16, డిసెంబర్ 2020, బుధవారం

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*55.సుమేరు మధ్య శృంగస్థా*


కామేశ్వరుని వామభాగములో వుండే దేవి వుండే ఇతర స్థానములు ఇప్పుడు చెప్పబడతవి. శ్రీమాత మేరుపర్వత మధ్యములో గల శిఖరముపై వెలసి వుంది. ఆ శిఖరమంతా. బంగారు శిఖరము. మేరుపర్వతాన త్రికోణములవలే మూడు శిఖరములు వున్నాయి. వాని మధ్యను నాలుగవ శిఖరంవుంది. అదే మాత నివాసస్థానం.


ఆ శిఖరమున గల బంగారు పొదరిళ్ళలో దేవతలు సంగీతము పాడుతుంటారు. దానికి తూర్పున నైరృతిదిక్కున, వాయువ్య దిక్కున మూడు శిఖరములు వున్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకములకు ఆధారమైనవి. వాటికి మధ్యన రత్న కాంతులతో దిక్కులన్నింటినీ వెలిగిస్తూవున్న శిఖరముపై శ్రీమాత నివసిస్తుంది .


మానవ శరీరమున వెన్నెముకను మేరువు అంటారు. బ్రహ్మరంధ్రము దానికి గల శిఖరమునకు పై భాగము "సహస్రారము”. ఆ సహస్రారము ఒక కమలము. ఆ కమలములో శ్రీమాత నివసిస్తుంది


కం|| ఘనమా సుమేరు మధ్యన, మనసారగ, నధివసించు మంగళగౌరీ వినగా నది సిరులొలికే

కనకమయపుశృంగ మహిమ కనగా వశమే!!


        లలితానామసుగంధం

                  M.s.s.k

కామెంట్‌లు లేవు: