7, జులై 2025, సోమవారం

సంఘజీవిగా బ్రతుకుదాము*

 *ఒంటరిగా కాదు సంఘజీవిగా బ్రతుకుదాము*


సభ్యులకు నమస్కారములు .


ఒకటిగా, ఒంటరిగా ఉన్న అక్షరాలకు ఏ అర్థము కానరాదు. అవుతే, 

*న మంత్రం అక్షరం నాస్తి* అని చదువుకున్నాము. ఇక్కడ కూడా అక్షరం *ఓం* కార సహితంగా ఉండాల్సిందే. ఒంటరి అక్షరాలకు జతగా మరిన్ని అక్షరాలు ఉంటేనే అవి అర్థవంతమైన వాక్యాలుగా, వ్యాఖ్యానాలుగా మారుతాయి. 


*మరియొక మాట.......*

*అక్షరాణాం అకారోస్మి*.. భగవాన్ ఉవాచ. అనగా నేనే అక్షరాన్ని అనే భగవంతుడే చెప్పినట్లుగా శాస్త్రాలు ఉటంకిస్తున్నాయి. ఇంతేకాకుండా *ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ నమః* మరియు *ఇతి ద్వే అక్షరే నారాయణాయ* ఇతి పంచాక్షరాని అని కూడా ఉపనిషత్ గీతా వచనం. అవుతే, సృష్టిలో దేవుడు కూడా ఒంటరిగా లేడు. దేవుడు సరసన దేవీ ఉంటుంది. వారి ప్రపన్నులైన భక్త బృందం ఉంటుంది.


 *ఒంటరి జీవితం కంటే సంఘజీవనం ఫలదాయకంగా ఉంటుంది*. మంచి వారితో స్నేహం, మంచి సంస్థలతో అనుబంధం వలన మానవ జీవితం అర్థవంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. జీవితం సార్ధకం అవుతుంది.


పుట్టేటప్పుడు ఏదో సాధిస్తానని పిడికిలి బిగించి ప్రాణం పోసుకుంటాడు మనిషి. కాని, పోయేటప్పుడు సాధించినదేది తీసుకపోలేము ..అని గుర్తుగా శూన్యమైన అరచేతులతో ప్రాణాలు వదిలేస్తాడు. సంపద, ఐశ్వర్యం, బంధాలు, అనుబంధాలు, సతీ, సుతులు, సంతానం చివరికి శరీరం కూడా వెంటరాదు. *చివరికి తనకు మిగిలేది, దక్కేది సేవల వలన వచ్చిన కీర్తి మాత్రమే*. అదే .. *శేషత్వ కీర్తి.*



జీవితంలో ఎంత సంపాదించాను, ఎంత ఎత్తుకు ఎదిగాను, అని *మాత్రమే గాకుండా ఎదుటి వారి మనసులో ఎంత స్థానం సంపాదించాను* అని పరిశీలించుకోవాలి. 


ఇంటికి పిల్చి ఇచ్చేది *విందు*. అడిగిన తదుపరి ఇచ్చేది *అప్పు మరియు భిక్ష*. ఎవరికి తెలియకుండా ఇచ్చేది *దానము* *ఆర్తి* గలవారిని వెతుక్కుంటూ వెళ్ళి చేసేది *ధర్మము.*


చివరిగా...

*సమాజంతో కల్సి ఉందాము, సంస్థలలో చేరుదాము, సేవలు చేద్దాము. మానవ జీవితానికి సార్థకత చేకూరుద్దాము*.


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: