16, డిసెంబర్ 2020, బుధవారం

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే

 ఆంధ్రప్రదేశ్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు - జనవరి 1 నుంచి అమలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెరగనున్నాయి. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

 

కొత్త చట్టం ప్రకారం విధించే జరిమానాల వివరాలు:

 

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. హెల్మెట్ లేకుండా నడుపుతూ రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా. 

* మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ.5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ.2 వేలు జరిమానా. ఇవి లేకుండా రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు, ఓవర్ లోడ్​కు రూ.20 వేల జరిమానా.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానా.

* పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

కామెంట్‌లు లేవు: