7, జులై 2025, సోమవారం

ఇంద్రియాలు చేసే మోసం!*

 *ఇంద్రియాలు చేసే మోసం!*

🪷🪷🪷🪷🪷🪷

*మన వాళ్ళే కాదు,  ఒక్కొక్కసారి మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు (sensory organs) కూడా మనల్ని మోసం చేస్తాయి..* 


*ఇది నేనంటున్న మాట కాదు. 7వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చెప్పిన మాట..*


*🐬నీటిలో ఉన్న చేప ఎరను చూడగానే , వాసన తగిలి ఎరకు తగులుకుని, జాలరి బుట్టలోకి పోతుంది.. అంటే దాని నాలుకే దానిని మోసం చేసింది..*


*🪳చుట్టుపక్కల ఎన్ని తినే పదార్ధాలున్నా, మంటను చూడగానే మిడత అందులో పడుతుంది.. దాని కన్నులే దానిని మోసం చేశాయి..* 


*🐝సంపెంగ పూవు వాసన తగలగానే భ్రమరం దాని మీద వాలి, మకరందాన్ని గ్రోలుతుంది. అందులోని విషపదార్థ ప్రభావం చేత భ్రమరం చనిపోతుంది.. (మిగిలిన ఏ పూవు మీద వాలినా ఏమీ కాదు, ఒక్క సంపెంగ తప్ప) .. అంటే... దాని నాశిక(ముక్కు) దానిని మోసం చేసిందన్న మాట..* 


*🐘మగ ఏనుగును వేటాడటానికి ఆడ ఏనుగును పంపు తారు.. అది మగ ఏనుగును రాసుకుంటూ వెళ్తుంది. చర్మ రాపిడికి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనుకే వెళ్ళి వేట గాళ్ళకు చిక్కుతుంది.. దాని చర్మమే దానిని మోసం చేసిందన్న మాట..* 


*🦌లేడి పిల్లల్ని పట్టుకోడానికి వేణువును ఊదుతారు.. వేణు గానం వినగానే అటు వైపు వెళ్ళి చక్కగా దొరికిపోతాయి.. వాటి చెవులే వాటిని మోసం చేశాయి..*


*ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుకుగా ఉన్న ఈ జీవులే ఇంతలా మోసపోతున్నప్పుడు, పంచేంద్రియాలూ చురుకుగా ఉన్న మనిషి మోసపోకూడదు అనుకుంటే... ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి..* మరింగంటి సీతారామాచార్యులు.

కామెంట్‌లు లేవు: