి మాత్రమే*. అదే .. *శేషత్వ కీర్తి.*



జీవితంలో ఎంత సంపాదించాను, ఎంత ఎత్తుకు ఎదిగాను, అని *మాత్రమే గాకుండా ఎదుటి వారి మనసులో ఎంత స్థానం సంపాదించాను* అని పరిశీలించుకోవాలి. 


ఇంటికి పిల్చి ఇచ్చేది *విందు*. అడిగిన తదుపరి ఇచ్చేది *అప్పు మరియు భిక్ష*. ఎవరికి తెలియకుండా ఇచ్చేది *దానము* *ఆర్తి* గలవారిని వెతుక్కుంటూ వెళ్ళి చేసేది *ధర్మము.*


చివరిగా...

*సమాజంతో కల్సి ఉందాము, సంస్థలలో చేరుదాము, సేవలు చేద్దాము. మానవ జీవితానికి సార్థకత చేకూరుద్దాము*.


ధన్యవాదములు.

హిందూ వివాహప్రక్రియలో

 🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏

                  మూడవ భాగం 

సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాంతే మా యోషం. సఖ్యాన్మే మా యోష్టాః సమయావ. సంకల్పావహై. సంప్రియౌ రోచిష్నూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్.

భావం:- నాతో ఏడడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎన్నటికి వియోగం పొందను. నా స్నేహంనుంచి నీవెన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోను కలిసి ఉంటూ నడుచుకుందాం.

అరుంధతీ నక్షత్రం:- వివాహం జరిగిన తర్వాత వధూవరులకు ధ్రువనక్షత్రమును, తర్వాత అరుంధతీ నక్షత్రమును పురోహితుడు చూపించి నమస్కారం చేయమని చెప్తాడు. ఎందుకంటే వారు ధ్రువనక్షత్రంలాగా నిశ్చలమైన మనస్థత్వాలతో స్థిరంగా వుండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఉద్దేశ్యం ఇందులో వుంది.

వధూవరులబాసలు:- మొత్తం వివాహ ఘట్టంలో వధూవరులమద్య హైందవ జీవనానికి ప్రయోజనం కలిగించే బాసలు ఎన్నో వుంటాయి. అందులో కొన్ని..

వరుడు ఇలా కోరుకుంటాడు - 

లోకోపకార స్వభావంగల అగ్నిదేవుడు ఈ వధువుకు వివాహం అయిన తర్వాత పుట్టింట మీద మమకారం తగ్గించి అత్తింటి మీద అభిమానం కలదానిగా చేయాలి. బ్రహ్మదేవుడు మా ఇద్దరికీ సకలసంపదలను ఇచ్చి దీర్ఘాయుష్యాన్ని అనుగ్రహించాలి. సుమంగళిగా, సౌభాగ్యవతిగా, దీర్ఘాయుష్యంతో ఉండే ఈ వధువును ఇంకా ఇంకా సుమంగళి, సౌభాగ్యవతి, దీర్ఘాష్మంతురాలు కావాలని పెద్దలైన మీరందరూ ఆశ్వీరదించి మీ మీ ఇండ్లకు వెళ్ళండి అని కోరుతాడు.

వధువు ఇలా కోరుకుంటుంది - 

నిన్ను నా అభిప్రాయంలను ఎరిగినవాణ్నిగాను, మంచి సంస్కారంతో పుట్టినవాడిగాను, మంచినియమాలతో నిజాయితితో పెంచుకున్న తేజస్సుగలవానిగా నేను గ్రహించాను. సంతానాభిలాషగల నీవు నాతో సంతానాన్ని కని, ధర్మంగా సిరిసంపదలను సంపాదించి సుఖంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుంది.

అటుపై వధూవరులిద్దరు ఇలా కోరుకుంటారు - 

సమంజంతు విశ్వే దేవా స్సమాపో హృదయాని నౌ / సం మాతరిశ్వా సం ధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ //

భావం:- విశ్వదేవులు, పవిత్రజలాలు, వాయువు, బ్రహ్మ మన మనస్సులను ఎన్నటికీ స్నేహంతో కలిసిపోయేటట్లు చేయాలి. వాగాధిదేవత సరస్వతి మనమెప్పుడు ప్రేమతో అభిమానంతో అనుకూలంగా మాట్లాడుకొనేటట్లు అనుగ్రహించాలి అని కోరుకోగా ...

పెద్దలు ఇలా ఆశ్వీరదిస్తారు -

అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతామ్ / రయ్యా సహస్రపోషసే మౌస్తా మనపేక్షితౌ //

భావం:- ఈ వధువు పాడిపంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదతోనూ, సకలసౌఖ్యలతో తులతూగుతూ మాకందరికీ అభివృద్ధిని కలిగించాలి. ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధి లతో దేనికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి.

పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్ / ఉభా హిరణ్యపేశసా వీతిహోత్రా కృతద్వసూ //

భావం:- పదహారువన్నెల బంగారంలాగా పచ్చగా ప్రకాశిస్తున్న ఈ కొత్తదంపతులు కొడుకులు, కూతుళ్ళతో ఈ సమాజంలో మంచిపనులు చేస్తూ, సిరిసంపదలనుభవిస్తూ దీర్ఘాయుష్యాన్ని పొందాలి.

వధూవరులకు కొన్ని సూచనలు -

పెళ్లన్నది నూరేళ్ళ పంట అని, ఏడేడు జన్మలబందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరిగా ఉండాలి. 

అనుకోనిసందర్భాలయందు ఏ పరిస్థితులకారణంగానైనా ఇద్దరిమద్య కోపతాపాలు, పట్టింపులు చోటుచేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి.

జీవితరధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.

భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమని ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి.

భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబగౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబంను భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి. అత్తవారింట్లో అత్తమామయ్యలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి.

కుటుంబఅభివృద్ధిని, అందరిహితంను కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే. 

                        స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

దిక్కులు

 ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని   తయారు  చేయడానికి  ఒక  రోజు  పట్టింది 

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం


మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


 వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


  పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


 పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


  

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


 పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


 పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : (1) గంగ, 

(2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

            

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(8) ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు : (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(8) పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(8) అద్భుత, (9) వీర


నవదుర్గలు : (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .


కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .


మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)


గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)


మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)


ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 


తమిళనాడు ~ రామలింగేశ్వరం

 

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు : (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107


(2) విభవ :- 

1928, 1988, 2048, 2108


(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109


( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110


( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111


( 6 ) అంగీరస :- 

1932, 1992, 2052, 2112


( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113


( 8 )భావ. - 

1934, 1994, 2054, 2114


9యువ.  - 

1935, 1995, 2055, 2115


10.ధాత.  - 

1936, 1996, 2056, 2116


11.ఈశ్వర. - 

1937, 1997, 2057, 2117


12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118


13.ప్రమాది. - 

1939, 1999, 2059, 2119


14.విక్రమ. - 

1940, 2000, 2060, 2120


15.వృష.-

1941, 2001, 2061, 2121


16.చిత్రభాను. - 

1942, 2002, 2062, 2122


17.స్వభాను. - 

1943, 2003, 2063, 2123


18.తారణ. - 

1944, 2004, 2064, 2124


19.పార్థివ. - 

1945, 2005, 2065, 2125


20.వ్యయ.-

1946, 2006, 2066, 2126


21.సర్వజిత్తు. - 

1947, 2007, 2067, 2127


22.సర్వదారి. - 

1948, 2008, 2068, 2128


23.విరోధి. - 

1949, 2009, 2069, 2129


24.వికృతి. - 

1950, 2010, 2070, 2130


25.ఖర. 

1951, 2011, 2071, 2131


26.నందన.

1952, 2012, 2072, 2132


27 విజయ.

1953, 2013, 2073, 2133,


28.జయ. 

1954, 2014, 2074, 2134


29.మన్మద.

1955, 2015, 2075 , 2135


30.దుర్మిఖి. 

1956, 2016, 2076, 2136


31.హేవళంబి. 

1957, 2017, 2077, 2137


32.విళంబి. 

1958, 2018, 2078, 2138


33.వికారి.

1959, 2019, 2079, 2139


34.శార్వారి. 

1960, 2020, 2080, 2140


35.ప్లవ

1961, 2021, 2081, 2141


36.శుభకృత్. 

1962, 2022, 2082, 2142


37.శోభకృత్. 

1963, 2023, 2083, 2143


38. క్రోది.

1964, 2024, 2084, 2144, 


39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145


40.పరాభవ.

1966, 2026, 2086, 2146


41.ప్లవంగ. 

1967, 2027, 2087, 2147


42.కీలక. 

1968, 2028, 2088, 2148


43.సౌమ్య. 

1969, 2029, 2089, 2149


44.సాధారణ . 

1970, 2030, 2090, 2150


45.విరోధికృత్. 

1971, 2031, 2091, 2151


46.పరీదావి. 

1972, 2032, 2092, 2152


47.ప్రమాది. 

1973, 2033, 2093, 2153


48.ఆనంద. 

1974, 2034, 2094, 2154


49.రాక్షస. 

1975, 2035, 2095, 2155


50.నల :-

1976, 2036, 2096, 2156, 


51.పింగళ                 

1977, 2037, 2097, 2157


52.కాళయుక్తి         

1978, 2038, 2098, 2158


53.సిద్ధార్ధి              

1979, 2039, 2099, 2159


54.రౌద్రి                 

1980, 2040, 2100, 2160


55.దుర్మతి              

1981, 2041, 2101, 2161


56.దుందుభి             

1982, 2042, 2102, 2162


57.రుదిరోద్గారి         

1983, 2043, 2103, 2163


58.రక్తాక్షి                 

1984, 2044, 2104, 2164


59.క్రోదన                  

1985, 2045, 2105, 216


60.అక్షయ              

1986, 2046, 2106, 2166.


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.... 

నమస్కారం

కథ

 *_‘‘ఓ పనిచేయండి, మీ పాత బడికి వెళ్లి మీ టెన్త్ క్లాస్ రిజిష్టర్ అడిగి తీసుకొండి...’’_*




కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది… ఓసారి చదవండి… ఇది కదా పది మందికీ షేర్ చేయాల్సింది… 


🔹ఆయన వయస్సు 50 ఏళ్లు… నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి…


తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్లిపోవాలి… ఆఫ్టరాల్ ఆస్తులు, పోస్టులు, డబ్బు వస్తయ్, పోతయ్,… మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటయ్… 


ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుంది… ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు… ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు… నువ్వు బయటికి వెళ్లి కూర్చోమ్మా అని ఆమెను బయటికి పంపించేశాడు… 


‘‘ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏమిటి..? ఎందుకు ఈ దిగాలు, డిప్రెషన్… ఏమైంది మీకు, శారీరకంగా కూడా ఏ వ్యాధులూ లేవు… మరిక ఏం బాధ..?’’


🔹‘‘నిజం డాక్టర్, చాలా ఆందోళనగా ఉంటోంది… చాలా చిక్కులు… ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది, పిల్లల చదువులు ఓ కొలిక్కి రావాలి, వాళ్లు స్థిరపడాలి, పెళ్లిళ్లు కావాలి, ఇంటి లోన్ తీర్చాలి, కార్ లోన్ అలాగే ఉండిపోయింది… అన్నీ ప్రెజర్ పెంచుతున్నయ్…’’


ఆయన ఓ డిఫరెంట్ సైకాలజిస్టు… పదే పదే కౌన్సిలింగు సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు… 


‘‘నువ్వు పదో తరగతి ఏ స్కూల్‌లో చదివావ్..?’’


ఆయన ఏదో చెప్పాడు… తరువాత డాక్టర్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడు, తరువాత తన దగ్గరికి రమ్మన్నాడు… మందులు కాదు, యోగ కాదు, మెడిటేషన్ కాదు, ఎక్కడికైనా గాలిమార్పిడి, స్థలమార్పిడికి వెళ్లమనే సూచన కూడా కాదు… నిజానికి అది విని ఆశ్చర్యపోవడం రోగి వంతైంది…


‘‘మీరు మీ బడికి వెళ్లండి, మీరు టెన్త్ క్లాసులో ఉన్నప్పటి రిజిష్టర్ అడిగి తీసుకొండి, మీ క్లాస్‌మేట్ల పేర్లన్నీ రాసుకొండి, అడ్రెస్సులు సేకరించండి, వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి… మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు, మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తుంది… బహుశా మీరు మళ్లీ నా దగ్గరకు రాకపోవచ్చు…’’


🔹ఆ పెద్దమనిషి డాక్టర్ చెప్పినట్టుగానే బడికి వెళ్లాడు… ఎక్కడో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిష్టర్ తీసుకుని, దుమ్మదులిపాడు… ‘‘ఏం సార్, స్టడీ సర్టిఫికెట్ కావాలంటే నేనిస్తాను కదా, మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు..?’’ అన్నాడు ఓ క్లర్కు నవ్వుతూ…


‘‘కాదు సార్, అల్యూమినీ (పూర్వ విద్యార్థుల) భేటీ ప్లాన్ చేస్తున్నాను’’ అన్నాడు… ఈమధ్య ఆ ట్రెండ్ కనిపిస్తోంది కదా, క్లర్క్ అభినందనగా చూసి తలపంకించాడు…


మొత్తం 120 పేర్లున్నయ్, తన సెక్షన్, మరో సెక్షన్ కలిపి… ఇక ఇంటికెళ్లి, ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు… రేయింబవళ్లూ ఫోన్లు, వివరాల సేకరణ… అంతా రాసిపెడుతున్నాడు… కేవలం 80 మంది వివరాలు మాత్రమే దొరికాయి… 


    🔹ఆశ్చర్యం… వారిలో 20 మంది ఆల్‌రెడీ చనిపోయారు… ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు… 13 మంది విడాకులు తీసుకున్నారు… 10 మంది వ్యసనాలకు బానిసలయ్యారు… ఎలా బతుకుతున్నారనేది విలువ లేని విషయం…


    అయిదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు… ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు… ఇద్దరికి పక్షవాతం, సగం మందికి సుగర్ లేదా ఆస్తమా ఉంది… ఇద్దరు కేన్సర్ రోగులు… ఒక జంట ప్రమాదంలో గాయపడి, వెన్నెముక దెబ్బతిని మంచం మీదే బతుకుతోంది…


    🔹ఒకడు జైలులో ఉన్నాడు… మరొకాయన రెండు విడాకుల అనుభవాల తరువాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు… ఇద్దరి పిల్లలు మానసిక వికలాంగులు, ముగ్గురో నలుగురి పిల్లలో బేవార్స్‌గా తిరుగుతూ అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌గా మారిపోయారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక ఓ విషాదపర్వం… దాదాపుగా… 


తాను రాసుకున్న సమాచారాన్ని ఓ క్రమపద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు, ఆ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు, వినిపించాడు… ఇప్పుడు చెప్పు నీకు ఏమనిపిస్తోంది అనడిగాడు డాక్టర్ చిరునవ్వుతో… 


*‘‘నీకు రోగాల్లేవు, ఆకలి బాధల్లేవు, కోర్టు కేసుల్లేవు, నీ కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, తెలివైనవాళ్లు…* పైగా జరగబోయేది ఏదైనా సరే, నువ్వు ఆపలేవు, ఆహ్వానించాల్సిందే…


ఏం జరుగుతుందో కూడా ఎవడూ చెప్పలేడు… మరి *రేపటి మీద చింతతో ఈరోజును ఎందుకు నాశనం చేసుకోవడం..?* మీరిక వెళ్లిరండి’’ అన్నాడాయన… తను డోర్ తీస్తుండగా మళ్లీ తనే ఓ మాటన్నాడు… 


*‘‘ఇతరుల పళ్లేలలో ఏముందో చూడటం మానేయండి, మీ పళ్లెంతో ఆహారాన్ని ఆస్వాదించండి…*


 ఇతరులతో పోలిక వద్దు, ఎవరి జీవితం వాళ్లదే…’’ 



ఏమిటి… మీకు కూడా బడికి వెళ్లి, పదో తరగతి రిజిష్టర్ తిరగేయాలని అనిపిస్తోందా… శుభం…

అదృష్టవంతులు

 *55 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 55 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.*


*డాక్టర్ వాడా 55 ఏళ్ల వారికి సలహా ఇచ్చారు...*

*"అదృష్టవంతుడు" అవ్వడం యొక్క రహస్యం"34 వాక్యాలలో" ఇలా వివరించబడింది:*


*1. కదులుతూ ఉండండి.*

*2. మీరు చిరాకుగా అనిపించినప్పుడు, లోతైన శ్వాస తీసుకోండి.*

*3. వ్యాయామం చేయండి, తద్వారా శరీరం దృఢంగా అనిపించదు.*

*4. వేసవిలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు త్రాగాలి.*

*5. మీరు నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి.*

*6. జ్ఞాపకశక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు, ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల.*

*7. ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.*

*8. ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.* 

*9. మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.*

*10. ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి.*

*11. మీకు కావలసినది తినండి, కానీ నియంత్రణలో ఉంచండి.*

*12. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.*

*13. మీకు నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు.* 

*14. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.* 

*15. వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది.*

*16. కష్ట సమయాల్లో, ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది.*

*17. ప్రతిసారీ, ఆహారం తిన్న తర్వాత, తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు త్రాగాలి.*

*18. మీరు నిద్రపోలేనప్పుడు, మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.*

*19. సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య.* 

*20. మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి.*

*21. మీకు సమీపంలో ఉన్న "ఫ్యామిలీ డాక్టర్"ని త్వరగా కనుగొనండి.*

*22. ఓపికగా ఉండండి, కానీ అతిగా ఉండకండి, లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి.*

*23. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అంటారు.*

*24. అత్యాశతో ఉండకు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది.* 

*25. మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు, వెంటనే లేచి నిలబడకండి, 2-3 నిమిషాలు వేచి ఉండండి.*

*26. మరింత సమస్యాత్మకమైన విషయాలు, మరింత ఆసక్తికరంగా ఉంటాయి.* 

*27. స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి.*

*28. మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి.*

*29. ఈరోజు ప్రశాంతంగా జీవించండి.*

*30. కోరికలే దీర్ఘాయువుకు మూలం!*

*31. ఆశావాదిగా జీవించండి.*

*32. సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు.*

*33. జీవితం మరియు జీవిత నియమాలు మీ స్వంత చేతుల్లో ఉన్నాయి.*

*34. ఈ వయస్సులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి!*


*55 ఏళ్లు దాటిన మిత్రులందరికీ అంకితం...*



*_💐 నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి 🙂🙏_*

రామాయణం


*🍁శనివారం 5 జూలై 2025🍁*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *89వ భాగం*

```

సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశాయి. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. 


ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతోంది. 


ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.

అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.


అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.


ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.


ఆ ఇంద్రజిత్ మళ్ళీ అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.


అప్పుడు లక్ష్మణుడు రాముడితో…  

“అన్నయ్యా! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నాడు.


రాముడన్నాడు…  

“పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ" అన్నాడు.


రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు.. 'ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి' అనుకుని ఆలోచించాడు. 


అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలో కూర్చోపెట్టాడు.


ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ… 'హా రామా, హా రామా' అని ఏడుస్తోంది. 


అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ…  

“దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావా, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.


అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు… “ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను" అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.


ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ… “ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను" అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి… 

“రామా! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు" అని చెప్పాడు.


ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.


అప్పుడు లక్ష్మణుడు అన్నాడు… 

“అన్నయ్యా! నువ్వు ‘ధర్మము ధర్మము ధర్మము’ అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము” అన్నాడు. 


వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి… “ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామా! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.


విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.


అప్పుడు విభీషణుడు… “లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి” అన్నాడు.


వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. 


ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి 'ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను' అని అనుకొని రథం ఎక్కాడు. 


అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. 


ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.


అప్పుడు లక్ష్మణుడు.. “దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ …

“ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.


లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు… “నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే, నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు” అన్నాడు. 


విభీషణుడు అన్నాడు… “నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు. ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.


లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు… “ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు” అన్నాడు.

```

*ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది*

*పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్*

```

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి “మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక” అని బాణ ప్రయోగం చేశాడు. 


ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.```


       *రేపు…90వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

*🌞ఆదివారం 6 జూలై 2025🌞*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                    

            *90వ భాగం*

```

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. 


తరువాత ఆయన అన్నాడు… 

“నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. 


ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. 


రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు… “ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం” అన్నాడు.


అప్పుడు రావణుడు… “రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను” అని అంతఃపురానికి వచ్చేశాడు.


మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. 

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.


అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతోంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. 


ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.


'తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు' అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. 


ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడి పోయాడు. 


అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు.


అప్పుడు రాముడన్నాడు…

“నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు” అని బాధపడ్డాడు.


అప్పుడు హనుమంతుడు… “రామా! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. 


అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.


“ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో” అని రాముడు ముందుకి బయలుదేరాడు. 


ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు 'దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు' అని అనుకున్నారు. 


అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.


అప్పుడా మాతలి రాముడితో అన్నాడు… “రామా! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి” అన్నాడు.


రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జరిగింది. 


రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు “ఇంక మీరెవ్వరూ యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి!” అన్నాడు.


అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు… 'ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-శస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది' అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. 


అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు ఆ సారధితో… “ఛీ నీచుడా! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు?” అన్నాడు.


అప్పుడా సారధి… “మీ దగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టుబడిన సారధిని నేను” అన్నాడు.


అప్పుడు రావణుడు… “నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధీ. నువ్వు ఉత్తమ సేవకుడివి” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.


ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు… “ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది? రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.


పోనీ అప్పటికీ రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.


పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు 

'అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే? ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి 'అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేక పోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి' అని అడిగారు. 


అప్పుడు బ్రహ్మగారు 'నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది' అని అన్నారు. 


దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి 'ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. 


అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. 


ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ‘ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం?' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి “రామా! రామా! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావా, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమ మంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

```

*“తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*

*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*

*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*

*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*```


అగస్త్య ఉవాచ:```

*రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*

*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*

*ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*

*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*

*సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*

*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*

*రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*

*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*

*సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*

*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*

*ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*

*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*

*పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*

*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*

*ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*

*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*

*హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*

*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్*

*హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః*

*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్*

*వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః*

*ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*

*ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*

*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*

*నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*

*తెజసామపి తేజస్వీ* *ద్వాదశాత్మన్నమోస్తుతే*

*నమః పూర్వాయ గిరయే* *పశ్చిమాయాద్రయె నమః*

*జ్యోతిర్గణాణాం పతయే* *దినధిపతయే నమః*

*జయాయ జయభద్రాయ* *హర్యశ్వాయ నమో నమః*

*నమో నమస్సహస్రాంశో* *ఆదిత్యాయ నమో నమః*

*నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*

*నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః*

*బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే*

*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః*

*తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె*

*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*

*తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే*

*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*

*నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*

*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*

*ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*

*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*

*వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*

*యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః*✍️

*ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ*

*కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః*

*పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం*

*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*

*అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*

*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం*

*ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా*

*ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్*

*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్*

*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*

*రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*

*సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్*

*అథ రవి రవదన్నిరీక్ష్య రామం*

*ముదితమనాః పరమం* *ప్రహృష్యమానః*

*నిశిచరపతి సంక్షయం విదిత్వా*

*సురగణమధ్యగతో వచస్త్వరేతి*

```

1 నుండి 2 శ్లోకాలు: అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట.


3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.


6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంతః స్వరూపము ఒక్కటే.


16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు.


25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవానుడు 

శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం.


అగస్త్యుడు అన్నాడు “ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు” అన్నాడు.


రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.```


        *రేపు…91వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏


*👆వేరే పని ఒత్తిడి వల్ల నిన్న ఆదివారం 90వ భాగం పంపలేక పోయినందుకు మన్నించాలి*


*ఈ రోజు ఆదివారం 90వ భాగం మరియు రేపటి రోజు సోమవారం 91వ భాగం పంపుతున్నాను🙏*

*************************

ఇంద్రియాలు చేసే మోసం!*

 *ఇంద్రియాలు చేసే మోసం!*

🪷🪷🪷🪷🪷🪷

*మన వాళ్ళే కాదు,  ఒక్కొక్కసారి మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు (sensory organs) కూడా మనల్ని మోసం చేస్తాయి..* 


*ఇది నేనంటున్న మాట కాదు. 7వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చెప్పిన మాట..*


*🐬నీటిలో ఉన్న చేప ఎరను చూడగానే , వాసన తగిలి ఎరకు తగులుకుని, జాలరి బుట్టలోకి పోతుంది.. అంటే దాని నాలుకే దానిని మోసం చేసింది..*


*🪳చుట్టుపక్కల ఎన్ని తినే పదార్ధాలున్నా, మంటను చూడగానే మిడత అందులో పడుతుంది.. దాని కన్నులే దానిని మోసం చేశాయి..* 


*🐝సంపెంగ పూవు వాసన తగలగానే భ్రమరం దాని మీద వాలి, మకరందాన్ని గ్రోలుతుంది. అందులోని విషపదార్థ ప్రభావం చేత భ్రమరం చనిపోతుంది.. (మిగిలిన ఏ పూవు మీద వాలినా ఏమీ కాదు, ఒక్క సంపెంగ తప్ప) .. అంటే... దాని నాశిక(ముక్కు) దానిని మోసం చేసిందన్న మాట..* 


*🐘మగ ఏనుగును వేటాడటానికి ఆడ ఏనుగును పంపు తారు.. అది మగ ఏనుగును రాసుకుంటూ వెళ్తుంది. చర్మ రాపిడికి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనుకే వెళ్ళి వేట గాళ్ళకు చిక్కుతుంది.. దాని చర్మమే దానిని మోసం చేసిందన్న మాట..* 


*🦌లేడి పిల్లల్ని పట్టుకోడానికి వేణువును ఊదుతారు.. వేణు గానం వినగానే అటు వైపు వెళ్ళి చక్కగా దొరికిపోతాయి.. వాటి చెవులే వాటిని మోసం చేశాయి..*


*ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుకుగా ఉన్న ఈ జీవులే ఇంతలా మోసపోతున్నప్పుడు, పంచేంద్రియాలూ చురుకుగా ఉన్న మనిషి మోసపోకూడదు అనుకుంటే... ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి..* మరింగంటి సీతారామాచార్యులు.

ఉత్తములకే కష్టాలు

 *జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.?*


మానవుడికి అతడి మొత్తం జన్మ ల రూపం సంచిత కర్మ.అందు లో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ ... 

మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతం లోని కర్మ ల కారణంగా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.


అతడి కర్మలను బట్టి, ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..

రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..

ఆంటే !!... ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం…

ఆంటే అది Bank loan Installment భాషలో ఇన్నిEMI లు 

ఉన్నాయి అని అర్ధం. 

ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!


వ్యాధులు బాధలు కష్టాలు. శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. 

ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి. 

వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి , ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.


భగవంతుడిని కానీ మరో దేవతలని కానీ ప్రత్యేకించి ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మ లో. నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి.. 


ఈ కారణంగా నే జ్ఞానులు. యోగులు. ఉత్తములు. కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? “ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి ” అనుకునే వారికి ఒక చిత్రం జరుగుతుంది..


ఈ ఉత్తములు తమ కోరిక కి అనుగుణం గా , వారు మోక్షానికి వెళ్లి పోవడానికి , వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..లేదా రాబోయే జన్మల సంఖ్య తగ్గుతుంది..ఆంటే Bank భాషలో మీ కోరిక ప్రకారం మీ EMI లు తగ్గాయి..అప్పుడు జరిగే పరిణామం ఏమిటి ? 


విపరీతం. గా వ్యాధులు అవమానాలు తిరస్కారాలు అప్పులు, ఇంత బయట దుర్భర స్థితి ఏర్పడుతుంది. మీరు గమనించండి..ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి.. త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్నారు.. వీరు భగవంతుడిని నిరంతరం భగవంతుడిని మనస్సులో నిలిపుకుని. ఆ వేదనలు అనుభవించారు. సక్కుబాయి తుకారామ్ ,మీరా. ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా అనుభవించారు..మీరు. “ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు ” అన్నారో, మీ జన్మల EMI లు పెరిగిపోతాయి.

 మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడ టా నికి కారణం ఇదే..

అధిక విద్యావంతు - లప్రయోజకులైరి

 సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి

పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి

సత్యవంతులమాట - జన విరోధంబాయె

వదరుబోతులమాట - వాసికెక్కె

ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి

పరమలోభులు ధన - ప్రాప్తులైరి

పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి

దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి


తే. పక్షివాహన । మావంటి - భిక్షుకులకు

శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

ఆవుపాల ఉపయోగాలు

 ఆవుపాల ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ.

              

.     ఆయుర్వేదము నందు ఆవుపాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆవుపాలు పలచగా ఉండి త్వరగా జీర్ణం అగును. శిశువులకు తల్లిపాలు లభించని పక్షంలో ఆవుపాలు పట్టడం అత్యంత శ్రేయస్కరం . 100 గ్రాముల ఆవుపాల నుంచి 60 కేలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల ఆవుపాలలో పిండిపదార్ధాలు 5 గ్రా , ప్రోటీన్స్ 3 గ్రా , ఫాట్స్ 3 .5 గ్రా , ఫాస్ఫరస్ 87 మి.గ్రా , క్యాల్షియం 120 మి.గ్రా , ఐరన్ 0 .3 మి.గ్రా , సోడియం 34 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , A విటమిన్ 170 LU లు  B1 - 55 మి.గ్రా , B2 - 200 మి .గ్రా , B3 - 4 .8 మి.గ్రా , నియాసిన్ - 3 మి.గ్రా , కొలెస్టరాల్ 11 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 2 గంటలు పడుతుంది. 

 

               ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులలో మన శరీరానికి అవసరం అయిన అని" ఎమైనో యాసిడ్స్"  పుష్కలంగా లభించును.  

        

.    పైన చెప్పిన వివిధ మోతాదుల్లో మన శరీరానికి అవసరం అయిన ఎన్నో విలువైన విటమిన్లు , ధాతువులు మనకి లభ్యం అగును. ఇప్పుడు మీకు ఆవుపాల గురించి వివరణయే కాక ఆయుర్వేదం నందు ఆవుపాలతో వైద్యప్రక్రియలు కూడా వివరిస్తాను . 

   

•  ఆవుపాలతో వైద్యప్రక్రియలు  - 

 

*  ఆవుపాలలో " కాసినోజిన్ " మరియు "లాక్టాల్ అల్బుమిన్ " అను మాంసకృత్తులు ఉన్నాయి . పాలలో ఉన్న మాంసకృత్తులు మన శరీరానికి అత్యవసరం . 


 *  ఆవుపాలలో ఉన్న మాంసకృత్తుల వలన మన శరీరంలో " వ్యాధినిరోధక శక్తి " పెరుగుటయే కాక మాంసకృత్తులు శరీరంలో లోపించిన సందర్భాలలో అవి భర్తీ చేయబడును. 

 

*  ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులు చిన్నపిల్లలకు , గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చు బాలింతలకు , జీర్ణశక్తి లోపించిన వారికి , శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అత్యంత అవసరం. 

 

*  క్షయ , మధుమేహం , క్యాన్సర్ , ఉబ్బసం , నిద్రలేమి , నరాల బలహీనత లాంటి దీర్ఘకాల వ్యాదులలో ఆవుపాల యందు ఉన్న మాంసకృత్తులు దివ్యౌషధంలా ఉపయోగపడును. 

 

*  పాలయందు ఉన్న పదార్ధాలలో మాంసకృత్తుల తరువాత కొవ్వు ముఖ్యమైన పదార్థంగా చెప్పుకోవచ్చు . పాలలో కొవ్వు కరిగి ఉండుటచేత పాలకు తెలుపు రంగు ప్రాప్తించింది . పాలలో ఉండు కొవ్వు మన శరీరంలో తేలికగా జీర్ణం అగును. కొవ్వు తీసిన పాలను " skimmed milk " అంటారు. 

 

*  ఆవుపాల యందు ఫాస్ఫెట్స్ , క్యాల్షియం , పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్దిగా ఉన్నాయి . ఎముకలు , కండరాల పెరుగుదలలో ఇవి ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆవుపాలలో ఐరన్ మాత్రం చాలా తక్కువ శాతములో లభించును. కాబట్టి ప్రతిరోజూ ఆవుపాలు ఆహారంగా స్వీకరించేవారు ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి . 

 

*  ఆవుపాలతో పాటు 2 ఖర్జురాలు కలిపి సేవిస్తుంటే ఐరన్ , క్యాల్షియం , ఫాస్ఫరస్ వంటి మినరల్స్  మరియు సాల్ట్స్ మన శరీరానికి పుష్కలముగా లభించును. 

 

*  పాలలో ఖనిజ లవణాలతో పాటు సిట్రిక్ ఆసిడ్ కూడా క్యాల్షియం , మెగ్నిషియంలలో మిళితమై పుష్కలంగా ఉంటుంది. ఈ ఆసిడ్ కడుపులో కురుపులు రాకుండా ఆపడంలో ప్రముఖపాత్ర వహించును.   


 *   ఆవుపాలలో విటమిన్ A , B2 , D  నికోటిక్ యాసిడ్ ఉన్నాయి. తాజా పాలలో విటమిన్ C కూడా ఉంటుంది. కాని పాలు కాచినప్పుడు విటమిన్ C నశిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం పాలని ఆహారంగా తీసుకొనే అలవాటు ఉన్నవారు విటమిన్ C కలిగిన కాస్త పుల్లనికాయలు , పండ్లు తీసుకోవడం మంచిది .


 *  పాలలో సమృద్దిగా ఉన్న విటమిన్ A , B కాంప్లెక్స్ , C & D అనునవి సూర్యుని అతినీలలోహిత కిరణాల ( Ultra voilet Rays ) ప్రసార ప్రభావం వలన కొన్ని మార్పులకు లోనగుటచేత ఉబ్బసము, క్షయ , కొన్ని ఎలర్జీలకు , దగ్గు , శరీరంలో కొన్ని మాంసకృత్తులు లోపించుట , శారీరకశక్తి లోపించినట్లుగా బాధపడువారికి , జుట్టు రాలిపోవువారికి , వయస్సు మీరినట్లు కనిపించుట , బలహీనంగా ఉన్న చిన్నపిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారముగా పనిచేయును . 

 

* గ్లాసు పాలలో 4 నుంచి 5 చుక్కలు " సోడియం నైట్రేట్ " కలిపి ఆహారంగా వినియోగిస్తుంటే పాలలో విడిగా ఉన్న క్యాల్షియం ఎంతో ఉపకరిస్తుంది. 


 *  పుల్లటి పండ్లు గాని , బిస్కెట్స్ కాని తిన్న తరువాత పాలు తాగితే జీర్ణక్రియ తేలికగా జరుగును. 

 

*  పాలు జీర్ణాశయము నందలి " పెప్సిన్"తో కలిసి జీర్ణాశయంలో అధికంగా జనియించే                       " హైడ్రోక్లోరికామ్లం " ను తగ్గించడంలో సహకరిస్తుంది.  జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు ప్రతిరోజు పాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే మంచి మందుగా పనిచేస్తాయి. 


 * పాలు పిల్లలలో జీర్ణం అయినంత త్వరగా పెద్దవారిలో జీర్ణం కావు . రికెట్స్ వ్యాధి ఉన్నవారికి కొవ్వుపదార్దాలు , క్యాల్షియం జీర్ణం అగుట అసాధ్యం . కాబట్టి పాలు స్వీకరించరాదు. రికెట్స్ వ్యాధి ఉన్నవారు పాలు తాగినప్పుడు జీర్ణం అగుట కష్టసాధ్యం అగుట చేత విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం అరగక ప్రమాదంగా మారే అవకాశంగా ఉంది.

 

*  పాలు సరిపడనివారు స్వీకరించరాదు. పాలు మితిమీరి తాగుతూ ఉంటే మలబద్దకం , అజీర్తి వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉన్నది. కడుపు నిండుగా భోజనం చేసినవెంటనే పాలు తాగుట మంచిది కాదు. 

 

*  పాల ద్వారా కలరా , టైఫాయిడ్ , క్షయ వంటి రోగాలను కలిగించే సూక్ష్మక్రిములు అతితేలికగా పయనించగలవు. కావున పాలను తాగేముందు బాగా కాచి తాగుతూ ఉంటే వ్యాధులను సంక్రమింపచేసే క్రిములు నశించుటయే కాక జీర్ణక్రియ తేలికగా జరుగును. 

 

*  పాలను పెద్ద మంటతో అతిగా కాచి నిదానముగా చల్లార్చుతూ ఉంటే పాలలో రుచి పోతుంది. 

 

*  పాలను కాచే ముందుగా పాలపాత్రను బాగా శుభ్రపరచవలెను . పాలు వాసన వచ్చినా , నీలిరంగుకు మారినా త్రాగరాదు. ఇటువంటి పాలు తాగిన వాంతులు , విరేచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చును. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవును 


 *  భోజనానంతరం 2 నుంచి 3 గంటలు ఆగి పాలు తాగిన సంపూర్ణంగా జీర్ణం అగును. 

 

*  గోరువెచ్చని పాలలో తగుమాత్రం తేనె కలిపి కాని లేదా ఏమి కలపకుండా కాని తాగితే మంచిది . అలా కాకుండా పంచదార కలిపిన పాలు తాగితే జీర్ణాశయంలో " హైడ్రోక్లోరిక్ ఆసిడ్ " అధికం అయ్యి జీర్ణం అగుట కష్టసాధ్యం అగును. 

 

*  గర్భము ధరించిన ( సూడి పశువు ) పశువుల పాలు తాగుతూ ఉంటే వయస్సుకు వచ్చిన స్త్రీ , పురుషుల ముఖము పైన మొటిమలు వస్తాయి. దీనికి కారణం ఆ పాలలో " ప్రొజెస్టిరాన్ "                 " ఈస్ట్రోజెన్ " అను సెక్స్ హార్మోన్స్ మిళితమై ఉండటమే దీనికి కారణం . 

 

*  పిల్లల వయస్సును అనుసరించి పాలలో నీటిశాతం పెంచుటయో , తగ్గించుటయో చేయాలి . ఉదాహరణకు ఒక నెల వయస్సు ఉన్న పిల్లలకు 1 వంతు పాలు , 3 వంతులు నీరు కలిపి 2 నుంచి 3 గంటల కొకమారు  పట్టాలి. 


 *  పిల్లలకు ఆవుపాలు పట్టువారు ఆ పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తే ఉపయోగకరంగా ఉండును. 

 

*  రాత్రి సమయంలో పసి పిల్లలకు ఆవుపాలు తాగించుట అంత మంచిది కాదు. ఈ సమయంలో నులివెచ్చని నీటిలో గ్లూకోజ్ గాని , పంచదార గాని కలిపి తాగించుట మంచిది . 


 *  ఆవుపాలను తరచుగా వేడిచేయుట మంచిది కాదు. ఒకేసారి పాలు కాచి అవసర సమయాలలో ఆ పాలలో వేడినీరు కలిపి పిల్లలకు పాలు తాగిస్తుంటే ఆ పాలు తేలికగా జీర్ణం అగును. 


 *  తల్లిపాలు సమృద్దిగా లభించే పిల్లలకు పోతపాలు పోయుట అనర్థదాయకం . ఎందుకంటే తల్లిపాలలో కంటే ఆవుపాలలో క్యాల్షియం , ఫాస్పరస్ 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉండటం చేత చిన్నపిల్లల మూత్రపిండాలకు వాటి విసర్జన కష్టం అయ్యి మూత్రపిండాలు పాడగును. అవసరం అయితే అత్యంత పలచగా చేసి పోయవలెను .  



.      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

    

గమనిక  -

      

.      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

           

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.

                   

            కాళహస్తి వేంకటేశ్వరరావు .

         

.        అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

.                     9885030034

సుభాషితమ్

 🔯 *సుభాషితమ్* 🔯


శ్లో𝕝𝕝   

> *దేవతానాం చ సఙ్కల్పం*

> *అనుభావం చ ధీమతామ్।*

> *వినయం కృతవిద్యానాం*

> *వినాశం పాపకర్మణామ్॥*

                         ~విదురనీతిః


తా𝕝𝕝 "దేవతల సంకల్పము, బుద్ధిమంతుల ప్రభావము, విద్వాంసుల అణుకువ, పాపాత్ముల వినాశం - ఈ నాలుగూ సద్యః ఫలితాన్ని ఇస్తాయి."


`నా అనువాదపద్యం`


కం.

సురసంకల్పములన్నియు 

వరధీమంతుల ఘనతయు పండితవినయ 

మ్మరుదై తత్క్షణ ఫలమిడు 

ఖరదురితాంతము త్వరతను కాటికిఁ జేరున్ 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - అనూరాధ -‌‌ ఇందు వాసరే* (07.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*