17, ఆగస్టు 2020, సోమవారం

నిధి ఉన్న బిచ్చగాడు : మంచి కథ

🍁 ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.

🍁 ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......

🍁 బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

🍁 తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.

🍁 ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలం…
*************
: బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి...నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.

మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.

హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే, కామేశ్వర్యై చ ధీమహి, తన్నోబాలా ప్రచోదయాత్.

: హరిఓం  ,
*******************

 ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.
ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.
ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం. సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా! కనుక భేదం లేదు.
ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు. ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.
ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి. దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు. ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.
శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.
వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు.ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.

ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు. నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.
ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం. కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ. ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.
అతిథి తృప్తిపడినప్పుడు ‘అన్నదాతా సుఖీభవ’ అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.
అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు. సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం. అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది............                        -                    🙏🙏🙏       

***************************           -

ఆనంద యోగం
సంతోషం మానసిక ఉద్వేగం. అది మనిషికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనిషికి కావాల్సింది సంతోషం కాదు... ఆనందం. కొంతకాలం మనిషికి హాయి చేకూర్చే సంతోషంకన్నా ఎప్పటికీ తరగని ఆనందం ప్రశాంతతనిస్తుంది.
ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, చాలాకాలం తరవాత బంధుమిత్రులు కలిసినప్పుడు, కోరినది లభించినప్పుడు సంతోషం తాండవిస్తుంది. ఒక సమయంలో అత్యంత సంతోషాన్ని కలిగించినవే మరొకప్పుడు విసుగు, చిరాకు, ఆందోళనలకు గురిచేస్తాయి. సంతోషం సగం బలం. ఆనందం పూర్తి అభయం.

సంతోషం వస్తుంది, పోతుంది. ఆనందం వస్తుంది, పెరుగుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఆనందం మాటలతో వర్ణించలేనిది. హృదయాన్ని పరవశింపజేసే దివ్య వరం. పరమాత్మ ఆనందస్వరూపుడు. భగవంతుడితో సాంగత్యమే ఆనందపు హరివిల్లు. మనిషికి ఈ లోకంలో ఆనందం పంచేందుకు అమ్మను, ప్రకృతిని సృష్టించి దాన్ని అందుకునే ప్రేమ హృదయాన్ని అందించాడు. బృందావనంలో గోప, గోపికల ఆనంద పారవశ్యం శ్రీకృష్ణుడి సాహచర్యఫలమే.

రాసక్రీడల ఆంతర్యం భగవంతుడితో కలిగే ఆనందానికి ప్రతిరూపం.

భృగుమహర్షి బాల్యంలో భగవంతుణ్ని తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించాడు. మొదట అన్నం పరబ్రహ్మస్వరూపంగా, ప్రాణం భగవన్మయంగా, ప్రకృతినే పరమేశ్వర రూపంగా భావించాడు. చివరకు భగవంతుడే ఆనందంగా గుర్తించాడని భృగువల్లి పేర్కొంది.

తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి ఆనంద స్వరూపాన్ని మూడు విధాలుగా వివరించింది. మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందంగా గుర్తించింది. లోకంలోని అనేక ఆకర్షణలు, అనురాగాలు, బాంధవ్యాలు మనుష్యానందానికి చెందినవి. దేవతారాధన, పూజలు, దానాలు, వ్రతాలు... వీటి వల్ల లభించే ఆనందం గంధర్వానందం.

నిజమైన ఆనందం పరమాత్మ సాంగత్యంలో లభిస్తుంది. ప్రకృతిలో, పంచభూతాల్లో, సూర్యచంద్రుల్లో నిండి భూమిపై గల సర్వప్రాణులకు జీవనాధారాన్ని ప్రసాదించే పరమాత్మ అనుగ్రహ వీక్షణమే బ్రహ్మానందం. సృష్టి సమస్తం బ్రహ్మమయం. దాని ప్రాణాధారమే బ్రహ్మానంద స్థితి. మనిషి సంతోషం నుంచి ప్రయాణం సాగించి బ్రహ్మానందస్థితికి చేరాలని ఆనందవల్లి బోధించింది.

పరమాత్మను హృదయంలో అంతర్యామిగా దర్శించాలి. దానికి సాధనామార్గాలు- ధ్యానం, జపం, పూజ, తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలు. నిరంతరం జీవనపోరాటంలో అలసిపోయే సంసారులకు యోగమార్గాలు ఆకాశదీపాలే.


సామాన్యుల కోసం అయిదు మానవతా విలువలను ఆచరణ మార్గాలుగా వేదం ప్రకటించింది. అవే- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. వాటిని నిత్యజీవితంలో అనుసరించి ప్రతి పనినీ భగవంతుడి ప్రీత్యర్థం కావిస్తే ఆనందానికి మనిషి సులువుగా చేరుకుంటాడు.

మంచినే చూడు, మంచినే విను, మంచినే మాట్లాడు అని మూడు కోతి బొమ్మలతో ఆనందరసానుభూతిని చూపు, శ్రవణం, మాటతో పొందవచ్చనే సందేశాన్ని గాంధీ మహాత్ముడు అందించాడు. మనిషి తన జీవితపరమపద సోపానం సంతోషం అనే మొదటి గడి నుంచి ప్రారంభించాలి. ఆరు దుర్గుణాలనే పాములను తప్పించుకోవాలి. మానవతావిలువలు అనే అయిదు నిచ్చెనలను అధిరోహించాలి. చివరకు బ్రహ్మానంద స్థాయి అయిన చివరి గడిని చేరాలి. అదే పరిపూర్ణ ఆనందజీవితం!
***********************
  యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః
సేవ్యతా  మక్షయో ధీరాసశ్రియైచా మృతాయచ
హి ధీరా= ఓ!విద్వాంసులారా జ్ఞానదయా సింధో= జ్ఞానమునకు,దయకు ను ఆశ్రయ భూతుడైన, అగాధస్య=గంభీరుడైన, యస్య=ఏ దేవుని యొక్క, గుణాః=గుణములు అనఘా= రాగాది  దోషములు లేనివో
అక్షయ=నాశ రహితుడైన, సః = ఆదేవుడు, శ్రియైచ= సంపదకోరకును, అమృతాయచ= మోక్షము కొరకు, సేవ్యతాం= సేవింప బడు గాక యిది పరమాత్మ పరమైన అర్థము.సముద్ర పక్షమందు
యస్య=ఏ, అగాధస్య= లోతైన,సింధో= సముద్రుని యొక్క,,గుణాః =రత్నాకరత్వాది గుణములు,  అనఘాః=నిర్దోషము లైనవో  అక్షయ= విష్ణువుకు నివాసమైన సః =ఆ సముద్రుడు, శ్రియైచ=లక్ష్మీదేవి కొరకు
అమృతాయచ =అమృతము కొరకు సేవ్యతాం= సేవింప బడుగాక
అనగా పూర్వము దేవతలు సముద్రమును (మధించి) సేవించి లక్ష్మీ దేవిని, అమృతమును బడసి నట్టు భగవంతుని సేవించు వారలు ధర్మార్థ కామము లనెడి త్రివర్గ సంపదను ,మోక్షమును పొందుదురని తాత్పర్యము.
పూర్వము సంస్కృత పాఠం వినడం యిష్టం లేని కొంత మంది కొంటె కుర్రవాళ్ళు
"యస్య జ్ఞాన దయాసింధో గొడదాటితే అదే సందో " అని గోడ దూకి పారిపోయేవారట
***********************

చెట్టు పంచిన స్నేహం - కధ



పార్వతీపురం అనే ఊళ్లో రామయ్య, సోమయ్య పక్క పక్క ఇళ్లల్లో ఉండేవారు. వీళ్ల ఇళ్లకు మధ్యన ఓ మామిడి చెట్టు ఉండేది. రామయ్య ఆ చెట్టుకు చాలా శ్రద్ధగా నీళ్లు పోస్తే... సోమయ్య ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్లకు ఆ చెట్టు నిండా మామిడి కాయలు విరగ్గాశాయి. దాంతో ఇద్దరూ ఆ కాయలు మావంటే మావని గొడవ పడడం మొదలుపెట్టారు.

చివరకు  ఇద్దరూ కలిసి న్యాయం కోసం ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. ‘మామిడి చెట్టులో ముప్పావు వంతు కొమ్మలు నా ఇంటివైపే ఉన్నాయి. కాబట్టి ఆ కాయలు నావే’ అన్నాడు సోమయ్య. ‘నేను రోజూ దానికి నీళ్లు పోశాను కాబట్టి కాయలు నావే...’ అన్నాడు రామయ్య. 

అంతా విన్న ఊరిపెద్ద మర్నాడు రమ్మని వాళ్లిద్దరినీ పంపించేశాడు. వాళ్లు వెళ్లిన అరగంటకు ఊరిపెద్ద తన దగ్గర పనిచేసే ఓ సహాయ కుడిని పిలిచి... ఇద్దరిళ్లకూ వెళ్లి మామిడికాయల్ని ఎవరో దొంగతనంగా కోసుకుంటున్నారని చెప్పమన్నాడు. ఆ పని వాడు మొదట సోమయ్య దగ్గరకు వెళ్లి... ఊరిపెద్ద చెప్పమన్నట్లే చెప్పాడు.

సోమయ్య ‘నేను ఖాళీగా లేను. తరవాత చూస్తా...’ అంటూ సమాధానమిచ్చాడు. తరువాత రామయ్య దగ్గరకు వెళ్లిన పనివాడు అదే విషయాన్ని చెబితే అతడు కర్ర తీసుకుని గట్టిగా అరుస్తూ ఇంటిబయటకు  వచ్చాడు.

సహాయకుడు ఇదే విషయాన్ని ఊరి పెద్దకు చెప్పడంతో అతడు మర్నాడు ‘చెట్టు ఎటువైపు ఉన్నా.. దాన్ని ఎవరు శ్రద్ధగా పెంచారో అది వాళ్లకే చెందుతుంది. కాబట్టి ఆ కాయల్ని కోసుకోవడానికి రామయ్య మాత్రమే అర్హుడు. అతడు ఇష్టపడి ఇస్తే సోమయ్య కూడా కొన్ని కాయలు తీసుకోవచ్చు’ అని చెప్పాడు.

ఆ తీర్పుతో ముఖం ముడుచుకున్న సోమయ్య దగ్గరకు రామయ్య వచ్చి, ‘కాయలు ఇద్దరం సమంగా తీసుకుందాం. ఇక నుంచీ చెట్టు సంరక్షణ కూడా  కలిసి చేద్దాం’ అన్నాడు. 

రామయ్య మంచితనం చూసిన సోమయ్య అప్పట్నుంచీ రోజూ చెట్టుకు నీళ్లుపోస్తూ రామయ్యతో స్నేహంగా ఉండసాగాడు.🍁
********************

గణపతి #వినాయకుడు


#గణపతి #వినాయకుడు #గణపతివైభవం #వినాయకవైభవం
గణపతి వైభవం:-
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఓం శ్రీ గురుభ్యోనమః
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ 
కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్  

ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము.  ఈ భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు గజాననునికి విఘ్నాదిపత్యంబొసంగబడియెను.  అందువలన ఈ స్వామి శుభాశిస్సులకై  ప్రతి సంవత్సరం ఈ  రోజున మనం ఈ  పండగ జరుపుకొంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యము తలపెట్టము. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నాడు.  ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు  నిర్విఘ్నముగా నెరవేరుతాయి విఘ్ననిర్మూలనముకై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్య మూర్తియై నిలిచాడు. 

వినాయకచతుర్థి రోజు అందరు ప్రాఃతక్కాలమునే నిద్రమేల్కాంచి అభ్యంగన స్నానమాచరించి పట్టువస్త్రాలను ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి  ఇష్టమైన కుడుములు, అపూపములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకధను చదువుకొని, కధాక్షతలని శిరస్సున ధరించి, భ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరు కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసులగ్నం చేసి, ఎంతో భక్తిశ్రదలతో ఈ పండగను మనం జరుపుకుంటాము.  ఇది మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ.

ప్రశ్న:-
అసలు ఈ గణపతి ఎవరు - ఈ  గణాధిపత్యం అంటే ఏమిటి ?
 సమాధానము:-
ఓం గణానాం త్వా గణపతిగ్o  హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!
జ్యేష్టరాజం బ్రహ్మణాo  బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !
మహాగణపతియే  నమః ।। ఓం ॥ 
గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలమునుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత , వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై  శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు.  "గ" శబ్దం బుద్దికి "ణ " శబ్దం జ్ఞానానికి ప్రతీక. 
సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరించబడేదే  "ఓంకారము  " అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము " లో వర్ణించారు.  గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు  - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి ".  అంతేకాకుండా "బ్రహ్మణస్పతి " అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.

గణపతి విష్ణుస్వరూపుడు :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే !

ఇక్కడ వినాయకుడు "విష్ణుం" అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబదినాడు. విష్ణుం అంటే సర్వవ్యాపకుడు, స్థితి కారకుడు. అంతేకాకుండా క్షీర సాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీ మహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.  
సృష్టి ఆది లో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది.  ఇంకా మనుషులే పుట్టకముందుఅన్నమాట . అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది . ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయకకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం. 

గణేశుని (4) అవతారాలు:-

గణేశ  పురాణం ప్రకారం గణేషుడు (4) అవతారాలుగా ఆవిర్భవిస్తాడని అవి (4) యుగాలలో ఒకొక్క యుగానికి ఒకొక్క అవతారం గా చెప్పబడ్డాయి.

1. మహోత్కట వినాయక : - 
ఈయన  కస్యపప్రజాపతి - అదితి ల కొడుకుగా కృత యుగంలో అవతరించారు. పది చేతులతో, ఎఱ్ఱని శరీర ఛాయతో సింహ వాహనుడై -- నరాంతక, దేవాంతక అనే రాక్షసులని సంహరించినట్లు చెప్పబడింది.

2. మయూరేశ్వర వినాయక :- 
ఈయన శివపార్వతుల కొడుకుగా త్రేతాయుగం లో అవతరించారు.  ఆరు చేతులతో, తెల్లని ఛాయతో, నెమలి వాహనంగా సిన్దురాసురుడు మొదలైన రాక్షస సంహారం కావించాడు.

3. గజానన వినాయక :- 
ఈయన శివపార్వతుల కొడుకుగా ద్వాపరయుగం లో అవతరించారు. ప్రస్తుత మన విఘ్న వినాయకుడు ఈయనే.  ఎర్రని శరీర చాయతో, నాలుగు బాహువులతో, మూషిక వాహనముతో. కుడివైపు రెండు చేతులలో  ఏక దంతమును,  అంకుశమును ధరించి,  ఎడమ వైపు రెండుచేతులతో పాశమును,
 మోదకమును ధరించి గజవదనంతో, తొండము కుడివైపు వంపుతిరిగి ఉండును. 

4.ధూమ్రకేతు వినాయకుడు :- 
ఈయన బూడిద రంగులో, నాలుగుచేతులతో, నీలంరంగు గుర్రం వాహనంగా, కలియుగాంతంలో, విష్ణుమూర్తి, కల్కి అవతారంలో అవతరించినప్పుడు, ధూమ్రకేతు వినాయకుడు కూడా అవతరిస్తాడు.

మూలాధార స్థితుడు గణపతి --- 
"త్వం మూలాధార స్తితోసి " అని శ్రుతి చెప్పే రహస్యం :-
కల్పాదిలో విష్ణు నాభి కమలంనుంచి ఉద్భవించిన బ్రహ్మగారికి, విష్ణుమూర్తి సృష్టి భాద్యతను అప్పచెప్పారు.  కాని ఎలా చెయ్యాలో చెప్పకుండా యోగనిద్రలోకి వెళ్ళిపోయారు.  బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక చాల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని సృష్టి ప్రారంభించారు. ప్రారంభంలో జీవకోటిని, ముఖ్యంగా మానవుల్ని సృజించటం లో కొంత తికమక పడటం జరిగింది, అప్పుడు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ఆయన మహాగణపతిని ప్రార్ధించమని చెప్పారు. బ్రహ్మ, మహాగణపతిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమై " మూలాధరమనే చక్రాన్ని సృష్టించు, అక్కడనుండి సహస్రార కమలందాక నిర్మాణం చెయ్యి.  ఆ మూలాధారచక్రంలో నేను అధిస్టానదైవం గా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను కలుగచేస్తాను అని చెప్పారు.

శరీరంలోని షట్చక్రములలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రము "మూలాధార చక్రం".  ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు.దీనిలో ఇంకో రహస్యం  కూడా ఉంది. "మహాశక్తి " అయిన పార్వతీదేవికి "ద్వారపాలకుడుగా "గణపతిని పెట్టినట్టు మనపురాణగాధ, దీనిలో అంతరార్ధం ఏమిటంటే -- మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో నిద్రిస్తూ ఉంటుంది అని, ఈ కుండలిని శక్తి యే  మహాశక్తి  -- అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి  ప్రవేసించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు.  అనగా గణపతి భీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే  శక్తిని మేల్కొలుపుట సాధ్యపడుతుంది.  మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి "ఇడ " "పింగళ " నాడులద్వార షట్చక్రములను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి "సిద్ధి" "బుద్ధి" కలుగుతుంది.  ఈ బుద్ది, సిద్ది -- ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.  
కొనసాగింపు తరువాత పోస్టు లో.....
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
జై శ్రీమన్నారాయణ
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
*******************

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం

– తుంగనాథ్‌ Elevation-3,680 m (12,073 ft)
హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం.
హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు! రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంది.
ఈ తుంగనాథ్‌ క్షేత్రం ‘పంచ కేదార’ ఆలయాలలో ఒకటి. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా! ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతోకొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాడట. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు! దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు. మరి పరమేశ్వరుడేమీ తక్కువవాడు కాదు కదా! వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభరూపంలోని శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు.
పంచకేదార క్షేత్రాలలో వృషభరూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది. అవడానికి ఇంత ఎత్తున ఉన్నా, మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం తేలికే! 58వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చాలు, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఒకపక్కన మందాకినీ నది, మరో పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. శీతకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది. అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడి తుంగనాథుని ఉత్సవవిగ్రహాన్ని మోకుమఠ్‌ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్యపూజలను నిర్వహిస్తారు. అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు శీతకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెబుతారు.
🙏🙏🙏🙏🙏🙏🙏

భగవంతుని అనుగ్రహమే అసలు సాధనం.


🌹🌹🌹🌹🌹
మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. 
దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు.  ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.
ఈ 'ఆరు రాత్రుల యాగం' అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు.
మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి.
ఈ ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.
భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు.
అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది...
🌹🌹🌹🌹🌹

జయా - జాయా🌷*

దాదాపు ముప్పైఅయిదు సంవత్సరాల క్రితం శ్రీమఠంలో నవరాత్రి సందర్భంగా సరస్వతి పూజ రోజు జరిగిన సంఘటన ఇది. ఎప్పటిలాగే మహాస్వామివారు త్రిపురసుందరి సమేత చంద్రమౌళిశ్వర పూజ పూర్తీ చేసి ఆరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మొదలుపెట్టారు. వైదికులొకరు స్వామివారి దగ్గర కూర్చొని చేతిలోని పుస్తకం సహాయంతో మంత్రభాగం చెబుతున్నారు.

సంకల్పము, ఆవాహనము, ప్రాణ ప్రతిష్ట, అంగ పూజ అయిన తరువాత సరస్వతి అష్టోత్తరం చదవడం ఆరంభించారు. ప్రతి నామము చివర నమః తరువాత స్వామివారు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నారు.
ఆ వైదికులు అష్టోత్తరం చదువుతూ,

“ఓం బ్రహ్మజయాయై నమః” అని చెదివారు.

ఈ నామం చేదివిన తరువాత మహాస్వామివారి చేతిలోని పూవు సరస్వతి అమ్మవారి పాదాలను తాకలేదు. ఆలాగే స్వామివారి చేతిలోనే ఉన్నది. మరలా అలాగే అదే మంత్రాన్ని చెదివారు వైదికులు. ఊహు! ఇప్పుడు కూడా స్వామివారు పువ్వు సమర్పించలేదు. అలా ఎన్ని సార్లు నామమును చదివినా మహాస్వామివారిలో కించిత్ చలనం కూడా లేదు.

చేతిలో పువ్వును పట్టుకుని అలా స్థాణువులా ఉండిపోయారు.
ఏం అపచారం జరిగిందో అని అక్కడున్నవారందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మహాస్వామి వారు చేతిలోని పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం లేదు?

ఈ విషయం శ్రీమఠం మేనేజరుకు చేరింది. విశ్వనాథ అయ్యర్ తొ పాటు ఆయన కూడా పూజ జరుగుతున్నా స్థలానికి వచ్చారు. ఆయన వైదికుణ్ణి ఆ నామాన్ని పలుకమని అడుగగా ఆయన అలాగే నామాన్ని చెప్పాడు “ఓం బ్రహ్మజయాయై నమః” అని.

ఎటువంటి చలనము లేక మహాస్వామివారి చేతిలో పుష్పం అలాగే ఉండిపోయింది. అదృష్టవశాత్తు అక్కడే ఒక సంస్కృత పండితుడు కూడా ఉన్నాడు. ఆ నామాన్ని ఆయన సవరించి దాన్ని ఇలా పలకమని ఆదేశించారు.

“ఓం బ్రహ్మ జాయాయై నమః”

వెంటనే మహాస్వామివారి చేతిలోని పుష్పం అమ్మవారి పాదాలపై పడింది.

ఈ రెండునామాలకి ఉన్న తేడా ఏమిటి అంటే,

“ఓం బ్రహ్మ ‘జాయాయై’ నమః” అంటే బ్రహ్మ పత్ని అయిన అమ్మవారికి ప్రణామములు అని. “ఓం బ్రహ ‘జయాయై’ నమః” అంటే బ్రహ్మను గెలిచిన అమ్మవారికి ప్రణామములు అని అర్థం. మహాస్వామివారు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పూజ చేసేవారు కాని, యాంత్రికంగా చేసేవారు కాదు. వారి పూజకట్టులో మడికట్టులో వారికి వారే సాటి కాని వేరొకరు కాదు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం!

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
********************

మంత్ర మహిమ🌹

ఒక యోగి జనంలో తిరుగుతూ జనం నోటి నుండి శివ శంభో అనే మంత్రాన్ని విన్నాడు.
ఎక్కడ చూసినా, ఈపని చేస్తున్నా, తింటున్న, పడుకుంటున్నా, తిట్టుకుంటున్నా, ఆడుకుంటున్న, పడుకుంటున్నా ఏది చేస్తున్న శివా అని ఒకరు శంభో అని ఒకరు ఇలా ప్రతిఒక్కరూ ఆ మంత్రాన్ని అసంకల్పంగా కూడా అనేస్తూ ఉండగా యోగికి విసుగొచ్చింది. ఏమిటీ ఈ జనం అంత ఇంత గోల పెడుతున్నారు. ఇదేంటో తేల్చేద్దాం అని శివుడి దగ్గరికి వెళ్ళాడు.

శివా ఏమిటి గోల! ఎవడు పడితే వాడు వేళాపాళా లేకుండా శివా శంభో ఏంటి గోల అన్నాడు. శివుడు నవ్వి.. అక్కడ ఓ పురుగు ఉంది చూడు అక్కడికి వెళ్లి శివశంభో అని దాని చెవి దగ్గర పలుకమన్నాడు. యోగి పురుగు దగ్గరికి వెళ్లి శివశంభో అన్నాడు. ఆక్షణమే అది చచ్చింది. స్వామి ఏమిటి శివశంభో అనగానే అలా చచ్చిపోయింది. aన్నాడు. శివుడు పురుగుని పట్టించుకోకుండా అదిగో సీతాకోకచిలుక చూడు ఎంత ముచ్చటగా ఉందొ.. అవును స్వామి చాలా బావుంది. ఐతే దాని దగ్గరకి వెళ్ళి శివశంభో అని ఉచ్చరించమన్నాడు. అలానే చేశాడు. ఎగిరే సీతాకోకచిలుక కాస్త చచ్చి కిందపడింది. స్వామి ఏమిటి అది కూడా చచ్చింది? అన్నాడు. అప్పుడు కూడా పట్టించుకోలేదు శివుడు.

అదిగో జింకని చూడు ఎంత ముద్దుగా ఉందొ! అవును స్వామి చాలా బావుంది. దాని దగ్గర కూడా శివశంభో అని పలుకు.. జింక దగ్గరగా తటపటాయిస్తూ వెళ్లి శివశంభో అన్నాడు వణుకుతున్న గొంతుతో.. తక్షణం మరణించింది. యోగి గుండె గుభేల్ మంది.. స్వామి ఏమిటి ఒకదాని వెనుక ఒకటి ఇలా మరణిస్తున్నాయి? ఇంకా ఆనామం ఉచ్చరించను. అన్నాడు. శివుడు పట్టించుకోకుండా మరోవైపు చూసి అదిగో ఇప్పుడే పుట్టిన శిశువు ఆశీస్సులకోసం వస్తున్నాడు. చూశావా!

చూశాను స్వామి. వేళ్ళు వెళ్లి ఆ శిశువు చెవిలో శివశంభో అని మంత్రాన్ని చెప్పు అన్నాడు. నేను వెళ్ళను స్వామి. ఆ మంత్రం పలుకను. అందరూ చనిపోతున్నారు. క్షమించండి అంటే పర్వాలేదు వెళ్లి మంత్రాన్ని చెవిలో చెప్పు అన్నాడు. భయపడుతూ భయపడుతూ వెళ్లి చిన్నగా శివశంభో అన్నాడు. అప్పటివరకూ ఏడుస్తూ ఉన్న పసివాడు కాస్త టక్కున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈవింత! ఆవేమో చచ్చిపోయాయి. పసివాడు లేచి కూర్చున్నాడు. అని అడిగాడు.

శివుడు చిరుదరహాసం చేసి పసివాడివైపు చూశాడు. పసివాడు ఇలా అన్నాడు. పురుగుగా ఉన్నప్పుడు శివశంభో అంటే సీతాకోకచిలుక అయ్యాను. సీతాకోకచిలుక గా ఉన్నప్పుడు అంటే జింకనయ్యాను. జింకగా ఉన్నప్పుడు అంటే మనిషిగా పుట్టాను. నువ్వు మరొక్కసారి నాచేవిలో శివశంభో అంటే దివ్యత్వం పొందుతాను అన్నాడు. యోగి కంటనీరు పెట్టుకొని శివుడి పాదాలపై పడి క్షమించమని శరణువేడాడు.

నాయనా చూశావు కదా మంత్రప్రభావం. ఎప్పుడు ఎలా చేసినా ఎలా పలికినా అది దివ్యత్వానికి దారి తీస్తుందే తప్ప వృథాగా పోదు. అన్నాడు. మీలో ఏర్పడే ఒక్క బలహీనక్షణం కోసం మంత్రం మిమ్మల్ని పట్టుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ బలహీనక్షణం దొరికిన క్షణం మిమ్మల్ని దివ్యత్వం వైపు నడిపిస్తుంది. ఆ క్షణం రావాలని కోరుకోండి. అన్నాడు.
🙏🙏🙏🙏🙏

శ్రీమద్ఒ భాగవతం

Srimadhandhra Bhagavatham -- 91 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

కనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము,  అగరు మొదలయిన సువాసనలతో ఉన్నది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో 'రుక్మిణీ! నిన్ను చూస్తే చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తున్నది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో ఇల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత  మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది.  ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు.

కృష్ణుడు ఇలా మాట్లాడవచ్చునా? అని  అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది.  చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు. రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది.  యథార్థమునకు కృష్ణ పరమాత్మ పదహారు వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు.  ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పోతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు.  కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన.

కృష్ణుని మాటలు విన్న  అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములకు  చెందినవాడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.

సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము. కృష్ణా, నీవు అన్న మాటలలోని  చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు’ అని అడిగింది. కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.

బలరాముడు రుక్మిని చంపుట

రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి.  అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం ఇందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతే అది జీవితమును ఉద్ధరించదు.

రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ నీకేమయినా బుద్ధి ఉన్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తావా?  ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు.  రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు.

ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు.  కళింగ భూపతి ‘బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు.

ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు  ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు.  బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నానని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాణి  ఈ ఆటలో బలరాముడే గెలిచాడని పలికింది. ఇంత అశరీర వాణి చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు.  కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు.  తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంత తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యధార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.
*****************************

ద్రౌపది విఙ్ఞత

దుష్టుడైన దుశ్శాసనుడు ద్రౌపది ని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొని వచ్చిన వేళ తన భర్త ల ఆగ్రహోదగ్రత్వాన్ని వివరించి వానిని భయపెట్టింది. సభాసదులను అందరినీ దిక్కరించింది. భీష్మద్రోణవిదురాదులైన గురుజనులు అందరూ నోరు మూసుకుని కూర్చున్నందులకు వారిని కఱకుములుకులవంటి పలుకులతో నిలదీసింది. సాహసపూర్వకంగా సభాసదులను అందరినీ సంభోదించి తనకు న్యాయం చేయండి అని అర్థించింది. ధర్మం! ధర్మం! ధర్మాన్ని పరిరక్షించండి! అని మొరపెడుతూ ఆమె వారిని అయ్యలారా! మహారాజు యుధిష్ఠిరుడు ముందుగా పందెములో తనను తాను ఒడ్డుకొని ఓడిపోయినవాడు. అనంతరం అతడు పందెంలో నన్ను ఒడ్డేడు. ముందు ఒకసారి ఓడిపోయినవారికి రెండవసారి నన్ను పణంగా పెట్టడానికి అధికారం ఉంటుందా? ఉండదా? ఆలోచించి తేల్చండి. అని ప్రశ్నించింది. ఆమె మాటలను అందరునూ విని మౌనం వహించడం తప్ప సమాధానం ఏమీ చెప్పలేకపోయారు. కడపట దుర్యోధనుడి తమ్ముడు అయిన వికర్ణుడనువాడు లేచి సభాసదులారా! ఊరకున్నారేమి? ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మౌనం వీడండి అని సభాసదులను అభ్యర్థిస్తూ ఇదిగో! నా అభిప్రాయం చెబుతున్నాను వినండి! అంటూ ఇలా అన్నాడు. ముందు ద్రౌపది ఐదుగురు పురుషుల కు భార్య అన్న మాటను మరువరాదు. మిగిలిన నలుగురు భర్తలను ఉపేక్షించి తాను ఒక్కడే ఆమెను జూదంలో పణంగా పెట్టడానికి ధర్మరాజు కు అధికారం లేదు. ఇది మొదటి అంశము. అతడు తాను ముందు ఓడిపోయి తరువాత ద్రౌపది ని పణంగా ఒడ్డేడు. ఇది అతనికి అనధికార చర్య అవుతుంది. ఇది రెండవ అంశం. వికర్ణుడు ఆడిన ఈ మాటలను విదురుడు సమర్ధించాడు. ఇతర సభాసదులందరూ అతనిని ప్రశంసించారు. ఈ విధంగా నిండు సభలో దుశ్శాసనుని చేత ఈడ్వబడి అవమానింపబడినా కడకు నైతిక విజయం ద్రౌపది కే కలిగింది. ఆమె బుద్ధి మిక్కిలి పరిణస్థితిని పొందింది. ఆమె మాటను ఎవరూ ఖంఢించ లేకపోయారు. చివరకు విదురుని ప్రోత్సాహం తో ధ్రుతరాష్ట్రుడు దుర్యోధనుడి ని మందలించి ద్రౌపది కి ప్రశన్నత కలిగింపనెంచి ఆమె తో అమ్మా! నీకు ఏమి కావలెనో కోరుకో! అని అన్నాడు. అప్పుడు ఆమె మహారాజా! నా భర్తలను దాస్యవిముక్తులనూ చేయండి! ఇదే నేను మీనుండి ఆశించే వరం అని పలికింది. ఇంకను ఏమైనా కోరుకో! అని ధ్రుతరాష్ట్రుడు మరల పలికాడు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఆమెకే తగియున్నది ఎల్లరూ మెచ్చుకొనే విధంగా ఉండి ఆమెలోని లోభ రాహిత్యం ధర్మప్రీతి ఆ సమాధానం లో స్పష్టం గా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ సమాధానం ఏది అంటే మహారాజా! అధికంగా ఆశించడం నాకు యుక్తం కాదు. ఇంకనూ మిమ్మల్ని ఏదో కోరాలి అన్న భావన నాకు లేదు. నా భర్తలు సర్వసమర్థులు, వారు  దాస్యవిముక్తులు అయితే తమంతట తాము గా ఏదైనా సాధించగలరు. ఇది ఆమె చెప్పిన సమాధానం. ఈ విధంగా ద్రౌపది తన విఙ్ఞత సాయంతోను పాతివ్రత్య బలంతోను తన భర్తలను దాస్యబంధవిముక్తులను చేసుకొంది...... సేకరణ 🍁
**********************

రామాయణం ఒక భూగోళ శాస్త్రము


రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు.
సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.
తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
🚩🕉️☀️🙏#జైశ్రీరామ్🙏☀️🕉️🚩
*******************

కరోనా సేవ కై సేవాభారతి

నమస్తే కరోనా సేవ కై సేవాభారతి టోల్ ఫ్రీ నంబర్ 04048210101 
కరోనా సోకిన వ్యక్తి కి కానీ వారి  కుటుంబ సభ్యుల కు కానీ పైన తెలిపిన టోల్ ఫ్రీ నంబరు కు phone చేస్తే సేవా భారతీ వారు వివరాలు నమోదు చేసుకొని 5000 రూపాయల విలువ చేసే kit ను ఉచితంగా అందిస్తున్నారు. అందులో Pulse Oxy meter, Thermo meter, ఆవిరి capsules, Vitamin tablets,. Paracetamol tablets, మాస్క్ లు మరియు గొంతు gargling చేయడానికి ఒక liquid కూడా ఉంది.
దయచేసి ఈ విలువైన మెసేజ్ ని ఎవరైనా నిరుపేదలకు వైరస్ సోకి ఉంటే వారికి kit ni అందజేసే ప్రయత్నం చేయండి🙏
*******************

తపస్సు అంటే ఏమిటి?


తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు.

భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు.
మనోవాక్కాయ కర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు.

నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.

ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు.

అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగి పోతాయి.

శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది.

ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వాసనా క్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాప వాసనా క్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది.

శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియ లోలత్వాన్ని బుద్ది పుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కావున శారీరకంగాను, మానసికంగాను, తపస్సనే ధనాన్ని పొందాలి.

ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో తపో వాతావరణంను పెంపొందించుకోవాలి.

తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి.

మొదట తానూ మారాలి? ఎందుకు?

ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి.

మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.

మోక్షం అంటే జీవించి వుండగానే దేహమును, ఇంద్రియాలను, మనసును, తెలివిని దేదీప్యమానముగా ఉంచే ఆత్మను దర్శించడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం. ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి.

మీ
స్వామీ రామానంద
**********************

" మహాభారతం పూర్తయ్యె నిచట "

- తెలుగువారి హృదయ దర్పణం గా " మహా భారతం" పేరొందింది.
"తింటే గారెలు తినాలి..వింటే భారతమే వినాలి" అనే నానుడి కూడా ప్రసిద్ధం.
అరణ్య పర్వ శేష రచన ద్వారా  తెలుగులో మహాభారత కథకు..కావ్యానికి  పరిపూర్ణత..సమగ్రతను కల్పించిన ఘనత మహాకవి ఎఱ్ఱనకు..ఆయన జన్మస్థలియైన  ప్రకాశం జిల్లా కు దక్కుతుంది.

సంస్కృతములో వేదవ్యాస మహర్షి " జయ " మనే  పేరుతో రచించిన మహాభారత గాథను తెలుగులో కవిత్రయం గా పేరొందిన నన్నయ,  తిక్కన ,  ఎఱ్ఱన  అనుసృజన చేసి తెలుగు జాతికి గొప్ప కానుకగా అందించారు . తెలుగులో మహా భారతం ఆది కావ్యం.
మహాభారతాన్ని రచించిన ఈ  ముగ్గురు మహాకవులు   నదీ తీర ప్రాంతాలతో సంబంధం ఉన్న వారే కావడం విశేషం . నన్నయ్య కవిత్వం  గోదావరి గంభీర నడకను సంతరించుకుంది.
11 వ శతాబ్ది కి చెందిన నన్నయ
తన  ప్రభువైన రాజరాజనరేంద్రుని ఆదేశంతో  తెలుగులో ఆది కావ్యమైన  మహాభారత రచనకు శుభ శ్రీకారం చుట్టాడు. ఆది కవిగా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు .
 ఆది పర్వం ,  సభాపర్వం పూర్తిగా తెనిగించిన నన్నయ్య లేఖిని అరణ్యపర్వం నాల్గవ ఆశ్వాసం  141వ పద్యం " శారద రాత్రు లుజ్వల లసత్తర తారక హార పంక్తులం " అనే పద్యంతో  ఆగిపోయింది.
  ఆ తరువాత 13వ శతాబ్దిలో పెన్నా నదీతీర వాసి..మనుమ సిద్ధి ఆస్థాన కవి యైన కవిబ్రహ్మ  తిక్కన సోమయాజి   పూనుకుని హరిహరనాథ స్తుతితో విరాట పర్వము నుండి ప్రారంభించి స్వర్గారోహణ పర్వం వరకు గల పదిహేను పర్వాలను తానొక్కడే రచించాడు.
పెన్నా నది ప్రవాహ పరవళ్లు తిక్కన కవిత్వంలో  చూస్తాము .
 ఆ తరువాత 14వ శతాబ్దంలో గుండ్లకమ్మ నది తీర వాసి..అద్దంకి రెడ్డి రాజుల ఆస్థాన కవి.. ప్రబంధ పరమేశ్వరుడును నైన   ఎఱ్ఱన మహాకవి   అరణ్య పర్వం లోని శేషభాగాన్ని  పూర్తి చేసేందుకు పూనుకున్నాడు.
 అరణ్య పర్వం 4 వ ఆశ్వాసం లో 142 వ పద్యం " స్ఫుర దరుణాంశు రాగరుచి బొంపిరివోయి నిరస్త నీరదా వరణములై " అనే పద్యంతో ప్రారంభించి అరణ్య పర్వం లోని 5,6,7 ఆశ్వాసాలను పూర్తి చేసి  మహాభారతానికి ఒక సమగ్ర ఆకృతిని కలుగ చేసాడు.
ఈ విధంగా గోదావరీ తీరాన ప్రారంభమైన మహాభారత రచన పెన్నా నదీ తీరాన ఉధృత స్థితిని అందుకుని గుండ్లకమ్మ తీరంలో ప్రశాంతతను పొందింది.
మహాభారతాన్ని నన్నయ తిక్కనల శైలిలో నడిపి తన ప్రత్యేకతను కూడా  ఎఱ్ఱన  చాటుకున్నాడు.
ఈ విధంగా మహాభారతాన్ని తెలుగులో పూర్తి చేసిన ఖ్యాతి ఎఱ్ఱన  గారికి..ప్రకాశం జిల్లా కు దక్కింది.
నన్నయ్య ,తిక్కన , ఎఱ్ఱన ఈ మువ్వురూ  కవిత్రయం గా తెలుగు వారి గుండెల్లో కొలువై ఉన్నారు.
ఈ ముగ్గురు మహా కవులు తెలుగు నేలపై జన్మించడం   తెలుగువారి అదృష్టం గా..పూర్వ పుణ్య ఫలంగా భావించాలి.
 ప్రకాశం జిల్లా గుడ్లూరు లో జన్మించి అరణ్య పర్వ శేషంతో మహాభారతానికి సమగ్ర ఆకృతిని  కల్పించిన ఎఱ్ఱన మహాకవిని  సదా స్మరించుకోవాలనే      సదాశయంతో  ఒంగోలులో ఎఱ్ఱన పీఠం ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఎఱ్ఱన గారి విగ్రహాన్ని 14.11. 1987లో ప్రతిష్ఠించారు.
ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం ఎఱ్ఱన విగ్రహాన్ని తయారు చేయించి బహూకరించింది. నాట్యావధాన కళా రూపంతో ఆంధ్రుల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎఱ్ఱన పీఠం కార్యదర్శి  డాక్టర్ ధారా రామనాథశాస్త్రి గారు.. అలాగే అప్పటి జిల్లా అభివృద్ధి అధికారి, ఎఱ్ఱన పీఠం శాశ్వత ఉపాధ్యక్షులు కె వెంకట శివయ్య గారు.. కోశాధికారి ఆలపాటి రాధా కృష్ణమూర్తి గారు  ఈ కృషిలో  ప్రధాన పాత్ర పోషించారు. డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు జిల్లా కలెక్టర్ గా..ఎఱ్ఱన పీఠం అధ్యక్షులుగా వ్యవహరించిన సమయంలో ఎఱ్ఱన విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.
 ఎఱ్ఱన పీఠం ఆధ్వర్యంలో గొప్ప గొప్ప  సాహిత్య సభలను నిర్వహించడంతో పాటు ఎఱ్ఱన పీఠం నిర్వాహకులు  ఎఱ్ఱన సాహిత్య లహరి పేరిట వ్యాస సంకలనాలు వెలువరించారు. ఎఱ్ఱన రచించిన పద్యాలతో విద్యార్థులకు పద్య పోటీలను జరిపి విజేతలకు బహుమతులను అంద చేసారు. అయితే
నేడు అదంతా ఒక చరిత్ర. జ్ఞాపకాల సమాహారం.

"మహా భారతంలో మహిత భావనలు" పుస్తక ప్రచురణ గురించి :
నన్నయ్య , తిక్కన , ఎఱ్ఱనల చేతుల మీదుగా పూర్తి యైన మహాభారతంలోని కొన్ని ముఖ్య విషయాలతో 2016 ఏప్రిల్ 16 న "మహాభారతంలో మహిత భావనలు" పేరిట ఒక పుస్తకాన్ని వెలువరించాను. కవిత్రయం ఫోటోలను ముఖ చిత్రంగా ప్రచురించాను.
2013 ఆగస్ట్ 23 - 24 తేదీలలో గుంటూరు జిల్లా నగరం లోని ఎస్ వీ ఆర్ ఏం కళాశాలలో (శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కళాశాల ) ఏర్పాటైన యూ జీ సీ జాతీయ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాన్ని మరింత విస్తరించి పై పుస్తకంగా వెలువరించాను.
మరో నాలుగు భాగాలు వెలువడ వలసి ఉంది.
సర్వేశ్వరుని అనుగ్రహంతో సహృదయుల తోడ్పాటుతో మిగిలిన భాగాలను కూడా వెలువరించేందుకు కృషి చేస్తాను.


  ( ఎం. వి.ఎస్ . శాస్త్రి , ఒంగోలు .
సెల్  9948409528)

గాయత్రి మంత్రం

గాయత్రి మంత్రం లో 24 అక్షరాలతో పాటు, ఇరువది నాలుగు దేవతాముర్తుల శక్తి  అంతర్గతంగా ఉంటుంది. ఈ ఇరువది నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వింశతి  గాయత్రి అనే పేరు..
1. తత్ : విఘ్నేశ్వరుడు
2. స : నరసింహ స్వామీ
3. వి : శ్రీ మహా విష్ణువు
4. తుః : శివుడు
5. వ : కృష్ణుడు
6. రే : రాధా దేవి
7. ణ్యం : శ్రీ మహా లక్ష్మీ
8. భ : అగ్ని దేవుడు
9. ర్గోః : ఇంద్రుడు
10. దే:  సరస్వతి దేవి
11. వ : దుర్గా దేవి
12. స్య : ఆంజనేయస్వామి
13. ధీ : భూదేవీ
14. మ: సూర్యభగవానుడు
15 .హి : శ్రీరాముడు
16. ధీ: సీతా దేవి
17. యో : చంద్రుడు
18. యో: యముడు
19. నః : బ్రహ్మ
20. ప్ర: వరుణుడు
21. చో: శ్రీ మన్నరాయనుడు
22. ద: హయగ్రీవుడు
23. యా: హంసాదేవత
24.త్ : తులసిమాత
       ....💐💐💐🙏🙏...
   ఈ ఇరవై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే ,కీర్తి ,దివ్య తేజస్సు ,సకల శుభాలు కలుగుతాయి....💐💐🙏🙏....
        ...జై శ్రీ రామ్.
*************************

భారవి కవి - కధ


*నాన్నను అపార్ధం చేసుకోకండి అని చెప్పే చిన్న‌ యదార్ధ కధ ఇది.*

*అప్పట్లో భారవి అనే కవి ఉండేవాడు. ఇతగాడు చిన్నతనం లోనే మంచి కవి. Best stories and lyrics రాస్తుండేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.*
*ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అని తేలికగా మాట్లాడేవాడు.*
*అయితే ఇక్కడ భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తిగా ఉండేది.*
*ఓ రోజు తల్లి దగ్గరకు వెళ్లి నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. ఊర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే అతనేమో ఏమున్నదిలే అన్నట్టు మాట్లాడుతారు.*

*ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారకపోయే సరికి భారవికి అసహనం ఏ స్థాయికి చేరిందంటే తండ్రిని చంపేద్దామని  నిశ్చయానికి వచ్చాడిక. ఒకరోజు రాత్రి భారవి నాన్న వంటింట్లో భోజనం చేస్తున్నాడు తల్లి వడ్డిస్తూ వుంది.*
*అప్పటికే అసహనంతో రగిలిపోతున్న భారవి వంటింటి అటక మీదకు ఎక్కి బండరాయితో మోదెయ్యాలని సిద్ధంగా వుంటాడు.*
*ఇక్కడే భారవి తల్లి*
*... భర్తతో ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటుంటారని బాధపడుతూ చాలా సందర్భాలలో నాకు చెప్పాడండి’ అంటుంది.*

*అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? ఊరంతా వస్తున్న పొగడ్తలు ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగేట్టు చేసి తనంతవాడు లేడని విర్రవీగేలా చేస్తాయి. దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అంటాడు.*
*అది విని భారవికి బుర్ర తిరిగి మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి.*
*పశ్చాత్తాపంతో రగిలి పోతాడు. వెంటనే బండ అక్కడ పారవేసి కిందకు దిగి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*
*తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు. పశ్చాత్తాపంతో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.*
*అప్పుడు మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.
ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*
*తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.*

*భారవి భార్య కూడా పుట్టింటిలోనే ఉందప్పుడు. సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.
రోజుకో పిండివంట చేసి ఆదరించారు.*
*రోజులు గడిచాయ్. ఇక అసలు కధ మొదలయ్యింది. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు లోపల లోపల విసుక్కున్నారు.*
*చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు.*
*మర్యాదలు తగ్గాయి.*
*బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.*
*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు.*
*దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.*
*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.
భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.*

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*
*ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.*
*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*
*ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడటం వాళ్ళ వంతయింది.*
*భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*
*తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి!*
*మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.*
*చిన్నప్పుడు తండ్రి దండించాడని కోపం పెంచుకోకండి!*
*అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి ఉంటారని గుర్తు పెట్టుకోండి!*
*******************

Some wonders in Kashi.. details.

1. Eagles will not fly in Kashi, cows will not tall, cows will not shout, corpses will not be shaken, every living being who died in Kashi will rise up to the right ear.

In 2. Kashi, there are many small tova sandals around the temple, it is like that of a Padmaveyuham, new people will not be found.

3. But earlier here many beautiful forests and flower trees, the people built large bungalows around the temple to save them from foreign penalty pilgrims attacks and made no way for enemy soldiers.

4. Big scientists from many countries came and did many research in Kashi and were surprised.

5. Where are these cosmores coming from?

In 6., the ancestors built temples in the places where there was power movement.

7. They wonder where they were in those days.

8. Pooja will be started with the corpse of Kashi Visweshwara.

9. If you visit Paranna Bhukteshwarun in Kashi, the creature will get rid of the debt of eating food from others.

10. If you do good deeds in Kashi temple, there will be a crore times result; even if you do sin, it will be a crore times sin.

11. The hand lines will change after the anointed of Vishwanath.

12. The residence of Annapurna Devi, which is the place of Shakti Peetam Vishalakshi Ammavaru, which feeds all over the world is Kashi.

13. The ancient Sanskrit peetam which is the mother of all languages in the world is in Kashi.

There are 84 ghats in Kashi on the banks of Gangamma......

In this there are many things built with their own power along with the goddess, sages, kings. Some of them:

1) Dashashwamedha Ghat:
The Lord Brahma did Ashwamedha Yagam 10 times here. Special Ganga Harathi is happening every evening.

2) Prayag Ghat:
Here in the womb, Yamuna and Saraswati will meet with Ganga.

3) Someshwar Ghat:
Made by the moon.

4) Mir Ghat:
The place where Satidevi's eye fell. Vishalakshi Devi Shakti Peetam.
Here is the penis installed by Yamudu

5) Nepali Ghat:
Pashupathi Nath temple was built by the king of Nepal with a golden kalasam.

6) Mani Karnika Ghat:
This is the first one in Kashi. This was built by Lord Vishnu himself with Sudarshana Chakra. Here all the goddesses take bath, here Ganga will flow as a pure place. If anyone takes a good bath here in the afternoon, their sins of births will go away. Even the Chatur Mukha Brahma God cannot explain how much virtue a creature gets.

7) Vishwever Ghat:
Now it is called Cyndia Ghat. This is where Ahalya bhai made a mistake. Here you will see Bindu Madhavun who takes bath.

8) Five Ganga Ghat:
Here 5 rivers from the underground in the Ganges will join.

9) Guy Ghat:
Gopuja is going on.

10) Tulsi Ghat:
Siva's order was received to practice Tulsi Das and write Ramacharitha Manas.

11) Hanuman Ghat:
Hanuman will come to listen to the Rama story happening here. Here is the Lolark pot which has gained many powers by the sun
Sri Vallabhacharya was born here.

12) Assi Ghat:
A pilgrimage has been created here by killing the demons of Durga Devi Shumbha, Nisumbha and laying the sword.

13) Harishchandra Ghat:
After losing everything, Harish Chandra worked here as a dead body worker and won the divine test and got his kingdom. To this day, here is always burning...

14) Manasa Sarovar Ghat:
Here the underground waterfall is meeting from the mountain of Kailas.
If you take bath here, you will get the virtue of surrounding the mountain of Kailasa.

15) Narada Ghat:
Narada has established a penis.

16) Chautassi Ghat:
According to Skandha Puranam here, 64 Yoginis have done penance here.
This is a loving place for Dattatreya... If you take bath here, you will get rid of sins and get the power of 64 Yoginas.

17) Rana Mahal Ghat:
Here, the Lord Brahma has made Vakratunda Vinayaka to remove the problems in the work of the creation.

18) Ahilya Bai Ghat
Because of her we are kashi today
Visiting the Lord of the Lord.

🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶

The pilgrims that arise near many ghats in the Ganga river in Kashi are together.

Vishwanath's temple was brightly lit in the middle of many temples, buildings and forests built by goddesses, sages and kings in Kashi.

But we are looking at Kashi after the Mahammediya Danda pilgrims targeted Kashi and destroyed it.

Along with Viswanath, Bindu Madhava, many temples were demolished and built mosques.

Even today, Nandi is looking at the demolished temple in the Viswanath Mandir.

There will be a well-being of the Gnanavapi pilgrimage that Lord Shiva dug with Trishulam.

Indoor Rani Sri Ahalya Bai Holkar has built the original temple of the Viswanath temple which we are visiting today.

🙏🙏 Kasi remembrance is always a salvation 🙏🙏

***********************

*URGENT Alert* For Hyderabad people

Hussain Sagar Lake touched its full tank level (FTL) on Sunday night after the city witnessed incessant rain for more nearly 48 hours. 

While the FTL of Hussainsagar is 513.41 m the current 513.59 m, that is 18 cms above the FTL.

Residents living in the downstream areas of Domalguda, Himayatnagar, Liberty and Ashok Nagar can be affected if the rain continues.

*Please alert Residents in the low lying areas*.

United Federation of Resident Welfare Associations, U-FERWAS
****************

పోత‌న త‌లపులో ...(22)

ప‌ర‌మాత్మ గొప్ప‌త‌నాన్ని,
ప‌ర‌మ ర‌మ‌ణీయంగా
తెలిపిన పావ‌న‌మూర్తి పోత‌న‌

                 ****
ఎవ్వని యవతార మెల్ల భూతములకు-
  సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ-
  సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ-
  భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల-
  సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;

                          **
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ; దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు; నెఱిఁగింపు మిద్ధచరిత!
                    ****

ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా.
ఓ సూతమునీంద్రా! అవన్నీ మాకు వినిపించు, అని శౌన‌కాది మునుల విన్న‌పం.

🏵️*పోత‌న ప‌ద్యం 🏵️
🏵️అక్ష‌ర పారిజాతం🏵️

వీర వనిత రాణి లింగమ్మ

గద్వాల్ కథ🌷*
*సోమనాద్రి - వీర వనిత రాణి లింగమ్మ - హనుమప్ప నాయుడు*
         🌷🌷🌷
గద్వాల్ నగరం తెలంగాణ రాష్ట్రం లోని 'జోగులంబగద్వాల్' జిల్లా ప్రధాన కార్యాలయం.  ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం.  గద్వాల్ చారిత్రాత్మకంగా హైదరాబాద్ నిజాం యొక్క  "గద్వాల్ సంస్థానం" యొక్క రాజధాని!

ఈ రోజు నేను ఈ వ్యాసంలో మీముందు ముగ్గురి ప్రాశస్త్యం ని కథలా చెప్పబోతున్నాను. వారు:
1. సోమానాధ్రి (సోమన్నభూపాలుడు)
2. వీర వనిత రాణి లింగమ్మ
3. హనుమప్ప నాయుడు

రాజరిక వ్యవస్థ ఘనంగా కొనసాగుతున్న రోజుల్లో గద్వాల సంస్థానం తనకంటూ ఓ ప్రత్యేక చరిత్ర సృష్టించుకొంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పేరు చెబితే ఇరుగు పొరుగు పాలెగాళ్లు గడగడ లాడిపోయేవారు. ఈ సంస్థానం వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అంతెందుకు నిజాం నవాబు సైతం గద్వాలను ప్రత్యేకంగానే పరిగణించేవారు. అలాంటి ఆ సంస్థానానికి నిర్మాణ వ్యవస్థాపక  మూలవిరాట్టుగా నిలిచిన పాలెగాడు నల సోమనాద్రి.  ఈ సంస్థానాన్ని ధర్మ నిరతితో పరిపాలించిన  సుప్రసిద్ధ పాలకుడు. ఇతన్ని  పెద్ద సోమభూపాలుడు, పెద శోభనాద్రి, సోమనాద్రి అని ప్రజలు ఎంతో ఆప్యాయంగా  పిలుచుకునేవారు. ఈ సంస్థానం స్థాపించాడానికి ముందు సోమనాద్రి 'పూడూరు'ను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. క్రీ.శ. 1663లో ఈ సంస్థాన స్థాపనకు గద్వాలలో బీజం వేశాడు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించాడు. ఈతని  పాళెగాని  తండ్రి పెద్దారెడ్డి. తల్లి బక్కమ్మ. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య అమ్మక్కమ్మ ,   చిన భార్య లింగమ్మ . తల్లి బక్కమ్మ పుట్టినిల్లు పూడూరు.  ఆ పూడూరే సోమనాద్రి తొలి రాజధాని.

చరిత్రలో స్మరించు కోవాల్సిన తెలుగు వీరవనితలు: పల్నాటి బాలచంద్రుని మగువ మాంచాల, నెల్లూరి సీమ సేనాధిపతి ఖడ్గ తిక్కన సతీమణి చానమ్మ ... ఇంకా ఎందరెందరో కథానాయిక ల్లో గద్వాల్ సోమనాద్రి సతీమణి లింగమ్మ కూడా ఒకరు.
శత్రు రాజుల కోటలో తన భర్త బందీ గా మారి కొన ఊపిరితో పోరాడుతున్నారన్న సమాచారం అందుకొంది రాణిలింగమ్మ. అంతలోనే వేగులు వచ్చి పూర్తిస్థాయి సమాచార మిచ్చారు.శతృ రాజులు యుద్దరంగం లో నిలవ లేక కర్నూలు కోటకు పారిపోతుండగా సోమనాద్రి వారిని వెంటబడి తరుముతూ  కర్నూలు కోటలో బందీగా చిక్కాడని చెప్పారు. రాజును విడిపించేందుకు కోట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నమైనా చేయకుండా తమ సైన్యం చేతులెత్తేసారని, అనుమతిస్తే వెనుదిరిగి వస్తామంటూ కబురు పంపించారని రాణి లింగమ్మతో చావు కబురు చల్లగా చెప్పారు. అందుకు ప్రతిగా రాణి ఏం చెప్పింది, మన కథానాయిక ఎలా అయిందన్నది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం పదండి మరి.

సోమనాద్రి ఆరడుగుల ఎత్తు గల  ఆజానుబాహుడు.  నల్లని రూపు తో గంభీరమైన ఆయన దేహదారుడ్యం చూపరులకు భీతిగొల్పేది. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగిన సోమనాద్రి  ఖడ్గం చేతబట్టా డంటే ప్రళయకాల రుద్రుడే. యుద్దరంగ మంటే మంచినీళ్ల ప్రాయమే.

పూడూరు రాజధానిగా ఆ ప్రాంత పాలెగాడుగా ఉన్న సోమనాద్రికి పూడూరు కోట మరమ్మత్తుల సందర్భంగా పెద్ద ఎత్తున గుప్త నిధులు దొరికాయి. ఆనాటి రోజుల్లో గద్వాల ప్రాంతమంతా అటవీమయంగా ఉండేది. అడవి జంతువులు విచ్చల విడిగా సంచరిస్తుండేవి. జనావాస యోగ్యంగా లేకపోవడంతో అడవి మరింత దట్టంగా పెరిగింది. సోమనాద్రి ఒకనాడు పూడూరు నుండి అటవి ప్రాంతంగా ఉండిన గద్వాల ప్రాంతానికి  వేటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఒక కుందేలు వేట కుక్కను తరమడం గమనించాడు. ఇక్కడి స్థలానికి ఏదో వీరోచిత మహత్తు ఉందన్న విషయాన్ని గ్రహించాడు. అందువల్ల ఇక్కడ రాజధాని నిర్మిస్తే తనకు అపజయమన్నది ఉండదని భావించాడు. ఇదే విషయాన్ని తన ముఖ్య  సహచరులతో చర్చించాడు.  తన అంగ రక్షకులు, అనుచరులు, సహచరులు కూడా సమ్మతించడంతో పూడూరు నుండి గద్వాలకు రాజధానిని మార్చాలని గట్టిగా  నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగానే పటిష్టిమైన  కోటను కూడా నిర్మించాలని తలపోశాడు. ఆ మేరకు  కార్యాచరణను సిద్ధం చేశాడు.
ఉత్తరం దిశన కృష్ణానది ఉండటం,
ఈ ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాలనుకున్నాడు.

సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని  గద్వాలకు, రాయచూరు కు మధ్యలో ఉన్న ఉప్పేరు ప్రాంతాన్ని పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు సమీప బంధువు.  ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి  తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలవాడనని సోమనాద్రి నమ్మబలికాడు. నవాబు అందుకు సంతోషంగా అంగీకరించాడు.

సోమనాద్రి  నిర్మాణం మొదలు పెట్టి వృత్తాకారంలో పటిష్టంగా, ఎంతో పకడ్బందీగా మట్టి కోటను నిర్మించాడు. తూర్పూ, పడమరల వైపు రెండు ప్రధానా ద్వారాలు, ఉత్తరం వైపు అత్యవసర రహస్య ద్వారం ఉండేటట్లు ప్రణాళిక రచించాడు.  కోటలో ఒక పెద్ద బావి, అంతఃపుర మందిరాలు, చెన్న కేశవ స్వామి ఆలయం నిర్మింపజేశాడు.  అనేక వ్యయప్రయాసలకు గురైనప్పటికీ కోట నిర్మాణం పూర్తి గావించి తన రాజధానిని గద్వాలకు తరలించాడు.

కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి ఉల్లంఘిం చాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నా డు. పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు కబురు పంపాడు సయ్య ద్ దావూద్ మియా.                                                            ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియ్యా అధ్వర్యంలో మూడు ప్రాంతాల నవాబులు ఏకమై ముప్పేట దాడికి పూనుకున్నారన్న సమాచారం సోమనాద్రికి అందింది.                                                               

ఇక ఎంత మాత్రం ఉపేక్షించకుండా సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని  రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు.  ఇరు పక్షాల మధ్య భీకర సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. యుద్ధ నష్ట పరిహారం గా తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, కొన్ని ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. చావుతప్పి కన్ను లొట్టబోయి ఎంతో దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.

అరగిద్ద యుద్ధంలో పరాభవాన్ని ఎదుర్కొన్న ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్, మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించింది. అది నవాబును  మరింతంగా కుంగదీసింది.  అవమాన భారంతో రగిలిపోయాడు. మిన్నంటిన ఆగ్రహంతో ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించే వరకు నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు.  సోమనాద్రి మీదకు దండయాత్ర సముచితం కాదని, ఆ యోచన విరమించుకోమని సయ్యద్‌కు నిజాం నవాబు సలహా ఇచ్చి అనునయించాడు. కాని సయ్యద్ పట్టు విడవలేదు. తప్పని పరిస్థితిలో ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధంలో పరాజయం పాలై అవమానంతో రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే మెరికల్లాంటి సైనికులను ఏరికూర్చుకొని తమ సైన్యాలతో కలిసి, నిజాం సైన్యానికి జత కలిశారు.

ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యాన్ని వెంటనిడుకొని నిజాం సైన్యం తుంగభద్రా నదికి ఉత్తరం దిశనుండి  బయలుదేరింది.  వీరు చాలరని తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు) గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల (నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు  నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది. సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరులోని నవాబుల సైన్యంపై  ముందుగా దండెత్తాడు.  నవాబుల సైన్యం కూడా అందుకు ధీటుగానే జవాబిచ్చింది. అంతకు ముందు అనేక యుద్దాల్లో ఒక ప్రణాళిక ప్రకారం సైన్యాన్ని నడిపిన సోమనాద్రికి ఈ యుద్దం అసలు లెక్కే లేకపోయింది. ఆ రోజంతా నవాబుల సైన్యంతో అరివీర భయంకరంగా ఎంతో వీరొచితంగా పోరాడాడు. ఫలితంగా నవాబుల సైన్యం కకావికలమై పోయింది. మొదటి రోజు పైచేయి సాధించిన విజయ గర్వంతో సోమనాద్రి ఆ రాత్రి కలుగొట్లకు తిరిగి వచ్చి విశ్రమించాడు.                                         

మొదటి రోజు యుద్దంలో సోమనాద్రి అసమాన పరాక్రమాన్ని చూసిన నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్ధారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకొంటే, మన విజయం సుళువుగా మారుతుందని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగిలించి తెచ్చినవాడికి  జాగీరును ఇస్తానని ప్రకటించాడు. ప్రాణాలకు తెగించి ఒక అశ్వ పాలకుడు కలుగొట్లకు వచ్చి ఎంతో నైపుణ్యంగా సోమనాద్రి గుర్రాన్ని తస్కరించుకువెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో పాటు, ఒక బంగారు కడియాన్ని కూడా అశ్వ పాలకునికి బహుమానంగా ఇచ్చాడు.

మరుసటి రోజు సోమనాద్రి శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేక పోవడం తనకు  కుడిచేయి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్య,స్థైర్యాలను విడువకుండా మరో జాతి గుర్రం సాయంతో ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందు రోజు నాటి ఉత్సాహం లేక పోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితో సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెళ్ళవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివ్వ గలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకు భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించాడు.

హనుమప్పనాయుడు:  సర్దార్ గుజ్జుల హనుమప్ప నాయుడు త్యాగం, విధేయత మరియు ధైర్యం ఇప్పటికీ ఎంతో గర్వంగా చెప్పుకునే జ్ఞాపకములుగా నిలచిపోయాయి !

హనుమప్ప నాయుడు యంగన్న పల్లె గ్రామానికి చెందిన బోయ కులస్థుడు.  ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరుడు. ప్రాణాలకు తెగించి తన ప్రభువు గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలుడునికి (నల సోమనాద్రికి)
విజయానికి దొహదపడిన కార్యశూరుడు.

సోమనాద్రి ప్రకటనకు హనుమప్ప నాయుడు అనే  ఒక బోయ సర్ధారు ముందుకు వచ్చాడు. ఇతని స్వగ్రామం నేటి ఇటిక్యాల మండలంలోని బొచ్చెంగన్న పల్లె. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా కట్టుకొని నిడ్జూరుకు బయలుదేరాడు. నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా సమీపించాడు. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదురనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టే అలా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్ని చూశాడు. చివరకు ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పను చూసి  సకిలించింది. సొప్పను చూసే సకిలించిందని సరి పెట్టుకున్నారు అక్కడి సైనికులు. గుర్రం కనపడిన ఆనందంతో తక్కువ దరకే సొప్పను అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకొనే సమయం కోసం ఎదురుచూస్తూ, ఎవరి కంటాపడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరి వెల్లకిలా పడుకున్నాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు విలవిలలాడితే, ప్రాణాలకే  ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకొన్నాడు. అర్థ తాత్రి దాకా, సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాడ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాక పోయేసరికి నడుముకున్న  కత్తిని ఎడమ చేతితో తీసుకొని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కొన్నాడు. తెగిన భాగానికి తలపాగ చుట్టుకొని లేచాడు.  గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కలుగొట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు  గుర్రంతో సహా నిలబడి హనుమప్ప నాయుడు ఎడమ చేతితో నమస్కరించాడు.. నాయుడి దుశ్చర్యకు రాజు ఆగ్రహించాడు.  రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాకా, జరిగిన సంగతంతా విన్నాకా  సోమనాద్రి చలించి పోయాడు.నాయుడుని కౌగిలించుకొని సన్మానం చేశాక తక్షణమే వైద్యం అందే ఏర్పాట్లు చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దాన శాసనం రాయించాడు.   
                                                                         
తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహ భరితుడైన  సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపాడు. అరివీర భయంకర ప్రతాపంతో నిజాం సైన్యంపై విరుచుకపడ్డాడు. ఆ నాటి యుద్ధంలో సోమనాద్రి చేతిలో ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్, బళ్ళారి నవాబు హతులయ్యారు. నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ వెళ్ళాడు సోమనాద్రి. నిజాం సైన్యం కర్నూలు కోటలోకి ప్రవేశించింది. తరుముతూ వెళ్ళిన సోమనాద్రి కూడా కొద్దిమంది సైనికులతో కలిసి కోటలోకి వెళ్ళాడు. హఠాత్తుగా వెనుక నుండి  కోట తలుపులు మూత పడ్డాయి.  దిక్కు తోచక బయటే మిగిలి పోయిన గద్వాల సైన్యం లోపలికి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసింది. కాని వీలు పడలేదు. కోటలో నవాబుల సైన్యం భారీగా ఉంది. తన తోడున్న కొద్ది మంది సైనికులతో మాత్రమే  తమ నాయకుడు కోటలోపలికి ప్రవేశించాడు. పైగా అప్పటికే చాలా సమయం గడిచి పోయింది. అందువల్ల తమ రాజు మరణించి ఉంటాడని, కాబట్టి తాము గద్వాలకు తిరిగి వస్తామని, మహరాణి లింగమ్మకు బయటే మిగిలి పోయిన సైన్యం కబురు పంపింది.

వీర వనిత రాణి లింగమ్మ:

ఆ సమాచారం అందుకున్న రాణి ఆగ్రహంతో ఊగిపోయింది. తమ సైనికుల పేలవతనానికి సిగ్గు పడింది. తమ సైనికుల తక్షణ కర్తవ్యం ఏమిటన్నది చెప్పకనే చెప్పే కబురు వారికి చేరేలా ఆజ్ఞను జారీ చేసింది ఇలా.

"అలాగే రండి! కాకపోతే నేను పంపించిన  ఈ గాజులు, చీరలు, పసుపు, కుంకుమలు ధరించి తిరిగి రండ" ని ప్రత్యుత్తరం పంపింది. దీంతో ఎక్కడ లేని పౌరుషం పొడుచు కొచ్చిన సైన్యం ఇక విజయమో, వీరస్వర్గమో ఎదో ఒకటి తేలిపోవాలని భావించింది. కళ్లు మూసి తెరిచే లోగా  కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టారు. పెల్లుబికిన ఆగ్రహంతో కోటలోకి దుమికారు. అప్పటి దాకా కోట తలుపులను తమ వీపు వైపు రక్షణ కవచంలా చేసుకొని తమతో ఉన్న కొద్ది పాటి సైన్యంతో శతృవులను మట్టి కరిపిస్తున్నాడు సోమనాద్రి. ఆ రోజంతా ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాద్రికి తన సైన్యాన్ని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లైయింది. సోమనాద్రి సైన్యం రెట్టించిన ఉత్సాహంతో మరింత విజృంభించింది. ముస్లిం సేనలను కత్తికొక కండగా నరికి వేస్తున్నారు. సోమనాద్రి తమనిక బ్రతకనించేటట్లు లేడని భావించిన  రాయచూరు, గుత్తి నవాబులు యుద్ద విముఖతను చూపారు. ఉప్పేరు నవాబు ఏం  చేయాలో దిక్కు తోచక  సందిగ్దంలో  పడిపోయాడు. ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకొని, సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించే సరికి, నిజాం కుడా సరేనన్నాడు. సోమనాద్రి కూడా అంగీకరించాడు. యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డివని భావించే   రామ, లక్ష్మణ ఫిరంగులను, కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది, విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చే ప్రయత్నాల్లో ఉండగా కపటోపాయంతో నిజాం సైన్యం సోమనాద్రిని హతమార్చింది. అయితే నిజాం మాత్రం తన నిజాయితీ ప్రదర్శించి గద్వాలను వశపర్చుకో కుండా సోమనాద్రి సతీమణి లింగమ్మ ను రాణిగా కొనసాగించాడు.
 
రాణి లింగమ్మ అధైర్యపడి తమ సైన్యాన్ని వెనుదిరిగి రమ్మని ఉంటే చరిత్ర మరోలా ఉండేది. బేలతనం ప్రదర్శించకుండా రాణివాసపు స్త్రీగా తమ సైన్యానికి పరోక్షంగా ధైర్యాన్ని నూరి పోసింది. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటమే శరణ్యమని చెప్పకనే చెప్పింది. అందుకే తన నిర్ణయం  విజయాన్ని సమకూర్చి పెట్టి, గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఇలాంటి వీరవనితలు పుట్టిన పుణ్యభూమి మన తెలుగు గడ్డ. అందుకే ఆ వీర వనితను స్మరించుకొని మనసారా నివాళులర్పిద్దాం.....
 *సేకరణ* :  శ్రీ ముసునూరి ఈశ్వర్ గారి పోస్టు.

సోమవారవ్రతం

సోమవారవ్రతం చేసే విధానం ఏమిటి? కార్తీకమాసంలో సోమవారం అని వారం పేరు తలచుకున్నా వెయ్యి సార్లు శివుడు ని తలచినట్లే అంటారు. దీనిని బట్టి కార్తీక సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజని అర్థం అవుతుంది. ఆరోజు చేసిన పూజలకు, అభిషేకాలకు, దానాలకు ఆ పరమేశ్వరుడు అధికంగా సంతుష్టుడు అవుతాడు. భక్తుల సర్వ అభీష్టము లను తీరుస్తాడు. కార్తీక సోమవారం నాడు చేసే శివనామ స్మరణ సద్యోముక్తిని కలిగిస్తుంది.

వ్రతకథ:-సోమవారంనాడు శివుడికి శక్తి కొద్ది పూజ చేస్తే జన్మ జన్మ ల పాపాలు నశిస్తాయని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు. ఒకసారి ఆకాశ మార్గాన పార్వతీపరమేశ్వరులు విహరిస్తూ ఉండగా పార్వతీదేవి కి పరమేశ్వరుని ఈ వ్రతాన్ని గురించి అడిగింది. "నాథా! వర్ణ బేధాలు  లేకుండా సకల మానవ కోటి ఆచరించగలిగే వ్రతం ఏదైనా ఉందా? శాస్త సమ్మతమైనది, ఆచంద్రార్కం మానవులకు శుభాలను అందించే వ్రతం ను చెప్పమని పార్వతి కోరింది. దానికి ఈశ్వరుని సమాధానమే సోమవార వ్రతము. సూర్యోదయం నుంచి ప్రదోషకాలం వరకూ ఉపవాసం చేసి అభిషేక అర్చనలతోసోమవారం తనను పూజించిన వారికి సమస్త శుభ ఫలాలు కలుగుతాయనిశివుడు బోధించాడు.
         ఈ వ్రత మహాత్మ్యము ను గురించి వశిష్ఠ మహర్షి జనకమహారాజుకు చెప్పాడు. కార్తీక పురాణం లోని సోమవార వ్రతకథ ప్రముఖ మైనది. మిత్రశర్మ, స్వాతంత్య్ర నిష్ఠురి అనే దంపతుల కథ ఇది. నిష్ఠురి తన భర్త మిత్రశర్మ ను నిద్ర లో ఉండగా చంపుతుంది. ఆ పాపానికి గాను నరకంలో శిక్ష అనుభవిస్తుంది. తరువాత కుక్క గా పుడుతుంది. ఒక రోజు తినడానికి ఏమీ దొరకక ఆ కుక్క అకలితో అలమటిస్తూ తిరగసాగింది. ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి బలి అన్నాన్ని బయట పెట్టగా ఆ కుక్క తినేసింది. ఆత్మఙ్ఞానసంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు సోమవార వ్రత ఫలాన్ని కుక్క కు దారపోయగా దానికి ముక్తి లభించింది. శివ సాన్నిధ్యం నకు వెళ్ళింది. జన్మ జన్మ ల పాపాలను తొలగించే శక్తి కార్తీక సోమవార వ్రతానికి ఉందని ఈ కథ తెలియజేస్తోంది. ఇంతకూ సోమవార వ్రతం అంటే కార్తీక సోమవారం నాడు పగటి పూట ఉపవాసం తో నక్షత్ర దర్శనం వరకూ శివ ధ్యానం చేయడం మాత్రమే. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Xxxxcccc
*Om namo sri arunachaleswaraya namaha*

Another auspicious day is bestowed upon all of us by the Lord Arunachaleswara. Let us spend this day in doing nama-sankeertana of the Lord and pray Him to bestow His  benign blessings on all of us.

Let us go and worship the lord of Sivalokam wherever He resides.

He will eliminate the misery of repeated births and grant us entry into his own abode.

We were thinking only about our personal petty comforts but we did not remember to worship His holy feet. Let us think of this transitory world as a mirage and go worship the Lord.

We were immersed in the ocean of desire and hence lost our clear senses.  Without knowing a way out of the bondage we became helpless creatures.

The lord gave us our human births. He gave us our hands to worship Him with folded hands. 

Let us all go like honey and milk together near the  entrance where the temple chariot is parked to the temple and worship the Lord.

*Om Namashivaya*
*********************

సరైన విషయాలు

ఊర్లలో, కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన కోడిని ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక గుంజేకు(కర్రకు) తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టిన ఊరు మొత్తం తిరిగి తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు. ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు.అదే విధంగా ఒక ఏనుగు ఎంత పెద్ద వృక్షమైన విరగొట్టే అంత బలం గలిగి ఉంటుంది, కానీ దాన్ని ట్రైన్ చేసిన మవాటి ఒక చిన్న కట్టెకు కట్టిన సరే అది తెంపుకొని పారిపోదు, ఆ ఏనుగుని పుట్టినప్పటి నుండి అలా కండిషనింగ్ చేస్తారు కాబట్టి.

Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి మోడరన్ గా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు.

అదే విధంగా Western countries లో,కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు, దీనే habitual conditioning అంటారూ. అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో కట్టిపడేస్తే అక్కడే పడి ఉంటాయి కానీ సంకెళ్ళు తెంచుకుని ముందుకు వెళ్లలేవు దీనే psychological conditioning అంటారు.

ఇలా మనుషులు కూడా పుట్టి పెరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ అన్ని ఆచార వ్యవహారాల్లో conditioning. చేయబడుతారు,

Ex:- ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన మతమే గొప్ప, అల్లా మాత్రమే దేవుడు అనుకుంటాడు, అదే విధంగా హిందు లేదా ఇతర మతల్లో పుట్టిన వాడు తన దేవుడే గొప్ప తన మతమే గ్రేట్ అనుకుంటాడు. ఇలా వారిని వారి చుట్టూ పక్కల ఉన్న సమాజం, కుటుంబం, ఆచారాలు, పరిసరాలు అన్ని నిరంతరం conditioning చేస్తుంటాయి, at the end of the day వారు నేర్చుకున్నది నిజం, మిగతాది అబద్ధం లేదా అవాస్తవం అని అనుకుంటారు కానీ నిజాన్ని ఒప్పుకోరు.

Ex:- ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేదా బాలయ్య ఫ్యాన్ లేదా ఇంకో హీరో అనుకుందాం అసలు ఆ వ్యక్తి వీళ్లకు ఎందుకు ఫ్యాన్ అనే విషయం వాడికి కూడా సరిగ్గా తెలీదు బట్ చుట్టు పక్కన ఉన్నవారిని చూసి అనుకరిస్తాడు ఒకవేళ అలా చేయకపోతే వాడు తేడా అని ముద్ర పడుతుంది, కనుక, వీడు లైఫ్ లో ఎప్పుడు కూడా వాడు అభిమానించే హీరో ఎందుకు గొప్పవాడు అని ఆలోచించకుండా గుడ్డిగా అభిమానం పెంచుకుంటాడు,ఆ హీరో గురించి ఏ రోజు తప్పుగా ఆలోచించడానికి కూడా సాహసం చేయడు, వాళ్ళ హీరో గురించి ఎవరైనా తప్పుని తప్పు అని point out చేసి చూపిస్తే, వాళ్ల మీద ఎటాక్ చేస్తారు, వీరి మెదడు ఎంత భయంకరంగా conditioning అవుతుందంటే వాడి మతమే గొప్ప, వాడి సంప్రదయమే గొప్ప, వాడి హీరోనే గొప్ప, వాడి కులమే గొప్ప, వాడి ప్రాంతమే గొప్ప ఇలాంటి arrogant mindset develop అవుతుంది. చివరకు వాడు నిజం ఏంటో అబద్ధం ఏంటో గ్రహించకుండా బావిలో కప్పలగా తాను అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో బ్రతికి చివరికి ఒక ముర్కుడిలాగా చనిపోతాడు, ఇలాంటి వారు బాగా ముదిరిపోతే తీవ్రవాదులు లేదా మత ఛాందస వాదులుగా తయారు అవుతారు...!!

Every child is a born atheist, freethinker and freebird but later on they become fundamentalists, casteist, arrogant hero worshippers when they grow up. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు తన మెదడులో కులం,మతం,దేవుడు,ద్వేషం లాంటి భావాలు లేకుండా పుట్టి, పెరుగుతున్న క్రమంలో కుటుంబాన్ని, సమాజాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసి నేర్చుకుంటాడు.

బాల్యంలో పిల్లల్లో ఉన్న questioning పెరిగి పెద్ద అవుతుంటే ఉండకపోడానికి కారణం, అతని మెదడు మొత్తం తరతరాల చెత్తతో మురుకి పట్టిపోతుంది (conditioning వల్ల) కాబట్టి వాడు నమ్మిన దేవుడ్ని కానీ, వాడు అభిమానించే హీరోని కానీ వాడి మతాన్ని కానీ ఎవరైనా కొంచెం విమర్శించిన తట్టుకోలేడు. వాడు బాల్యం నుంచి నమ్మింది తప్పు అని తెలిస్తే వాడి ego దెబ్బ తిని దాడులు చేస్తారు. ఇలా conditioning చేయబడిన మనుషులు జీవితం మొత్తం ఏదో ఒక *ism* ఇజంని గాడిద లాగా మోస్తూ మోస్తూ చివరకు నడుం విరిగి చనిపోతారు.

Note:- చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, break the barriers and explore the life beyond the boundaries of conditioning.
మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న అన్ని విషయాలు కరెక్ట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు కాబట్టి మనం నేర్చుకున్న విషయం నిజం కాకపోతే, అసలు నిజమేంటో అని శోధించి తెలుసుకోవాలి.

దీన్ని మనం unlearning process అంటాం. సరైన విషయాలు నేర్చుకుంటూ, విశ్వ మానవుడిగా ప్రతి ఒక్కరు ఎదగాలి.. 🙏🙏
********************

#సాష్టాంగ_నమస్కారం.....

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...

అష్టాంగాలు అంటే...

#ఉరసా" అంటే తొడలు,
#శిరసా" అంటే తల,
#దృష్ట్యా" అనగా కళ్ళు,
#మనసా" అనగా హృదయం,
#వచసా" అనగా నోరు,
#పద్భ్యాం" అనగా పాదములు,
#కరాభ్యాం" అనగా చేతులు,
#కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక వుండి చేయాలి.

1) #ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) #శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) #దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) #మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5)  #వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే  "ఓం నమఃశివాయ" అని అంటూ నమస్కారం చేయాలి..

6) #పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) #కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) #జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు #పంచాంగ_నమస్కారం మాత్రమే చేయాలి... అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంబంధించిన మరిన్ని విషయములు తెలుసుకొనుట  కొరకు  ఈ క్రింది లింక్ ద్వారా మా గ్రూప్ లో చేరండి..

🚩 #భారతీయ_సనాతన_సంస్కృతి  🚩
***************************

పితరులు


పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.
ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు. 'యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్' అని వాక్యం. మహతామ్+ ఆలయం= మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును.

దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది.

ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.

భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ ఉంటారు. కావున మహాలయ పక్షాలలో వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంగా 'కారుణ్యపితరులు'గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం మంచిది. * దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు. * 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు.

3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి. * 1. పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారినాహ్వానించి) తర్పణం చేయాలి.

2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.

వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి. పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.

మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు.

మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి. మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.

ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం. భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ కర్మకాండల వల్ల ముందు తరాల వారి గురించి జీవిత విశేషాలు తెలుస్తాయ. వారి నడవడి తెలుస్తుంది.

కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం అంటేనువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడంమన విద్యుక్త ధర్మం! తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెల్పడం మన కనీసధర్మం.

కనుక ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సర్వ శ్రేయస్కరం! కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా? అని కొంతమంది సందేహాన్ని వెలిబుచ్చుతుంటారు. 'దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం' అంటుంది శాస్త్రం.

అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. కనుక కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది శాస్త్రం చెప్పలేదు. కనుక ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కేవలం వారిని స్మరించుకోవడమే! కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలను శ్రద్ధతో ఆచరించడం కనీస మానవ ధర్మం. తర్పణవిధులను అందరం ఆచరించి ధర్మాన్ని కాపాడుదాం.

*********************


నీమటుకు నువ్వు పెళ్ళి చేసుకుని పోతే....ఈ సంసారం గతేమిటి?ఇంటికి పెద్దబిడ్డవు. నిన్ను నమ్ముకునే కదా...

బంగారం లాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి...నీతో బాటు రికార్డింగులకు తిరుగుతూ...నీ కోసం ఇంత కాలం కష్ట పడ్డాను. 

ముగ్గురు చెల్లెళ్ళని...నలుగురు తమ్ముళ్ళని గాలికి వదిలేసి...నీదారి నువ్వు చూసుకుంటావా ఇప్పుడు!.....

8 వ ఏట నుండి పాడుతూ...నటించాను కూడా. 

ఇప్పుడు 23 ఏళ్ళు నాకు. అదైనా...ఆయనే అడిగారు కనుక...అదీ మీ అనుమతి తీసుకుని ఆలోచిస్తాననే చెప్పాగా! 

ముందు పెద్ద చెల్లెలి పెళ్ళి చేసే...మేము చేసుకుంటాం నాన్నా.....కుమార్తె అభ్యర్థన.

ఒక్క దాని పెళ్ళొక్కటే సమస్య కాదు. మిగతా వాళ్ళ సంగతేమిటి?  

ఇంత వరకు నువ్వు సంపాదించిందంతా...మాకే ఇచ్చెయ్యాలి! ఇకమీద కూడా నీ సంపాదనలో..సగ భాగం మాకే ఇవ్వాలి...

అంటూ కండిషన్లు పెడుతున్న తాగుబోతు తండ్రి వైపు ఏ కూతురైనా ఎలా చూస్తుంది!...

                               **************

అయినా నే నిప్పుడేమన్నానని?!....

నీ ఫ్రెండ్....ఆ తెల్లతోలు పిల్ల జమునారాణి....అన్ని మాటలనేసి పోయింది! పిదప కాలం పిదప బుధ్ధులు.....

అత్తగారి ఈటెలు!

ఏం? పాట పాడేప్పుడు...రికార్డింగప్పుడు...మగ వాళ్ళ ప్రక్కనే...భుజం..భుజం...రాసుకుంటూ ఎందుకు పాడాలి?  

మీ ఆడ వాళ్ళకు సపరేట్ గా మైక్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా!? అంటే తప్పొచ్చిందా!.... కొనసాగుతున్న అత్త గారి  సణుగుడు.

అట్లా వీలు కాదండి. ఇద్దరికీ కలిపి ఒక్కటే మైక్ ఉంటుంది. 

రాణి కొంచెం ముక్కు సూటి మనిషి....తన మాటలు పట్టించుకోకండి.....కోడలు విన్నపం.

మేము కార్ లోనో...టాక్సీలోనో వెళ్ళి....పాట పాడి వచ్చేస్తాం పిన్ని గారు. 

మరి మీపక్కింట్లో....మీరెప్పుడూ పొగుడుతుంటారే....తంగనాయకి అని మీవాళ్ళ అమ్మాయి...

2 బస్సులు మారి...ఆఫీస్ కెళ్ళాలి. 

మరి బస్సుల్లో రద్దీ మీకు తెలియనిది కాదు! ఎంతమంది భుజాలు తాకుతుంటాయి! మరి అది పరవాలేదా?!.....

అంటూ...తంగం గురించి....అట్లా మాట్లాడుతుందా! పొగరు కాకపోతే! ...

ముందు నువ్వా పిల్ల జమునా రాణి తో మాట్లాడటం మానెయ్ అమ్మాయ్. నిన్నూ చెడకొడ్తోంది!......అత్తగారి వాగ్ధాటి!

                             **************

ఆ మ్యుజిక్ డైరెక్టర్ కు నాకు పడదు. నువ్వు వాడి దగ్గర పాడటానికి వీల్లేదు!

అగ్రిమెంట్ ప్రకారం నేను పాడాలి తప్పదండి. 

పైగా...రిహార్సల్స్ కూడా అయిపోయి...రెడీగా ఉన్న పాటలు. 

నిన్న ఏదో మీతో గొడవయ్యిందని...ఇప్పుడు నన్ను పాడొద్దంటే ఎలాగండి?....భార్య అభ్యర్థన.

వాడంతగా చెప్తున్నాడుగా...భర్తంటే లక్ష్యం లేదా నీకు! 
వాడెలా చెప్తే అట్లాగే చెయ్.....

అత్తగారి సన్నాయి నొక్కులు.

నా గౌరవం నీకు ముఖ్యం కాదనుకుంటే....నీ ఇష్టం. పోయి పాడు......
భర్త గారి అలక...బెదిరింపు!

అసలు కొంత కాలం ఈ సినిమాల్లో పాడటం మానేయ్.....

భర్త గారి ఆర్డర్.

పిల్లల తోటే ఖర్చులూ పెరుగుతున్నాయి. ఈ టైం లో పాడటం మానేస్తే ఎలాగండి?......భార్య.

అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లు ఇంట్లోనే ఉండు.....భర్త తీర్మానం.

                              *************

వేల వత్సరాలైనా....వసంత ఋతువు సొగసు.... నిత్య నూతనమే. 

గల గల పారుతున్న జీవ నది గమనం.... ఎక్కడ నుండి చూసినా ఆహ్లాదంగానే ఉంటుంది......

కాలం కాని కాలంలో ....కూసినా......కోయిల గొంతు....
గుండె గూటిని  తట్టి లేపుతూనే ఉంటుంది.

పశువులను...శిశువులను కూడా జోకొట్టి...మరో లోకంలో విహరింప చేసే శక్తి... 

అమృత గానానికి ఉంది.

అలాంటి గాన మాధుర్యాన్ని గళసీమలో నింపుకున్న మెలొడీ పాటల  మహారాణి....

పిల్లాపాలు. గజపతి. కృష్ణవేణి(పి.జి. కృష్ణవేణి).

సింపుల్ గా జిక్కి గా పేరొందిన సుమధుర గాయని.

                             *************

కసవు మించి పొసగు చోట...
 మెలికలైన కాలి బాట....
 మునుముందొక లేమావి...
 దారిలోన అల్లదే...
 నా ప్రియా కుటీర వాటిక...
 నా ప్రియ కుటీర వాటిక...

పాట రికార్డింగుకు స్టూడియో కెళుతుంటే , ఏదో ఫంక్షన్ కు వెళుతున్నట్లుండేది. 

రచయిత, ఆర్కెస్ట్రా, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, నటీ నటులు కూడా వచ్చేవారు.

రారోయి మా ఇంటికి...మావో..మాటున్నది -దొంగ రాముడులోని ఈ పాట పాడేప్పుడు...

ఎ..ఎన్.ఆర్, ఆర్.నాగేశ్వర రావులు కూడ ప్రక్కనే ఉన్నారు. 

ఏ.సి. లు అప్పుడు లేవు...సౌండ్ బాగా రికార్డ్ కావాలని ఫాన్లు కూడా ఆపేసేవారు. 

అందరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా...మళ్ళీ మొదటి నుండి పాడాల్సిందే!

ఆర్కెస్త్రా కు ఒక మైక్....గాయనీ గాయకులకు ఒకే మైక్. 

ఘంటసాల వారి తో పాడాలంటే...నన్ను ఒక స్టూలెక్కించే వారు!

వంగి పాడేదాన్ని. ఇప్పుడున్న సౌకర్యాలు, అప్పుడుండి  ఉంటే ఇంకా బాగా పాడే వాళ్ళమేమో! 

అయినా..ఇప్పుడు ఇన్ని వసతులున్నా మేము పాడిన పాటలే క్లియర్ గా బాగున్నాయి!

                              *************

పి.జి.కృష్ణవేణి ని చిన్నప్పటి నుండి జిక్కమ్మా అని వారి నాన్నగారు పిలిచేవారంట. 

అది అలా ఫిక్స్ అయిపోయింది. 

2వ తరగతి తో చదువు ఆపినా...మద్రాసు లోనే పుట్టి పెరగడంవల్ల తమిళం మాత్రం వ్రాయగల్గి,.... 

శాస్త్రీయ సంగీతంలో అసలు ఓనమాలు రాకపోయినా...దైవదత్తమైన స్వరమాధురితో  జిక్కి గారు...

తెలుగులో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు.

అల్లదే..అవతల...అదిగో నా ప్రియా కుటీర వాటిక..

పులకించని మది పులకించు...

రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...

హాయి హాయిగా ఆమని...

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా...

గుత్తొంకాయ్ కూరోయ్ బావ కోరివండినానొయ్ బావ..

ఎన్నొ మధురాతి మధురమైన గీతాలు  జాలువారాయి ఆ మధుర అమృత గళం నుండి.-

బాలనటి గా పంతులమ్మ (1943), వాల్మీకి (1945), ఇది మా కథ (1946)లలో నటించి తన పాటలు తనే పాడుకున్న జిక్కి...

మన దేశం (1949) లో లక్ష్మీకాంత కు తొలిసారి నేపథ్య గీతాలు పాడింది.

మరువలేనురా..నిను నేను మరువలేనురా. .
ఓ పంచదార వంటి పోలిసెకంట స్వామి..
ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో పాడారు జిక్కి గారు.

ఇక ఆ స్వర వాహిని అలా భాషా బేధాలనధిగమించి...ఎన్నో భాషలలో మరెన్నో మధుర గీతాలను అందించారు.-

                              *************

దేవదాసు మూవీ లో పాడినప్పుడు ఒక చేదు అనుభవం ఎదుర్కున్నారు జిక్కి గారు. 

అంతకు ముందు డి.ఎల్.నారాయణ గారు స్త్రీ సాహసం సినిమా తీసి జిక్కి గారితో పాడించుకుని పారితోషికం గా ఇచ్చిన చెక్కు చెల్లలేదట. 

అడిగితే..మరో సినిమా దేవదాసు తీస్తున్నాము..అప్పుడు ఇస్తాలేమ్మా అన్నారట.

దేవదాసు కోసం ఘంటసాల గారి తో, సి.ఆర్ సుబ్బరామన్ స్వరరచనలో- ఓ...దేవదా...చదువు ఇదేనా...డ్యూయెట్ పాడారు.

కానీ..మళ్ళీ కె.రాణి తో జస్ట్ హమ్మింగ్ చేయించి...మిగతా పాటలు (హీరోయిన్ సావిత్రి కి) ఆమె చేతే పాడించి సినిమా రిలీజ్ చేయించారు!

జిక్కి గారి పేరు టైటిల్స్ లో వేయలేదు. రాయల్టీ ఇవ్వలేదు! 

తండ్రి కోర్టు కెళ్దామన్నా..వద్దని వారించారట జిక్కి గారు.

                              *************

తన పై ఆధారపడ్డ 4గురు సోదరులు,ముగ్గురు సోదరీమణులు, తాగుబోతు తండ్రి....

ఆ పరిస్థితిలో శ్రీ.ఎ.ఎం.రాజా తో ప్రేమ వివాహం,...

కాలక్రమేణా..6గురు సంతానం...

కుటుంబ బాధ్యతల మధ్య కూడా...ఎన్నో ప్రయాసలకోర్చి...సినీ గీతాలు, కచేరీలు..చేసేవారు జిక్కి.

1989లో భర్త రాజా అకాల మరణం తో కృంగి పోయినా...

తోటి గాయనీ మణులు...చక్కటి స్నేహితురాళ్ళు అయిన జమునారాణి, పి.లీల & ఎ.పి.కోమల గార్లతో దేశ, విదేశాలలో కచేరీలు చేసేవారు జిక్కి.

సీతారామయ్య గారి మనవరాలు (1991), అమ్మ కొడుకు (1993), నిన్నే పెళ్ళడుతా (1996) & మురారి (2001) దాకా పాడారు.

2001 లోనే బ్రెస్ట్ కేన్సర్  వస్తే... చికిత్స చేయించుకునే స్తోమత కూడా లేని పరిస్థితి!

చిరకాల మిత్రురాలు...గాయని జమునారాణి గారు కచేరీలు చేసి...

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభ్యర్థన లేఖలు వ్రాసి...నిధులు సమకూర్చవలసి వచ్చింది!

సర్జరీ  తరువాత కూడా సెకండరీస్ తో  16 ఆగస్ట్ 2004 న  అనంత విశ్వంలో లీనమైనా వారి పాటలతో చిరస్మరణీయులయ్యారు శ్రీమతి.జిక్కి గారు.

ఈ రోజు  సుమధుర గాయని....జిక్కి గారి వర్ధంతి సందర్భంగా స్మృత్యంజలి సమర్పిస్తూ.....కొన్ని వారి మధుర గీతాలు.

                           🌹🌿🌹🌿🌹🌿🌹

అల్లదే..అవతల ..అదిగో..నా ప్రియ కుటీర వాటిక..

https://youtu.be/-bvjVo9t9qg

మ్రోగింపవే హృదయవీణ..పలికింపవే మధుర ప్రేమ...

https://youtu.be/3JTgb032TOk

మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు..

https://youtu.be/0eTQontdKcY

గుత్తొంకాయ్ కూరోయ్ బావ.....కోరి వండినానోయ్ బావ..

https://youtu.be/voR_C-IfonA

చాంగురే బంగారు రాజా..చాంగు చాంగురే బంగారు రాజా...

https://youtu.be/35a7Fykppgc

పులకించని మది పులకించు...

https://youtu.be/vThrTWa5kSc

వద్దురా కన్నయ్యా...ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా.....

https://youtu.be/EW8MTNPSq_Q

అంద చందాల సొగసరి వాడు...

https://youtu.be/d23NCHutdTA

హాయి హాయిగా ఆమని సాగె...

https://youtu.be/O5ajXn9j1bM

రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...

https://youtu.be/VIryMqxwijc

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న...

https://youtu.be/VH72kvy0y98

ఎక్కడమ్మా చంద్రుడు....చక్కనైన చంద్రుడు.....

https://youtu.be/0YpXvG8GvMI

అందాలసీమలో....చందమామ కాంతిలో....

https://youtu.be/_IEpFWGSdqY

ఓ...దేవదా...చదువు ఇదేనా.......

https://youtu.be/lRs-xF6e95o

పొద్దైనా తిరగకముందే....చుక్కైనా పొడవకముందే......

https://youtu.be/OxePGmmr5ME

మరువ లేనురా..నిను నేను మరువలేనురా...

https://youtu.be/iu5g_P-_emY

నీ షోకు చూడకుండా నవనీతమ్మా.....

https://youtu.be/HKmwEVE4cHw

టౌను పక్కకెళ్ళొద్దురో...డింగరీ......

https://youtu.be/DzV6CWyslwY

పందిట్లో పెళ్ళవుతున్నది..కనువిందవుతున్నది..

https://youtu.be/FDCzwTPxQ84

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేచేను......

https://youtu.be/QzMfouXUEII

చిందు వేయవోయి చిన్ని కృష్ణయ్య.......

https://youtu.be/Fu7SVORE9aY

పట్నమెల్లగలవా బావా పర్మిటు తేగలవా......

https://youtu.be/ZsubahA4Wf4

వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు........

https://youtu.be/r6Vfdb9HKls

జీవితమే సఫలము...రాగసుధా భరితము......

https://youtu.be/SvHfiigQbPA

కొమ్ములు తిరిగిన మగవారు...కొంగు తగిలితే పోలేరు...

https://youtu.be/QzMfouXUEII

రారోయి మా ఇంటికి...మావో మాటున్నది.....

https://youtu.be/FL_r6QyUAow

కనులకు దోచి చేతికందని ఎండ మావులున్నాయ్......

https://youtu.be/FKx4fffOOFA

నవనీత చోరుడు..... నంద కిశోరుడు....

https://youtu.be/UJOlhjlKt5M

ఏటి ఒడ్డున మా ఊరు....ఎవ్వరు లేరు మావారు....

https://youtu.be/jBWLvac7tfY

లేవోయి చినవాడా....లే లేవోయి చినవాడా.....

https://youtu.be/6UmAxyh0kJ4

కళ్ళు తెరచికనరా....సత్యం ఒళ్ళు మరచి వినరా.....

https://youtu.be/OFbSEpoZvS0

ఇంత చల్లని రేయి..... ఇంత చక్కని హాయి....

https://youtu.be/xArYDK_xYIk

అన్నా అన్నా విన్నావా...చిన్ని కృష్ణుడు వచ్చాడు......

https://youtu.be/sWYEyBG712c

తల్లిని మించి ధారుణి వేరే దైవము వేరే లేదుగా.......

https://youtu.be/WObC7stH1wI

విరిసింది వింత హాయి....మురిసింది నేటి రేయి.

https://youtu.be/_9SsBWpSjHY

తీరెను కొరిక తియ్యతియ్యగా....హాయిగ మనసు తేలిపోవగ....

https://youtu.be/6y_3wegadSs

కం కం కం కంగారు నీ కేలనే........

https://youtu.be/6vDylVuQYQs

చిగురాకులలో చిలకమ్మా...చిన్న మాట వినరావమ్మా.....

https://youtu.be/65gt3xXLNtM

వలపు తేనె పాట...తొలి వయసు పూల తోట.......

https://youtu.be/IrSX36oeoEg

ఓహో బస్తీ దొరసాని...బాగా ముస్తాబయ్యింది.......

https://youtu.be/gkbFfqs5IhE

పడుచుదనం  రైలు బండి పోతున్నది......

https://youtu.be/Pbf6nycgqAA

వేణు గానమ్ము వినిపించెనే..చిన్ని కృష్ణయ్య కనిపించెనే......

https://youtu.be/mfh1cTXg7GQ

రావె రాధ రాణి రావె...రాధ నీవె కృష్ణుడ నేనె......

https://youtu.be/A4W6ijCahs8

కలిసె నెలరాజు కలువ చెలిని.......

https://youtu.be/PaaXa352iOk

ఈ తీయని రేయి తెలవారుటె మానే....ఇలా నిలిచి కవ్బించనీ.....

https://youtu.be/9K6tYEm0iBY

చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా.....

https://youtu.be/16EtZWj0co4

నన్ను పెళ్ళాడవొయ్ నాసామీ చెంచితనయ్యా నా సామి.....

https://youtu.be/B8ZRvmUseNI

సిపాయి బిరాన రావోయి...ఓ సిపాయి...మన తరాన.....

https://youtu.be/6yzbtxP6ewo

ఆశలు తీర్చవె ఓ జనని...ఆదరముంచవె జాలిగొని.....

https://youtu.be/3pEymqk93OE

చిట్టిపొట్టి బొమ్మలు....చిన్నారి బొమ్మలు......

https://youtu.be/j_wOdMS76GQ

చిలకా గోరింక కులికే పక పక........

https://youtu.be/IfyDycXxCHQ

ప్రేమ జగాన విషాదాంతమేనా.......

https://youtu.be/8IfUGAypItY

ఆనందమే.....అందాలు చిందేటి ఆనందమే.......

https://youtu.be/v4R9dOPD8EY

చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది.......

https://youtu.be/KvWnyuKEk0Q

నెరజాణవులే....వరవీణవులే....కిలికించితాలలో....

https://youtu.be/JZ6EiyoCfsU

నిన్నే పెళ్ళాడేస్తానంటూ...మాట ఇస్తే ఊరుకుంటామా......

https://youtu.be/BbU2DhfIUhw

వెలుగు రేఖల వారు తెలవరి తామొచ్చి...ఎండ ముగ్గులు పెట్టంగా....

https://youtu.be/Hec_wMFQftA

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి.....

https://youtu.be/EO3JWdSL1mk

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿

                                                              - కె.వి.ఎస్. ప్రసాద్.

Xxxxcccc

☘️☘️☘️☘️☘️☘️
*లీడర్ కి ఉండాల్సిన  లక్షణాలు*
🚩🚩🚩🚩🚩
1. *లీడర్*- గతాన్ని వదిలేయాలి.
2. *లీడర్*- నేర్చుకోవడం అపోద్దు
3. *లీడర్*- మనసులో ఉన్న విషయం
                   బయటకు  చెప్పాలి.
4. *లీడర్*- ఈగో వదిలేయాలి. 
5. *లీడర్*- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. *లీడర్*- తప్పును కూడ శాoతoగ చెప్పలి. 
7. *లీడర్*- ఎవరైనా బాదలో ఉంటే
                  ఓదార్పు ఇవ్వాలి.
8. *లీడర్*- బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
9. *లీడర్*- అన్నీ సందర్భాలనీ స్వీకరించాలి.
10. *లీడర్*- ఎంత కటిన నిర్ణయం 
                    ఆయన  తీసుకునే దైర్యం ఉండాలి.
11. *లీడర్* - మార్గ దర్శకుడు కావాలి.
12. *లీడర్*- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. *లీడర్*- సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
14. *లీడర్*- తన అనుచరుల కంటే 
                      ఒక అడుగు ముందు ఉండాలి.
15. *లీడర్*- తన అనుచరులకు ఎల్లప్పుడూ
                    అభినందనలు తెలుపుతుండాలి
16. *లీడర్*- తను ఉన్న చోట్ల నాయకత్వ
                     లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. *లీడర్*- సమాజం నుండి ఎల్లప్పుడూ
                     నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ 
                     ఎంతోకొంత      ఇస్తూనే ఉండాలి.
18. *లీడర్*- అనుచరుల ఎదుగుదలను 
                   కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
19. *లీడర్*- తన స్వార్థం     కోసం కాకుండా
                     *అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి