16, డిసెంబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 111*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత - 111*

                                     *****

      *శ్లో:- వనే రణే శత్రు జలాగ్ని మధ్యే ౹* 

             *మహార్ణవే పర్వత మస్తకే వా  ౹*

             *సుప్తం ప్రమత్తం విషం స్థితం వా ౹*

             *రక్షన్తి పుణ్యాని పురా కృతాని  ౹౹*

                                     ***** 

*భా:- ధర్మో రక్షతి రక్షితః - అని ఆర్యోక్తి. సత్యమున్నచోట ధర్మము, ధర్మమున్నచోట అర్థము, ఇవన్నీ ఉన్నచోట మోక్షప్రాప్తికి మార్గం సుగమంగా ఉంటుంది. మన పూర్వజన్మ కృతమైన పుణ్యం నిల్వలో ఉన్నట్లయితే మనకెలాంటి ఆపదలు రావు. 1."వనే":- కీకారణ్యంలో చిక్కుకుపోయినా; 2."రణే":- వ్యూహాత్మకమైన రణరంగంలో బందీ అయినా; 3."శత్రు":- శత్రువుల దాడిలో బంధింపబడినా; 4."జల":- ప్రమాదవశాత్తు జల దిగ్బంధంలో కొట్టుకుపోతున్నా, 5."అగ్నిమధ్యే":-  ఆకస్మికంగా చుట్టూరా అగ్నికీలలు అలముకొన్నా; 6."మహార్ణవే":- గొప్పదైన సముద్రపు అలలు వేగంగా వచ్చి లాక్కొని పోతున్నా; 7."పర్వతమస్తకే":- కొండ కొమ్మున కేగి, దారి తెన్నెరుగక దిక్కుతోచని పరిస్థితి ఎదురైనా; 8."సుప్తం":- ఒడలు మరచి గాఢ నిద్రలో మునిగినా; 9."ప్రమత్తం":-  పూర్తి జాగ్రత్తలో ఉన్మాద స్థితిలో ఉన్నా; 10."విషమస్థితి":- ప్రమాదవశాత్తు అనూహ్యమైన "విపత్కరస్థితుల నెదు రీదుతున్నా-- మనము పూర్వజన్మలో చేసి, నిల్వలో ఉంచుకున్న పుణ్యఫలరాశి మనలను సలక్షణంగా నీడలా  వెన్నంటి, ఆ గండం నుండి అమాంతం పట్టుకొని ప్రాణాలతో  గట్టెక్కిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. నిన్ను నీవే  నమ్మ లేని చిత్రాతి చిత్రమైన   స్థితి తారసపడుతుంది. అందుకనే జీవించిన నాలుగు రోజులు సత్య సమ్మతమైన ధర్మాన్ని చేస్తూ, ధర్మబద్ధమైన అర్థాన్ని గడిస్తూ, యోగ్యత, పాత్రత లతో కూడిన దాన ధర్మాలు నిర్వహించాలని, అవే పురాకృత పుణ్యరూపములో  రక్షిస్తాయని సారాంశము*. 

                               *****

               *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

Shivlinga Radioactive

 Are Shivlinga Radioactive? 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏


Yes it is 100 % true!!


Pick up India's Radio Activity Map, you will be surprised! Apart from the nuclear reactor of the government of India, the highest radiation is found in the places of all Jyotirlingas.


▪️ Shivling is nothing but nuclear reactors, that's why they are offered water so that they may remain calm.


▪️ All the favorite substances of Mahadev such as Bilv Patra, Aakamad, Dhatura, Gudhal etc. are all nuclear energy soaking.


▪️ Because the water on Shivlinga also becomes reactive, that is why the drainage tube is not crossed.


▪️ The design of Bhabha Atomic Reactor is also like Shivling. [1]


▪️ Water offered on Shivling takes the form of medicine together with the flowing water of the river.


▪️ That's why our ancestors used to say to us that if Mahadev Shivshankar gets angry, then the holocaust will come.


▪️ Notice how deep science is hidden behind our traditions.


▪️ The culture of which we have been born, is eternal. Science has been dressed as the core of traditions so that it becomes a trend and we Indians should always live a scientific life.


▪️ You will be surprised to know that there are such important Shiva temples in India which are built in the same straight line from Kedarnath to Rameshwaram. Wonder what kind of science and technology our ancestors had that we didn't even understand till today? Kedarnath of Uttarakhand, Kaleshwaram of Telangana, Kalhasti of Andhra Pradesh, Ekambareshwar of Tamil Nadu, Chidambaram and finally Rameshwaram temples are built in a geographical straight line of 79°E 41'54 ′′ Longitude.


▪️ All these temples represent gender expression in the 5 elements of nature, which we call Panchabhut in common language. Panchbhut means earth, water, fire, air and space. Based on these five elements, these five Shivlingas have been installed.


Water is represented in Thiruvanaikwal temple,

The fire is represented in Thiruvannamalai,

The wind is represented in Kalahasti,

Earth is represented in Kanchipuram and at the end

Space or sky is represented in Chidambaram temple!


These five temples depict the amazing gathering of Vastu-Science-Vedas.


▪️ Geographically also featured in these temples. These five temples were built according to Yoga Science, and are placed in a certain geographical alignment with each other. There must be some science behind this that will affect the human body.


▪️ These temples were built about five thousand years ago when there was no satellite technology available to measure the latitude and longitude of those places. Then how so accurately five temples were installed? Only God knows the answer.


▪️ The distance between Kedarnath and Rameshwaram is 2383 km. But all these temples are almost in the same parallel line. After all, thousands of years ago, using which technique these temples were built in parallel line, this is still a mystery.


The twinkling lamp at Srikalhasti temple shows that it is air penis.

The water spring in the interior plateau of the Thiruvanikka temple shows that it is a water penis.

Huge lamp on Annamalai hill shows that he is a fire penis.

Kanchipuram's sand self-penis shows that it is earth gender and

From the formless state of Chidambaram, the formlessness of God means the sky element is known.


▪️ Now it's not surprising that the five genders representing the five elements of the universe have been installed centuries ago in the same line. We should be proud of the knowledge and intelligence of our ancestors that they had science and technology that even modern science couldn't distinguish. It is believed that not only these five temples but there will be many temples in this line which fall in a straight line from Kedarnath to Rameshwaram. This line is also known as ′′ Shiva Shakti Aksha Rekha Perhaps all these temples have been constructed keeping Kailash in mind, which falls in 81.3119° E!? Only Lord Shiva knows.


It is amazing. See the relationship between Shiva Jyotirlingas with ′′ Mahakal ′′


The distance between the remaining Jyotirlingas from Ujjain is also interesting -


▪️ Ujjain to Somnath-777 km


▪️ Ujjain to Omkareshwar-111 km


▪️ Bhimashankar from Ujjain-666 km


▪️ Ujjain to Kashi Vishwanath-999 km


▪️ Ujjain to Mallikarjuna-999 km


▪️ Ujjain to Kedarnath-888 km


▪️ Ujjain to Trimbakeshwar-555 km


▪️ Ujjain to Baijnath-999 km


▪️ Ujjain to Rameshwaram-1999 km


▪️ Ujjain to Ghrishneshwar-555 km


In Hindu religion nothing was done without reason.


Ujjain is considered the center of the earth, which has been considered for thousands of years in Sanatan Dharma. Hence, man-made instruments have been made for calculating sun and astrology calculations in Ujjain about 2050 years ago.


And when the fictional line (cancer) on earth was formed by the English scientist about 100 years ago, the middle part of it turned out to be Ujjain. Even today, scientists come to Ujjain for information about sun and space.


 *Har Har Mahadev*

ధర్మసూక్ష్మమ్

 ధర్మసూక్ష్మమ్ :-

************

   కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, 

పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు

మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక

కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి

వాటిని తినడం మానేస్తాం.పైగా

"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో

వదిలేశాను "

"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను

అని చెప్పుకుంటాం.


నిజానికి పెద్దలు వదలమన్నది,

  "కాయాపేక్ష, ఫలా పేక్ష "


 *వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*


   కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ.  ప్రతి వ్యక్తికి

ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి ,

ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి

రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ

వదిలేసి సాధువులా బతకమని అర్ధం.


  ఫలాపేక్ష అంటే :-  ఏదైనా పని చేసి దాని ధ్వారా

లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.


ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం.  యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం.  బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా

ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం


(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను) 


                      ఓం నమశ్శివాయ

                                 ****

ఆయుర్వేద వైద్య పరిజ్ఞానం

 ప్రాచీన భారతీయుల

ఆయుర్వేద వైద్య పరిజ్ఞానం

చెత్తకుప్పలో వేయాల్సిందేమీ కాదు..

వందల శతాబ్దాలుగా

ఆ అనుభవ జ్ఞానం

ఇంకా కళ్లెదుట బతికే ఉంది...


* నోటి పండ్లు ఊడిపోయినా

ముక్కు, చెవులు తెగిపోయినా

లోపం కలగకుండా అతికించారు

* మానవ, జంతు 

మృత కళేబరాలను

వేర్వేరు భాగాలుగా

కోసి పరీక్షించారు...

సుశ్రుత సంహితలో ఇదంతా 

నమోదై ఉంది..

* ఆరు జాతుల జలగలను

పేర్కొంటూ క్రిమిదష్ట భాగాన్ని

ఎలా బాగు చేయవచ్చో ఉంది..

* గ్యాంగ్రీన్ వగైరా ఏవైనా..

కుళ్లిన భాగాలను తప్పనిసరై

ఆ భాగాన్ని తొలగించి

శరీరాన్ని కాపాడాలనే

స్పృహ వారికుంది..అంతేకాదు

తొలగించిన కాళ్లకు

ఇనుప, కర్రలతో 

కృత్రిమ అవయవాలను

డిజైన్ చేశారు..

* వైద్య చికిత్సలో మూలికలనేగాక..

పాము గరళాన్ని, లోహాలను, 

గంధకీ, నత్రకి, ఉదజహరిత ఆమ్లాలను సైతం ప్రయోగించారు

14వ శతాబ్దం వచ్చేవరకూ

ఔషధాల్లో లోహ, రసాయనాలను ఉపయోగించడం

యురోపియన్లకు తెలియదు..

క్రీ.పూ.  కు ముందే

ఈ వైద్య విజ్ఞానం 

భారతీయులకు తెలుసు..


ఇలా ఎన్నెన్నో Hindu Superiority గ్రంథంలో

సాక్షాధాలతో ఉన్నాయి...

ఈ మాటలు రాసిన

పరిశోధకులంతా విదేశీయులే..

మిత్రుడు 'తెలుగువాడు శ్రీనివాసు' ఆ పుస్తకం లింక్ 

ఇచ్చాడు.. తెలుసుకోవాలనే

జిజ్ఞాస ఉంటే 

అందులో చదువుకోండి..

ఒరిజినల్ గ్రంథం 1906 లో

పబ్లిష్ అయింది..

సెకండ్ ఎడీషన్ 

వచ్చిందో.. లేదో తెలియదు

తెలుగు అనువాదం మాత్రం

1930 లో వచ్చింది..

మలి ముద్రణ కాలేదని కచ్చితంగా చెప్పగలను..


ఓ వైద్యశాస్త్రమే కాదు

అనేకంగా సంస్కృత గ్రంథాలు

క్రీ.శ. 6వ శతాబ్దం

మొదలుకుని అరబ్బీలోకి

తర్జుమా అవుతూ వచ్చాయి

నేరుగా సంస్కృతం

నుంచికాక...అరబ్బీ నుంచి

ఆంగ్లానికి అనువాదమయ్యాయి


ఈ పుస్తకంలో విదేశీ పండితుల

పిండీకృత భావమేమంటే..

" వైద్యం అనే శాస్త్ర అవగాహన భారత దేశంలో పుట్టింది..

ఆ వైద్యవిజ్ఞానం మొదట

అరబ్బులకు పరిచయమై..

అక్కడి నుంచి అది

యూరప్ కు చేరింది.."


ముక్తాయింపుగా 

ఓ మూడు మాటలు..

ఆయుర్వేదం 'గుడ్డు' అయితే

అలోపతి రెక్కల పక్షే...

పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించడం

ఓ సామెతకాదు 'పక్షి' నిజం..


మనలోమాట...

అలోపతి మందుల కంపెనీలతో

పోలిస్తే...ఆయుర్వేద ఫార్మా

మార్కెట్ తక్కువేం కాదు..

భారతీయ విజ్ఞానం అంతా

నాన్ సెన్స్..నాన్ సైన్స్ 

పాతచింతకాయ పచ్చడని

అనేవాళ్లు..అనుకునే వాళ్లు

ఈ గోడమీద వాదించ వచ్చు

కాకపోతే.. వైద్య శాస్త్రాల 

చరిత్ర..

ఆ పరిజ్ఞానం లేకుండా..

రాస్తే చర్చ ముందుకు సాగదు..

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

🙏శ్రీమద్భగవద్గీత🙏

4వ అధ్యాయము 

జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।


యదా-యదా — ఎప్పుడెప్పుడైతే; హి — నిజముగా; ధర్మస్య — ధర్మము యొక్క ; గ్లానిః — క్షీణత; భవతి — సంభవించునో; భారత — అర్జునా, భరత వంశీయుడా; అభ్యుత్థానమ్ — పెరుగుట; అధర్మస్య — అధర్మము యొక్క; తదా — అప్పుడు; ఆత్మానం — నన్ను; సృజామి — సృజింతును (ప్రకటించుకుందును); అహం — నేను.



భావము 4.7: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.


వివరణ:

ధర్మము అంటే నిజానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పురోగతికి సహకరించే, విహిత కర్మలే; దీనికి విరుద్ధమే అధర్మం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్త, నిర్వహణాధికారి అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకొని, దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. ఈ అవతారం ‘Avatar’ అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి తీసుకోబడింది, ఇప్పటికాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్ లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు. కానీ, ఈ భాష్యం లో ఈ పదాన్ని, దాని యొక్క నిజమైన అర్థం లో, అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడుదాము. శ్రీమద్భాగవతం లో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది. కానీ, భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి.


జన్మకర్మాభిధానాని సంతి మేఽoగ సహస్రశః

న శక్యంతే ఽనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి హి (భాగవతం 10.51.36)

🙏శ్రీమద్భగవద్గీత🙏

4వ అధ్యాయము 

జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।


పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.


భావము 4.8: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.


వివరణ:

పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని దగ్గరగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.


సాధు జనులను రక్షించుట కొరకు. పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.


దుష్టులను సంహరించుట కొరకు. భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం ఏమున్నది?


ధర్మాన్ని స్థాపించుట కొరకు. అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. దేవుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తనే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.


మరయితే, ఈ శ్లోకం లో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.


జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరం. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది మరియు ఎంతో మధురమైనది.


ఈ విధంగా, 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీ లో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుశ్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమనోహరంగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. రామ చంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:


రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ


"తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్దరించుకున్నారు." కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :


ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తి లో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.


దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించి రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దేవతలు కాబట్టి మరెవ్వరి వలన సంహరింపబడలేరు. కాబట్టి, దేవుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే కదా.


ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకం లో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.


ఇది, ఈ శ్లోకం యొక్క అసలైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.


"అనాది కాలం నుండి ఉన్న అనంతమైన దేవుని అవతారములను ఎవరూ గణించలేరు.". క్రింద చెప్పబడినట్టు, ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:


1. ఆవేశావతారములు – ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టటం; మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం. నారద ముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ. బుద్ధుడు కూడా ఒక ఆవేశావతార ఉదాహరణ.


2. ప్రాభవావతారములు – ఇవి భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులను ప్రదర్శించిన అవతారములు. ప్రాభవావతారములు కూడా రెండు రకాలు.


a) దేవుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమయి, తన కార్యాన్ని పూర్తిచేసి, వెళ్లిపోయేవి. హంసావతారము దీనికి ఒక ఉదాహరణ, దీనిలో కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.


b) భూలోకంలో చాల ఏళ్లు ఉండే అవతారాలు. పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతార రూపమే.


3. వైభవావతారములు – తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము లు వైభావావతారముల ఉదాహరణలు.


4. పరావస్థావతారములు – భగవంతుడు తన సర్వ మహోన్నత శక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి. శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, నృసింహావతారము - పరావస్థావతారముల ఉదాహరణలు.


ఈ వర్గీకరణ వల్ల, ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు. తనే ఒక అవతారమైన వేద వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు: సర్వే పూర్ణాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరమాత్మనః (పద్మ పురాణం), “భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి. అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితైనవి.” కాబట్టి మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు. ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. కాబట్టి పై వర్గీకరణ చేయబడింది.

5వ అధ్యాయము 

కర్మ సన్న్యాస యోగము


యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।


యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో ఏకమై; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధి తో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మ ను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.


భావము 5.7: పరిశుద్ధ మైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలో ఆత్మల పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో లో చిక్కుకోరు.


వివరణ: వైదిక వాఙ్మయం లో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్ధాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికి ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్దాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.


ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధి తో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు; అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణ లోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్దతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

5వ అధ్యాయము 

కర్మ సన్న్యాస యోగము


విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।

శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।


విద్యా — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము; వినయ — వినయము; సంపన్నే — కలిగి ఉన్న వారు; బ్రాహ్మణే — ఓ బ్రాహ్మణుడు; గవి — ఓ ఆవు; హస్తిని — ఓ ఏనుగు; శుని — ఓ కుక్క; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; శ్వ-పాకే — ఓ చండాలుడు; చ — మరియు; పండితాః — పండితులు; సమ-దర్శినః — ఒకే దృష్టితో చూస్తారు.


భావము 5.18: నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు.


వివరణ: మనం జ్ఞాన దృక్పథం తో చూసినప్పుడు దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు, అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం'. శ్రీ కృష్ణుడు 'విద్యా సంపన్నే' అన్న పదాలని ఇదే అర్థం లో వాడుతున్నాడు, అంతే కాక 'వినయ' అన్న పదం కూడా వాడుతున్నాడు, అంటే, 'అణకువ/నమ్రత'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది, కానీ, పైపైని పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడిఉంటుంది.


భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశ అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీ కృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవ జాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడుతాడు, అదే సమయంలో, ఒక ఛండాలుడు అందరిచే సాధారణంగా చిన్న చూపు చూడబడుతాడు; ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది; కాని కుక్క కాదు; ఏనుగు శుభ-కార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవ జాతులు, భూమిపై ఉన్న వైవిధ్య జీవ రాశులలో, పూర్తి విభిన్నమైనవి. కానీ, నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు, కాబట్టి సమ దృష్టి తో చూస్తాడు.


బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశలైన నిత్య జీవాత్మలే, అందుకే అందరూ సమానమే.

మార్గశిర లక్ష్మీవార వ్రతం’_

 *🚩_రేపు గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’_🚩*


🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


ఒకనాడు నారదుడు , పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం(ఆవుపేడ)తో అలికి , ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి , కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి , లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా , వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో *"మహర్షి ! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి ? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి"* అన్నారు. *గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"* *మహనీయ , ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా ? చేస్తే ఎవరు చేశారో , వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి"* అనగా , పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.


ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో *"స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను"* అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి *"అవ్వా ! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి ?"* అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ *"అమ్మా ! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి ? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను"* అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.


*"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి , ఇల్లు గోమయంతో అలికి , ముగ్గులు పెట్టి , లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో , బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని , దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి , పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని , కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి , ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా , నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం".* 


లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. *"రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని , పదిమందిని పిలిచి ఈ వ్రతం చేయాలి , పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. 


*ఈ వ్రతం మాత్రమే కాదు , మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి , పొయ్యి బూడిద తీయకపోయిన , ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా , మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో , కొడుతుందో , ఇల్లువాకిలి చిమ్మదొ , అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి , సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు , నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట , ఆశుభ్రప్రదేశాలలో తిరగడం , అత్తమామాలను ధూషించడం , సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు , తరువాత కాళ్ళు , చేతులు , ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ , ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా , అసంధర్భంగా , గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో , గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు , పూజలు చేయదో , భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం , అమావాస్యా , సంక్రాంతి(ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది)తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి(నరకానికి) పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధపదార్ధములను తినకుండా , నక్తం(ఒంటిపూట , ఒకపొద్దు) ఉంటుందో , లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర , దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు , మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట , భర్త మాట వినని స్త్రీ ఇంట , దైవంయందు , బ్రాహ్మాణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి , పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది"* అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి లక్ష్మీ దేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.


ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి , ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి , లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి , ధూపం వేసి , నైవెధ్యాలు పెట్టి , పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. *"ఓ భక్తురాలా ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో , ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాని చేరుతావు" అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి , విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు , భోగబాగ్యాలు , ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది"* అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీ చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.


*నైవేద్యాలు :*


1 వ గురువారం - పులగం 

2 వ గురువారం - అట్లు , తిమ్మనం

3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము

4 వ గురువారం - చిత్రాన్నం , గారెలు , 

5 వ గురువారం - పూర్ణం బూరెలు


🙏🙏🌻🙏🙏🌻🙏🙏🌻🙏🙏

పత్రం పుష్పం

 🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀


పత్రం పుష్పం ఫలం తోయం,  యోమే భక్త్యా ప్రయచ్చతి

 తదహం భక్త్యు ప్రహృతమస్నామి  ప్రయతాత్మనః      ( భగవద్గీత )


సామాన్యమైన అర్థం ఏమిటంటే :-

భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.


 కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.


🌷 పత్రం -- మనస్సు -- చంచలం.

🌷 పుష్పం -- బుద్ధి -- వికసించడం.

🌷తోయం -- చిత్తం -- నిర్మలం.

🌷 ఫలం  -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.


అవి ధ్యానం వల్లనే సాధ్యం.

👉 ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.

👉 అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.

👉 అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.

👉 దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.

 అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే దైవానికి ప్రీతి పాత్రుడు అవుతాడు.


🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀

నారాయణా

 *నారాయణా నీ నామమే గతి ఇక* 


🍁🍁🍁🍁


భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు.


 కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. 


 ఇందుగలడని అందులేడని సందేహము వలదు --


--అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.


ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి.


 భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". 


విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. 

వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం.  నారాయణ మంత్రం  వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది,  ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.


నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. 


 సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం.  ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. 


మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాదని తెలియజేసేది నారాయణ మంత్రం. 


ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు.


 తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. 


మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.


 అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. 


అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు.  జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను  జ్ఞానం కల్గి ఉంటాడు. 


 చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు.  దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది.


 అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలా చేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.



🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

విధి లిఖితాని

 .

🙏🏻🍂🥀🍂🙏🏻

 

ఒకసారి చదవండి ◆◆

*విధి లిఖితాని ...* 

*విష్ణువు నైనా విడిచిపెట్టదు ..* 📍


ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా, కోవిడ్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధా,  "ఈ సమయంలో ఇలా ఏమిటి ? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి ?" *అని చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోయి ఉండవచ్చు, సహజం ..* 


*అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు, ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి, వారందరి కోసం " మహాభారతం " మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయాలి ...*

 

ఎక్కడో ద్వారక. 

దానికి చాలా దూరంలో తపోవనం, ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు, అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు, ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది, కానీ బలరాముడు కూడా లేడు, *కానీ సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు ..*  


ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు, వెతికాడు, దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు, మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు... కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు, కుమిలిపోయాడు, రోదించాడు, అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు ..


అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు, అప్పటికే శ్రీకృష్ణుడు,  అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి..


ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేదు, ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది, అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు, ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండానే ..


*విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి, బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు, శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా, వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు ..*


*అంతటి ఇతహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు, మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి, అనడానికి ఇదొక ఉదాహరణ ..*

 

*అందరూ కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే,  కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు ..* 


*ఈ కరోనా సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి,*  శ్రీకృష్ణుడి అంత్యక్రియలా, ఈ ఘట్టం కొంతైనా భారాన్ని తగ్గస్తుంది .. *ఇలాంటి కుటుంబ సభ్యులకు భారాన్ని దింపుకునే శక్తిని, ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని..  శ్రద్ధాంజలితో ..* 🍂🥀


🥀ఓం శాంతి! ఓం శాంతి !! 🍂


🥀🥀🥀🙏🏻🥀🥀🥀

.

నేను ఉన్నాను

 నేను ఉన్నాను అనే ఎరుక ఉంటుంది..ఈ నేను అనే ఎరుకను తెలుసుకోవడానికి నేను ఎన్నో జన్మలు ఎత్తాల ? చిత్రం ఏమిటంటే 

" నేను " అన్నప్పుడు వెంటనే ఒక రూపం,నామం(పేరు) ఇవే నేనుగా అనిపిస్తాయి..ఈ నామ రూపాలు అసలైన నేను ను 

మరుగు పరుస్తాయి..ఇక జీవుడు(మనం) ఏమి చేస్తాడు అంటే ఆ నామ, రూపాల పైన అభిమానాన్ని పెంచుకొని " అవి నేనే " అనే అహంకారంగా మారిపోతాడు..


ఇలా..నేను అనే ఎరుక నుండి, నేనే అనే అహంకారంగా జీవుడు మారి ఇక కర్మలు చేస్తూ ఉంటాడు,సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, మళ్ళీ పుట్టి మళ్ళీ చస్తూ ఉంటాడు..ఈ తలనొప్పి అంతా ఎందుకు వచ్చిందో తెలుసా..నేను ఉన్నాను అనే నిజమైన ఎరుకను మరచిపోవడం వల్ల.. నేను ఇలా ఉన్నాను,అలా ఉన్నాను,ఇక్కడ ఉన్నాను,అక్కడ లేను అనే భ్రాంతి జ్ఞానంతో జీవించడం వల్ల జీవుడు సంసారంలో ఇరుక్కుపోతున్నాడు.. 


మరి జీవుడు విడుదల పొందాలి అంటే ఏం చేయాలి..తన నిజమైన ఎరుకను గుర్తించాలి..అంతే..అదే మోక్షం..ఈ నిజమైన ఎరుకకే ఆత్మ అని,పరమాత్మ అని,మహా చైతన్యం అని పేర్లు ఉన్నాయి..తన నిజమైన ఎరుకను గుర్తించిన వాడు మృత్యుంజయుడు..అతడికి మృత్యు భయం ఉండదు.

❤️❤️❤️❤️❤️

గీత17:08**

 ఆయుః సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ! రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యా ఆహారాః సాత్త్విక ప్రియాః!! 


భావం: ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పరచు నవియు, పాలు, చక్కెర మొదలగు రసపదార్థములును, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములును, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములును, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ఇష్టమైనవి. **గీత17:08**

నవ్వుకుంటాం

 ☘️🍁☘️🍁☘️



మనం ఇతరుల ఇష్టాల్ని చూసి కొన్నిసార్లు నవ్వుకుంటాం. 

ఇతరుల కోర్కెల్ని చూసి అవి ఎంత అల్పమయినవి అనుకుంటాం.

 మన కోరికలు గొప్పవని, మన లక్ష్యాలు సాటి లేనివని విర్రవీగుతాం. 

ఉన్నత లక్ష్యాలని గమ్యాలని ఏర్పరచుకోవాలనుకుంటాం. 

పదేళ్ళలో ఒకడు పదికోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. 

ఆ పూట గడిస్తే చాలనుకునేవాడు అట్లాంటి ఆలోచన వైపే రాడు. 

పదికోట్ల లక్ష్యం పెట్టుకున్నవాడు వందకోట్ల లక్ష్యం పెట్టుకున్నవాణ్ణి చూసి ఈర్ష్యపడతాడు.


ఇతరుల్తో పోల్చుకోవడంలో ఎంత కోల్పోతామో ఇతరుల్ని తక్కువ చెయ్యడంలోనూ అంతే కోల్పోతాము. 

ఎవరూ ఆసంగతి గుర్తించరు. 

జీవిత గమ్యం అందం, ఆనందం, ప్రశాంతం అని చెబితే పిచ్చివాడనుకుంటారు. 

ఒక సముద్ర తీరంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నారు. పరిగెడుతున్నారు. 

కిలకిలా నవ్వుతున్నారు, గంతులేశారు.

 కాసేపటికి ఇసుకలో కూచున్నారు.

 మెల్లగా ఇసుకతో ఆటలాడడం ప్రారంభించారు. 

ఇసుకతో కోటను తయారు చేశారు.

 ఎవరికి వాళ్ళు సొంత కోటను నిర్మించుకున్నారు. 

ఆ కోటలకు ద్వారాలు, బురుజులు తయారు చేశారు. 

అవి చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి.

 అంతలో ఒకడు “నాదే మంచికోట” అన్నాడు. 

రెండో కుర్రాడు “నాది బ్రహ్మాండమయిన కోట!” అన్నాడు. 

దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. 

ఒకరిమీద ఒకరికి కోపం వచ్చింది. 

జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి పోట్లాట వచ్చింది. 

దాంతో మొదటి కుర్రాడు రెండో కుర్రాడి ఇసుక కోటను ఒక్క తన్ను తన్నాడు అది ఒక్కసారిగా కూలిపోయింది. 

దాంతో రెండో కుర్రాడికి ఏడుపు వచ్చింది. 

మొదటి కుర్రాడి కోట మీద కాలు పెట్టి పచ్చడి పచ్చడి చేశాడు. 

రెండు కోటలు ఇసుకలో కలిసిపోయాయి. 

తప్పు నీదంటే నీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

చివరికి ఎవరిది అన్యాయమో చెప్పమని రాజు గారి దగ్గరికి వచ్చారు.

 ఆ రాజుకు పిల్లలంటే ఇష్టం. అందుకని సమస్యలు  వచ్చే పిల్లలు స్వేచ్ఛగా తనవద్దకు రావచ్చని ఆయన చట్టం చేశాడు. 

ఆ పిల్లలిద్దరూ రాజు దగ్గరికి వచ్చారు. 

రాజు వాళ్ళిద్దరూ తినడానికి తినుబండారాలు తెప్పించాడు. 

పిల్లలు తింటూ ఉంటే సమస్య చెప్పమని అడిగాడు.

 కోట కూల్చేశాడని ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 

రాజుకు నవ్వు వచ్చింది.

 ఇసుక కోటలు కూలినందుకు వీళ్ళు ఇంత గొడవపడుతున్నారా! 

అని రాజు బిగ్గరగా నవ్వాడు. 

దగ్గరే ఉన్న వివేక వంతుడయిన ఒక మంత్రి 

 “రాజుగారూ! ఈ పిల్లలిద్దరూ ఇసుక కోటల్ని కూల్చేసుకుని గొడవపడుతున్నారని మీరు నవ్వారు.

 కానీ ఇక్కడ నవ్వాల్సిన దేముంది. 

మీరు రాతి గోడల్ని అంటే రాతికోటల్ని పడగొట్టడానికి, ఆక్రమించడానికి నిద్ర లేకుండా నిరంతర యంత్రాంగంలో గడిపిన రోజులు మరచిపోయారా? 

నిజానికి వాటికీ వీటికీ తేడా ఏమైనా ఉందా? 

మీరే ఆలోచించండి” 

అన్నాడు.


            ఆ మాటల్తో రాజుకు కనువిప్పు కలిగింది. 

అధికారం కోసం అల్ప స్థాయిలోనయినా, ఉన్నత స్థాయిలోనయినా ఘర్షణలు జరుగుతాయి కదా!

 అని తెలుసుకున్నాడు.           


🌀🌀🌀🌀🌀🌀

మంగళసూత్రాన్ని

 *భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త సంపూర్ణ ఆయుష్యుతో జీవిస్తాడు, ప్రతి భార్యభర్తలు తెలుసుకోవాల్సిన విషయాలివి.*

🌻🌺🍀🌻🌺🍀🌻




*👌పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.?*


*👌 వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.*


*👌సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలనిఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు,ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలాచేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక.*


*👌మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం.*


*👌అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కనబెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట.*


*👌 నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువైఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది.*


*👌మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.*


*👌అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట.*


*👌కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది.*


*👌వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది.*


*👌 అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది.*


*👌ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజచేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర* *ఇనుముకిసంబంధించిన వస్తువులుపెట్టకూడదు.మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలంపూర్తిగా దాటి కిందకి ఉండాలి.*


*👌మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగలసూత్రం తెగిపోతే(పెరిగితే) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి.*



*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*

*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*

అష్టాక్షరీ మంత్ర

 *🚩అష్టాక్షరీ మంత్ర మహిమ.🚩*


” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, 

అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.

ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే 

శ్రీ మన్నారాయణుడు.


స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, 

విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, 

సమస్త మానసిక రుగ్మతలు తొలగించు 

లక్ష్మీ సుదర్శనునిగా, 

భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, 

సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా 

భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు


మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం 

పదిహేడో అధ్యాయం. 

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి 

ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. 


సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం 

ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. 

అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. 

ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. 

అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.


అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి 

ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా..


ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం,

నకారం రక్త (ఎరుపు) వర్ణం,

మో అనే అక్షరం కృష్ణ (నలుపు),

నా అనే అక్షరం ఎర్రగానూ,

రా అనే అక్షరం కుంకుమరంగులోనూ,

య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,

ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.


ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం 

ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. 


ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. 

దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. 

ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత 

పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.


సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. 

ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. 


ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. 

అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. 


స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. 

అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. 

రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, 

మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. 

అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. 

ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, 

ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. 

ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. 


నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే 

అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.


నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. 


ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. 

జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. 


ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. 

వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. 


ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. 

అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓంనమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా 

ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. 

అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో 

అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*55.సుమేరు మధ్య శృంగస్థా*


కామేశ్వరుని వామభాగములో వుండే దేవి వుండే ఇతర స్థానములు ఇప్పుడు చెప్పబడతవి. శ్రీమాత మేరుపర్వత మధ్యములో గల శిఖరముపై వెలసి వుంది. ఆ శిఖరమంతా. బంగారు శిఖరము. మేరుపర్వతాన త్రికోణములవలే మూడు శిఖరములు వున్నాయి. వాని మధ్యను నాలుగవ శిఖరంవుంది. అదే మాత నివాసస్థానం.


ఆ శిఖరమున గల బంగారు పొదరిళ్ళలో దేవతలు సంగీతము పాడుతుంటారు. దానికి తూర్పున నైరృతిదిక్కున, వాయువ్య దిక్కున మూడు శిఖరములు వున్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకములకు ఆధారమైనవి. వాటికి మధ్యన రత్న కాంతులతో దిక్కులన్నింటినీ వెలిగిస్తూవున్న శిఖరముపై శ్రీమాత నివసిస్తుంది .


మానవ శరీరమున వెన్నెముకను మేరువు అంటారు. బ్రహ్మరంధ్రము దానికి గల శిఖరమునకు పై భాగము "సహస్రారము”. ఆ సహస్రారము ఒక కమలము. ఆ కమలములో శ్రీమాత నివసిస్తుంది


కం|| ఘనమా సుమేరు మధ్యన, మనసారగ, నధివసించు మంగళగౌరీ వినగా నది సిరులొలికే

కనకమయపుశృంగ మహిమ కనగా వశమే!!


        లలితానామసుగంధం

                  M.s.s.k

తిరుప్పావై మొదటిపాశురము*

 🌹💐🌷🌾🥀🌸🌺


*తిరుప్పావై మొదటిపాశురము*


మార్ గళితిజ్ఞళ్ మదినిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిశైయీర్ శీర్ మల్ గుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ ఏరాకణ్ణి యశోదై యిళం శిఙ్గమ్ కార్మేని చెఙ్గజ్ణ్ కదిర్ మది యయ్బోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తఱువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్



*మార్గశిర మాసాన మంచి వెన్నెల రోజు నీరాడ కోరువారు రారండి రమణులార శ్రీలు పొంగెడు వ్రేపల్లె పడుచులార! దివ్యాభరణములు దాల్చిన మేల్బంతులార వాడివేలము తోడిగాచు నందగోపసుతుడు సుందర లోచని యశోద కిశోర సింహం సూర్యచంద్రుల మించు శ్యామ సుందరుడు నారాయణుడె మనకె పరనిచ్చువాడుమంగళము కూర్చు మన శ్రీవ్రతము*


                M.s.s.k

🌹🌺🌸🥀🌾🌷💐

*ఇక తిరుప్పావై తొలి పాశురం 'మార్గళిత్తింగల్ మది నిరైన్దనన్నాళాల్' అర్ధము, అంతరార్ధము తెలుసుకుందాం*


 శ్రీ గోదా గోపిక వ్రత సంకల్పం చేస్తూ ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏమి చేసి, ఎవరి వలన ఏ ఫలము పొందవచ్చునో మనకు వివరిస్తారు


*1. ఎప్పుడు ఈ వ్రతం చెయ్యాలి*


భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో పెద్దలు నిర్ణయించిన విధంగా ధనుస్సంక్రమణం నాడు ఈ వ్రతారంభం చెయ్యాలి క్రమం తప్పకుండా 30 రోజులు కొనసాగించాలి *


*2. ఎవరు ఈ వ్రతం చెయ్యాలి?*


కోరిక వున్న వారందరూ, జాతి, కుల, వయో, లింగ, వర్గ భేదం లేకుండా. ఈ ప్రతంలో చేరవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆత్మయౌవ్వనులందరూ ఈ వ్రతం చెయ్యవచ్చు. పరమాత్మ చూచి ఇష్టపడే యౌవనం మన ఆత్మలకుంటే చాలు దీని అర్థం ఏమిటో మనం ముందుకు వెళ్ళే కొద్ది తెలుసుకుంటాం. ఆ ఇచ్ఛ ఉంటే చాలు, స్వేచ్ఛగా మనం మనసా, వాచా, కర్మణా ఆడపడచులం కావాలి. ఏ విషయంగా? భగవద్విషయపరంగా మాత్రమే! అసలు ఈ ప్రపంచంలో భగవద్విషయం కానిది ఏముంది

               M.s.s.k

*3. ఈ వ్రతం ఎక్కడ చెయ్యాలి?*


మన ఇళ్ళలో, వాకిళ్ళలో, గుడులలో, బడులలో,  మన గుండెలలో,


*4. ఈ వ్రతంలో మనం చెయ్యవలసినది ఏమిటి?*


ఇది స్నాన వ్రతం అందుకని మనం స్నానం చెయ్యాలి. మనం రోజూ చేసే బాహ్య స్నానం కాక అంతర స్నానం కూడా చెయ్యాలి. బయట చేసే స్నానం శరీరం శుభ్రం చేసుకోవటానికి, లోపలి స్నానం అంతఃకరణ శుద్ధికి. బాహ్య స్నానం రోజూ బ్రాహ్మముహూర్తం ముందు అంటే వేకువన నాలుగు గంటలకు. ఆ తరువాత తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి అయిభగవదనుభవం అవుతుంది. భగవదనుభవమనే ఉత్పుల్ల పంకజ తటాకములో మునిగి, తాను వేరుగా తెలియకుండా ఉండుటే స్నానం అని ఉభయ వేదాంతాలు చెప్తున్నాయి. 


జీవులనే నదులు పరబ్రహ్మమనే సముద్రములో చేరి, దాని నుండి వేరు చేసి చూపుటకు వీలు కానట్లు సాయుజ్యము నందుటయే మోక్షము. 


ఈ వ్రతంలో స్నానం అంటే అర్ధం గోపికలు అందరూ కలసి నంద గోపభవనం చేరి కృష్ణుని కలుసుకోవటమే. పరమాత్మ సేవలలో తరించడమే.


*5. ఈ వ్రతం చేస్తే ఎవరి వలన ఏ ఫలము పొందుతాము?*


శ్రీ కృష్ణ పరమాత్మ మనకు కావలసిన ఇహపర సుఖములను అనుగ్రహిస్తాడు గోపికలకు వలె, మనతో నిత్య సంబంధము కలిగి, మనం చేసే కైంకర్యములను స్వీకరిస్తాడు


ఇవన్నీ పొందేందుకే గోదా గోపిక స్నానము చేసే కోరిక గల వారందరూ రండి అని పిలుస్తోంది. హాయిగా తానొక్కతే వ్రతం చేసుకొని, ఫలం పొందక అందరు గోపికలను ఎందుకు పిలవడం? అంటే - ఒక మంచికార్యం చేసేటప్పుడు పదిమందితో కలిసి చేస్తే అధిక ఫలం అని సంప్రదాయం. అట్లాగే 'ఏక స్వాదునభుంజీత' ఒక మంచి పదార్థాన్ని తానొక్కడే తినరాదు. నలుగురికీ పంచి తాను తినాలి. అందుకే గోదా గోపిక నంద ప్రజములోని కన్నెపడుచులందరినీ పిలుస్తోంది. 

                M.s.s.k

వారు భాగ్యవంతులట! వాడే వారి వాడైనాడు. శ్రీకృష్ణ కైంకర్యమే వారి ఐశ్వర్యము. వారు దివ్యాభరణములను దాల్చి ఉన్నారట. అదేమిటి? స్నానానికి వెళ్ళేవాళ్ళు మంచి ఆభరణములు ధరించడమేమిటి? అంటే వారు చేసేది సామాన్య స్నానం గాదనీ, వారు వేసుకునేవి సాధారణ ఆభరణములు కావనీ తెలుస్తుంది భగవత్ గుణానుభవ స్నానానికి కావలసిన ఆభరణాలు - జ్ఞానము, భక్తి, వైరాగ్యం ప్రాప్యత్వర మున్నగునవి. అందుకే వారిని 'నేర్కై యీర్' విలక్షణమైన ఆభరణములను ధరించిన వారలారా అని గోదా గోపిక పిలుస్తున్నది.


అయితే, ఆ కృష్ణుని చేరడం ఎలా? అతడు నంద గోపుని రక్షణలో నుండును. నంద గోపుడు వాడియైన వేలాయుధము (బల్లెము) పూని, తన కుమారుని సదా కాపాడుచుండును. తల్లి యశోదా దేవి ఒడిలో ఆ కిశోర కృష్ణ సింహము చెంగు చెంగున దుముకుచుండును. ఆమె అందమైన కనుసన్నలలో అతడు మెలగుచుండును.


ఇచట నంద గోపుడే ఆచార్యుడు. ఆయన ధరించే ఉపదేశముద్రయే వేలాయుధము. *మంత్రోమాతా, గురుః పితా - తల్లి యశోద మంత్రము. యశము నిచ్చునది యశోద, ఆనందము నిచ్చువాడు కృష్ణుడు, ఆనందమే కృష్ణుడు. అచార కృపతో మంత్రాధీనమైన భగవంతుడు మనకు అంది వస్తాడు. మనకు ఏది హితలు చూచి అందిస్తాడు.*


మన గోపికలు శ్రీకృష్ణుని రూపమును స్వభావమును స్తుతిస్తున్నారు. కార్మిని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్!' మేఘము వలె నల్లని శరీరము, తామరలు వలె ఎఱ్ఱని కన్నులు, సూర్య, చంద్రుల పోలు ముఖము కలవాడు. 


అది ఇంకా బాగుండాలంటే ఎలా చెప్పాలి? ఒక మేఘముపై రెండు తామరపూవులు, రవి చంద్రుడు ఒకేసారి వికసించారట! ఎందుకండీ? ఇంత గొప్పగా మనం భగవంతుని. కీర్తించడం? మన తక్కువతనాన్ని తెలుసుకోవడానికేనట! ఆ హద్దు ఈ హద్దును తెలుపుతుంది! 


మేఘము తాపహరము, సుశీలము, జీవనప్రదము. శ్రీకృష్ణుడట్టివాడు అతని నేత్రములు స్తుతి పాత్రములు. అవి ఆర్తిని, వాత్స్యలమును, స్వామిత్వమును ప్రకాశింపజేయును. 

              M.s.s.k

ఇక శ్రీకృష్ణుని దివ్యముఖమండలమున సూర్యచంద్రులిరువురు ఒకేసారి కన్పట్టిరట. అంటే భక్తులకు చల్లగా, భక్త విరోధులకు వేడిగా తోచునట! ఆయన అత్యంత సులభుడు, అత్యంత దుర్లభుడు కూడానట.


అట్టి అనంత కల్యాణ గుణములుగల - 'నారాయణనే నమక్కెపరై తరువాన్' నారాయణుడే మనకే 'పర'ను (పురుషార్ధమును) ఇచ్చువాడు. 'పర' అనగా వ్రతము లను కావలసిన వాద్యము. మనకు ఇహపరాలు ఇచ్చేవాడు ఆ నారాయణుడే ఆ శ్రీకృష్ణుడే! నారాయణుడంటే అన్ని పదార్ధముల లోపల వెలుపల వ్యాపించి, వాటిని తనయందు నిలుపగలిగినవాడు.. *'అంతర్ బహిశ్చతత్ సర్వం వ్యాష్య నారాయణ స్థితః, ఆయన 'మనకే' అని నొక్కివక్కాణించడం* ఎందుకంటే - ఆ శ్రీమన్నారాయణుడే మాకు ఉపాయము ఉపేయము అని గట్టిగా నమ్మే ప్రపన్నులకు మాత్రమే తనంతతానుగా అందివచ్చి, నిత్య కైంకర్య భాగ్యమును అందించును.


*పైగా, మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి ఆనందిస్తారు. రండి:*


కల్యాణం చేకూర్చే ఈ వ్రతము మనందరము కలిసి చేద్దాము అని మనల్ని ఆండాళ్ 

ఆహ్వానిస్తోంది.


                M.s.s.k

గోదాదేవి ప్రార్థన*

 🌹🌺🌸🥀🌾🌷💐


*గోదాదేవి ప్రార్థన*


నీళాతుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్యకృష్ణమ్ పారార్థ్యమ్ స్వమ్ శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ స్వోచ్ఛిష్టాయామ్ స్రజనిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే గోదాత స్యైనమ ఇదమిదమ్ భూయ ఏవాస్తు భూయః !


అన్నవయల్ పుదువై యాణ్ఞాళ్ అరంగర్కు

పన్ను తిరుప్పావైప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్

పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై


శూడిక్కొడుత్తాళైచ్చొల్

శూడిక్కొడుతత్తశుడర్కొడియే తొల్పావై పాడి యరుళవల్ల పల్ వళై యామ్ -- నాడినీ

వేంగడవర్కెన్నై విదియెన్ర విమ్మాత్తమ్ నాంగడవావణ్ణమే నల్గు 

        

                   M.s.s.k

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-97- శ్లోకము :


ద్వీపే యోఽస్తాచలోఽస్మిన్భవతి 

ఖలు స ఏవాపరత్రోదయాద్రి-


ర్యా యామిన్యుజ్జ్వలేందుద్యుతి 

రిహ దివసోఽన్యత్ర తీవ్రాతపః 


సఃయద్వశ్యౌ దేశకాలావితి నియమ యతో నో తు యం దేశకాలా-


వవ్యాత్సస్వప్రభుత్వాహిత

భువన హితో హేతురహ్నామినో వః ॥



-97- మత్తేభము :


ఎది యీ దీవిని గ్రుంకుమెట్ట యది

వేర్ద్వీపంబునన్‌ బొడ్పుగ


ట్టెది జాబిల్లి వెలుంగు రేయిటనదే

యింకొక్కచోనుండు మం


డుదినంబెవ్వడు దేశకాలముల

నేఁడున్‌ లోఁచు లోఁగాకహ


మ్మొదవన్‌ హేతువు లోకభద్రకరుఁడా

యుష్ణాంశుడేలున్‌ మిమున్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని దేశ కాలము

   లకు అతీతునిగా

   చెప్పుచున్నారు..]


ఎ(..ఏ)ది , యీ , దీవి ని = ద్వీపము పై , (గ్రుం)క్రుంకు = అస్తమించు , మెట్ట = 

కొండయో ,  (య)అది , వేర్ = వేరొక ,  

+ ద్వీపంబునన్ , ‌ (బొ)పొడ్పు = ఉదయించు , గట్టు = కొండ ;

+ ఎ(..ఏ)ది ,  

< జాబిల్లి వెలుంగు రేయి >  = చంద్రకాంతి తో వెన్నెల రాత్రి , + ఇటన్ =

ఇక్కడనో ,  + అదే , 

< (యిం)ఇకొక్క చో(..ట)న్ ,  + ఉండు , మండు దినంబు > = ఇంకొక చోట

ఎండలో మండునట్టి పగలు ;

+ ఎవ్వడు , (ఈ రీతిగా వేరు వేరుగా తోచు ఆ యా ..) దేశ కాలములన్ = దేశము , కాలములను , 

+ ఏడు న్‌ = (కాలమునకు సంకేతమైన ..) సంవత్సరము (..పొడవునా క్రమము తప్పక ) , 

లోఁచు = (తన..) అధీనమున నుంచుకొనుచు ,  ( వాటికి తాను..) లోఁగాక = అధీనుడు కాకుండా , 

+ అహమ్ము = పగలు / దినము , 

+ ఒదవన్‌ = అగుటకు , హేతువు = 

కారణము (..అయిన) , లోక(..మునకు) , భద్రకరుఁడు = శుభము గూర్చువాడు , 

+ ఆ ,  (యు)ఉష్ణ = వేడి , 

+ అంశుడు = కిరణములవాడు - సూర్యుడు , +[ఏలున్‌ ] , మిమున్ , ఏలున్ = కాచును గాక ..‌✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని దేశ కాలము

   లకు అతీతునిగా

   చెప్పుచున్నారు..]


ఏది యీ ద్వీపమున అస్తమించు కొండయో - అది వేరొక 

ద్వీపంబున ఉదయించు కొండ ;

ఏది యిక్కడ చంద్రకాంతితో వెన్నెల రాత్రియో  -  అదే ఇంకొక చోట

ఎండలో మండునట్టి పగలు ;

ఎవ్వడు ఈ రీతిగా వేరు వేరుగా 

తోచు ఆ యా దేశము , కాలములను సంవత్సరము పొడవునా క్రమము తప్పక 

తన అధీనమున నుంచుకొనుచు - వాటికి తాను అధీనుడు కాకుండా ..

పగలు అగుటకు 

కారణమయినవాడో ..

లోకమునకు శుభము గూర్చువాడు - 

వేడి కిరణములవాడు - ఆ సూర్యుడు మిమ్ములను కాచును గాక ..‌✋️🤚

భగవద్గీత

భగవద్గీత పిడిఎఫ్ కోసం కింద లింకుని ప్రెస్ చేయండి. 


https://drive.google.com/file/d/1zEOs_CBg70Z9irw3f_Hn3WQtmu3g9zYX/view?usp=sharing

ధనుర్మాస

 మిత్రులందరికీ "ధనుర్మాస ప్రారంభోత్సవశుభాకాంక్షలు"

సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి "ధనుర్మాసం"ప్రారంభ మవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసంమొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగు స్తుంది.

కార్తీక మాసం,మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు.  కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాస మంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల "మహాలక్షి" కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

'ధనుర్మాసం' వైష్ణవులకు చాలా ప్రత్యేకమైనది.

 తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. 'సుప్రభాతం' బదులు "తిరుప్పావై" గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని 'బాలభోగం' అంటారు.  ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతు లలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది.సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించ డం చాలా మంచిది.

ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి.

ధనుర్మాసంలో విష్ణువును 'మధుసూధనుడు' అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్ధోజనం అర్పించాలి.

పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్ల తో  పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి "మార్గళి వ్రతం" పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పర లోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.

మన మిత్రులందరికీ ఆ " విష్ణుమూర్తి "కటాక్ష ప్రాప్తిరస్తు  ........

ముఖ్యమైన పండుగలు

 🕉 *మార్గశిర మాసం లో ముఖ్యమైన పండుగలు నిర్ణయం......*🙏

1.తేది.15-12-2020 మంగళవారం రోజున (ధనుర్ సంక్రమణం)

2.తేది.16-12-2020 బుధవారం రోజున (ధనుర్మసారంభం)

3.తేది.20-12-2020 ఆదివారం రోజున (శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)

4.తేది.25-12-2020 శుక్రవారం రోజున (ముక్కోటి వైకుంఠ ఏకాదశి, శ్రీ రంగాది సమస్త విష్ణు క్షేత్రేషు వైకుంఠ ద్వార దర్శనం భాగవత జయంతీ,గీతాజయంతీ)

5.తేది.26-12-2020 శనివారం రోజున (శ్రీ మత్స వాసుదేవ ద్వాదశి)

6.తేది.29-12-2020 మంగళవారం రోజున (శ్రీ దత్తాత్రేయ జయంతి)

7.తేది.30-12-2020 బుధవారం రోజున( శ్రీ రమణ మహర్షి జయంతి, పౌర్ణమి🌕)

8.తేది.1-1-2021 శుక్రవారం రోజున (నూతన ఆంగ్ల సంవత్సరాది)

9.తేది.2-1-2021 శనివారం రోజున (సంకష్టహర చతుర్ధి వ్రతం)

10.తేది.9-1-2021 శనివారం రోజున (సుఫలైకాదశి, సర్వేషాం ఏకాదశి)

11.తేది.11-1-2021 సోమవారం రోజున (మాసశివరాత్రి)

12.తేది.12-1-2021 మంగళవారం రోజున (పితృ తర్పణం,  శ్రాద్ధ తిథి అమావాస్య  రాత్రి  ఉంటుంది⚫)

13.తేది.13-1-2021 బుధవారం రోజున (అమావాస్య ఉదయం 10-54 వరకు ఉంటుంది... కావున మంగళవారం రోజున అమావాస్య)

........................................

🌹🚩 మకర సంక్రాంతి నిర్ణయం🌹🚩

1.తేది.13-1-2021 బుధవారం రోజున ( భోగి పండుగ,గోదా కళ్యాణం)

2.తేది.14-1-2021 గురువారం రోజున (మకర సంక్రాంతి)

3.తేది.15-1-2021 శుక్రవారం రోజున (కనుమ పండుగ)

🌹మకరసంక్రాంతి నిర్ణయం🌹

ఈ సంవత్సరం పుష్య శుద్ధ పాడ్యమి తేది.14-1-2021 గురువారం రోజున పగలు 1-54 ని.లకు శ్రవణ నక్షత్రం వజ్రనామయోగం బాలవ కారణము నందు రవి మకరరాశి ప్రవేశం.మకర సంక్రాంతి పురుష స్వరూపం మూడు శిరస్సు లు, రెండు ముఖములు, నాలుగు నాలుకలు, వికృతమైన శరీరచ్చాయ, నూరు యోజనముల ఎత్తు , పన్నెండు యోజనముల వెడల్పు గలిగిన భీకరాకారం.......

1.అస్యపురుషస్య మిశ్రనామ్- విప్రనాశనము

2.వేపాకు స్నానం-రోగభయం

3.రక్తవస్ర్తమ్- రోగదాయకము

4.చందనగంధలేపనము-విప్రనాశనము

5.జాజిపుష్పమ్- సుశోభనము

6.ముత్యము ఆభరణమ్- శుభదాయకము

7.వెండిపాత్రమ్-సుభిక్షము

8.పాయస ఆహారము-పశునాశనము

9.అరటిపండు భక్షణమ్-ఫలనాశనము

10.భిండి ఆయుధమ్-చతుష్పాత్తులకు నాశనము చేయుట

11.రక్త ఛత్రమ్-మహాయుద్ధము

12.పులివాహనమ్- మృగనాశనము

13.క్రోధముఖమ్-జననాశనము

14.కూర్చోనియుండు-మధ్యార్ఘము

15.దక్షిణదిక్క గమనము-దక్షిణదేశ నాశనము

16.శుక్లపక్షము-దుర్బిక్షము

17.పాడ్యమి తిథి-శుభప్రదము

18.గురువారము-సుభిక్షము, ఆరోగ్యం

19.కాలఫలమ్-విప్రనాశనము

20.మేషలగ్నమ్-జగత్తుకు ఆనందము కలుగును...

🕉అథః మౌఢ్య నిర్ణయం🕉

1.తేది.17-1-2021 పుష్య శుద్ధ చవితి ఆదివారం మొదలు మాఘ మాసం శుద్ధ షష్టి బుధవారం తేది.17-2-2021 వరకు గురు మౌఢ్యమి ఉంటుంది.(కావున భూమి పూజ లు, గృహప్రవేశం లు, నిశ్చితార్థం లు, పెండ్లి లు నుండిజరుపు కోవడం పనికిరావు)

       మరల

2.ఆస్మిన్ వర్షే మాఘ మాసం శుద్ధ తదియ ఆదివారం తేది.14-2-2021నుండి స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి బుధవారం తేది.28-4-2021 రోజున శుక్రమౌఢ్యమి నివృత్తి, అయిపోతుంది)

........................................🕉 స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ తదియ గురువారం తేది.29-4-2021 రోజు నుండి శుభకార్యములు ప్రారంభం జరుపుకోవాలి...

🕉 శుభం-భవతు🕉

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దీర్ఘాయుష్మాన్ భవ

 దీర్ఘాయుష్మాన్ భవ అంటే?


చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు. 


“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”


మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు. 


”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు. 


”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం. 


మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు. 


పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.


సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ  మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.


వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు. 


”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం. 


ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తలరాత

 Forwarded.....


ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. 

అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజని తెలియదు. 

యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. 

ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే,

కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు *నీళ్లు* ఇచ్చి దాహం తీర్చాడు. 


నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమునిని... కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, యమధర్మరాజు ఆ వ్యక్తికి  ఒక *డైరీ* ఇచ్చారు. 

నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే *జరిగి తీరుతుంది* 

కానీ గుర్తుంచుకో... 

నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే....

ఆ వ్యక్తి  ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. 


మొదటి పేజీలోనిది చదివాడు... 

అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు. 


తర్వాత పేజీ చదివాడు...

"తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది " అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.


 తర్వాత పేజీలో "తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,


ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ....

ఏదో వొకటి రాస్తూ...

 

చివరికి...! 

ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా... 

ఈలోపే  యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి  డైరీని తీసుకుని, 

నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. *నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే, నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు* 

నీ యొక్క మృత్యువు  నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు  యముడు. 

ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.


 ఈ కథ యొక్క *అర్థం* ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో *అద్భుతమైన అవకాశాలను*

తానే స్వయంగా గానీ...

బంధుమిత్రులు,

శ్రేయోభిలాషులు, 

ఇరుగుపొరుగువారు,

బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. 

కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ *ఇతరులకు చెడు చేస్తూ* మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. 

ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా *భగవంతుని కృప నిండి ఉంటుంది.* 


ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి  

"మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి" అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. 

కానీ మనము పర చింతన చేస్తూ సమయము  వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం... 


అందరూ బాగుండాలి... 

అందరిలో నేనుండాలి...

సర్వేజనా సుఖినోభవంతు!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే

 ఆంధ్రప్రదేశ్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు - జనవరి 1 నుంచి అమలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెరగనున్నాయి. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

 

కొత్త చట్టం ప్రకారం విధించే జరిమానాల వివరాలు:

 

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. హెల్మెట్ లేకుండా నడుపుతూ రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా. 

* మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ.5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ.2 వేలు జరిమానా. ఇవి లేకుండా రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు, ఓవర్ లోడ్​కు రూ.20 వేల జరిమానా.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానా.

* పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

కొబ్బరికాయ కొట్టడం

 🍀🍀🍀🍀🍀🍀🍀🍀     దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం వల్ల అర్ధం ఏమిటి? అంటే తమోగుణ ప్రధానమైన అహంకారం అనే పెంకును పగలకొట్టాలి. రజోగుణ ప్రధానమైన సంపదను అంటే గుజ్జును అంటే కొబ్బరికాయ లో ఉండే గుజ్జు అన్నమాట. సత్త్వగుణ ప్రధానమైన కొబ్బరికాయ లోని నీళ్లు దేవుని కి సమర్పించాలి. అందుకే మన పూర్వీకులు కొబ్బరికాయ ను ఎన్నిక చేశారు. వారు ఏంచేసినా అర్థం, అంతర్ధం ఉంటుంది.           🍀🍀🍀🍀🍀🍀🍀🍀      దేవుడి కి అరటిపండు సమర్పించడంలో అర్థం ఏమిటి? అంటే అరటి చెట్టు తన జీవితకాలం లో ఒకే ఒక్క సారి అరటి గెలను ఇస్తుంది. అలా వచ్చిన అరటిపండ్లు ను ఆ భగవంతుని కి సమర్పించు కొంటున్నాము. 84లక్చల జీవరాశులలో మానవ జన్మ ఒక్క సారే వస్తుంది. అరటిపండ్లు ను ఆదర్శంగా తీసుకుని నిన్ను నీవు భగవంతుని కి సమర్పించుకో అని అర్థం. మన ఆచారాలను గౌరవించండి. వాటిని పాటించండి. మనం పాటించితే మన పిల్లలు, మనవలు చూసి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

సేకరణ 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

మొగలిచెర్ల

 *స్వామివారి నిజరూప ప్రతిమ..(రెండవ భాగం)*


సరిగ్గా స్వామివారి ఆరాధన పదిరోజుల ముందు..శ్రీ స్వామివారి ప్రతిమ మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరింది..ఆ ప్రతిమను ఒక గాజు పేటిక లో పెట్టి, మంటపం లో ఉంచితే..భక్తులందరూ చూడటానికి అనువుగా ఉంటుందని భావించాము..భక్తులందరికీ చక్కగా...ఏ వైపు నుంచి చూసినా.. కనబడే విధంగా పేటిక కావాలి..తయారు చేసే పనివాళ్లను పిలిపించాము..కొలతలు తీసుకొని వెళ్లారు..నాలుగైదు రోజుల్లో తయారు చేసి ఇస్తామన్నారు..సరే అన్నాము..


రెండు రోజులు గడిచిపోయాయి..ఒంగోలు నుంచి రామచంద్ర శర్మ గారని దత్తభక్తులు వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అయిన తరువాత..స్వామివారి విగ్రహానికి పేటిక తయారు చేసే ఖర్చును భరించే అవకాశం తనకు ఇవ్వమని అడిగారు..ఏ సమయానికి ఎవరితో పని అవుతుందో వారిని శ్రీ స్వామివారే పిలిపించుకుంటున్నారని అర్ధం అయింది..పైగా ఇది స్వామివారి ఆదేశం అనిపించింది..రామచంద్ర శర్మ గారికి ధన్యవాదములు చెప్పాను..తనకు ఆ అవకాశం కలగడం తనకు అదృష్టంగా భావించారాయన..ఆ మాటే నాతో చెప్పారు.


"అయ్యా..స్వామివారి నిజరూప విగ్రహం వచ్చింది..గాజు పెట్టెలో పెడదామని అనుకుంటున్నాము కదా...అందులో స్వామివారి పాదుకలు కూడా తయారు చేయించి పెడితే బాగుంటుంది కదా..మీరు ఆలోచన చేయండి.." అని మా అర్చకులు చెప్పారు..నాకూ ఆ ప్రతిపాదన నచ్చింది..


"సరే..రేపు పాదుకల గురించి ఆలోచిద్దాము.." అని చెప్పి సింగరాయకొండ కు వచ్చేసాను..


ఆరోజు రాత్రి తొమ్మిదిగంటలకు అష్రాఫ్ జాన్ అనే ముస్లీమ్ యువతి (ఈ అష్రాఫ్ జాన్ గారి గురించి ఇంతకు ముందు ఒక పోస్ట్ లో పాఠకులకు పరిచయం చేసి వున్నాను..)  ఫోన్ చేసి.."స్వామివారి మందిరం లో ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటున్నాను..సాధ్యమైనంత వరకూ అది స్వామివారి విగ్రహం వద్దే ఉండాలని అనుకుంటున్నాను..మీరేదైనా సలహా ఇస్తారా..? " అని అడిగింది.. నామనసులో పాదుకలు అడగాలి అనే ఆలోచనే రాలేదు..తీర్ధం వేసే చిన్న పాత్రలు, హారతి పళ్లెం, శఠారి..ఇత్యాదులు గుర్తుకొస్తున్నాయి కానీ మరేమీ నా తలకాయలో తట్టడం లేదు.."అమ్మా..రేపుదయం చెపుతాను.." అన్నాను..సరే అన్నది..


ప్రక్కరోజు ఉదయం ఏడు గంటలకల్లా తిరిగి ఆ అష్రాఫ్ జాన్ నాకు ఫోన్ చేసి.." ప్రసాద్ గారూ..ఈ తెల్లవారుజామున స్వామివారు నా కలలో దర్శనం ఇచ్చారు..నిజమండీ..నన్ను తనకు పాదుకలు చేయించి ఇవ్వమన్నారు.." అని ఉద్వేగంతో చెప్పింది..


నేను ఆశ్చర్యం తో ఏమీ మాట్లాడలేకపోయాను..నేను సరిగా వినలేదు అనుకోని..మళ్లీ చెప్పింది.."నీ అదృష్టం తల్లీ.." అన్నాను..అంతకు మించి ఏమనాలో కూడా తెలియలేదు..తన విగ్రహం తో పాటు తనకు పాదుకలు కూడా కావాలని స్వామివారే కోరినట్లు నాకు తోచింది..


"అమ్మా..శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ ను తయారు చేయించాము..ఆ విగ్రహం వద్ద మీరు చేయించబోయే పాదుకులను ఉంచుతాము..స్వామివారే మీతో చెప్పి చేయించుకున్న తరువాత..అంతకంటే సరైన ప్రదేశం ఎక్కడుంటుంది?..మీరు చేయించండి.." అన్నాను..


"వెండిపూత కూడా వేయించి తీసుకొస్తాను..నాకూ ఆనందంగా ఉంది..మీకు కృతజ్ఞతలు చెప్పాలి.." అన్నది..అన్నమాట ప్రకారం పాదుకలు తయారు చేయించి, వాటికి వెండితో పూత కూడా వేయించి భక్తిగా సమర్పించింది..


శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవానికి వారం రోజులముందే స్వామివారి ప్రతిమ అన్నివిధాలా తయారైపోయింది..ఈ ఆలోచనకు ముఖ్యకారకుడైన జయచంద్రకు నేను ఫోన్ చేసి, ఆరాధన నాటికి శ్రీ స్వామివారి మందిరానికి రమ్మనమని చెప్పాను..ఆ ప్రతిమను తయారు చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా వస్తున్నారని..ఆర్ధికంగా తోడ్పాటు అందించిన చీమలదిన్నె అంకయ్య నూ ఆరోజుకు రమ్మనమని చెప్పానని జయచంద్ర చెప్పారు..


మే నెల 11 వతేదీ వైశాఖ శుద్ధ సప్తమి..ఆరోజు శ్రీ స్వామివారి ఆరాధన..ఆ రోజు  శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమను అర్చకస్వాములు శాస్త్రోక్తంగా మంత్రపఠనం చేస్తుండగా ఆవిష్కరించాము..సాక్షాత్తూ శ్రీ స్వామివారే కూర్చుని ఉన్నట్లు గా ఉందని..ఆ విగ్రహాన్ని చూసిన పలువురు భక్తులు వ్యాఖ్యానించారు..


శ్రీ స్వామివారు తన ప్రతిమను తన భక్తుల ద్వారా తానే చేయించుకున్నారని మేము భావించడం లో ఎటువంటి సందేహమూ లేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

విద్వాన్ సర్వత్ర

 విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్. విద్యావంతుడు సమస్త విశ్వ ములో పూదనీయుడు. విద్య అనగా యత్ వి ద విలక్షణమైన ద అగ్ని తత్వమును తెలియుడు. విశిష్టమైన అగ్ని దేశమునందు కలదా లేక విశ్వమంతా కలదా. అని పరిశీలన చేసిన విశిష్టమైన అగ్ని ఈశ తత్వ మని అది తెలియుట విద్య యని, విద్య అనే అగ్ని అమృత తుల్యమని యిది తెలియుట కయతప్ప వేరు అమృత తత్వము లేదని మంత్ర పుష్పం రూపంలోగల ఋగ్వేద మంత్రం తెలుపుచున్నది. యిదే తత్వము అయినా సర్వ వ్యాప్తమైనదని. అయనాయ అన్నది అయనాంశయని జ్యోతి ఉష, శాస్త్రము కూడా చెప్పుచున్నది. కారణమును అయనంశలవలననే అదియును భూవైశాల్యమువలననే తెలియును. అన్నింటికి భూమి కారణం భూమి గురించి మంత్ర పుష్పం తెలుపుచున్నది. అది పంచభూతాక్మకమైన శరీరముతో గూడిన జీవ ధర్మమని ప్రకృతిలో ఎవరూ శోధన చేయకుండానే ప్రకృతి ద్వారా మనకు సూత్ర పరంగా వివరించి యున్నారు. అనుభవైక వైద్యమే సూత్రమని వేరు సూత్రములు ఎక్కడా లేవని అనగా వక పద్ధతి ప్రకారం అగ్నిరూప దేహమును అమృత తుల్యంగా మార్పును కూడా మంత్ర పుష్పం మంత్ర పాఠము తెలుపుచున్నది. అన్నీ ఆ పరమేశ్వర తత్వము నీరు, గాలి, నిప్పు ఆకాశము మెుదలగు తత్వములను తెలియుటయే ప్రధమ కర్తవ్యం. అవి మనదేహరూపములో నున్నవని దానికి సూర్యాస్తమయములు చక్కని వివరణ ప్రత్యక్షంగా.

ఘన విజయం

 16 డిసెంబర్ 1971 


భారత సైనికుల ఘన విజయం


ప్రపంచ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత దేశానికి లొంగిపోయారు.  భారత ఆర్మీకి చారిత్రక రోజు.


ఉక్కు మహిళగా భారత ప్రధాని ఇందిరాగాంధీకి కీర్తి తెచ్చిపెట్టిన సంఘటన ఇది. ఈ విజయంతో ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట ఇనుమడించింది.  బంగ్లాదేశ్ విముక్తి పొందింది. 


భారత సైనిక జనరల్ జగ్జిత్ అరోరా ఎదుట లొంగిపోతున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్న దృశ్యం.

ద్రాక్షారామం

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

ద్రాక్షారామం :-స్వామి :-భీమేశ్వరుడు,

అమ్మ వారు :-మాణిక్యాంబదేవి

రూపం:-తత్పురుషరూపము(ఆత్మ స్వరూపము)

ప్రతిష్ట :-స్వయం భువు

తారకాసురుని మెడలోని అమ్రుత లింగము యొక్క ద్వితీయ ఖండము పడిన ప్రదేశమే ద్రాక్షారామం. ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందినది. ఈ క్చేత్రములో పరమేశ్వరుడు తత్పురుషముఖ రూపుడై స్వయంగా ప్రతిష్టుతుడు అయినాడు ఈ క్చేత్రములో పడిన అమ్రుతలింగ ఖండము ను ప్రతిష్ట చేయడానికి సూర్యుడు నియమింపబడినాడు. ఈ ప్రతిష్ట చేయడానికి పవిత్ర గోదావరి జలాలు తో అభిషేకించడానికి సప్తఋషులను దేవతలు పంపించారు. ఆ ఋషులు గోదావరి మాతను ప్రార్ధించి ఆ నదీమతల్లితో వస్తూంటే దారి లో ఉన్న తుల్యమర్షి ఆశ్రమము మునిగిపోయింది. ఆ ముని కోపం తో శపించారు. అప్పుడు గోదావరి మధ్యవర్తిగా ఉండి దైవకార్యము యొక్క ప్రయోజనం తెలిపి మునులను ఋషులనూ శాంతపరచి అంతర్వాహిని గా ద్రాక్షారామం చేరుకుంది. అదే సప్తగోదావరి. ఆ కార్యక్రమం ఆలస్యం అయినందున శివుడు తనంత తానుగా ప్రతిష్ఠితుడైనాడు. సూర్యుడు ప్రధమ అర్చన చేశాడు. సూర్యుడు భూమిపై ఏవిధంగా ప్రకాశించునో, అదేవిధంగా ద్రాక్షారామం స్వయం ప్రకాశమై రెండవ కైలాసం గా వెలుగొందగలదని వరమిచ్చినాడు. అప్పుడు అక్కడ గర్భగృహము అంతా కూడా భరించలేని వేడి పుట్టింది. అది భరించలేక దేవతలు, ఋషులు పరమేశ్వరుని వేడుకున్నారు. అప్పుడు అశరీరవాణి ఈవిధంగా పలికింది. "పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టుతుడై సూర్యుని  ప్రపధముగా అర్చించుటవలన ఈ వేడి పుట్టింది. ఈ క్చేత్రమునకు అష్ట దిక్కులలోనూ సోమేశ్వర లింగములు ప్రతిష్ట చేస్తే ఈ వేడి తగ్గుతుంది అని చెప్పింది

           రవాణి తెల్పిన ప్రకారం సప్త ఋషుల అష్టదిక్కుల లోనూ

సోమేశ్వర లింగములు ను ప్రతిష్ఠించి తమతో తీసుకువచ్చిన సప్తగోదావరి తీర్థజలములతో అభిషేకించారు. తూర్పున సూర్యుడు, ఆగ్నేయమున కశ్యప మహర్షి, దక్షిణ దిశలో అత్రిమహర్షి నైరుతి లో భరద్వాజ మహర్షి, పడమర విశ్వామిత్రుడు, వాయువ్యములో గౌతమ మహర్షి ఉత్తరము న వశిష్ఠ మహర్షి ఈశాన్య భాగము న జమదగ్ని మహర్షి ప్రతిష్టించారు.

      ఇక్కడ అమ్మ వారు మాణాక్యాంబాదేవి, అష్ఠాదశశక్తి పీఠాలలో పన్నెండవ పీఠముగా ప్రఖ్యాతి గాంచినది. ఆదిశంకారాచార్యులవారిచే ప్రతిష్ఠంపబడిన శ్రీ చక్ర రాజిస్తితమైన మాణిక్యాంబ అమ్మ వారి దివ్య పాదారవిందములను శ్రీ చక్ర మేరువును ఏకకాలంలో దర్శించుకోవచ్చును. భక్తుల పాలిట కల్పతరువు అయిన ఈ అమ్మవారి కి వేలాదిమంది భక్తులు నిత్యమూ కుంకుమార్చనలు జరిపించుకుని అమ్మవారి క్రుప కటాక్షము లకు పాత్రులగుచున్నారు. ఈ దివ్య క్చేత్రములో సూర్యుని ప్రధమార్చన అగుటచేత ప్రతీరోజూ ఉదయమూ సాయంత్రం యందు సూర్య భగవానుని కిరణాలు స్వామి పాదములు చెంత పడతాయి. సశేషం

తిరుపావై

 *తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*


*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.* శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?

=గోదాదేవి.


*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

=శ్రీ విష్ణు చిత్తులు.


*5.* ఆళ్వారులు ఎంతమంది?

=12మంది.


*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

=భూదేవి.


*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

=తమిళ భాష.


*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

=నాలాయిర్ దివ్యప్రబంధము.


*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

=108.


*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

=శ్రీవిల్లిపుత్తూరు.


*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

=196 అడుగులు.


*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

=మూడవ పాశురం.


*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

=తిరుసాదము.


*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

=కోదై (గోదా)


*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

=గరుడాంశము.


*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=శ్రీవ్రతము.


*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

=పరమాత్మ చేతిలోని శంఖమువలే.


*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

=మన్మధుని


*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

=సింహం పిల్లవలె.


*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

=ధృడమైన కోరిక, పట్టుదల.


*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

=మొదటి పాశురం.


*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

=రెండవ పాశురం.


*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

=వామన అవతారం.


*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?

=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=మూడు.


*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

=యమునా నది.


*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

=దానగుణం.


*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

=వర్షానికి.


*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

=ఐదవ పాశురం.


*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=నమ్మళ్వారు.


*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=బుద్ధివ్రతం.


*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

=పిళ్ళాయ్ (పిల్లా).


*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

=ఆళ్వార్లతో.


*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వారు.


*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

=భరద్వాజ (చాతక) పక్షులు.


*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*43.* మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?=పక్షులు.


*44.* ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

=నమ్మళ్వారు.


*45.* పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

=శిరువీడు.


*46.* భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*47.* అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

=కుంభకోణం.


*48.* పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=ప్రీతి వ్రతం.


*49.* కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వార్.


*50.* పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

=శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51.* పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

=బకాసుర వధ.

 

*52.* సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

=త్యాగం.


*53.* శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుప్పాణి.


*54.* తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

=భగవద్రామానుజులు.


*55.* తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

=నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు”.


*56.* శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

=అహంకారమును హతమార్చుట.


*57.* పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

=దాస్య వ్రతము.


*58.* గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

=నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59.* కోయిల్ అనగా ఏమి?

=కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60.* నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

=దాన గుణము.


*61.* గోపికలు ఎంబెరుమాన్ (మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

=నందుడు.


*62.* భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుమంగై యాళ్వారు. 


*63.* గోపికలు తమ వంశమునకు ‘మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

=యశోద.


*64.* శెంపొర్కజలడి-ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

=బలరాముడు. 


*65.* నీళాదేవి ఎవరు?

=కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66.* యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67.* భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

=పేయాళ్వారు.


*68.* ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

=ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69.* భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

=18 వ పాశురం.


*70.* లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

=18వ పాశురం.


*71.* శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

=కువలయాపీడము.


*72.* అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73.* గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

=అద్దము, విసనకఱ్ఱ.


*74.* తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

=కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75.* ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

=మృగరాజగు సింహము.


*76.* ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

=అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77.* పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

=సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78.* పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

=సింహ గర్జన.


*79.* కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

=మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80.* కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

=వెలగ చెట్టు.


*81.* ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=భోగవ్రతము.


*82.* ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

=శ్రీవిల్లిపుత్తూరు.


*83.* పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

=పాంచజన్యము.


*84.* ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు?

=సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85.* ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

=కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86.* భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

=గోవింద.


*87.* భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88.* కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

=సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89.* గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

=ఆవుల వెనుక.


*90.* ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

=27 వ పాశురం.


*91.* పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

=శ్రీకృష్ణునివి.


*92.* భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

=దాసుని లక్షణములు.


*93.* 'అజాయమానః' (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

=విష్ణుపోతము


(విష్ణువనే ఓడ)


*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

=ఆయన దాసులే గొప్ప.


*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

=ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

=అయోధ్య.


*98.* వజ్గం అంటే ఏమిటి?

=ఓడ.


*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

=అమృత కలశం.


*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101.* గోపికల దివ్యాభరణములేవి?

=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105.* తిరుప్పావై ఎటువంటి మాల?

=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=తొండరపడిప్పొడి

యాళ్వార్.


*జై శ్రీమన్నారాయణ!*

*ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్*